23, జులై 2024, మంగళవారం

సమస్య పూరణ

 

ఇచ్చిన సమస్య:గురు బుధ వారముల్ శనిని గూడిన మంగళ, తాళి కట్టెదన్


నా పూరణ (చంపక మాల):


సుర రిపు వారమున్ సెలవు, చూడగ శ్రావణ శుక్రవారమౌ,

మరి యొక నాల్గు రోజులును మాకును గావలె పెండ్లి వేడ్కకున్,

దొరలకు విన్నవించెదను, తోషము గూర్చుచునొప్పుకొన్నచో,

గురు బుధ వారముల్ శనిని గూడిన మంగళ, తాళి కట్టెదన్


భావము: ఒక కుర్రాడు పెళ్ళి చేసుకోవాలి. దానికి సెలవలు కావాలి. శుక్రవారం ఎలాగూ శ్రావణ శుక్రవారం సెలవిచ్చారుట.

         మిగిలిన నాలుగు రోజులు (మంగళ, బుధ, గురు, శని) సెలవలు దొరికితే పెళ్ళి చేసుకోవచ్చు. కాబట్టి "దొరలకు" (పై అఫీసర్లకు) విన్నవించి, ఆ సెలవలు దొరికితే, మంగళవారం తాళి కట్టడం, తరువాత ఐదు రోజులు వేడుకలూను)

కామెంట్‌లు లేవు: