12, జూన్ 2021, శనివారం

మంత్రం అందరికి

 *మంత్రం అందరికి ఎందుకు సిద్దించడం లేదు ?*


మంత్ర సాధనా నియమాలలో కొన్నైనా ఈ నేపథ్యంలో చెప్పుకుందాం.


ఒక మంత్రం కానీ, పూజ కానీ పరిహారంగా చేయమని చెప్పినప్పుడు దానికి లక్షల్లో జపం చేయమని ఎవ్వరూ చెప్పరు....ఎందుకంటే అవి పరిహారం కోసం ఇవ్వబడ్డాయి. సమస్యని తొలగించి, ఉపశమనం కలిగించే మంత్రాలు అవి. 


ఇన్ని వారాలు, లేదా ఇన్ని రోజులు, ఇన్నిసార్లు చేయాలి అనే నియమమే ఉంటుంది.....{సందర్భాన్ని బట్టి మారుతుంది}


సిద్ది పొందడానికి చేసే ఉపాసనలు మటుకే, దశమభాగం విధులు చేయాలి. గనుక దాన్ని లక్షల్లో జపం చేయవలసి ఉంటుంది..


ఏదైనా సమస్య పరిష్కారం కావాలి అని ఆ మంత్రం జపం చేస్తే పని అయిపోతుంది అని ఎప్పుడెప్పుడు జపం పూర్తి అయిపోతుందో దానిపైనే దృష్టి పెట్టి ఉంటారు , కానీ భక్తి శ్రద్ద అనేది ఉండదు. ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తున్నామో ఆ మంత్రాదిష్ఠాన దేవత పైన భక్తి ఉండాలి, 


ఆ దేవతా స్త్రోత్రం చేయాలి. త్రికరణ శుద్ధితో జపం చేయాలి. 


జప సంఖ్య కన్నా కాస్త ఎక్కువ సార్లు చేయాలి. 


జపం చేసే వాళ్ళు మాసిన వస్త్రాలు ధరించకూడదు. నిన్న కాసేపు వేసుకున్నదే కదా అని మరుసటి రోజు ధరించ కూడదు.... మెడలో ధరించిన మాలని జపానికి వాడకూడదు.


శ్వాసలో దుర్వాసన రాకూడదు, పొద్దు వచ్చాక స్నానం చేయాకుడదు.....


అనగా ఋషి స్నానమే చేయాలి. మీరు జపం ఆలస్యంగా మొదలు పెట్టిన స్నానం మటుకు సూర్యోదయం కి ముందే చేయాలి. 


ఇది చాలా మందికి తెలియక 7,8,9 అలా ప్రొద్దెక్కిన తర్వాత స్నానం చేయడం వల్ల జప ఫలితము కూడా దక్కదు.. ఇది నిజం. స్నానానికి

 అంత  ముఖ్యమైన పాత్ర ఉందా! అనుకోకండి. 


మీరు ఒక నెల రోజులు పాటు వరుసగా , వేకువ ఝామునే, 4- 00 గంటలకే  స్నానం ముగించండి. (ఈ సమయంలో చేసే స్నానమే ఋషి స్నానం).


మీరు చేసే పూజ కానీ జపం కానీ ఎంత త్వరగా ప్రభావం చూపిస్తుందో చూడండి......సూర్యుడికి  అర్ఘ్య ప్రదానం చేస్తే రోజు మీకు అన్నివిధాల శుభం కలుగుతుంది. 


కొన్ని మంత్ర జపాలకు మటుకే ఆహార నియమం పాటించాలి, కానీ అన్ని పరిహారాలకు ఆహార నియమం అవసరం లేదు. మంత్ర సాధన ఉన్నంత కాలం....శాకాహారం తినడమే ఉత్తమం.


ఏ మంత్ర జపం, ఏ పరిహారం చేసే వాళ్ళు అయినా వారి కుల దేవతని మంగళవారం విశేషం గా ఆరాధించాలి. 


బియ్యం పిండితో దీపం పెట్టి స్త్రోత్రం చేసి దేనికోసం పరిహార జపం చేస్తున్నారో అది ఫలించే లాగా అనుగ్రహించమని సంకల్పం చేయాలి. అప్పుడు ఆటంకాలు రాకుండా కులదేవత కూడా అనుగ్రహిస్తుంది..


వివాహం ,ఉద్యోగం, వృత్తి వ్యాపారాలు, ఆస్తి తగాదాలు, శత్రు బాధలకై ముఖ్యంగా పరిహారం చేసుకుంటూ ఉంటారు. 


ఎంత కోపం ఉన్నా జపం చేసే సమయంలో కోపంతో జపం చేయాకుడదు.. మీకు ద్రోహం చేసి వారు అయితే ఖచ్చితంగా వారికి ఎలాగో శిక్ష పడుతుంది. కానీ ఉపాసించే మంత్రం జపం చేస్తూ మనసులో శతృభావంతో చేయాకుడదు. అది మీకు కూడా మంచిది కాదు , ఎవరు తప్పు చేశారో ఖచ్చితంగా తెలియనప్పుడు *ఆముకం* దగ్గర శత్రువు అనిపెట్టాలి. కానీ ఎవరి పేరు చదవకూడదు .


దేవీ ఉపాసన మంత్రాలు స్ట్రోత్రాలు చదివే వారు ముందు గా గణేషుడి కి నమస్కారం చేసి దక్షణామూర్తి ని స్త్రోత్రం చేసే దేవీ ఉపాసన మొదలు పెడితే పూజ ఫలిస్తుంది..


 అలాగే దశమహావిద్యల లోని దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ, ఆ మంత్రం జపం చేసే వాళ్ళు, బైరవుడి ని ఆరాధించి ఆ మంత్రం జపించి తర్వాత ఆ దేవత ఆరాధన మొదలు పెట్టాలి.... అప్పుడే ఆ సాధన ఫలిస్తుంది. లేకుంటే ఎంత చేసినా ఫలితం త్వరగా రాదు.


రాహుకాలంలో భోజనం చేసిన, స్నానం చేసిన, మైధునం జరిగిన మీరు చేసుకున్న జప ఫలితం, పూజ ఫలితం అంతా రాహువుకి పోతుంది.. ఆ సమయం దాటాక భోజనం చేయాలి. 


లేదా ముందుగా చేయాలి.. అటువంటి పగటి సమయంలో గర్భం నిలిస్తే తల్లితండ్రులను హింసించే పిల్లలు పుడతారు. 


లేదా పిల్లల వల్ల ఏదో విధంగా బాధ పడుతూనే ఉంటారు..ఇది కొత్త దంపతులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. 


పొద్దు వాలే సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా ఇవే నియమాలు పాటించాలి. 


అయితే సూర్యుడు అస్తమించే సమయంలో స్నానం చేసిన పర్వాలేదు కానీ భోజనం నిద్ర చేయాకుడదు.


మంత్ర జపం చేస్తున్నవారు ఎవరితో గొడవ పడకూడదు, దూషించ కూడదు, అమాయకులను బాధ పెట్టకూడదు ఎవ్వరిని కాలితో తన్న కూడదు...


కాకికి , కుక్కకి తరచుగా అన్నం పెట్టడం వల్ల మీ దోషాలు చాలా వరకు తగ్గుతుంది.... జప సంఖ్య పూర్తి అయ్యాక వదిలేయ కూడదు. కొద్దిగా అయినా రోజు కాసేపు జపం చేస్తూ ఉండాలి.....


లేదా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరుకొని సుందరకాండ పారాయణం, లలితా సహస్రనామం  పారాయణ చేయండి మీకు మీ కుటుంబానికి మంచి కలుగుతుంది.

Mumbai - Bombay *

 *Mumbai - Bombay *

Lengthy but worth reading...

Superb answer by a Mumbai-lover to a question "Why Mumbai​ is a likable place?"


I took a Cab from Lower Parel to Worli. The fare was Rs.67. Since I was coming from Bangalore, I gave Rs.100 to the cab driver and started walking towards my office. The driver called me back. He gave me Rs.30 back. I started walking again. He called me back again and gave me 3 bucks back.


This is why I love Mumbai.


It was Holi Morning. I had to come to office. My cab fare was again 70 bucks. The driver did not have change. He went ahead and bought a Vada (a typical Mumbai snack) worth Rs.10 and returned me the balance. When I was walking away. The driver took his plate of Vada, offered me half of them. "Boss, ek lelo, Holi hai!"


This is why I love Mumbai.


It was my first night out on Marine Drive. The rainy days were about to start.I sat on the rocks with my friend. And suddenly it started raining. Ohh, I can't even start to tell you how much people love the first rain here. It was 3 a.m. I saw a group of 3 girls, all dressed up in their short LBDs , probably coming back after party. They got out of their car. And started drenching and dancing in the rain. And no, not a single guy catcalled them.


This is why I love Mumbai.


Just on the opposite side of the road ,where the girls were dancing, there was an old traditional Muslim couple. They were completely wet . The rain poured like nothing I have ever seen. Yet they sat there enjoying the view of the sea, holding hands. They were in their 60s.


This is why I love Mumbai.


Every Time I took the local train, I realized there is always a place for another person. It always looked impossible from the outside to get in. But somehow "we" always used to fit in those small coaches.


That is why I love Mumbai.


Every time it rains here, I wonder if the city is coming to a stop. It literally is like the hell broke down. I saw platform being overflown by rainwater. Then when I reached my office, I saw everyone came to work. People somehow manage to live here, irrespective of anything. The best part is they do it with a smile.


That is why I love  Mumbai.


There used to be a couple, just below my first apartment, on the street. They did not have a place to stay. They were homeless. I used to take the cab for my office from the front of their tent. I saw the old guy reading his news paper, sipping tea and I saw his wife combing hair of one of the street dogs. I never saw them sad in their happy little home (tent?). The wife always wore a little lilly on her hair.


That is why I love Mumbai.


I was at Dadar Station . It was 9 in the morning. It is pointless to say that it is one of the busiest hour. I saw a couple smooching on the platform. They were probably saying goodbyes to each other. From what I figured out later the girl was moving to another city on a long distance train. And then I realized I am one of the very few people watching. Everyone else is busy about their own train.


That is why I love Mumbai.


The city is an infrastructural mess. The air is so polluted at times I could not see the top of my own building due to dust. The place is so over crowded that there is probably more space in a first world country's prison than in Mumbai. Yet, I saw a young Punjabi guy, dressed in formal, singing his heart out while coming back from office on a bike. I saw a Jaguar stuck in the same traffic light. And they coexisted happily, side by side.


That is what Mumbai is for you "naked, sheer raw acceptance of truth"

I saw thousands of small homes. Homes of the size of washrooms of my place in Kolkata . Yet, I never saw a permanent sad face in any of those windows. People ran, people fought, people struggled for their dreams . "One does not live in Mumbai, One struggles in Mumbai".


Mumbai is still the city of dreams. Mumbai can give you respect, happiness, irrespective of your caste, creed, gender and economical status. As the tea stall owner just outside my office used to say.. "Ambani bhi petrolpump pe petrol deta tha.. To hum konsi maal hai?"

 

One more thing , just shout Ganpati Bappa anywhere in Mumbai u will hear  MORYA next minute 


That spirit is the greatness of Mumbai..

పదాల తేడా

 🍃🥀పదాల తేడా చదువుకోడానికి మాత్రమే..చర్చకోసం కాదు

🙂  🙂  🙂  🙂  🙂  🙂

'ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ' సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని దండించారట.  ' చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా రాసినా పర్వాలేదు. కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు' అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది.భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.  

'వాడెదవ'  అంటే తిట్టనుకునేరు .చెరకుగడ  చివరిభాగం. tip of the sugar cane అన్నాడు బ్రౌన్.

'సమాజం'  అనబోయి 'సమజం' అన్నారనుకోండి.ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. (ఈ అర్ధం బాగుంది కదా !)

'శ్రీ' అంటే  విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.

'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా .(customary fee - బ్రౌన్)

 ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి  " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట. తండ్రికి తగ్గ ఆ కొడుకు  " పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు " అన్నాడట  ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు.  పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.

 ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ " మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు " అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం( శబ్దరత్నాకరం)

సొంతవిషయాలను పదేపదే చెబుతుంటే ' నీ సొద ఆపు అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ " శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.

ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది. 

' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.

గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం'  అని రాస్తున్నాం.

'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.

గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే?  కర్ర లేని గొడుగు.

పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.

బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది 

'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో  కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.

                🍃🥀🍃🥀🍃

సేకరణ: అంతర్జాలం

శ్రీ చక్రం వక పరిశీలన

 శ్రీ చక్రం వక పరిశీలన. బిందు త్రికోణ మధ్యే త్రికోణాంతర దీపికా. శక్తి బిందువు నుండి వ్యాప్తంగా అనంతమైనది. అది తెలియాలంటే పదార్ధ రూపం దాల్చవలెను. అటువంటిది షట్కోణాకృతిగల త్రిగుణములతో గూడిన ప్రకృతి తత్వమే.షట్కోణము అనంతమైన 64 చతుషష్టుపచారాఢ్యా, చతుషష్టి కళామయి, 64 కోణములు గలది అనగా శక్తి రూపమైనది.శ్రీ చక్రము. యిది సమస్త ప్రకృతి పరమైన శక్తి లక్షణములు గల భూమియే శ్రీ చక్రం. ఊర్ధ్వకోణ, అధోకోణ త్రిభుజ మిశ్రమమైన పురుష, ప్రకృతి శక్తుల కలయికయే శ్రీచక్రమునకు యంత్ర శక్తికి మూలము.దానిని పదార్ధ రూపమే మేరువు.మరియు మేరు పర్వత రూపంలో సుమేరు శృంగ మధ్యస్థయైన బిందు రూపమే కైలాస పర్వతం.దానినే మనం మేరువుగా పూజించుట. కైలాసపర్వతం ప్రకృతి పరంగా మేరు పర్వతమని తెలియుచున్నది. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే ,దేవతాస్తత్ర మెూదన్తి తన్మే మనః శివసంకల్ప మస్తు.సమస్త దేవతలకు మెూదము కలిగించేది కైలాసశిఖరం. యిది బిందు పూర్వక శ్రీచక్రమే మేరువుగా మనం తెలియవచ్చును. అచ్చటికి ప్రయాణం. గఛ్చంతు మహా మేరు అని వేదములో అరుణ ప్రశ్న తెలుపు చున్నది. అనగా దానిని అధిరోహించుటయనగా మెూక్మే పునరావృత్తి లేని జీవుడు. జీవునికి పునః పునః జన్మ లేకుండుట. దాని శక్తి తెలియాలి అంటే యీ రెండిటిని వ్యతిరేకముగా చూచిన ఎక్స్ ఆకారము దాల్చును.ఎక్స్ యనగా ఆరుద్ర,మూల రాహు కేతు మరియు మఘ, శతభిషం నక్షత్రముల కేతు రాహువులు రేఖల కలయిక వలన ఏర్పడిన శక్తి ఎక్స్ కిరణాలు వాని లక్షణములు. సమస్త ప్రకృతి శక్తి రూపము బిందువునుండి విశ్వ వ్యాప్తమైనది. ఏదైనా తెలియాలి అనగా దానిగురించి వివిధ కోణములలో ఆలోచించాలి. దానినే పరా ఙ్ఞానమని మూడవ నేత్రము పర అనబడే ఙ్ఞానము. ప్రతీ వ్యక్తి మూడవ నేత్రం కలిగియున్నాడు.మనస్సనే నేత్రముతో ఆలోచన చెయ్యాలి.శ్రీచక్రమనగా భూమండలమే దానికి మధ్యస్ధానమైన బిందువు కైలాస శిఖరం. సృష్టి శక్తి మూలము పార్వతీ పరమేశ్వర తత్వం. మనకు అటువంటి శక్తి అవగాహన కొరకు విష్ణు తత్వముగా తెలియుట. అదియును అసంపూర్ణమైన. బ్రహ్మ తత్వము స్పష్టంగా జీవ పరిణామం మునకు మెదటి తత్వం బ్రహ్మంగా తెలియుట. అది ప్రాకృతికంగా స్పష్టంగా తెలియుటకు వామనావతార తత్వం. అప్పటి వరకు మిగిలిన అవతార తత్వములు  సృష్టించిన పరబ్రహ్మ తత్వానికి కూడా తెలియదు. వామనుడినుండి పరశురామ రామ, కృష్ణ తత్వం పూర్ణ మానవ జీవ పరిమాణము తెలసినది.వామనూన౦ి అవతారం 5 అవతారం మానవునికి కూడా 5 వ నెలలోనే పూర్ణాకృతి దాల్చును.అయిననూ ఙ్ఞానమూ కలుగదు 6 వ నెల నుడి జీవికి ఙ్ఞాన పరంపర మెుదలు. అంతకుముందు వరకూ అసంపూర్ణ మానవ తత్వమైన జంతు లక్షణ సంబంధమైన ప్రకృతి.సాధనవలననే సమస్త విషయములు అవగాహన.అది సవ్యమైన రీతిలో కుతర్కాన్ని విడిచి సత్యదర్శనం చేయుట వలననే. ఎవరికి వారే ఆలోచన చేసిన తత్వం బోధ పడును.మనం అనంతమైన శక్తి రూపంలో గల తత్వమును  తెలుసుకొనే ప్రయత్నమే సాధన. అదే ఙ్ఞానం.ప్రతీ విషయాన్ని ఋషులు దర్శించి పరిపూర్ణ మానవుడు ఎలా మెులగవలెనో తెలిపి యుండిరి.మానవుడే తెలియవలెను. వేరే జీవ రూపంలో తెలియుట అసంభవం.ఋషులు దార్శనీకులు కావున.మనం కూడా అటువంటి దార్శనీయతకు సాధన ద్వారా ప్రయత్నం చేద్దాం. తెలుసుకుంటూనే వుందాం. 

ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..*


*(యాభై ఆరవ రోజు)*


శ్రీ స్వామివారి పేరు, ప్రఖ్యాతులు చుట్టుప్రక్కల గ్రామాల్లో వ్యాపించసాగాయి..శ్రీధరరావు గారింటికి అనేకమంది పండితులూ..ముముక్షువులూ.. సాధకులు  రావడం..శ్రీ స్వామివారిని కలవాలని కోరడం..శ్రీ స్వామివారి అవకాశాన్ని బట్టి వారితో మాట్లాడటం..జరుగుతోంది..


దాదాపుగా అందరి నోటా ఒకటే మాట.."ఈయన సాధారణ మానవుడు కాదు..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి ప్రతి రూపమే ఈ మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల్లో ఆశ్రమం కట్టుకొని సాధకుడి గా మారి నడయాడుతున్నాడు..మీ దంపతులు చేసుకున్న పుణ్యమే ఇది!.." అని..


శ్రీ విక్రాల శేషాచార్యులు గారు, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గారు (వీరిద్దరూ సంస్కృతాంధ్రములలో మహా పండితులు..శతావధానం చేసిన వారు..శ్రీ వైష్ణవులు..ఆదిదంపతులే కలసి వచ్చినట్లుగా భావిస్తారు వారిని చూసిన వారు..వీరి గురించి ఈ చరిత్ర మొదట్లో ప్రస్తావించడం జరిగింది..) శ్రీ స్వామివారిని చూడటానికి మొగలిచెర్ల వచ్చారు..ఆరోజు శ్రీ స్వామివారు కూడా ఈ దంపతుల కోసమే తీరుబడిగా ఉన్నట్లు..వారితో ఎంతో సేపు చర్చ చేశారు..దాదాపు రెండు గంటలపాటు ఆ దంపతుల తో శ్రీ స్వామివారు ఓపికగా మాట్లాడారు..


తిరిగి వచ్చేటప్పుడు గూడు బండిలో ఆ దంపతులిద్దరూ.."నాయనా శ్రీధరరావు, అమ్మా ప్రభావతీ..మీ పూర్వపుణ్యం వలన ఆ మహనీయుడు మీ బిడ్డగా సేవలందుకొంటున్నాడు.. ఆయనది "పరా" విద్య!..మాది కేవలం పాండిత్యం..జన్మజన్మల  సంస్కారం, తపస్సు, సాధన..ఈ మూడింటిముందు మా పాండిత్యం కేవలం గడ్డిపోచ వంటిది..ఆ మహానుభావుడి ని పరీక్షించడానికి మాబోటి వాళ్ళము వెయ్యిమందిమి వచ్చినా చాలము..అది ఆ తల్లి లలితా దేవి కరుణ తప్ప మరోటి కాదు..ఆ జ్యోతి ముందు మా విద్య సూర్యుడి ముందు చిన్న ప్రమిద లో వెలిగే దీపం లాంటిది..మీరు అదృష్టవంతులు!.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు వాళ్ళను మర్యాదచేసి..వారి పాదాలకు నమస్కరించి వాళ్ళను సాగనంపారు..ఆ ప్రక్కరోజే..ప్రభావతి గారి నాన్న గారు కూడా కావలి నుంచి కొంతమంది పండితులను వెంటబెట్టుకొని మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారిని చూసి తిరిగి వెళుతూ..ఆ పండితులందరూ ఈ దంపతుల సేవను పొగిడి వెళ్లారు..


ఈ వరుస ఘటనలతో..ప్రభావతి గారిలో ఒక మూల చిన్న అహంకారం మొలకెత్తింది..తాము ఒక మహనీయుడికి సేవ చేసినందునే ఈ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి..తామిద్దరం కూడా దైవాంశ సంభూతులమేమో?.. తాము అందరికన్నా అధికులము అనే భావన మెల్లిగా ఏర్పడసాగింది.. మరీ ముఖ్యంగా..పండితులందరూ ఏక కంఠంతో మెచ్చుకోవడం ఆవిడకు ఆనందాన్ని..అహాన్నీ పెంచాయి..


ఆరోజు మధ్యాహ్నం శ్రీధరరావు గారి స్నానానికి నీళ్లు పెట్టి..టవల్ తీసుకొని స్నానాలగదిలో పెట్టబోతున్నారు..అంతలో ఆ టవల్ లో దాక్కొని ఉన్న ఒక తేలు.. అందులోంచి జారి ప్రభావతి గారి కాలిమీద పడి.. ఒక్కసారిగా కుట్టింది..వెఱ్ఱి కేక పెట్టారు ప్రభావతి గారు..ఆ తేలు కూడా ఒక పట్టాన వదిలిపెట్టలేదు..ఈలోపల శ్రీధరరావు గారు వచ్చి తేలును చెప్పుతో కొట్టి చంపేశారు..కానీ అప్పటికే ప్రభావతి గారికి తేలు విషం మోకాలు పై భాగం దాకా ప్రాకిపోయింది..ఆవిడ విపరీతంగా బాధ పడుతున్నారు..సాయంత్రానికి కూడా బాధ తగ్గలేదు..


శ్రీ స్వామివారికి చెపితే ఏదైనా మంత్రం వేస్తారని.. అక్కడికి తీసుకుపొమ్మని గ్రామస్థులు శ్రీధరరావు గారికి చెప్పారు..వద్దని..ఓర్చుకుంటే తెల్లవారేలోపల తగ్గుతుందని శ్రీధరరావు గారు నచ్చచెప్పి వాళ్ళను పంపించివేశారు..


కానీ..శ్రీధరరావు దంపతులను తన తల్లిదండ్రుల వలె భావించే ఒక మనిషి మాత్రం వుండబట్టలేక..సైకిల్ వేసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోయాడు..


అక్కడ శ్రీ స్వామివారు ఆశ్రమం బైట తిరుగుతూ వున్నారు..ఈ మనిషి సైకిల్ దిగి, శ్రీ స్వామివారికి నమస్కరించి..ప్రభావతి గారికి తేలు కుట్టిన విషయమూ..ఆవిడ పడుతున్న బాధనూ వివరించాడు..


శ్రీ స్వామివారి సమాధానం..అహం తొలగడం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)