17, మే 2026, ఆదివారం

సోమవారం*🕉️ *🌹18, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

 *🌹18, మే, 2026🌹*

 *దృగ్గణిత పంచాంగం*               


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : విదియ* సా 05.53 వరకు ఉపరి *తదియ*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం  : రోహిణి* మ 11.32 వరకు ఉపరి *మృగశిర*

*యోగం : సుకర్మ* రా 09.48 వరకు ఉపరి *ధృతి*

*కరణం  : బాలువ* ఉ 07.46 *కౌలువ* సా 05.53 ఉపరి

*తైతుల* రా.తె 04.03 ఆపైన *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*     

 అమృత కాలం  : *ఉ 08.44 - 10.08 & రా 12.56 - 02.20*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : సా 04.28 - 05.53 వరకు*

*దుర్ముహూర్తం  : మ 12.30 - 01.22 & 03.05 - 03.57* 

*రాహు కాలం   :ఉ 07.13- 08.50*

గుళికకాళం      : *మ 01.41 - 03.18*

యమగండం    : *ఉ 10.27 - 12.04*

సూర్యరాశి : *వృషభం*                  

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 05.43* 

సూర్యాస్తమయం :*సా 06.42*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.36- 08.11*

సంగవ కాలం    :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం   :*10.46 - 01.21*

అపరాహ్న కాలం  :*మ 01.21- 03.57*

*ఆబ్ధికం తిధి :అధిక జ్యేష్ఠ శుద్ధ విదియ*

సాయంకాలం   :*సా 03.57- 06.32*

ప్రదోష కాలం    :*సా 06.32 - 08.45*

రాత్రి కాలం       :*రా 08.45 - 11.42*

నిశీధి కాలం     :*రా 11.42- 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.52*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


       *🔱రుద్ర స్తుతి🔱*


*త్ర్యంబకాయ త్రినేత్రాయ* 

 *యోగినాంపతయే నమః*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ।। 24 ।।



ప్రతిపదార్థ:



బ్రహ్మా — బ్రహ్మన్; అర్పణం — యజ్ఞము యందు ఉపయోగించే గరిటె (స్రువము) మరియు ఇతర అర్పితములు; బ్రహ్మా — బ్రహ్మన్; హవిః — హోమద్రవ్యము; బ్రహ్మా — బ్రహ్మన్; అగ్నౌ — యజ్ఞాగ్ని యందు; బ్రహ్మణా — అతనిచే; హుతమ్ — సమర్పించి; బ్రహ్మ — బ్రహ్మన్; ఏవ — నిజముగా; తేన — దానిచే; గంతవ్యం — పొందబడును; బ్రహ్మ — బ్రహ్మన్; కర్మ — సమర్పణ; సమాధినా — సంపూర్ణముగా భగవత్ ధ్యాసలోనే ఉన్నవారు.



తాత్పర్యము : 


సంపూర్ణ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమైన వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.

   


వివరణ:

నిజానికి ఈ ప్రపంచపు వస్తువులన్నీ భగవంతుని మాయ అనే భౌతిక శక్తి ద్వారా తయారుచేయబడ్డాయి. శక్తి అనేది శక్తిమంతునికి అభేదమైనది మరియు అదేసమయంలో ఆయన కంటే వేరైనది కూడా. ఉదాహరణకి, వెలుగు అనేది అగ్ని యొక్క శక్తి. అది అగ్ని కంటే వేరైనది అనుకోవచ్చు ఎందుకంటే అది అగ్నికి బాహ్యంగా ఉంటుంది. దానిని అగ్నిలో భాగమే అనికూడా అనుకోవచ్చు. కాబట్టి సూర్య కిరణాలు కిటికీ గుండా లోపటికి వచ్చినప్పుడు, జనులు, ‘సూర్యుడు వచ్చాడు’ అని అంటారు. ఇక్కడ సూర్య కిరణాలను సూర్యుడిని ఒక్కలాగే చూస్తున్నారు. శక్తి అనేది శక్తివంతునికి కన్నా వేరైనది మరియు ఆయనలో భాగమే కూడా.


ఆత్మ కూడా భగవంతుని శక్తి రూపమే — అది ఆధ్యాత్మిక శక్తి, దానినే జీవ శక్తి అంటారు. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు 7.5వ శ్లోకంలో వివరించాడు. చైతన్య మహాప్రభు ఇలా అన్నాడు:


జీవ-తత్త్వ శక్తి, కృష్ణ-తత్త్వ శక్తిమాన్

గీతా–విష్ణుపురాణాది తాహాతే ప్రమాణ


(చైతన్య చరితామృతము, ఆది లీల, 7.117)


 


‘శ్రీ కృష్ణుడు శక్తిమంతుడు, ఆత్మ అతని శక్తి. భగవద్గీత, విష్ణు పురాణం మొదలైన వాటిలో ఈ విషయం చెప్పబడింది.’ ఈ విధంగా ఆత్మ అనేది ఏక కాలంలో భగవంతుని నుండి వేరైనది కాదు మరియు భగవంతుని కన్నా భేదమే. కాబట్టి భగవంతుని యందే మనస్సు నిమగ్నమైనవారు, ఈ జగత్తుని అంతా భగవంతునితో ఒక్కటిగా, ఆయనకన్నా అభేదమైనదిగా చూస్తారు. శ్రీమద్ భాగవతం ప్రకారం:


సర్వ-భూతేషు యః పశ్యేద్ భగవద్-భావమాత్మనః

భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః (11.2.45)


‘భగవంతుడినే అంతటా చూసేవాడు, అందరిలో భగవంతుడినే చూసేవాడే, అత్యుత్తమ భాగవతుడు (ఆధ్యాత్మికవేత్త).’ భగవంతుని యందే ఎల్లప్పుడూ మనస్సు నిమగ్నమై ఉన్న ఇటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకులకు, యజ్ఞము ఆచరించే వాడు, యజ్ఞ ద్రవ్యము, హోమ పరికరాలు, హోమ అగ్ని, యజ్ఞ ప్రక్రియ, ఇవన్నీ భగవంతుని కంటే అభేదమైనవే.


ఎలాంటి దృక్పథంతో యజ్ఞం ఆచరించాలో వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఈ లోకంలో జనులు చిత్తశుద్ధి కోసం ఆచరించే వివిధ రకాల యజ్ఞాలని వివరిస్తున్నాడు.

17-05-2026 ఆదివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

17-05-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.  

---------------------------------------


వృషభం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


మిధునం


సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

---------------------------------------


కర్కాటకం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. 

---------------------------------------


సింహం


ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

---------------------------------------


కన్య


దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మిత్రుల నుంచి అవసరానికి ధనసహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

---------------------------------------


తుల


కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.  

---------------------------------------


వృశ్చికం


బంధుమిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. 

---------------------------------------


ధనస్సు


బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ధన పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

---------------------------------------


మకరం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కుంభం


ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

---------------------------------------


మీనం

 

ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

---------------------------------------

ఇతరులకు సహాయం ఇతరులకు సహాయం

 దయచేసి పూర్తిగా చదవండి🙏

ఇతరులకు సహాయం చేసిన వారిమి అవుతాం

🤝

హైదరాబాద్ లోని 

ఈ సి ఐ ల్ లో 

అత్యాదునిక సదుపాయలతో  300 పడకల  హాస్పటల్  ఉంది ...

కనుక  ఈ సి ఐ ల్ 

దిగీ ఎవరిని అడిగినా 

తులసి హాస్పటల్  

అడ్రస్ చెబుతారు 

అలాగే 15 సంవత్సరాల పై 

నుండి 80 సంవత్ష రాల  వరకు cardio(గుండె ) & ortho(విరిగిన ఎముకలు ) &Urology(కిడ్నీ రాళ్లు ) 

వైద్యమైనా సరే అంటే   

10 లక్షలు అయ్యే హార్ట్ సంబంధిత వ్యాదులైనా  ఉచితమే

సదుపాయాలు కార్పోరేట్   తరహాలో ఉంటాయి

కనుక  

మనలో మన పక్కన  

ఎంతో మంది పేదవాళ్ళు  జీవితంలో సంపాదించిందంతా  వైద్యానికే ఖర్చుచేసే మద్యతరగతి వారు ఉంటారు  

అలాంటి వారికి  

ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి 

మనమంతా కలసి 

ఒక్క  ప్రాణాన్పి కాపాడినా చాలు    

ఎ ఒక్కరు కూడ 

టెన్షన్  పడకూడదనే 

నేను నా పోన్లో ఉన్న 550 వాట్సప్ మెంబర్స్‌కి 

ఈ మెసేజ్  పంపుతున్నాను

మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే  185000 మందికి 

ఈ విషయం తెలుస్తుంది

కనీసం 50 మంది  ప్రాణాలు కాపాడుదాం

తీసుకుని రావలసింది ఆరోగ్య శ్రీ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ 


Contact number 

040-49336699

9505108108

Hospital name 

Tulasi hospitals Ecil Hyderabad 

*Just forward please*🙏🏻

*సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*744 వ రోజు*

అశ్వమేధ పర్వము చతుర్ధాస్వాసం

చిత్రాంగద దుఃఖించుట

చిత్రాంగదకు అర్జునుడు, బభ్రువాహనుడు నేలకొరిగిన విషయము తెలిసి పరుగు పరుగున యుద్ధభూమికి తరలి వచ్చింది. ఉలూపీ కూడా యుద్ధభూమికి వచ్చింది. ఉలూపీణీ ఛుసిన చిత్రాంగద " ఉలూపీ ! నీ వలన ఎంత ఘోరము జరిగిందో చూసావా ! తండ్రి కొడుకులను యుద్ధానికి పురికొలిపిన ఫలితంగా వారిరువురు ఇలా అచేతనులయ్యారు. నీవూ పతివ్రతవు కాదా ! నీకు ధర్మము తెలియదా ! నీవు ఈ పసివాడిని తండ్రిమీద ఎందుకు యుద్ధానికి పురికొల్పావు. నీవె మనభర్త అర్జునుడిని పునరుజ్జీవితుడిని చెయ్యాలి. నీ వలననే ఈ ఘోరము జరిగింది కనుక అర్జునుడిని పునరుజ్జీవితుడిని చేయవలసిన బాధ్యత నీదే " అన్నది చిత్రాంగద. తరువాత చిత్రాంగద అర్జునుడిని చూసి " నాధా మహావీరా ! ఎందరి ప్రాణాలనో కాపాడిన నీవిలా నీ ప్రాణాలు కాపాడ లేక పోయావు. ప్రాణనాధా ! ఎన్ని రోజులైంది నిన్ను చూసి. కళ్ళు తెరచి చూడండి నేను మీ చిత్రాంగదను వచ్చాను. మీరు మీ అన్న గారి యాగాశ్వమును కాపాడాలి. లేవండి యాగాశ్వము వెంట వెళ్ళండి " అని శోకించింది చిత్రాంగద. మరలా ఉలూపిని చూసి ఇతడు మన ఇద్దరికి భర్త. నాకుమారుడి చేతిలోనే నా భర్త ప్రాణాలు పోయేలా చేసావు. నీవు ముందు నా భర్తను బ్రతికించక పోయినచో నేను ప్రాయోపవేశము చేస్తాను " అని దృఢంగా చెప్పింది.

బభ్రువాహనుడు విలపించుట

ఇంతలో మూర్చ నుండి లేచిన బభ్రువాహనుడు ఏడుస్తున్నా చిత్రాంగదను చూసి " అమ్మా ! నీవు శోకించడము నేను ఎన్నెడూ చూడ లేదు. ఇది కూడదు తగదు అని చూడక కన్నతండ్రిని యుద్ధములో చంపిన మహాపాపిని నేను. నా పాపానికి నిష్కృతి లేదు " అని తల్లి పక్కన కూర్చుని బభ్రువాహనుడు విలపించసాగాడు. ఇంతలో అక్కడకు వచ్చిన యాజ్ఞవల్క్య శిష్యులు మిగిలిన బ్రాహ్మణులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన బభ్రువాహనుడు " అయ్యో ! ఈ బ్రాహ్మణులు అర్జునుడిని అనుసరించి వచ్చారు. ఇక్కడ అర్జునుడు విగతజీవుడై పడి ఉన్నాడు " అని శోకించసాగాడు. తిరిగి ఉలూపిని చూసి " అమ్మా ! నీ మాట మీద నిన్ను సంతోషపరచాలని కదా నా తండ్రి అర్జునుడితో యుద్ధము చేసాను. నా తండ్రి మరణానికి నేనే కారణమయ్యాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ! తండ్రినిచంపిన నా పాపానికిక నిష్కృతిలేదు. నాకిక మనశ్శాంతి లేదు ఉత్తమలోక ప్రాప్తిలేదు " అని విలపించసాగాడు. తరువాత పైకి లేచిన బభ్రువాహనుడు తల్లి చిత్రాంగద అక్కడ చేరిన జనులు వినేలా " నా తండ్రి లేని లోకంలో నేనిక బ్రతుకలేను. నేనిక నా తండ్రితో కలసి ప్రాయోపవేశము చేస్తాను. వీరుడు, రాజు, ధార్మీకుడు, మీదు మిక్కిలి నా తండ్రి అయిన అర్జునుడిని చంపిన నాకిక ప్రాయోపవేశమే గతి " అని నేల మీద మౌనంగా కూర్చున్నాడు.



*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

*శ్రీ మహావిష్ణు పురాణం*

  175f4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀9️⃣0️⃣




      *శ్రీ మహావిష్ణు పురాణం*

             ➖➖➖✍️

              90 వ భాగం 


*ఋషభ అవతారం* ``` స్వాయంభువ మనువు తరువాత అతని కుమారుడు ప్రియవ్రతుడు భూమిని పరిపాలించాడు. ప్రియవ్రతుని పుత్రుడు అగ్నీధ్రుడు లక్ష సంవత్సరాలు జంబూద్వీపానికి రాజై పరిపాలించాడు. అగ్నీధ్రుని పుత్రుడు నాభి మహారాజై రాజ్యపాలన చేపట్టాడు.


నాభి విష్ణుమూర్తి వంటి కుమారుని పొందాలని తలచాడు. మహారాణి మేరుదేవితో కలసి విష్ణువు అనుగ్రహం పొందడానికి మహర్షులను ఋత్వికులుగా చేసుకుని పెద్ద యజ్ఞం చేశాడు. యాగం సమాప్తి సమయంలో విష్ణువు ఋత్వికులకు కనపడి "ఏ ఫలం పొందడానికి రాజు చేత ఈ యాగం చేయిస్తున్నారని" అడిగాడు.


ఋత్వికులు విష్ణువుని అనేక విధాలుగా స్తుతించి "నారాయణా! నాభి మహారాజు నీవంటి పుత్రుడు కావాలని 

ఈ యజ్ఞం చేస్తున్నాడు. ఆయన కోరిక తీరేటట్టు చేయడమే ఈ యాగానికి ఫలము. ఆయనకు మీ వంటి పుత్రుని ప్రసాదించండి" అని ప్రార్ధించారు.


విష్ణువు చిరునవ్వుతో "ఋత్వికులారా! నాతో సమానమైనవాడు మరొకరు ఎక్కడ ఉన్నారు? లేరు కదా! కనుక నేనే మీ మహారాజుకి కుమారుడుగా జన్మిస్తాను" అని ఋత్వికులు చూస్తుండగానే మాయమై మహారాణి గర్భంలో ప్రవేశించాడు. నవమాసాలు నిండిన తరువాత మహారాణి తేజస్వి అయిన పుత్రునికి జన్మ నిచ్చింది.


నాభి మహరాజు రాజ్యమంతా ఉత్సవాలు జరిపి జాత కర్మలు ఘనంగా చేసి కుమారునికి "ఋషభుడు" అని నామకరణం చేసాడు. ఋషభుడు నారాయణాంశ సంభూతుడని బాల్యం నుంచి తన నడవడిక, ప్రవర్తనతో లోకానికి తెలియ జేశాడు. ఋషభునికి యుక్తవయసు రాగానే పట్టాభిషేకం చేసి నాభి మహారాజు భార్యతో వానప్రస్థానికి బదరికాశ్రమం చేరాడు. అక్కడే శేష జీవితం గడిపి స్వర్గస్థుడు అయ్యాడు.


ఋషభుడు విష్ణువాంశ అని తెలిసిన దేవేంద్రుడు వియ్యం కోరి జయంతిని అనే కన్యను తీసుకు వచ్చి కన్యాదానం చేసి వివాహం చేశాడు ఆ దంపతులకు భరతుడు మొదలైన నూరుగురు కుమారులు జన్మించారు. అంతవరకు "అజనాభం" అనే పేరు గల దేశానికి "భరత వర్షము" అని పేరు వచ్చింది.


మానవులందరికి ఆదర్శంగా నిలవాలని ఋషభుడు వేదోక్త కర్మలు చేయసాగాడు. బ్రాహ్మణులకు విధేయుడై గృహస్థాశ్రమంలో ఉంటూ అనేక యాగాలు చేశాడు. బ్రాహ్మణుల ఉపదేశం పాటించి ఒక్కొక్క క్రతువును నూరు సార్లు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. ప్రజారంజకంగా పాలన చేసాడు.


తన పుత్రులలో వర్తుడు అని పేరు చివర పిలువబడే కుశావర్తుడు మొదలైన తొమ్మిదిమందిని వారి పేర్లతో పిలువబడే కుశావర్తం, ఇలావర్తం మొదలైన తొమ్మిది దేశాలకు రాజులను చేశాడు. కవి, హరి, అంతరిక్షుడు మొదలైన తొమ్మిదిమంది కుమారులు భాగవత ధర్మ ప్రకాశకులు, ప్రచారకులు అయ్యారు. మిగిలిన ఎనభై ఒక్కమంది శ్రోత్రియులు, యజ్ఞశీలురు, కర్మనిష్ఠులు అయిన బ్రాహ్మణోత్తములు అయ్యారు.


ఋషభుని పాలనలో ప్రజలందరు బ్రహ్మజ్ఞానం కలవారై ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి లేకుండా జీవించ సాగారు. చాలా కాలం ప్రజారంజకంగా పాలన చేసిన ఋషభుడు సంసార బంధనాల నుండి విముక్తి పొందదలచాడు. బ్రహ్మావర్త దేశానికి మంత్రులతో వెళ్లి అక్కడి మహర్షులతో ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో తన నూరుగురు పుత్రులను ఉద్దేశించి


"కుమారులారా! నేను సంసార బంధనాల నుండి విముక్తి పొంది సన్యాస దీక్ష తీసుకోదలచాను. నాకు వారసులైన మీరందరు తపస్వులు, జ్ఞానులు, పెద్దలను సేవిస్తూ ఉండండి. దీనులను రక్షించండి. విషయాసక్తులు కాకండి. మనం చేసే కర్మలే మన పునఃజననానికి కారణం అవుతాయి. కనుక కర్మత్యాగం చేయండి.


సదా శ్రీహరిని ధ్యానిస్తూ పూజిస్తూ లౌకిక వాంఛలకు దూరంగా ఉండండి. మోక్ష మార్గం చూపని తండ్రి తల్లి గురువు బంధువు చివరికి దైవం కూడా మీకు హితులు కారు. మీ శ్రేయస్సు కోరి ఉపదేశం చేస్తున్నాను. నా తరువాత జేష్ఠుడైన భరతుని నన్ను గౌరవించినట్లే గౌరవించండి.


ఈ జంతు జీవ వృక్ష సృష్టిలో మానవులు శ్రేష్ఠులు. ఇంద్రాది దేవతలు మానవుల కన్నా శ్రేష్ఠులు. దేవతల కన్నా బ్రహ్మదేవుడు శ్రేష్ఠుడు. సృష్టిలో దేవాధిదేవుడైన శ్రీమహావిష్ణువు అందరి కన్నా శ్రేష్ఠుడు. అటువంటి శ్రీహరికి వేదనిరతులైన మునులు, బ్రాహ్మణులు అత్యంత ప్రియమైన వారు. కనుక వారిని మీరు గౌరవించండి. బ్రాహ్మణ పూజ వలన శ్రీహరి సంతృప్తి చెందుతాడు. విష్ణు ప్రియులైన బ్రాహ్మణులను, విష్ణుభక్తులను పూజించేవారు విష్ణుమాయను దాటి మోక్ష మార్గము చేరగలుగుతారు"


అని ఉపదేశించాడు. అవధూత మార్గం లోకానికి తెలియజేయాలని ఋషభుడు దిగంబరుడై అవధూతగా దేశ సంచారం చేస్తూ దక్షిణ దేశం వెళ్లాడు. అక్కడ దేహత్యాగం చేయాలని వనంలోకి అజగర వ్రతం పాటిస్తూ ప్రవేశించాడు. దైవ ప్రేరితమైన దావానలం వనాన్ని. దహించసాగింది. ఆ దావానలాగ్నిలో ఋషభుడు దేహత్యాగం చేశాడు.


మహావిష్ణువు యొక్క ఈ ఋషభావతారం రజోగుణ రహితులైనవారికి ధర్మమార్గం చూపించడానికి ఏర్పడింది. సకల వేదలోక దేవ బ్రాహ్మణులకు, గోవులకు పరమగురువు, భగవంతుడు అయిన ఋషభ చరిత్ర విన్నవారికి పాపచరిత్ర పోయి శుభము కలుగుతుంది.✍️

*[తరువాత కధ రేపటి భాగంలో చదువుకుందాం..

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

వైశాఖ పురాణం - 30*

 175f9;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


       *వైశాఖ పురాణం - 30* 

                ➖➖➖✍️

           30 వ అధ్యాయము


          

*పుష్కరిణి - ఫలశ్రుతి*```

నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును.


దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను.


త్రయోదశినాడు దేవతలకు నమృతమును యిచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ యను మూడు తిధులకును, "ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను యిచ్చును.


వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. యీ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను, దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు , దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములున్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున నీ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చి సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు.


శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు.


మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయముకంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా.


నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను.


అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.✍️


*ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

అధిక జ్యేష్ట మాసం

 175f8;```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀నేటి నుండి అధిక మాసం ప్రారంభం ```


*అధికమాసం / అధిక జ్యేష్ట మాసం / పురుషోత్తమ మాస మహిమ సంపూర్ణ వివరణ*

           ➖➖➖✍️```


*అధిక మాసాలలో ప్రతి మాసానికీ ప్రత్యేకమైన పుణ్యప్రభావం ఉన్నప్పటికీ, అధిక జ్యేష్ఠ మాసం అత్యంత పుణ్యప్రదమైనదిగా ధర్మశాస్త్రాలు, పురాణాలు పేర్కొంటాయి. దీనిని కొన్నిచోట్ల పురుషోత్తమ మాసం అని కూడా గౌరవిస్తారు, ముఖ్యంగా విష్ణుభక్తులకు ఇది విశేషమైనది.```


*అధిక మాస మహాత్మ్యం ప్రధానంగా* :```

స్కాంద పురాణం, పద్మ పురాణం, నారద పురాణంలో వివరించబడింది.

```  

*“అధికే మాసి యత్ దత్తంయత్ జప్తం హుతమేవ చ।*

*తత్ సర్వం కోటి గుణితం భవేత్ నాత్ర సంశయః॥”*



*అధిక జ్యేష్ఠ మాస ప్రాశస్త్యం* 


*1. విష్ణు ప్రీతికర మాసం:-*```

ఈ మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది.

ఈ కాలంలో: విష్ణు నామస్మరణ, గీతా పారాయణం, విష్ణు సహస్రనామం, దానధర్మాలు చేస్తే అనేక రెట్లు ఫలితం లభిస్తుందని పురాణోక్తి.```


*2. పాపక్షయకర మాసం:-*```

సాధారణ మాసాల్లో చేసిన పుణ్యకర్మలకు ఒక ఫలితం ఉంటే, అధిక మాసంలో అవి అనేక రెట్లు ఫలిస్తాయని చెబుతారు.```


*3. పురాణ కథ — పాపి విమోచనం*```


*పురాణాలలో ఒక కథ:- 

ఒక పాపాత్ముడు జీవితమంతా దురాచారంలో గడిపాడు. చివరలో యాదృచ్ఛికంగా అధిక మాసంలో: ఉపవాసం చేశాడు విష్ణునామం జపించాడు ఆ ఒక్క పుణ్యంతోనే అతనికి విష్ణులోకం లభించిందని చెప్పబడింది. ఇది ఈ మాసపు కరుణాశక్తిని తెలియజేస్తుంది.```


*పురాణాలలో మరొక కథ*:-```

*మలమాసం యొక్క దుఃఖం*:- ఈ అదనపు నెలకు:-

సంక్రాంతి లేదు, దేవతాధిపత్యం లేదు, యజ్ఞాది శుభకార్యాలు లేవు

అందువల్ల అందరూ దీనిని: “మలమాసం” “అశుభమాసం”

అని తృణీకరించారు. అవమానంతో ఆ మాసం ఏడుస్తూ దేవతల వద్దకు వెళ్లింది. ఎవ్వరూ దానిని స్వీకరించలేదు. అప్పుడు విష్ణువు...


*శ్రీమహావిష్ణువు అనుగ్రహం*:- చివరకు ఆ మాసం శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడని “ఇప్పటి నుండి నీవు నా స్వరూపమైన ‘పురుషోత్తమ మాసం’ అవుతావు.” నామం మహిమ పుణ్యప్రభావం అన్నీ ఈ మాసానికి ప్రసాదించాడు. అందుకే: ఇతర మాసాల కంటే అధిక మాసం పుణ్యప్రదమైనది. “పురుషోత్తమ” అనే పదార్థం భగవద్గీత లో: “ఉత్తమః పురుషస్త్వన్యః…” అని శ్రీకృష్ణుడు తనను “పురుషోత్తముడు”గా పేర్కొన్నాడు. అంటే: సర్వోన్నతుడు, జగన్నాథుడు, పరమాత్మ ఆయనకు ప్రియమైన మాసమే ఈ పురుషోత్తమ మాసం. భోగాల కోసం కాదు, యోగం కోసం, భక్తి కోసం పాపపరిహారం కోసం ఉద్దేశించబడింది. అధిక మాసం మనిషికి ఒక “ఆధ్యాత్మిక అదనపు అవకాశం”.; గత లోపాలను సరిచేసుకో భక్తిని పెంచుకో మనస్సును పవిత్రం చేసుకో నారాయణుని ఆశ్రయించు అందుకే ఈ మాసాన్ని: “పాపక్షయ మాసం” “భక్తి మాసం” “పురుషోత్తమ మాసం” అని మహర్షులు గౌరవించారు.```


*ప్రసిద్ధమైన వాక్యం:*


*“అధికే మాసి యత్ పుణ్యం తత్ కోటి గుణితం భవేత్”*```

అర్థం: అధిక మాసంలో చేసిన పుణ్యకర్మ కోటి రెట్లు ఫలిస్తుంది.

ఎందుకు “మలమాసం” అని కూడా అంటారు?

చంద్రసౌర గణనల్లో వ్యత్యాసం సమతుల్యం చేయడానికి వచ్చే అదనపు నెల ఇది. ప్రారంభంలో దీనిని దేవతలు స్వీకరించలేదని, తరువాత శ్రీమహావిష్ణువు దీనికి “పురుషోత్తమ మాస” మహిమ ఇచ్చాడని పురాణ కథనం.


వివాహం గృహప్రవేశం ఉపనయనం వంటి శుభకార్యాలు సాధారణంగా నివారిస్తారు. కానీ: జపం, తపస్సు, వ్రతం, దానం, తీర్థయాత్ర, పితృకార్యాలు అత్యంత శ్రేష్ఠంగా భావిస్తారు.```


*అధిక జ్యేష్ఠ మాసంలో చేయదగినవి:-*```

*అత్యుత్తమ ఆచరణలు:-,


శ్రీమన్నారాయణ పూజ, విష్ణు సహస్రనామ

పారాయణం, గజేంద్ర మోక్షం పారాయణం, భాగవత పఠనం ,తులసి పూజ, ఏకాదశి ఉపవాసం, అన్నదానం, జలదానం, గోసేవ.


*ప్రత్యేక దానాలు..*--


"జ్యేష్ఠ మాసం వేడి కాలం" కావడంతో: నీటి దానం, పానకం, చల్లని పానీయాలు, గొడుగు, పాదరక్షలు, విసనకర్రలు దానం చేయడం మహాపుణ్యకరం.


*పితృకార్యాలు చేయవచ్చా?* అవును. 

👉 అధిక మాసంలో:

మాసికం, ఆబ్దికం, తర్పణం, శ్రాద్ధం తప్పనిసరిగా నిర్వహించాలి. ఇవి నిషిద్ధం కావు. ఆధ్యాత్మిక సందేశం:- మనిషికిలోపాల పరిహారం ఆత్మపరిశీలన, భక్తి వృద్ధి, పాపక్షయం కోసం లభించిన అదనపు పవిత్ర కాలంగా భావించబడుతుంది.


*అధిక జ్యేష్ఠ మాసం — రోజువారీ ఆచరణ విధానం*

*అధిక మాసంలో కఠిన నియమాలు తప్పనిసరి కాదు.


*తమ శక్తి, సమయం, భక్తికి అనుగుణంగా ఆచరించినా మహాపుణ్యం లభిస్తుంది. ఇది ప్రధానంగా భక్తి, జపం, దానం, నియమాచరణ కోసం ఉద్దేశించిన మాసం.


*ప్రాతఃకాల ఆచరణ (బ్రహ్మముహూర్తం నుండి)*


1. *బ్రహ్మముహూర్తంలో లేవడం*:- సూర్యోదయానికి 1½ గంటల ముందు లేవడం శ్రేష్ఠం. లేవగానే: కరాగ్రే వసతే లక్ష్మీః... లేదా ఓం నమో నారాయణాయ స్మరించాలి.

2. *స్నానం* : సాధ్యమైతే:- తలస్నానం, తీర్థస్నానం, గంగాస్మరణతో స్నానం, స్నాన సమయంలో: గంగే చ యమునే చైవ...పఠించాలి.

3. *దీపారాధన*:- ఇంట్లో తులసి వద్ద, పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలి.

4. *ప్రధాన పూజా విధానం*:- శ్రీమహావిష్ణు పూజ, అధిక మాసాధిదేవత శ్రీమన్నారాయణుడు. కనుక విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామం పురుషసూక్తం, గజేంద్ర మోక్షం, శ్రీమద్భగవద్గీత ఒక అధ్యాయం

5. *జపం / అత్యుత్తమ మంత్రాలు:*- ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గాయత్రీ జపం, హరినామసంకీర్తనం

రోజుకు: 108 లేదా 1008 సార్లు జపిస్తే ఉత్తమం.


*మధ్యాహ్న ఆచరణ* :-


1. *దానం* :- జ్యేష్ఠ మాసంలో దానం అత్యంత శ్రేష్ఠం.

ముఖ్యంగా:- జలదానం, పానకం, మజ్జిగ, గొడుగు, పాదరక్షలు, వీసనకర్ర, అన్నదానం ఇవి వేడి కాలంలో జీవరక్షణ దానాలుగా భావిస్తారు.

1. *సాత్త్విక భోజనం*:- ఒకపూట భోజనం శ్రేష్ఠం, ఉల్లిపాయ, వెల్లుల్లి నివారించడం మంచిది, మితాహారం పాటించాలి, ఏకాదశి రోజుల్లో ఉపవాసం అత్యుత్తమం.


*సాయంకాల ఆచరణ*:-


1. *సాయంకాల దీపారాధన* :- తులసి కోట వద్ద దీపం వెలిగించాలి.

పఠించదగినవి: విష్ణు సహస్రనామం, రామనామం, గోవింద నామస్మరణ

హరినామ సంకీర్తన

1. *పురాణ పారాయణం* ఈ మాసంలో ముఖ్యంగా: శ్రీమద్భాగవతం, భగవద్గీత, విష్ణు పురాణం, పురుషోత్తమ మాస మహాత్మ్యం వినడం లేదా చదవడం శ్రేష్ఠం.

*నిద్రకు ముందు*

ఆ రోజు చేసిన తప్పులకు క్షమాపణ ప్రార్థన:- “కృష్ణార్పణమస్తు” భావన

నారాయణ స్మరణతో నిద్ర, ప్రత్యేక నియమాలు (సాధ్యమైతే) పాటించదగిన నియమాలు

✅ బ్రహ్మచర్యం

✅ సత్యవచనం

✅ కోపనిగ్రహం

✅ పరనింద నివారణ

✅ భూశయనం (సాధ్యమైతే)

✅ ఉపవాసం / అల్పాహారం

ఈ మాసంలో అత్యంత ఫలప్రదమైనవి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖