ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వక్కరికి
ఎదుటివాడు అంటరాని వాడే
కరచాలనాలు కుడరదు
చుంబనాలు చేయకూడదు
ఆలింగనాలు అసలెవద్దు
ఏది పట్టుకున్న
ఏది ముట్టుకున్నా
చివరకు కొట్టుకున్న
కరోనా భయం
ఎక్కడో కప్పలు పాములు
తిని తెచ్చుకున్న రోగం
ఈరోజు ప్రతి మనిషిని వణికిస్తున్నది
ఎవరో చేసిన పాపం ఎవరికో చుట్టుకున్నట్లు
కరోనా చేస్తున్న బీభత్సవం
ఇంతా అంతా కాదు
టివి పెట్టుకుంటే కరోనా
సెల్ పట్టుకుంటే కరోనా
ఎటు చూస్తే అటు కరోనా
తత్వమసి అన్నట్లు
ఇప్పుడు అంతా తత్వ కరొనస్మి
తొల్లి పరీక్షిత్ ని
తక్షకుడు చంపితే
నేడు కరోనా ప్రతీ పరీక్షితుని చంపుతున్నది
తక్షకుడు సర్పమైతే
నేడు సర్పాలని తిని
చెనా వాడు కరోనా కారకుడైనాడు
ఈ కరోనా తక్షకునికాన్నా డెంజర్
ముని శాపం కన్నా అఫేక్టీవ్
వాట్సాఫ్
నీకు హేట్సాఫ్
ట్విట్టర్ ఫెస్బుక్ నీకు తోబుట్టువులు
అందరి చేతుల్లో మీరే
అందరి మనసుల్లో మీరే
గతంలో వార్తలు
వార్తల్లోనే ఉండేవి
ఇప్పుడు ప్రతి సెల్లు
పుకార్లకు ప్రతీకలు
అదిగో పులి అనక ముందే
ఇదిగో తోక అని చూపెడుతున్నారు.
ఏది నిజమో ఏది అబద్దమో
తెలుసుకునే స్థితిలో ఎవరు లేరు.
సెల్లున్న ప్రేతివారు కరోనా
మందులు చెప్పేవారే
కొందరు అది చేయే ఇదిచేయి
అంటమే కాక
చివరకు ఉమ్మెత్త కాషాయం కూడా
కరోనాకు మందు అనే స్థితికి
జనం వచ్చారు.
అది రాసిన వాడికా లేక
ఫాలో అయ్యే వాడికా పిచ్చి
ఎవరు చెపుతారు.
ఏతా వాతా తేలిందేమిటంటే
ప్రపంచ ఎకనామి ట్రబుల్స్
స్టాకు మార్కెట్ కొలాప్స్
హోటల్లో తినే వాడు లెడు
బైట నడిచే వాడు లేడు
ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వక్కరికి
ఎదుటివాడు అంటరాని వాడే