8, జులై 2021, గురువారం

బ్రహ్మమొక్కటే

 బ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే... 


🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మాట్లాడే మాటకు, స్పృశించే శరీరానికి, భావించే మనసుకు అందిన విషయాలను లోకంలో మానవులు సామాన్య విషయాలుగానే భావిస్తారు. మాటకు దొరకకుండా, శరీరానికి అందకుండా, మనసుకు కూడా భావించే శక్తి చాలకుండా ఉండే అద్వితీయశక్తి ఉన్నదా అంటే అదే 'పరబ్రహ్మ' అనే సమాధానం వస్తుంది. పరబ్రహ్మ ఎప్పుడూ అసాధారణ విషయమే. అద్భుతవృత్తమే. అమృతస్వరూపమే.

అందినవాటిని సునాయాసంగా పొందడం, అందనివాటికోసం అర్రులు చాచడం మానవ స్వభావం. ఈ స్వభావమే మనిషిని పరబ్రహ్మతత్వాన్వేషణకు పురిగొల్పింది. కానీ పరబ్రహ్మ ఎప్పుడూ అందినట్లే అనిపిస్తూ, ఎంతకూ దొరకని చరమగమ్యమే. ఈ తత్వాన్ని చర్చించడానికి పూనుకొని సమస్త వాఞ్మయాలూ అలసిపోయాయేగాని, పరతత్వం సంపూర్ణంగా ఇంకా అందనే లేదు. అందుకే ఎవరికి తోచినట్లు వారు నిర్వచించడం ప్రారంభించారు. నిర్వచించడానికి మాటలు చాలని గంభీర విషయం పరబ్రహ్మతత్వం.


తెలిసినంత వరకు పరబ్రహ్మను వర్ణించడానికి అందమైన పదబంధాలను ప్రయోగించారు కవులు. సుందరంగా ఉన్న చెవికమ్మలోని బంగారంలా, సముద్రంలో మమేకమైన నీటిబొట్టులా, భేదంలో అభేదంలా పరబ్రహ్మ భాసిస్తోందని విశ్లేషించారు. ఏ చోటనైనా, ఏ విధంగానైనా పూజకు అనుగుణంగా ఉండేదే పరబ్రహ్మ అనీ, ఆ స్వరూపం ఎలా ఉన్నా సరే ఆరాధనకు యోగ్యమని పెద్దల మాట. పుట్టడం, జీవించడం, మరణించడం అనే ప్రక్రియలు కళ్లముందే కనబడుతున్నాయి. నిలబడేందుకు, సంచరించేందుకు ప్రదేశాలు విశాలంగా ఉన్నాయి. కాలమూ అనంతంగా సాగిపోతోంది. చరాచరాలూ ప్రత్యక్షాలే. ఇవన్నీ పరబ్రహ్మమూర్తులు కాదా? మండుటెండలో ఎడారి ఇసుకపై నీటిజాడలా కనబడుతూ, ఆ తరవాత అది నీరు కాదనీ, ఎండమావి అనీ తెలిసే సత్యం పరబ్రహ్మ స్వరూపమే! మసక చీకటిలో పాములా కనబడి భయపెట్టిన వస్తువు, తాడు అని తెలిసినప్పుడు అనుభవంలోకి వచ్చిన జ్ఞానం పరబ్రహ్మ స్వరూపమే!


ఈ విశ్వమంతా దేనినుంచి పుడుతున్నదో, దేనిలో నిలుస్తున్నదో, కాలం మూడినప్పుడు దేనిలో లయిస్తున్నదో ఆ పరంజ్యోతి వెలుగులోనే ఈ లోకమంతా కళ్లకు కనబడుతుంది. ఆ వెలుగే వెలగకపోతే భౌతికంగా ఏర్పరచుకొన్న దీపాలేవీ వెలగవు. ఆ వెలుగే పరబ్రహ్మస్వరూపం.


జీవుడు వేరనీ, దేవుడు వేరనీ మనుషులు భావిస్తారు- పరమార్థం మాత్రం అంతా ఒకటే. బ్రహ్మ అనీ, విష్ణువు అనీ, శివుడు అనీ, ఇంద్రుడు అనీ, సూర్యుడు అనీ చంద్రుడు అనీ, ఎన్ని పేర్లతోనైనా, ఎన్ని రూపాలతోనైనా పరబ్రహ్మను దర్శించవచ్చు కానీ- అవన్నీ పరబ్రహ్మలోని అంశాలే కానీ వేరు కావు. అసలు 'వేరే' అనే పదార్థమే లేదు.


పరబ్రహ్మ విశ్వరూపం సామాన్యుల కన్నులకు సంపూర్ణంగా కనబడటం అసాధ్యం. అందుకే ఒక కవి- 'బ్రహ్మ, దక్షుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, వాయువు, అగ్ని, చంద్రుడు, ఇంద్రుడు, రుద్రుడు, పర్వతాలు, నదులు, సముద్రాలు, గ్రహ సముదాయాలు, మనుషులు, దైత్యులు, గంధర్వులు, నాగులు, ద్వీపాలు, నక్షత్రాలు, సూర్యుడు, మునులు, ఆకాశం, భూమి, అశ్వినులు... ఇలా అన్నీ ఏ తనువులో లీనమై ఉంటాయో అదే విశ్వరూప'మని వర్ణిస్తాడు.


పుష్పదంతుడు అనే గంధర్వుడు తన శివమహిమ్న స్తోత్రంలో- మనుషులు తమ తమ అభిరుచులను అనుసరించి పరబ్రహ్మను వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నారనీ, ఏ మూర్తిని ఆరాధించినా చివరికి ఆ పూజ చేరేది ఒకే పరబ్రహ్మలోనే అని అంటాడు.


భవబంధాలు, రాగద్వేషాలు, ఎక్కడ నశించిపోతాయో... అదే పరబ్రహ్మ స్వరూపం. అది వివరించడానికి సాధ్యంకాదు. ప్రేమతో చూసినప్పుడు అలరింపజేసే సుందరి ముఖం అనే చంద్రబింబంలా హృదయంలో అమందానందాన్ని అందించగలదు. దాన్ని తలచుకుంటే చాలు- ఎంత కాలంగానో పెనవేసుకొని ఉన్న చిక్కుముడులన్నీ తొలగిపోతాయి. నిరాశలు, నిస్పృహలు ఉండవు. ఎటు చూసినా వెలుగులే కనబడతాయి. మనసులో సైతం చీకట్లు ఉండవు. ఆహ్లాదం పరిపూర్ణమే కాదు, శాశ్వతం అవుతుంది.


జై శ్రీమన్నారాయణ🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

భగవంతుడు సర్వ వ్యాపి

 భగవంతుడు సర్వ వ్యాపి అన్న విషయాన్ని పలువిధాలుగా అర్థం చేసుకుంటారు. కొంతమంది తూర్పు దేశ తత్వవేత్తలు, ఈ లోకము, భగవంతుని పరిణామమే (transformation) అని నమ్ముతారు. ఉదాహరణకి, పాలు అనేవి ఒక కల్మషములేని పదార్ధము. పుల్లని పదార్థ సంపర్కంచే అది పెరుగుగా మారుతుంది. అంటే, అది మారినప్పుడు, పెరుగు అనేది పాల యొక్క పరిణామమే. ఈ ప్రకారంగా, పరిణామ వాద ప్రవక్తలు, భగవంతుడే ఈ జగత్తు లాగ మారిపోయాడు అని చెప్తారు.


కొందరు తత్వవేత్తలు, ఈ జగత్తు వివర్తము (ఒక వస్తువును ఇంకోలా తప్పుగాఅనుకోవటం) అంటారు. ఉదాహరణకి, చీకట్లో ఒక తాడుని పాములా అనుకోవచ్చు. వెన్నెలలో మెరిసే నత్తగుల్లని వెండిగా పోరపాటుపడవచ్చు. అదే విధంగా, వారు అనేదేమిటంటే, ఉన్నదంతా దేవుడే, ఈ లోకం లేదు అని, మనం జగత్తుగా చూసేదంతా నిజానికి బ్రహ్మమే అని.

కానీ భగవద్గీత 7వ అధ్యాయం 4 మరియు 5వ శ్లోకాల ప్రకారం ఈ జగత్తు పరిణామము కాదు, వివర్తమూ కాదు. అది భగవంతుని యొక్క మాయా శక్తి అనే భౌతిక శక్తి ద్వారా సృష్టించబడినది. జీవాత్మలు కూడా భగవంతుని శక్తి స్వరూపమే, కానీ వారు ఆయన యొక్క ఉత్కృష్ట స్థాయి, జీవ శక్తి. కాబట్టి ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్న అన్ని జీవులు రెండూ భగవంతుని శక్తి స్వరూపములే మరియు ఆయన వ్యక్తిత్వము లోని భాగములే. అయినా, తను సర్వ భూతములకు అతీతుడను (వాటిలో వసించను) అని చెప్తున్నాడు; అంటే పరిమితమైన వాటి యందు, అనంతమై ఉన్నది, ఇమిడి ఉండలేదు. ఇది ఎందుకంటే ఆయన ఈ రెండు శక్తి స్వరూపాల మొత్తం కన్నా ఎంతో ఎక్కువైనవాడు. 


ఎలాగైతే సముద్రము ఎన్నో అలలను విడుదల చేస్తుంటుందో, మరియు ఈ అలలన్నీ సముద్రము లోని భాగములే అయినా, సముద్రము అనేది ఈ సమస్త అలల మొత్తానికన్నా ఎంతో ఎక్కువే. అదే విధంగా, జీవులు మరియు మాయ భగవంతుని వ్యక్తిత్వంలోని భాగమే, అయినా, ఆయన వాటికన్నా ఉన్నతుడు, అతీతుడు.


🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩

సంస్కృతభాష

 *సంస్కృతభాష ప్రపంచాన్ని_తనవైపు_తిప్పుకుంటోంది*


సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన *ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది*.


1.NASA వారి ప్రకారం *ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే*.


2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ *ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.*


3. ప్రస్తుతానికి *సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.*


4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు *'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.*


5.NASA వద్ద *ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.*


6.1987 లో Forbes మ్యాగజీన్ *computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.*


7. మిగతా భాషలతో పోలిస్తే *సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.*


8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, *నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.*


9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం *సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.*


10. *సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం*.


11. *జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.*


12. *NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది*.


13. *ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.*


14. *NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే*.


15. *సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు.*


16. *ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో ( కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా ) Technical Courses లో సంస్కృతబోధన జరుగుతోంది.*


*ఇప్పుడు చెప్పండి. సంస్కృతం ఆవశ్యకమా? కాదా?*


*నా భూమి ఖర్మ భూమి, ఈ ప్రపంచానికి ధర్మ భూమి*

🇮🇳🇮🇳🇮🇳🕉️🔱🕉️🏹🕉️

మంత్రిణీన్యస్త రాజ్యధూః

 786. 🔱🙏  మంత్రిణీన్యస్త రాజ్యధూః 🙏🔱

ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *మంత్రిణిన్యస్తరాజ్యధురేనమః* అని చెప్పాలి.

మంత్రిణీ = మంత్రిణి అయిన శ్యామలాదేవి యందు, 

న్యస్త = ఉంచబడిన రాజ్య ధూః= రాజ్యభారము కలది.

అమ్మవారికి 16 మంది మంత్రిణులుంటారు.  ఈ పదహారు మంది మంత్రిణులలో అతి ముఖ్యురాలు శ్యామలాదేవి. విశ్వసామ్రాజ్య పరిపాలనా బాధ్యతలను అమ్మవారు ఈ శ్యామలా దేవి మీద ఉంచుతుంది. శ్యా మాలా దేవి - కృష్ణ (లేదా విష్ణు) సంబంధమైన దేవి. (శ్రీ కృష్ణ, శ్యామలాదేవి శ్రీరామోలలితాంబికా) విష్ణువు జగత్పోషక కారుడు కాబట్టి, అమ్మవారు రాజ్యాన్ని - విష్ణు సంబంధమైన శ్యామలాదేవికి అప్పచెప్పింది.

‘మంత్రి' అనే పుంలింగ శబ్దానికి 'మంత్రిణీ' అనేది స్త్రీలింగ పదం. మంత్రములో సలహా ఇచ్చేవాణ్ణి 'మంత్రి' అంటారు. మంత్రాన్ని ఉచ్చరించడానికి లోపల సంకల్పంగా పనిచేస్తూ మన చేత' ఓం - సోహం - ర్- నాదం' మొదలైనవాటి ఉచ్చారణ సహకారంతో మాటలను పలికించేది, ఆలోచనలను కలుగ చేయునది కూడా కాబట్టి - శ్యామల - మంత్రిణి అయింది.

'మంత్రిణి అయిన శ్యామలాదేవి యందు ఉంచబడిన రాజ్య భారము కలది' అని ఈ నామానికి అర్థం.

🙏ఓం ఐం హ్రీం శ్రీం మంత్రిణిన్యస్తరాజ్యధురేనమః 🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

కాలమా!! ఎలా అయిపోతివే!!!"

 "కాలమా!! ఎలా అయిపోతివే!!!"  

※   ∞  ※ ∞  ※  ∞  ※  ∞  ※  ∞   ※


కాకికి పిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ.. ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తోంది.


"పంతులుగారు! ఒకవేళ కాకిముట్టకుంటే ఎలా?" ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు.


"ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం" అని ఉంది.ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లలో కూడా వేయొచ్చు జలచరాలకు...చెప్పారు పంతులుగారు.


"లేదు కాకి వచ్చిముడుతేనే  ఆత్మశాంతి కలిగినట్లు!

అప్పటివరకు ఇక్కడి నుండి జరిగేదే లేదు. వేచి చూడవలసిందే!!" ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్దావిడ.

ఆమె చనిపోయిన వ్యక్తి తరుపున వచ్చిన ఏకైక బంధువు.అతని పెద్దమ్మ కూతురు.


మిగతా బంధువులంతా చనిపోయిన వ్యక్తి కోడలు తరుపు బంధువులు


"ఇంకెక్కడి కాకులు! కాకులు కనిపిస్తున్నాయా అసలు!! కాకులన్నీ లోకులై పుడుతేనూ!!" జోక్ చేశారు వచ్చిన బంధువుల్లో ఒకరు. ఇద్దరు  నవ్వారు.


సమయం కానీ సమయంలో జోక్ చేసిన వాళ్ళ వైపు తీక్షణంగా చూసింది పెద్దావిడ.


"అబ్బా! ఈ ముసలాడు బతికి ఉన్నన్నినాళ్ళు సాధించాడు..చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు" అన్నాడు కర్మకాండ చేస్తున్నవ్యక్తికి స్వయంగా పిల్లనిచ్చిన మామ.


"అవును" అన్నట్లుగా తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు.. తన మామ అన్న మాటలకు..


ఈ మమాఅల్లుళ్ళ ప్రవర్తనకు పెద్దావిడకి బాగా కోపమొచ్చింది..


చనిపోయిన వ్యక్తంటే ఆమెకి బాగా గౌరవం.పేదరికంలో పుట్టినా కష్టపడి పైకివచ్చాడు. కొడుకు 10వతరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్ళీ పెళ్లిచేసుకోలేదు.కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు. కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండడం వల్ల ..కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు.కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు.3 సంవత్సరాల క్రిందటి నుండి మంచం పట్టాడు. చేసేది లేక తండ్రిని తీసుకెళ్లి తనదగ్గరే ఉంచుకున్నాడు కొడుకు.


కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలనుకున్నాడు.

తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తివచ్చింది.

తిరిగివచ్చే 10 రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు సడ్డకుడు(తోడల్లుడు).


"లేదు!ఇలా మంచంమీదనే ఉండేవాళ్ళని తీసుకోరు! అదీగాక, ఇతరుల దృష్టిలో కూడా బావుండదు! "అంది భార్య.


చివరకు అనేక చర్చల తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒకరూంకు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకుని 10 రోజులవరకు తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయి మాట్లాడి టూర్ కు బయలుదేరారు.


ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని, అదే రోజు రాత్రి తెల్లరేటప్పుడు గుండెపోటుతో మరణించాడు. 


టూర్ వెళ్లిన అందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది.అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చారు.అంత్యక్రియలకు ఊరుఊరంతా హాజరయ్యారు. తర్వాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు.


"బతికిఉన్నన్నినాళ్ళు ఏం కష్టపెట్టాడ్రా??మీ నాన్నా!!" అడిగింది పెద్దావిడ.


"నీకేం తెలుసే అత్తమ్మా! 3 సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో!!


ఈ ఆరునెలల నుండి మరీనూ!! అన్నీ మంచం మీదే!!

వాటికోసం పెద్దజీతానికి మనిషిని మాట్లాడవలసి వచ్చింది.

వాడు రాత్రికి ఉండడు కదా!..రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది!" అన్నాడు కొడుకు సమాధానంగా...


"అదొక్కటేనా!!!!

చాలా రాత్రివరకు కూడా కాళ్ళు నొక్కించుకుంటూనే ఉండేవాడు..తొందరగా వదిలిపెట్టేవాడు కాదు!!" చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్ గా!!


" ఓహో అంతేనా!

నీకు చిన్నప్పుడు రెండు  సంవత్సరాల పాటు ఆల్బమినో..గిల్బమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....


మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కృంగిన నీకు ఫీట్స్ వస్తుంటే..సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకుని సేవచేస్తూనే ఉన్నాడే!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....


మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళిచోసుకోరా!! అంటూ మేమెంత పోరినా "వచ్చేదేలాంటిది వస్తుందో నా కొడుకు దిక్కులేనివాడౌతాడే!! "అంటూ నీ కోసం తనసుఖాలన్నీ వదులుకున్నాడుగా!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....


"నేను దరిద్రంలో పుట్టి పెరిగాను..నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దారపోసి జాగలు.. భూములు.. నగా నట్రా అన్నీ జమచేసి ఇచ్చాడుగా!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....


నువ్వెప్పుడు బిజీగా ఉంటావు..ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చెయ్యడానికి కూడా వెనుకాముందయ్యేవాడు..

నీతో మాట్లాడుదామనుకున్న మాటలన్ని ఒక డైరీలో రాసేవాడు.. మీ నాన్నమీద ప్రేముంటే ఇంట్లో వెతికి చదువురా దాన్ని!!


పగలనకా రాత్రనకా కష్టపడి నీకోసం ముప్పై ఏండ్లు సేవచేసినోడికి మూడేండ్ల సేవ చేయడం "సాధించడం " క్రిందకైంది కదూ!!నీకు!

అయినా ఎలా తెలుస్తుందిలే!!మీ నాన్న విలువా!!ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నాడివాయే!! తండ్రి కష్టం..విలువా..బంధం చూస్తేనే కదా తెలిసేది!!

చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది!!


పెద్దసంబంధం!! సుఖపడతావని.. పెళ్లిచేసాడు..


ఎవరో మహాకవి అన్నాట్టా!!


" సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామనే ఆశతో వెళ్ళాను! చివరకు ఆ సముద్రమే మింగివైచినది!!"అని.


అలా అయింది మీ నాన్న పరిస్థితి.


ఏమయ్యా పెద్దమనిషి !నువ్వైనా చెప్పొద్దూ!!

ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాళ్ళు ఎందుకు నొక్కిచ్చుకున్నాడో!!!....


ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం "పుత్రపరిష్వంగమేనయ్యా"!!! ..పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చెబుతున్నాయావిషయం. కొడుకుని కావలించుకోవడం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా!!


ఆ వయస్సులో భార్య..ప్రియురాలు.. ఎవరి స్పర్శ సుఖమనిపించదు.. ఏ వయస్సులోనైనా సుఖాన్నిచ్చేది తన సంతానం స్పర్శనేనయ్యా!!


ఇదికూడా తెలియక పేద్ద.. చెప్పొచ్చావ్!!


తన చివరి వయస్సులోనైనా కొడుకుతో ప్రేమసుఖం పొందడానికేనయ్యా!! వాడు కాళ్ళు నొక్కించుకున్నది!!


నీకూ వయసొస్తుంది! అప్పుడర్థమైతుందయ్యా ఇదంతా!!""


తల్లిలేదు! తండ్రిలేడు!!

ప్రేమలేదు!బంధం లేదు!!

కాలమా!! ఎలా అయిపోతివే!!!""


అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ !!!!!


అప్పుడేడ్చాడు కొడుకు 

నిజంగా..

గుండె పగిలేలా..మనుసునిండా..

తండ్రి గుర్తొచ్చి..

తండ్రిప్రేమ గుర్తొచ్చి..

తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి..

తన జీవితమంతా కళ్ళముందు కదిలి.. 

...పశ్చాత్తాపంతో


అతన్ని చూసి కోడలూ..వియ్యంకుడు.. బంధువులు.. ఇలా అందరూ ఏడవసాగారు.


కొందరికి తమ తమ తండ్రి గుర్తుకురాగా!..

మరికొందరికి తమ తండ్రితనం..పిల్లలకోసం పడిన కష్టం గుర్తుకురాగా!!

 ఇంకా కొందరికి ఆ పెద్దావిడ"కాలమా!! ఎలా అయిపోతివే!!!" అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతోందో అనే వేదన కలగడం వల్ల.....


పుత్రధర్మాన్ని కావుమంటూ(రక్షించుమంటూ)

అప్పుడొచ్చాయి ఒక్కసారిగా!

కావు.. కావు మంటూ!!

అంతవరకు ఎక్కడాలేని కాకులు!!! 

"కాకిపిండాన్ని " తినడానికి!!!!


               *ధర్మో రక్షతి రక్షితః*

🔸 ♾ ꕥ ♾   ॐ    ♾ ꕥ ♾ 🔸

      *ఓం మధుసూదనాయ నమః*

🔸 ♾ ꕥ ♾    🧘🏻‍♂️    ♾ ꕥ ♾ 🔸

న్యాసము..* *(చివరి భాగము)*

 *న్యాసము..* *(చివరి భాగము)*


సాధారణంగా ఏ మంత్రాన్ని ఏ దేవతను మనం జపము ధ్యానము చేయదలచుకున్నామో ఆ మంత్రానికి సంబంధించిన భాగాలను ఆ  దేవత కు సంబంధించిన రూపాన్ని మన శరీరంలో మనసులో ముందుగా నిలుపుకోవాలి. అలా నిలుపుకోవడమే న్యాసము అని పిలుస్తారు. న్యాసము మొదటిది. తరువాతది మంత్రజపము. ఆ తరువాతది మానసిక ధ్యానము. ఆఖరి మెట్టు సగుణోపాసన ( దర్శనము లేదా సాక్షాత్కారానికి ప్రయత్నము). 


 ఈ న్యాసము రెండు విధాలు. కాలి గోరు దగ్గర్నుంచి తల వెంట్రుకల వరకూ ఆపాదమస్తకం ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగాన్ని వివరణాత్మకంగా నూ సమగ్రం గానూ నిలిప డాన్ని మహాన్యాసము అంటారు. అలా కాకుండా ప్రధానమైన శరీర భాగాలు మనసు వీటిలో మంత్రానికి సంబంధించిన దేవత కు సంబంధించిన ముఖ్య విషయాలను నిలపడాన్ని లఘున్యాసము లేదా సాధారణ న్యాసము అంటారు. న్యాసం పూర్తయితే ధ్యానం చేసేవాడి దేహమే దేవాలయం గానూ అందులో ఉండే జీవుడే అతను ధ్యానం చేసే దేవత గాను మారినట్లుగా భావన చెయ్యాలి. 


వ్యవహారంలో వేదంలోని రుద్రాన్ని మహాన్యాస పూర్వకం గా చేస్తే మహాన్యాసం అని మామూలు న్యాసంతో చేస్తే లఘున్యాసం అని వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు మనం చేస్తున్న చర్చ కు రుద్రా ని కి సంబంధం లేదు. 


 సాధారణంగా న్యాసము అంగన్యాసము కరన్యాసము అని రెండు భాగాలుగా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మంత్రాన్ని ప్రధానంగా ఆరు భాగాలుగా చేస్తారు. ఈ ఆరు భాగాలు కాక ఆ మంత్రాన్ని మొదటిసారిగా దర్శించి మానవాళికి అందించిన రుషి పేరును ఆ మంత్రం నిర్మింపబడిన ఛందస్సును ఆ మంత్రం ద్వారా సూచింపబడే దేవతను కలిపి న్యాసం చేస్తారు. ఇవి కాక  బీజాక్షర న్యాసము మాంత్రిక న్యాసము  కూడా ఉన్నాయి. పాంచరాత్ర ఆగమం ప్రకారం లఘున్యాసం లో కూడా 16 భాగాలుంటాయి. ఆ పద్ధతి అంతగా ప్రచారంలో లేదు. 


ప్రస్తుతం వ్యవహారంలో  సాధారణ న్యాసం లో 1. ఋషి 2. చందస్సు 3. దేవత 4. బీజం 5. శక్తి 6. మంత్రం 7. కీలకం 8. అస్త్రం 9. నేత్రం 10. కవచం 11. దిగ్బంధనం 12. ధ్యానం 13. వినియోగం అనే భాగాలు ఉంటాయి. ఏ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటామో సాంప్రదాయం ప్రకారం ఆ మంత్ర భాగాలను చెబుతూ ఆయా శరీర భాగాలను స్పృసించు కోవాలి.  కరన్యాసం లో అయితే చేతి వేళ్ళు అరచెయ్యి చేతి వెనక భాగము వీటిని ముట్టుకోవాలి. కరన్యాసము లో పంచభూతాలను వాటి వాటి బీజాక్షరాలతో చేతి వేళ్ళ చివర న్యాసం చేసి మనం ఉపాసించే దేవత సర్వభూత త్మకమైన శక్తి గా భావించి ఆ శక్తిని చేతిలోకి ఆవాహన చేసుకోవాలి.   అంగన్యాస కరన్యాసాలలో ఏ శరీర భాగం తో ఏ శరీర భాగాన్ని ముట్టుకోవాలో గురువుల దగ్గర కూర్చొని చూసి నేర్చుకోవాలి.


 ఋషి చందస్సు ఇందాక అయిపోయినాయి. దేవత అన్నప్పుడు ప్రార్ధన శ్లోకాన్ని బట్టి ఆ దేవత యొక్క రూపాన్ని ఊహించుకుంటూ ఆ దేవత పేరు చెప్పాలి.  బీజము శక్తి అనేవి మంత్రంలో ముఖ్య భాగములు. కీలకము అంటే కట్టు కొయ్య. ఆవులు మొదలైన జంతువులను తాడుతో కట్టడానికి నేలలో పాతే రాట. ధ్యానం చేసేవాడు కీలకం యొక్క పరిధిని దాటి పోకూడదు. బీజము శక్తితో కూడిన మంత్రానికి ఏకాగ్రతను కలిపితే అది అస్త్రం గా మారుతుంది. అప్పుడు అంతర్ముఖంగా ఉన్న కళ్ళకు బృకుటి దగ్గరగానీ హృదయం దగ్గర కానీ భగవద్దర్శనం జరగాలి. ఇది నేత్రం. ( లో పలి చూపు). ధ్యాన భంగం లోపలి కారణాలవల్ల బయట కారణాలవల్ల రెండు విధాలుగా జరగొచ్చు. వాటిని నిరోధించడానికి కవచము దిగ్బంధం చేసుకోవాలి. ధ్యానం అనేది దేవతా రూపాన్ని తెలియజేసేది. వినియోగం అనేది సంకల్పము. ఇవి న్యాసం లో ఉండే భాగాలు.


Self Hypnotism సాధన చేసేటప్పుడు తల నుంచి కాళ్ల వరకు లేదా కాళ్ళ నుంచి తల వరకు శరీర భాగాలను క్రమక్రమంగా relax చేసుకుంటూ రావాలి. అది పూర్తయిన తర్వాత Self Hypnotism లోపలికి వెళ్తాము. ఇది సైన్స్ అంగీకరించిన విషయము. హిప్నటిజం లోనూ ధ్యానం లోనూ trance లోపలికి వెళ్తాము. 


కానీ... *ధ్యానం అనేది హిప్నాటిజం మించి చాలా ఎత్తులో ఉన్న విషయము. దానిని ప్రస్తుతం సైన్స్ అందుకోలేదు..*

 

పైన చెప్పిన విషయాలను ఉదాహరణ పూర్వకంగా తెలుసుకోవడానికి విష్ణు సహస్రనామ మాలా మంత్రానికి సంబంధించిన న్యాస భాగాలను పరామర్శిద్దాము.


 వేదవ్యాసుడు ఋషి. అనుష్టుప్ ఛందస్సు. శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణుడు దేవత. అమృతాంశూద్భవో భానుః అనేది బీజం. దేవకీనందన స్రష్ట అనేది శక్తి. ఉద్భవః క్షోభనః దేవ అనేది మంత్రము. శంఖ భ్తృత్ నందకీ చక్రీ అనేది కీలకము. శార్జ్ఞధన్వా గదాధర అనేది అస్త్రము. రథాంగపాణిః అక్షోభ్య  అనేది నేత్రము. త్రిసామా సామగస్సామా అనేది కవచము. ఋతు సుదర్శనః కాల అనేది దిగ్బంధము. విశ్వరూప అనేది ధ్యానము. శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్ధం జపించాలి అనేది వినియోగము.


ఈ మంత్రం లో కవచం తర్వాత ఆనందం పర బ్రహ్మేతి యోనిః అని ఉన్నది. మిగతా మంత్రాలలో ఎక్కడా ఇలా ఉండదు. ఆనంద స్వరూపుడు అయిన పరబ్రహ్మమే మూలము అని దాని అర్థం. ఈ మాటకు న్యాసానికి సంబంధం ఏమిటి. న్యాసము అంటే మనలో పలే భగవంతుడిని నిలుపుకోవటం అనుకున్నాం కదా. పైన చెప్పిన మంత్రము ఆ భగవంతుడి లక్షణాన్ని వివరిస్తుంది. పరబ్రహ్మ యొక్క ముఖ్య లక్షణం ఆనందము. ఆ సత్ చిత్ ఆనంద సమాహారమైన పరబ్రహ్మయే సృష్టికి మూలము. నేను నా లోపల దర్శించ బోయే భగవంతుడు సత్ చిత్ ఆనందమయుడై న బ్రహ్మ అనే జ్ఞానాన్ని కూడా ఈ న్యాసంలో ప్రత్యేకంగా ఇమిడ్చారు. ఇది విష్ణు సహస్రనామం తాలూకు న్యాసంలో ఉన్న ప్రత్యేకత. 


విష్ణు సహస్రనామం యొక్క అధిష్టాన దేవత సాకార దేవత అయినప్పటికీ ఆయనే నిరాకారుడైన పరబ్రహ్మము అనే విషయాన్ని సూచించడం వల్ల ధ్యానం చేసేవాడు భగవత్సాక్షాత్కారమే కాకుండా కైవల్య స్థితిని పొందడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇది దీని ప్రత్యేకత. 

 


*పవని నాగ ప్రదీప్.*

ప్రశ్న పత్రం సంఖ్య: 8

 ప్రశ్న పత్రం సంఖ్య: 8                             కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ ప్రశ్న పత్రం సర్వ జన ప్రయోజనకరంగా వుండే విషయాలను తీసుకొని తయారు చేయబడినది. కాబట్టి అందరు దీనిని కూలంకుషంగా చదివి జవాబులు ఇవ్వ ప్రయత్నించండి.  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  

1) ఇంట్లో శిశువు జన్మించినప్పుడు బర్త్ సర్టిఫికెట్ కోసం ఎక్కడ దర్జీ పెట్టాలి. 

2) బర్త్ సర్టిఫికెట్ కోసం ఏ ఏ డాకుమెంట్లు సమర్పించాలి. 

3) జనన మరణ రిజిస్టరు ఏ కార్యాలయంలో ఉంటుంది. 

4) సాధారణ చే బదులుగా అప్పు తీసుకున్నప్పుడు వ్రాయించుకొనే దాస్తావైజు ఏమిటి.  

5) ప్రామిసరీ నోటు ఎవరు ఎవరికి వాసి ఇస్తారు. 

6) ప్రామిసరీ నోటుకు స్టాంపు డ్యూటీ ఉంటుందా, ఉంటే యెంత కట్టాలి. 

7) ప్రామిసరీ నోటు దాస్తావీజు స్టాంపు కాగితం మీద వ్రాస్తే చెల్లుబాటు అవుతుందా. 

8) ప్రామిసరీ నోటు మీద పోస్టల్  స్టాంపు అతికిస్తే  చెల్లుబాటు అవుతుందా. 

9) రెవెన్యూ స్టాంపు అంటే ఏమిటి.  దానిని ఎప్పుడు వాడతారు. 

10) ప్రామిసరీ నోటు సంబంధిత బాకీ వాసులు కాకపొతే యెంత కాలంలో కోర్టులో దావా వెయ్యాలి. 

11) కాల దోషం పట్టిన ప్రామిసరీ నోటు కోర్టులో పనికి వస్తుందా. 

12) ప్రామిసరీ నోటు మీద వేసే వాజ్యం సివిల్ కేసా లేక క్రిమినాలు కేసా 

13)అప్పు చెల్లు చేయటానికి ఇచ్చిన చెక్కు చెల్లక పొతే వేసే కేసు సివిల్ కేసా లేక క్రిమినల్ కేసా 

14)ప్రామిసరీ నోటుపై దావా వేయటానికి లాయరు నోటీసు ఇవ్వటం తప్పనిసరా. 

ప్రామిసరీ నోటు విషయమై నేను దూరదర్శన్ యాదగిరిలో పాల్గొన్న ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని క్రింది లింకు ఫై క్లిక్ చేసి చూడగలరు 


https://www.youtube.com/watch?v=Ku7Vc_Uhnhk&t=619s 



15) చెక్కు బౌన్స్ కేసు వేయటానికి లాయరు నోటీసు ఇవ్వటం తప్పనిసరా. 

16) సంపాదనా పరుడైన భర్త భార్యను వదలి వేసిన ఆ భార్య భర్త నుండి భరణం పొందవచ్చా 

17)  సంపాదనా పరుడైన తండ్రి మైనారు పిల్లలను పట్టించుకోక పొతే వారు అతని నుండి భరణం పొందవచ్చా 

18) మన దేశంలో భార్య భర్తలు ఒకరి నుండి ఇంకొకరు విడాకులు తీసుకోవాలంటే ఏ కోర్టుని ఆశ్రయించాలి. 

19) కుటుంబ న్యాయస్థాన పరిధిలో వచ్చే కేసులు ఏమిటి. 

20) కుటుంబ న్యాయస్థానము  లేని చోట్ల సదరు కేసులు ఏ కోర్టులో దాఖలు చేయాలి. 

21) పాదచారులు రోడ్డుకు ఎటువైపు నడవాలి 

22) మనదేశంలోని కారుకు స్టీరింగ్ ఎటువైపున ఉంటుంది.  అలా ఉండటానికి కారణం ఏమిటి. 

23) మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఎక్కడ ఫిరియాదు చేయాలి. 

24) ప్రభత్వ కార్యాలయాలనుండి అధికారికంగా సమాచారం పొందే హక్కు ప్రజలకు ఉందా.  ఏ చట్టం దీని గూర్చి చెపుతుంది. 

25)  ప్రభత్వ కార్యాలయాలనుండి అధికారికంగా సమాచారం పొందటానికి దాఖలు చేసే అర్జీ మీద ఎన్ని రూపాయల స్టాంపు అంటించాలి. 


ఈ ప్రశ్న పత్రంకు జవాబులు ఇవ్వదలచిం వీక్షకులు ముందుగా ఫాలోవరు అయి క్రింది కామెంటు బాక్సులో మీ జవాబులు వ్రాయగలరు. 



జ్యోతి గురించి

 జ్యోక్పశ్యేమ సూర్యః, జ్యోతిః గమయః, జ్యోతిర్మసి. జ్యోతి గురించి పలు విధముగా మార్పుచెందుతున్వ౮ని. దానికి మూల కారణం శక్తియే. దానికి మూలం అణువు లేక ఆత్మలను. అది విశ్వ వ్యాప్తిని తెలియుచున్నది. వక మనిషి తన ఆయన ప్రమాణంతో అనేక సంవత్సరాల రక్షిం నుండి వున్న జీవ లక్షణము తెలియుటే ఙ్ఞానం. ఎలా తెలియుట. ఎవరో వారు శబ్ద రూపంగా శ్రవణం వినికిడి ద్వారా చెప్పాలి. వంటి కదా చెప్పగలిగే విన్న దానిలో సూక్మంగా మూల తత్వ పరిశీలన చెయ్యాలి. అప్పుడే దానిని సూత్ర పరంగా తెలుస్తుంది అది సత్యమని. అదే తత్ సత్. జ్యోతిని అనగా మనలో కూడా అగ్ని రూపంలో వుంది లోపలా బయటా కూడా. యిదే ఙ్ఞాన లక్షణము. అంతా వుంటే వున్నది వకటే అయితే అది వివిధ రూప గుణ రంగు లుగా భాష ప్రకాశించుటకై మూలం అగ్ని. ప్రకాశవంతమైన నిరంతరం వుండదు మార్పు చెందుతూ జరుగుచున్నది. మార్పుచెందనిది నిరంతరం కలది నిత్యనూతనమైనది. సత్యం. పూర్ణ ఙ్ఞానమే సత్ అనబడే సత్యం. పూర్ణ ఙ్ఞాన మనగా యింక ఏమీ తెలియుటకు లేనిది.అది జ్యోతిః అసి.జ్యోతి సత్ అని. అసి అనగా  వున్నదని యదార్ధమని తెలియుటయే ఙ్ఞానము.జ్యోతి ప్రత్యక్షంగా జీవుని రూపంలో కదలికకు, దాని మూలమైన అగ్నియని తెలుసుకుంటూనే వుందాం అనంతమైన ఙ్ఞానమును. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు..అనుభవాలు..లీలలు..


*అన్నదానం..*


2007 వ సంవత్సరం జూన్ నెల మొదటి వారం లో ఒకరోజు ఓ భక్తుడు 35 కిలోల బియ్యం తీసుకుని వచ్చి, " దేవుడి వద్ద అన్నం వండి పెట్టాలని మొక్కుకున్నానయ్యా, కానీ నాకు వీలులేక చెయ్యలేకపోతున్నాను..ఈ బియ్యం ఇక్కడ ఇస్తున్నాను..మీరు ఉపయోగించండి " అని చెప్పాడు..ఆరోజు వరకూ శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం ఒక విధాన పూర్వకంగా జరగడం లేదు..రాబోయే ఆదివారం రోజు నుంచి క్రమం తప్పకుండా అన్నదానం చేయడం ప్రారంభిస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన కలిగింది ..


అప్పటికి ఆలయం లో వ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదు..చాలా తర్జన భర్జన తరువాత , మావద్ద కాపలాదారుడిగా ఉన్న ఆంజనేయులు కల్పించుకొని, "అయ్యా! గుడి తరఫున అన్నదానం మొదలుపెడదాము, శనివారం రాత్రికి, వచ్చిన భక్తులు ఇక్కడ ఏ వసతీ లేక ఇబ్బంది పడుతున్నారు..అలాగే, ఆదివారం మధ్యాహ్నం కూడా.."  అన్నాడు..అర్చకులు, అర్చకేతర సిబ్బంది అందరూ ఈ సలహా బాగుంది అన్నారు..


     ఇక, నిర్ణయం తీసుకోవడానికి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది..ఇంతమంది చెప్పిన తరువాత..ఆలయ సిబ్బంది సహకారమూ ఉన్న తరువాత.. ప్రక్కరోజు ఆదివారం నాడు ప్రయత్నం మొదలు పెడదామని అనుకున్నాము..మనసులో ఆలోచనంతా దానిని కొనసాగించడానికి నిధులెట్లా?అని..ఎందుకంటె, అన్నదానం  ఏదో ఒకపూట చేసి ఆపడం కాదు..ప్రతి వారం కొనసాగించాలి..అదీ..శనివారం రాత్రి..ఒక్కొక్కసారి వేయి మంది భక్తులు వస్తుంటారు.. ఆదివారం మధ్యాహ్నం కూడా ఏడు వందల మందికి తగ్గరు..వంటవాళ్ళు , శుభ్రం చేసే పనివాళ్ళు, ఇలా ప్రతిదీ ఏర్పాటు చేసుకోవాలి..కానీ..మా అందరికీ ఉన్న ఒకే ఒక ధైర్యం..ఆ దిగంబర అవధూత దత్తాత్రేయ స్వామివారే! మనం ప్రారంభిద్దాము... తరువాత ఆ స్వామివారే చూసుకుంటారు  అనుకున్నాము..


ఆరోజు సాయంత్రం మా దంపతుల మిద్దరమూ శ్రీ స్వామివారి సమాధి వద్ద నిలబడి, "స్వామీ..ఈ క్షేత్రం లో అన్నదాన కార్యక్రమం నిరాఘాటంగా జరగాలని సంకల్పించాము..మా ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా జరిగేటట్లు ఆశీర్వదించు తండ్రీ.." అని మనస్ఫూర్తిగా మ్రొక్కుకున్నాము..


అనుకున్న ఆదివారం వచ్చింది...ఆరోజు చిరు జల్లులు పడుతున్నాయి..మొట్టమొదట సలహా ఇచ్చిన ఆంజనేయులే ఆ పూట వంటకూడా చేసాడు..వాన కారణంగా పెద్దగా భక్తులూ రాలేదు..ఓ 150 మంది భోజన చేశారు.. 


సరిగ్గా మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఓ ముసలాయన, చేతిలో చిన్న సంచితో  గుడికి వచ్చాడు..ఆయన శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న తరువాత.."పెద్దాయనా..అన్నం తిని వెళ్ళు.." అని చెప్పాను..సరేనన్నట్లుగా తలవూపి వెళ్ళాడు..


భోజనం చేసి వచ్చి, "అన్నదానానికి చందా ఇస్తే తీసుకుంటారా?"అన్నాడు.. ఆయన్ని చూస్తే.."ఈయన చందా ఇస్తాడా?.." అనిపించింది..మహా అయితే ఓ యాభై రూపాయలు ఇస్తాడు.. సరే..పెద్దాయన..ఇస్తానంటున్నాడు..కాదనడం ఎందుకు అనుకున్నాము..


ఆయన తన పేరు పువ్వాడి కోటయ్య అనీ..కందుకూరు ప్రక్కన మహాదేవపురం గ్రామమనీ, వ్యవసాయం చేసుకుంటాననీ చెపుతూ..చేతి లోని సంచీలోంచి, 5000/- అక్షరాలా ఐదు వేల రూపాయలు తీసి ఇచ్చాడు..యాభై రూపాయలు కూడా ఇవ్వలేడేమో అనుకున్న మాకు..ఛెళ్ళున ఎవరో చెంప మీద కొట్టినట్టు అనిపించింది..దత్తాత్రేయుడు మాలోని అహంకారపు అజ్ఞానాన్ని ఇలా ఎత్తి చూపాడు..ఆ మొత్తంతో మరో రెండు వారాలు నిరాటంకంగా అన్నదానం జరపొచ్చు..(2007 నాటి ముచ్చట ఇది..ప్రస్తుతం శని, ఆదివారాల్లో ఒక పూటకే..అంతకు నాలుగురెట్లు ఎక్కువగా ఖర్చు అవుతున్నది..) కోటయ్య కు రసీదు ఇచ్చి..శ్రీ స్వామివారి సమాధి వద్ద మనస్ఫూర్తిగా మన్నించమని వేడుకున్నాను..


 ఆరోజు మొదలైన అన్నదాన కార్యక్రమం, ఈ నాటికీ నిర్విఘ్నంగా జరుగుతోంది..దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా, బడ్జెట్ లో కేటాయింపులు చేశారు..చేస్తున్నారు..ఇప్పుడు ప్రతి శనివారం రెండుపూటలా, ఆదివారం మధ్యాహ్నం కలిపి, సుమారు రెండువేల మందికి అన్నదానం జరుగుతోంది..మిగిలిన రోజుల్లో కూడా ప్రతిరోజూ ఓ యాభై మందికి ఆహారం అందివ్వగలుగుతున్నాము..


శ్రీ స్వామివారి దయవల్ల దాతల సహకారంతో అన్నదానం చేయగలుగుతున్నాము..శని, ఆదివారాల్లో ఎంతమంది భక్తులు వచ్చినా..అందరికీ ఉచితంగా ఆహారం అందివ్వగలుగుతున్నాము..


దత్తదీక్షా కాలంలో ఆ 41 రోజులూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో ఉన్న దీక్షాధారులకు రెండుపూటలా ఉచితంగా ఆహారం అందిస్తున్నాము..


శ్రీ కోటయ్య  ఆరోజు మాకిచ్చిన స్ఫూర్తి మేమెన్నడూ మరచిపోలేదు..


మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి  మీవంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

సౌందర్య లహరి

 సౌందర్య లహరి 

----------------------------------------

శ్లోకం            విషయము

నెం

11.   శ్రీచక్రము

12.   సాయుజ్యము

13.   ఉపాసనాఫలము

14.   షట్చక్రముల కిరణములు

15.   సారస్వత ప్రయోగము

16.   సారస్వత ప్రయోగము

17.   సారస్వత ప్రయోగము

18.   స్త్రీ వశీకరణ

19.   జీవన్ముక్తి

20.   జ్వర , విష శాంతి

శివశక్త్యైక్యరూపిణీ

 1.శివశక్త్యైక్యరూపిణీ, హరిబ్రహ్మేంద్రసేవితా. మొదటి పదం-"శివశక్త్యాయుక్తో"-ఈ పదంలో శ్రీచక్రము ఉంది, శివశక్తుల సమాగమ ప్రదేశమే శ్రీచక్రం. కనుక సౌందర్య లహరి మొదటి శ్లోకం ఆరంభం శ్రీచక్రం తో ఆరంభించారు.

2. అమ్మవారి పాదపద్మ రేణువులో సృష్టి, స్థితి, లయలు ఉన్నాయి అని చెప్పారు.

3. పాదపద్మరేణు మహిమ- చతుర్బాహుసమన్వితా-సంసారపంకనిర్మగ్న సముద్ధరణ పండితా

4. చరణద్వందము- వర,అభయ ప్రదములు

5. ఆరాధనాఫలితం- సర్వసంపత్ప్రదాత్రీ, సర్వ సౌభాగ్యదాయినీ

6. అపాంగవీక్షణము- సర్వకార్య విజయం

7. స్థూలరూపం -ఆయుధ ధారిణి, సూక్ష్మరూపం- మంత్రరూపం..పంచదశి, షోడశి

పరారూపం- కుండలినీ శక్తి

8. నివాసం- చింతామణి గృహం, శ్రీచక్రము, పంచబ్రహ్మాసనస్థితా

9. కుండలినీ స్వరూపిణి-షట్చక్రభేదన,సహస్రారచక్ర/కమల పయనం, శివసమాగమం

10. అమృతధార-సహస్రారం నుండి క్రిందకి స్వస్థల పయనం

సౌందర్య లహరి

 ఆదిశంకరుల వారు సౌందర్య లహరి శ్లోకాల ద్వారా మనకు

ఏ విషయాలు తెలియజేశారో 

ఒకసారి మననం చేసుకుందాం 

( రోజూ 10 శ్లోకాల చొప్పున) :

శ్లోకం .            విషయం

నెం

----------------------------------------

1.     శక్తిత్వము 

2.      పాదధూళి మహిమ

3.      పాదధూళి మహిమ

4.      చరణములు 

5.       సేవామహిమ

6.       దయాఫలము

7.        బాహ్యరూపము

8. అంతరనివాస విలాసము

9. సుషుమ్న- ఊర్ధ్వమార్గము

10.సుషుమ్న- అధోమార్గము.