ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
12, మార్చి 2024, మంగళవారం
భగవంతుడు మనకిచ్చిన
కం.
భగవంతుడు మనకిచ్చిన
అగణితమూల్యమ్ముగల్గు నాయువు గలుగన్
సగమున పోబోవ మెపుడు
పగటిమి రోగమ్ము లిచ్చు బాధల నఱయన్
కం.
రోగము వచ్చిన వచ్చును
భోగము తగ్గింప బూని పూనిక తోడన్
ఆగని మేఘమ్ము పగిది
రాగము వీడగ సుఖమగు బ్రతుకున నిలలోన్
కం.
చింత లవేలనొ మనసుకు?
చెంతనె సుఖదుఃఖములిల జేరి మనుజునిన్
పొంత నశాంతి నొస గను
దాంతిని బొందంగ వలెను ధరణి మహాత్మా!
మీ
*~శ్రీశర్మద*
8333844664
ఆణిముత్యం
*💎నేటి ఆణిముత్యం💎*
*ఖలుని బుద్ధి చూడ చులకనై యుండును*
*నిలకడుండదెపుడు నిందఁజేయు*
*బుద్ధి గడ్డితినగ శుద్ధెట్లు కలుగును*
*బుద్ఢి మార్చుకొనిన బుధులు మెచ్చు!!*
*భావం:*
*నీచుల బుద్ధి చాలా అవమానకరంగా ఉంటుంది. నిలకడ ఉండదు.ఎవరో ఒకరిని నింద చేస్తూనే ఉంటారు.ఆలోచనలు వక్రంగా ఉంటే స్వచ్ఛత ఎక్కడుంటుంది?కాబట్టి బుద్ధి మార్చుకున్నవారు కీర్తించబడతారు.*
*🤠 నేటి సామెత 🌸*
*వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు..*
కొంతమంది అప్పగించిన పనిని సమయానికి ముగించకుండానే ఆ పని ముగించేసినట్టు చెబుతుంటారు. నిక్కచ్చిగా నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ఏవో కారణాలను చూపుతుంటారు.
*🗣నేటి జాతీయం🤔*
*హారతి కర్పూరం అయిపోవడం*
సులభంగా ఖర్చైపోవడం, తొందరగా అయిపోవడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కర్పూరాన్ని హారతి కోసం వెలిగించినప్పుడు కలిగే స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.హారతి కర్పూరము అతి తొందరగా హరించుక పోతుంది. ధనం, ఆస్తి తొందరగా ఖర్చైన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. 'ఆస్తంతా హారతి కర్పూరమైంది' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.
తెలుసుకుందాం
*✅తెలుసుకుందాం✅*
*🟥బాగా వర్షం వచ్చేప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఎందుకు?*
🟢సాధారణ వర్షం కురిసేప్పుడు విద్యుత్ సరఫరాను ఆపరు. కేవలం మెరుపులు, వేగంగా వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. బాగా మెరుపులు వచ్చేప్పుడు అవి విద్యుత్ తీగలను తాకితే వేల ఓల్టుల విద్యుత్ శక్మం (electrical potential) తీగల ద్వారా ఇళ్లు, సబ్‌స్టేషన్లలోకి ప్రసరించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల విద్యుత్ సాధనాలు, పరికరాలు పాడవుతాయి. విద్యుత్‌ను ముందుగానే ఆపితే నష్టం కొంత నివారణ అవుతుంది. పెనుగాలులు వీచేప్పుడు చెట్లు, స్తంభాలు కూలిపోయి విద్యుత్ వైర్లు కలిసి విద్యుత్ హ్రస్వ వలయం (electrical short circuit) ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.
శ్రీ బాదామి గుహాలయం
🕉 మన గుడి : నెం 254
⚜ కర్నాటక : బాదామి
⚜ శ్రీ బాదామి గుహాలయం
💠 బాదామి గుహ దేవాలయాలు భారతదేశంలోని కర్ణాటకలోని ఉత్తర భాగంలోని బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి పట్టణంలో ఉన్న హిందూ మరియు జైన గుహ దేవాలయాల సముదాయం.
పశ్చిమ కొండపై ఉన్న గుహలు భారతీయ రాతి వాస్తుశిల్పానికి, ముఖ్యంగా బాదామి చాళుక్య వాస్తుశిల్పానికి ముఖ్యమైన ఉదాహరణలు
💠 బదామిని దీనినే వాతాపి అని కూడా అంటారు. ఇది 540 నుండి 757 ప్రాంతంలో పరిపాలించిన చాళుక్యుల రాజధాని నగరం. బదామి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహలకి, గుహాలయాలకీ చాలా ప్రసిద్ధి.
ఇక్కడ ఉన్న ఎర్రకొండలు అందంగా ఎవరో మలిచినట్లుంటాయి. ఇవి అంతర్జాతీయంగా పర్వతారోహకులకి చిర పరిచరియలే.
💠 బాదామి, చారిత్రక గ్రంథాలలో వాతాపి, వాతాపిపుర మరియు వాతాపినగరి అని కూడా పేర్కొనబడింది. ముందుగా ఈ ప్రాంతానికి వాతాపి అని పేరు రావడం వెనుక రామాయణ కాలంలో అగస్త్య మహామునితో కూడిన ఒక కథ ప్రాచుర్యం పొందివుంది.
💠 ఇల,వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఇక్కడ ఉండేవారు. వాళ్ళు ఆ దారినపోయే వారిని చాకచక్యంగా, వింత పద్ధతిలో చంపుతూవుండేవారు.
ఇద్దరూ కలిసి దారిన పోయే బాటసారుల్ని విందుకి పిలిచేవారు. పెద్దవాడైన ఇల్వలుడు, వాతాపిని మాంసంగా వండి వడ్డించేవాడు.
తరువాత ఆ అతిథి పొట్టని చీల్చుకుని వాతాపి బయటకి వస్తూ వుండేవాడు.
ఆ విధంగా ప్రజల్ని మాయలో పడేసి చంపుతూ వుండడం వారికి పరిపాటిగా మారిపోయింది.
💠 ఒకనాడు ఆ మార్గాన వస్తున్న ఆగస్త్య మహామునిని కూడా ఇలాగే మాయ చేద్దామనుకున్నారు.
దివ్యజ్ఞానం కలిగిన అగస్త్యుడు మారు మాట్లాడకుండా ఇల్వలుడు పెట్టిన విందుని కడుపారా ఆరగించి, జీర్ణం..జీర్ణం.. వాతాపి జీర్ణం అని తేన్చాడు.
ఆ తర్వాత ఇల్వలుడు ఎన్నిసార్లు వాతాపిని పిలిచినా ఇంకరాలేదు.
ఈ విధంగా వాతాపి తన అన్న చేతిలోనే హతుడయ్యాడు.
ఆ తరువాత ఇల్వలుడు కూడ మరణించాడు. బదామిలో ఇప్పటికి రెండు కొండల్ని వాతాపి, ఇల్వల అని వారి గుర్తుగా పిలుస్తారు.
ఈ సన్నివేశం జరిగినది ఇక్కడే.
💠 ఇక చారిత్రకంగా 6-8 శతాబ్దాల్లో కర్నాటక, ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన చాళుక్యుల రాజధాని బదామి. ఈ పట్టణం 535 నుండి 566 వరకూ పరిపాలించిన పులకేశి 540లో నిర్మించాడు. ఈతడు చాళుక్య వంశం గుహాలయాల మాత్రం, పులకేశీ మొదటి కుమారుడు కీర్తివర్మ 567-598 ప్రాంతంలోను, రెండవ కుమారుడు మంగళేశుడు 598-610 ప్రాంతంలోను నిర్మించారు.
అయితే 610-642 మధ్యకాలంలో ఏలిన రెండవ పులకేశి చాలా ప్రసిద్ధుడయ్యాడు. ఈతని కాలంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరిగింది. రెండవ పులకేశి అనేక దండయాత్రలు చేసి ఎందరో రాజుల్ని ఓడించాడు. కానీ, పల్లవుల్ని జయించి వారి రాజధాని కాంచీ పురాన్ని చేజిక్కించుకోలేకపోయాడు.
💠 ఇక్కడున్న గుహాలయాలు చాలా వరకూ 6-8 శతాబ్దాల్లో నిర్మించినవే. ఇక్కడ హిందూ మతంతో పాటు భౌద్ధ, జైన మతాలు కూడా బాగా వర్ధిల్లాయి.
ఈ గుహాలయాల్లో మనకి 18 లిపులు గోడలమీద కనిపిస్తాయి. అయితే అందులో అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్నవి మాత్రం కొన్నే ఉన్నాయి.
అందులో నాటి కన్నడ భాషలో లిఖించిన సంస్కృత పదాల విషయం ఒకటుంది.
💠 బాదామిలో మొత్తం 4 గుహ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ హిందూ దేవతలకు చెందిన అద్భుతమైన శిల్పాలను కలిగి ఉన్నాయి. ఈ ఆలయాల నిర్మాణం ఉత్తర భారత , నాగర శైలి మరియు దక్షిణ భారత ద్రావిడ నిర్మాణ శైలి యొక్క సంపూర్ణ కలయిక. ప్రతి గుహలో గర్భగుడి, హాలు, వరండా మరియు స్తంభాలు ఉంటాయి.
💠 తొలి గుహ దేవాలయం (గుహ 3, వైష్ణవం) 6వ శతాబ్దానికి చెందినది, గుహ 1 (శైవమతం) కొంతకాలం తర్వాత నిర్మించబడింది.
గుహ 2 (వైష్ణవం) 7వ శతాబ్దానికి చెందినది.
4వ గుహలో వేదాంతశాస్త్రం మరియు జైనమతం యొక్క ఆలోచనలు ఉన్నాయి, ఇది మొదటి మూడు తర్వాత నిర్మించబడింది.
🔅 గుహ I :
ఇది శైవుల గుహ.
ఈ గుహలోని ముఖ్యమైన శిల్పాలు 18 చేతులతో నృత్యం చేస్తున్న శివుడు, రెండు చేతుల గణేశుడు, మహిషాసుర మర్దిని, అర్ధ నారీశ్వరుడు & శంకర నారాయణ
ఎర్ర ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ గుహలో బహిరంగ వరండా, అనేక స్తంభాలతో కూడిన హాలు మరియు గర్భగుడి ఉన్నాయి.
🔅 గుహ II :
2వ గుహ ఇసుకరాయి కొండ శిఖరం వద్ద ఉంటుంది. ఈ గుహ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడింది.
ఇక్కడ, విష్ణువు 'త్రివిక్రమ' రూపంలో ప్రదర్శించబడ్డాడు.
ఈ గుహలో త్రివిక్రమ,& భూవరాహ, అనంతశయన, బ్రహ్మ, విష్ణు, శివుడు ఇతర అష్టదిక్పాలకుల శిల్పాలు ఉన్నాయి.
🔅 గుహ III :
ఇది చాలా పెద్దది , ఉత్తమమైనది.
ఈ గుహలో శైవ, వైష్ణవ ఇతివృత్తాలకు సంబంధించిన చెక్కడాలు ఉన్నాయి.
త్రివిక్రమ, నరసింహ, శంకరనారాయణ, భువరాహ, అనంతశయన , హరిహర విగ్రహాలు చెక్కబడ్డాయి.
🔅 గుహ IV:
మూడు గుహలకు తూర్పున ఉన్న నాల్గవ గుహ జైన్ గుహ. గర్భగుడిని అలంకరించిన మహావీరుడి చిత్రం ఉంది.
ఇక్కడ ఉన్న ఇతర శిల్పాలు పద్మావతి మరియు ఇతర తీర్థంకరులు.
ఈ మందిరంలో, కూర్చున్న భంగిమలో మహావీరుని ప్రతిమను చూడవచ్చు.
💠 ఇది హంపి నుండి 145 కి.మీ మరియు హుబ్లీ నుండి 106 కి.మీ.
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - ద్వితీయ & తృతీయ - రేవతి - భౌమ వాసరే* *(12-03-2024)*
ప్రముఖ వేదపండితులు,
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
🙏🙏
సేవిస్తేనే రోగం నయం అవుతుంది.
శ్లోకం:☝️
*శాస్త్రాణ్యధీత్యాపి భవన్తి మూర్ఖాః*
*యస్తు క్రియావాన్పురుషః స విద్వాన్ |*
*సుచింతితం చౌషధమాతురాణాం*
*న నామమాత్రేణ కరోత్యరోగం ||*
భావం: అనేక శాస్త్రాలను అభ్యసించినంత మాత్రాన పండితులు అయిపోరు. వాటిని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టేవారే పండితులు. ఆచరణలో పెట్టనివారు మూర్ఖులే!
ఒక వ్యక్తి మంచి ఔషధాన్ని ఎదురుగ్గా పెట్టుకుని దాని గుణగణాలు వర్ణించినంత మాత్రాన రోగం తగ్గదు. ఆ ఔషధాన్ని నియమానుసారంగా సేవిస్తేనే రోగం నయం అవుతుంది.
A. S. Rao. Nagar
మీరు ఈసారి హైదరాబాద్ లోని,
A. S. Rao. Nagar కు వెళితే......
బహుశా 2000 వ సంవత్సరం అనుకొంటా,
ఒక ముసలాయన హైదరాబాద్ సిటీ బస్సులో
టికెట్ కొనుక్కొంటూ,
కండక్టర్ తో " A. S. R. నగర్ వస్తే చెప్పండి " అన్నాడు.
కాసేపయ్యాక బస్ ఆగితే
ఆయన కండక్టర్ తో " ఇది ASR నగరేనా?
" అని అడిగితే అపుడు కండక్టర్ విసుగ్గా
" ఏమయ్యా, నీకు ASR నగర్ ఎక్కడుందో,
ఎప్పుడొస్తుందో తెలియదా?
" అన్నాడు. అపుడు పక్క సీట్లో వున్న
మరో వ్యక్తి కండక్టర్ తో " ఆయనే A. S. R. గారు "
అన్నపుడు కండక్టర్ తో పాటు అది విన్న,
ఇతర ప్యాసెంజర్లు కూడా ఆశ్చర్యపోయారుట.
అంత నిరాడంబరత A. S. Rao గారిది.
అయ్యగారి సాంబశివరావు(A.S.Rao) గారికి 1960 లో పద్మశ్రీ, 1974లో పద్మభూషణ్ అవార్డులు వెతుక్కొంటూ వచ్చాయి.
కానీ ఆయన కారు వాడేవాడు కాదు. 'ఎందుకండీ, ఇంకా చేతనౌతుంది, నడచి పోవచ్చు. చాలా దూరం అనుకోండి సిటీ బస్సులు వున్నాయి కదా! ' అనేవారు ఆయన.
ఎవరు ఈ A. S. Rao గారు?
1914 సెప్టెంబర్ 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామం లో జన్మించిన రావు గారికి elementary మరియు middle school లో చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆయన తల్లి, ఆమె పెళ్లప్పుడు అమ్మ నాన్న లు పెట్టిన ఒక చీర ను పాత గుడ్డలు కొనుక్కొనేవారికి అమ్మి, ఆ డబ్బు ను రావు గారికి ఇచ్చిందట. ఎంతనో తెలుసా?
2 రూపాయలు !
అప్పులు చేసి, పస్తులుండి చదువే ఆయుధంగా ముందుకు నడచి రావు గారు కాశీ లోని ప్రఖ్యాత Benaras Hindu University లో MSc physics చేరారు. హాస్టల్ సౌకర్యం దొరక్కపొతే, వాళ్ళను వీళ్ళను పావలా, అర్ధరూపాయ అడుక్కోంటూ 8 రూపాయలు అయితే దానితో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి MSc పూర్తీ చేసారు.
అపుడు అమెరికా (క్యాలిఫోర్నియా ) లోని Stanford University లో Masters చేయాలని రావు గారి కోరిక. పేదరికం వెక్కిరించింది.
కానీ ఆయన ప్రతిభ ఎవరినో ఆకర్షించింది. ఎవరు వారు?
TATA సంస్థ
40 000 రూపాయలను ఆయనకు ఇచ్చి Stanford University కి పంపింది.
అక్కడ ఆయన మేధస్సుకు అమెరికన్ శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, Masters తరువాత వాళ్ళు " ఇండియా వెళ్ళకండి. ఇక్కడే ప్రొఫెసర్ గా వుంటూ మా వాళ్ళను గైడ్ చేయండి, " అని ఆయనకు నెలకు పెద్ద జీతం ఆఫర్ చేసారు. ఎంతనో తెలుసా?
1, 50, 000 రూపాయలు.
కానీ రావు గారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, " క్షమించాలి. నేను నా మాతృదేశం ఋణం తీర్చుకోవాలి, నన్ను ఇక్కడికి పంపిన TATA సంస్థ కు నా సేవలు అందించాలి, " అన్నారట.
భారత్ తిరిగిచ్చాక టాటా వాళ్ళు Tata Institute of Fundamental Research (TIFR ) Mumbai లో ఉద్యోగం ఇచ్చారు. అపుడు ఆయన జీతం ఎంతనో తెలుసా?
300 రూపాయలు!
ఎక్కడ 1,50 000 ? ఎక్కడ 300 ?
ఈ కాలం లో అయితే ఆయన నిర్ణయాన్ని మనం పిచ్చి అంటాం. అవును మనకు డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ప్రతిష్ట పిచ్చి, సుఖాల పిచ్చి !
ఆయనకు దేశమంటే పిచ్చి, కర్తవ్యం అంటే పిచ్చి, కృతఙ్ఞత అంటే పిచ్చి, నైతిక విలువలంటే పిచ్చి!
ముంబై లో రావు గారి పరిశోధనలు ఏ స్థాయిలో వుండేవంటే, సాక్షాత్తూ Father of Indian Nuclear Programme అని పిలవబడిన Dr. Homi Zahangir Bhabha తానే స్వయంగా ముంబై వెళ్లి రావు గారిని అభినందించి వచ్చారట.
తరువాతి రోజుల్లో ఆయన ఎన్నో విభాగాల్లో దేశానికి, సైన్స్ టెక్నాలజీ రంగాల్లో సేవలు అందించి, హైదరాబాద్ లో Electronics Corporation of India Ltd ( ECIL ) ను కూడా స్థాపించారు.
2003 లో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రి లో చేరినప్పుడు ఒక డాక్టర్ గారు ఆయనకు ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్ అమరుస్తూ వున్నారు. ఆయనకు తెలుసు రావు గారు ఇక కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతారని. అపుడు రావు గారు డాక్టర్ ను దగ్గరికి పిలిచి " నాకు ట్రీట్మెంట్ ఇచ్చి నీవు పైకి లేచేటప్పుడు జాగ్రత్త, పైన వున్న మానిటర్ నీ తలకు తగిలే ప్రమాదముంది " అని అన్నారట.
చివరి శ్వాస వరకూ ఇతరుల కష్టం, ఇతరుల బాధ తనవిగా భావించే సున్నితత్వం, మానవత్వం వారిది.
ఇవే కదా ఒక మనిషి character ను నిర్ణయించేది !
ఈసారి హైదరాబాద్ లోని ASR నగర్ వెళితే ఆ మహనీయుడిని గుర్తు చేసుకోండి.
🙏
Very good inspiration
For Everyone.
Source: Facebook