*💎నేటి ఆణిముత్యం💎*
*ఖలుని బుద్ధి చూడ చులకనై యుండును*
*నిలకడుండదెపుడు నిందఁజేయు*
*బుద్ధి గడ్డితినగ శుద్ధెట్లు కలుగును*
*బుద్ఢి మార్చుకొనిన బుధులు మెచ్చు!!*
*భావం:*
*నీచుల బుద్ధి చాలా అవమానకరంగా ఉంటుంది. నిలకడ ఉండదు.ఎవరో ఒకరిని నింద చేస్తూనే ఉంటారు.ఆలోచనలు వక్రంగా ఉంటే స్వచ్ఛత ఎక్కడుంటుంది?కాబట్టి బుద్ధి మార్చుకున్నవారు కీర్తించబడతారు.*
*🤠 నేటి సామెత 🌸*
*వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు..*
కొంతమంది అప్పగించిన పనిని సమయానికి ముగించకుండానే ఆ పని ముగించేసినట్టు చెబుతుంటారు. నిక్కచ్చిగా నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ఏవో కారణాలను చూపుతుంటారు.
*🗣నేటి జాతీయం🤔*
*హారతి కర్పూరం అయిపోవడం*
సులభంగా ఖర్చైపోవడం, తొందరగా అయిపోవడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కర్పూరాన్ని హారతి కోసం వెలిగించినప్పుడు కలిగే స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.హారతి కర్పూరము అతి తొందరగా హరించుక పోతుంది. ధనం, ఆస్తి తొందరగా ఖర్చైన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. 'ఆస్తంతా హారతి కర్పూరమైంది' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి