27, ఆగస్టు 2020, గురువారం

*నిమిత్తములు వివిధ పద్ధతులు*



జాతాక ఫలిత నిర్ణయంలో అనేక పద్ధతులు ఉన్నాయి. నేరుగా జాతక చక్రం లేకపోయినా, ప్రశ్న చక్రం వెంటనే వేయలేకపోయినా మనం *చూసేదానిని, వినే దానిని, మనసుచే అనుభవించే దానిని* బట్టి కూడా ఫలితం చెప్పడం ఉన్నది. దీనినే క్లుప్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే “ *నిమిత్తము* అంటారు. ఈ నిమిత్తములను అనుసరించి ఫలితనిర్ణయం చేయడం అనేది సాధన చేస్తే చాలా సులువైనది.


వాచీలోని గంటలముల్లును లగ్నంగాను,
నిమిషాల ముల్లును భాగలగానూ,
సెకనుల ముల్లును లిప్తలు గాను గ్రహించి...

దీనికి ఆనాటి గ్రహస్థితిని జోడించి ప్రశ్నచక్రం మనసులోనే తయారు చేసుకుని ఫలితం చెప్పు పద్ధతి ఉన్నది.  *Watch Predictive Teqnic* అంటారు దీనిని.

కొందరు *గవ్వల ప్రశ్న, తాంబూల ప్రశ్న, అంజన ప్రశ్న, దర్పణ ప్రశ్న*  చెబుతారని మనకు తెలుసు. *చిలక జోస్యం* కూడా అత్యద్భుతంగా చెప్పగలిగేవారు పూర్వంలో.

 ఇవన్నీ *దైవఙుని యొక్క మంత్రానుష్ఠానము, ఆయా పద్ధతులలో సునిసిత సాధన* అనే రెండిటింమీదా ఆధారపడి ఉంటాయి. 

వీటిలాగే మనము చూస్తున్న విషయాన్ని బట్టి గ్రహస్థితి అంచనా వేయడం అనేది ఒక పద్ధతి. ఒకవ్యక్తిని నేరుగా చూసి, లేదా అప్పటికప్పుడు తీసి పంపిన ఫోటో ని చూసి  అతని యొక్క జాతకము లేదా ఏప్రశ్న అడిగారో దాని ఫలితము నిర్ణయించే విధానం ఉన్నది.

ప్రస్తుతం మన గ్రూపులో వీలైనప్పుడల్లా అటువంటి సాధన చేద్దాం. నాకూ ఈ విషయం కొత్తనే. కానీ సాధన చేయగా చేయగా మనకు అనుభవం వస్తుంది. జాతక చక్రంద్వారా చెప్పలేనీ కొన్ని విషయాలను ఇటువంటి నిమిత్తాలను బట్టి టక్కున చెప్పవచ్చు.

మీ

 *R. విజయ్ శర్మ*
9000532563
*******************

కామెంట్‌లు లేవు: