ఆంధ్రభాషాయోష అమృతంపు పలుకులు- పండితహృద్యమై పద్యమాయె
అలపాలకడలి దేవాసురుల్ మధియింప- ప్రబలిన సుధ తెల్గు పద్యమాయె
నిర్జరాధీశుని నిర్జించి ఖగరాజు- బడసిన సుధ తెల్గు పద్యమాయె
సుమశరారి మనోజ్ఞ డమరుకన్వెల్వడి- పరతెంచు ధ్వని తెల్గు పద్యమాయె
నారదుని దివ్య మహతీ నినాదజనిత- భవ్య గానామృతము తెల్గు పద్యమాయె
పద్యకవిత సరస్వతీ పాదపద్మ- మహిత మంజీర నాదసంభవముగాదె”
అని జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు తెలుగు పద్యవైభవాన్ని ఎలుగెత్తి చాటారు. తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినది పద్యం. పద్యం తెలుగువారి ఆస్తి. తెలుగుజాతికి మాత్రమే ప్రత్యేకించిన గొప్ప రచనాప్రక్రియ. తెలుగు పద్యానికి వెయ్యేళ్ళకు పైబడిన చరిత్ర ఉంది. పద్యం మంచిగంధం, పద్యం మల్లె
డా. ఎన్. శిల్పారాణి
ఉపాధ్యాయురాలు,
వేమాపురం, తిరుపతి,
తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9502375155, Email: silparanimay26@gmail.com
Download PDF