నేనే శివుడిని
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
15, ఫిబ్రవరి 2026, ఆదివారం
నేనే శివుడిని
సాధకుడు
ఒక్క విషయం ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి అదేమిటంటే తానూ ధరించిన తన
శరీరం తనది కాదని అది కేవలం తన తల్లిదండ్రుల వలన ఈ భౌతిక ప్రపంచములో
తయారయినదని. దానికి బిన్నంగా దానిని ఆసరాగా చేసుకొని తాను వున్నానని
తెలుసుకోవాలి. ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే సాధకునికి అర్ధం
అవుతుంది. తన శరీరమే తనది కానప్పుడు ఆ శరీరానికి సంబందించిన బంధాలు కూడా
తనవి కావు అని తెలుసు కుంటాడు. అటువంటప్పుడు ఇక ఆస్తి పాస్తులు తనవి
యెట్లా అవుతాయి.తాను నాటిన చెట్లను మొలకెత్తించి పురుషుపించే టట్లు
చేసింది ఎవరు. ఆ ఈశ్వరుడు తప్ప ఇంకెవరు. పద్మ పురాణంలోని ఈ శ్లోకాన్ని
ఒకసారి చూడండి.
ఋణానుబంధ రూపేణ! పశు పత్నీ సుతాలయాః!
ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్
రుద్రుడు
అంటే దుఃఖంని హరించే వాడు అని అర్ధం. అంటే ఆనంద స్వరూపుడు అని
తెలుసుకోవాలి. సాధకుడు రుద్రుడిని పూజించాలంటే ముందుగా తాను రుద్రుడిగా
మారాలి
to be continued
శివ " అను రెండు అక్షరములు
( " శివ " అను రెండు అక్షరములు ఉచ్చరించినంత మాత్రాన సమస్త పాపములు నశించును - ధర్మ రక్షకుడు,ఈ జగత్తుకు ప్రభువు, అయిన శివుని ఎవడు నిందిస్తున్నాడో వాడి నాలుకను కోసివేయవలెను - సతీదేవి దక్షప్రజాపతితో )
శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను. మరల మరల నమస్కరిస్తున్నాను).
--------
" శివునకు హవిర్భాగం లేకుండా యజ్ఞము చేస్తున్న
శివ ద్వేషి అయిన దక్షప్రజాపతితో, సతీదేవి ఇలా అన్నది.
"తండ్రీ! శివుడు సమస్త జీవులకు ప్రియమైన ఆత్మస్వరూపుడు.
తనకు ప్రియమైన వాడు గాని,అప్రియమైన వాడుగాని లేనివాడు.
ఎవ్వరియందు వైరభావము లేనివాడు.
ఈ జగత్తులో శివునికంటే శ్రేష్ఠుడు ఎవడు లేడు.
ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు, కారణమైన వాడు.
అటువంటి శివునిపై నీవు తప్ప మరి యెవరు విరోధము వహించెదరు?
సత్పురుషులు ఇతరుల దోషములను గూడా గుణములు గానే గ్రహించెదరు.
కాని నీవంటి అసూయాపరుడు ఇతరులలోని మంచి గుణములలో గూడా దోషములనే చూస్తాడు.
గుణ,దోషములను, యథార్థముగా చూచువాడు మధ్యముడు.
మహాత్ములు ఇతరుల దోషములను పట్టించుకొనకుండా,వారి అల్పగుణములను కూడా గొప్పవిగా స్వీకరింతురు.
శివుడు అటువంటి మహాత్ముడు.
సర్వోత్తముడైన ఆ శివుని అవమానించి నీవు మహా పాపమును చేశావు.
శ్లో//నాశ్చర్య మేతద్య దసత్సు సర్వదా
మహద్వినిన్దా కుణపాత్మ వాదిషు/
సేర్ష్యం మహాపూరుష పాద పాంసుభి
ర్నిరస్త తేజస్సు తదేవ శోభనమ్//
(నశించే శరీరమునే ఆత్మ అని భావించే అసత్పురుషులు, మహాత్ములను నిందించడములో ఆశ్చర్యమేముంది!
మహాత్ములు,తమ నిందను సహిస్తారు.
బ్రహ్మాదులు శిరస్సున ధరించే వారి పాద ధూళి మాత్రము మహాత్ముల నింద సహించదు.
ఆ పాద ధూళి అసత్పురుషులను నశింపజేస్తుంది.
అది మంచిదే గదా!
అనగా మహాత్ములను నిందించిన వారు తమ కృత్యముల వలన తామే నశిస్తున్నారు.
దుర్మార్గులు నశించడము లోకానికి క్షేమమే గదా!
ఆ విధంగా దుర్మార్గులు మహాత్ములను నిందించడం లోక క్షేమం దృష్ట్యా మంచిదే).
శ్లో// యద్ద్వ్యక్షరం నామగిరేరితం నృణాం,
సకృత్ప్రసంగా దఘమాశు హంతి తత్/
పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం,
భవానహో ద్వేష్టి శివం శివేతరః//
( ఎవరి నామము "శివ" అను రెండు అక్షరములు కలిగి వేదములలో ప్రసిద్ధి చెంది ఉన్నదో,
ఎవరి నామము మానవులు కేవలము ప్రసంగ వశమున ఒక మారు ఉచ్చరించినంత మాత్రమున వారి పాపములను నశింప జేయునో,
అనుల్లంఘ్యనీయమైన శాసనము కలవాడు,
పవిత్రమైన యశస్సు కలవాడు,
అయిన ఆ శివుని,
అమంగళ స్వరూపుడవైన నీవు మాత్రమే ద్వేషించు చున్నావు.ఎవరూ ద్వేషించరు).
సతీదేవి దక్షప్రజాపతి తో ఇంకా ఇలా అన్నది.
" తండ్రీ! తుమ్మెదలు మకరందము కోసము పద్మములను సేవిస్తాయి.
అలాగే బ్రహ్మానందమనే మకారందాన్ని ఆస్వాదించడానికి బ్రహ్మాది మహాత్ములందరు శివుని పాదపద్మములను సేవిస్తున్నారు.
ఆ శివుని పాదపద్మములు భక్తజనులకు మనోవాంఛిత వస్తువులను నిరంతరము వర్షించు చుండును.
విశ్వబంధువగు అట్టి శివుని నీవు ద్వేషించుచున్నావు.
శ్లో//కిం వా శివాఖ్య మ శివం న విదుస్త్వదన్యే,
బ్రహ్మాదయ స్తమవకీర్య జటాః శ్మశానే/
తన్మాల్య, భస్మ, నృకపాల్య వస త్పిశాచై
ర్యే మూర్ధభి ర్దధతి తచ్చరణావ స్పృష్టమ్//
(శ్మశానభూమి యందలి మానవ కపాల మాలను,చితాభస్మమును, ఎముకలను, ధరించేవాడు అని శివుని నీవు నిందించావు.
జడలను విరబోసుకుని భూత, ప్రేత,పిశాచములతో బాటు శ్మశానములలో నివసిస్తాడు అన్నావు.
పేరుకు మాత్రమే శివుడు, కానీ వాస్తవానికి అశివుడు ( అమంగళుడు ), అని కూడా నిందించావు.
బ్రహ్మదేవుడు మొదలైన మహాత్ములందరూ నీవు దూషించిన శివుని పాదముల నిర్మాల్యమును భక్తితో శిరస్సు మీద ధరిస్తున్నారు.
పాపం!వారందరూ నీ అంత విజ్ఞానం ఉన్నవారు కాదు కాబోలు ! )
ధర్మ రక్షకుడు,ఈ జగత్తుకు ప్రభువు, అయిన శివుని ఎవడు నిందిస్తున్నాడో వాడి నాలుకను కోసివేయవలెను.
అందుకు సమర్ధుడు కాకున్నచో, ఆ శివ నింద వినకుండా, చెవులు మూసుకుని, అక్కడనుండి వెళ్లిపోవలెను.
అటుల చేయలేక పోతే ప్రాణములు విడిచి పెట్టవలెను.
ఇదే ధర్మము.
శ్లో//అతస్తవోత్పన్న మిదం కలేవరం,
న ధారయిష్యే శితికంఠ గర్హిణః/
జగ్ధస్య మోహాద్ధి విశుద్ధి మంధసో,
జుగుప్సిత స్యోద్ధరణం ప్రచక్షతే//
(అందువలన శివ ద్వేషివైన నీ నుండి పుట్టిన ఈ దేహమును ఇటుపై నేను ధరించను.
పొరబాటున తినకూడని అన్నము తిన్నచో,దానిని వమనము చేయుటయే అందుకు విరుగుడు).
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
15-2-'26.
మాఘ పురాణం - 28వ*
🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷ఆదివారం 15 ఫిబ్రవరి 2026🌷*
_*మాఘ పురాణం - 28వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*15వ తేదీ ఆదివారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
```
మాఘ పురాణం ఇరవైఎనిమిదవ అధ్యాయంలో, క్రూర అనే చాలా కోపంగా ఉండే శూద్ర స్త్రీ ఒకప్పుడు ఉండేది.
ఆమె కొడుకు మాత్రం దయాళువు మరియు ధర్మవంతుడు. అతని భార్య కూడా చాలా మంచిది మరియు భర్తను ప్రేమించేది.
కానీ క్రూర మాత్రం తన కోడలిని కారణం లేకుండా ఎప్పుడూ హింసించేది.
ఒకరోజు ఆమె కోడలిని గదిలో బంధించి ఏడు రోజుల పాటు ఆహారం లేదా నీరు ఇవ్వకుండా పీడించింది. చివరికి ఆమె ఆకలి, దాహంతో మరణించింది. కొంత కాలానికి క్రూర కుమారుడు భార్యను చూసేందుకు గదిలోకి వెళ్లి ఆమె మరణించినట్లు తెలుసుకుని బాధతో కృంగిపోయాడు.
అతను కూడా దుఃఖంతో మరణించాడు. తను చేసిన పనికి క్రూర చాలా పశ్చాత్తాపపడింది కానీ ఆమె కూడా దుఃఖంతోనే మరణించింది. పాపంతో వీరు ముగ్గురూ యమలోకానికి వెళ్ళి అనుభవించాల్సిన కష్టాలు అనుభవించారు.
అదే సమయంలో ధీరుడు, ఉపధీరుడు అనే ఇద్దరు సన్యాసులు చంపానదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించారు. అప్పుడు ఆ చెట్టు క్రింద సర్పాలుగా ఉన్న క్రూర, ఆమె భర్త, కుమారుడు వారిని చూశారు. ధీరుడు మరియు ఉపధీరుడు శ్రీహరిని ప్రార్థించగా, శ్రీహరి వారి ప్రార్థనలను మన్నించి, క్రూర, ఆమె భర్త, కుమారుడి పాపాలను తొలగించాడు. వారు తమ సర్ప శరీరాలను విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నారు. మాఘమాస వ్రతం యొక్క మహిమ ఎంతటిదంటే, దానిని ఆచరించిన వారి పాపాలు తొలగిపోయి వారు స్వర్గాన్ని చేరుకుంటారని ఈ కథ చెబుతోంది.
```
*క్రూర కథ*```
గృత్నృమదహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. “మాఘ మాసమునందు నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘ వ్రతమును ఆచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమును ఎక్కి పూజ్యుడై తన వంశము వారినందరిని ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర అను పేరు కల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది.ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు.ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది తిట్టెడిది. అప్పుడు ఆమె భర్తయు తలచి అత్త మామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యధా శక్తిగ సేవలు చేయుచుండెడిది.
ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా! అమ్మా! నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని, నా భార్య కాని మీకేమి అపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణము ఏమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపము వల్ల ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా! సర్వజ్ఞులైన, పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వ జన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.
పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతో యిట్లనెను.
“మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత? నీ భార్యయెంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు” అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. ’అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా ! విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము మరేమి లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.
కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను.
ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడు రోజులు అన్నము, నీరు లేక ఆవిధముగా నిర్భంధములో ఉండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలెనని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.
క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యేడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి.
క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా6 తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.
క్రూర పశ్చాత్తాపమునందెను, పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభము ఏమి, పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి.
యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము (కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి, చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.
సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన, వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా ! మాఘమాస వ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాస వ్రతము నాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడు అయినను మాఘమాస వ్రతమును ఆచరించినచో, చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకు ఎన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.```
*మాఘపురాణం ఇరవై ఎనిమిదోవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*
శివరాత్రి జాగారం*
🕉️🔱🕉️🔱🛕🔱🕉️🔱🕉️
*శివరాత్రి జాగారం*
*ఉపవాసం ఎందుకు చేస్తారో * *తెలుసా ?"*
*శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతాయి.*
*శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం.*
*వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు.*
*రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది.*
*ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.*
*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ? జాగారం ఎవరు , ఎప్పుడు ప్రారంభించారు ?*
*అంటే దానికి ఒక కథ ఉంది…. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.*
*అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.*
*క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు.
*#శివుడి అభిషేకం యొక్క గొప్పతనం*
*శివరాత్రి సందర్భంగా*
1) శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది
2) ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు
3) దీనిని రుద్ర నమక చమకంతో చేస్తారు
4) జ్ఞానం, ఆరోగ్యం & సంపదకు మూలం శివుడే
5) మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి
6) మానవుల కోరికలు అన్నీ కూడా శివాభిషేకంతో సాధించబడతాయి
7) శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది
8) అందుకే శివ లింగం ఎండిపోకుండా - ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్ళు పడేలా ఉంచుతారు
9) శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు. ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు
10) పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది & రుద్రుడిని శివునిగా మారుస్తుంది
11) శివపార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తాము.
🙏🕉️🔱🌹🛕🌹🕉️🕉️🙏
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
🔱మహా శివరాత్రి పూజా విధానం🔱*
🕉️🔱🕉️🔱🛕🔱🕉️🔱🕉️
*🔱మహా శివరాత్రి పూజా విధానం🔱*
శివరాత్రి నాలుగు విధాలు.....
*1. నిత్య శివరాత్రి* ```
ప్రత్రిరోజూ రాత్రి శివుడిని ఆరాధించడం.```
*2.పక్ష శివరాత్రి*```
పదిహేను తిథులలో చతుర్ధశి లయకారుడైన పరమ శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు చేసే శివారాధన పక్ష శివరాత్రి. ```
*3.మాస శివరాత్రి* ```
బహుళ పక్షంలో (అమావాస్యకు ముందు) వచ్చే 'చతుర్దశి' అంటే శివునికి మరింత అత్యంత ప్రీతికరమైనది మరియు శివపూజమ విశిష్టమైనది. అదే మాస శివరాత్రి.
```
*4. మహా శివరాత్రి* ```
మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడే శివుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
☀️ఇలా శివున్ని నాలుగు విధాలైన శివరాత్రులలో ఆరాధించడం అనంతమైన పుణ్యఫలదాయకం.
ఈ శివరాత్రులలో 'శివ' అనే నామాన్ని ఉచ్ఛరించడమే మోక్షదాయకం.
☀️బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా 'శివ' అనే పేరులోని 'శి' అనే అక్షరం పాపాలను హరింపజేస్తుంది. 'వ' అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుంది.
"శివ" అంటే చాలు పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుంది. ఒక్క శివ నామంలోనే ఇంత శక్తి ఉంటే, నాలుగు విధాల శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. అయితే ఈ నాలుగు ఆచరించలేకపోయినా, కనీసం ఒక్క మహాశివరాత్రిని పాటించినా అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలం లభిస్తుంది.
ఒక్క శివరాత్రి వ్రతం సర్వపాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
⭐️మహాశివరాత్రి ఆచరణ విధానం.....
☀️మహా శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రిపూట అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని 'లింగ పురాణం' చెబుతోంది. శివనామస్మరణతో పగలు గడిపి, అభిషేకాలు, పూజలు రాత్రి చేయవలెను. రాత్రి నాలుగు ఝాముల్లో నాలుగు రకాలైన అభిషేకాలు, పూజలు చేయాలి.
☀️ మొదటి ఝాములో శివుడిని పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించవలెను.
☀️రెండవ ఝాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించి తులసి దళములతో పూజించి పాయసాన్ని నైవేద్యం సమర్పించవలెను.
☀️ మూడవ ఝాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళములతో పూజించి నువ్వులతో వండిన నైవేద్యంగా సమర్పించవలెను.
☀️ నాలుగవ ఝాములో శివలింగాన్ని తేనెతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి, అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవలెను.
⭐️ మహాశివరాత్రినాడు పాటించ వలసిన మరో ప్రధానమైన విధి ఉపవాసం.
☀️భగవత్ప్రాసాదితమైన జ్ఞానామృతంతో ఆత్మ ప్రక్షాళన గావించుకుని శివసాన్నిధ్యంలో కామక్రోధలోభ మోహాది విషయాలను త్యజించి శివ సాన్నిధ్యంతో వాసం చేయడమే 'ఉపవాసం'.
☀️ మహాశివరాత్రి నాడు ఆచరించవలసిన మరో నియమం 'జాగరణ' అంటే బుద్ధిని మెలుకువగా - జాగృతావస్తా - లో ఉంవడమే. అజ్ఞానాందకారంతో తలెత్తి మన మీద దాడిచేసే అరిషడ్వర్గాలను గుర్తించి, సావధానంలో మేల్కొని వానిని జయించాలని జాగరణలోని పరమార్థం. ఎవరి బుద్ధి మేల్కొని ఉంటుందో వారికి మరణ-జననాల పునరావృత్తి ఉండదు. అందువలన చిత్తశుద్ధితో జాగరణ చేయడం మోక్షదాయకం.
☀️ శివలింగం మూలం బ్రహ్మ స్వరూపము, మధ్య భాగం విష్ణు స్వరూపం, పైభాగం సదాశివ స్వరూపం, పానవట్టం గౌరీస్వరూపం. కనుక, శివలింగాన్ని పూజించినట్లైయితే, సృష్టి, స్థితి లయకారులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను ఆదిశక్తిని ఒకే సమయంలో పూజించినట్లు లెక్క.```
🙏🕉️🔱🌹🛕🌹🕉️🔱🙏
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చే యడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కైలాస గిరి నుండి కాశికై.
శ్రీభారత్ వీక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు 🌹
కైలాస గిరిపై నుంచి ప్రపంచాన్ని పరిరక్షిస్తున్న పార్వతీ పరమేశ్వరులకు వందనాలు సమర్పిస్తూ మహా శివరాత్రి సందర్భంగా శ్రీభారత్ వీక్షకులకు అందిస్తున్న చక్కటి గీతం.. కైలాస గిరి నుండి కాశికై.. రచన- మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. గానం.. శ్రీమతి ఆకెళ్ల రాధాదేవి. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు మనలనందరినీ ఆశీర్వదించడానికి ఉపకరించే గీతం. వినండి.. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
15-02-2026 ఆదివారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
15-02-2026 ఆదివారం రాశి ఫలితాలు
మేషం
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.
---------------------------------------
వృషభం
చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.
---------------------------------------
మిధునం
ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.
---------------------------------------
కర్కాటకం
వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
---------------------------------------
సింహం
బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
---------------------------------------
కన్య
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.
---------------------------------------
తుల
దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధు మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధిక ఫలితం తక్కువగా ఉంటుంది.
---------------------------------------
వృశ్చికం
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
---------------------------------------
ధనస్సు
ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
---------------------------------------
మకరం
వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.
---------------------------------------
కుంభం
కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.
---------------------------------------
మీనం
కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
---------------------------------------
సుభాషితమ్
🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *పాపోత్సప విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ*
*స్తోత్ర ధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్త*
*శిరోఽఘిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్ధితో మమాజ్ఞాన*
*యాతన్నిరూపయా ముహుర్మామేవనూమేవచః*
తా𝕝𝕝 *ఓ సర్వేశ్వరా! నేను పాపమును పోగొట్టుకోవడానికి మోక్షం సంపాదించుకోవడానికి, నీ స్తుతియందు జిహ్వను, ధ్యానమున మానసమును ప్రణమిల్లుట యందు శిరస్సును. ప్రదక్షిణమున చరణాలను, అర్చనయందు హస్తములను, చూచుట యందు నేత్రములను, వినడమున కర్ణములను ఉండేలా ఆజ్ఞాపించమని కోరుతున్నాను. నీ ఆజ్ఞను పాటించేలా నన్ను ఉత్సాహపరచుము.*
✍️🌹💐🌸🙏
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము
*652 వ రోజు*
ఏనుగుని ఇవ్వడానికి గౌతముని షరతులు
చివరకు గౌతముడు ఏనుగును ఇవ్వడానికి అంగీకరిస్తూ " రాజా ! పుణ్యకార్యములు చేసిన వాడికి సుఖములు, పాపకార్యములు చేసిన వాడికి కష్టములు కలిగించగలిగిన ప్రదేశం అయిన యమసభకు వస్తే నేను ఈ ఏనుగును నీకు ఇస్తాను. ఆ మాటలకు రాజువేషంలో ఉన్న ఇంద్రుడు నవ్వి " గౌతమా ! పాపములు చేసిన వారు నాస్తికులు పోయే చోటు అయిన యమసభకు నేను ఎలా రాగలను " అన్నాడు. గౌతముడు " రాజా ! అదేమిటి యముడు పుణ్యాత్ముడు కదా ! అక్కడకు రానని చెప్పడం మర్యాదగా ఉంటుందా ! " అన్నాడు. ఇంద్రుడు " అది కాదయ్యా ! యముడు తల్లి, తండ్రులని అక్కను భక్తితో పూజించి పుణ్యాత్ముడయ్యాడు. అక్కడకు నేను రాను " అని అన్నాడు. గౌతముడు " సరేలే గంగానది ఒడ్డుకు రా అక్కడ నేను ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " గౌతమా ! నదీతీరాన అతిథులను సత్కరించి పిదప భుజించేవారు, పరుల నుండి ఏమీ పుచ్చుకునే వారు ఉంటారు కనుక అక్కడకు నేను ఎలా రాగలను ? " అని అడిగాడు. గౌతముడు " కానీ మేరుపర్వతము వద్దకు రా అక్కడ నేను ఈ ఏనుగును ఇస్తాను. ఇంద్రుడు " అదేమిటయ్యా ! మృదువుగా మాట్లాడే వారు, ఎల్లప్పుడు సత్యము పలికేవారు, సర్వభూతములను ప్రేమించేవారు, అందరి మీద దయ కలిగినవారు ఉంటారు అక్కడకు నేను ఎలా రాగలను " అన్నాడు. గౌతముడు " అయితే నారదుడు విహరించే వనముకు రా అక్కడ ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడ ఉన్న నృత్యకళా కోవిదులతో నారదుడు వినోదిస్తూ ఉంటాడు. అక్కడకు నేను ఎలా రాగలను " అన్నాడు. గౌతముడు " పోనీ 'ఉత్తరకురుభూములకు రా అక్కడ దేవతలు విహరిస్తుంటారు. దేవేంద్రుడు కూడా అక్కడకు వచ్చి దేవతల కోరికలు తీరుస్తుంటాడు. అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అది కుదరదయ్యా ! అక్కడకు కామము, హింస విడిచి పెట్టిన వారు వస్తారు. ఆచోటుకు రావడం నా తరంకాదు " అన్నాడు. గౌతముడు " చంద్రుడి ఇంటికి రా అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " ఇంద్రుడు " అక్కడ కుదరదులే. అక్కడ దానం చేసే వారు, మరొకరి దానము పుచ్చుకొనని వారు అక్కడకు వస్తారు. నేను దానం తీసుకోవడానికి అక్కడకు ఎలా రాగలను " అని అన్నాడు. గౌతముడు " పోనీ సూర్యలోకముకు రా ! అక్కడ ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " మంచితపస్సు, సాధ్యాయనం చేసే వారు వస్తారు. కనుక అక్కడకు నేను రాలేను " అన్నాడు. గౌతముడు " పోనీ వరుణలోకముకు రా ! అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అని అన్నాడు. ఇంద్రుడు " యజ్ఞ, యాగములు, నిత్యాగ్ని హోత్రములు చేసే వారు వస్తారు. అక్కడకు నేను రాను " అని అన్నాడు. గౌతముడు " పోనీ ఇంద్రుడి వద్దకు రా అక్కడ ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అమ్మో అక్కడకు యుద్ధ వీరులూ, యజ్ఞమును చేసిన సోమయాజులు, నూరేండ్లు జీవించిన మానవులు ఉంటారు. అక్కడకు నేను రాను " అన్నాడు. గౌతముడు " పోనీ ప్రజాపతి లోకానికి రా అక్కడ ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడకు అశ్వమేధయాగము చేసినవారు వస్తారు. నేను అక్కడకు రాను " అన్నాడు. గౌతముడు " పోనీ గోలోకముకు రా అక్కడ ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అక్కడకు గోదానము చేసిన వారు, తీర్ధయాత్రలు సేవించిన వారు, నిరంతరం బ్రహ్మచర్యము అవలంబించువారు వస్తారు. అక్కడకు నేను రాను " అన్నాడు. గౌతముడు " రాజా ! శీతోష్ణములు, సుఖదుఃఖములు, మిత్రులు శత్రువులు లేని ద్వదందములకు అతీతమైన బ్రహ్మలోకముకు రా ! అక్కడ నీకు ఏనుగును ఇస్తాను " అన్నాడు. ఇంద్రుడు " అది కుదరదులే ! అక్కడకు సంగత్వము లేని వారు, ఆత్మజ్ఞానంతో ప్రకాశించే వారు, ఎల్లప్పుడూ వ్రతనిష్ట కలిగిన వారు, ఆధ్యాత్మ విద్యయందు ఆసక్తికలవారు వస్తారు. అక్కడకు నేను రాలేను " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
⚜ శ్రీ యోగ రామచంద్ర ఆలయం
🕉 మన గుడి : నెం 1389
⚜ తమిళనాడు : నెడుంగుణం
⚜ శ్రీ యోగ రామచంద్ర ఆలయం
💠 కడు రమణీయమైన ప్రకృతి సౌందర్యం వుట్టిపడే నెడుంగుణం అనే ఊళ్ళో ఒక విభిన్నమైన శ్రీ వైష్ణవాలయం వున్నది.
అదే 'యోగ రాముని' ఆలయం.
💠 ఈ ఆలయంలోని శ్రీరాముడు కోదండం లేకుండా యోగముద్ర ధరిస్తూ దర్శనమివ్వడం ఒక విశిష్టత.
💠 ఈ దేవాలయం తమిళనాడులోని వందవాసికి సమీపమున గల నెడుంగుణం అనే ఊరిలో వుంది.
⚜ స్థల పురాణం
💠 శుకబ్రహ్మ గొప్ప జ్ఞాని,మహాయోగి.
ఇహలోక విషయాలకు అతీతుడై సదా తపోదీక్షలోనే వుండే మహానుభావుడు.
💠 రావణుడిని ఓడించిన తర్వాత, శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు నెడుంగునం కొండ అతని దృష్టిని ఆకర్షించింది.
అక్కడ, చిలుక లాంటి ముఖం కలిగిన, వేద వ్యాసుని కుమారుడు అయిన శుకుడు మోక్షాన్ని కోరుతూ అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని దర్శనం కోరి తపస్సు మొదలుపెట్టాడు.
💠 శ్రీరాముడు సీతా లక్ష్మణ హనుమత్సమేతంగా శుక మహర్షి ఆశ్రమానికి విచ్చేసాడు.
వచ్చిన అతిధులందరికీ ఆ రోజు ఆతిధ్యమివ్వాలని శుకముని ఆశించి రాముడిని కోరారు.
వారికి ఒక పూట భోజనం పెట్టాలని అనుకుని శ్రీ రాముని ఆహ్వానించారు మహర్షి.
💠 రావణ సంహారం అయిన వెంటనే సీతాదేవితో అయోధ్యకు రాకపోతే అగ్ని ప్రవేశం చేసే ప్రయత్నంలో భరతుడు వున్నాడు.
శ్రీరామునికి ఎటూ పాలుపోని స్థితి. శుక మహర్షి కోరికను కాదనలేడు. అటు సోదరుడు భరతుని కాపాడాలి.
💠 ధర్మసంకటంలో పడిన రామునికి ఒక ఆలోచన తట్టింది.
వెంటనే హనుమంతునికి తన అంగుళీయకమును యిచ్చి తాము అయోధ్యకు వస్తున్న వార్తను భరతునికి తెలిపి వెంటనే తిరిగి రమ్మని హనుమంతుని ఆదేశించాడు.
💠 రామాజ్ఞ మేరకు హనుమ వాయువేగంతో భరతుని వద్దకు వెళ్ళి విషయం తెలిపి, అతనిని సమాధానపరచి తిరిగి వచ్చాడు.
💠 శుక మహర్షి తను సేకరించిన అపురూపమైన వేదార్ధ తాళపత్ర గ్రంధాలను శ్రీరామునికి యివ్వగా, రాముడు వాటిని వినయంగా అందుకొని హనుమంతునికి యిచ్చి చదివి వినిపించమన్నాడు.
💠 తక్షణమే హనుమంతుడు
రామునికెదురుగా పద్మాసనంలో కూర్చుని ఆ తాళపత్రాలను చదివి వినిపించగా అందులోని వేదశాస్త్రార్ధాలను విని ఆనందించిన
శ్రీరాముడు 'ముక్తికోపనిషత్తు 'అనే ఉపనిషత్తుని హనుమంతునికి ఉపదేశించాడని ఈ ఆలయ చరిత్ర తెలుపుతున్నది.
💠 ప్రాచీనకాలంలో అరిటాకుకి
మధ్యలో ఇప్పుడు వున్నట్టు
సగభాగం చేస్తూ ఈనె వుండేది కాదట.
💠 హనుమంతుడు వేరు,తాను వేరు కాదని భావించే రాముడు హనుమంతునికి తనతో
సమాన అంతస్తుని యివ్వాలని సంకల్పించాడు.
💠 శుక మహర్షి ఆశ్రమంలో భోజనం చేసేటప్పుడు ఇద్దరూ ఒకే అరిటాకులో భోజనం చేయడానికి హనుమంతుని కూడా ఆశీనుని చేసి ఒకే ఆకులో వారిద్దరూ ఒకే సమయంలో భోజనం చేయడానికి వీలుగా అరిటాకు
మధ్య ఒక గీతని గీశాడు రాముడు.
💠 ఆనాడు అరిటాకు మధ్యలో గీసిన గీతే ఈనాడు అరిటాకులో మధ్యగా ఈనెగా మారిందని చెపుతారు. ఈ సంఘటన ఈ ఆలయం వున్న స్థలంలోనే జరిగినదని స్థలపురాణం విశదీకరిస్తోంది
💠 శుక మహర్షి ప్రార్ధనని మన్నించి శ్రీరాముడు ఒక పూట ఆయన ఆశ్రమంలో వుండి ఒక పొడవాటి రాతిమీద ఆశీనుడైనందున, ఈ ప్రాంతం ప్రసిధ్ధిచెంది 'నెడుంకున్డ్రు ' అని పిలువబడినది.
💠 శుకుడు తన ఆశ్రమంలోనే శ్రీరాముడు విడిది చేసిన భంగిమలోనే ఒక విగ్రహం ప్రతిష్టించి, తన నివాసాన్ని ఆలయంగా చేసుకుని పూజలు చేయసాగారు శుకమహర్షి.
శ్రీరాముడు కూర్చున్న భంగిమలో ఉన్న ఏకైక ఆలయం ఇదే.
💠 యోగ రాముడి ఆలయం విద్యా ప్రయోజనాలను కోరుకునే ప్రార్థనా స్థలంగా మరింత గౌరవించబడుతుంది.
భక్తులు జ్ఞానం, సంతోషకరమైన వివాహం, సంతాన వరం, కుటుంబ ఐక్యత, మతిమరుపు నుండి నివారణ మొదలైన వాటి కోసం కూడా భగవంతుని ఆశీర్వాదాలను కోరుకుంటారు.
💠 ఆదిలో చాలా చిన్నదిగా వుండే ఈ రాముని ఆలయాన్ని కృష్ణదేవరాయలు తన కాలంలో చాలా అభివృద్ధి పర్చారు.
💠 ఆరు అంతస్తుల రాజ గోపురం,బలి పీఠం,వేయి కాళ్ళ మండపం గల ఈ ఆలయం గర్భగుడి ముందు 9 అడుగుల ఎత్తున ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా
నిలబడివుండడం చూస్తాము.
💠 గర్భగుడిలోని శ్రీ రాముడు కోదండం ధరించకుండా యోగ భంగిమలో సింహాసనం మీద ఆశీనుడై వుండగా, ఆయన
ఒక హస్తం జ్ఞాన ముద్రనుపట్టి
హృదయానికి సమీపమున వుంటుంది.
మరియొక హస్తం తొడమీద
వుంటుంది.
💠 ఆయనకి ఎడమ వైపున సీతాదేవి చేతిలో తామర పుష్పం ధరించి ఆశీనురాలై వుంటుంది.
కుడిప్రక్కన లక్ష్మణుడు , రామునికి ముందు హనుమంతుడు నేల మీద ఆశీనుడై తాళపత్రాలలోని
బ్రహ్మసూత్రాలను చదువుతున్న భంగిమలో కనిపిస్తారు.
💠 విజయరాజు అన్నది యోగరామ దేవాలయంలోని ఉత్సవమూర్తి పేరు.
💠 చక్రతాళ్వారు, కల్యాణ వేంకటేశ పెరుమాళ్, సంజీవి హనుమాన్, ఆళ్వారులు మొదలైన వారి కోసం ప్రధాన మందిరం చుట్టూ అనేక అందమైన సన్నీధులు ఉన్నాయి.
💠 ఈ ఆలయ తీర్థాన్ని శుక తీర్థం లేదా సూర్య తీర్థం అని కూడా పిలుస్తారు .
💠 శ్రీ రామనవమి వైశాఖ నక్షత్రాన గరుడసేవ,శ్రీకృష్ణ జయంతి , కార్తిక దీపం,హనుమజయంతి, మొదలైన
పండుగలు వైభవంగా
జరుపుతారు.
శ్రీ రామనవమి ఉత్సవం
ఘన వైభవంగా జరుపుతారు.
💠 తిరువన్నమలై నుండి 55 కి.మీ
రచన
©️ Santosh Kumar
మాఘ పురాణం*
```
*మాఘ పురాణం*
➖➖➖✍️
28 వ అధ్యాయము
మాఘ పురాణం ఇరవైఎనిమిదవ అధ్యాయంలో, క్రూర అనే చాలా కోపంగా ఉండే శూద్ర స్త్రీ ఒకప్పుడు ఉండేది.
ఆమె కొడుకు మాత్రం దయాళువు మరియు ధర్మవంతుడు. అతని భార్య కూడా చాలా మంచిది మరియు భర్తను ప్రేమించేది.
కానీ క్రూర మాత్రం తన కోడలిని కారణం లేకుండా ఎప్పుడూ హింసించేది.
ఒకరోజు ఆమె కోడలిని గదిలో బంధించి ఏడు రోజుల పాటు ఆహారం లేదా నీరు ఇవ్వకుండా పీడించింది. చివరికి ఆమె ఆకలి, దాహంతో మరణించింది. కొంత కాలానికి క్రూర కుమారుడు భార్యను చూసేందుకు గదిలోకి వెళ్లి ఆమె మరణించినట్లు తెలుసుకుని బాధతో కృంగిపోయాడు.
అతను కూడా దుఃఖంతో మరణించాడు. తను చేసిన పనికి క్రూర చాలా పశ్చాత్తాపపడింది కానీ ఆమె కూడా దుఃఖంతోనే మరణించింది. పాపంతో వీరు ముగ్గురూ యమలోకానికి వెళ్ళి అనుభవించాల్సిన కష్టాలు అనుభవించారు.
అదే సమయంలో ధీరుడు, ఉపధీరుడు అనే ఇద్దరు సన్యాసులు చంపానదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించారు. అప్పుడు ఆ చెట్టు క్రింద సర్పాలుగా ఉన్న క్రూర, ఆమె భర్త, కుమారుడు వారిని చూశారు. ధీరుడు మరియు ఉపధీరుడు శ్రీహరిని ప్రార్థించగా, శ్రీహరి వారి ప్రార్థనలను మన్నించి, క్రూర, ఆమె భర్త, కుమారుడి పాపాలను తొలగించాడు. వారు తమ సర్ప శరీరాలను విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నారు. మాఘమాస వ్రతం యొక్క మహిమ ఎంతటిదంటే, దానిని ఆచరించిన వారి పాపాలు తొలగిపోయి వారు స్వర్గాన్ని చేరుకుంటారని ఈ కథ చెబుతోంది.
*క్రూర కథ:*```
గృత్నృమదహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. “మాఘ మాసమునందు నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘ వ్రతమును ఆచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమును ఎక్కి పూజ్యుడై తన వంశము వారినందరిని ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర అను పేరు కల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది.ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు.ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది తిట్టెడిది. అప్పుడు ఆమె భర్తయు తలచి అత్త మామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యధా శక్తిగ సేవలు చేయుచుండెడిది.
ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా! అమ్మా! నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని, నా భార్య కాని మీకేమి అపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణము ఏమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపము వల్ల ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా! సర్వజ్ఞులైన, పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వ జన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.
పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతో యిట్లనెను. “మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత? నీ భార్యయెంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు” అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. ’అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా ! విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము మరేమి లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.
కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడు రోజులు అన్నము, నీరు లేక ఆవిధముగా నిర్భంధములో ఉండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలెనని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.
క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యేడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి.
క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.
క్రూర పశ్చాత్తాపమునందెను, పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభము ఏమి, పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము (కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి, చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.
సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన, వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా ! మాఘమాస వ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాస వ్రతము నాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడు అయినను మాఘమాస వ్రతమును ఆచరించినచో, చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకు ఎన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
పోతన
పోతన వ్యక్తిత్వ ప్రశంస :
పోతన మహాకవి పేరును.. ఆయన రచించిన భాగవత కావ్యాన్ని తలచుకోగలగడమే పెద్ద పుణ్యం.
"రాజులు గడ్డమంటినను రాడు సభాస్థలి చూడనైన ,
ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు , విష్ణు వి, భ్రాజిత పాదపద్మములు భాగవతమ్ములు వాని పద్యముల్ , సాజము గానె చిత్తీ కలశమ్మును చుట్టిన భక్తి సూత్రముల్ "
అంటూ ,'మహా సహస్రావధాని', ' పద్మశ్రీ ' డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు పోతన వ్యక్తిత్వం గురించి "సాగర ఘోష " కావ్యంలో ఘనమైన పద్యాన్ని అందించారు,
పోతన మహాకవి విషయంలో ఈ వర్ణన ,ప్రశంస అక్షర సత్యమనే చెప్పాలి .
పోతన మహాకవి కవిత్వాన్ని నమ్ముకున్న వాడే గానే అమ్ముకున్న వాడు కాదు .
రాజులు తనను ఆహ్వానించి విలువైన రత్న ధనరాశులు ఇస్తామని భాగవత కావ్యాన్ని తమకు అంకితం ఇవ్వ వలసినదని ఎంతగా ప్రాధేయపడినా సున్నితంగా నిరాకరించిన ఘనమైన వ్యక్తిత్వం పోతన మహాకవి స్వంతం.
రాజుల ప్రలోభానికి.. ఒత్తిడికి తలొగ్గి పోతన భాగవత కావ్యాన్ని వారికి ఎక్కడ అంకితం ఇస్తాడోననే భయంతో సరస్వతీ దేవి కన్నీరు కారుస్తూ పోతన ఎదుట సాక్షాత్కరించింది.
తాను ధనం కోసం భాగవత కావ్యాన్ని రాజులకు. అంకితం ఇవ్వనని దుఃఖించ వద్దంటూ పోతన సరస్వతీ దేవిని ఊరడించి ఆమె కన్నీరు తుడిచి ఆమెకు సంతోషాన్ని కలుగ చేసాడు.
ధనం కోసం కవిత్వాన్ని కావ్యాన్ని అమ్ముకోవడం తీవ్రమైన అపచారంగా పోతన భావించాడు .
అందుకే ఆయన వ్యవసాయం చేసుకుని జీవిస్తాను తప్ప తన కావ్యాన్ని, కవిత్వాన్ని ధనం కోసం అమ్ముకోబోనని స్పష్టం చేసాడు.
పేరు ప్రతిష్ఠల కోసం ..ప్రచారం కోసం తమ రచనలను దుర్వినియోగం చేసే వారున్న నేటి కాలంలో పోతన వంటి సత్కవులు పుణ్య శీలురు అతి అరుదుగా మనకు కనిపిస్తారు. పోతనను దండించాలని చూసిన రాజులు కాల గర్భంలో కలిసి పోయారు.
పోతన పద్యాలు మాత్రం పండిత..పామర జన నాల్కలపై నర్తిస్తూ భాగవత మకరంద సుధారస మాధురులను పంచుతూ ఆ మహాకవిని..పరమ భాగవతోత్తముని నేటికీ మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి.
కవి నిఖార్సైన వ్యక్తిత్వం కలిగిన వాడయినప్పుడే అతడికి సామాజిక గౌరవం, సత్కీర్తి ప్రాప్తిస్తాయి.
కవిత్వం విలువ నిలబడాలంటే కవులకు ఉన్నతమైన వ్యక్తిత్వం అవసరం.
కవి రచనతో పాటు అతడి వ్యక్తిత్వపు విలువను కూడా సమాజం అంచనా వేస్తుంది.
(ఎం.వి.ఎస్. శాస్త్రి, ఒంగోలు 9948409528)
ఆయురారోగ్యాలు ఇచ్చే ధన్వంతరీ*
*ఆయురారోగ్యాలు ఇచ్చే ధన్వంతరీ*
➖➖➖✍️
```
ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు. సకల సుఖాలు అనుభవించడానికి ఆరోగ్యమే ఉండాలి. అందుకే పెద్దలు దీవించేటప్పుడు “ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన,ఉద్యోగ ప్రాప్తిరస్తు” అంటారు.
ఆయువు తర్వాత ఆరోగ్యానికే పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. సకల రోగాల విముక్తికై మనమంతా ధన్వంతరిని పూజించాలి.
సాక్షాత్తూ విష్ణుమూర్తియే ధన్వంతరిగా పాలకడలి నుండి అమృతభాండం పట్టుకుని అవతరించాడు.
భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
కాశీరాజు దేవదాసు ధన్వంతరి(అంటే ‘ధన్వంతరి’ అన్న బిరుదు కలిగిన కాశీరాజు ‘దేవదాసు’)- ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.
విక్రమాదిత్యుని ఆస్థానంలో ‘నవరత్నాలు’గా ప్రసిద్ధులైన పండిత ప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే ‘ధన్వంతరి నిఘంటువు’ అనే వైద్య పారిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ధన్వన్తరి శబ్దానికి ‘ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః’ అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది.
మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును.
పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి ‘ధాన్వన్తరీయులు’ అని వ్యవహరించడం వాడుకలో ఉంది.
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని విష్ణుమూర్తి ఆజ్ఞతో మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు.
అతన్ని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మారుద్రాదులు గ్రహించి అతనికి ‘ధన్వంతరి’అని పేరు పెట్టినారు.
వైద్యవిద్యకు అధిదేవుడు. సనాతన వైద్య శాస్తమ్రైన ఆయుర్వేదాన్ని వృత్తిగా గైకొన్నవారు ప్రతిరోజూ ధన్వంతరీ పూజ చేస్తారు. యాగాలు చేస్తారు. వైద్యులు మాత్రమే ధన్వంతర యాగాన్ని, పూజలను చేస్తారని, మరెవ్వరూ చేయరు అనే భావన చాలామందిలో ఉంది.
కాని ఈ ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. అందుకే ధన్వంతరి వ్రతాన్ని ఆనవాయితీగా లేనివారు కూడా శ్రీమన్నారాయుణిడిని, ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి.
ఆయుర్వేదానికి ప్రథమ గురువు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి మొదట ఆయుర్వేద శాస్త్రం ఉపదేశం పొందినాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలు, ప్రతి చెట్టు ఔషధాలతో నిస్తుందని చెప్తుంది ఆయుర్వేదం. కేరళ రాష్ట్రంలో త్రిశూర్ వద్ద ధన్వంతరి ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.```
*పురాణ కథనం:* ```
పురాణ కథనం ప్రకారం సురాసురులు కలిసి పాలసముద్రాన్ని మధించారు. ధర్మాచరణతో మనుగడ సాగించేవారికి అపారమైన జ్ఞానాన్ని, అనంతమైన సంపదను అందించడానికి విశ్వపాలకుడు, జగద్రక్షుడైన ఆ నారాయణుడు నడుం కట్టాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని పరమశివుడు మింగేసి గరళకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, ఉచ్ఛైశ్రవం పుట్టాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీ, కల్పవృక్షం ఉద్భవించింది.
చిట్టచివరగా శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ ప్రశాంత సాకార పరంజ్యోతి స్వరూపుడుగా ధన్వంతరి రూపం ధరించి చేతిలో అమృత కలశంతో వెలుపలికి వచ్చాడు.
అమృత కలశంలోనే సమస్త శారీరక, మానసిక, అజ్ఞానరోగాలకు ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి.
శ్రీమహావిష్ణువుకు ప్రతి రూపమైన ధన్వంతరి నాలుగు భుజాలుతో ఉద్భవించాడు. దేవదానవులు అతనికి నమస్కరించారు.
వైభవంగల ధన్వంతరి(శ్రీమహావిష్ణువు) పటాన్ని కుంకుమతో, పుష్పాలతో అలంకరించి, స్వామి సహస్రనామాన్ని పఠిస్తూ తెల్లపూవులు లేదా తులసీ దళాలతో అర్చించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ ముందుగా స్వీకరించి అనంతరం ఖచ్చితంగా కనీసం అయిదుగురికైనా పంచాలి.
మేడి(ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి ధన్వంతరి ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము.
అత్తి చెట్టు కింద కూర్చుని శ్రీధన్వంతరి మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ ధన్వంతరివారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీధన్వంతరిస్వామిని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది.
ఈ క్రింది స్తోత్రము ప్రతి రోజు చదివిన యెడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు. ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.```
*ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ*
*ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ*
*త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా*
*ఓం నమోభగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ*
*త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః*✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
నక్షత్రం: జ్యేష్ట (Jyeshtha)*
*నక్షత్ర స్తోత్ర మాలిక*
➖➖➖✍️
18 వ రోజు
*నక్షత్రం: జ్యేష్ట (Jyeshtha)*
*అధిపతి: బుధుడు (Mercury)*
```
*ఆరాధించాల్సిన దైవం: ఇంద్రుడు /శ్రీకృష్ణుడు(గోవిందుడు)
జ్యేష్ట నక్షత్ర జాతకులు, కుటుంబ పెద్దలు మరియు నాయకత్వ లక్షణాలు, మానసిక ప్రశాంతత కోరుకునే వారు పఠించాల్సిన స్తోత్రం:
🙏 శ్రీ గోవిందాష్టకం 🙏
సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్।
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్॥1॥
మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవసంత్రాసం
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్।
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్॥2॥
త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్।
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్॥3॥
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్।
గోభిర్నిగదితగోవిందస్ఫుటనామానం బహునామానం
గోధీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్॥4॥
గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభం
శశ్వద్గోఖురనిర్ధూతోద్గతధూళీధూసరసౌభాగ్యమ్।
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్॥5॥
స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః।
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతఃస్థం
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్॥6॥
కాంతం కారణకారణమాదిమనాదిం కాలఘనాభాసం
కాళిందీగతకాళియశిరసి సునృత్యంతం ముహురత్యంతమ్।
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్॥7॥
బృందావనభువి బృందారకగణబృందారాధితవంద్యాయాం
కుందాభామలమందస్మేరసుధానందం సుమహానందమ్।
వంద్యాశేషమహామునిమానసవంద్యానందపదద్వంద్వం
నంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్॥8॥
గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యో
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి।
గోవిందాంఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో
గోవిందం పరమానందామృతమంతఃస్థం స తమభ్యేతి॥9॥```
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ గోవిందాష్టకమ్।```
జ్యేష్టా నక్షత్రం వృశ్చిక రాశిలోని 16°40′ నుండి 30°00′ డిగ్రీల పరిధిలో ఉండే 18వ నక్షత్రం.
ఇది బుధుని పాలనలో ఉండి, ఇంద్రుని అధిదేవతగా కలిగి ఉంటుంది.
ఈ నక్షత్రం తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు, రక్షణ బాధ్యతలను సూచిస్తుంది, జాతకులకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, మరియు చురుకుదనాన్ని ప్రసాదిస్తుంది.
*జ్యేష్ట నక్షత్రం యొక్క ముఖ్య లక్షణాలు:
*అధిపతి: బుధుడు (Mercury)
*రాశి: వృశ్చిక రాశి
*అధిదేవత: ఇంద్రుడు
*చిహ్నం: గొడుగు, గుండ్రని రక్షిత టాలిస్మాన్ లేదా చెవిపోగు
*గణం: రాక్షస గణం
*అక్షరాలు: నో, యా, యీ, యూ (No, Ya, Yi, Yu)
*వ్యక్తిత్వ లక్షణాలు:
*తెలివైనవారు & నాయకులు: జ్యేష్ట నక్షత్ర జాతకులు అత్యంత మేధావులు, బాధ్యతాయుతమైనవారు మరియు కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తారు.
*ధైర్యవంతులు: వీరు చాలా ధైర్యవంతులు, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరు, మరియు తమకు నమ్మకమైన స్నేహితులను కలిగి ఉంటారు.
*రక్షకులు: ఇతరులను, ముఖ్యంగా బలహీనులను రక్షించే స్వభావం వీరికి ఉంటుంది.
*అహంకారం: కొంతమందిలో అహంకారం లేదా తమ గొప్పతనాన్ని ప్రదర్శించాలనే కోరిక ఎక్కువగా ఉండవచ్చు.
*సమస్యల పరిష్కారం: వీరు క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు, మరియు నిగూఢ శాస్త్రాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.
*వృత్తి మరియు ఆర్థికం:
న్యాయవాదులు, పరిపాలకులు, నాయకులు, మరియు సంరక్షకులుగా రాణిస్తారు.
ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు, తరచుగా చిన్న వయస్సు నుండే సంపాదన మొదలుపెడతారు.
*పరిహారాలు:
జ్యేష్ట నక్షత్రం 'గండ మూల' నక్షత్రాలలో ఒకటి కాబట్టి, శాంతి పూజలు చేయడం మంచిదని సూచించబడింది.
బుధుడు అధిపతి కాబట్టి, విష్ణు సహస్రనామ పారాయణ లేదా బుధ మంత్ర జపం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
జ్యేష్ట నక్షత్ర జాతకులు తమలోని అహంకారాన్ని తగ్గించుకుని, ఇతరులతో సున్నితంగా వ్యవహరిస్తే, గొప్ప విజయాలను సాధించగలరు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
విసమం అంటే సమం కానిది
. విసమం అంటే సమం కానిది
అదే విషం అని వాడుక పదం.
విషాన్ని తిరగేస్తే శివ
వేద వాఙ్మయం లోనే కాదు
విచిత్రంగా ఏ భాషలో అయినా ఒకటే
ఆంగ్లంలో కూడా అంతే
ద్వంద్వాల (కష్టసుఖాలు, లాభనష్టాలు) మధ్య సమత్వభావనే శివ తత్వం
శివుని విష భక్షణం అంటే
సమం లేదా సరికానిది మనసులో కూడా ఉండకూడదు
అదే విషం అని వాడుక పదం.
విషాన్ని తిరగేస్తే శివ
వేద వాఙ్మయం లోనే కాదు
విచిత్రంగా ఏ భాషలో అయినా ఒకటే
ఆంగ్లంలో కూడా అంతే
ద్వంద్వాల (కష్టసుఖాలు, లాభనష్టాలు) మధ్య సమత్వభావనే శివ తత్వం
శివుని విష భక్షణం అంటే
సమం లేదా సరికానిది మనసులో కూడా ఉండకూడదు
మహాశివరాత్రి
శ్రీరామ (83)
శుభోదయం.
🙏🏻అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🏻
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
ఈరోజు మహాశివరాత్రి శుభసందర్భంగా శివ నామ మాహాత్మ్యం ఒకసారి గుర్తుచేసుకుందాము.
' వేదపాదస్తవము ' లో శ్రీ జైమినిమహర్షి,
ఈశ్వరుని ఇలా ప్రార్ధిస్తున్నారు.
శ్లో// లబ్ధానిష్ట సహస్రస్య,నిత్యమిష్ట వియోగిన:/
హృద్రోగం మమ దేవేశ హరిమాణం చ నాశయ//
(ఓ ఈశ్వరా! అజ్ఞాన జనితమైన హృదయ దౌర్బల్యం వలన నేను నిత్యము మనస్సుకు ఇష్టంకాని ( వార్ధక్యము, వ్యాధులు, మరణము, మొదలైనవి) విషయములతో సంయోగమును,
మనస్సుకు ఇష్ఞమైన (ధనము, బంధుమిత్రులు కీర్తిప్రతిష్ఠలు మొదలైనవి) విషయములతో వియోగమును పొందుచున్నాను.
హృదయ దౌర్బల్య కారణము,జ్ఞాన విజ్ఞానములను నశింపజేసేది అయిన నా అజ్ఞానమును పోగొట్టుము)
శ్రీ ధూర్జటిమహాకవి, దీనికి పరిష్కారం
సమస్త పాపములను నశింపజేసి, ధర్మార్థకామ మోక్షములను ప్రసాదించే, మహామహిమాన్వితమైన
శివనామ జపం నిరంతరం చేయటమే అంటున్నారు.
శా//నిప్పై పాతక తూల శైల మడచున్, నీ నామమున్ మానవుల్/
తప్పన్ దవ్వుల విన్న నంతక భుజాదర్పోద్ధత క్లేశముల్/
తప్పుం, దారును ముక్తులౌదురని శాస్త్రంబు ల్మహాపండితుల్/
చెప్పంగా దమ కింక శంక వలెనా
శ్రీ కాళహస్తీశ్వరా!//
(ఓ ! శ్రీకాళహస్తీశ్వర స్వామీ! "శివ" అను నీ నామము తెలిసి గాని, తెలియకుండా గాని,భక్తితోగాని, భక్తి లేకుండా గాని, కేవలము ఉచ్చరించినా,
దూరమునుండి విన్నా,
అగ్ని , దూది రాసులను దహించునట్లు సమస్త పాపములను నశింపజేస్తుంది,
దర్పంతో యముడు పెట్టే బాధలనుండి విముక్తి లభిస్తుంది,
మోక్షము లభిస్తుంది,
అని,
శాస్త్రములు, మహాపండితులు చెప్పుచుండగా ఇంకా మాకు సందేహం ఎందుకు ?)
కాబట్టి అన్ని శంకలు వదిలేసి నిరంతర శివనామ స్మరణ చేసి తరిద్దాం.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు,
15-2-'26
శ్రీశైలమునకేగి సేవలన్ గావించ
ఓం నమః శివాయ 🙏
శ్రీశైలమునకేగి సేవలన్ గావించ
శంకరా ! నా కంత శక్తిలేదు
కాంచీపురికి నేగి కనుల నేకామ్రేశు
దర్శించి సేవించ తనువు వినదు
కాశికావిశ్వేశు కనులార గాంచంగ
కాంక్ష యున్నది కాని కదల లేను
శ్రీమహాకాళేశు చేరిసేవించగా
స్థిరభక్తి యుండినన్ చేవ లేదు
నాదు నణుమాత్ర శక్తిని నయముగాను
కాంచనాద్రిగా నీవు భావించి మదిని
వేగ రక్షించునన్ను నీ వీక్షణముల
ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !
గోపాలుని మధుసూదన రావు 🙏🙏🙏
శివస్తుతి
🕉️మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలతో...🕉️
✡️🕉️ *శివస్తుతి* 🕉️✡️
పినాకహస్తభూషణం సదావిభూతిదాయకం
గిరీంద్రజాతమానసాబ్జభృంగరాట్చ మోహనమ్
మహేశ్వరం శుభాన్వయం హిమాద్రిశృంగవాసినం
నిరంతరం హృదంతరే ప్రపూజయామి ఈశ్వరమ్ -1
అనంగదర్పభంజకం భుజంగభూషశోభితం
చితాదిభస్మలేపితం సదాతపోవిరాజితమ్
నిశాచరాధినాయకం శశీంద్రఖండశేఖరం
నిరంతరం హృదంతరే ప్రపూజయామి ఈశ్వరమ్ -2
మహాశ్మశానవాసినం కరీంద్రచర్మవేష్ఠినం
మహాగ్నిఫాలలోచనం త్రిశూలదండధారిణమ్
దిగంబరం కళాధరం రజోహరం విరాగినం
నిరంతరం హృదంతరే ప్రపూజయామి ఈశ్వరమ్ -3
నిశీధిపూజనప్రియం నితాంతభక్తతోషణం
హిమాద్రిజాతవల్లభం సురేశ్వరాదివందితమ్
తమోహరం మనోహరం తపోనిధిం గుణార్ణవం
నిరంతరం హృదంతరే ప్రపూజయామి ఈశ్వరమ్ -4
త్రిలోకభూతనాయకం త్రికోటిదేవపూజితం
త్రికాలవేద్యదైవతం త్రిపుండ్రదారిణం హరమ్
త్రిలోచనం సురేశ్వరం త్రిలోకముఖ్యనాయకం
నిరంతరం హృదంతరే ప్రపూజయామి ఈశ్వరమ్ -5
*~శ్రీశర్మద*