🏵️శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
🌷మూకపంచశతి-ఆర్యాశతకము🌷
🌹అహితవిలాసభఙ్గీ-
మాబ్రహ్మస్తమ్బశిల్పకల్పనయా౹
ఆశ్రితకాఞ్చీమతులా-
మాద్యాంవిస్ఫూర్తిమాద్రియేవిద్యామ్౹౹
🌺భావం: చతుర్ముఖ బ్రహ్మ ప్రథమజీవుడు కాగా,జీవులలో అధమస్థానములోనుండు స్థావరము (చెట్లు) లైన చెరుకు మొదలగు గడ్డిజాతి మొక్కలను స్తంభములని వ్యవహరింతురు.ఈ సృష్టిలో అత్యుత్తమమైన జీవి మొదలుకొని ,అధమాధమ జీవి వరకు గల శరీరనిర్మాణముల యొక్క చాతుర్యమంతయూ ఆ పరమేశ్వరి యొక్కవిలాసమే ! అట్టి సాటిలేని ,మొట్టమొదటి,అత్యంత కౌసల్యముతో నున్న వృత్తి ఙ్ఞానమనెడి
ఆ శిల్పవిద్యాస్వరూపిణి ని ఆదరించెదను.🙏
🌼ఈ సృష్టివిస్తరణకై మహావిష్ణువు నాభికమలమున ఉద్భవించిన ఆ చతుర్ముఖబ్రహ్మ మొదటి జీవుడు.జీవత్వమున్న వాటిలో చలనములేని స్థావరములు అధమస్థానములోనుండును.అందు ఈ స్తంభములు మరింత అధమాధమ ముగా వ్యవహరింపబడును.ఆ బ్రహ్మ మొదలు ఈ స్తంభముల వరకు ఉన్న మొత్తము జీవుల శరీరనిర్మాణములు ఎంతో కల్పనాచతురతతో ఉండును.ఈ శిల్ఫకల్పన నంతటినీ వివిధ రకములుగా ఆ తల్లి విలాసముగా,ఏమాత్రమూ అలసటలేకుండా చేయుచుండెను. అట్టి అద్భుతమైన ,మొట్టమొదటి వృత్తివిద్యా జ్ఞాన స్వరూపిణి అయి ,కాంచీనగరమును ఆశ్రయించిన ఆ కామాక్షీ దేవిని మనసున స్థిరముగా నిలుపుకొనెదను.🙏
🥀భాస్కరసీతామైత్రేయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి