27, మే 2026, బుధవారం

🌹28, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🌷గురువారం🌷*

 *🌹28, మే, 2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం* 

              

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి       : ద్వాదశి* ఉ 07.56 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం: గురువారం*

(బృహస్పతివాసరే)

*నక్షత్రం   : చిత్త* ఉ 08.08 వరకు ఉపరి *స్వాతి*

*యోగం  : వరీయాన్* రా 03.55 వరకు ఉపరి *పరిఘ*

*కరణం   : బాలువ* ఉ 07.56 *కౌలువ* రా 08.51 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 04.30 - 06.00*     

అమృత కాలం  : *రా 12.55 - 02.41*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం        : మ 02.19 - 04.05*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.47 మ 03.07 - 03.59* 

*రాహు కాలం :మ 01.42- 03.20*

గుళికకాళం      : *ఉ 08.49 - 10.27*

యమగండం    : *ఉ 05.34 - 07.12*

సూర్యరాశి : *వృషభం*                 

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.42*   

సూర్యాస్తమయం :*సా 06.45*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం  :  *ఉ  05.34 - 08.10*

సంగవ కాలం    :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం :*10.47 - 01.23*

అపరాహ్న కాలం :*మ 01.23- 03.59*

*ఆబ్ధికం తిధి     : అధిక జ్యేష్ట శుద్ధ త్రయోదశి*

సాయంకాలం  :*సా 03.59 - 06.35*

ప్రదోష కాలం     :*సా 06.35- 08.47*

రాత్రి కాలం      :*రా 08.47 - 11.43*

నిశీధి కాలం     :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

             *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీగురు దత్తాత్రేయాయ నమః*


*దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం*

*ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోవతు*

           

      *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

పంచాంగము


  

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 27 మే 2026*

``

         *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                        2️⃣3️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *238 వ రోజు*                    

*భీష్మ పర్వము ప్రథమాశ్వాసము*


*భీకర సమరం*```


ఏనుగుల దంతములు ఒరుసుకుంటున్నాయి. రథములు రథములతో ఢీకొన్నాయి. ఏనుగుల రథముల తాకిడికి కాల్బలములు నిలువ లేక పోతున్నాయి. గజారోహకులు విచక్షణా రహితంగా తొక్కుకుంటూ విహరిస్తున్నారు. బాణవర్షాలు, కత్తులు, ఈటెలు, గదలు, అస్త్ర శస్త్రములు, హయములు, రథములు, విన్యాసాల శబ్ధాలు, హాహాకారాలతో యుద్ధభూమి మారు మ్రోగి పోతుంది. వారి రక్తంతో యుద్ధ భూమి తడిసి పోతుంది. ఒక కాలు తెగినా విడువక ఎదుటి వాడిపై రౌద్రంగా దూకుతున్నారు. ఒక చేయి తెగిన పిమ్మట వేరొక చేతితో యుద్ధం చేస్తున్నారు. తల తెగి పడినా విడువక ఎదుటి వాడి తల నరికి కింద పడుతున్నారు. కింద పడిన తలలలో కూడా వీరత్వం వీడ లేదు. తమ రథములు, హయములు పోయినా పక్క వాడి రథాలను ఎక్కి యుద్ధం చేస్తున్నారు. గాయపడినా లెక్క చేయక బంధు మిత్రులకు సాయపడుతున్నారు. శత్రు బలంగంలో ఉన్నది బంధువైనా తలపడుతున్నారు. సారథి చనిపోగా రథములు దిక్కు తోచక పరుగెడుతున్నాయి. పదాతి దళములు రథముల కింద పడుతున్నాయి వారిని ఏనుగులు తొక్కుతూ దంతంతో ఎత్తి ఆవల విసురుతున్నాయి. ఈ విధంగా మంధర పర్వతంతో చిలికినప్పుడు పాల సముద్రంలా యుద్ధభూమి అల్లకల్లోలమై ఉంది. ఇలా మధ్యాహ్న సమయం వరకూ యుద్ధం సాగింది.

```

*కౌరవ సేనల విజృంభణ*```


కుఱుక్షేత్రంలో భీకర పోరు జరుగుతున్న సమయంలో నీ కుమారుడు ప్రేరేపించగా దుర్ముఖుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివిశంతులు తమ బాణాగ్నితో పంచాగ్ని హోత్రంలా భీష్మునికి ఇరు వైపులా చేరి పాండవ సేనలను తరిమి తరమి కొడుతున్నారు. భీష్ముడు విజృంభించి పాండవ సేనలను తుత్తునియలు చేస్తున్నాడు. ఛేది, పాంచాల, కేకయరాజుల వారి ధాటికి తట్టుకోలేక పోతున్నారు. తెగిపడుతున్న తలలు, విరిగిన విల్లులు, నేలకూలిన శరీరములు, విరిగి పడుతున్న రథాలు తమ పక్షంలో తరుగుతున్న సైన్యాలను చూసి పాండవ సైన్యం తల్లడిల్లుతుంది. ప్రళయ కాల రుద్రుడు వలె విజృంబిస్తున్న భీష్ముని ఎదిరించే వారు లేక పాండవ సైన్యం కకావికలై పోతుంది. ఇంతలో అభిమన్యుడు విజృంభించి శల్యుని అయిదు బాణాలతో కొట్టాడు. ఒక బాణంతో కృతవర్మ హృదయాన్ని చీల్చాడు. మరి ఒక బాణంతో దుర్ముఖుని సారథిని కొట్టాడు. ఇంకొక బాణంతో వివిశంతి విల్లు విరిచాడు. మూడు బాణాలతో కృపాచార్యుని రథముకు కట్టిన హయములను చంపాడు. తరువాత భీష్ముని మీద శరవర్షం కురిపించాడు. అంతా అభిమన్యుని పరాక్రమానికి ఆశ్చర్య పోతున్నారు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వివేకచూడామణి

  *వివేకచూడామణి*


*శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*62. న గచ్ఛతి వినా పానం వ్యాధిరౌషధశబ్దతః* *వినాపరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్న ముచ్యతే*


*పదవిభజన*

*న - గచ్ఛతి - వినా - పానం - వ్యాధిః + ఔషధ - శబ్దతః - వినా - అపరోక్ష + అనుభవం - బ్రహ్మశబ్దైః + న - ముచ్యతే*


*భావము*:

*ఔషధం పేరును ఉచ్చరించినంత మాత్రాన రోగం నయం కాదు. మందును త్రాగినప్పుడే ఉపశమనం లభిస్తుంది. అలాగే, బ్రహ్మసాక్షాత్కారం లభించినప్పుడే బంధవిముక్తుడవుతాడు.*


*వివరణ :*

*అపరోక్షానుభూతి లేక అపరోక్షానుభవం : అపరోక్షానుభూతి అంటే ఆత్మ యొక్క ప్రత్యక్షానుభవము. "సర్వం ఖల్విదం బ్రహ్మ" - సర్వమునూ ఆత్మస్వరూపముగా చూడగలిగినవారికి ప్రపంచభావం నశిస్తుంది. ప్రపంచవిషయం దుఃఖానికి మూలమవుతున్నది. అపరోక్షానుభూతి ( ఆత్మానుభవము ) ఇంద్రియాలకు అతీతము.అపరోక్షానుభూతి అంటే పరమసత్యాన్ని లేదా పరబ్రహ్మాన్ని సూటిగా అనుభూతి చెందటమని కూడా చెప్పవచ్చు.*

🙏🙏🙏

ఒక్కటే దారి*

  *ఒక్కటే దారి*


*ఈ భూమి మీద పడ్డ ప్రతి ప్రాణికీ కలిబంధనాలు తప్పవు. ఆకలితో మొదలై, ఆశల దారుల్లో ప్రయాణించక తప్పదు. ప్రయాణంలో ఒక మజిలీ నుంచి మరో మజిలీకి చేరుకున్నట్లే, ఒక సమస్యనుంచి మరో సమస్య వైపుగా సాగించే పయనమే జీవితం. అన్నీ తెలిసినా క్షణకాలం ఆనందం, అంతలోనే వైరాగ్యం కలుగుతాయి. మనసుపై మోహం పొరలు కమ్మేస్తాయి. విషయాసక్తుల వైపే మనసు మొగ్గు చూపుతుంది. పరిస్థితుల పెనుగాలి రాపిడికి వజ్రంలా మారిన వ్యక్తికి కూడా కొన్నిసార్లు మనశ్శాంతి కరవవుతుంది. తనకు తాను ఎన్ని బోధనలు చేసుకున్నా అలజడి తగ్గదు.*


*అలాంటి బాధతోనే స్వామీజీని ఆశ్రయించాడు ఒక వ్యక్తి. "స్వామీ, అన్నిటికన్నా వేగంగా ప్రయాణించగల మనసు ఘోషను నియంత్రించడమెలా? మనసుకు ఎన్ని బుద్ధులు చెప్పుకొన్నా ఉపశమనం తాత్కాలికమవుతోంది. శాశ్వత పరిష్కారం తెలియజేయండి" అని వేడుకున్నాడు. స్వామి ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూపించాడు. కిటికీ తెరపై వాలిన కందిరీగ బయటికి వెళ్లేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. కాని, బయట పడలేకపోతోంది. అలసిపోయి కింద పడుతూ, మళ్లీ లేచి అదే తెర మీద వాలి, దానిలోంచి బయటికి వెళ్లే మార్గం కోసం వెతుకుతోంది. ‘నాయనా! మన తీరు కూడా అంతే. ఆ కందిరీగ ఆ పక్కనే ఉన్న పెద్ద రంధ్రం గుండా లోపలికి వచ్చింది. తిరిగి వెళ్లే దారి మరచి ఫలితాన్ని అనుభవిస్తోంది’ అన్నాడు. ‘అంటే, దానిలాగా నాకు కూడా విముక్తి లేదా స్వామీ?’ అన్నాడా వ్యక్తి. "ఉంది. తల్లి గర్భంలోని శిశువు- ఈ గర్భనరకాన్ని వీడి బయటపడిన మరుక్షణం నుంచీ నీ నామస్మరణ చేస్తూ, విషయవాంఛలకు దూరంగా ఉంటానని ఆ దైవానికి వాగ్దానం చేస్తుంది. ఇప్పుడు పడుతున్న కష్టాన్ని గుర్తుపెట్టుకుని మరుజన్మ లేకుండా జ్ఞానదృష్టితో ప్రవర్తించి మోక్షాన్ని పొందుతానని ప్రార్థిస్తుంది. భూమ్మీద పడ్డాక అన్నీ మర్చిపోయి, ఇదే శాశ్వతమనుకుంటుంది. ప్రాపంచిక సంబంధ విషయజ్ఞానం ఇహానికి పనికొస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యం తిరిగి వెళ్లే దారి చూపిస్తుంది. ఆ మార్గం తెలుసుకోవడమే అసలైన సంతృప్తి. ఈ దిశగా ఆలోచించి ఆత్మజ్ఞానాన్ని పొంది ఇహపర సుఖాల అర్థాన్ని తెలుసుకో. అంతరాత్మను ప్రశాంతపరచుకో" అని బోధించాడు స్వామీజీ.*


*విశాలవిశ్వంలో చిన్న రేణువుగా ఉన్న భూమిపై అత్యంత స్వల్పమైనది మనిషి ఉనికి. అలాంటప్పుడు విషయాలను పెద్దవిగా ఊహించుకుని బాధపడటం అర్థరహితం. భగవద్భావనకు మనసును చల్లబరిచే మహత్తర శక్తి ఉంది. వచ్చిన దారిలో తిరిగి వెళ్లాలనే స్పృహ కలిగి ఉండటమే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానమార్గంలో పయనించి మనో నిశ్చలత్వంతో జీవించడం మనకు ఋషులు, యోగులు చూపించిన సన్మార్గం. ‘లోకాస్సమస్తాస్సుఖినోభవంతు’ అనే భావనతో జీవిస్తే మనశ్శాంతి దానంతటదే కలుగుతుంది. ప్రశాంత తీరమైన దైవాన్ని చేరుకునే దారి తప్పక కనబడుతుంది. అప్పటివరకూ నలుగురికీ ఉపయోగపడుతూ జీవించాలి. అదే సుఖం, శుభం.*


🙏🙏🙏

దేవతా వృక్షాలు -

 దేవతా వృక్షాలు -


• దేవకాంచనం పువ్వులతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తే ఆయనకి ఎంతో ప్రీతీ. ఈ చెట్లు పొడవుగా, పువ్వులు తెల్లగా ఉంటాయి. కాడలు గాడ నారింజా ఎరుపుతో ఉంటయి.


• నందివర్ధనం దీనితో శివపూజ తొందరగా ఫలిస్తుంది.


• మందారం స్త్రీ దేవతా పూజకు చాల మంచిది.


• సంపెంగ 2 రకాలు. తెలుపు, సం పెంగ రంగు. పార్వతి దేవి పుజకు చాలా మంచిది. తెలుపు రంగు సంపెంగతో లక్ష్మీదేవి పుజకు ఉపయోగిస్తారు.


• గులాబి పువ్వులు సాయిబాబా కి చాలా ఇష్టం.


• మర్రి,మేడి,రావి,జువ్వి,మేడి , మామిడి చిగుళ్ళను నీటిలో నానబెట్టి విగ్రహాలు, యంత్రాలుకు స్నానం చేయించాలి. వీటి శక్తి (కాస్మిక్ శక్తి ) వాటికి వస్తుంది. మనుషులు కూడా చేయవచ్చు.


• కమిడి లేక కదంబ చెట్టు లేక కనిక చెట్టు వీటితో అమ్మవారి కి పూజకి చాలా మంచిది. 


          కాళహస్తి వేంకటేశ్వరరావు   


      అనువంశిక ఆయుర్వేద వైద్యులు  


                   9885030034

పంచాంగం 27.05.2026 Wednesday,

 ఈ రోజు పంచాంగం 27.05.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి సౌమ్య వాసర హస్త నక్షత్రం వ్యతిపాత యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: ద్వాదశి 


 

నమస్కారః , శుభోదయం

బుధవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

27-05-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.  

--------------------------------------- 


వృషభం


ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మండకొడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------


మిధునం


ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

---------------------------------------


కర్కాటకం


ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయాదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి.

---------------------------------------


సింహం


ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి.

---------------------------------------


కన్య


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తప్పవు.

---------------------------------------


తుల


సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు.  

---------------------------------------


వృశ్చికం


నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

---------------------------------------


ధనస్సు


దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------


మకరం


ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవసరం లేని వస్తువులపై ధన వ్యయం చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కుంభం


ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి.

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. కీలక వ్యవహారాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.

---------------------------------------

కైవల్య ప్రాప్తి:

 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

🍎🥭🍍శుభోదయం 🍎🥭🍍

💐💐💐💐💐💐💐💐💐💐


కైవల్య ప్రాప్తి:


అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. బంగారాన్ని ఏదీ ఆకర్షించలేదు. బంగారమే అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రకృతి మానవుడికి చెప్పే గొప్ప గుణపాఠం ఇది. అన్ని జీవుల్లోకీ మానవ జన్మ అపూర్వం. ఈ విషయం తెలుసుకోవడం గొప్ప కాదు, జన్మ సార్థకతను పొందడం ముఖ్యం. ఇనుము లాంటి మనసును పుటం పెట్టి బంగారం చేసుకోవడమే కైవల్య ప్రాప్తి. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనే అవయవాలు- శబ్ద, స్పర్శ, దృశ్యం, రుచి, వాసనల జ్ఞానాన్ని మెదడుకు అందిస్తాయి. అందువల్ల ఇవి జ్ఞానేంద్రియ పంచకాలు. పనిచేసే అవయవాలైన నోరు, చేతులు, కాళ్లు వంటివి కర్మేంద్రియ పంచకాలు. దేహం లోపల ఉండి నడిపించే అవయవాన్ని అంతఃకరణం అంటారు. ఇది నాలుగు విధాలు. మనసు- బహిర్‌ ప్రపంచంలోని పలు విషయాలను గ్రహిస్తూ, పరిపరి విధాల ఆలోచించేది. బుద్ధి- విచక్షణ చేసేది. అహంకారం- నేను, నాది అనే భావాన్ని కలిగించేది. చిత్తం- పూర్వ జన్మ కర్మ సంస్కారాల భోషాణం. శరీరంలో స్వేచ్ఛగా సంచరించే గాలిని అది నిర్వహించే కార్యాలను బట్టి వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కారణమైనప్పుడు ప్రాణం అని, విసర్జనలో సహాయపడుతున్నప్పుడు అపానం అని, ఆహారం ద్వారా అందే శక్తిని శరీరమంతటికీ అందజేసేటప్పుడు వ్యానం అని, కంఠం నుంచి ఉదరం వరకు వాయు సంచారానికి తోడ్పడుతున్నప్పుడు ఉదానం అని, జీర్ణ వ్యవస్థలో భాగమైనప్పుడు సమానం అని అంటారు. ఇంద్రియాలను ఆకర్షించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో ఏర్పడే విశేష అనురాగం వల్ల బహిరంగ బంధాలేర్పడతాయి. వినడం వల్ల వేటగాడికి చిక్కే లేడి, ఆడ ఏనుగు స్పర్శ చేత ఏనుగు, మంటను చూసి ఆకర్షితమైన మిడుత, రుచితో చేప, పరిమళాన్ని ఆఘ్రాణించి తుమ్మెద ప్రమాదాన్ని కొని తెచ్చుకుని మృత్యువాత పడతాయి. ఒక్కో ఇంద్రియ చపలత్వానికి ఒక్కో ప్రాణి బలైపోతే, ఈ అయిదు ఇంద్రియాల ఇంద్రజాలానికి లోబడే మనిషి గతి చెప్పనలవి కాదు.


ఈ సృష్టిలో జన్మించిన జీవులన్నీ సుఖాలనే కోరుకుంటాయి. సుఖాలు ఐహికం, ఆముష్మికం, కైవల్యం అని మూడు రకాలు. ఈ లోకంలో ధన కనక వస్తు వాహనాల ద్వారా పొందే సుఖం, పుత్ర మిత్ర కళత్ర సంబంధ బాంధవ్యాల వల్ల కలిగే సంతోషం- ఐహిక సుఖాలు. యజ్ఞయాగాది కార్యాల వల్ల కలిగే స్వర్గతుల్య భోగాలు ఆముష్మికాలు. ఆత్మ సాక్షాత్కారంతో కలిగే పరమోత్కృష్ట సుఖం- కైవల్యం.


మనిషి డబ్బు సంపాదనలో తలమునకలు కావడానికి కారణం- ఆ ధనంతో పంచేంద్రియాలను సంతృప్తిపరచే వాటిని సాధించవచ్చని. డబ్బు సంపాదించే యావలో తానేమిటో, తన జన్మకు అర్థమేమిటో తెలుసుకోలేకపోతున్నాడు.


విషయ భోగాలను విషంలా విసర్జించి అమృతోపమాన తోషం (సంతోషం), దయ, క్షమ, ఆర్జవం (రుజుభావం), ప్రశాంతి అనే గుణాలను పెంపొందించుకుంటే మనిషికి కైవల్యం సులువుగా సంప్రాప్తిస్తుందంటారు పెద్దలు. తోషం- దుఃఖాన్ని దరి చేరనీయకుండా, సదా సంతోషంగా ఉండటం. దయ- సమస్త జీవరాశిపట్ల ఉదారత ప్రదర్శించడం. క్షమ- ఓరిమిని కలిగి ఉండటం. ఆర్జవం- కపటానికి ఆస్కారం లేని రుజువర్తన. ప్రశాంతి- అరిషడ్వర్గాలను విడిచిపెట్టడం వల్ల కలిగే చిత్తశాంతి.


ఇన్ని మంచి విషయాలు- ఎన్నో జీవజాతులున్నా... ఒక్క మనిషి చెవినే పడతాయి, అతడి మనసు మాత్రమే విచక్షణ, సద్బుద్ధులతో అర్థం చేసుకుని, గురువును ఆశ్రయించి, అజ్ఞానాన్ని జయించి తద్వారా శరీరాన్ని కైవల్య పథంలో ముందుకు సాగేలా చేస్తుంది. ప్రక్షాళిత శరీరం ద్వారా ఆత్మ పొందే సుఖానుభూతే కైవల్య ప్రాప్తి.


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻