5, జనవరి 2026, సోమవారం

పద్మ పురాణం

 🕉️🕉️ పద్మ పురాణం 🕉️🕉️


అధ్యాయం 14 part 7


నానాతరులతాయుతము నానామృగరవసంకులము చెట్లుతీగల పువ్వుల పరిమళించునది వాయువులు వీచుచుండ బుద్ధిపూర్వకముగ నెవరో యుంచినట్లున్న పూలనుండిచిమ్ముసువాసనలతో పండ్లతో నతిసుందర మీ ప్రదేశమందు జొచ్చి భక్తితోడి నాఆరాధన మందికొని అరవిందగర్భుడు (బ్రహ్మ) వరమును బ్రసాదించునది. బ్రహ్మ ప్రసాదముననే యీ పుష్కరమును గురించిన కోరిక సిద్ధించినది. పాపమునడంచి దుష్టమును వారించి పుష్టిని సంపదను బలమును బెంపొందించునది దివ్యక్షేత్రము లభించినది యని ధ్యానము సేయుచున్న మహా తేజశ్శాలి రుద్రునికెదుట భక్తిప్రీతుడై పద్మజుడు సాక్షాత్కరించి వ్రాలిన రుద్రునిపైకెత్తి గురువుగా మఱి యిట్లనియె- దివ్యమైన వ్రతోపచారమున నా దర్శనము కావలెనని నీచేనెంతో ఆరాధింపబడినాను. వ్రతనిష్ఠులు మానవులు దేవతలు నన్ను జూచెదరు. వారి కోరికతో పరమప్రవరమైన వరము నే నిత్తును. సర్వకామములు చక్కగ సిద్ధించుటకు నంతరాత్మ సంతుష్టిగ త్రికరణశుద్ధిగ వ్రతమాచరించితివి. వరమేమి నీకిత్తునది తెలుపుమన

రుద్రు డిట్లనియె :

భగవంతుడా ! ఇదే మహావరము చాలును. జగద్వంద్య ! జగత్కర్తా ! నాకు గనబడితివి. నమస్కారము. బహుపుణ్యము యజ్ఞములచే బహుకాలము సంపాదించుకొన్నది ప్రాణములొడ్డి చేసిన తపస్సుచే నీవు గననౌదువు. దేవేశా ! ఈ కపాలము నా చేతినుండి జారిపడదు. ప్రభూ ! అందరు ఋషుల కసహ్యమై తలవంపు గూర్చుచున్నది. నీ ప్రసాదముచే కాపాలికమను వ్రత మాచరించితిని. ఈ మహావ్రతము సిద్ధించెనా ? శరణందితి నానతిమ్ము, పుణ్యస్థలమునందెక్కడ దీనిని విసరివైతునది పలుకుము. ఆత్మభావనులగు ఋషులకు పవిత్రుడయ్యెదను అని రుద్రుడన

బ్రహ్మ యిట్లనియె :

భగవంతుని స్థాన మవిముక్తమనునది పురాతన మున్నది. కపాలమోచనమునకు నీకిది తీర్థముగాగలదు. నేను నీవు విష్ణువు నిట నుండుదము. ఇట నీ దర్శనమైనంత పరిశుద్ధులై నాభవనమందిట సర్వభోగములనుభవింతురు, దేవతల కెంతో ప్రియమైన వరుణ - అసి యను సదీమతల్లు లిటనున్నవి. ఆ నదుల నడుమ బ్రహ్మహత్య యెన్నడుం జొరబడదు. ఇక్కడ పోయినవారేలాటి భయములేక హంసయానమున స్వర్గమున కేగుదురు. ఐదుక్రోసుల కొలతను నేనీ క్షేత్రమును నీ కిచ్చితిని. ఈ క్షేత్రముమధ్యనుండి గంగ సముద్రమున కేగును. అప్పుడక్కడ పుణ్యమైన మొక పురమేర్పడును. పుణ్యనది గంగ ఉత్తరముగను సరస్వతి తూర్పునకు జాహ్నవి ఉత్తరముగను రెండామడలిట ప్రవర్తించును. దేవతలింద్రాదులందరు అటకు వచ్చి నాతో నుందురు. అక్కడ నీ కపాలము విడువుము.

అటకేగి పిండదానముచే పితరులను శ్రాద్ధమందు బ్రీతినందజేయువా రక్షయ పుణ్యలోకము స్వర్గ మందుదురు. వారాణసియందు మహాతీర్థమందు స్నానముచేసిన యతడు సప్తజన్మల పాపమునుండి ముక్తి నందును. ఇటకు యాత్రసేసినను జాలును. అది సర్వతీర్థోత్తమము. నీకు మ్రొక్కి ఇట ప్రాణము విడిచిన వారు రుద్రత్వమంది నీతో సమ్మోదింతురు. ఇట మనఃపూర్వకముగ నిచ్చిన దానము మహత్ఫలనిధానమగును. అది నీ ప్రభావమే. ఇట తమ శరీరము తాము చీల్చుకొని సంస్కరించుకొను వారెప్పుడు రుద్రలోకమందానందింతురు. (ఆత్మహత్యాదోష మచటలేదన్నమాట) ఒచ్చునొరములేని సాధువైన వయస్సులో నున్న యందమైన గోసుతమునిట (ఆబోతును) అచ్చోసి వదలినయతడు పరమపదమందును. పితరులతో గూడ మోక్షమందును. ఇందు సందేహములేదు.

పలుమాటలేల ? అక్కడ మానవులు ధర్మోద్దేశముతో నే పని చేసినను నది యంతులేని ఫలమిచ్చును. ఆ తీర్థమవనిలో స్వర్గమునకు అపవర్గమునకు (మోక్షమును) గూడ కారణమని ఋషి సమ్మతము. స్నానము జపము హోమము దానము ననంత ఫలదము. భక్తితో రుద్రపరాయణులై వారాణసీ తీర్థమున కేగి యట పంచత్వమునందినభక్తులు పితృదేవతలు, పితామహులు, (తాతలు) వసువులు, రుద్రులు, ప్రపితామహులు (ముత్తాతలు) ఆదిత్యులు నౌదురని వేదమువలన వినికి. ఇట పిండదానవిధి మూడు విధములని నే జెప్పితిని. ఇటకు యాత్రవచ్చిన మనుజుపుత్రులు పిండదానము శ్రద్ధతో చేసి తీరవలెను. సుపుత్రులు వారే పితరులకు సుఖమిచ్చినవారు. దర్శనమాత్రమున ముక్తినిచ్చు తీర్థమును నే నీకు దెల్పితిని. అచట స్నానముచేసిన జన్మబంధమునుండి ముక్తినందును. రుద్రా ! అచ్చట యథాసుఖముగా బ్రహ్మహత్యనుండి నీవు ముక్తుడవై భార్యతో నేనిచ్చిన యీ యవిముక్తక్షీరమందు సుఖమందుము. అన శివుడు

అటకేగి పిండదానముచే పితరులను శ్రాద్ధమందు బ్రీతినందజేయువా రక్షయ పుణ్యలోకము స్వర్గ మందుదురు. వారాణసియందు మహాతీర్థమందు స్నానముచేసిన యతడు సప్తజన్మల పాపమునుండి ముక్తి నందును. ఇటకు యాత్రసేసినను జాలును. అది సర్వతీర్థోత్తమము. నీకు మ్రొక్కి ఇట ప్రాణము విడిచిన వారు రుద్రత్వమంది నీతో సమ్మోదింతురు. ఇట మనఃపూర్వకముగ నిచ్చిన దానము మహత్ఫలనిధానమగును. అది నీ ప్రభావమే. ఇట తమ శరీరము తాము చీల్చుకొని సంస్కరించుకొను వారెప్పుడు రుద్రలోకమందానందింతురు. (ఆత్మహత్యాదోష మచటలేదన్నమాట) ఒచ్చునొరములేని సాధువైన వయస్సులో నున్న యందమైన గోసుతమునిట (ఆబోతును) అచ్చోసి వదలినయతడు పరమపదమందును. పితరులతో గూడ మోక్షమందును. ఇందు సందేహములేదు.

పలుమాటలేల ? అక్కడ మానవులు ధర్మోద్దేశముతో నే పని చేసినను నది యంతులేని ఫలమిచ్చును. ఆ తీర్థమవనిలో స్వర్గమునకు అపవర్గమునకు (మోక్షమును) గూడ కారణమని ఋషి సమ్మతము. స్నానము జపము హోమము దానము ననంత ఫలదము. భక్తితో రుద్రపరాయణులై వారాణసీ తీర్థమున కేగి యట పంచత్వమునందినభక్తులు పితృదేవతలు, పితామహులు, (తాతలు) వసువులు, రుద్రులు, ప్రపితామహులు (ముత్తాతలు) ఆదిత్యులు నౌదురని వేదమువలన వినికి. ఇట పిండదానవిధి మూడు విధములని నే జెప్పితిని. ఇటకు యాత్రవచ్చిన మనుజుపుత్రులు పిండదానము శ్రద్ధతో చేసి తీరవలెను. సుపుత్రులు వారే పితరులకు సుఖమిచ్చినవారు. దర్శనమాత్రమున ముక్తినిచ్చు తీర్థమును నే నీకు దెల్పితిని. అచట స్నానముచేసిన జన్మబంధమునుండి ముక్తినందును. రుద్రా ! అచ్చట యథాసుఖముగా బ్రహ్మహత్యనుండి నీవు ముక్తుడవై భార్యతో నేనిచ్చిన యీ యవిముక్తక్షీరమందు సుఖమందుము. అన శివుడునీ మాటంబట్టి పృధివిలో నన్ని తీర్థములందు విష్ణువుతో నీతో నేనుందును. నేనుకోరువరమిది. నేను దేవుడుగా మహాదేవ ! నీతో నెల్లప్పుడారాధ్యుడనగుదును. సంతుష్టాంతరంగుడనై యీ వరమిచ్చుచున్నాను.

విష్ణువునకును కోరిన వరములిత్తును. దేవతలకు మునుల కందర కాత్మభావనులకు నిచ్చువాడను నేనే. ఇంకొకరెట్లునుం గాకూడదన బ్రహ్మ - రుద్రా ! నీయన్న శుభవచనము నే నిట్లేచేసెదను. నారాయణుడును నీ వన్నట్లు సేయును. సందియము లేదు అని రుద్రునిం గూర్చి పలికి వెళ్ళి వారాణసియందు దివ్యతీర్థము నేర్పరచెను.


ఇది సృష్టిఖండమునందు బ్రహ్మహత్యానాశమను పదునాల్గవయధ్యాయము

కామెంట్‌లు లేవు: