*653వ నామ మంత్రము*
*ఓం యోగిన్యై నమః*
ఏకత్వభావం కలిగి సాక్షాత్తు మహాయోగేశ్వరేశ్వరి, మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవిత, యోగినీ స్వరూపిణి అయిన పరాత్పరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యోగినీ* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం యోగిన్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకునికి చక్కని యోగ్యత, సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలిగి, పరమేశ్వరియందు అత్యంత భక్తితత్పరుడై జన్మకు సార్థకత కలిగించుకుంటాడు.
మనసును అదుపుచేసుకుని ఇంద్రియములను అంతర్ముఖము చేయడాన్నే యోగము అంటాము. మనసును నిశ్చలంచేసినప్పుడు ఏకాగ్రతత లభిస్తుంది. అలా ఏకాగ్రతతో చేసిన జపంవలన సిద్ధి పొందవచ్చు. సాధారణంగా ఏదైనా మంత్రజపం చేయునప్పుడుగాని, కనులు మూసుకొని భగవంతుని ధ్యానం చేయునపుడుగాని ఏవేవో దృశ్యాలు కళ్ళలో కదులుతుంటాయి. మనసు అనేకవిధాల ఆలోచించితే ధ్యానం భగ్నమవుతుంది. మనస్సును నిరోధించి లక్ష్యాన్ని ఏకాగ్రం చేస్తే ఇంద్రియాలను అంతర్ముఖం చేయవచ్చు. మనోవాక్కాయకర్మలతో పరిశుద్ధమైన మనసుతో చేసే అర్చన వలన ఫలితం కలుగుతుంది. అందుకే యోగం చేయాలి. *యోగః చిత్త వృత్తి నిరోధక్తః* మనసును అదుపుచేయుటయే యోగము అని అందురు.
శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు కలవు. తొమ్మిది ఆవరణలకు, తొమ్మిది చక్రములు, వాటికి అధిష్ఠానదేవతలుగా యోగినీదేవతలు కలరు.
1) భూపురం ఆవరణకు త్రైలోక్యమోహన చక్రము, యోగినీ దేవత పేరు ప్రకటయోగిని.
2) షోడశదళం ఆవరణకు సర్వాశా పరి పూరక చక్రము, యోగినీ దేవత పేరు గుప్తయోగిని.
3) అష్టదళం ఆవరణకు సర్వసంక్షోభిణీ చక్రము, యోగినీ దేవత పేరు గుప్తతర యోగిని.
4) మన్వస్రం ఆవరణకు సర్వ సౌభాగ్యదాయక చక్రము, యోగినీ దేవత పేరు సంప్రదాయ యోగిని.
5) బహిర్దశారం ఆవరణకు సర్వార్ధసాధక చక్రము, యోగినీ దేవత పేరు కులోత్తీర్ణ యోగిని.
6) అంతర్దశారం ఆవరణకు సర్వ రక్షాకర చక్రము, యోగినీ దేవత పేరు నిగర్భ యోగిని.
7) అష్టకోణం ఆవరణకు సర్వ రోగహర చక్రము, యోగినీ దేవత పేరు రహస్య యోగిని.
8) త్రికోణం ఆవరణకు సర్వ సిద్ధిప్రద చక్రము, యోగినీ దేవత పేరు అతిరహస్య యోగిని.
9) బిందువు ఆవరణకు సర్వానందమయ చక్రము, యోగినీ దేవత పేరు పరాపర రహస్య యోగిని.
*శ్రీదేవిఖడ్గమాలా స్తోత్రం* మనం స్తోత్రం చేయునప్పుడు ఈ ఆవరణలలోని చక్రములు, యోగీనీ దేవతల పేర్లు చెప్పడం జరుగుతుంది.
*ఇంకను దశారయుగ్మము నందు గల యోగినులు*
1) విద్యాయోగినీ, 2) రేచికాయోగినీ, 3) మోచికాయోగినీ, 4) అమృతాయోగినీ, 5) దీపికాయోగినీ, 6) జ్ఞానయోగినీ, 7) ఆప్యాయనీయోగినీ, 8) వ్యాపినీయోగినీ, 9) మేథాయోగినీ, 10) వ్యోమరూపాయోగినీ, 11) సిద్ధరూపాయోగినీ, 12) లక్ష్మీ యోగినీ, మరియు వశిన్యాది శక్తులు ఎనిమిది మొత్తము కలిపి 20 శక్తులు అగును. ఇవి శ్రీచక్రము నందలి దశారయుగ్మమునందు ఉండు 20 (10 x 2 ) కోణములు ఇవే.
*చతుష్షష్టికోటియోగిగణసేవితా* అని 237వ నామ మంత్రంలో స్తుతించాము. అరవైనాలుగు కోట్లమంది యోగినీగణ దేవతలచే జగన్మాత సేవింపబడుతోంది. తొమ్మిదవ ఆవరణము బిందువు. అక్కడగలదు సర్వానందమయచక్రం. అక్కడ పరాపరరహస్యయోగినీ రూపంలో అమ్మవారు కలదు. అందుకే ఆ తల్లిని *యోగినీ* అని స్తుతిస్తున్నాము.
యోగినీ స్వరూపిణి అయిన పరాత్పరికి నమస్కరించునపుడు *ఓం యోగిన్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻నేడు గురు (బృహస్పతి) వారము🔯🔯🔯గురువారమునకు అధిష్టాన దేవత గురుడు (బృహస్పతి)🌻🌻🌻 అందుకే గురువారమును బృహస్పతివారము🌹🌹🌹గురువారమునకు పసుపురంగు మంగళప్రదం🔯🔯🔯గురువారం లక్ష్మీప్రీతికరం గనుక గురువారాన్ని లక్ష్మివారం అనికూడా అంటారు🚩🚩🚩శుక్రవారంకూడా లక్ష్మీప్రీతికరమే ఎందుచేతనంటే శుక్రవారానికి అధిదేవత శుక్రుడు🔱🔱🔱శుక్రుడు భృగువంశస్థుడు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది గనుక శుక్రవారము కూడా లక్ష్మీప్రీతికరము🙏🙏🙏ఇదేరోజున సాయినాథుని అర్చించుతాము అలాగే శ్రీగురు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధిస్తాము🕉🕉🕉ఓం శ్రీగురు దత్తాత్రేయ స్వామినే నమః🚩🚩🚩ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*76వ నామ మంత్రము*
*ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః*
భండాసురుని సోదరులు, అతని బాహువుల నుండి ఉద్భవించినవారు, అతనికిరువైపులా రక్షకులైనవారు, అతని సేనానాయకులుగానున్న వారు అయిన విషంగుడు, విశుక్రుడు అను వారిలో విశుక్రుని పరిమార్చిన జగన్మాత సేనాని వారాహీదేవి పరాక్రమమును గాంచి ఆనందమందిన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ వారాహీ స్వరూపిణి అయిన శ్రీమాతను ఉపాసించు సాధకునిలోని అసురీ లక్షణాలను (ఉంటే) నిర్మూలించి, పవిత్రభావాలను కలుగజేసి, ఆధ్యాత్మిక చింతనతో, ఆత్మానందముతో భగవదారాధనలో నిమగ్నముచేసి తరింపజేయును.
భండాసురుని సంహారానికి శక్తిసేన సమన్వితయై, సంపత్కరీ దేవి గజసేనలతో, అశ్వారూఢ అశ్వసేనలతో, సర్వాయుధ పరిష్కృతమైన చక్రరాజము అను రథమునధిరోహించి, గేయచక్రమునధిరోహించిన శ్యామలాదేవి (రాజశ్యామల), కిరిచక్రరథారూఢ అయిన దండనాథ అయిన వారాహి తనను సేవించుచుండగా, అగ్నిపుత్రికలు, అగ్నిస్వరూపులు అయిన జ్వాలామాలిని, వహ్నివాసినులు ఏర్పరచిన జ్వాలాప్రాకారం మధ్యలో నుండగా, తన శక్తిసేనలు భండుని సైన్యాన్ని తునుమాడుతుంటే వారి శక్తివిక్రమమునకు హర్షాతిరేకితయై, భండుని పుత్రులను సంహరించు తన అంశయందు పుట్టిన బాలాత్రిపురసుందరి పరాక్రమమునకానందించినదై, తన మంత్రిణి శ్యామలాదేవి భండసోదరులు విషంగుడు, విశుక్రుడు అను వారిలో విషంగుని సంహరించుటతో అంతులోని ఆనందమందిన ఆ పరాశక్తి ఈ నామ మంత్రములో భండాసురులలో రెండవవాడైన విశుక్రుని వారాహీదేవి సంహరించుటతో ఆ పరాశక్తి ఆనందానికి ఆకాశంకూడా హద్దు కాలేకపోయింది.
అమ్మవారు భండాసుర యుద్ధానికి సన్నద్ధమయింది. పదిహేను మంది భండుని సేనానాయకులు, ముప్పది మంది పుత్రులు, విషంగుడు, విశుక్రుడు అను సోదరులతో తలపడగా, శక్తిసేనలు, నిత్యాదేవతలు, సంపత్కరి, అశ్వారూఢ, బాలాత్రిపురసుందరి, శ్యామల, వారాహి మొదలైనవారు భండుని మొత్తం పరివారాన్ని మట్టుబెట్టాయి.
భండాసురుని సోదరులు విషంగుడు, విశుక్రుడు అనువారు భండుని బాహువులనుండి ఉద్భవించారు. వారిరువురు అతనికి బాహువులవంటివారు. భండుని రక్షణకు రెండు బాహువులయారు. ఇంతకు ముందు బాహువులలో ఒక బాహువు వంటి వాడు విషంగుని శ్యామలా దేవి సంహరించగా, విశుక్రుని వారాహీదేవి అంతమొందించినది.
మనలోని శుక్రధాతువు కామోద్రేకాన్ని ప్రేరేపిస్తుంది. విశుక్రుడు శుక్రధాతువు వంటివాడు. ఆ విశుక్రుని వారాహీదేవి అంతమొంచిందంటే వారాహి మనలోని శుక్రధాతువును అదుపులోఉంచి తన్మూలంగా అరిషడ్వర్గాలలో ఒకటైన కామాన్ని నశింపజేస్తుంది. కామమనేది నశిస్తే జీవుడు నడక దైవం వైపు సాగుతుంది కదా! సాధకుడు కామమయమైన శరీరం ఉన్నవాడైతే కామాన్ని దాటి సాధన చేయలేడు. అందుకే యోగి కావాలంటే భోగలాలస వదలాలి. ముఖ్యంగా బ్రహ్మచారులు కామాన్ని విడిచి సాధనాపరంగా ముందుకు పోవాలంటే వారాహీ ఉపాసన చేయాలి.
సప్తమాత్రుకలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రిలలో వారాహి ఒక దేవత.
శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రంలో ప్రథమావరణంలో ప్రస్తుతింపబడ్డారు.
విశుక్రుడు అహంకారపూరితుడు. ఐహికబంధాలలో చిక్కిపోయినవాడు. సంసారలంపటుడు. అందుకే వారాహీ దేవి అతనిని నిర్మూలించింది.
సంసారబంధములలోని చిక్కులు వీడాలన్నా, దుర్వ్యసనాలకు లోనుకాకుండా ఉండాలన్నా వారాహీ ఉపాసన చేయవలెను. వారాహీ అనే అమ్మవారి అంశ దేవతే కారణభూతురాలౌతుందని చెప్పడంలో ఔచిత్యం గలదు. ఎక్కడైనా, ఎప్పుడైనా *అహాన్ని* శ్రేష్ఠవంతం చేయగలిగేది *వరాహమే* అని సౌందర్యలహరిలోని మూడవ శ్లోకంలో ఆది శంకరులు ఇలా చెప్పారు.
*అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగ జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ*
*దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి॥3॥*
జననీ! నీ పాద కమల రేణువు,లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటికి సూర్య కిరణం లాంటిది .జ్ఞానం కలిగిస్తుంది .మంద బుద్ధులకు చైతన్యం అనే కల్ప వృక్ష పుష్పం యొక్క మకరందం. దీనులకు అన్ని కోర్కె లను తీర్చే చింతామణి .జనన ,మరణ ,సంసార సముద్రం లో మునిగి ఉన్న వారికి యజ్న వరాహ మైన విష్ణువు యొక్క దంష్ట్రం (కోర ).లలితా పరా భట్టారికను స్తుతిస్తే అవిద్య, జడత్వం , దరిద్రం, జనన , భయాలు ఉండవు అని స్పష్ట పరుస్తున్నారు శంకర భగవత్పాదులు .
ఆ జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻నేడు గురు (బృహస్పతి) వారము🔯🔯🔯గురువారమునకు అధిష్టాన దేవత గురుడు (బృహస్పతి)🌻🌻🌻 అందుకే గురువారమును బృహస్పతివారము🌹🌹🌹గురువారమునకు పసుపురంగు మంగళప్రదం🔯🔯🔯గురువారం లక్ష్మీప్రీతికరం గనుక గురువారాన్ని లక్ష్మివారం అనికూడా అంటారు🚩🚩🚩శుక్రవారంకూడా లక్ష్మీప్రీతికరమే ఎందుచేతనంటే శుక్రవారానికి అధిదేవత శుక్రుడు🔱🔱🔱శుక్రుడు భృగువంశస్థుడు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది గనుక శుక్రవారము కూడా లక్ష్మీప్రీతికరము🙏🙏🙏ఇదేరోజున సాయినాథుని అర్చించుతాము అలాగే శ్రీగురు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధిస్తాము🕉🕉🕉ఓం శ్రీగురు దత్తాత్రేయ స్వామినే నమః🚩🚩🚩ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*******************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి