శ్రీ చక్రం వక పరిశీలన. బిందు త్రికోణ మధ్యే త్రికోణాంతర దీపికా. శక్తి బిందువు నుండి వ్యాప్తంగా అనంతమైనది. అది తెలియాలంటే పదార్ధ రూపం దాల్చవలెను. అటువంటిది షట్కోణాకృతిగల త్రిగుణములతో గూడిన ప్రకృతి తత్వమే.షట్కోణము అనంతమైన 64 చతుషష్టుపచారాఢ్యా, చతుషష్టి కళామయి, 64 కోణములు గలది అనగా శక్తి రూపమైనది.శ్రీ చక్రము. యిది సమస్త ప్రకృతి పరమైన శక్తి లక్షణములు గల భూమియే శ్రీ చక్రం. ఊర్ధ్వకోణ, అధోకోణ త్రిభుజ మిశ్రమమైన పురుష, ప్రకృతి శక్తుల కలయికయే శ్రీచక్రమునకు యంత్ర శక్తికి మూలము.దానిని పదార్ధ రూపమే మేరువు.మరియు మేరు పర్వత రూపంలో సుమేరు శృంగ మధ్యస్థయైన బిందు రూపమే కైలాస పర్వతం.దానినే మనం మేరువుగా పూజించుట. కైలాసపర్వతం ప్రకృతి పరంగా మేరు పర్వతమని తెలియుచున్నది. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే ,దేవతాస్తత్ర మెూదన్తి తన్మే మనః శివసంకల్ప మస్తు.సమస్త దేవతలకు మెూదము కలిగించేది కైలాసశిఖరం. యిది బిందు పూర్వక శ్రీచక్రమే మేరువుగా మనం తెలియవచ్చును. అచ్చటికి ప్రయాణం. గఛ్చంతు మహా మేరు అని వేదములో అరుణ ప్రశ్న తెలుపు చున్నది. అనగా దానిని అధిరోహించుటయనగా మెూక్మే పునరావృత్తి లేని జీవుడు. జీవునికి పునః పునః జన్మ లేకుండుట. దాని శక్తి తెలియాలి అంటే యీ రెండిటిని వ్యతిరేకముగా చూచిన ఎక్స్ ఆకారము దాల్చును.ఎక్స్ యనగా ఆరుద్ర,మూల రాహు కేతు మరియు మఘ, శతభిషం నక్షత్రముల కేతు రాహువులు రేఖల కలయిక వలన ఏర్పడిన శక్తి ఎక్స్ కిరణాలు వాని లక్షణములు. సమస్త ప్రకృతి శక్తి రూపము బిందువునుండి విశ్వ వ్యాప్తమైనది. ఏదైనా తెలియాలి అనగా దానిగురించి వివిధ కోణములలో ఆలోచించాలి. దానినే పరా ఙ్ఞానమని మూడవ నేత్రము పర అనబడే ఙ్ఞానము. ప్రతీ వ్యక్తి మూడవ నేత్రం కలిగియున్నాడు.మనస్సనే నేత్రముతో ఆలోచన చెయ్యాలి.శ్రీచక్రమనగా భూమండలమే దానికి మధ్యస్ధానమైన బిందువు కైలాస శిఖరం. సృష్టి శక్తి మూలము పార్వతీ పరమేశ్వర తత్వం. మనకు అటువంటి శక్తి అవగాహన కొరకు విష్ణు తత్వముగా తెలియుట. అదియును అసంపూర్ణమైన. బ్రహ్మ తత్వము స్పష్టంగా జీవ పరిణామం మునకు మెదటి తత్వం బ్రహ్మంగా తెలియుట. అది ప్రాకృతికంగా స్పష్టంగా తెలియుటకు వామనావతార తత్వం. అప్పటి వరకు మిగిలిన అవతార తత్వములు సృష్టించిన పరబ్రహ్మ తత్వానికి కూడా తెలియదు. వామనుడినుండి పరశురామ రామ, కృష్ణ తత్వం పూర్ణ మానవ జీవ పరిమాణము తెలసినది.వామనూన౦ి అవతారం 5 అవతారం మానవునికి కూడా 5 వ నెలలోనే పూర్ణాకృతి దాల్చును.అయిననూ ఙ్ఞానమూ కలుగదు 6 వ నెల నుడి జీవికి ఙ్ఞాన పరంపర మెుదలు. అంతకుముందు వరకూ అసంపూర్ణ మానవ తత్వమైన జంతు లక్షణ సంబంధమైన ప్రకృతి.సాధనవలననే సమస్త విషయములు అవగాహన.అది సవ్యమైన రీతిలో కుతర్కాన్ని విడిచి సత్యదర్శనం చేయుట వలననే. ఎవరికి వారే ఆలోచన చేసిన తత్వం బోధ పడును.మనం అనంతమైన శక్తి రూపంలో గల తత్వమును తెలుసుకొనే ప్రయత్నమే సాధన. అదే ఙ్ఞానం.ప్రతీ విషయాన్ని ఋషులు దర్శించి పరిపూర్ణ మానవుడు ఎలా మెులగవలెనో తెలిపి యుండిరి.మానవుడే తెలియవలెను. వేరే జీవ రూపంలో తెలియుట అసంభవం.ఋషులు దార్శనీకులు కావున.మనం కూడా అటువంటి దార్శనీయతకు సాధన ద్వారా ప్రయత్నం చేద్దాం. తెలుసుకుంటూనే వుందాం.
ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి