23, జులై 2024, మంగళవారం

ఫీజులు

 💸 *ఫీజులు ...గుండెలు గుభిల్లు`*


✍️ *దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న విద్యావ్యయం ...ఐఐటి ల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు ఫీజుల పెంపు, ప్రభుత్వం ప్రకటించే ఫీజుకన్నా రకరకాల గా అదనంగా వసూలు చేస్తున్న ప్రవేటు కాలేజీలు. వాటిపై పర్యవేక్షణ చేయని యంత్రాంగం. ఫీజుల వసూలులో ఆన్ లైన్ చెల్లింపు కన్నా ,క్యాష్ చెల్లింపులే ఎక్కువ. అదనపు వసూళ్ళు కు తోడు పాకెట్ మనీ పేరుతో ,పుస్తకాలు పేరుతో , ఏసీల పేరుతో ,హాస్టల్ పేరుతో... ఇష్టానుసారంగా వసూళ్ళు .డిమాండ్ మేరకు ప్రభుత్వ కాలేజీల సంఖ్యా పెరగాల్సిందిపోయి ప్రవేటు కాలేజీ లకు అనుమతుల వెల్లువ.. గ్రౌండ్లు ఉండవు ,కనీస  వ్యాయామం ఉండదు, నెలల పొడవునా కనీసం సూర్యరశ్మి తగలని పరిస్థితి ల్లో విధ్యార్థులను యంత్రాల్లా చూస్తున్న దారుణ పరిస్థితి లు ఉంటున్నాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలు కు కారణమౌతున్న దుస్థితి లను చక్కదిద్దే చర్యలు బహు అరుదే `*

కామెంట్‌లు లేవు: