ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
5, జనవరి 2026, సోమవారం
సంపూర్ణ మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*శనివారం 3rd జనవరి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
9️⃣4️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*94 వ రోజు*
*వన పర్వము తృతీయాశ్వాసము*
*మాంధాత*```
ఆ తరువాత ధర్మరాజు సైంధవారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ప్రవహించుచున్న యమునా నదిని చూసి రోమశుడు ఇలా చెప్పసాగాడు.. “ధర్మరాజా ఇది యమునా నది. గంగా నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు పరిపాలించాడు. ఆయన చరిత్ర చెపుతాను విను..
పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, కీర్తివంతుడు, ధర్మశీలుడు, బలవంతుడూ అయిన యవనాశ్వుడు అనే రాజు ఉండే వాడు. అతనికి సంతానం లేదు. అతడు భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి సంతానం కోసం అర్ధించాడు. అతని కోరిక మన్నించి భృగుమహర్షి పుత్రకామేష్టి యాగం చేసాడు. మంత్రజలం నిండిన పాత్రను జాగ్రత్తగా కాపాడమని ఋత్విక్కులను నియోగించాడు. ఒక అర్ధరాత్రి యవనాశ్వుడు దాహంవేసి తెలియక ఆ మంత్రజలం త్రాగాడు. ఇది భృగుమహర్షికి తెలిసి యవనాశ్వునితో “రాజా! విధి అనుల్లంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని నీవు త్రాగావు. కనుక నీవు గర్భం ధరిస్తావు. నీకు ఒక కుమారుడు పుడతాడు” అని చెప్పాడు.
యవనాశ్వుడు గర్భం ధరించాడు. అతని ఎడమభాగాన్ని చీల్చుకుని కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడటానికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఆ బాలుని నోట్లో చూపుడు వ్రేలిని పెట్టి
“ఇది అమృతమయము దీనిని త్రాగుము” అని అన్నాడు.
అందువలన అతనికి మాంధాతృడు అని నామకరణం చేసాడు. మాంధాత ఎన్నో ఏళ్ళు రాజ్యపాలన చేసాడు. తన పరాక్రమంతో ఎన్నో రాజ్యాలు జయించాడు. యజ్ఞయాగాలు చేసాడు. ఇంద్రునితో యుద్ధం చేసి రాజ్యంలో సకాలంలో వానలు కురిసేలా చేసాడు. మాంధాత యజ్ఞం చేసిన చోటు ఇదే. ధర్మజా! సోమకుడనే మహర్షి యాగం చేసిన ప్రదేశం. ఇది నహుషుడు యజ్ఞం చేసిన ప్రదేశం. ఇది అంబరీషుడు యాగం చేసిన పుణ్యభూమి. ఇది సరస్వతీ నది నిషధ దేశంలో మాయమై ఇక్కడ చమసోద్భేదం అనే చోట బయటపడింది. ధర్మజా ఇది విష్ణుప్రద తీర్థం, ఇది కాశ్మీర మండలం, ఈ క్షేత్రానికి మానసద్వారం అని పేరు. దీనిని పూర్వం పరశురాముడు నిర్మించాడు.```
*శిబిచక్రవర్తి*```
ఒకరోజు ఇంద్రుడు శిబి చక్రవర్తిని పరీక్షించాలని అగ్నిదేవునితో కలసి తాను డేగరూపంలోనూ అగ్నిదేవుడు పావురం రూపంలోనూ మారారు.
డేగ రూపం లోని ఇంద్రుడు పావురంరూపంలో అగ్నిదేవుని తరుముతూ ఉన్నాడు. ఆ పావురం శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు వేడింది. శిబి పావురానికి అభయం ఇచ్చాడు. డేగ శిబి చక్రవర్తిని చూసి
“రాజా! ఇది నాకు ఆహారం. దీనిని నాకు ఇవ్వండి. ఈ ఆహారం లేకుంటే నేను బ్రతకలేను” అని అడిగింది.
శిబి చక్రవర్తి “ఈ పావురం నన్ను శరణుజొచ్చింది. అభయం ఇచ్చిన వారిని విడిచిపెట్టడం ధర్మంకాదు. నీవు వేరే ఆహారం చూసుకో!” అన్నాడు.
డేగ శిబితో “రాజా! ఇది నాకు దేవుడిచ్చిన ఆహారం. దీనికి సమానమైన ఆహారం నాకిచ్చి దీనిని నువ్వు తీసుకో!” అని చెప్పింది.
అందుకు అంగీకరించిన శిబి ఒక కత్తి తీసుకుని తన దేహాన్ని కోసి మాంసం తీసి త్రాసులో వేసాడు. ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తూగకపోవడం చూసి ఆశ్చర్య పడిన శిబి తనకు తానే త్రాసులో కూర్చుని ఆత్మార్పణం చేసుకున్నాడు.
అతని త్యాగనిరతికి మెచ్చి ఇంద్రుడు, అగ్నిదేవుడు తమ నిజరూపాలు ధరించి “రాజా! నీ త్యాగనిరతికి సంతోషించాము. నీకీర్తి అజరామరమై చిరకాలం వర్ధిల్లుతుంది” అన్నారు.```
*సశేషం*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
*సంపూర్ణ మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*ఆదివారం 4th జనవరి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
9️⃣5️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*21 వ రోజు*
*వన పర్వము తృతీయాశ్వాసము*
*అష్టావక్రుడు*```
ఆ తరువాత రోమశుడు ధర్మరాజుకు అష్టావకృడిని గురించి చెప్పసాగాడు. “పూర్వం ఏకపాదుడనే ముని ఉండే వాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరమైన తపస్సు చేశాడు. తన శిష్యులకు సదా విద్యా బుద్ధులు నేర్పుతుండే వాడు. కొంత కాలానికి సుజాత గర్భం ధరించింది. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదునితో ఇలా అన్నాడు. ‘మీరు ఇలా అహోరాత్రులు పాఠాలు చదివిస్తుంటే వారికి విద్య ఎలా వస్తుంది. వారికి నిద్ర లేక పోవడం చేత విశ్రాంతి లేక జఢులౌతారు. ఇది మంచిదా?’ అని అడిగాడు.
అందుకు ఏకపాదుడు ఆగ్రహించి.. ‘నేను చేయించిన వేదాధ్యయనాన్ని వక్రించి చెప్పావు కనుక నీవు అష్టా వక్రుడిగా పుట్టు!’ అని శపించాడు.
సుజాత పురిటి సమయానికి తిండి గింజలు సంపాదించడానికి ఏకపాదుడు జనకుని వద్దకు వెళ్ళాడు. కాని అక్కడ ఉన్న వందితో వాదించి పరాజయం పొందాడు.
సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అష్టావక్రుడు పెద్దవాడయ్యాడు. తన తండ్రిని వెతుకుతూ మేనమామ కొడుకు శ్వేతకేతునితో జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు.
కాని వారిని ద్వారపాలకులు అడ్డగించి ‘మీరు బాలురు ఇది విద్వాంసులు, పెద్దలు, ఋత్విక్కులకు మాత్రమే ప్రవేశార్హత మీకు లేదు’ అని అడ్డగించారు.
అష్టావక్రుడు ‘అయ్యా! వయస్సుతో జ్ఞానం రాదు కదా? కనుక జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే! మేము ఈ మహారాజు కొలువులో ఉన్న విద్వాంసులను జయించడానికి వచ్చాము’ అని అన్నాడు.
ఈ విషయం తెలిసి మహారాజు వారిని లోనికి పిలిపించాడు.
అష్టావక్రుడు అక్కడున్న విద్వాంసులందర్ని ఓడించి తండ్రిని మిగిలిన బ్రాహ్మణులను చెఱ నుండి విడిపించాడు.
జనక మహారాజు అష్టావక్రుని ఘనంగా సన్మానించాడు.
అష్టావక్రుడు తన తండ్రితో కలసి స్వస్థలానికి వెళ్ళాడు.```
*యువక్రీతుడు*```
ఆ తరువాత ధర్మరాజు సంగమ నదీ తీరం చేరాడు. రోమశుడు ధర్మరాజుకు రైభ్యాశ్రమం, భరద్వాజాశ్రమం చూపించి యువక్రీతుని గురించి చెప్పసాగాడు. “రైభ్యుడు, భరద్వాజుడు అనే మహా ఋషులు ఉన్నారు. వారిరువురు మిత్రులు. వారిద్దరు అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడు అనే కుమారులు ఉన్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజునికి ఒక కుమారుడుండే వాడు. అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునకు అర్ధావసు,పరావసు అంటే అసూయ. అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలని సంకల్పించి ఇంద్రుని గురించి తపస్సు చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ‘ఏ కోరికతో ఇంత ఘోర తపస్సు చేసావు?’ అని అడిగాడు.
యువక్రీతుడు ‘నాకు చదవకుండానే సకల శాస్త్రాలు, వేదాలు అవగతం కావాలి’ అని కోరాడు.
ఇంద్రుడు ‘ఇది అసంభవం. తపస్సు వలన వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖతః నేర్చుకోవడం ఉత్తమం’ అన్నాడు.
అందుకు యువక్రీతుడు అంగీకరించ లేదు. ఇంద్రుడు వెళ్ళి పోయాడు.
యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు.
మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్ళతో ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు.
అది చూసి యువక్రీతుడు నవ్వి
‘వృద్ధుడా! ఇదేమి పని? ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తి ఔతుంది?’ అన్నాడు.
ఆ వృద్ధుడు ‘నేను నీలా సాధ్యం కాని దాని కోసం ప్రయత్నిస్తున్నాను’ అన్నాడు.
ఇంద్రుడు నిజరూపం చూపి..‘యువక్రీతా! నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు చేసే తపస్సు అంతే నిరర్ధకం.కనుక నీ ప్రయత్నం మానుకో’ అన్నాడు.
అందుకు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందే నని పట్టు పట్టాడు.
ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు.
తన కోరిక తీరిందని గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు.```
*సశేషం*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
*సంపూర్ణ మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
``
*సోమవారం 5th జనవరి 2026*
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
9️⃣6️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*96 వ రోజు*
*వన పర్వము తృతీయాశ్వాసము*
*యువక్రీతుడు వధింపబడుట*```
ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూసాడు. ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆముని శాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకుని పోయింది. ఆమె ఆ విషయం తన మామగారికి చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జటాజూటం తీసి అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్యను సృష్టించాడు. వారిరువురిని చూసి
“మీరు యువక్రీతుని వధించండి!” అని పంపాడు.
ముందు ఆయువతి అందంతో యువక్రీతుని మైమరపించి కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అపవిత్రుడు అయ్యాడు. వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు.
ఆ తరువాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు కుమారుని మరణ వార్త విని పుత్ర శోకం భరించ లేకగ్ని ప్రవేశం చేసి మరణించాడు.```
*పరావసు తండ్రిని చంపుట*```
తరువాత కొన్నాళ్ళకు బృహద్యుముడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి పరావసు, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆశ్రమానికి వచ్చేసమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావసు ఏదో క్రూరమృగం వస్తుంది అనుకుని పొరపాటున ఎదురుగా వస్తున్న రైభ్యుని ఆత్మరక్షణార్ధం చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పి పరావసు తన అన్నఅర్ధవసుతో
“అన్నయ్యా! నీవు ఒక్కడివి ఆ యాగాన్ని నిర్వహించ లేవు కాని నేను ఒక్కణ్ణి చేయగలను. కనుక నేను ఆయాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యాపాతకానికి పరిహారం చెయ్యి" అన్నాడు.
అలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చితములు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు.
అతనిని చూసి పరావసు బృహద్యుమ్నినితో ఇలా అన్నాడు
“మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం చేస్తున్నాడు" అన్నాడు.
రాజు అనుచరులు అర్ధావసుని యాగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు.
```
*అర్ధావసు కోరిక మీద రైభ్యాదులు బ్రతుకుట*```
అర్ధావసు రాజును చూసి "రాజా బ్రహ్మహత్యా పాతకం చేసినది నేను కాదు. ఈ పరావసు చేసిన బ్రహ్మ హత్యకు నేను ప్రాయశ్చిత కర్మలు చేసి అతడిని బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తుడిని చేసాను" అని సత్యం చెప్పాడు.
అందుకు దేవతలు సంతోషించి
"అర్ధవసూ! నీ సత్యవ్రతం గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నీవు ప్రాయశ్చితం చేసావు. ఏమి వరం కావాలో కోరుకో" అని అడిగారు.
అర్ధవసుడు "అయ్యా! నా తండ్రిని, భరద్వాజుని, యువక్రీతుని బ్రతికించండి అలాగే నా తమ్మునికి దోషం కూడా పరిహరించండి" అని కోరుకున్నాడు.
దేవతలు అందరిని బ్రతికించారు. యువక్రీతుడు దేవతలను చూసి
"దేవతలారా! నేను ఎన్నో విద్యలు చదివాను, వ్రతాలు చేసాను కాని రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి?" అని అడిగాడు.
దేవతలు “యువక్రీతా! గురు ముఖతః నేర్చుకున్న విద్య ఫలిస్తుంది, తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు కనుక నీ విద్యలు నిర్వీర్యం అయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక అతడు నీ కంటే శక్తిమంతుడు అయ్యాడు.” అని పలికి స్వర్గానికి వెళ్ళారు.```
*సశేషం*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
06జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
*🌹06జనవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సంకష్టహర చతుర్ధి*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - హేమంత ఋతౌః*
*పుష్యమాసం - బహుళపక్షం*
*తిథి : తదియ* ఉ 08.01 వరకు ఉపరి *చవితి*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : ఆశ్లేష* మ 12.17 వరకు ఉపరి *మఖ*
*యోగం : ప్రీతి* రా 08.21 వరకు ఉపరి *ఆయుష్మాన్*
*కరణం : భద్ర* ఉ 08.01 *వణజి* రా 07.20 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 12.00 - 01.00 సా 04.00 - 06.00*
అమృత కాలం : *ఉ 10.46 - 12.17*
అభిజిత్ కాలం : *ప 11.51 - 12.36*
*వర్జ్యం : రా 12.07 - 01.41*
*దుర్ముహూర్తం : ఉ 08.52 - 09.37 రా 10.57 - 11.48*
*రాహు కాలం : మ 03.01 - 04.25*
గుళికకాళం : *ప 12.13 - 01.37*
యమగండం : *ఉ 09.25 - 10.49*
సూర్యరాశి : *ధనస్సు*
చంద్రరాశి : *కర్కాటకం/సింహం*
సూర్యోదయం :*ఉ 06.48*
సూర్యాస్తమయం :*సా 05.55*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.38 - 08.52*
సంగవ కాలం : *08.52 - 11.06*
మధ్యాహ్న కాలం : *11.06 - 01.20*
అపరాహ్న కాలం : *మ 01.20 - 03.35*
*ఆబ్ధికం తిధి : పుష్య బహుళ చవితి*
సాయంకాలం : *సా 03.35 - 05.49*
ప్రదోష కాలం : *సా 05.49 - 08.23*
రాత్రి కాలం :*రా 08.23 - 11.48*
నిశీధి కాలం :*రా 11.48 - 12.39*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.55 - 05.47*
******************************
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*
*ధర్మోద్ధారక హనుమంత*
*రామకార్యదక్ష హనుమంత*
*జయ బజరంగబలి*
*జయజయ జయ బజరంగబలి*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
మహామృత్యుంజయ మంత్రం
*🎻🌹🙏మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి?*
*ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?*
*అసలు ఈ మంత్రానికి అర్ధం ఏమిటి ? ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా ?*
🌹🌹🌹🌹🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఈ మంత్రంలో ఓం, త్ర్యంబకం, యజామహే, సుగంధిం, పుష్టివర్థనం, ఉర్వారుకం, మృతోర్ముక్షీయ, అమృతాత్ …ఈ పదాలకు యెంత అద్భుతమైన , అమృతతుల్యమైన భావం ఉందో, శ్రీ ఆంజనేయ స్వామి వారు మృత్యుంజయులు ఎలా అయ్యారో తెలుసుకుందామా మరి 🌹
🌿మహా మృత్యుంజయ మంత్రంను “మరణం జయించే మంత్రం” లేదా “త్రయంబక మంత్రం” అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. మహా మృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం .
🌸ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయనిచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడెను.
🌹” ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ “🌹
🌷ప్రతి పదార్ధం:🌷
🌿ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము;
🌸త్రయంబకం = మూడు కన్నులు గలవాడు;
🌿యజామహే = పూజించు చున్నాము;
🌸 సుగంధిం = సుగంధ భరితుడు;
🌿 పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ;
🌸వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు;
🌿 ఉర్వారుకం = దోస పండు;
🌸 ఇవ = వలె;
🌿బంధనాత్ = బంధమును తొలగించు;
🌸 మృత్యోర్ = మృత్యువు నుండి;
🌿అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు;
🌸మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.
🌹తాత్పర్యం: 🌹
🌿అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!
🌹ప్రాశస్త్యము:🌹
🌸 మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం” పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది.
క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం.
🌿ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని పారాయణం చేస్తారు.
🌸ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి
ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.
🌿ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
🌸ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది.
🌿ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 𝟏𝟎𝟖 సార్లు, ప్రదోషకాలంలో 𝟏𝟎𝟖 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
🌸ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది.
🌿 ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది.
05-01-2026 సోమవారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
05-01-2026 సోమవారం రాశి ఫలితాలు
మేషం
దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
---------------------------------------
వృషభం
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో వివాదాలు కొంత మానసికంగా చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కష్టించినా ఫలితం కనిపించదు. దాయదులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.
---------------------------------------
మిధునం
చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
---------------------------------------
కర్కాటకం
భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
---------------------------------------
సింహం
వృత్తి వ్యాపారాలు మరింత మెరుగైన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మంద కోడిగా సాగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.
---------------------------------------
కన్య
విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. బంధువర్గంతో వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
---------------------------------------
తుల
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బందు వర్గంతో వివాదాలు కొంత బాధిస్తాయి.
---------------------------------------
వృశ్చికం
ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. గృహ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
---------------------------------------
ధనస్సు
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.
---------------------------------------
మకరం
వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
---------------------------------------
కుంభం
కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
---------------------------------------
మీనం
ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
శ్రీ హనుమద్భాగవతము
శ్రీ హనుమద్భాగవతము (116)
బలబుద్ధినిధానుడైన హనుమానుని ఉద్దేశ్యము పరిపూర్ణమయ్యింది. ఆయన తన ఆకారాన్ని తగ్గించుకొనగానే అసురులు చేసిన బంధనాలు జారాయి. శ్రీ పవనకుమారుడు బంధవిముక్తుడై తన బృహద్రూపమును ధరించాడు. ఆయన మండుతున్న తన వాలమును గిరగిర త్రిప్పనారంభించాడు. వాలముతో రాక్షసులను మోదుచుండగా ఆ హఠాత్పరిణామమునకు వారు ఆశ్చర్యముతో భయభ్రాంతులైరి, శ్రీహనుమంతుని వాలాఘాతము వజ్రఘాత సదృశముగా వారికి తోచింది. బాలకులు, యువతీయువకులు, వృద్ధులైన రాక్షసులందఱు భయముతో పారిపోవసాగారు. కాని వారెచ్చోటకు పరిగెత్తినా అచ్చోటకు వారిని ప్రజ్వలిస్తూ వాలము వెంటాడి మోదనారంభించింది. అగ్నిజ్వాలలలో చిక్కి అసురులు మరణింపసాగారు. ఇట్లు ఆ ప్రదేశమందున్న రాక్షసులనందరిని సంహరించి శ్రీహనుమంతుడు లంకానగరములో గల ఎత్తయిన అట్టాలిక పైకెగిరాడు.
శ్రీహనుమంతుని వాలమునకు నిప్పంటించిన విషయమును కొందఱు రాక్షస స్త్రీలు పరుగుపరుగున సీతకడకు పోయి పలికారు. “జానకీ! నీతో మాటలాడిన వానరమును బంధించి అవమానపరుస్తూ లంకానగరమంతా త్రిప్పి వాని వాలమునకు నిప్పుబెట్టారు.”
ఈ వృత్తాంతమును ఆలకించగానే సీతాదేవి కంపించింది. ఆమె తల ఎత్తి చూడగా లంకానగరము అగ్నిజ్వాలలతో మండుతున్నది. ఆమె వ్యాకులచిత్తయై అగ్ని దేవునిట్లు ప్రార్థించింది. “అగ్ని దేవా ! నేను నా ప్రాణనాథునకు సేవకురాలనైతే, నా పాతివ్రత్యము తపము నున్నచో పవనపుత్రుడగు శ్రీహనుమంతునకు నీవు శీతలత్వమును ప్రసాదింతువుగాక! " పతివ్రతాశక్తి అతులనీయము, సాధ్వి తలంచినచో సకలసృష్టి స్తంభించును. సీతా దేవి పతివ్రతి మాత్రమే కాక సకలసృష్టికి అధిష్ఠాత్రి, జగజ్జనని, మూలప్రకృతి, ఈశ్వరి. ఆమె ఇట్లు ప్రార్థించగానే అగ్ని దేవుడు శ్రీ హనుమంతుని యెడల శీతలత్వము ధరించాడు. అగ్నిశిఖలు ప్రదక్షిణం ఒనరించుచున్నట్లు శ్రీహనుమంతునకు గోచరించగా ఆశ్చర్యచకితుడై ఇట్లా ఆలోచించాడు. ఆహా! అగ్ని యొక్క గుణము జ్వలించుట. అగ్నిస్పర్శచే గొప్ప భవనములే బూడిద అవుచున్నవి. కాని నా కెట్టి తాపము కలుగకపోగా చల్లదనమును అనుభవించుచుంటిని. నిశ్చయంగా ఈ వైచిత్రమునకు సీతా దేవి అనుగ్రహమో, శ్రీరామచంద్రుని ప్రభావమో, నా తండ్రికి అగ్ని దేవునకు గల స్నేహమో కారణము కావచ్చునని తోస్తున్నది.
సాధన చతుష్టయ సంపత్తి. 23 .
సాధన చతుష్టయ సంపత్తి. 23 .
( అజ్ఞాన మూల : , అజ్ఞాన స్వరూప విచారణ )
దీనికి సంబంధించిన వివరణ ఆదిశంకరులు, ' వివేక చూడామణి ' లో విశదంగా చెప్పడం జరిగింది, సంస్కృతశ్లోకాలద్వారా. వీటిని మన సౌలభ్యం కోసం, సులభమైనశైలిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఓం శ్రీగురుభ్యోమ్ నమ :
* * *
శ్లో.
అనాదిత్వ మవిద్యాయా : కార్యస్యాపి తథేష్యతే /
ఉత్పన్నా యాస్తువిద్యయా మా విద్య కమనాద్యపి // 200 .
అవిద్యకు మొదలంటూ ఎలాలేదో, అలాగే జగత్తు, జీవము. బుద్ధి మొదలైనవి కూడా అనాదిగా వున్నవి. అయినా, జ్ఞానము పొడచూపగానే, అజ్ఞానమనే పొర, వీటికి తొలగిపోతుంది. మట్టినుండి కుండతయారుకాక మునుపు కుండలేదు. అనగా అది నిత్యముకాదు.
* * *
కారణముకన్నా కార్యము వేరుకాదు. అగ్నియొక్క లక్షణము దహించుట. దహించుట అనేది అగ్నికి వేరుగాలేదు. నీటి స్వభావము చల్లగావుండుట. చల్లదనము వేరు, నీరు వేరుకాదు. అవయవముల కన్నా శరీరము భిన్నముకాదు. నూలుపోగులకన్నా వస్త్రము వేరుకాదు. విత్తనముకన్నా చెట్టు వేరుకాదు. ఈ విధంగా కార్య కారణ సంబంధములను గుర్తుపట్ట కలగాలి.
అందువలన అవిద్య అనాదిగా వస్తున్నా, అవిద్య వలన చేస్తున్న కర్మలుకూడా అవిద్యయే. అవిద్య వలననే పుణ్యపాపకర్మలు చేయకలుగుతున్నాము. అవిద్య నశించే జ్ఞానము కలిగినంతనే అమృతత్వ భావన అనుభవించ కలుగుతున్నాము.
సూర్యోదయము కాగానే అంధకారము అంతర్ధానం అవడం నిత్యం అందరకూ అనుభవమే. ఎంత భానుడు ప్రకాశించినా, గుహలో సూర్యకిరణాలు సోకకపోతే, గుహలో చీకటిని ఎవరు పారద్రోలగలరు.
* * *
కాబట్టి ఈ అజ్ఞానము అనాదిగావున్నా, నిత్యము కాదు, తొలగింప శక్యమైనది. గురుదేవులు దృష్టాంత పూర్వకంగా చెప్పుచున్నారు. స్వప్నం అనుభవిస్తున్న వానికి కలలో చూసిన పదార్ధములు, సంఘటనలు, ఆ సమయానికి సత్యములుగా కనిపిస్తాయి. స్వప్నం లోనే ఆనందిస్తూ ఉంటాడు, భయపడుతూ వుంటాడు. ధిగ్గున మేల్కొనగానే, అవన్నీ మాయమయి మంచి స్వప్నమైతే, ఇది నిజమైతే యెంత బాగుంటుంది అనుకుంటాడు. చివరగా, స్వప్నం లో చూసింది మిధ్య అని తెలుసుకుంటాడు. అదేవిధంగా, జాగ్రద్ అవస్థలో జరుగుతున్న సంఘటనలు, జ్ఞానికి జ్ఞాన అవస్థలో కల్పితంగానే కనిపిస్తాయి.
ఉపాధి అనేది బుద్ధితో సమన్వయము అయేదితప్ప వేరుకాదు. స్వేచ్ఛగా తిరిగే పక్షిని పంజరంలో బంధించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా, దానికి శాంతి కలుగదు. బయట స్వేచ్ఛగా తిరుగుతున్న వేరొక పక్షి బియ్యపుగింజలు కష్టపడి సంపాదించుకుని తిరుగుతుంటే, దానినిచూసి, అశాంతికి గురి అవుతుంది.
* * *
అలాగే, జీవుడు నిత్యానంద స్వరూపుడే అయినా, అవిద్యకు తగులుకుని, బుద్ధి అనే ఉపాధిలోవుండి, అశాంతికి గురి అవుతున్నాడు. జ్ఞానముచే ఆ బంధాన్ని తొలగించు కున్నవాడై, పరమాత్మ రూపమై శాంతి పొందుతున్నాడు.
స రాగులకు, వీత రాగులకు ఇదే వ్యత్యాసము.
* * *
శ్లో.
జీవత్వం న తతో>న్యత్తు స్వరూపేణ విలక్షణ /
సంబంధస్వ్యాత్మనో బుద్ధ్యా మిధ్యా జ్ఞాన పురస్సర : // 203 .
జీవత్వం అనేది యదార్ధముకాదు. అది బుద్ధివలన కలిగిన దోషమే. ఉపాధికి బుద్ధితోవున్న సంబంధమే జీవత్వం. బియ్యపుగింజపై పొట్టు వున్నప్పుడే, దానిని వడ్లగింజ అని అంటాము. ఒకసారి, పొట్టు తీసివేసిన తరువాత, అది కేవలం బియ్యపు గింజ మాత్రమే.
అలాగే, జీవత్వం అనేది బుద్దిని ఆలంబనగా చేసుకుని వున్నదే. అది అజ్ఞానముచే కల్పితము . ఆ బుద్ధి అణిగినచో జీవుడే పరమాత్మ.
* * *
జీవత్వబుద్ధి తొలగే ఉపాయము చెబుతున్నారు గురుదేవులు.
స్వస్తి.
ఆదిశంకరుల అనుగ్రహంతో మరికొంత రేపు.
ప్రేమతో,
గండవరపు ప్రభాకర్.
గురువు యొక్క ప్రాముఖ్యత
🔱 గురువు యొక్క ప్రాముఖ్యత 🔱
గురువు లేకుండా, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించే హక్కు ఏ సాధకుడికి లేదు.
‘గురు వినా యత్స్తన్త్రే నాధికారః కథంచన్.
అత్ ఏవ మహేశానీ గురుః కర్తవ్యం ఉత్తమః' ॥
ఏ వ్యక్తి అయినా పుస్తకాలు మొదలైనవాటిని అధ్యయనం చేసి, గురువు లేకుండా జపం చేస్తే, పాపాలు పేరుకుపోతాయి -
'గురువు లేకుంటే యస్తు మూర్ఖః పుస్తకాదివిలోకనాత్.
జపబన్ధం సమాప్నోతి కిల్బిషం పరమేశ్వరీ ।
గురువు ఒక్కడే పాపాలను నాశనం చేస్తాడు ఎందుకంటే-
'తల్లి లేదా తండ్రి కాదు, సోదరుడు, తస్య కో వా గతిః ప్రియమైన.
గురురేకో వరారోహే పాపం నాశయతి క్షణాత్' ॥
ఎంతగా అంటే ఆత్మాశ్రయ ప్రపంచం మొత్తం గురువులో మాత్రమే ఉంది -
‘గురుమూలమిదం శాస్త్రం నాన్యః శివతమః ప్రభు.
ఏవ మహేషాని యత్నతో గురుమాశ్రయేత్'
యోగసూత్రంలో, మహర్షి పతంజలి దేవుడిని మొదటి గురువుగా అంగీకరించారు.
🔱గురువు అవసరం-
నారద్పంచరాత్రంలో మానవుని (శిష్యుడి) శరీరం సంస్కృతి లేకుండానే ఉంటుందని చెప్పబడింది. సంస్కృతి లేని శరీరం ఉపయోగపడదు, కాబట్టి గురువు మొదట తన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి.
‘ఆదౌ శిష్యస్య దేహన్ తు శోధ్యేత్రిపుణః గురుః.
సంస్కృతి లేని శరీరం యోగ్యమైనది కాదు: స్యత్కథంచన్.
అప్పుడు హృదయ విందులో వెలుగు బల్బు లాంటి స్వీయ చైతన్యాన్ని గ్రహించి దానిని అతని ఆత్మతో అనుసంధానించడం గురువు విధి –
'బోధియేత్తధారిదంభోజే ప్రదీప్కలికకృతి.
ఆత్మచైత్న్యమిశాని తచ్చ స్వాత్మాని యోజయేత్' ॥
🕉️ ఓం నమశ్శివాయ ||
|| నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ||
☸️ ఓం నమో నారాయణాయ ||
🔱 జై మహాకాల్ ||
🔱 జై మహాకాళి ||
🔯 ఓం శ్రీ మాత్రే నమః ||🙏🙏🙏
నీలోని గుడికి... 18 మెట్లు
నీలోని గుడికి... 18 మెట్లు
“మనిషి మనసులో దైవత్వం ఉంటే.. మనిషి ఉనికి ఆలయం అవుతుంది.
ఈ 18 మెట్లను అధిరోహించి..మీలోని దైవత్వాన్ని చాటి చెప్పండి.
మీలోని సుగుణాలతో... సమాజంలో పరివర్తనకు దారులు వేయండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల నుంచి జల్లెడ పట్టి... మీ కోసం అల్లిన విశిష్ఠ సుమమాల ఇది.
సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడికొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమంటే నేటిరోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షు లందరూ చెప్పారు... ‘నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు’అన్నారు.
అందుకాయన– ‘మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించ కుండా ఉండలేను’అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం.”```
*"1 .సంస్కారబలం ఉండాలి"*
“సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కార బలం కోసం. చదువుకు సంస్కారం తోడయితే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది.”```
*"2.మోహాన్ని పోగొట్టుకోవాలి"*```
“మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన ‘నీకేం అర్థమయింది’ అని అడిగాడు.
‘నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా’అన్నాడు అర్జునుడు.
```
*"3 .తప్పొప్పుల కూడిక"*```
“ఈప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. ‘నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా.’ మారీచుడు చెప్పాడు రావణుడికి... ‘నీకేంలోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి’అన్నాడు.
అన్నీ విన్న రావణుడు ‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’ అన్నాడు.
అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపఃశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు?”```
*"4. మాట వినడమన్నది తెలుసుకోవాలి"*```
“మహాభారతం సమస్తసారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది – ‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు?’అన్నాడు.
మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు.”
```
*"5 .పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు"*```
“తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్య పడుతుందా? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు.
పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కులు చదవండి. రామకృష్ణ పరమహంస, ఎపిజె అబ్దుల్ కలాం గారి మాటలు చదవండి.”```
*"6.బాగుపడినా, పాడై పోయినా కారణం–జడత్వమే"*```
“జడమనే మాట ఒకటుంది. జడం–అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతి స్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం–అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణ మేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం.”```
*"7. ఆదర్శాలు చెప్పడమే కాదు... ఆదర్శంగా మారాలి"*```
“ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని ‘నడిచే రామాయణం’ అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు.’సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:’. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్న దాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది.”```
*"8.ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి"*```
“నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పది మందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం?’చెప్పండి."
```
*"9.కోపాన్ని తగ్గించుకోవాలి"*```
“మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించు కోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగినవాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు."```
*"10.జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి"*```
“అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధక బాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చు కావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచు కోవాలి."```
*"11.వినండి, వినడం నేర్చుకోండి"*```
“ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే.. వారి జీవితం చక్కబడుతుంది."```
*"12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి"*```
“నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి.
ఒక చంద్రశేఖరేంద్రస్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలంటే ఆయన సందేశాల పుస్తకం మీ దగ్గర ఉండాలి.”```
*"13.మృత్పిండంలా కాదు... రబ్బరు బంతిలా ఉండాలి"*```
“పదిమందికి ఉపయోగ పడకుండా ఎప్పుడు పోతారో తెలుసాండి. మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి, ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడై పోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి.”```
*"14.నిరాశను దరిచేరనివ్వకండి"*```
“అబ్దుల్ కలాంగారి కెరీర్ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్‌లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాం గారిని పిలిచి అడిగారు. ‘ఏం ఎందుకలా కూర్చున్నావ’ని ఈయనన్నారు.
‘నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వ్యూ అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు.’
ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలను కుంటున్నాడో’
ఆ మాట ఆయన మీద పనిచేసింది.
అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషు డయ్యాడు.”```
*"15. మంచి మంచి పుస్తకాలు చదవండి"*```
“ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందిలో తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా అన్న సందిగ్ధం మొదలైంది. ఇంగ్లిషు బాగా చదువుకుని పాసవండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి.”```
**16.ఆరాధించడం కాదు..*. *"ఆదర్శంగా తీసుకోవాలి"*```
“ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కూ ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్ క్రికెట్ చూడటం కాదు. టెండూల్కర్ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి."```
*"17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి"*```
“మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్ము విరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి."```
*"18. పొగడ్తకు పొంగిపోకండి"*
```”ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంత మోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చి పోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి."```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
లోకా సమస్తా సుఖినోభవన్తు!
శ్రీ లింగ మహాపురాణం
అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - పశుపక్ష్యాదుల సృష్టి - ఎనభై ఒకటవ భాగం
_________________________________________________
బ్రహదేవుడు అసుర దేవ పితృ మానవాది ఎనిమిది సృష్టుల తరువాత పశుపక్షు జంతు మృగాదుల సృష్టి చేయ సంకల్పించాడు. యువావస్థ పొంది స్వేచ్ఛగా జీవించగలిగే పక్షులను సృష్టించాడు. ఈ పక్షులు రెక్కలు కలిగి ఆకాశంలో ఎగురుతూ ఎక్కడికైనా వెళ్ళగలవు. పక్షులను సృష్టించిన తరువాత రెక్కలు కలిగిన పశువుల సమూహములను సృష్టించాడు.
తరువాత జంతు సృష్టి జరిగింది. బ్రహ్మ తన ముఖము నుండి అజములను అనగా మేకలను, వక్షస్థలము నుండి గొర్రెలను, ఉదరము నుండి గోవులను (ఆవులను) , పార్శ్వముల నుండి వృషభమలను (ఎద్దులను), పాదముల నుండి గుర్రములను, గార్ధభములను, ఏనుగులను, ఒంటెలు మొదలైన వన్య మృగములను సృష్టించాడు.
బ్రహ్మ దేవుని శరీర రోమముల నుండి సస్య, పూల మొక్కలు, ఫలముల నిచ్చే వృక్షాలను సృష్టింప చేశాడు. స్వాత్తిక సృష్టిగా పిలువబడే సృష్టి తరువాత బ్రహ్మదేవుడు యజ్ఞము చేశాడు. అప్పుడు ఆటవిక మృగ సృష్టి జరిగింది.
అప్పుడు మాంస భక్షక మృగములు, వేటకుక్కలు, వానరములు, పక్షి పంచకములు (మాంస భక్షణ చేసే ఐదు రకాల పక్షులు) , ఏడు రకాలైన సరీసృపములు అనగా నేల పై ప్రాకే జీవులు, తోడేళ్ళు, పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలు సృష్టించబడ్డాయి.
కల్ప ప్రారంభంలో మొదట బ్రహ్మ విద్యుత్, వజ్ర, మేఘ, రోహిత, ఇంధ్రధనుస్సు, తేజ, జ్యోతిర్గణాలను సృష్టించాడు. దేవతలు, అసురులు, పితరులు, మానవులను సృష్టి చేసిన తరువాత స్థావర జంగమ యక్ష పిశాచ గంధర్వ అప్సరస కిన్నెర రాక్షస గణాలను ఉత్పన్నం చేశాడు. పిదప వృక్ష పశు పక్ష్యాదులు సర్పాలు జంతువులు మృగాలను సృష్టి చేశాడు.
పూర్వ కల్పాలలో వీటికి హింస అహింస నమ్రత క్రూరత ధర్మము అధర్మము సత్యము అసత్యము మొదలైన ఏయే స్వభావాలు ఉన్నాయో ఈ కల్పంలో కూడా అవే స్వభావాలు లక్షణాలు సమకూర్చుకున్నాయి.
తరువాత బ్రహదేవుని ప్రధమ ముఖము నుండి గాయత్రి, త్రిక్, త్విష్ఠ, సామ, స్థంతర, అగ్నిష్టోమ మంత్రాలు, పద్యాలు సృష్టించబడి శబ్ద రూపంలో వెలువడ్డాయి. దక్షిణ ముఖము నుండి యజు, త్రిష్టుభు, ఛందము పంచదశ స్తోమము, బృహద్ స్తోమము, ఉక్త్య పద్యాలు సృంజించబడ్డాయి.
తరువాత జగతీఛంద, సప్తదశ స్థోమ, వైరూపసామ, అతిరాత్ర మంత్ర పద్యములు ఉత్న్నమయ్యాయి. ఉత్తర ముఖము నుండి ఇరవై ఒకటి అధర్వ ప్రార్ధనా మంత్రాలు, ఆప్తోయ, అర్యమ, అనుష్ఠభ ఛందము, వైరాజ ఛందముల సృష్టి జరిగింది.
తరువాత మహాభూతములైన ఇంద్రియముల క్రియల, విషయములు, వాని రూపముల సృష్టి జరిగింది. బ్రహ్మ స్వయంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రయాలు జీవులకు ఏర్పాటు చేశాడు. వేదముల ననుసరించి ప్రళయము యొక్క అంతిమ రాత్రి చివర భాగంలో ఉత్పన్నులయ్యే మునుల పేర్లను, చేయు కర్మలను బ్రహ్మదేవుడు మునుపటి కల్పాలలో ఏవిధంగా ఉందో అదేవిధంగా ఉండేటట్టు చేశాడు.
బ్రహ్మదేవుడు చరాచర ప్రాణుల సృష్టి తన మానసిక స్థితిని అనుసరించి చేశాడు. సత్త్వ రజో గుణాలతో సృష్టి తరువాత బ్రహ్మ మనస్సులో తనూ మాత్రమే సృష్టి ఇలా ఎంత కాలం చేస్తూ వుండగలడు అనే ఆలోచన వచ్చింది. మనస్సు తమోగుణ పూరితమై దుఖము కలిగి దుఖితుడయ్యాడు. ధ్యాన దీక్షలోకి వెళ్లిన తర్వాత సత్త్వ రజో గుణములు వచ్చి తమముతో ఏకమైనాయి. మిధునం లేదా జంటగా ఏర్పడటంతో సృష్టి కొనసాగించటానికి తగిన విధంగా తన దేహాన్ని రెండుగా మార్చాలని అన్న ఆలోచన కలిగి బ్రహ్మకు ప్రసన్నత కలిగింది.
తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.
మీ అమూల్యమైన స్పందన కోరుతూ.
మీ
శ్రీకాంత్ గంజికుంట కరణం
చిన్నపిల్లల దేవుడు
చిన్నపిల్లల దేవుడు
అప్పటి రోజుల్లో చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా మన సంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడేది. సామాజిక జీవితాలను నాశనం చేసే ఇప్పటి పిల్లల ఆటలు వచ్చిచేరిన సమయం కాదది.
మరి అలాంటి సమయంలో ఎన్నో దేవాలయాలతో, ఎన్నో ఆలయ ఉత్సవాలతో, నిరంతరం దేవతల ఊరెరిగింపులతో ఉండే కుంభకోణం పిల్లలకు ఆటవిడుపు ఏమిటి? వారికి ఆటలు ఏవి?
నిజమైన స్వామి ఊరేరిగింపుల్లో ఉండే సందడి ఆటల్లో కూడా ఉండేది.
ఒక బుట్ట నిండుగా బంకమట్టి తెచ్చి, నలుగురూ చేతులు వేసి కలిపి, స్వామిని సిద్ధం చేసేవారు. వెన్న కుండ, గరుడ వాహనం, అశ్వ వాహనం ఇలా మొత్తం సరంజామా సిద్ధం చేసేవారు.
ఇక పూలకు కొదువ లేదు. కావేరీ తీరంలో ఎన్నో పూల చెట్లు వున్నాయి.
ఇక మంత్రాలా, అందుకోసం వేదపాఠశాల నుండి శిక్షణ పొందాలా? శివాయ నమః, విష్ణువే నమః, సుబ్రహ్మణ్యాయ నమః, వినాయకాయ నమః.
ఇలా ఒక స్వామివారిని ఊరేరిగింపుగా తీసుకునివచ్చారు, కుంభకోణంలోని శ్రీమఠం వీధిలోనికి. స్వామి వచ్చి శ్రీమఠం ముందు నిలబడ్డారు. ఎవ్వరూ ఊహించని సంఘటన. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. అది చిన్నపిల్లల ఆట అని తేలికగా తీసుకోలేదు స్వామివారు.
ఆ చిన్నపిల్లల దేవునికి దండ నమస్కారం చేశారు; రెండు చేతులు జోడించి నమస్కరించారు. కొబ్బరికాయ, అరటిపళ్లతో నైవేద్యం చెయ్యమని మఠం వారికి చెప్పారు. పిల్లలకు ఆరతిపళ్లు, పటికబెల్లం పంచమని ఆదేశించారు. తరువాత చెయ్యెత్తి వారిని ఆశీర్వదించి, స్వామి ఉత్సవం ముందుకు వెళ్లడానికి అనుమతిచ్చారు.
ఆ పిల్లలకు ఎంతటి సంతోషమో!!!
ఆ చిన్నపిల్లల భక్తిని గౌరవించి, అది వారిలో ఇంకా పెరగడానికి స్వామివారు చేసిన పని ఎంతో అపూర్వమైనది.
పరమాచార్య స్వామివారు రోజూ ఏకాగ్రతతో ఎంతోసేపు, విస్తారంగా పూజ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసినదే. అలాగే, స్వామివారు ఇతరులు చేసే పూజను కూడా గౌరవిస్తారు.
శ్రీమఠానికి వచ్చే భక్తులలో, రోజూ పంచాయతన పూజ చేసేవారు ఎందరో వున్నారు. స్వామివారు వెళ్ళి అ పూజలను చూసి, భగవంతుణ్ణి ప్రార్థిస్తారు.
స్వామివారు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా వినాయకుని మందిరం కనబడితే - అది చిన్నదైనా, పాడుబడినదైనా లేదా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించకపోయినా, ఆ గణపతులకి తప్పక కొబ్బరికాయ సమర్పించాల్సిందే.
--- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
వైకుంఠ ఏకాదశికి
మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి
ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.
ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలావిశేషాలు ఉన్నాయి.
శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య,కూర్మ,వరాహ, నారసింహావతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ,ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి, కలియుగంలో విరజానదీ మధ్యభాగంలో, సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీ దేవి భూ దేవిల సమేతుడై, విష్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా, శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాధను, ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కధ ఉంది.
పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు, తన గొప్పదనాన్ని అందరితోపాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాల్కులకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ భూనీలా సమేతముగా, పరమశివుడు పార్వతీగంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీ వాణీ సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు ,ముక్కోటి దేవతలు, సకలలోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతిదేవి ఇంద్రునితో ," నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమణులున్నారని ఏర్పాటు చేస్తే, అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా" అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశి,మేనక,తిలోత్తమలను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు.
అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు, వాణిపద్మజులను సేవించి, సభికులకు అభివందనం చేసి, సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలు పెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్యకౌసల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీ దేవి నవరత్నఖచిత బంగారు గండపెండేరాన్ని,లక్ష్మీ దేవి బంగారు కడియాన్ని,సరస్వతి దేవి రత్న ఖచిత దండ కడియాన్ని, రంభకు బహూకరించారు. ఇంకా చాలా మంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు.
రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందన వనానికి వెళ్ళాడు.
ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు ,నేరుగా నందన వనానికి వెళ్ళి,సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికీ అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్నకిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికి బృహస్పతి వినకపోవడంతో, రోషావేశపూరితమైన రంభ దేవ గురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది.
ఈ లోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి, ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ శాపాలు అందరు అనుభవించవలసిందే అని తెలిశాక, ఇంద్రుడు భోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు.
ఇంద్రుని దుఃఖాన్ని చుసిన కరుణాపూరితుడైన విష్ణుభగవానుడు అతనిని ఓదార్చి, తను భూలోకంలో అవతరించి శాపవిమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీ దేవి " స్వామి గురువుశిష్యులు ఇద్దరు పరస్పర వివేకశూన్యులై శపించుకుంటే , ఆ శాపవిమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి...రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా? " అని అడిగింది.
తాను ద్వాపరయుగాంతంలో దుర్వాసుని శాపంవల్ల బాధితురాలైన ఓ గొల్ల భామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు.
అలా శ్రీ మహవిష్ణువు భూలోక అవతార వెనుక చాల కథలు ఉన్నాయి...అందులో ఇది ఒకటి!
పద్మ పురాణం
🕉️🕉️ పద్మ పురాణం 🕉️🕉️
అధ్యాయం 14 part 7
నానాతరులతాయుతము నానామృగరవసంకులము చెట్లుతీగల పువ్వుల పరిమళించునది వాయువులు వీచుచుండ బుద్ధిపూర్వకముగ నెవరో యుంచినట్లున్న పూలనుండిచిమ్ముసువాసనలతో పండ్లతో నతిసుందర మీ ప్రదేశమందు జొచ్చి భక్తితోడి నాఆరాధన మందికొని అరవిందగర్భుడు (బ్రహ్మ) వరమును బ్రసాదించునది. బ్రహ్మ ప్రసాదముననే యీ పుష్కరమును గురించిన కోరిక సిద్ధించినది. పాపమునడంచి దుష్టమును వారించి పుష్టిని సంపదను బలమును బెంపొందించునది దివ్యక్షేత్రము లభించినది యని ధ్యానము సేయుచున్న మహా తేజశ్శాలి రుద్రునికెదుట భక్తిప్రీతుడై పద్మజుడు సాక్షాత్కరించి వ్రాలిన రుద్రునిపైకెత్తి గురువుగా మఱి యిట్లనియె- దివ్యమైన వ్రతోపచారమున నా దర్శనము కావలెనని నీచేనెంతో ఆరాధింపబడినాను. వ్రతనిష్ఠులు మానవులు దేవతలు నన్ను జూచెదరు. వారి కోరికతో పరమప్రవరమైన వరము నే నిత్తును. సర్వకామములు చక్కగ సిద్ధించుటకు నంతరాత్మ సంతుష్టిగ త్రికరణశుద్ధిగ వ్రతమాచరించితివి. వరమేమి నీకిత్తునది తెలుపుమన
రుద్రు డిట్లనియె :
భగవంతుడా ! ఇదే మహావరము చాలును. జగద్వంద్య ! జగత్కర్తా ! నాకు గనబడితివి. నమస్కారము. బహుపుణ్యము యజ్ఞములచే బహుకాలము సంపాదించుకొన్నది ప్రాణములొడ్డి చేసిన తపస్సుచే నీవు గననౌదువు. దేవేశా ! ఈ కపాలము నా చేతినుండి జారిపడదు. ప్రభూ ! అందరు ఋషుల కసహ్యమై తలవంపు గూర్చుచున్నది. నీ ప్రసాదముచే కాపాలికమను వ్రత మాచరించితిని. ఈ మహావ్రతము సిద్ధించెనా ? శరణందితి నానతిమ్ము, పుణ్యస్థలమునందెక్కడ దీనిని విసరివైతునది పలుకుము. ఆత్మభావనులగు ఋషులకు పవిత్రుడయ్యెదను అని రుద్రుడన
బ్రహ్మ యిట్లనియె :
భగవంతుని స్థాన మవిముక్తమనునది పురాతన మున్నది. కపాలమోచనమునకు నీకిది తీర్థముగాగలదు. నేను నీవు విష్ణువు నిట నుండుదము. ఇట నీ దర్శనమైనంత పరిశుద్ధులై నాభవనమందిట సర్వభోగములనుభవింతురు, దేవతల కెంతో ప్రియమైన వరుణ - అసి యను సదీమతల్లు లిటనున్నవి. ఆ నదుల నడుమ బ్రహ్మహత్య యెన్నడుం జొరబడదు. ఇక్కడ పోయినవారేలాటి భయములేక హంసయానమున స్వర్గమున కేగుదురు. ఐదుక్రోసుల కొలతను నేనీ క్షేత్రమును నీ కిచ్చితిని. ఈ క్షేత్రముమధ్యనుండి గంగ సముద్రమున కేగును. అప్పుడక్కడ పుణ్యమైన మొక పురమేర్పడును. పుణ్యనది గంగ ఉత్తరముగను సరస్వతి తూర్పునకు జాహ్నవి ఉత్తరముగను రెండామడలిట ప్రవర్తించును. దేవతలింద్రాదులందరు అటకు వచ్చి నాతో నుందురు. అక్కడ నీ కపాలము విడువుము.
అటకేగి పిండదానముచే పితరులను శ్రాద్ధమందు బ్రీతినందజేయువా రక్షయ పుణ్యలోకము స్వర్గ మందుదురు. వారాణసియందు మహాతీర్థమందు స్నానముచేసిన యతడు సప్తజన్మల పాపమునుండి ముక్తి నందును. ఇటకు యాత్రసేసినను జాలును. అది సర్వతీర్థోత్తమము. నీకు మ్రొక్కి ఇట ప్రాణము విడిచిన వారు రుద్రత్వమంది నీతో సమ్మోదింతురు. ఇట మనఃపూర్వకముగ నిచ్చిన దానము మహత్ఫలనిధానమగును. అది నీ ప్రభావమే. ఇట తమ శరీరము తాము చీల్చుకొని సంస్కరించుకొను వారెప్పుడు రుద్రలోకమందానందింతురు. (ఆత్మహత్యాదోష మచటలేదన్నమాట) ఒచ్చునొరములేని సాధువైన వయస్సులో నున్న యందమైన గోసుతమునిట (ఆబోతును) అచ్చోసి వదలినయతడు పరమపదమందును. పితరులతో గూడ మోక్షమందును. ఇందు సందేహములేదు.
పలుమాటలేల ? అక్కడ మానవులు ధర్మోద్దేశముతో నే పని చేసినను నది యంతులేని ఫలమిచ్చును. ఆ తీర్థమవనిలో స్వర్గమునకు అపవర్గమునకు (మోక్షమును) గూడ కారణమని ఋషి సమ్మతము. స్నానము జపము హోమము దానము ననంత ఫలదము. భక్తితో రుద్రపరాయణులై వారాణసీ తీర్థమున కేగి యట పంచత్వమునందినభక్తులు పితృదేవతలు, పితామహులు, (తాతలు) వసువులు, రుద్రులు, ప్రపితామహులు (ముత్తాతలు) ఆదిత్యులు నౌదురని వేదమువలన వినికి. ఇట పిండదానవిధి మూడు విధములని నే జెప్పితిని. ఇటకు యాత్రవచ్చిన మనుజుపుత్రులు పిండదానము శ్రద్ధతో చేసి తీరవలెను. సుపుత్రులు వారే పితరులకు సుఖమిచ్చినవారు. దర్శనమాత్రమున ముక్తినిచ్చు తీర్థమును నే నీకు దెల్పితిని. అచట స్నానముచేసిన జన్మబంధమునుండి ముక్తినందును. రుద్రా ! అచ్చట యథాసుఖముగా బ్రహ్మహత్యనుండి నీవు ముక్తుడవై భార్యతో నేనిచ్చిన యీ యవిముక్తక్షీరమందు సుఖమందుము. అన శివుడు
అటకేగి పిండదానముచే పితరులను శ్రాద్ధమందు బ్రీతినందజేయువా రక్షయ పుణ్యలోకము స్వర్గ మందుదురు. వారాణసియందు మహాతీర్థమందు స్నానముచేసిన యతడు సప్తజన్మల పాపమునుండి ముక్తి నందును. ఇటకు యాత్రసేసినను జాలును. అది సర్వతీర్థోత్తమము. నీకు మ్రొక్కి ఇట ప్రాణము విడిచిన వారు రుద్రత్వమంది నీతో సమ్మోదింతురు. ఇట మనఃపూర్వకముగ నిచ్చిన దానము మహత్ఫలనిధానమగును. అది నీ ప్రభావమే. ఇట తమ శరీరము తాము చీల్చుకొని సంస్కరించుకొను వారెప్పుడు రుద్రలోకమందానందింతురు. (ఆత్మహత్యాదోష మచటలేదన్నమాట) ఒచ్చునొరములేని సాధువైన వయస్సులో నున్న యందమైన గోసుతమునిట (ఆబోతును) అచ్చోసి వదలినయతడు పరమపదమందును. పితరులతో గూడ మోక్షమందును. ఇందు సందేహములేదు.
పలుమాటలేల ? అక్కడ మానవులు ధర్మోద్దేశముతో నే పని చేసినను నది యంతులేని ఫలమిచ్చును. ఆ తీర్థమవనిలో స్వర్గమునకు అపవర్గమునకు (మోక్షమును) గూడ కారణమని ఋషి సమ్మతము. స్నానము జపము హోమము దానము ననంత ఫలదము. భక్తితో రుద్రపరాయణులై వారాణసీ తీర్థమున కేగి యట పంచత్వమునందినభక్తులు పితృదేవతలు, పితామహులు, (తాతలు) వసువులు, రుద్రులు, ప్రపితామహులు (ముత్తాతలు) ఆదిత్యులు నౌదురని వేదమువలన వినికి. ఇట పిండదానవిధి మూడు విధములని నే జెప్పితిని. ఇటకు యాత్రవచ్చిన మనుజుపుత్రులు పిండదానము శ్రద్ధతో చేసి తీరవలెను. సుపుత్రులు వారే పితరులకు సుఖమిచ్చినవారు. దర్శనమాత్రమున ముక్తినిచ్చు తీర్థమును నే నీకు దెల్పితిని. అచట స్నానముచేసిన జన్మబంధమునుండి ముక్తినందును. రుద్రా ! అచ్చట యథాసుఖముగా బ్రహ్మహత్యనుండి నీవు ముక్తుడవై భార్యతో నేనిచ్చిన యీ యవిముక్తక్షీరమందు సుఖమందుము. అన శివుడునీ మాటంబట్టి పృధివిలో నన్ని తీర్థములందు విష్ణువుతో నీతో నేనుందును. నేనుకోరువరమిది. నేను దేవుడుగా మహాదేవ ! నీతో నెల్లప్పుడారాధ్యుడనగుదును. సంతుష్టాంతరంగుడనై యీ వరమిచ్చుచున్నాను.
విష్ణువునకును కోరిన వరములిత్తును. దేవతలకు మునుల కందర కాత్మభావనులకు నిచ్చువాడను నేనే. ఇంకొకరెట్లునుం గాకూడదన బ్రహ్మ - రుద్రా ! నీయన్న శుభవచనము నే నిట్లేచేసెదను. నారాయణుడును నీ వన్నట్లు సేయును. సందియము లేదు అని రుద్రునిం గూర్చి పలికి వెళ్ళి వారాణసియందు దివ్యతీర్థము నేర్పరచెను.
ఇది సృష్టిఖండమునందు బ్రహ్మహత్యానాశమను పదునాల్గవయధ్యాయము
అహితవిలాసభఙ్గీ
🏵️శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
🌷మూకపంచశతి-ఆర్యాశతకము🌷
🌹అహితవిలాసభఙ్గీ-
మాబ్రహ్మస్తమ్బశిల్పకల్పనయా౹
ఆశ్రితకాఞ్చీమతులా-
మాద్యాంవిస్ఫూర్తిమాద్రియేవిద్యామ్౹౹
🌺భావం: చతుర్ముఖ బ్రహ్మ ప్రథమజీవుడు కాగా,జీవులలో అధమస్థానములోనుండు స్థావరము (చెట్లు) లైన చెరుకు మొదలగు గడ్డిజాతి మొక్కలను స్తంభములని వ్యవహరింతురు.ఈ సృష్టిలో అత్యుత్తమమైన జీవి మొదలుకొని ,అధమాధమ జీవి వరకు గల శరీరనిర్మాణముల యొక్క చాతుర్యమంతయూ ఆ పరమేశ్వరి యొక్కవిలాసమే ! అట్టి సాటిలేని ,మొట్టమొదటి,అత్యంత కౌసల్యముతో నున్న వృత్తి ఙ్ఞానమనెడి
ఆ శిల్పవిద్యాస్వరూపిణి ని ఆదరించెదను.🙏
🌼ఈ సృష్టివిస్తరణకై మహావిష్ణువు నాభికమలమున ఉద్భవించిన ఆ చతుర్ముఖబ్రహ్మ మొదటి జీవుడు.జీవత్వమున్న వాటిలో చలనములేని స్థావరములు అధమస్థానములోనుండును.అందు ఈ స్తంభములు మరింత అధమాధమ ముగా వ్యవహరింపబడును.ఆ బ్రహ్మ మొదలు ఈ స్తంభముల వరకు ఉన్న మొత్తము జీవుల శరీరనిర్మాణములు ఎంతో కల్పనాచతురతతో ఉండును.ఈ శిల్ఫకల్పన నంతటినీ వివిధ రకములుగా ఆ తల్లి విలాసముగా,ఏమాత్రమూ అలసటలేకుండా చేయుచుండెను. అట్టి అద్భుతమైన ,మొట్టమొదటి వృత్తివిద్యా జ్ఞాన స్వరూపిణి అయి ,కాంచీనగరమును ఆశ్రయించిన ఆ కామాక్షీ దేవిని మనసున స్థిరముగా నిలుపుకొనెదను.🙏
🥀భాస్కరసీతామైత్రేయి.
ఆచారానికి వివరణ
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి - 35 - అనాది ఆచారానికి వివరణ - ముప్పై ఐదవ రోజు
ఋతుక్రమం అనేది స్త్రీలకు సర్వసాధారణ ప్రక్రియ అని చెపుతూ శ్రీ స్వామివారు..
"తల్లీ ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా..ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది..అది చెపుతాను శ్రద్ధగా వినండి..ఇందాక మీరు అపవిత్రం అన్నారు గదా..అది ఎందువల్ల వచ్చింది?..మల మూత్ర విసర్జన తరువాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగా.. ఈ బహిష్టు సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది కాబట్టి..అప్పుడు ఆ స్ర్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక..ఎక్కువ విశ్రాంతి కలుగ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని పెట్టారు..అలాగే.. ఆ సమయంలో దైవ విగ్రహాలు స్పృశించటం..దైవారాధన గదిలోకి..అదేనమ్మా పూజా గృహం లోకి ప్రవేశించడం నిషేధించారు..ఆ మూడురోజులూ పిల్లలకు భర్తకు దూరంగా వుండమని కూడా చెప్పారు..ఆ మలినమైన శరీరం దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఆ ఏర్పాటు చేశారు..పసిపాపలను, దైవాన్ని అపవిత్రం చేయగూడదనే ఆ నియమం పెట్టారు..శిరస్సు ద్వారా..నోటి ద్వారా..చెవి, ముక్కు, కళ్ల ద్వారా ప్రాణం పోయిందనుకో..అది ఊర్ధ్వ లోకాల ద్వారా పోయినట్లు..నాభి క్రింద రంధ్రాల ద్వారా ప్రాణం పోతే..అది అధో లోకాల ద్వారా వెళ్లిందని అర్ధం.."
"అమ్మా!..ఒక విషయం గుర్తుపెట్టుకో..భగవన్నామోచ్చారణ అనేది అగ్ని లాటిది..అది నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి..అలా చేయగా చేయగా..ఆ అగ్ని మన మనసునూ..శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి..ఏ మలినమూ అంటకుండా చేస్తుంది..ఆ భగవన్నామోచ్చారణానికి ఒక ప్రదేశం..ఒక బహిష్టు..ఒక అపవిత్రత అనేవి లేవు గాక లేవు!..అందుచేతే సద్గురువులు కోటి జపం..నామకోటి వ్రాయడం లాంటి నియమాలు పెట్టి..ఆ భగవంతుడి నామోచ్చారణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు.."
"ఇప్పుడర్ధమైందా తల్లీ!..నీవు నీ సాధారణ పనులు చూసుకో..నాకు ఆహారం ఎవరిచేతనైనా ఇప్పించు..నేను స్వీకరిస్తాను..నిరంతర నామోచ్చారణ అనే సూర్యడు వెలుగుతుండగా..ఇక అపవిత్రం అనే చీకటి ఎక్కడుందమ్మా?..నీ మానసిక జపం నీవు చేసుకుంటూ వుండు!..ఇక పూజ గదిలోకి నీవు ఎలాగూ వెళ్లవు.. ఇందుకోసం నేను మాలకొండ వెళ్ళవలసిన అగత్యం లేదు..శ్రీధరరావు గారూ మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.." అన్నారు..
శ్రీ స్వామివారి వివరణతో ఆ ముగ్గురికీ సందేహాలు తొలగిపోయాయి..శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్లి..ధ్యానం చేసుకోసాగారు.. శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న గది మీద..వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి..
బొగ్గవరపు చిన మీరాశెట్టి గారి దంపతులు కూడా..వారం లో మూడురోజుల పాటు..శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగుచేయించే పనిలో మొగలిచెర్ల వచ్చి పోతున్నారు...ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం చదును చేయించడం పూర్తి అయింది..
అది నవంబరు నెల చివరి రోజులు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చి రమారమి ఇరవై రోజులు దాటిపోయాయి..చలి కూడా బాగా పెరిగింది..అంత చలిలోనూ శ్రీ స్వామివారు తెల్లవారుఝామున లేచి దిగంబరంగా ఆవరణలో తిరగడం మానలేదు..వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజూ ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వడం జరిగిపోతూ ఉన్నది..శ్రీ స్వామివారి బోధ పూర్తి అయిన తరువాత..ప్రభావతి శ్రీధరరావు గార్లు..శ్రీ స్వామివారు చెప్పిన విషయాల గురించి తర్కించుకోవటం అలవాటుగా మారింది..
శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారి ఉపదేశాలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకున్నారు..తమ పూర్వపుణ్యం కొద్దీ..ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగుపెట్టాడనీ..ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యేవరకూ ఇక్కడే బస చేస్తారు కనుక..మరిన్ని మహాద్భుత విషయాలను తెలుసుకొని తరించవచ్చనీ..భావించారాదంపతులు..
కానీ...దైవ లీలలు మరోలా ఉంటాయి..
శ్రీ స్వామివారు ఆశ్రమ స్థలానికి తరలి వెళ్లడం..రేపు..
శ్రీ శ్రీ బోధే౦ద్ర సరస్వతి స్వామీజీ
శ్రీ శ్రీ బోధే౦ద్ర సరస్వతి స్వామీజీ ( కంచి మఠానికి 59 వ పీఠాధిపతులు. )
* * *
కేశవపాండురంగ యోగి , సుగుణ దంపతులకు 1610 వ సంవత్సరంలో క౦చిమఠానికి కేంద్రంగావున్న, కాంచీపురంలో బోధే౦ద్ర సరస్వతి స్వామి, జన్మించారు. చాలారోజుల వరకు తల్లిదండ్రులకు సంతానం లేకపోగా, లేకలేక కలిగిన ఈ పిల్లవాడు, 59 వ కంచి జగద్గురు విశ్వకేంద్ర సరస్వతివారి వరప్రసాదంగా తల్లిదండ్రులు తలపోశారు. విశ్వకేంద్ర సరస్వతి స్వామి వారే బాల్యంలో ఆ పిల్లవానికి ‘ పురుషోత్తమన్ ‘ అని నామకరణం చేసారు.
బాల్యంలోనే పురుషోత్తమన్ చూపిస్తున్న భక్తిభావం, పరిపక్వత, నిగూఢ మేధాశక్తి చూసి ఆశ్చర్యపోయి, విశ్వకేంద్ర సరస్వతి వారు, ఆపిల్లవాడు తమదగ్గరవుంటే, మానవజాతి కి యెంతోసేవ చేయగలడని తలచి, ఆ పిల్లవాడిని, కంచి పీఠానికి దత్తత యివ్వమని పురుషోత్తమన్ తల్లిదండ్రులను కోరారు. తమ పీఠానికి కాబోయే అధిపతినిగా పురుషోత్తమం ని చేయాలనీ వారి ప్రగాఢ సంకల్పం.
* * *
తల్లిదండ్రులు కూడా లేకలేక కలిగిన సంతానమైనా, అతడిని తమ ఇష్టపూర్వకంగానే కంచిపీఠానికి దత్తత ఇచ్చారు. పురుషోత్తమన్ దినదిన ప్రవర్ధమానుడవుతూ, శృతి, స్మృతి, పురాణాలలో మంచి ప్రావీణ్యం పొంది, వేదాంత విషయాలలో పట్టుసాధించి, యువకులకు మార్గ దర్శకులయ్యారు. క్రమంగా పురుషోత్తమన్ రామనామ సంకీర్తన వైపు దృష్టి మరల్చి, కలియుగంలో రామనామ సంకీర్తనమే భవత్సాగరం దాటిస్తుందని ప్రగాఢంగా నమ్మారు. ఆక్రమంలోనే, రోజుకు లక్షసార్లు పురుషోత్తమన్ రామనామ జపం చేస్తూ వుండేవారు.
* * *
సన్యాసం స్వీకరణ
పూరి జగన్నాధ క్షేత్రంలో, ‘ లక్ష్మీధరులు ‘ వ్రాసిన ‘ భగవద్ నమ కౌముది ‘ ని వారినుండి గ్రహించి, దాని స్పూర్తితో ఒక లక్ష భగవద్ నామ శ్లోకాలను స్వరయుక్తంగా తయారుచేసి, ఆ తరువాత గురువుగారి అనుమతితో, బోధే౦ద్ర సరస్వతి పేరుతొ సన్యాసం స్వీకరించి, కాంచీపురం వెళ్లారు. 1638 నుంచి వారు జీవన్ముక్తి పొందేవరకు స్వామి కాంచీపీఠ 59 వ, మఠాధిపతులుగా వున్నారు.
భగవద్ నామ శ్లోకాలను స్వరపరచే సువర్ణ అవకాశం బోధే౦ద్రులు అందిపుచ్చుకుని, రామునిపై తనకున్న భక్తినంతా ఆ శ్లోకాలలో కుమ్మరించి ధన్యులయ్యారు. బోధే౦ద్ర స్వామి, శ్రీరాముని వైభవాన్ని కీర్తిస్తూ, ఆరు గొప్ప కావ్యాలు ప్రజలముందు వుంచారు.
అవి భగవన్నామ రసోదయం, భగవన్నామ రసార్ణవం, భగవన్నామ రసాయనం, హరిహర భేద ధిక్కారం ‘
మొదలైనవి. రామనామ ప్రాశస్త్యాన్ని వివరించడానికి స్వామి అనేక గ్రామాలు తిరుగుతూ, శ్రీరాముని గొప్పదనాన్ని పల్లెప్రజలకు వివరించి వారిని ధన్యులను చేసారు.
* * *
బోధేన్ద్ర స్వామి తమతోపాటు, శ్రీ శ్రీధర వేంకటేశ్వర అయ్యవారిని తిరువిశనల్లూర్ నుండి పిలిపించుకుని, అనేక గ్రామాలు వారిని తీసుకువెళ్లి, వారిచేతకూడా రామనామ ప్రాశస్త్యం గురించి చెప్పించారు. ఆ అనుభవాలతోనే, శ్రీధర వేంకటేశ్వర అయ్యవారు, ‘భగవన్నామ భూషణం ‘ అనే గ్రంధాన్ని రచించి, అందులో, పరమాత్మ ప్రభావాన్ని వేదాలు, ఇతిహాసాలు, పురాణాలూ మూలంగా తీసుకుని రచించారు.
గోవిందపురం
బోధేన్ద్ర సరస్వతి, ఆవిధంగా పర్యటిస్తున్నప్పుడే కావేరీ తీరం వెళ్లడం జరిగింది. అక్కడి ప్రకృతి రమణీయతకు యెంతో ముగ్ధులై, తమ శేషజీవితాన్ని అక్కడే గడిపి, సమాధి పొందాలని నిర్ణయించుకున్నారు.
తంజావూరు లోని గోవిందపురంలో, ఆ విధంగా స్వామి నిర్ణయించుకున్నట్లే, 1692 లో పురత్థాసి ( సెప్టెంబర్- అక్టోబర్ ) మాసంలో, ఒక ప్రాత: సమయాన తాము కోరుకున్న విధంగానే, బోధేన్ద్ర సరస్వతి, కూర్చున్నవారు కూర్చున్నట్లే మహాయోగి వలే, జీవసమాధి పొందారు. ఆ తరువాత, ఒక పౌర్ణమి తిధినాడు, విదేహముక్తి పొందారు.
* * *
బోధేన్ద్ర సరస్వతి వారి సమాధి ఇప్పటికీ సకల మర్యాదలతో, కాంచీమఠం నిర్వహిస్తూ వున్నది.
స్వస్తి.
ప్రేమతో,
గండవరపు ప్రభాకర్.
( ఒక ముఖపుస్తక మిత్రుని కోరిక మేరకు, బోధేన్ద్ర సరస్వతి స్వామివారి గురించి వ్రాసే అవకాశం నాకు దక్కింది. ఆ మిత్రునికి కృతజ్ఞతలతో...)
బొట్టు_పెట్టుకునేటప్పుడు_ఈ_మాట_అంటే
#బొట్టు_పెట్టుకునేటప్పుడు_ఈ_మాట_అంటే.. మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎ ఆపద రాదు!
#మీ_కుటుంబాన్ని_కాపాడే_శక్తివంతమైన_బొట్టు_మంత్రం! 🌸🛡️
"చాలామంది 'సర్వమంగళ మాంగల్యే' శ్లోకాన్ని చదువుతారు, అది చాలా మంచిది. కానీ మీ కుటుంబాన్ని ఆపదల నుండి, దిష్టి నుండి కాపాడుకోవాలంటే బొట్టు పెట్టుకునేటప్పుడు ఇంకొక అద్భుతమైన మంత్రం ఉంది.
🛡️ ఈ మంత్రం విశిష్టత (Significance):-
📿 మంత్రం:-
🙏"ఓం సర్వేశ్వరీ సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షామాం కురు కురు స్వాహా"
అర్థం:-
✨ సర్వేశ్వరీ:- అంతటికీ అధిపతివైన దానవు.
✨ సర్వశక్తి స్వరూపిణి:- అన్ని శక్తులు నీలోనే ఉన్నాయి.
✨ మమ కుటుంబ రక్షామాం:- నా కుటుంబాన్ని నువ్వే రక్షించాలి (Protector of my family).
✨ కురు కురు స్వాహా:- ఈ రక్షణను నాకు ప్రసాదించు తల్లీ.
👍 ఎందుకు చదవాలి?
✨ 1. 'సర్వమంగళ మాంగల్యే' స్తోత్రం ప్రధానంగా సౌభాగ్యం (భర్త క్షేమం) గురించి చెబితే, ఈ మంత్రం మొత్తం కుటుంబాన్ని (పిల్లలు, ఇల్లు, ఆరోగ్యం) రక్షించమని అమ్మవారిని వేడుకుంటుంది.
✨ 2. నుదుటిపై బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే, మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుందని, ఏ దుష్టశక్తులు మీ కుటుంబంపై ప్రభావం చూపవని నమ్మకం.
✨ 3. ఈ మంత్రం చదివినప్పుడు అమ్మవారితో మనకు ఉన్న బంధం మరింత బలపడుతుంది. ఆమెను మన ఇంటి పెద్దగా, రక్షకురాలిగా భావిస్తాం.
🎯 ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో మీరు అమ్మవారిని కేవలం మీ కోసమే కాదు, మీ కుటుంబం మొత్తాన్ని రక్షించమని అడుగుతున్నారు. మీరు నుదుట బొట్టు దిద్దుకుంటున్న ఆ క్షణంలో ఈ మాట అంటే.. మీ ఇంటి గడప దాటి ఏ ఆపద లోపలికి రాదు. ఆ తల్లి తన శక్తులతో మీ ఇంటిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి రేపటి నుండి బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ రక్షణ మంత్రాన్ని కూడా జపించడం మర్చిపోకండి."🙏
🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
#కుటుంబరక్షణ #లలితమ్మమంత్రం 🙏
నదిపట్ల ఎలా వ్యవహరించాలి?...
ఆచారాలు-అభీష్టసిద్ధులు
నదిపట్ల ఎలా వ్యవహరించాలి?...
మలం మూత్రం పురీషం చ శ్లేష్మ నిష్ఠీనాశ్రుచ, గండూషాశ్చైవ ముంచంతి యే తే బ్రహ్మహణైః సమః
(స్కందపురాణం)
మలమూత్రాల త్యాగం, కఫం, కన్నీరు, నోరు పుక్కిలించడం, ఉమ్మడం నదులలో/జలాశయములలో చెయ్యడం వల్ల బ్రహ్మహత్యకు మించిన మహాపాపం వస్తుంది.
- బీబీ నాంచారిని
ప్రశ్న :- బీబీ నాంచారిని వెంకటేశ్వర స్వామి వారు నిజంగా వివాహం చేసుకున్నారా.
సమాధానం :-
నేను దాదాపు ఆరు నెలల పాటు రీసెర్చ్ చేసి సంపాదించిన అంశాలు ఈ పోస్ట్ కు ఆధారం.
బీబీ నాంచారి అనే భక్తురాలినీ వేంకటేశ్వరస్వామి వారు వివాహం చేసుకున్నారా అంటే .
తిరుమల ఆలయం యొక్క స్థలపురాణం లో కానీ స్వామి వారి భక్తుల యొక్క చరిత్ర లో కానీ తిరుమల కు సంబంధించి ఎక్కడ కూడా బీబీనాంచారి అనే భక్తురాలి పేరు మనకు కనిపించదు.
ఆ పేరు కల భక్తురాలు ఎప్పుడైనా తిరుమలకు వచ్చింది అని చెప్పడానికి కూడా ఒక చిన్న ఆధారం కూడా మనకు దొరకదు.
మరి బీబీనాంచారి అనే భక్తురాలు ఏ ఆలయం యొక్క చరిత్రలో కనిపిస్తుంది అంటే దానికి సంబంధించిన వివరాలు మనకు మైసూరు సమీపంలోని మెల్కోటే ఆలయం యొక్క చరిత్ర లో కనిపిస్తుంది.అక్కడి చరిత్ర ఏమిటి అని ఒకసారి పరిశీలిద్దాం.
ఢిల్లీ సుల్తానులు మెల్కోటే ఆలయం పై దాడి చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఎత్తుకొని వెళ్లిపోయారు అని అప్పుడు రామానుజుల వారు డిల్లీకి వెళ్ళి సుల్తాన్ తో మాట్లాడి ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకుని వచ్చారు అని చెబుతారు.
కాకపోతే ఆ స్వామి వారి విగ్రహాన్ని ఎంతో ఇష్టంగా ప్రాణం గా ప్రేమించే ఆ సుల్తాన్ కూతురు స్వామి వారి విగ్రహాన్ని వదిలి ఉండలేక మెల్కోటే ఆలయానికి వచ్చి అక్కడ ఆలయం ముందు తనువు చాలించి స్వామి లో ఐక్యం అయింది అని కొందరు భావిస్తారు.
(నిజానికి అక్కడ ఉన్న స్వామి వారి విగ్రహం చాలా అద్భుతమైన సౌందర్యం తో ఉంటుంది.ఎంత సేపు చూసినా తనివితీరని రూపం అక్కడున్న చలువ నారాయణ స్వామి రూపం .అక్కడ స్వామిని కూడా పగలు కాకుండా సాయంత్రం పూట అదికూడా వెన్నెల్లో ఊరేగింపు చేస్తారు.అందుకే ఆ స్వామిని చలువ నారాయణస్వామి అని అంటారు.)
అక్కడి వరకు బాగానే ఉంది కానీ.
చరిత్ర ను కొంచెం పరిశీలిస్తే
రామానుజుల వారి జీవితకాలం1017 నుంచి 1137
వరకు .ఒక మానవుని సంపూర్ణఆయువు 120 యేళ్ళు రామానుజుల వారు అలా పరిపూర్ణజీవితాన్ని గడిపారు.కానీ రామానుజుల వారి కాలం లో డిల్లీ నీ సుల్తానులు పాలిస్తున్నారా లేదా అని పరిశీలిస్తే అప్పటికి డిల్లీ ఇంకా ముస్లిం సుల్తానుల చేతుల్లోకి పోలేదు .అప్పుడు డిల్లీనీ పాలిస్తుంది
రాజపుత్రులు ఐన తోమర్లు అంటే కచ్చితంగా చెప్పాలి అంటే అనంగపాల తోమర్ అనే హిందూరాజు డిల్లీ నీ పాలిస్తున్నాడు.
రామానుజుల వారు పరమపదం పొందిన 60 ఏళ్లకు డిల్లీ సుల్తానుల పరం అయింది.అంటే కుతుబ్ బుద్ధిన్ ఐబక్ అనే ఘోరీ సైన్యాధిపతి డిల్లీసుల్తాన్ అయ్యాడు.ఇతడి వంశాన్ని మామ్లుక్ రాజవంశం లేదా బానిస వంశం అంటారు.
పోనీ దక్షిణ భారత దేశం పైకి మొదట దాడి చేసిన వారు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తరుపున మాలిక్ కాఫర్ దాడి చేశాడు అదికూడా రామానుజల వారి కాలం తరువాత దాదాపు 150 సంవత్సరాలకు
దీన్ని బట్టి పరిశీలిస్తే రామానుజుల కాలం లో మెల్కోటే ఆలయం పై ముస్లిము ల దాడి జరగలేదు అని తెలుస్తుంది .అలా దాడి జరగనప్పుడు రామానుజుల వారు డిల్లీ వెళ్ళడం ఆపద్ధము.
ఆ డిల్లీ సుల్తాన్ కూతురు మెల్కోటే రావడం కూడా అబద్దం.ఇంకా విచిత్రం ఏమిటంటే డిల్లీ సుల్తాన్ అంటారు కానీ ఆ సుల్తాన్ పేరు ను ఇంతవరకు ఎవ్వరు చెప్పడం నేను వినలేదు.
తరువాత కాలం లో అంటే 14 లేదా 15 వ శతాబ్ద కాలం లో బీబీ నాంచారి కథను సృష్టించి ఉండవచ్చు.
దీన్ని బట్టి పరిశీలిస్తే బీబీ నాంచారి అనే భక్తురాలు కల్పితం అని కచ్చితంగా మనం నిరూపించవచ్చు.
జై శ్రీ కృష్ణ 🙏 🙏 🙏 🙏 🙏 🌺🌺🌺🌺🌺🌺
కోరను కోర్కెలెన్నియొ
ఉ॥
కోరను కోర్కెలెన్నియొ యకుంఠితదీక్షగ విన్ము తల్లి! నే
నూరక నుండబోను హృది నుద్యమమై జన నీదు నామమున్
సారెకు సారెకుం దలతు జక్కగ ధ్యానమునందు నిల్పెదన్
తీరిక నందుమా! రుజల దీర్చి యొసంగుమ మోక్షధామమున్
*~శ్రీశర్మద*
చిదంబర నటరాజేశ్వరుని హారతి
చిదంబర నటరాజేశ్వరుని హారతి దర్శనం అపూర్వమైన దివ్యానుభూతి.🔥
చిదంబరం నటరాజేశ్వర ఆలయంలో జరిగే నటరాజేశ్వరుని హారతి దర్శనం భక్తులకు పరమానందాన్ని ప్రసాదించే మహాదివ్య అనుభవం.
ఇది కేవలం ఒక పూజ కాదు - ఆనంద తాండవంలో లీనమైన పరబ్రహ్ముని ప్రత్యక్ష దర్శనం.
పంచభూతాలలో ఆకాశ తత్త్వమునకు ప్రతీకగా ఉన్న ఈ క్షేత్రంలో, హారతి సమయంలో దీపజ్యోతి నాట్యభంగిమలో కదిలే నటరాజుని సాక్షాత్తుగా ప్రతిబింబిస్తుంది.
చిదంబర రహస్యం (ఆకాశ లింగం) - హారతి అనంతరం తెర తొలగించి చూపే శూన్యాకాశం, సృష్టి-స్థితి-లయల సారాన్ని బోధిస్తుంది.
వేద మంత్రోచ్చారణలు, నాదస్వర, తాళ ధ్వనులతో ఆలయం నిండా దైవనాదం ప్రతిధ్వనిస్తుంది.
హారతి సమయంలో వెలిగే దీపాలు అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానప్రకాశమునకు ప్రతీక.
శంఖనాదం, వేదోచ్చారణల మధ్య జరిగే హారతి భక్తుల మనసును పరమశాంతికి చేర్చుతుంది.
హారతి సమయంలో భక్తుడి మనస్సు స్థిరమై,
అహంకార లయ → చైతన్యోదయం → ఆనందానుభూతి అనుభవం కలుగుతుందని శాస్త్రోక్తి.
నటరాజుని నాట్యం - జీవితం ఒక లీల, విముక్తి ఒక నాట్యాంతమని గుర్తుచేస్తుంది.
"ఆకాశమే లింగం, ఆనందమే తాండవం
చిదంబరంలో శివుడే చైతన్యం."
#ఓంనమఃశివాయॐ
#అరుణాచలశివॐ🙏



