*అష్టమ స్కంధము - పదునెనిమిదవ అధ్యాయము*
*శ్రీమహావిష్ణువు వామనుడుగా అవతరించుట - బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలయందు ప్రవేశించుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీశుక ఉవాచ*
*18.1 ప్రథమ స్వాగతము)*
*ఇత్థం విరించస్తుతకర్మవీర్యః ప్రాదుర్బభూవామృతభూరదిత్యామ్|*
*చతుర్భుజః శంఖగదాబ్జచక్రః పిశంగవాసా నలినాయతేక్షణః॥6986॥*
*శ్రీశుకుడుఅనుడివెను* పరిక్షిన్నహారాజా! ఈవిధముగా బ్రహ్నదేవుడు పరమాత్మయొక్క శక్తి సామర్థ్యములను, లీలలను స్తుతించెను. అప్పుడు జనన మరణరహితుడైన భగవానుడు అదితిఎదుట సాక్షాత్కరించెను శంఖచక్రగదాపద్భములను ధరించియుండెను. కమలములవలె విశాలమైన కన్నులు గల ఆ దేవదేవుడు పీతాంబరముతో శోభిల్లుచుండెను.
*18 2 (రెండవ శ్లోకము)*
*శ్యామావదాతో ఝషరాజకుండల-త్విషోల్లసచ్ఛ్రీవదనాంబుజః పుమాన్|*
*శ్రీవత్సవక్షా బలయాంగదోల్లసత్కిరీటకాంచీగుణచారునూపురః '॥6987॥*
ఆ ప్రభువు మేను విశుద్ధ శ్యామ వర్ణముతో విరాజీల్లుచుండెసు. కర్ణములయందలి మకఃరకుండలముల కాంతులు ఆ ప్రభువుముఖకమల శోభను ఇనుమడింపజేయు చుండెను. వక్షఃస్థలమునందు శ్రీవత్సచిహ్నము, చేతులయందు కంకణములు, బాహువులయందు భుజకీర్తులు, శిరమున కీరీటము, నడుమన మొలనూలు, పాదములయందు అందమైన నూపురములు ధగధగమెరయుచుండెను.
*18.3 (మూడవ శ్లోకము)*
*మధువ్రతవ్రాతవిఘుష్టయా స్వయా విరాజితః శ్రీవనమాలయా హరిః|*
*ప్రజాపతేర్వేశ్మతమః స్వరోచిషా వినాశయన్ కంఠనివిష్టకౌస్తుభః॥6988॥*
భగవంతుడు మెడయందు వనమాలను ధరించియుండెను. దానిచుట్టును తమ్మెదలు మూగి ఝంకారములను గావించు చుండెను. ఆ స్వామి గళమునందు కౌస్తుభమణి శోభిల్లుచుండెను భగవానుని తమ శోభలతో!అ కశ్యప ప్రజాపతియొక్క ఇంటి యందలి చీకట్లు దూరమాయెను.
*18.4 (నాలుగవ శ్లోకము)**
*దిశః ప్రసేదుః సలిలాశయాస్తదా ప్రజాః ప్రహృష్టా ఋతవో గుణాన్వితాః|*
*ద్యౌరంతరిక్షం క్షితిరగ్నిజిహ్వా గావో ద్విజాః సంజహృషుర్నగాశ్చ॥6989॥*
ఆ సమయమూన దిక్కులు నిర్మలములు ఆయెను. నదులు, సరోవరమునందలి జలములు స్వచ్ఛము లాయెను. ప్రజల హృదయములలో ఆనందము వెల్లివిరిసెను. అన్ని ఋతువులు ఒక్కసారిగా తమ సహజ లక్షణములను ప్రకటించెను. స్వర్గలోకము, అంతరిక్షము, పృథ్వి, దేవతలు, గోవులు, ద్విజులు, పర్వతములు అన్నియు ఆనందముతో కలకలలాడుచుండెను.
*18.5 (ఐదవ శ్లోకము)*
*శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తేఽభిజితి ప్రభుః|*
*సర్వే నక్షత్రతారాద్యాశ్చక్రుస్తజ్జన్మ దక్షిణమ్॥6990॥*
రాజా! ఆపరమేశ్వరుడు అవతరించిన సమయమము చంద్రుడు శ్రవణా నక్షత్రమునందుండెసు. భాద్రపదశుద్ధ ద్వాదశినాడు అభిజిన్మహూర్తమున ఆ భగవంతుడు జన్మించెను. నక్షత్రములు, గ్రహములూ అన్నియు భగవంతుని జననము. శుభప్రదమని సూచించు చుండెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునెనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి