27, ఆగస్టు 2020, గురువారం

నృత్యం


దేముడి విన్యాసాలు

🌺పాదారవిన్ద శతకం🌺

మూక పంచశతి🌸
 

శ్లోకం

యయోః సాంధ్యం రోచిః సతత మరుణిమ్నే స్పృహయతే
యయోః చాంద్రీకాంతిః పరితపతి దృష్ట్వానఖరుచిం
యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం
మ్రదిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే ౹౹23౹౹

ययोः सान्ध्यं रोचिः सततमरुणिम्ने स्पृहयते
ययोश्चान्द्री कान्तिः परिपतति दृष्ट्वा नखरुचिम् ।
ययोः पाकोद्रेकं पिपठिषति भक्त्या किसलयं
म्रदिम्नः कामाक्ष्या मनसि चरणौ तौ तनुमहे  ||23||


అర్థం :- ఉభయ సంధ్యలయందరి అరుణకాంతి ఏ దేవీ చరణాలయందలి ఎరుపు రంగును, ఎల్లప్పుడూ అలాంటి ఎరుపు ఉండాలని కోరునో,ఏ దేవి యొక్క గోళ్ళకాంతిని చూసి వెన్నెల మిక్కిలి తప్పించునో ఏ దేవి చరణాలయందలి పరిపక్వతను భక్తిచేత చివురు చదువకోరునో కామాక్షీదేవి ఆ దివ్యచరణములు నా మనసున్నందు నిలుపుకొందును.

పాదారవిన్ద శతకం

శ్రీ  గురుభ్యోనమః🙏🏻🙏🏻

     🌸మూక పంచశతి🌸
    🌺పాదారవిన్ద శతకం🌺

శ్లోకం

మహామంత్రం కించిన్మణికటక నాదైరివ జపన్
క్షిపన్దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః
నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమతా
పిశాచీం పాదోఽ యం ప్రకటయతి తే మాంత్రికదశాం  ౹౹36౹౹


महामन्त्रं किञ्चिन्मणिकटकनादैर्मृदु जपन्
क्षिपन्दिक्षु स्वच्छं नखरुचिमयं भास्मनरजः ।
नतानां कामाक्षि प्रकृतिपटुरच्चाट्य ममता-
पिशाचीं पादो‌உयं प्रकटयति ते मान्त्रिकदशाम् ॥36॥

అర్థం :- ఓ కామాక్షీ దేవి మణిమంజీరనాదముల చేత ఏదో యొక మహామంంత్రమును జపించుచున్నట్లున్న గోళ్ళకాంతియనెడి నిర్మలమైన భస్మమునకు సంబంధించిన పరాగమును దిక్కులయందు వెదజల్లుచు స్వాభావికముగా సమర్ధమైన నీయొక్క ఈ పాదము నమస్కరించిన వారి యొక్క మమకారమనెడి పిశాచమును ఉచ్చాటన చేసి మాంత్రిక స్ధితిని ప్రకటించుచున్నది.

భావము :- అందెల చప్పుడుతో ఏదో ఒక మహామంత్రమును జపించుచు దిక్కుల యందు స్వచ్ఛమైన నఖముల కాంతి యనెడి బూడిదను వెదజల్లుచు స్వభావసిద్ధమైన పటుత్వము గల అమ్మవారి పాదము నమస్కరించు వారి మమకారమును పిశాచముయొక్క ఉచ్చాటన మొనరించుచు మాంత్రికస్ధితిని ప్రకటించుచున్నది.


🙏🏻శ్రీ కామాక్షీ దేవ్యైనమః🙏🏻

శంకరసేవాసమితి సౌజన్యంతో
*******************

ఇది ప్రాచీన గాధాలహరి లోని ఒక కథ..


భగవంతుని పై నమ్మకం


ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట  నివసిస్తూ ఉండేది. అక్కడ  ఎటువంటి పచ్చదనమూ లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది.

ఒక రోజున నారదుడు అటు పోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను  చూసి చాలా జాలి పడ్డాడు.  ఆ పక్షి దగ్గరకు వెళ్ళి ,” ఓ చిన్ని పక్షి ! ఇంత మండే  ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు?  నీకు ఏమైనా సహాయం చేయనా ?అని అడిగాడు.

ఆ చిన్ని పక్షి,” నాకు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది.  కాని ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలు రెండు కాలిపోతున్నాయి.  ఇక్కడ ఒక చెట్టు ఉంటే, ఈ ఎండ,  వేడిని కొంచము తట్టుకుని  హాయిగా, సంతోషంగా ఉండగలను." అని చెప్పింది .

“ఇటువంటి  ఎడారిలో చెట్టు మొలవటం అంటే, నా ఊహకి అందకుండా ఉన్నది. అయినా నేను పరమాత్మ దగ్గరకి వెళ్లి  నీ కోరిక  నెరవేర్చమని అయనను అడుగుతాను”, అన్నారు.

శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్లి ఆ పిట్టకి సహాయం చేయమని ఆయనకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు ఆయన  "నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలా చేయగలను.  కానీ ఆ పిట్ట విధి రాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ, ఎండ నుంచి ఉపశమనము కోసము ఒక ఉపాయం చెబుతాను. ఎప్పుడూ ఏదో ఒక కాలి  పైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి  కొంత విశ్రాంతి దొరికి, ఉపశమనం కలుగుతుంది. వెళ్లి ఆ పక్షి తో ఇలా నేను  చెప్పానని చెప్పు"  అన్నారు పరమాత్మ. 

నారదుడు మళ్ళీ ఎడారి లో ఉన్న  పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి  భగవానుని పై ఎంతో నమ్మకము.   ఈ ఉపాయం విని చాలా సంతోషించింది.   నారద మహర్షికి ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఈయనకు అర్థం కాలేదు "ఇందులో ఇంత సంతోషించటానికి ఏముందో. అడిగిన చెట్టు మొలిపించలేదు సరి కదా, ఒంటి కాలి  మీద నడువు" అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి  వెంటనే అమలు లో పెట్టటం మొదలు పెట్టింది. 

మహర్షికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ అక్కడికి వెళ్లి చూద్దామని ఆ  దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. అది హాయిగా ఆ  ఎడారి మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య  కూర్చుని ఉంది.  పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి ఈయనకి  ఆనందం కలిగింది, అయినా పరమాత్మ చెప్పక పోయినా చెట్టేలా వచ్చిందనే  విషయం బోధ పడలేదు.  మళ్ళీ  దేవుడి దగ్గరకి వెళ్ళి  ఆయనతో  ఈ  పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు.

అందుకు శ్రీమహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు:" నేను చెప్పినట్లే జరిగింది.  పక్షి తల రాతలో  చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి  నా సందేశం వినిపించిన తరువాత, భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని, అర్థము చేసికొని ఆచరించింది.  అంతే కాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయముతో తనకు లభించిన  భగవత్ప్రసాదమును  స్వచ్ఛమైన అంతఃకరణతో అమలులో పెట్టింది.  ఆ పక్షి  చూపించిన ఈ భక్తి  శ్రద్ధలకు , నా అనుగ్రహము మేరకు తల రాతను మార్చేసి, అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను" అన్నారు. 

                                                                                                                                                                                       మనం నేర్చుకోవలసినది ఏమిటి?
*అందిన అనుగ్రహాన్ని ఆచరించాలి, ఆ పూటకు దొరికిన  దాన్ని ప్రసాదముగా భావించాలి. ఈ మాత్రము అందుకోగలిగినందుకు ఆయన పట్ల కృతజ్ఞత చూపాలి. మనకేమి కావాలో ఆవి యిస్తారు, మనం కోరుకున్నవన్నీ మనకు సుఖ శాంతులు అందించలేకపోవచ్చు. అందువలన ఇది కావాలి అది కావాలి అని కోరుకునే కంటే, మనకేది అవసరమో ఆయనే ఇచ్చేటట్లు ధన్యవాదములు తెలియచేసుకోవాలి, భగవంతుని ఆశీస్సులను పొందే ప్రయత్నం చేయాలి. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం- వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.
***********************

banana







ఇది, శ్రీ రమణ (మిధునం)గారి యనుభవం!

             
 శ్రీరమణ పాత్రికేయునిగా విజయవాడలో నున్నప్పుడు జరిగినది.  రమణగారు విశ్వనాధగారి సన్మానమును
చీరాలలో నేర్పాటుచేసి, వారినితోడ్కొనిరావటానికి తామేపూనుకొన్నారు. టాక్సీలో ప్రయాణం 4గంటల వ్యవధి, గమ్యంచేరటానికి. మధ్యమధ్య నస్యం ముక్కుల్లో ధట్టిస్తూ విశ్వనాధ రమణతో యేవేవో ముచ్చట్లు చెపుతున్నారు.  వారికినచ్చని విషయమేదైనా అడిగితే అమ్మో! వారికికోపం వస్తుందేమో?  విషయం అసలుకే చెడుతుంది.  అందుకే రమణగారు కంఠదఘ్నంగా ఉన్న తమ కోరికను బయటకు చెప్పలేక పోతున్నారు.  అలాగని అడగటం మానాలనీలేదు.  ప్రయాణమాపూర్తికావచ్చింది.కోరికా మిగిలిపోయింది.
ఇంతలో రైలుగేటు పడింది విశ్వనాధ కొంచెంతీరుబడిగా కన్పించారు.  మెల్లగా శ్రీరమణ విషయం కదిపారట! బాబాయిగారూ!  నాదో చిన్నకోరిక, "ఆఁ ఏవిటో అడుగవయ్యా!" -అన్నవెంటనే" శ్రీ శ్రీ-కవితాదృక్పధానికీ,
మీ కవితా దృక్పధానికి మధ్యతేడా ఏమిటో కకొంచెం సెలవీయండి", అనియడిగారట!
దానికాయన కోపందెచ్చుకోక, నశ్యం ఒకపట్టు గట్టిగాపీల్చి ముక్కులుతుడుచుకుంటూ"అబ్బో!  ఆవిషయం చెప్పాలంటే చాలా ఉందయ్యా! చెపుతానులే, విను.

ఉదాహరణకు భాగవతంలో సముద్రమధన ఘట్టం ఉన్నది గదా.  అగో దానినిద్దరం వింటున్నామే అనుకో, దానిని చదువుతున్నప్పుడు అక్కడ ఆదృశ్యాన్ని మేము చూసే తీరుల్లో తేడా చాలా ఉంటుందయ్యా, నేనయితే ఆదృశ్యాన్ని పోతన చిత్రించిన తీరునుజూచి అబ్బురపాటుతో ఆనందాన్ని పొందుతాను.
"ఆ ఘట్టంలోని అద్భుత రసపోషణను, అలంకార ప్రయోగచాతుర్యాన్ని, మెచ్చుకుంటాను".  ఎందుచేత, నాదంతా ప్రాబంధికదృష్టి, అంటే సౌందర్యదృష్టి!"-

 "ఇదే శ్రీశ్రీయైతే,  ఆమంధర పర్వతంక్రింద నలిగిపోతున్న నత్తలుా, కప్పలూ, మొదలైన జలచరాలమృత్యుఘోషను,వాటిబాధలను, అవిచేస్తున్న ఆక్రందనలనూ,
దేవదానవులు చేస్తున్న ప్రాణిహననమునూ, నిరసించేదృష్టితో చూస్తాడు.  చూడటమేగాదు, ఆఅల్పప్రాణులయెడ తనకుగలసానుభూతిని కవితావిష్కారంచేయటానికి ప్రయత్నిస్తాడుకూడా.
     
నాది సౌందర్య శిల్పకళాదృష్టి!

అతనిది జీవ కారుణ్యదృష్టి !
 
ఇదీ మాకవితాదృక్పథము మధ్యగల భేదము"-
 
విశ్వనాధగారి వివరణపూర్తియైనది.  టాక్సీ గమ్యమును చేరినది.
       🌷 స్వస్తి!🌷
******************

మంత్రము-సాధన

ఏ మంత్రమైనా గురూపదేశం లేనిదే ఫలించదు. మంత్రాన్ని పుస్తకాలలోనూ, టివిలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ తీసుకొని చేస్తే మహాపాపం. కఠోరమైన నియమాలున్నాయి. ప్రమాణ శ్లోకాలతో చూపిస్తే భయపడతాం. మనకి తొందరగా కోరిక తీరాలనే ఆబ, ఆశ, ఎక్కువ. త్వరగా సంపాదించాలనే ఆశ వాళ్ళకి ఎక్కువ. ఈరెంటి మధ్య కలియుగంలో మంత్రములు బజారు పాలు అవుతున్నాయి.

రింగ్ టోన్ల రూపంలో గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వినపడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇవి మనల్ని పతనం చేస్తాయి. మంత్రములు ఎప్పుడూ పాటలు కారాదు. మననం చేయవలసింది మంత్రం. గురూపదేశం ద్వారా పొంది మనస్సులో చేయాలి. మంత్రాలు పాటలు, భజనలు కావు. పాటలు, భజనలు కావలసినన్ని ఉన్నాయి. చేసుకోండి. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు చాలా ఉన్నాయి. హాయిగా పాడుకోండి. రామ, శివ, శంభో అని నామం చేసుకోండి. తప్పులేదు. కానీ మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం బయటికి అంటాం, భజనలు చేస్తాం, ఎలుగెత్తి పలుకుతాం అంటే మహాపాపం. శక్తివంతమైన వాటిని జాగ్రత్తగా వాడాలి. Hi Voltage Electricityని జాగ్రత్తగా వాడుతున్నామా? లేదా? ఉపయుక్తమైనది, మంచిది, గొప్పది అని తీగను పట్టుకుంటే ఏమౌతుందో అదే అవుతుంది ఇవన్నీ చేస్తే. శాస్త్ర ప్రమాణములున్నాయి దీనికి. ఒకమందు ప్రిస్కిప్షన్ లేనిది పుచ్చుకోకూడదని డాక్టర్లు చెప్తారు. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఒకటుంది. ఏ జబ్బుకి యేమందో లిస్ట్ దొరుకుతుంది. నచ్చిన మందు వేసుకుంటే యే డాక్టర్ ఒప్పుకుంటాడో చెప్పండి. జబ్బు, మందు తెలిసినప్పటికీ వాడకూడదు. వైద్యుడు దగ్గరికి వెళ్ళాల్సిందే. వైద్యుడు కూడా ఇద్దరు డయాబెటిక్ పేషేంట్స్ కి ఒకే మందు వ్రాయడు. ఒక మందు ఇవ్వడానికి రోగిని వైద్యుడు ఎంత పరీక్షించాలో ఒక మంత్రిమివ్వడానికి గురువు శిష్యుడిని అంత పరీక్షించాలి. వాని పద్ధతి, జీవన విధానం, పరంపర, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు.

అయితే కొన్ని మంత్రాలకి ఎక్కువ నియమాలుంటాయి. కొన్ని మంత్రాలకు పెద్ద నియమాలుండవు. అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో పంచాక్షరి ఒకటి. నమశ్శివాయ, శివాయ నమః కూడా పంచాక్షరే. ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చేయాలి. ఉపదేశం లేని వారు ప్రణవసహితంగా చేయరాదని శాస్త్రం చెబుతోంది. ఉపదేశం లేనప్పుడు శివాయ నమః – భక్తితో చేస్తే అదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఓం నమశ్శివాయ అని పాటలు పాడితే తప్పు అని శాస్త్మే చెప్తోంది. అశాస్త్రీయం అలవాటు అయిపోయి అసలు శాస్త్రం చెప్తే కోపం వచ్చే రోజులలో ఉన్నాం. ఉపదేశం లేకుండా పంచాక్షరి చేస్తే సత్ఫలితం ఇస్తుంది. అందులో ఏమీ తేడాలేదు. అయితే ఉపదేశం లేకుండా చేస్తే దానికి సాధ్యమంత్రము అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రము అని పేరు. ఉపదేశం చేసే దానికంటే ఉపదేశం పొంది చేసే మంత్రం కోటిరెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉపదేశం ఇచ్చిన వారు మంత్రంలో సిద్ధి పొందిన వారు అయితే అప్పుడు ఆ మంత్రం సుసిద్ధ మంత్రం అవుతుంది. గురువులేనిదే యేవిద్య కూడా భాసించదు.

ఒక చెట్టును ఫోటోతీసి ఇంట్లో ఉంచుకొని, అందులోంచి చెట్టు ప్రయోజనాల్ని పొందడం ఎలాంటిదో – రికార్డు చేసిన మంత్రాలద్వారా అనుష్ఠానం, అర్చనాదులు చేయడం అలాంటిదే. అందులోంచి ప్రాణశక్తిని పొందలేం.

నేర్చుకోవడానికి, లేదా విని అనుభూతిని పొందడానికి ఈ కేసెట్స్ పనికిరావచ్చు. అంతేగానీ వ్రతాలు, అభిషేకాలు చేయడానికి మాత్రం పనికిరావనే చెప్పాలి.

వ్రతాది యజ్ఞ (ఆరాధనా) కార్యాలలో బ్రహ్మను (విప్రుని) ఉచిత స్థానంలో ఆసీనుని చేయాలి. యజ్ఞాలో ’ఋత్విగ్వరణం’ ఇదే. అలాగే పూజాదులను స్వయంగా అనుష్ఠించలేనప్పుడు, బ్రహ్మస్థానంలో ఒకరిని నియమితుని చేసి వారు మంత్రోచ్చారణ చేస్తుంటే వీరు ఆచరిస్తుంటారు.

న సిద్ధ్యతి క్రియాకాపి సర్వేషామ్ సద్గురుం వినా!
మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ!!

సద్గురువు లేనిదే యే సాధనా ఫలించదన్న విషయం సనాతనమైన వేదవాక్యము.
************************

తెలుసుకోదగినవి

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్, 
3. మంజునాథ్.
శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్
సముద్రమే వెనక్కివెళ్లే
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
స్త్రీవలె నెలసరి అయ్యే
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు, 
2. కేరళ దుర్గామాత.
రంగులు మారే ఆలయం.
1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు
 1. కాణిపాకం, 
2. యాగంటి బసవన్న, 
3. కాశీ తిలభండేశ్వర్, 
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

స్వయంభువుగా
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
ఆరునెలలకు ఒకసారి తెరిచే
1. బదరీనాథ్, 
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం.

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు
హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

12 ఏళ్లకు ఒకసారి
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.

స్వయంగా ప్రసాదం
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే ధారీదేవి.

నీటితో దీపం వెలిగించే
 ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు 
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్

ఇంకా...
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి,
చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc

పూరీ
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.

ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి...
*****************

మొక్కలు పద్మ పురాణం


Voleti Venkateswarlu

Today is the birth day of great vidvan Sri Voleti Venkateswarlu 🙏
         🌷🌷🌷
'నిద్దుర నిరాకరించి,ముద్దుగ తంబుర బట్టి,శుద్ధమైన మనసుతో,సుస్వరముతో,పద్దుతప్పక భజియించే' ...తోడిరాగంలోని ఈ త్యాగయ్య కృతి వినగానే, నాకు ఒక గాయకుని ఆకృతి మదిలో మెదలుతుంది.  ఆయనెవరో కాదు...నిండైన విగ్రహంతో,ధవళ వస్త్రధారులై,తంబుర చేతబూని,కనులు మూసుకొని,తాదాత్మ్య స్థితిలో, గానాంబుధిలో తనిసి, తరించే ఓలేటి వేంకటేశ్వర్లుగారు.
ఒక విలక్షణమైన సంగీతం ఆయనది...గ్రీష్మఋతువులాంటి వెచ్చనైన కర్ణాటక సంగీతం పాడుతూ, అలవోకగా శరదృతువులో ప్రవేశించి, చల్లని వెన్నెలలాంటి హిందుస్థానీ సంగీతాన్ని స్పృశించి, పరవశింపజేయగల సవ్యసాచి ఆయన!
ఆయనకున్న స్వరజ్ఞానం అనన్యసామాన్యం. రేడియోలో ఎవరయినా ఒక కీర్తన పాడుతుంటే, వింటూ, అదే వేగంతో ఆ సాహిత్యాన్ని స్వరసహితంగా వ్రాసేసేవారాయన!
పుట్టింది- 27-8-1928న, రాజమహేంద్రిలో, సంగీతంలో తొలి పాఠాలు నేర్చింది- అచ్యుతరామయ్య శాస్త్రి, మునుగంటి వెంకటరావు పంతులుగార్ల వద్ద. అయితే, ఆయనకు బాణి నేర్పినవారు డా.శ్రీపాద పినాకపాణిగారు. 'ఓలేటిలాంటి ప్రజ్ఞాశాలి ఇక పుట్టడు' అంటారు గురువు పాణిగారు.
బెజవాడ ఆకాశవాణి చేసుకున్న అదృష్టమేమిటో! ఓలేటిగారి వంటి స్రష్టలను అక్కునచేర్చుకుంది. 1966 లో రేడియో ప్రవేశం చేసిన నాటినుండి, సంగీత ప్రయోక్తగా ఆయన నెరపని సంగీత ప్రక్రియలేదు. 'భక్తిరంజని' కోసం ఎంతో ప్రయాసకోర్చి, ఆధ్యాత్మరామాయణ కీర్తనలను సేకరించారు. సదాశివబ్రహ్మేంద్రసరస్వతి కీర్తనలను, నారాయణతీర్థ తరంగాలను స్వరపరచి, పదిలపరిచారు.  ఎన్నో యక్షగానాలకు రూపునిచ్చారు. లలితగీతాలకు బాణీలు కట్టారు.  ఆయన పాడిన 'హనుమాన్ చాలీసా' బహుళ ప్రసిద్ధమైనది.  'నగవులు నిజమని', 'కందర్ప జనక' లాంటి అన్నమయ్య కీర్తనలను, ' మనసౌనే ఓ రాధ', 'తలనిండ పూదండ' వంటి లలితగీతాలను, 'భజోరే భయ్యా'..వంటి హిందీ భజన్లు, స్వరపరచి, ఆలపించారాయన.
హిందుస్థానీ సంగీత దిగ్గజం- బడేగులాం ఆలీఖాన్, ఆయనకు దైవ సమానులు.  ఒకమారు ఖాన్ గారు హైదరాబాదులో కచేరీ నిమిత్తం వచ్చినపుడు వారి దర్శనంచేసుకున్న ఓలేటిగారు,  'మీరు అనుమతిస్తే, మీరు రికార్డులో పాడిన ఒక ఠుమ్రీని పాడి, వినిపిస్తాను' అన్నారట. 'పాడమని' సంజ్ఞచేశారు ఖాన్ సాహెబ్.  అంతే..ఓలేటిగారు కనులు మూసుకొని, గానం ఆరంభించారు.  ఖాన్ గారితో సహా అక్కడ ఉన్న యావన్మందీ మంత్రముగ్ధులయ్యారు. గానం పూర్తి అయింది.  ఖాన్ సాహెబ్ ఓలేటిగారితో 'నిజంగా ఆ రికార్డులో నేనింత బాగా పాడానా!' అన్నారట ఆనందంగా..
      ఓలేటిగారు,ఖాన్ గారికి ఎంత అభిమాని అంటే, తన గాత్రాన్నే కాదు, శరీరాకృతిని కూడా ఖాన్ గారిలా మార్చుకున్నారేమో! అనిపించేది.
ఓలేటిగారు నిగర్వి, అల్పసంతోషి.  'ఒక బహుళ అంతస్థుల భవంతి, తానే గొప్పని, ఎత్తైనదానినని విర్రవీగితే, ఏంలాభం?  చిన్న పిట్ట ఎగిరి, దాని నెత్తిమీద కూర్చోదుటండీ!  ఈనాటి ప్రతిభావంతులైన పిల్లలు పాడుతున్న సంగీతం ముందు, మన సంగీతమెంత సార్..?' అనేవారు మిత్రులతో ఆయన.  నిజం చెప్పాలంటే, ఆయనకు తెలుగునాటకన్నా, తక్కినచోట్లనే అభిమానులు మెండు.  మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో ఆయన చేసిన చిట్టచివరి కచేరీ వినే అదృష్టం కలిగింది నాకు.  వరాళి రాగం ఆనాటి ప్రధానాంశం. రసప్రవాహమై సాగిన నాటి కచేరీ అనంతరం, అసంఖ్యాక శ్రోతలు వేదికపైకి తోసుకొచ్చి, వోలేటిగారి పాదాలను తాకి నమస్కరించిన దృశ్యం నేను మరువలేను.  ఆనాడు కోయంబత్తూరు వంటి దూర నగరాలనుండి వచ్చిన సంగీత సభానిర్వాహకులు ఎందరో, తమ సభలో కచేరీ చేయవలసిందిగా అర్థిస్తే, 'నేను ప్రయాణం చేసి రాలేనని' సున్నితంగా వోలేటిగారు తిరస్కరించటం ఇంకా గుర్తుంది నాకు.
అదే..ఓలేటిగారి కచేరీ, ఒకసారి బెజవాడ రోటరీ ఆడిటోరియంలో జరిగితే, పట్టుమని పాతిక మంది లేరు.  కనులు మూసుకొని తన పాటలో లీనమైపోయిన ఓలేటిగారిని చూస్తే నాకప్పుడనిపించింది,  'ఏ శ్రోతలు వింటున్నారని కొమ్మ గుబురుల్లో దాగి, అంత కమ్మగా కోయిలమ్మ పాడుతుంది?' అని.
ఓలేటిగారు రేడియోలో నిర్వహించిన 'సంగీత శ్యామల' అనే రూపకంలో చిన్నప్పటి శ్యామశాస్త్రి పాత్రలో నటించే అవకాశం వచ్చింది నాకు.  అప్పుడు నాకు పధ్నాలుగేళ్ళు.  నాటరాగంలో బీజాక్షరాలతో కూడిన ఒక శ్లోకం పాడవలసి వచ్చింది.  రాగం మీదే దృష్టి పెడుతూ, శ్లోకం అనలేకపోతున్న నాతో, 'నువ్వు రాగం గురించి ఆలోచించకు.  అది ఎలాగూ తప్పురాదు నీకు.  ఉచ్చరించే అక్షరాలపై మనసుపెట్టి చూడు' అన్నారాయన.  ఆశ్చర్యం!  అది పాటించిన వెంటనే ఆశ్లోకాన్ని దోషరహితంగా పాడగలిగాను. నా గాత్రాన్ని మెచ్చుకొని, నన్ను ప్రోత్సహించేవారాయన.
ఓలేటిగారికి ముఖతః పెద్దగా శిష్యులు లేరనే చెప్పాలి.  అయితే, బెజవాడ రేడియోలో సుదీర్ఘ కాలం ఆయన నిర్వహించిన 'సంగీత శిక్షణ' ప్రసారం కోసం, తమిళనాట కూడా విద్యార్థులు ఎదురు చూసేవారు.  కొన్ని వందల కృతులు ఆవిధంగా ఆయన నేర్పారు.  రేడియో వారి 'వాణి' అనే పక్షపత్రికలో ఆ కృతుల స్వరలిపి ప్రచురింపబడేది.
మెహ్దీ హసన్, గులాం ఆలీ గజల్స్ అంటే ప్రాణమిచ్చేవారాయన!  ఆ గాయకులు ఆలపించిన బాణీలకు రజని, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గార్లవంటి కవులచే సాహిత్యం వ్రాయించుకొని, పాడేవారాయన!
కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు, 'సంగీత చూడామణి', 'సుర్ సింగార్' బిరుదులు మాత్రం లభించాయి ఆయనకు.  ప్రఖ్యాత వైలిన్ విద్వాంసులు లాల్గుడి జయరామన్ గారు, ఓలేటిగారి కోరిక మేరకు 'పహాడి' రాగంలో తిల్లానా రచించారు.
29-12-1989 న తనువు చాలించిన ఓలేటి వేంకటేశ్వర్లు గారిని తెలుగు రాష్ట్రాలవారు మరచినా, నరేంద్రనాథ్ మీనన్ గారి వంటివారు వారిని సంస్మరించుకుంటూ తమిళనాట, ఈనాటికీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

-Modumudi Sudhakar

శేషన్ చెప్పిన ఒక అనుభవం

మేనేజ్‌మెంట్ సెమినార్‌లో టిఎన్ శేషన్ చెప్పిన ఒక అనుభవం ఉంది.

 ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆయన తన భార్యతో కలిసి పిక్నిక్ కోసం ఉత్తర ప్రదేశ్‌లో ప్రయాణిస్తున్నారు.  దారిలో, పిచ్చుక గూళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు.

 ఇది చూసిన వారు అక్కడకు వెళ్లారు మరియు అతని భార్య రెండు గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంది.

 పొలాలలో ఆవులను మేపుతున్న ఒక బాలుడిని పోలీసు ఎస్కార్ట్ పిలిచి, గూళ్ళను దించాలని డిమాండ్ చేశారు. పిచుక గూళ్ళను తీసినందుకు 10 రూపాయలు చెల్లిస్తామని ఆశ లేదా కూలి ఇస్తామనే ధీమాతో పోలీసులు ఆ యువకునికి చెప్పారు. ఆ ఆవులు మేపుతున్న అతను అందుకు  నిరాకరించాడు. దీనితో మరి కొద్దిగా రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామని శేషన్  ఆఫర్‌ను 50 కి పెంచారు.
శేషన్ పెద్ద అధికారి కావడంతో పోలీసులు బాలుడిని చేయమని కోరారు. ఒక సందర్భంలో ఆదేశించారు.  బాలుడు శేషన్ మరియు అతని భార్య ఇలా అన్నారు. మీరు 50 రూపాయలే కాదు. ఎంత ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లోను పిచుక గూళ్ళను తీసి ఇవ్వలేను  'సాబ్జీ అంటూ ఎంతో ధీమాగా చెప్పాడు ఆ బాలుడు. మీరు ఇచ్చేదానికి నేను ఆశపడి, కక్కుర్తి పడి నేను అన్యాయం చేయలేను.  చేయను' కూడా అంటూ చెప్పాడు. అంతే కాకుండా ఆ పిచుక గూళ్ళను తొలగిస్తే  'ఆ గూళ్ళ లోపల, శిశువు పిచ్చుకలు ఉంటాయి, నేను మీకు ఆ గూళ్ళు ఇస్తే అందులో ఉన్న శిశువు పిచుకలు ఏమి అవుతాయి. అలాగే  సాయంత్రం తల్లి పిచ్చుక తన పిల్లలకు ఆహారం తీసుకు వచ్చినప్పుడు తన పిల్లలు కనిపించకపోతే ఆ తల్లి పిచుక ఎలా అల్లాడి, తల్లడిల్లి పోతుందో, ఏడుస్తుందో ఆలోచిస్తే మాటలు రావడంలేదు. ఆ పిచుక పిల్లల, తల్లి బాధ చూడటానికి నాకు గుండె లేదు ’.  ఇది విన్న శేషన్ మరియు అతని భార్య షాక్ అయ్యారు.

నా స్థానం, హోదా, నా సర్వీసు, నా చదువు, నా IAS అన్నీ కూడా ఆ ఆవులను కాస్తున్న బాలుని ముందు కరిగిపోయాయి అంటూ   శేషన్ చెప్పారు.    నేను ఆవపిండిలా అతని ముందు ఉన్నాను.  ఆ బాలుడు మా కళ్ళు తెరిపించాడు. ఫలితంగా మా కోరికను వదులుకున్నాం.  తిరిగి వచ్చిన తరువాత, ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది.  విద్య, స్థానం లేదా సాంఘిక స్థితి మానవత్వం యొక్క కొలతకు ఎప్పుడూ గజ స్టిక్ (స్కేల్) కాదు.

 విజ్ఞానం అనేది ప్రకృతిని తెలుసుకునేందుకు,  సమాచారాన్ని సేకరించేందుకు, విలువలను తెలుసుకునేందుకు, ఆచరించేందుకు, ప్రక్క వాని కొంప కూల్చకుండా సాటి వాడు కూడా సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడినప్పుడే దానికి ఒక విలువ ఉంటుందని ఆ బాలుడు నాకు ఆచరణలో నేర్పాడని చెప్పారు. అది లేకుండా ఏమి చేసినా ఉపయోగం లేదని , తద్వారా ఏమీ సాధించలేమని పేర్కొన్నారు..  మీకు, మాకు అందరికి భావం మరియు జ్ఞానం ఉన్నప్పుడు అందరి  జీవితం ఆనందంగా మారుతుంది చెప్పారు.

అప్పటిలో శేషన్ పేరు వింటేనే కాకలు తీరిన బడా రాజకీయ నాయకుల వెన్నులో సైతం వణుకు పుట్టించిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా దోచుకోవడం, దాచుకోవడం ఏమాత్రం తెలియని ఆ బాలుడు తన కష్టాన్ని విలువలను మాత్రమే నమ్ముకున్నాడు. అవి విలువలని మనం అనుకుంటున్నా ఆ బాలునికి మాత్రం అదేమి తెలియదు. శేషన్ అయినా మరెవరైనా ఆబాలుని దృష్టిలో ఒకటే.  అంటే భారత రాజ్యాంగం, భారత న్యాయవ్యవస్థ ముందు పేద, ధనిక, హోదా అనే ఎటువంటి బేధాలు లేకుండా అందరూ ఒకటే అని నమ్మే బాలుడు కనుకే అంత ధీమాగా అంత మంది పోలీసులను చూసి కూడా తన మాటను స్పష్టంగా చెప్పగలిగాడు.

ధర్మ బద్ధంగా జీవించండి !!

తల్లి  గర్భము  నుండి ! ధనము  తేడెవ్వడు ! 
వెళ్ళి  పోయెడి  నాడు !  వెంట  రాదు !
లక్షాధికారైన- లవణ మన్నమే కానీ !
మెరుగు  బంగారంబు ! మింగ  బోడు !
విత్తమార్జన జేసి ! విర్రవీగుటె  కానీ !
కూడ బెట్టిన  సొమ్ము ! కుడవ  బోడు !
పొందుగా  మరుగైన- భూమి  లోపల బెట్టి !
దాన  ధర్మము  లేక !  దాచి  దాచి !
తుదకు  దొంగల కిత్తురో- దొరల  కవునో !
తేనె జుంటీగ లియ్యవా- తెర  వరులకు !
భూషణ  వికాస !  శ్రీ ధర్మపురి  నివాస !
దుష్ట  సంహార ! నరసింహ ! దురిత దూర !!

వ్యాఖ్య:- మనము తల్లి గర్భము నుండి ఈ లోకములోకి ఉత్తచేతులతోనే వచ్చాము !! ఉత్త చేతులతోనె పోతాము !! పుట్టిన వాడు
గిట్టక తప్పదు!!
 లక్షాధికారి అయినా ఎవరూ బంగారం తినరు కదా !! ఉప్పుకారంతోకూడుకున్న అన్నమే తింటారు!! అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ధనాన్ని సంపాదించి ఎంత విర్ర వీగినా కూడ బెట్టిన సొమ్ము ఎవరై నా తినగలుగుతారా !! తినలేరుకదా !!

దానము,ధర్మము లేక!! దోచి దోచి దాచిన సొమ్ము చివరకు దొంగలకవుతుందా !!
దొరలకవుతుందా !! ప్రభుత్వమే జప్తు చేసు కుంటుందా!! చెప్పటం కష్టం!!
మన కళ్ళ ముందర ఎంత మందిని చూడటం
లేదు!! అవినీతి మహారాజుల జీవితాలు
తారు మారు కావటం లేదా!!
తేనెటీగలు జీవితాంతము కూడ బెట్టిన తేనె ను అవి తినగలుగుతున్నాయా ? తినలేవు!!

మన హిదుత్వ ఆధ్యాత్మిక జీవన విధానం త్యాగమయమే కాని భౌతిక భోగలాలసత్వం  కాదు!!
" త్యాగేనైక అమృతత్వ మానుషుః! న ధనేన
న ప్రజేన" అని వేదం ఘోషిస్తుంది!!

త్యాగము చేయటం వలననే "అమృతత్వం"
సిద్ధిస్తుంది! ధనం వలన గానీ సంతానము
వలన గానీ ప్రజాబలం వలన గానీ లభించదు

ధర్మ బద్ధంగా సంపాదించండి !!
ధర్మ బద్ధంగా జీవించండి !!
ఇదే మన భారతీయ జీవన విధానం !!
హిందూ ధర్మ జీవన వైభవం!!
*********************

కౌటిల్యుని అర్థశాస్త్రం


– పుల్లెల శ్రీరామచంద్రుడు
పేర్కొనేదానికీ, కౌటిల్యుని అర్థశాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదు.

కౌటిల్యుడు తన గ్రంథాన్ని అర్థశాస్త్రమని పేర్కొన్నాడు. దండనీతిని అర్థశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారతాన్ని బట్టి తెలుస్తుంది. భారతంలో ప్రముఖుడైన అర్జునుడు అర్థశాస్త్రంలోని నిష్టాతుడని శాంతి పర్వములో పేర్కొనబడింది. ఇంకోచోట శ్రేష్టులయిన రాజులు అర్థశాస్త్రాన్ని అనుసరిస్తారని కూడా చెప్పబడింది. అయితే దండనీతికి గల ఈ పేరు అంత ప్రచారంలో లేదనే చెప్పవచ్చు. ఆఖరుకు కౌటిల్యుడు కూడా విద్యల సంఖ్యను చెప్పేడప్పుడు అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అనే పేర్లు చెప్పాడు. కానీ ఎక్కడా ప్రత్యేకించి అర్థశాస్త్రమనే మాట వాడలేదు. దానికి బదులుగా దండనీతి అనే మాట ఉపయోగించాడు. అందువల్ల ఈ దండనీతి అనే పేరు బహుళ ప్రచారంలో వున్నది.

కాబట్టి కౌటిల్యుని అర్థశాస్త్రంలోని ప్రధాన విషయ వస్తువు రాజనీతికి సంబంధించినదని, మనకు లభ్యమవుతున్న అతి ప్రాచీన గ్రంథం అర్థశాస్త్రమని చెప్పవచ్చు. అయితే దీనికి అర్థశాస్త్రం అనే పేరు ఎందుకు పెట్టబడింది అనే విషయానికి కౌటిల్యుని వివరణ గమనించండి. మనుష్యుల జీవితాలకు మూలం అర్థం, లేదా “మనుష్యులకు భూమియే అర్థము. అట్టి భూమిని సంపాదించు ఉపాయములు, పాలించు ఉపాయములు, వీనిని గురించిన శాస్త్రము అర్థశాస్త్రము”.

దండనీతి ప్రధాన ఉద్దేశం కూడా యింతకు ముందు లభించునటువంటి భూమిని సమకూర్చుకోవటం, అలా సమకూర్చుకున్న దానిని రక్షించుకోవటం, వృద్ధి చేసుకోవటం, అలా వృద్ధి చేసుకున్న దానిని మంచివారి చేతులలో ఉంచడం. కాబట్టి రెండింటి ప్రధాన ఉద్దేశము భూమి సంపాదన, పరిపాలనములే కనుక దండనీతికి అర్థశాస్త్రము పర్యాయ పదంగా వాడబడినదని కౌటిల్యుని అభిప్రాయం.
#KautilyuniArthasastram
#కౌటిల్యునిఅర్థశాస్త్రం
 #పుల్లెలశ్రీరామచంద్రుడు
*****************

ఏల్చూరి సుబ్రహ్మణ్యం శతజయంతి



ఈరోజు  (26-8-2020) *ఆంధ్రజ్యోతి* ఎడిటోరియల్ పేజీలో వ్యాసం🌹 *నయాగరా నవ్య జలపాతం ఏల్చూరి* // నయాగరా కవుల్లో ఒకడిగా  సుప్రసిద్ధుడు,కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా బహుముఖీనంగా వికసించిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం శతజయంతి నేడు. ఆధునిక తెలుగు కవులలో అచ్చమైన అభ్యుదయానికి ఆదిపురుషుల వంటి కవులలో ఏల్చూరి సుబ్రహ్మణ్యం ప్రథమ శ్రేణీయులు."అరసంకు కేల్చూపిన కవుల దిట్ట", అని ఆరుద్రతో అనిపించుకున్న ఘటికుడు. శ్రీ శ్రీ, ఆరుద్ర,అబ్బూరి వరదరాజేశ్వరరావు కవిత్రయంగా రాసిన "మేమే" కావ్యాన్ని అంకితం పొందిన అసాధ్యుడు ఏల్చూరి. "వేసాలమారి లోకపు మోసాలను తాగి తాగి మూర్ఛిల్లిన ఈ కాసింత కావ్యపాత్రకు  జీససు నీవై కళాసు చేద్దూ ఏసూ! " అంటూ శ్రీశ్రీ అంకిత పద్యాలు కూడా రాశారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యంను శ్రీశ్రీ ముద్దుగా ఏసు, అని పిలిచేవారు. అరసంతో వీరి అనుబంధం అపురూపం. తొలి తరం  అరసం సభల్లో పాల్గొన్న సభ్యుల్లో గణనీయుడు ఏల్చూరి. నవ్య కళాపరిషత్ స్థాపించి, విభిన్న కళల నవ్యత్వ సృష్టికి  మూలస్తంభంగా నిలిచిన నవ్య ఆలోచనా ప్రసన్నుడు. వీరి సారస్వత జీవిత ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఈ అభ్యుదయకవి  ఆగస్టు 26, 1920లో పలనాటి ముఖద్వారం నరసరావుపేటలో పుట్టారు. వీరి స్వగ్రామం ఏల్చూరు. ఈ గ్రామం సుప్రసిద్ధ పురుషుల నివాసంగా సుప్రసిద్ధం. ప్రఖ్యాత  కొప్పరపు సోదరకవుల అవధాన విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. నేటి కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి  (పూర్వాశ్రమ ప్రసాదరాయ కులపతి) కూడా ఇదే గ్రామానికి చెందినవారు. ప్రపంచ ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావు కూడా ఈ ఊరివారే. వీరు ఏల్చూరి సుబ్రహ్మణ్యంకు స్వయంగా సోదరులు. ఇంతటి సారస్వత మూలాల మట్టివాసన పులుముకొని పైకొచ్చిన విలక్షణుడు ఏల్చూరి. ఉద్దండులైన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు, నాయని సుబ్బారావు, అక్కిరాజు రామయ్య, మద్దులపల్లి గురుబ్రహ్మశర్మ, భాగవతుల వెంకటసుబ్బారావు దగ్గర వీరు నరసరావుపేటలో శిష్యరికం చేశారు. తొలినాళ్లలోనే బలమైన సారస్వతమైన  పునాదులు వేసుకున్నారు. నరసరావుపేట నుండి ప్రయాణం విజయవాడకు మరలింది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి  ఇంట్లోనే ఉండి, బి.ఏ పూర్తి చేశారు. కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ముగ్గురు విద్యార్థి దశలో స్నేహితులు. ఆ స్నేహం కవితగా ప్రవహించింది. 1944 ఆగస్టులో వీరి " నయాగరా" కవితా సంకలనం ఆవిష్కృతమైంది. ఈ కావ్యాన్ని అనిసెట్టి సుబ్బారావు - లక్ష్మి దంపతులకు పెళ్లికానుకగా అంకితం చేశారు. ఈ సంకలనాన్ని విశ్వనాథ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం తొలిరోజుల్లో పద్య సాహిత్యపు ఆకర్షణలో పడ్డారు. ఏల్చూరి నృసింహస్వామిపై శతకం కూడా రాశారు. తదనంతరం,  అభ్యుదయం - కమ్యూనిజం బాటలోనే నడిచారు. శ్రీశ్రీ ప్రభావంతోనే ఈ మార్గం పట్టారు. మహాప్రస్థానం సంకలనంలో "మరోప్రపంచం" కవితలోని, నయాగరా వలె ఉరకండి... ప్రేరణతో, వీరి  కవితా సంకలనానికి "నయాగరా" అనే పేరు పెట్టుకున్నారు.అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో అచ్చయిన తొలి కవితా సంపుటిగా దీనికి పేరు దక్కింది. దీనిద్వారా నయాగరా కవులుగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర మూడేళ్ళు చదువుకున్నా, వారి ప్రభావానికి లోను కాలేదు. కవిగా, గురువుగా విశ్వనాథను గౌరవిస్తూనే, తన సొంత పంథాలోనే నడిచారు. శ్రీ శ్రీ ప్రభావంతో కవితా మార్గాన్ని ఎంచుకున్నా, పదబంధాల నిర్మాణంలో తనదైన శైలినే నిలుపుకున్నారు. భావం అభ్యుదయమైనా, రూపంలో నవ్యత్వం, ప్రబంధ బంధురత చాటుకున్నారు. సకల ప్రజా సముద్ధర్త, సుప్తోద్ధృత జీవశక్తి, తమసగర్భ దళనహేతి,బంధీకృత ధనిక శక్తి, రక్తారుణ కుసుమం, బానిస సంద్రం మొదలైన కొంగ్రొత్త పదబంధాలు సృష్టించారు. కవిగా సర్వ స్వతంత్రుడుగా కవితా యానం సాగించారు. విశ్వనాథ, శ్రీశ్రీ ఇద్దరి పట్లా జీవితాంతం గురుభావమే నిలుపుకున్నాడు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం  నా దగ్గర మూడేళ్లు చదువుకొని, అతను ఏమి నేర్చుకున్నాడో నాకు తెలియదు కానీ, నేను అతని దగ్గర నుండి చుట్ట తాగడం నేర్చుకున్నానని విశ్వనాథ చమత్కరించాడు. అలా, గురుశిష్యులకు "చుట్టరికం" కుదిరింది. ఏల్చూరి కవితల్లో "ప్రజాశక్తి" సుప్రసిద్ధం. ఠాగూర్ చంద్రసింగ్, విజయముద్ర కూడా ఎందరినో ఆకర్షించాయి. సోవియట్ సాహిత్యంలో ప్రసిద్ధమైన బోల్షెవిక్ విప్లవాన్ని ఏల్చూరి అద్భుతమైన కవితా వస్తువుగా మలచుకున్నారు. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారం నవంబర్ 7, 1917 నాడు ఈ సంఘటన జరిగింది."నవంబర్ 7" శీర్షికతో సుదీర్ఘమైన కవిత రాశారు. 1956లో విశాలాంధ్ర పత్రిక ఈ కవితను ప్రచురించింది. తెలుగు సాహిత్యంలో తొలి దీర్ఘకవితగా చరిత్రకెక్కింది. చలం, గుర్రం జాషువా కూడా ఏల్చూరికి సారస్వతమైన స్ఫూర్తిని నింపారు. పులుపుల శివయ్య, కొల్లా వెంకయ్య ప్రభావంతో ఏల్చూరి సుబ్రహ్మణ్యం కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి ప్రవేశించారు. ఎన్నో ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎన్నో పత్రికల్లో పనిచేసినా, సోవియట్ భూమి పత్రికతో ఉన్న అనుబంధం సుదీర్ఘమైంది. 1961 నుండి 1988వరకూ, 27సంవత్సరాలపాటు సంపాదకవర్గంలో కీలకమైన సభ్యుడిగా ఉండి, సంపాదకుని హోదాలో పదవీవిరమణ చేశారు. ఇంగ్లీష్ లో వచ్చిన ఎన్నో వందలాది రష్యన్ కవితలను తెలుగులోకి  అనువాదం చేశారు. సోవియట్ భూమి పత్రికలో సుమారు 40 వేల పేజీల అనువాద రచన చేశారు. అభ్యుదయకవిగా ఎంత సృష్టిచేశారో, అంతకు మించిన కృషి పాత్రికేయుడిగా చేశారు. 1940 లో 20 ఏళ్ళ వయస్సులోనే నరసరావుపేటలో "సన్యాసి", అనే పత్రికను, “చిత్ర” అనే పత్రికను స్వయంగా స్థాపించారు. క్రాంతి, పొగాకులోకం, తెలుగుదేశం, నేత, సోషలిస్టు, అభ్యుదయ మొదలైన పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.1941-42 ప్రాంతంలో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రసర్వస్వంకు సహాయ సంపాదకులుగా బాధ్యత వహించారు. జరుక్ శాస్త్రి, రాయప్రోలు రాజశేఖర్ మొదలైనవారితో కలిసి ఆకాశవాణికి ఎన్నో స్క్రిప్ట్లు అందించారు. మద్రాస్ లో కొంతకాలం సినిమాలకు పాటలు కూడా రాశారు. సంగీతలక్ష్మి, పంచకళ్యాణి-దొంగలరాణి, కథానాయకురాలు మొదలైన సినిమాలకు రాసిన పాటలు బాగా హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ తో చిన్ననాటి నుండి స్నేహం ఉంది. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఎన్టీఆర్ ఏల్చూరికి జూనియర్. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర వీళ్ళందరూ బాగా కలిసేవారు. సంగీతలక్ష్మి సినిమాలో ఎన్టీఆర్ హీరో. ఘంటసాల, పి.సుశీల పాడిన “కలో నిజమో కమ్మని ఈ క్షణం” పాట ఎంతో జనాదరణ పొందింది. విజయవాడ స్నేహాన్ని గుర్తుపెట్టుకొని, ఎన్టీఆర్ ఏల్చూరిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు. జగ్గయ్య - ఏల్చూరి ప్రాణస్నేహితుల్లా మెలిగారు. 1960 లో, సుప్రసిద్ధ సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మ రాసిన తొలినవల "చంద్రునికో నూలుపోగు"కు  పీఠిక రాసి, పాఠకలోకానికి పరిచయం చేశారు. పురాణం వారు ఏల్చూరిని గురువుగా భావించేవారు. త్రివేణి పత్రిక సంపాదకులుగా ప్రఖ్యాతులైన కోలవెన్ను రామకోటేశ్వరరావు స్ఫూర్తితో ఏల్చూరి సుబ్రహ్మణ్యం పత్రికా స్థాపన, రచనల వైపు మళ్లారు. దేశిరాజు కృష్ణశర్మ, బెల్లంకొండ రాఘవరావు నరసరావుపేటలో ఏల్చూరికి నైతికస్ఫూర్తిని ఇచ్చినవారు. అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, దేవరకొండ బాలగంగాధర తిలక్, దండమూడి కేశవరావు మొదలైన ప్రతిభామూర్తుల తొలి రచనలు ఏల్చూరివారు స్థాపించిన సన్యాసి పత్రికలోనే అచ్చుకు నోచుకున్నాయి. ఈయన స్థాపించిన నవ్యకళా పరిషత్ లో రెంటాల గోపాలకృష్ణ, సముద్రాల రామానుజాచార్యులు, తిలక్, అనిసెట్టి, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు మొదలైన అభ్యుదయ కవులందరూ సభ్యులే. నయాగరా కవిగా ప్రసిద్ధులైన ఏల్చూరి సారస్వత జీవితం పలు మార్గాల్లో శాఖోప శాఖలుగా విస్తరించింది. జీవితంలో ఎక్కువ భాగం మద్రాస్, హైదరాబాద్ లో గడిచింది. కథలు, కవితలు, కావ్యాలు, వ్యాసాలు, గీతాలు వంటి విభిన్న ప్రక్రియల్లో తన అచ్చపు ముద్రవేసుకున్న అభ్యుదయగామి ఏల్చూరి సుబ్రహ్మణ్యం జీవితం - కవిత్వం రెండూ జలపాతాలే. ప్రతిభ, ప్రేమ రంగరించుకున్న విశేష సారస్వతమూర్తిని, శతజయంతి సందర్భంగా హృదయపు తలపుల్లో తలచుకుందాం. -మాశర్మ🙏
*************************

*వక్రతుండ*



వక్రతుండ నామార్ధం

ఓం గం గణపతయే నమః
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః

గణపతికి వక్రతుండుడని పేరు

. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు,

 కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం.

 వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం.

 వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు.

 వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు.

 దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు.

 గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు.

తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు.

 దుష్టులంటే వ్యక్తులే అని భావించనవసరంలేదు. మనలో కూడా అనేక చెడు సంస్కారాలు,
 నీచపు ఆలోచనలు ఉంటాయి. వాటిని నాశనం చేస్తాడు కనుక గణపతికి వక్రతుండ అని పేరు.

 అంతేకాదు, మనలో చెడు తొలగించినా, మనం మంచిగానే ప్రవర్తించినా, ఎదుటివారు మనకు కీడు చేయవచ్చు. కనుక అటువంటి వారి వక్రమైన ఆలోచనల పాలిట కాలుడై, నంశింపజేయువాడు కనుక గణపతికి వక్రతుండ అన్న నామం వచ్చింది.

పిల్లలు దురలవాట్లకు లోనైనప్పుడు, తల్లిదండ్రులు గణపతికి వక్రతుండ నామంతో జపించి, అర్చించి, వేడుకుంటే, తప్పుత్రోవ పట్టిన పిల్లలు తిరిగి మంచిమార్గంలోకి వస్తారు.

 ఈ వక్రతుండ అన్న నామం చాలా మహిమాన్వితమైంది.

 తంత్రశాస్త్రంలో సదాచారతంత్ర విధానంలో 'ఓం వక్రతుండాయ నమః' అనే వక్రతుండ గణపతి మంత్రానికి ఒక బీజాక్షరం చేర్చి, జపిస్తారు.

 ఈ వక్రతుండ గణపతి మంత్రాన్ని గణపతి గురించి తెలిసినవారి వద్దనుంచి గ్రహించి జపించాలి. ఆ జపం చేయడం వలన ఉపాసకుడి పై చేసిన ప్రయోగాలు విఫలమవుతాయి.

మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది.

ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు సద్గురు శివాయ సుబ్రహ్ముణియ స్వామి వారు.

 ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది.

తొండం యొక్క ప్రస్తావన వచ్చింది కనుక గణపతికి ఉండే వంకర తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి.

ఓం వక్రతుండాయ నమః

వక్రములను తొలగించే ఆ గణపతి మనలోని చెడు భావనలను తొలగించుగాక!!

ఓం గం గణపతయే నమః 🙏🌹

Xxxxcccc
*I salute this student and may his tribe grow..*

*It is acceptable to fail in exam, but it is not acceptable to call Mughals great.*

*A student from Lucknow University, Kunwar Ritesh Singh had given such a unique answer to a question in an exam that set social media abuzz.*

In the exam, the question on *'the contribution of the Mughals in Indian Administration* ' was asked.

In response to that question, the student wrote, *"Sir I humbly ask you to forgive me. According to my knowledge in History, the Mughals were looters ( dacoits, robbers) and they came to India with the aim of looting. Dacoits do not contribute to the progress of a nation. How can people who robbed the treasure of our country and sent it back to their home land ever contribute to the development of our country?* '
*The student also wrote that not only Mughals perpetrate katl-e-aam (mass killing), they also raped the mothers and daughters of our country. In our country thousands and lakhs of widows jumped into the funeral pyres of their husbands due to the fear of the Mughals. According to me, this was the contribution of the Mughals to our nation. The student also wrote that if the Mughals were such good administrators then why couldn't they develop their own country and why did they come to rob our country*.

*In the end the student kunwar Ritesh Singh wrote that ' Sir, I grew up reading the stories of Maharana Pratap and the battle of Haldighati. I cannot tarnish the history of my ancestors, I would prefer to fail the exam rather than glorify the thieving Mughals.*

Xxxxxxxxxxxx

*🙏🙏స్వామి వివెేకానంద:🙏🙏*

మృత్యువును ఎల్లప్పుడూ మరువకుండా ఙ్ఞాపకం   వుంచుకుంటే మనలోని నీచత్వం నశించి, అంతరాత్మ జాగృతమై సదా భగవంతుని స్మరిస్తూ ఆయన కోసం పరితపిస్తూ (ధ్యానిస్తూ) ఉండి శరీరంలో నూతన ఉత్తేజాన్ని కలుగజేస్తుంది, తదనంతరం ఆయనలో ఐక్యం అవుతుంది.‌

*🙏🙏శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏🙏*

Xxxxxxxxxxxx

*నిమిత్తములు వివిధ పద్ధతులు*



జాతాక ఫలిత నిర్ణయంలో అనేక పద్ధతులు ఉన్నాయి. నేరుగా జాతక చక్రం లేకపోయినా, ప్రశ్న చక్రం వెంటనే వేయలేకపోయినా మనం *చూసేదానిని, వినే దానిని, మనసుచే అనుభవించే దానిని* బట్టి కూడా ఫలితం చెప్పడం ఉన్నది. దీనినే క్లుప్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే “ *నిమిత్తము* అంటారు. ఈ నిమిత్తములను అనుసరించి ఫలితనిర్ణయం చేయడం అనేది సాధన చేస్తే చాలా సులువైనది.


వాచీలోని గంటలముల్లును లగ్నంగాను,
నిమిషాల ముల్లును భాగలగానూ,
సెకనుల ముల్లును లిప్తలు గాను గ్రహించి...

దీనికి ఆనాటి గ్రహస్థితిని జోడించి ప్రశ్నచక్రం మనసులోనే తయారు చేసుకుని ఫలితం చెప్పు పద్ధతి ఉన్నది.  *Watch Predictive Teqnic* అంటారు దీనిని.

కొందరు *గవ్వల ప్రశ్న, తాంబూల ప్రశ్న, అంజన ప్రశ్న, దర్పణ ప్రశ్న*  చెబుతారని మనకు తెలుసు. *చిలక జోస్యం* కూడా అత్యద్భుతంగా చెప్పగలిగేవారు పూర్వంలో.

 ఇవన్నీ *దైవఙుని యొక్క మంత్రానుష్ఠానము, ఆయా పద్ధతులలో సునిసిత సాధన* అనే రెండిటింమీదా ఆధారపడి ఉంటాయి. 

వీటిలాగే మనము చూస్తున్న విషయాన్ని బట్టి గ్రహస్థితి అంచనా వేయడం అనేది ఒక పద్ధతి. ఒకవ్యక్తిని నేరుగా చూసి, లేదా అప్పటికప్పుడు తీసి పంపిన ఫోటో ని చూసి  అతని యొక్క జాతకము లేదా ఏప్రశ్న అడిగారో దాని ఫలితము నిర్ణయించే విధానం ఉన్నది.

ప్రస్తుతం మన గ్రూపులో వీలైనప్పుడల్లా అటువంటి సాధన చేద్దాం. నాకూ ఈ విషయం కొత్తనే. కానీ సాధన చేయగా చేయగా మనకు అనుభవం వస్తుంది. జాతక చక్రంద్వారా చెప్పలేనీ కొన్ని విషయాలను ఇటువంటి నిమిత్తాలను బట్టి టక్కున చెప్పవచ్చు.

మీ

 *R. విజయ్ శర్మ*
9000532563
*******************

తులసీ దళాలు

తులసి:

శ్రవణే చ, వ్యతీపాతే, భౌమ భార్గవ భానుషు,
పక్షద్వయాంతే, సంక్రాంతౌ, ద్వాదశ్యాం, సూతకద్వయే,
తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శ్శిరః!!

ఆది, మంగళ, శుక్ర, వారాలలో, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య తిధులలో, జాతాశౌచ, మృతాశౌచాలలో, శ్రవణా నక్షత్రంలో, వ్యతీపాత యోగంలో, సంక్రాంతులలో, తులసీ దళాలు కోయగూడదు.తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!

తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.
తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!

తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.
*******************

శ్రీ అన్నమాచార్య చరితము



                -----   ప్రశస్థి  ------

శ్రీ వెంకటేశ్వరు స్థిరభక్తి  ధ్యానించు
             హరికీర్తనాచార్యు డన్నమయ్య
నేతలౌ రాజుల నిరసించి బ్రతికిన
         హరికీర్తనాచార్యు డన్నమయ్య
సర్వ జీవుల యందు సమత జూపిన యట్టి
         హరికీర్తనాచార్యు డన్నమయ్య
పూటకో  పాటతో పూజయోనర్చిన
          హరికీర్తనాచార్యు డన్నమయ్య
విశ్వకర్తగు శ్రీమహావిష్ణు దేవు 
నందకాంశంబు నందున నరయ బుట్టి
వేల హరికీర్తనంబుల నిలను  బలికి
సన్ను తొందెను జగతిలో నన్నమయ్య

          -------. చరితము ---------

పరగ హూణ  పదవ శతాబ్దంబు నందు
కాశి యందున తీవ్రమౌ  కఱవు వచ్చె
పండితులు కొంద ఱచ్చోట నుండ లేక
వలస వచ్చిరి దక్షిణ వైపు నకును

వారణాసి నుండి వచ్చిన వారిలో
నందవరము నకును కొందఱేగి
యందు స్థిరత నుండి 'నందవరీకు' లై
పెంపు పొందినారు పేరుగాంచి
**********************

*ఆర్తవ వస్త్ర ఫలములు*

సుభగాన్వేత వస్త్రా స్యాధృడ వస్త్రా పతివ్రతా|
క్లౌమ శస్త్రాక్ష తీశాస్యాన్నన వస్త్రా శుభాన్వితా|
దుర్భగా జీర్ణవస్త్రాస్యా ద్రోగిణీ రక్తధారిణీ|
నీలాంభర ధర నారీ విధవా పుష్పిణీ భవేత్|
మలినాంబా సంవీతా దరిద్రాస్యా ద్రజస్వలా|
ధృరువస్త్ర లాభం సమ్యగ్గ దితం మునిపుంగవై||
*తెల్లనిబట్టలు కట్టుకొని రజస్వల అయిన - సో భాగ్యవతి యగును

*తెల్లనిబట్టలు గట్టిదైన - సాధ్వీమణి, గుణవంతురాలు అవును.

*పట్టువస్త్రము గట్టి రజస్వల అయిన- పట్టపురాణి యగును. సుఖశాంతు లుండును

*క్రొత్త వస్త్రము కట్టుకొని రజస్వల అయిన- శుభకరుడు అవును.

*చినిగిన వస్త్రము- దౌర్భాగ్యులు అవును.

*ఎఱ్ఱనిబట్ట కట్టుకొని రజస్వల అయిన- వ్యాధిగ్రస్థులరాలగుని.
 *నల్లనిబట్ట కట్టుకొని రజస్వల అయిన- విధవ, భర్తహినురాలగును

*మాసినబట్టలు కట్టుకొని రజస్వల అయిన దరిద్రుడు అవును. *దిగంబరియై రజస్వల అయిన-విధవ యగును.
*సంకలనం గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు*
****************************

నవగ్రహ జపసంఖ్య*


సూర్యాదీనాం నభోగానాం మంత్రర్విప్రేంద ! వైదికై:|
పౌరాణిక ర్వ విధ్వత్ మౌనం తు జపమాచరేత్ |
రవేర్నగా స్తద్వదిందోరుద్రా దశ కుజస్యవై |
బుధస్య నందా వచసాం పతేరేకోనవింశతిః||
భృగోస్తుషోడశ తథా అధికావింశతి: శనే:|
రాహూరప్టేందవః కేతో ర్నగేందవ ఇమాః పునః |
సహస్ర గుణ తా లబ్ద సంఖ్య కం జప మాచరేత్|
జపానుష్ఠానతః ఖేటాః ప్రీతాళ్ళుభ ఫలప్రదా: ||


సూర్యాది నవగ్రహములకు విహితమైన వైదిక మంత్రములతో గాని, పౌరాణిక
మంత్రములతో గాని మౌనముగా జపము చేయవలెను. జపసంఖ్య- రవికి 7000, చంద్రునికి 11,000, కుజునికి 10,000; బుధునికి 7,000; గురునికి 19,000; శుక్రునికి 16,000,శనికి 23,000; రాహువునకు 18,000; కేతువునకు 17,000 జపము చేసినందున, ప్రీతి పొందిన గ్రహములు శుభఫలము నిచ్చును.
*సంకలనం గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు*
*******************

శ్రీ రాధాదేవి తత్త్వం

*శ్రీ రాధాకృష్ణులు/శ్రీ రాధాదేవి తత్త్వం అంతరార్థం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*రాధాదేవి అమ్మవారి అయిదు శక్తులలో ఒకటి. అమ్మవారి పరిపూర్ణ రూపములు అయిదు అని దేవీ భాగవతం వర్ణిస్తుంది.*


*దుర్గా లక్ష్మీ సరస్వతీ గాయత్రి రాధ అని అయిదు శక్తులు.మొదటి నాలుగు లోక వ్యవహారానికి సంబంధించి నటువంటివి.*


*దుర్గాదేవి ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన జ్ఞాన శక్తి.లక్ష్మి ఐశ్వర్య శక్తి సరస్వతి వాక్బుద్ధిజ్ఞానముల, విద్యా శక్తి.గాయత్రీ దేవి సూర్య మండలాంతర్వర్తి యైన ప్రాణ శక్తి.ఈ నాలుగూ ఈ విశ్వాన్ని నడుపుతాయి. ఇక అయిదవది అయిన రాధాదేవి పరమాత్మయొక్క ఆనంద స్వరూపము, ప్రేమ స్వరూపము. పరమాత్మ ప్రేమవల్లనే ఈ జగమంతా నడుస్తున్నది.*


*ఆ ప్రేమ, ఆనందము - ఈ రెండింటి యొక్క సాకార రూపమే రాధాదేవి. రాధాదేవి ఒక పాత్ర కాదు. రాధాదేవి ఎక్కడుంది? భాగవతంలో ఉందా? లేక పురాణాలలో ఉన్నదా? అని వెతకడం కాదు. ఆమె విశ్వమంతా ఉన్నది. రాధాదేవి పరమాత్మయొక్క ప్రేమానంద శక్తి. అందుకు రాధాదేవి ఉపాసన అత్యంత శుద్ధము. పైగా శుద్ధమైన మనస్సు గల వారు మాత్రమే రాధాదేవిని అర్థం చేసుకోగలరు. ఈ రాధాదేవి అమ్మవారియొక్క పూర్ణ రూపంగా చెప్పబడుతున్నది.*


*లలితా సహస్రంలో కూడా "ఆబాల గోప విదితా", "ప్రేమ రూపా ప్రియంకరీ" అని చెప్పబడుతున్న నామములు రాధాదేవి నామములే అని విజ్ఞులు వ్యాఖ్యానిస్తారు. ఈ రాధాదేవి గోలోకంలో కృష్ణ పరమాత్మతో ఉంటుంది. గోలోకం అనే శాశ్వత లోకం ఒకటి ఉంది. అక్కడ శ్రీకృష్ణుడు విబుధుడై వేణునాద లోలుడై ఉంటాడు. అది కేవలం ఆనంద ధామం, పరమానంద ధామం.*


 *అక్కడ ఆయన శక్తి ప్రేమానంద రూపిణియైన హ్లాదినీ శక్తి రాధాదేవి. హ్లాదము అంటేనే ఆనందము అని అర్థం. హ్లాదినీ, సంధినీ ఇత్యాది శక్తులతో పరమాత్మ లోకాన్ని నడుపుతూ ఉంటాడు. వీటిలో హ్లాదిని ఆనంద శక్తి. సంధినీ ఇత్యాది శక్తులు లోక వ్యవహారాన్ని నడిపే శక్తులు. ఇటువంటి ఆనంద శక్తి అయిన రాధాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి పరమాత్మ యందు ప్రేమ కలుగుతుంది.* 


*ఆ ప్రేమ వల్ల పరమాత్మ ఆనందం లభిస్తుంది. ఆ ఆనందమే సచ్చిదానందము, బ్రహ్మానందము. ఆ బ్రహ్మానంద స్వరూపిణి రాధాదేవి. ఈ రాధాదేవి దర్శనం కోసం బ్రహ్మదేవుడు ఆరువేల సంవత్సరములు తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరును చూడగలిగాడట.* 


*అంటే అర్థం రాధాదేవి దర్శనం అంత తేలిక కాదు అని చెప్పడం దీనిలోని విశేషం. పైగా అమ్మవారి దర్శనం కాలేదు అని దుఃఖపడితే అప్పుడు కృష్ణ పరమాత్మ బృందావనంలో నేను అవతరిస్తాను, అప్పుడు రాధాదేవి కూడా అవతరిస్తుంది అప్పుడు నీవు చూడవచ్చులే అని చెప్తాడు. ఆవిధంగా స్వామి కృష్ణుడై భూమియందు అవతరించినప్పుడు బృందావన సీమను ఎంచుకున్నాడు. నిజానికి బృందావనంలో సూక్ష్మమైన తేజోరూపంగా కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడుట.*


*కానీ ద్వాపర యుగాంతంలో అవతార మూర్తిగా ప్రకటింపబడ్డాడు. అప్పుడు అమ్మవారు రాధాదేవి కూడా అవతరించింది. కృష్ణ పరమాత్మ యశోదానందుల పుత్రుడిగా ఆయన ఉంటే ఈ రాధాదేవి ఒక అయోనిజగా అవతరించింది. వృషభానుడు అనే గోపరాజుకి అనేక జన్మల తపస్సుకు ఫలితంగా అమ్మవారు ఒక పద్మమునందు ఆవిర్భవించి గోచరించారు.*


*వృషభానుడు పరసానుపురమునకు రాజు. ఆ పరసానుపురమే నేటికీ బృందావనంలో బర్సానాధాం అని చెప్పబడుతున్నది. బ్రహ్మగిరి అని పర్వతమది. ఆ పర్వతాన్ని ఆధారం చేసుకొని ఈ పరసానుపురం ఉన్నది. దానికి గోపరాజుగా ఉన్నటువంటి వాడు వృష భానుడు. ఆయన కుమార్తెగా ఈవిడ లభించింది. ఎలాగైతే సీతాదేవి అయోనిజగా జనక మహీపతికి లభించిందో అదేవిధంగా రాధాదేవి లభించింది.* 


*అలా లభించిన రాధాదేవి కృష్ణ పరమాత్మను ఉపాసన చేస్తున్న ప్రేమానంద శక్తి. రాధాకృష్ణుల దివ్యమైన అనుబంధం లౌకికమైనది కాదు. లౌకికమైన ధర్మము కానీ, అధర్మము కానీ రెండూ అక్కడ కనిపించవు. లౌకికమైన ద్వంద్వములేవీ లేవక్కడ. అదొక పరమ పావనమైన నిర్మలమైన అత్యంత శుద్ధమైన సచ్చిదానంద స్థితి. రాధాదేవి, కృష్ణుడు అవిభాజ్య తత్త్వము. అందుకే కృష్ణ రాధా తత్త్వములు ఎటువంటివి అంటే "చంద్ర చంద్రికయోరివా" అని వర్ణిస్తున్నది బ్రహ్మ వైవర్త పురాణం, పద్మపురాణం మొదలైనవి. రాధాదేవి తత్త్వం సామవేదం, ఋగ్వేదంలో కూడా చెప్పబడుతున్నది.* 


*"దేవం-దేవం రాధసే చోదయన్త్య్" అని. ఈ రాధాదేవి చంద్ర చంద్రికయోరివా అంటే చంద్రునికీ, వెన్నెలకీ ఎలాంటి అనుబంధమో కృష్ణునికీ రాధకీ అలాంటి అనుబంధం అని చెప్పారు. దీని భావం వారిద్దరూ అవిభాజ్య తత్త్వము. కృష్ణుని ప్రేమశక్తి, ఆనందశక్తి యే రాధ. కృష్ణుని యొక్క ప్రేమ అంటే మనపై అది కరుణగా వర్షిస్తుంది. కృష్ణుడికి మనపై ఉన్న ప్రేమ, మనకి కృష్ణుడి పై ఉన్న ప్రేమే రాధాశక్తి. జీవుడికి కృష్ణుడి పై ప్రేమ ఉంటే దానికి భక్తి అని పేరు. కృష్ణుడికి జీవుడిపై ప్రేమ ఉంటే దానికి దయ అని పేరు.*


*అందుకు కృష్ణుడిలో దయగానూ, భక్తుడిలో భక్తిగానూ ఉన్నది రాధాదేవి. రాధాదేవి దయలేకపోతే కృష్ణుడి దయ దొరకదు అన్నారు. అంటే భక్తి అనేది ఉంటేగానీ భగవంతుడు దొరకడు. ఆ భక్తి అనే ప్రేమ అందరికీ లభించదు. "ప్రకాశ్యతే క్వాపి పాత్రే" అని నారదుల వారు చెప్తారు. భక్తి, శుద్ధమైన భగవత్ప్రేమ అంత తేలికగా దొరకదు. ఆ ప్రేమ స్వరూపిణి రాధాదేవి. ఆ రాధాదేవిని కార్తిక పూర్ణిమ నాడు కృష్ణ పరమాత్మ ఆరాధించాడు.*


*కృష్ణ పరమాత్మను ఆమె ఆరాధిస్తుంది. అందుకే ఆరాధనా శక్తియే రాధ. ఈ రాధాదేవి ఉపాసన చేస్తే "రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తితా" అని దేవీభాగవతం చెప్తోంది. కార్తిక పూర్ణిమనాడు రాధాదేవిని ప్రత్యేకించి ఆరాధించాలి. దీనికి అనేక తంత్ర శాస్త్రాలలో ఉపాసనా పధ్ధతి ఉన్నది. రాధాదేవి సహస్రం ఉన్నది, రాధాదేవి మంత్రమున్నది, రాధాదేవి స్తోత్రమున్నది.*


 *సుయజ్ఞుడు అనే మహానుభావుడు రాధాకృష్ణుల ఉపాసన చేసాడు అని శాస్త్రం చెప్తున్నది. రాధాదేవి ఉపాసన చేస్తే సర్వమైన వాంఛలూ తీరుతాయిట. అంటే అన్ని అభీష్టములూ నెరవేరుతాయి అన్నారు. అన్ని అభీష్టములు నెరవేరడం అంటే అర్థం అసలు ఏకోరికా లేని పరిపూర్ణ స్థితి వస్తుందని దీనియొక్క భావం.* 

*****************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*అష్టమ స్కంధము - పదిహేడవ అధ్యాయము*

*భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*ఉపధావ పతిం భద్రే ప్రజాపతిమకల్మషమ్|*

*మాం చ భావయతీ పత్యావేవం రూపమవస్థితమ్॥6976॥*

కల్యాణీ, నీవు నీ పతియైన కశ్యపుని యందు నేను ఈ రూపమున పుత్రుడవైయున్నట్లు భావించి, పాప రహితుడైన ప్రజాపతిని సేవింపుము.

*17.20 (ఇరువదియవ శ్లోకము)*
********************


*నైతత్పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథంచన|*

*సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతమ్॥6977॥*

దేవీ! ఇతరులు ఎవ్వరైన అడిగినను  ఈ విషయమును చెప్పవలదు. దైవరహస్యమును ఎంత గోప్యముగా ఉంచిన, అంత సఫలమగును.

*శ్రీశుక ఉవాచ*

*17.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏతావదుక్త్వా భగవాంస్తత్రైవాంతరధీయత|*

*అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభోః॥6978॥*

*శ్రీశుకుడు పలికెను* ఈ విధముగా తెలిపి శ్రీహరి అచటనే అంతర్ధానమయ్యెను. అదితియు భగవంతుడు తన గర్భమున జన్మింపబోవుచున్నాడని తెలిసికొని, దుర్లభమైన ఈ వరప్రాప్తికి మిగుల సంతోషించెను.

*17.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్|*

*స వై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత॥6979॥*

*17.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ప్రవిష్టమాత్మని హరేరంశం హ్యవితథేక్షణః|*

*సోఽదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతమ్|*

*సమాహితమనా రాజన్ దారుణ్యగ్నిం యథానిలః॥6980॥*

అంతట అదితియు తాను ధన్యురాలైనట్లు భావించి మిక్కిలి భక్తితో తన పతిదేవుడైన కశ్యపుని సేవింపసాగెను. కశ్యపుడు తన తపోబలమువలన భగవంతుని అంశ తనలో ప్రవేశించినట్లు తెలిసికొనెను. త్రికాలజ్ఞానియైన ఆయనకు అన్ని విషయములును తెలియును. అతడు ఏకాగ్రచిత్తముతో తన తపస్సు ద్వారా చాల కాలము సంచితమైన వీర్యమును వాయువు అగ్నిని కట్టెయందు ఉంచినట్లు, అదితిగర్భమున ఉంచెను.

*17.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనమ్|*

*హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః॥6981॥*

సనాతనుడైన శ్రీహరియే అదితిదేవి యొక్క గర్భము నందు స్వయముగా అధిష్ఠించియున్నాడు అను విషయము బ్రహ్మదేవునకు తెలిపెను. అప్పుడు ఆ హిరణ్యగర్భుడు భగవంతునియొక్క రహస్యనామములతో ఆ ప్రభువును  ఇట్లు స్తుతింపసాగెను-

*బ్రహ్మోవాచ*

*జయోరుగాయ భగవన్నురుక్రమ నమోస్తు తే|*

*నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః॥6982॥*

*బ్రహ్మదేవుడు పలికెను* - "సకల లోకములయందును ప్రశంసనీయుడైన పరమాత్మా! నీకు జయము అగుగాక! నీవు అనంత శక్తులకు అధిష్ఠాతవు. త్రిగుణములను నియమించువాడవు. వేదవేత్తలను ఆరాధించువాడవు. నీకు పదే పదే నమస్కారములు.

*17.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే|*

*త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే॥6983॥*

అదితికంటె పూర్వము పృశ్నిగర్భమున జన్మించిన వాడవు. వేదజ్ఞానముఅంతయు నీలోనే యున్నది. వాస్తవముగా నీవే విధాతవు. ముల్లోకములను నీ నాభియందే ఉన్నవి. ముల్లోకములకు అతీతమైన వైకుంఠలోకము నీ నివాసస్థానము. నీవు సకలజీవులలో అంతర్యామివై సర్వత్ర వ్యాపించియుందువు. పరమాత్మా! నీకు నమస్కారము.

*17.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*త్వమాదిరంతో భువనస్య మధ్యమనంతశక్తిం పురుషం యమాహుః|*

*కాలో భవానాక్షిపతీశ విశ్వం  స్రోతో యథాంతః పతితం గభీరమ్॥6984॥*

ప్రభూ! ఈ జగత్తునకు ఆదిమధ్యాంతములు నీవే. అనంతశక్తి గల పరమపురుషుడవు నీవే యని వేదములు వర్ణించుచున్నవి. లోతైన ప్రవాహము తనయందు పడిన గడ్డి మొదలగు వాటిని తీసికొనిపోయినట్లు, కాలస్వరూపుడవగు నీవు సంసార ప్రవాహమును అతివేగముతో నా శనమువైపు నడిపింతువు.

*17.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం  ప్రజాపతీనామసి సంభవిష్ణుః|*

*దివౌకసాం దేవ దివశ్చ్యుతానాం  పరాయణం నౌరివ మజ్జతోఽప్సు|*

దేవా! సకలచరాచర ప్రాణుల, ప్రజాపతుల ఆవిర్భావములకు నీవే మూలకారణుడవు. జలములయందు మునిగినవానికి నావ సహాయకారియైనట్లు, స్వర్గమునుండి వెళ్ళగొట్టబడిన దేవతలకు నీవే పరమ ఆశ్రయుడవు".

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తదశోఽధ్యాయః (17)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు పదిహేడవ అధ్యాయము (17)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదిహేడవ అధ్యాయము*

*భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*ఉపధావ పతిం భద్రే ప్రజాపతిమకల్మషమ్|*

*మాం చ భావయతీ పత్యావేవం రూపమవస్థితమ్॥6976॥*

కల్యాణీ, నీవు నీ పతియైన కశ్యపుని యందు నేను ఈ రూపమున పుత్రుడవైయున్నట్లు భావించి, పాప రహితుడైన ప్రజాపతిని సేవింపుము.

*17.20 (ఇరువదియవ శ్లోకము)*

*నైతత్పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథంచన|*

*సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతమ్॥6977॥*

దేవీ! ఇతరులు ఎవ్వరైన అడిగినను  ఈ విషయమును చెప్పవలదు. దైవరహస్యమును ఎంత గోప్యముగా ఉంచిన, అంత సఫలమగును.

*శ్రీశుక ఉవాచ*

*17.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏతావదుక్త్వా భగవాంస్తత్రైవాంతరధీయత|*

*అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభోః॥6978॥*

*శ్రీశుకుడు పలికెను* ఈ విధముగా తెలిపి శ్రీహరి అచటనే అంతర్ధానమయ్యెను. అదితియు భగవంతుడు తన గర్భమున జన్మింపబోవుచున్నాడని తెలిసికొని, దుర్లభమైన ఈ వరప్రాప్తికి మిగుల సంతోషించెను.

*17.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్|*

*స వై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత॥6979॥*

*17.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ప్రవిష్టమాత్మని హరేరంశం హ్యవితథేక్షణః|*

*సోఽదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతమ్|*

*సమాహితమనా రాజన్ దారుణ్యగ్నిం యథానిలః॥6980॥*

అంతట అదితియు తాను ధన్యురాలైనట్లు భావించి మిక్కిలి భక్తితో తన పతిదేవుడైన కశ్యపుని సేవింపసాగెను. కశ్యపుడు తన తపోబలమువలన భగవంతుని అంశ తనలో ప్రవేశించినట్లు తెలిసికొనెను. త్రికాలజ్ఞానియైన ఆయనకు అన్ని విషయములును తెలియును. అతడు ఏకాగ్రచిత్తముతో తన తపస్సు ద్వారా చాల కాలము సంచితమైన వీర్యమును వాయువు అగ్నిని కట్టెయందు ఉంచినట్లు, అదితిగర్భమున ఉంచెను.

*17.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనమ్|*

*హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః॥6981॥*

సనాతనుడైన శ్రీహరియే అదితిదేవి యొక్క గర్భము నందు స్వయముగా అధిష్ఠించియున్నాడు అను విషయము బ్రహ్మదేవునకు తెలిపెను. అప్పుడు ఆ హిరణ్యగర్భుడు భగవంతునియొక్క రహస్యనామములతో ఆ ప్రభువును  ఇట్లు స్తుతింపసాగెను-

*బ్రహ్మోవాచ*

*జయోరుగాయ భగవన్నురుక్రమ నమోస్తు తే|*

*నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః॥6982॥*

*బ్రహ్మదేవుడు పలికెను* - "సకల లోకములయందును ప్రశంసనీయుడైన పరమాత్మా! నీకు జయము అగుగాక! నీవు అనంత శక్తులకు అధిష్ఠాతవు. త్రిగుణములను నియమించువాడవు. వేదవేత్తలను ఆరాధించువాడవు. నీకు పదే పదే నమస్కారములు.

*17.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే|*

*త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే॥6983॥*

అదితికంటె పూర్వము పృశ్నిగర్భమున జన్మించిన వాడవు. వేదజ్ఞానముఅంతయు నీలోనే యున్నది. వాస్తవముగా నీవే విధాతవు. ముల్లోకములను నీ నాభియందే ఉన్నవి. ముల్లోకములకు అతీతమైన వైకుంఠలోకము నీ నివాసస్థానము. నీవు సకలజీవులలో అంతర్యామివై సర్వత్ర వ్యాపించియుందువు. పరమాత్మా! నీకు నమస్కారము.

*17.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*త్వమాదిరంతో భువనస్య మధ్యమనంతశక్తిం పురుషం యమాహుః|*

*కాలో భవానాక్షిపతీశ విశ్వం  స్రోతో యథాంతః పతితం గభీరమ్॥6984॥*

ప్రభూ! ఈ జగత్తునకు ఆదిమధ్యాంతములు నీవే. అనంతశక్తి గల పరమపురుషుడవు నీవే యని వేదములు వర్ణించుచున్నవి. లోతైన ప్రవాహము తనయందు పడిన గడ్డి మొదలగు వాటిని తీసికొనిపోయినట్లు, కాలస్వరూపుడవగు నీవు సంసార ప్రవాహమును అతివేగముతో నా శనమువైపు నడిపింతువు.

*17.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం  ప్రజాపతీనామసి సంభవిష్ణుః|*

*దివౌకసాం దేవ దివశ్చ్యుతానాం  పరాయణం నౌరివ మజ్జతోఽప్సు|*

దేవా! సకలచరాచర ప్రాణుల, ప్రజాపతుల ఆవిర్భావములకు నీవే మూలకారణుడవు. జలములయందు మునిగినవానికి నావ సహాయకారియైనట్లు, స్వర్గమునుండి వెళ్ళగొట్టబడిన దేవతలకు నీవే పరమ ఆశ్రయుడవు".

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తదశోఽధ్యాయః (17)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు పదిహేడవ అధ్యాయము (17)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
**********************

అద్వైతము : పురాణనామచంద్రిక


ఇది స్మార్తమతము. ఇందు బ్రహ్మమని అవిద్యయని రెండుపదార్థములు కలవు. అందు బ్రహ్మము సత్యము, జ్ఞానానందాత్మకము, నిర్వికారము, నిరవయవము, నిత్యము, నిర్దోషము, విభువు. (సత్యము = కాలత్రయముచే బాధింపఁదగనిది. నిర్వికారము = రూపాంతరములు లేనిది. నిరవయవము = అవయవములు లేనిది. నిత్యము = కాలత్రయములయందు ఉండునది. విభువు = వ్యాపనము కలిగి ఉండునది.)
అవిద్య అపారమార్థికము, సదసద్విలక్షణము, జడము, సవికారము, సావయవము, అనాది సాంతము, అజ్ఞానరూపము. (అపారమార్థికము = మిథ్యా భూతము. బ్రహ్మతత్వజ్ఞానముచేత నివర్తించునది. ఇది వ్యావహారికసత్త అని చెప్పఁబడుచున్నది. వ్యవహారదశలో సత్తుగా తోఁచును కాని పరమార్థము కాదు. సదసద్విలక్షణము = సత్తనఁగా బ్రహ్మము, అసత్తనఁగా తుచ్ఛమయిన శశశృంగాది; పారమార్థికసత్తయిన బ్రహ్మముకంటెను ప్రమాణసిద్ధముగాని తుచ్ఛముకంటెను విలక్షణమైనది. బ్రహ్మమువలె పారమార్థికము కాదు, తుచ్ఛమువలె ప్రమాణములకు అవిషయమును కాదు.)

ఈయవిద్య సత్వరజస్తమోరూపగుణత్రయాత్మకము. దీనికి ఆచ్ఛాదకశక్తి, విక్షేపశక్తి అని రెండుశక్తులు ఉన్నవి. ఆచ్ఛాదకశక్తికల యవిద్యచేత ఆవరింపఁబడిన బ్రహ్మమునకు చీఁకటిలో ఉన్నమనుష్యునకువలె స్వస్వరూపజ్ఞానము చెడి విక్షేపరూపమయిన దేవతిర్యఙ్మనుష్యాది భేదజ్ఞానము కలుగుచున్నది. ఈదేవాదిభేదములు అన్నియు అవిద్యాపరిణామములుగాని పరమార్థములు కావు.

ఈచైతన్యరూపమయిన బ్రహ్మము శుద్ధ చైతన్యము, మాయావచ్ఛిన్నచైతన్యము, అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము, వృత్త్యవచ్ఛిన్నచైతన్యము, విషయావచ్ఛిన్నచైతన్యము అని అయిదు భేదములుగలది. శుద్ధమైన బ్రహ్మస్వరూపమునకు ఈభేదములు అవిద్య మొదలుగాఁగల యుపాధులచేత కలుగుచున్నవి.

అందు శుద్ధచైతన్యము అనునది శుద్ధబ్రహ్మస్వరూపము.

మాయావచ్ఛిన్నచైతన్యము అనునది ఈశ్వరుఁడు. అతఁడె జగత్సృష్ట్యాదికర్త, సర్వాంతర్యామి, సగుణ బ్రహ్మము.

అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము అనునది జీవుఁడు. ఆకాశగతములయిన సూర్యాదితేజములు తటాకాదులయందు ప్రతిబింబించునట్లు తేజోమయమయిన బ్రహ్మచైతన్యము అవిద్యాపరిణామములయిన అంతఃకరణములయందు ప్రతిఫలించుచున్నది. ఇందు బ్రహ్మము బింబము, అంతఃకరణములయందు తోఁచునట్టివి ప్రతిబింబములు, అవియె జీవులు. సూర్యాదిబింబములకును జలములయందు తోఁచునట్టి ప్రతిబింబములకును భేదము లేనట్లు, బ్రహ్మజీవులకు భేదము లేదు. ప్రతిబింబభూతజీవులకును అంతఃకరణ రూపోపాధిభేదమే కాక స్వరూపభేదము లేదు.

వృత్త్యవచ్ఛిన్నచైతన్యము అనునది అంతఃకరణ పరిణామరూపవృత్తులయందు ప్రతిఫలించు చైతన్యము. ఇదియె జ్ఞానము అని చెప్పఁబడుచున్నది. ఇది ప్రత్యక్షాదిభేదములచే అనేకవిధములు కలదిగా ఉన్నది.

విషయావచ్ఛిన్నచైతన్యము ఘటపటాదులు.

ఇందు మాయావచ్ఛిన్నచైతన్యమైన యీశ్వరుఁడు మొదట సృజింపఁగల ప్రాణివర్గముల తారతమ్యమునకు హేతువగు కర్మములను తోడుచేసికొని అపరిమితశక్తియుక్తమైన మాయను వశపఱిచికొని నామరూపాత్మకమైన సకలప్రపంచమును సృజియింప సంకల్పించి మొదట ఆకాశాది పంచభూతములను అపంచీకృతములను పుట్టించెను. అందు ఆకాశమునకు శబ్దమును, వాయువునకు శబ్దస్పర్శములను, తేజస్సునకు శబ్దస్పర్శరూపములను, అప్పునకు శబ్దాదులతోడ రసమును, పృథివికి శబ్దాదులతోడ గంధములును గుణములు.

పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశమును అను నీపంచభూతములును, గుణత్రయాత్మకమయిన యవిద్య యొక్క కార్యములుగాన ఇవియు త్రిగుణాత్మకములు. సత్యగుణయుక్తములు అయిన యీభూతములచేత త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనెడి జ్ఞానేంద్రియములు, మనోబుద్ధ్యహంకారచిత్తములు అనెడి యంతఃకరణ పరిణామములును పుట్టుచున్నవి. రజోగుణయుక్తములు అయిన యీభూతములచేత వాక్పాణిపాదపాయూపస్థములు అనెడి కర్మేంద్రియములు పుట్టుచున్నవి. రజోగుణముతోకూడిన భూతముల చేత ప్రాణాపాన వ్యానోదాన సమానములు అను పంచప్రాణములు పుట్టుచున్నవి.

ఈ పంచభూతములుచేతను, జ్ఞానకర్మేంద్రియములచేతను, పంచప్రాణములచేతను, మనోబుద్ధులచేతను సూక్ష్మశరీరము పుట్టుచున్నది. ఈశరీరము లింగశరీరము అని చెప్పఁబడును. ఈశరీరము పరలోకయాత్రకు అనుకూలమై మోక్షపర్యంతము ఉండునది.

తమోగుణముతోడ కూడిన యపంచీకృత భూతములచేత పంచీకృతభూతములు పుట్టుచున్నవి. పంచీకరణము అనఁగా ఆకాశాది పంచభూతములను మొదల ప్రత్యేకము రెండుగాభాగించి అందు ఒక్కొక్క యంశమును నాలుగేసిగా భాగించి ఆనాలుగింటిలో ఒక్కొక్క భాగమును భాగింపని యొక్కొక్క సగముతో చేర్చి కలపఁగా పంచీకృతభూతములు ఏర్పడియె. అందు ఆకాశార్ధమును కడమభూతములలో ఎనిమిదింట ఒక్కొక్కభాగమును చేర్పఁగా పంచీకృతాకాశము. ఇట్లు వాయ్యాదులను ఊహింపవలయును.

ఈ పంచీకృత భూతములచేతనే అండములును, వానికి లోఁబడిన పదునాలుగులోకములును, జరాయుజాది దేహములను పుట్టుచున్నవి. (జరాయుజములు = జరాయువువలనపుట్టునవి = మనుష్యాదులు. జరాయువు = గర్భముతిత్తి. అండజములు = అండమువలన పుట్టునవి = పక్షిసర్పాదులు, అండము = గ్రుడ్డు. స్వేదజములు = చెమటవలన పుట్టునవి = నల్లి మొదలయినవి. ఉద్భిజ్జములు = భూమిని చీల్చుకొని పుట్టునవి = వృక్షాదులు.)

ఇట్టి ప్రపంచమునకు మూలప్రకృతి పరిణామ్యుపాదానకారణము. ఘటమునకు మన్ను వంటిది. పరిణామి అనఁగా ఒక రూపము నుండి మఱియొక రూపమును పొందునది. బ్రహ్మము ప్రపంచమునకు వివర్తోపాదానకారణము; అనఁగా వెండి అను భ్రాంతికి శుక్తి వలె ప్రపంచభ్రమమునకు అధిష్ఠానము. (అధిష్ఠానము = స్థానము.) పరమార్థమయిన బ్రహ్మమునందు ప్రపంచమునకు అధ్యాసము గలుగుచున్నది. (అధ్యాసము = భ్రమము.)

ఇట్టి ప్రపంచరూపకార్యముల నాశము ప్రళయము అనఁబడును. అది నిత్యప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృతప్రళయము, ఆత్యంతికప్రళయము అని నాలుగువిధములు కలది. అందు ఆత్యంతిక ప్రళయము బ్రహ్మసాక్షాత్కారముచేత అవిద్యారూప కారణముతోడ సకల ప్రపంచనివృత్తి. (బ్రహ్మసాక్షాత్కారము = తనకును బ్రహ్మమునకును ఐక్యప్రత్యక్షము.) ఈసాక్షాత్కారము శ్రవణ మనన నిదిధ్యాసనములతోఁగూడిన వేదాంతవాక్యములచేత కలుగుచున్నది. (శ్రవణము = ఆచార్యునివలన న్యాయయుక్తములు అయిన యర్థములను వినుట. మననము = విన్నయర్థములందు విరోధశంకలు కలుగునప్పుడు దానిని పోఁగొట్టునట్టి మానసికమగు యుక్తివిచారము. నిదిధ్యాసనము = అనాదివాసనచేత విషయములయందు ప్రవర్తించి ఉండునట్టి మనసును విషయముల నుండి యీడ్చి ఆత్మయందు కదలనీక నిలుపుట.) ఇది సాక్షాత్కారరూపమయిన బ్రహ్మైక్యజ్ఞానమునకు చేరిన కారణము. ఈ జ్ఞానము పాపక్షయముచేత కలుగుచున్నది. కర్మానుష్ఠానముచేత పాపక్షయము గలుగును.

ఈ శ్రవణాదులయందు మోక్షేచ్ఛగలవారికే అధికారము. ఆమోక్షేచ్ఛయందు నిత్యానిత్యవస్తువివేకము, విషయఫలవైరాగ్యము, శమదమోపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ అనునవి ప్రయోజకములు. (శమము = అంతరింద్రియనిగ్రహము. దమము = బహిరింద్రియనిగ్రహము. ఉపరతి = చాంచల్యము లేమి. తితిక్ష = ఓర్పు. సమాధానము = ఒకచోటనే మనసు నిలుపుట. శ్రద్ధ = గురువులయందును శాస్త్రముల యందును విశ్వాసము.)

నిర్విశేషమయిన బ్రహ్మమును సాక్షాత్కరింప సామర్థ్యము లేనివారు సవిశేవిబ్రహ్మోపాసనము చేయవలయు. వీరికి సగుణబ్రహ్మోపాసనముచేత మనసు స్వాధీనపడఁగానే నిర్విశేష బ్రహ్మము తానే తోఁచును. సగుణబ్రహ్మోపాసనము చేయువారు అర్చిరాది మార్గముగా బ్రహ్మలోకమును పొంది అందు శ్రవణాదులచేత సాక్షాత్కారము కలిగి బ్రహ్మతోడ మోక్షమును పొందుచున్నారు. కర్మనిష్ఠులు ధూమాది మార్గముగా పితృలోకమును పొంది అందు సుఖానుభవములు చేసి మరల పుణ్యపాపానురూపముగ మనుష్యాది యోనులయందు పుట్టుచున్నారు. నిషిద్ధకర్మములను ఆచరించువారు రౌరవాదినరకములను పొంది అందు పాపానురూపంబుగా దుఃఖములను అనుభవించి మరల కుక్క నక్క మొదలుగాఁగల తిర్యగ్యోనులయందు స్థావరాదియోనులయందును పుట్టి నశించుచున్నారు. నిర్గుణ బ్రహ్మోపాసనము చేయువారు ప్రారబ్ధ కర్మములను మాత్రము అనుభవించి కడమ పుణ్యకర్మములను మిత్రులయందును పాపకర్మములను శత్రువులందును విడిచి కైవల్యమునుపొంది, నిరతిశయానందమును అనుభవించుచున్నారు.
*అద్వైతము : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) నుంచి సేకరణ*
***********************************

కరోనా గూర్చి తెలుసుకోండి

జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది.

* లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు.

* 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది.

* సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. అందులోనూ నెగెటివ్ వచ్చింది.

* రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుండటంతో... ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కూడా *ఆర్ టీ-పీసీఆర్* పరీక్ష చేయగా కొవిడ్ లేదు.

* ఈ పరిస్థితుల్లో ఛాతీ *CT* *స్కాన్* తీయించిన వైద్యులు.. కొవిడ్ గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారు.

పరీక్షలు చేస్తే వెల్లడైన ఫలితాలనే ఎవరైనా నమ్ముతారు. వైరస్ ఉంటే ఉన్నట్లు.. లేకపోతే లేనట్లుగా భావిస్తారు.

* కరోనాగా నిర్ధారిస్తే.. దానికి తగ్గట్లుగా చికిత్స పొందుతూ మానసికంగా సన్నద్ధమవుతారు.

* లేదని తేలితే.. వైరస్ సోకలేదని ఊరట పొందుతారు.

* అయినా లక్షణాలు కనిపిస్తుంటే.. సీజనల్ వ్యాధులు కావచ్చులే అని అనుకునే అవకాశాలూ ఉన్నాయి.

* అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమించి, చివరకు ‘ *CT* *స్కాన్* ’ ద్వారా కొందరిలో కొవిడ్ ను నిర్ధారించాల్సి వస్తోంది.

* ప్రస్తుతం ఈ తరహాలో కరోనా నిర్ధారణ అవుతున్నవారు కూడా గుర్తింపు సంఖ్యలోనే వెలుగులోకి వస్తున్నారు. వీరిలో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది.

* కొవిడ్ ను గుర్తించి, కచ్చితమైన చికిత్స అందించకపోవడం వల్ల ఈ తరహా వ్యక్తుల్లో కొన్నిసార్లు పరిస్థితి విషమించి... ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది.

* కరోనా నిర్ధారణ కాకపోయినా.. లక్షణాలు మాత్రం కొనసాగుతుంటే.. మరింత లోతుగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

* నాలుగడుగులు వేస్తే ఆయాసం వస్తున్నా... రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

* వైరస్ ఉందా? లేదా? తెలిసేదెలా?

కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్రమేణా పెరిగిపోతుంటాయి. ఆ తర్వాత రోగ నిరోధక శక్తి సామర్థా్యన్ని బట్టి తగ్గిపోతాయి.

* శరీరంలోకి ప్రవేశించిన వైరస్ ను *యాంటీజెన్* అంటారు.

* వైరస్ ను ఎదుర్కోవడానికి మన శరీరం స్పందిస్తుంది దీన్ని *యాంటీబాడీస్* అంటారు.

* ఈ *యాంటీబాడీస్* రెండు రకాలు..
1. *ఐజీఎం* (ఇమ్యునోగ్లోబులిన్స్ -ఎం)
2. *ఐజీజీ* (ఇమ్యునోగ్లోబులిన్స్ -జి)

వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తొలి 7 రోజుల వరకూ యాంటీబాడీస్ ఉండవు.

7 రోజుల తర్వాత మొదట ఐజీఎం తయారవుతాయి.

పరీక్షల్లో ఐజీఎం పాజిటివ్ ఉంటే.. తాజాగా ఇన్ ఫెక్షన్ బారినపడినట్లుగా అర్థం. ఇవి 7-21 రోజుల వరకూ శరీరంలో ఉంటాయి.

ఆ తర్వాత ఐజీజీగా రూపాంతరం చెందుతాయి. ఐజీజీలు కూడా సాధారణంగా వైరస్ శరీరంలో ప్రవేశించిన 14వ రోజు నుంచి తయారవుతాయి.

ఐజీజీ ఉన్నట్లుగా ఫలితాల్లో నిర్ధారిస్తే.. ఆ వ్యక్తికి వైరస్ వచ్చి వెళ్లిపోయిందని అర్థం.

సాధారణంగా 28 రోజుల తర్వాత శరీరం నుంచి వైరస్ పూర్తిగా వెళ్లిపోయి, కేవలం ఐజీజీ యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి.

ఒకవేళ రోగికి వైరస్ సోకిందా? లేదా? అని కచ్చితంగా తెలియాలంటే..

ఆర్ టీ-పీసీఆర్* తో పాటు *ఐజీఎం*, *ఐజీజీ* పరీక్షలూచేయాలి.
ఈ పరీక్షలకు సుమారు రూ.600 -1000 వరకు ఖర్చవుతుంది.

అయితే ఇప్పటివరకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వైరస్ ను తొలిదశలో గుర్తించడానికి ఆర్ టీ-పీసీఆర్ పరీక్షనే ప్రామాణికం.

సీటీస్కాన్ లో గుర్తిస్తే కరోనాగా చికిత్స
ఛాతీ స్కాన్ చూసినప్పుడు.. అందులో ఐదు స్థాయులను పరిశీలిస్తాం.

ఐదో స్థాయిలో ఉంటే వందశాతం కొవిడ్ గానే పరిగణిస్తాం.
2వ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే కొవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉన్నట్లుగా భావిస్తాం.

సీటీ స్కాన్ ను పరిశీలించడం ద్వారా శ్వాసకోశాల్లో వైరస్ ఎక్కడెక్కడ వ్యాపించింది? దాని తీవ్రత ఎంతనేది తెలిసిపోతుంది.

కొంచెం ఆలస్యమై నిమోనియా చేరితే..
అప్పుడు బ్రాంకోస్కోపీ చేసి శ్వాసకోశాల్లో ద్రావణాలను పరీక్షిస్తే అందులో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది.

బ్రాంకోస్కోపీ క్లిష్టమైన ప్రక్రియ. ఇది అందరిలోనూ సాధ్యం కాదు.

కొవిడ్ లక్షణాలు తగ్గకపోతే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేరడం ముఖ్యం.

ఎందుకంటే.. వైరస్ తీవ్రత తగ్గినా.. దాని ప్రభావంతో శరీరంలోని రక్తనాళాల్లో వాపు (ఇన్ ఫ్లమేషన్ ) వస్తుంది.

ఫలితంగా రక్తనాళాల్లో పొర దెబ్బతిని, రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయి.

వేర్వేరు కారణాల వల్ల పరీక్షల్లో నెగెటివ్ రావచ్చు.

ఇది కొత్త జబ్బు కాబట్టి.. దీని పరీక్షలకు తగినంత నైపుణ్యం కూడా అవసరం.

ఆర్ టీ-పీసీఆర్ లో 60-70 శాతమే కచ్చితత్వం ఉంటుంది.

సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన ( 0-5 ) రోజుల్లో ఎక్కువమందిలో లక్షణాలు కనిపించవు.
( 5-14 ) రోజుల్లో అంటే ఆ 10 రోజుల వ్యవధిలో లక్షణాలు వెలుగులోకి వస్తాయి.
( 14-21) రోజుల్లో వైరస్ తగ్గడం మొదలవుతుంది. ( 21-28 ) రోజుల్లో పూర్తిగా వెళ్లిపోయి శరీరంలో యాంటీబాడీస్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయి. ఈ సమయాల్లో ఎప్పుడు నమూనాను స్వీకరించామనే దానిపై కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది.

కరోనా లేదని తేలినా.. ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి?

ఆయాసం ఉన్నప్పుడు

జ్వరం తగ్గకుండా వస్తున్నప్పుడు

దగ్గు ఆగకుండా ఉన్నప్పుడు

నీరసం, నిస్సత్తువ పెరిగినప్పుడు

రక్తంలో ఆక్సిజన్ 94% కంటే తక్కువైనప్పుడు

ఎందుకిలా జరుగుతోంది?

ప్రస్తుతం ఆర్ టీ-పీసీఆర్ , యాంటీజెన్ పరీక్షల ద్వారా కరోనాను నిర్ధారిస్తున్నారు.

దీన్ని నిర్వహించడానికి, నమూనా సేకరణలోనూ తగిన నైపుణ్యం, శిక్షణ అవసరం.

నమూనాను సరిగా సేకరించకపోయినా, తగినంత మోతాదులో తీయకపోయినా, తీసుకున్న నమూనాను ఎక్కువకాలం నిల్వ ఉంచినా, నిల్వ చేయడంలోనూ తగిన ప్రమాణాలు పాటించకపోయినా..
వైరస్ వృద్ధి చెందకముందే నమూనాను తీసుకున్నా.. ఫలితం తారుమారు కావచ్చు.

ఉదాహరణకు కొన్నిసార్లు వైరస్ వచ్చిన తర్వాత 7-10 రోజుల మధ్య గనుక పరీక్ష చేయించుకుంటే.. అప్పటికే ఐజీఎం అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో ఐజీఎం వైరస్ పై దాడి చేస్తుంటుంది. వైరస్ క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గనుక పరీక్ష చేయించుకుంటే.. వైరల్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు నెగెటివ్ గా కనిపిస్తుంది.

* అంటే ఆ వ్యక్తిలో వైరస్ ఉన్నా పరీక్షల్లో వెల్లడయ్యే అవకాశాలు చాలా తక్కువ.

-డాక్టర్ శశికళ,
పరిశోధన,
అభివృద్ధి విభాగం సంచాలకులు,
ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ.
**********************

అన్నమాచర్య చరితము -- 2

నారాయణయ్యను నందవరీకుడు
          కాపురంబుండె నా గ్రామమందు
బాల్యంబు నందునా బాలున కెందుకో
          చదువు లబ్బకనుండె సక్రమముగ
గురువులు పెట్టెడి గురుహింస వలనను
           విపరీత మైనట్టి విసుగుబుట్టె
బహు విరక్తియు బుట్టి బ్రతుకన్న యతనికి
           చావంగ దలచెను చదువు నొదలి
అంత చింతలమ్మ యను గ్రామదేవత
మందిరంబు చెంత మహినియున్న
పుట్ట లోన చెయ్యి పెట్టెనాతం డంత
సర్ప కాటు తోడ చచ్చు టకును 

అంత టమ్మవారు యద్భుత మహిమతో
కరుణ తోడ నతని గావ నెంచి
బాలు నెదుట తాను  ప్రత్యక్ష మయ్యును
పరమ వత్స లతతొ బలికె నిట్లు

"సాహసం బేల నీకిట్లు చచ్చుటకును
కలత చెందకు బాలక కలదు శుభము
తప్పకను నీదు మూడవతరము నందు
బాలుడుదయించు శ్రీహరి భావమందు "

అంతట శ్రీ నారాయణ
సంతోషము పొంది మిగుల స్వాంతము నందున్
గెంతుచు వెళ్ళియు గృహముకు
పంతుళ్ళకు జెప్పి మిగుల పరవశమొందెన్

అవని నారాయణయ్యయు యమ్మ కృపన
పెఱిగి పెద్దయ్యు ద్విజులందు పెంపు పొందె
పరిణయంబాడి పుత్రుని బడసి యతడు
పేరు నారాయణ నుచును బెట్టు కొనియె

నారాయణు కృప వల్లను
నారాయణ సూరి బెఱిగి నాలుగు చదువుల్
పారాయణ మొనరించియు
పారీణత పొందె మిగుల పండితు లందున్

గోపాలుని మధుసూదన రావు
**********************

ధార్మిక గీత - 2

మనసును  మాట చేతయును
           మాన్యుల కుండును నేక పద్ధతిన్ ,
ననయము వారి జీవనము
           నందరి కుండును మార్గ దర్శియై,
మనసును మాట చేత నణు
           మాత్రము పొంతన లేక నుంద్రు దు
ర్మనుషులు లోకమందు ,
           మాన్యత లేకను మంచి లేకయున్.

గోపాలుని మధుసూదన రావు
                                     *****
          *శ్లో:- మన స్యేకం  వచ స్యేకం ౹*
                 *కర్మ ణ్యేకం మహాత్మనామ్*౹
                 *మన స్యన్యత్ వచ స్యన్యత్*౹
                 *కర్మ ణ్యన్యత్ దురాత్మనామ్*౹౹
                                        *****
*భా:- సన్మార్గులకు మనసు, మాట, చేత(పని) ఒకే విధంగా ఉంటాయి. ఇక దుర్మార్గులకు మనసులో ఒకటి, మాటలో మరొకటి, క్రియలో వేరే ఒకటి  ఉంటాయి.  మనం తలచే భావన,  మాట్లాడే మాట, చేసే పని ఒకే విధంగా ఉండాలి అని భావము. ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి  ఎదగాలంటే త్రికరణశుద్ధి అవసరము. ఈ త్రికరణ శుద్ధి వల్లనే  రాముడు, హరిశ్చంద్రుడు, శిబి, రంతి దేవుడు మున్నగు రాజన్యులు ప్రజారంజనముతో కీర్తిప్రతిష్ఠలను గడించి, శిఖరాగ్రాన భాసించ గలిగారు. సుయోధనుడు, కర్ణుడు, కంసుడు, శిశుపాలుడు, కీచకుడు మున్నగువారు సమర్థులైనప్పటికిని, దుస్సంగతివలన, మనోవాక్కాయలలో పొంతనలేనందున, దురాగతాలకు పాల్పడి, పాపకూపంలో కూరుకుపోయి చరిత్ర హీనులైనారు. ఇహపరసాధనకు కూడ త్రికరణాల ఐక్యత, పవిత్రత ఆలంబనము. భగవంతుని  అనుగ్రహప్ర్రాప్తికి  చిత్తశుద్ధి ; సత్యవాక్కు ; సత్ క్రియాచరణ  శాశ్వత సోపానాలని గ్రహించి మానవాళి పురోగమించాలని సారాంశము.*
                                   *****
                   *సమర్పణ   :   పీసపాటి*
******************

గురుర్విష్ణుః

గురుర్విష్ణుః సత్త్వమయో రాజసశ్చతురాననః ।
తామసో రుద్రరూపేణ సృజత్యవతి హంతి చ।।

ఆది యందు శ్రీ గురు పరబ్రహ్మ యొకరే గలరు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపములు దాల్చి సృష్టి, స్థితి, సంహారములు చేయుచున్నారు. ఆది మధ్యాంతములయందు శ్రీ గురువు యొక్కరే గలరు.
*********************

పలకరింపు

_*మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.*_

_*పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*_

_*నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*_

_*ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_

_*పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.*_

_*ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పని చేస్తాయి.*_

_*పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.*_

_*ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు తీయని పలకరింపు అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోం చేస్తున్నపుడు నన్ను చాలా మందే పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని పాత్రలో వివరిస్తుంది.*_

_*డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.*_

_*లాక్‌డౌన్‌ మూలానా ఇంట్లోనే అందురున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో యియర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.*_

_*మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.*_

*కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం.*

*నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు.*

_*''నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలికన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !*_

_*✅ అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు !
************************

రామాయణమ్. 43


మంధరా ! రాముని పట్టాభిషేకము తప్పించే ఉపాయం ఆలోచించవే ! వాడిని ఎలాగైనా సరే అడవులకు పంపాలి ! అడిగింది కైక .
.
పూర్వము నీవే నాకు ఒక విషయము చెప్పావు గుర్తులేదా!  అయితే చెపుతా విను !  మహారాజు శంబరాసురునితో యుద్ధానికి వెళ్ళి నప్పుడు నీవు కూడా ఆయన వెంట వెళ్ళావు !
ఆ యుద్ధంలో ఒకసారి గాయాలబారిన పడి స్పృహకోల్పోయిన దశరధుడిని రాక్షసులబారినుండి నేర్పుగా నీవు తప్పించావు !. అందుకు రాజు సంతోషించి నీకు రెండువరాలిచ్చాడు ! నీవు అవసరమయినప్పుడు ఆ వరాలు కోరుకుంటానన్నావు అందుకు రాజు సరే నన్నాడు ! గుర్తుకు వచ్చిందా ! .
.
ఇదే సరయిన సమయం ఆ రెండు వరాలు ఇప్పుడు కోరుకో !
నీ కొడుకు భరతుడికి రాజ్యపట్టాభిషేకము ,రామునికి పదునాలుగేండ్లు అరణ్యవాసము .
.
 పదునాలుగేండ్లు భరతుడు పరిపాలించెనా ! జనం మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతాడు ,రాజ్యాధికారం స్థిరమవుతుంది ! అని చెప్పి, నీవు నిరాలంకారవై ,మలినవస్త్రాలు ధరించు ! నీ మగడు వచ్చే వేళ అయింది ! ఆయనతో మాటాడకు మొదట బెట్టు చేయి!.అని నూరిపోసింది మంధర!.
.
ఇలా పలికిన మంధర కైక కంటికి మనోహరంగా కనపడ్డది ! రాజహంసలాగ ఉన్నావే నీవు అంటూ ప్రశంసించింది.
నీ గూని కూడా ఎంత అందంగా ఉన్నదే ! దానికి బంగరుమాల తొడిగి అలంకరిస్తాను భరతుడు రాజు కాగానే !
.
ఈ మాటలు,వరాలమూటలు తరువాత , ముందు కాగల కార్యం చూడమ్మా కైకమ్మా ! రాజు వచ్చే వేళ అయ్యింది అని హెచ్చరించింది దాసి మంధర!.
.
వంటికున్న అన్ని ఆభరణాలు తొలగించి ,మాసిన చీర ధరించి మంధరతో కలసి కోపగృహప్రవేశం చేసింది కైక!.
.
కైకను చూడకుండా దశరధుడుండలేడు ,కౌసల్యా మందిరానికి ఎప్పుడోగాని పోడు!
.
ఆమె ఆయనకు కామసంజీవనౌషధి,ఆమె పెడమొగమయితే ఆయనకు నరకమే ! రాముని పట్టాభిషేక వార్త ఆవిడకింకా చెప్పలేదు ! తనకు చెప్పనందుకు ఎంతకోపంతో ఉన్నదో ఏమో ! వెంటనే చెప్పి ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోవాలి, 
.
కసిరికొడితే బుజ్జగించాలి , కోపగిస్తే లాలించాలి ఏ విధంగానైనా ఆవిడను ప్రసన్నురాలిని చేసుకోవాలి అని ఆలోచిస్తూ కైక మందిరంలో అడుగుపెట్టాడు దశరధుడు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
********************

RULES TO TEACH YOUR SON


1. Never shake a man’s hand sitting down.
2. Learn how to cook a signature dish.
3. Spend 30 min a day reading up on current events.
4. In a negotiation, never make the first offer.
5. Request the late check-out.
6. When entrusted with a secret, keep it.
7. Hold your heroes to a higher standard.
8. Return a borrowed car with a full tank of gas.
9. Play with passion or don’t play at all…
10. When shaking hands, grip firmly and look them in the eye.
11. Don’t let a wishbone grow where a backbone should be.
12. Stand up when she enters the room.
13. Carry two handkerchiefs. The one in your back pocket is for you. The one in your breast pocket is for her.
14. You marry the girl, you marry her family.
15. Be like a duck. Remain calm on the surface and paddle like crazy underneath.
16. Experience the serenity of traveling alone.
17. Never be afraid to ask out the best looking girl in the room.
18. Never turn down a breath mint.
19. A sport coat is worth 1000 words.
20. Try writing your own eulogy. Never stop revising.
21. Thank a veteran. Then make it up to him.
22. Open her door and walk on the outside of the street.
23. After writing an angry email, read it carefully. Then delete it.
24. Ask your mom to play. She won’t let you win.
25. Manners make the man.
26. Give credit. Take the blame.
27. Stand up to bullies and racists. Defend their victims.
28. Write down your dreams.
29. Add value everywhere you go.
30. Be confident and humble at the same time.
31. If ever in doubt, REMEMBER WHOSE SON YOU ARE and REFUSE to just be ordinary!
32. Change the world, don't let it change you.
*************************

ఒక చమత్కార శ్లోకం చూడండి ...

 అంబలి ద్వేషిణం వందే

 చింతకాయ శుభ ప్రదమ్

 కూరగాయ కృత త్రాసం

 పాలనేతి గవాం ప్రియమ్

తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసారా ?

కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?

అంబలిని ద్వేషించే వాడికి వందనమట.
చింతకాయ చాలా శుభ దాయకమట.
 కూరగాయ భయోత్పాతకమట.
ఆవు పాల నేయి ప్రియమైనదట.

ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా ?

అం , బలి = బలిని అణచి వేసిన వాడు

చింతక , ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు

కు , ఉరగాయ = దుష్ట సర్పమును ( కాళీయుని) అణచి వేసిన వాడు

పాలన , ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )

వందే = నమస్కరించుచున్నాను.

ఇది శ్రీ కృష్ణ నామ స్మరణ చేసే శ్లోకం.
*******************

29వ పద్యం

మ. 
గ్రహదోషంబులు  దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహముం బేర్కొను నుత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే?
దహనుం గప్పగ జాలునే శలభ సంతానంబు? నీ సేవ జే
సి హతక్లేశులు గారు గాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా!
*********************

యింద్రియ ములు

ఇంద్ర అనే శబ్దం అనగా యింద్రియ మూలమైన అగ్ని రూపంలో శక్తి. యిది జీవునికి ఎలా అన్వయం యింద్రియ ములు ద్వారా కోరిక వాసనల అవగతమగును. అది అగ్ని రూపంలో పుట్టుక దేహంలో. దీనిని ఈశాన్య యవయా వధం.అగ్రే వధాయచ దూరే వధాయచ... అని రుద్రంలో వదంతి అనగా ధ  ధం ధాతు పరమైన శక్తి లక్షణము ఈ అనే శక్తి యెుక్క మూల ప్రకృతి యే. యింద్రం వో విశతస్పరి హవానే జనేభ్యః. అస్మాకం అస్తు కేవలఃఈశానో అప్రతిష్కుతః యివి అన్నియు శక్తి ఈ అనే మూలమైన శక్తి అనేక రూపములలో హవనాగ్నియే పూర్వకంగా జనులలో జీవ లక్షణంగా మారు చున్నది. విశ్వతో విశ్వతస్పాత్... అని మంత్రం కూడా విశ్వం సమస్తం సత్ అనే ఆప అగ్ని రూపంలో నీరు యీ అనే శక్తి యని. తెలియుచున్నది. ప్రకృతిలో వర్ష లక్షణము వరుణ యింద్ర లక్షణమే. యింద్ర యీ అనే ఎన్ అనగా నూట్రాన్ లక్షణము రాహువు శక్త రజోగుణం వలన చైతన్యమై పూర్తిగా నీరుగా మారి జీవమునకు ఆధారమగును. అన్నింటికి నీరు పరమేశ్వర రూపం. అదే యింద్ర రూపం. నేను అనే ౦ కేవలం నిమిత్తమాత్రుడను. హవానే జనేభ్యః మనం కూడా రోజూ దేహంలో యున్న ఆత్మకు నీరు నేరుగా తీసుకొనుట. యజ్ఞ లక్షణము. లేనిచో అది నిర్జీవంగా నీరు యెక్క మూలం అగ్ని. అగ్ని యెుక్క మూలం ఎన్ అనే రాహు శక్తి.మనం ఆహారం తీసుకొనుట కూడా యజ్ఞము. దేహమునకు సరియైన ఆహారం కూడా యజ్ఞ లక్షణమే. అది ప్రమాద కారి కాదు.అందుకే యజ్ఞంలో జీవ హింస లేదు. తెలుసుకుంటూనే ఉందాం. ఆచరిస్తూనే ఉందాం.
*********************

# శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 # శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||
తారాసంగుని భంగి శీర్షముపయిన్ ధట్టించి కూర్చుండగా
నేరన్ ; మారుని గాల్చినట్టి నిటలాగ్ని స్థాన మాశింప; రం
గారన్ పన్నగహారమై నడత వక్రంబూన, నీ పాద మం
జీరంబై రవళించెదన్ సతతమున్ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;
చంద్రుడిలాగా నీ నెత్తి మీద కూర్చోవాలి అనుకోవట్లేదు,
మన్మధుని దహించి వేసినట్టి ఉగ్రమైన నీ మూడో కన్ను స్థానమైన నీ ఫాల భాగాన్ని నేను ఆశించడం లేదు.
నీ మెడలో పడగవిప్పి విషం గ్రక్కే నాగు పాము స్థానాన్ని కూడా నేను కోరటం లేదు.నేను కోరుకునేది
నీ కాలికి కంకణం లాగా నీ పాదాల దగ్గర ఎప్పటికీ పడి ఉండేటట్లు ఇంత చోటు నాకు ప్రసాదించు స్వామీ, శ్రీ సిద్ధ లింగేశ్వరా!

స్వార్థం రాజ్యమేలుతోంది



బంధం, అనుబంధాల విలువ మంట గలిసింది.

అప్పుడు అసహ్యంగా ఉందని కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన కూతురు.
ఇప్పుడు తాను భారతదేశం మొత్తం ప్రశంసించిన తర్వాత
ప్రేమగా చూసుకుంటానని  ముందుకు రావడం ఆలోచించాల్సిన విషయం.

#పైసామే_పరమాత్మ
మనిషులు ఎంత స్వార్థపరులయ్యారో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ..

ఈ వృద్దురాలు రేణు మండల్
ఈమె కుమార్తె పెరిగి పెద్దదయిన తరువాత తల్లి వికారంగా ఉందని సిగ్గుపడి ఇంట్లో నుండి గెంటేసింది.
రేణు మండల్ 7 సంవత్సరాలు రైల్వే ప్లాట్‌ఫాంపై దేవుడిచ్చిన అద్బుతమైన గొంతుతో పాడుతూ బిక్షాటన చేస్తూ బ్రతికింది.

ఒక యువకుడు  ఆమె పాట వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో ఉంచారు,సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..సోనీ ఛానెల్ నుండి పిలుపు రావడంతో రాత్రి రాత్రికి స్టార్ అయ్యింది.

ఏ కూతురైతే తల్లి ముసలిదైంది అని ఇంట్లో నుండి గెంటేసిందో ఆమే వచ్చి మొఖాన నవ్వు పులుముకోని తల్లిని హత్తుకుంది

 ఆధునిక యుగంలో పిల్లలకు తల్లిదండ్రులు బోధించాల్సిన విషయాలు ఏమిటంటే!
ఇతరుల పట్ల దయ,కరుణ, జాలి కలిగి ఉంటూ
అపాయ్యత అనురాగాలను పంచాలి.
ఆ క్షణంలో ఎదుటి వ్యక్తి యొక్క శరీర సౌందర్యం లేదా కుల మత ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని.

- Whatsapp నుంచి సేకరణ
****************

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*




*653వ నామ మంత్రము*

*ఓం యోగిన్యై నమః*

ఏకత్వభావం కలిగి సాక్షాత్తు మహాయోగేశ్వరేశ్వరి, మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవిత, యోగినీ స్వరూపిణి అయిన పరాత్పరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యోగినీ* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం యోగిన్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకునికి చక్కని యోగ్యత, సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలిగి, పరమేశ్వరియందు అత్యంత భక్తితత్పరుడై జన్మకు సార్థకత కలిగించుకుంటాడు.

మనసును అదుపుచేసుకుని ఇంద్రియములను అంతర్ముఖము చేయడాన్నే యోగము అంటాము. మనసును నిశ్చలంచేసినప్పుడు ఏకాగ్రతత లభిస్తుంది.  అలా ఏకాగ్రతతో చేసిన జపంవలన సిద్ధి పొందవచ్చు. సాధారణంగా ఏదైనా మంత్రజపం చేయునప్పుడుగాని, కనులు మూసుకొని భగవంతుని ధ్యానం చేయునపుడుగాని ఏవేవో దృశ్యాలు కళ్ళలో కదులుతుంటాయి. మనసు అనేకవిధాల ఆలోచించితే ధ్యానం భగ్నమవుతుంది. మనస్సును నిరోధించి లక్ష్యాన్ని ఏకాగ్రం చేస్తే ఇంద్రియాలను అంతర్ముఖం చేయవచ్చు. మనోవాక్కాయకర్మలతో పరిశుద్ధమైన మనసుతో చేసే అర్చన వలన ఫలితం కలుగుతుంది. అందుకే యోగం చేయాలి. *యోగః చిత్త వృత్తి నిరోధక్తః* మనసును అదుపుచేయుటయే యోగము అని అందురు.

శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు కలవు. తొమ్మిది ఆవరణలకు, తొమ్మిది చక్రములు, వాటికి అధిష్ఠానదేవతలుగా యోగినీదేవతలు కలరు.

1) భూపురం ఆవరణకు త్రైలోక్యమోహన చక్రము, యోగినీ దేవత పేరు ప్రకటయోగిని.

2) షోడశదళం ఆవరణకు సర్వాశా పరి పూరక చక్రము, యోగినీ దేవత పేరు గుప్తయోగిని.

3) అష్టదళం ఆవరణకు సర్వసంక్షోభిణీ చక్రము, యోగినీ దేవత పేరు గుప్తతర యోగిని.

4) మన్వస్రం ఆవరణకు సర్వ సౌభాగ్యదాయక చక్రము, యోగినీ దేవత పేరు సంప్రదాయ యోగిని.

5) బహిర్దశారం ఆవరణకు సర్వార్ధసాధక చక్రము, యోగినీ దేవత పేరు కులోత్తీర్ణ యోగిని.

6) అంతర్దశారం ఆవరణకు సర్వ రక్షాకర చక్రము, యోగినీ దేవత పేరు నిగర్భ యోగిని.

7) అష్టకోణం ఆవరణకు సర్వ రోగహర చక్రము, యోగినీ దేవత పేరు రహస్య యోగిని.

8) త్రికోణం ఆవరణకు సర్వ సిద్ధిప్రద చక్రము, యోగినీ దేవత పేరు అతిరహస్య యోగిని.

9) బిందువు ఆవరణకు సర్వానందమయ చక్రము, యోగినీ దేవత పేరు పరాపర రహస్య యోగిని.

*శ్రీదేవిఖడ్గమాలా స్తోత్రం* మనం స్తోత్రం చేయునప్పుడు ఈ ఆవరణలలోని చక్రములు, యోగీనీ దేవతల పేర్లు చెప్పడం జరుగుతుంది.

*ఇంకను  దశారయుగ్మము నందు గల యోగినులు*

1) విద్యాయోగినీ, 2) రేచికాయోగినీ, 3) మోచికాయోగినీ,  4) అమృతాయోగినీ, 5) దీపికాయోగినీ, 6) జ్ఞానయోగినీ, 7) ఆప్యాయనీయోగినీ, 8) వ్యాపినీయోగినీ, 9) మేథాయోగినీ, 10) వ్యోమరూపాయోగినీ, 11) సిద్ధరూపాయోగినీ,  12) లక్ష్మీ యోగినీ, మరియు వశిన్యాది శక్తులు ఎనిమిది మొత్తము కలిపి 20 శక్తులు అగును. ఇవి శ్రీచక్రము నందలి దశారయుగ్మమునందు ఉండు 20 (10 x 2 )  కోణములు ఇవే.

*చతుష్షష్టికోటియోగిగణసేవితా* అని 237వ నామ మంత్రంలో స్తుతించాము.  అరవైనాలుగు కోట్లమంది యోగినీగణ దేవతలచే జగన్మాత సేవింపబడుతోంది. తొమ్మిదవ ఆవరణము బిందువు. అక్కడగలదు సర్వానందమయచక్రం. అక్కడ పరాపరరహస్యయోగినీ రూపంలో అమ్మవారు కలదు. అందుకే ఆ తల్లిని *యోగినీ* అని స్తుతిస్తున్నాము.

యోగినీ స్వరూపిణి అయిన పరాత్పరికి నమస్కరించునపుడు *ఓం యోగిన్యై నమః*  అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. 
 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻నేడు గురు (బృహస్పతి) వారము🔯🔯🔯గురువారమునకు అధిష్టాన దేవత గురుడు (బృహస్పతి)🌻🌻🌻 అందుకే గురువారమును బృహస్పతివారము🌹🌹🌹గురువారమునకు పసుపురంగు మంగళప్రదం🔯🔯🔯గురువారం లక్ష్మీప్రీతికరం గనుక గురువారాన్ని లక్ష్మివారం అనికూడా అంటారు🚩🚩🚩శుక్రవారంకూడా లక్ష్మీప్రీతికరమే  ఎందుచేతనంటే శుక్రవారానికి అధిదేవత శుక్రుడు🔱🔱🔱శుక్రుడు భృగువంశస్థుడు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది గనుక శుక్రవారము కూడా లక్ష్మీప్రీతికరము🙏🙏🙏ఇదేరోజున సాయినాథుని అర్చించుతాము అలాగే శ్రీగురు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధిస్తాము🕉🕉🕉ఓం శ్రీగురు దత్తాత్రేయ స్వామినే నమః🚩🚩🚩ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*76వ నామ మంత్రము*

*ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః*

భండాసురుని సోదరులు, అతని బాహువుల నుండి ఉద్భవించినవారు, అతనికిరువైపులా రక్షకులైనవారు, అతని సేనానాయకులుగానున్న వారు అయిన విషంగుడు, విశుక్రుడు అను వారిలో విశుక్రుని పరిమార్చిన జగన్మాత సేనాని వారాహీదేవి పరాక్రమమును గాంచి ఆనందమందిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ వారాహీ స్వరూపిణి అయిన శ్రీమాతను ఉపాసించు సాధకునిలోని అసురీ లక్షణాలను (ఉంటే) నిర్మూలించి, పవిత్రభావాలను కలుగజేసి, ఆధ్యాత్మిక చింతనతో, ఆత్మానందముతో భగవదారాధనలో నిమగ్నముచేసి తరింపజేయును.

భండాసురుని సంహారానికి శక్తిసేన సమన్వితయై, సంపత్కరీ దేవి గజసేనలతో, అశ్వారూఢ అశ్వసేనలతో, సర్వాయుధ పరిష్కృతమైన చక్రరాజము అను రథమునధిరోహించి, గేయచక్రమునధిరోహించిన శ్యామలాదేవి (రాజశ్యామల), కిరిచక్రరథారూఢ అయిన దండనాథ  అయిన వారాహి  తనను సేవించుచుండగా, అగ్నిపుత్రికలు, అగ్నిస్వరూపులు అయిన జ్వాలామాలిని, వహ్నివాసినులు ఏర్పరచిన జ్వాలాప్రాకారం మధ్యలో నుండగా, తన శక్తిసేనలు భండుని సైన్యాన్ని తునుమాడుతుంటే వారి శక్తివిక్రమమునకు హర్షాతిరేకితయై, భండుని పుత్రులను సంహరించు తన అంశయందు పుట్టిన బాలాత్రిపురసుందరి పరాక్రమమునకానందించినదై, తన మంత్రిణి శ్యామలాదేవి భండసోదరులు విషంగుడు, విశుక్రుడు అను వారిలో విషంగుని సంహరించుటతో  అంతులోని ఆనందమందిన ఆ పరాశక్తి ఈ నామ మంత్రములో భండాసురులలో రెండవవాడైన విశుక్రుని వారాహీదేవి సంహరించుటతో ఆ పరాశక్తి ఆనందానికి ఆకాశంకూడా హద్దు కాలేకపోయింది.

అమ్మవారు భండాసుర యుద్ధానికి సన్నద్ధమయింది. పదిహేను మంది భండుని సేనానాయకులు, ముప్పది మంది పుత్రులు, విషంగుడు, విశుక్రుడు అను సోదరులతో తలపడగా, శక్తిసేనలు, నిత్యాదేవతలు, సంపత్కరి, అశ్వారూఢ, బాలాత్రిపురసుందరి, శ్యామల, వారాహి మొదలైనవారు భండుని మొత్తం పరివారాన్ని మట్టుబెట్టాయి.

భండాసురుని సోదరులు విషంగుడు, విశుక్రుడు అనువారు భండుని బాహువులనుండి ఉద్భవించారు. వారిరువురు అతనికి బాహువులవంటివారు. భండుని రక్షణకు రెండు బాహువులయారు. ఇంతకు ముందు బాహువులలో ఒక బాహువు వంటి వాడు విషంగుని శ్యామలా దేవి సంహరించగా, విశుక్రుని వారాహీదేవి అంతమొందించినది.
మనలోని శుక్రధాతువు కామోద్రేకాన్ని ప్రేరేపిస్తుంది. విశుక్రుడు శుక్రధాతువు వంటివాడు.    ఆ విశుక్రుని వారాహీదేవి అంతమొంచిందంటే వారాహి మనలోని శుక్రధాతువును అదుపులోఉంచి తన్మూలంగా అరిషడ్వర్గాలలో ఒకటైన కామాన్ని నశింపజేస్తుంది. కామమనేది నశిస్తే జీవుడు నడక దైవం వైపు సాగుతుంది కదా! సాధకుడు కామమయమైన శరీరం ఉన్నవాడైతే   కామాన్ని దాటి సాధన చేయలేడు. అందుకే యోగి కావాలంటే భోగలాలస వదలాలి. ముఖ్యంగా బ్రహ్మచారులు కామాన్ని విడిచి సాధనాపరంగా ముందుకు పోవాలంటే వారాహీ ఉపాసన చేయాలి.

సప్తమాత్రుకలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రిలలో వారాహి ఒక దేవత.

శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రంలో ప్రథమావరణంలో ప్రస్తుతింపబడ్డారు.

విశుక్రుడు అహంకారపూరితుడు. ఐహికబంధాలలో చిక్కిపోయినవాడు. సంసారలంపటుడు. అందుకే వారాహీ దేవి అతనిని నిర్మూలించింది.

సంసారబంధములలోని చిక్కులు వీడాలన్నా, దుర్వ్యసనాలకు లోనుకాకుండా ఉండాలన్నా వారాహీ ఉపాసన చేయవలెను. వారాహీ అనే అమ్మవారి అంశ దేవతే కారణభూతురాలౌతుందని చెప్పడంలో ఔచిత్యం గలదు. ఎక్కడైనా, ఎప్పుడైనా *అహాన్ని*  శ్రేష్ఠవంతం చేయగలిగేది *వరాహమే* అని సౌందర్యలహరిలోని మూడవ శ్లోకంలో ఆది శంకరులు  ఇలా చెప్పారు.

*అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగ జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ*

*దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి॥3॥*


జననీ! నీ పాద కమల రేణువు,లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటికి సూర్య కిరణం లాంటిది .జ్ఞానం కలిగిస్తుంది .మంద బుద్ధులకు చైతన్యం అనే కల్ప వృక్ష పుష్పం యొక్క మకరందం. దీనులకు అన్ని కోర్కె లను తీర్చే చింతామణి .జనన ,మరణ ,సంసార సముద్రం లో మునిగి ఉన్న వారికి యజ్న వరాహ మైన విష్ణువు యొక్క దంష్ట్రం (కోర ).లలితా పరా భట్టారికను స్తుతిస్తే అవిద్య, జడత్వం , దరిద్రం, జనన , భయాలు ఉండవు అని స్పష్ట పరుస్తున్నారు శంకర భగవత్పాదులు .

ఆ జగన్మాతకు నమస్కరించునపుడు  *ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌻🌻నేడు గురు (బృహస్పతి) వారము🔯🔯🔯గురువారమునకు అధిష్టాన దేవత గురుడు (బృహస్పతి)🌻🌻🌻 అందుకే గురువారమును బృహస్పతివారము🌹🌹🌹గురువారమునకు పసుపురంగు మంగళప్రదం🔯🔯🔯గురువారం లక్ష్మీప్రీతికరం గనుక గురువారాన్ని లక్ష్మివారం అనికూడా అంటారు🚩🚩🚩శుక్రవారంకూడా లక్ష్మీప్రీతికరమే  ఎందుచేతనంటే శుక్రవారానికి అధిదేవత శుక్రుడు🔱🔱🔱శుక్రుడు భృగువంశస్థుడు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది గనుక శుక్రవారము కూడా లక్ష్మీప్రీతికరము🙏🙏🙏ఇదేరోజున సాయినాథుని అర్చించుతాము అలాగే శ్రీగురు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధిస్తాము🕉🕉🕉ఓం శ్రీగురు దత్తాత్రేయ స్వామినే నమః🚩🚩🚩ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*******************