8, జులై 2021, గురువారం

మంత్రిణీన్యస్త రాజ్యధూః

 786. 🔱🙏  మంత్రిణీన్యస్త రాజ్యధూః 🙏🔱

ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *మంత్రిణిన్యస్తరాజ్యధురేనమః* అని చెప్పాలి.

మంత్రిణీ = మంత్రిణి అయిన శ్యామలాదేవి యందు, 

న్యస్త = ఉంచబడిన రాజ్య ధూః= రాజ్యభారము కలది.

అమ్మవారికి 16 మంది మంత్రిణులుంటారు.  ఈ పదహారు మంది మంత్రిణులలో అతి ముఖ్యురాలు శ్యామలాదేవి. విశ్వసామ్రాజ్య పరిపాలనా బాధ్యతలను అమ్మవారు ఈ శ్యామలా దేవి మీద ఉంచుతుంది. శ్యా మాలా దేవి - కృష్ణ (లేదా విష్ణు) సంబంధమైన దేవి. (శ్రీ కృష్ణ, శ్యామలాదేవి శ్రీరామోలలితాంబికా) విష్ణువు జగత్పోషక కారుడు కాబట్టి, అమ్మవారు రాజ్యాన్ని - విష్ణు సంబంధమైన శ్యామలాదేవికి అప్పచెప్పింది.

‘మంత్రి' అనే పుంలింగ శబ్దానికి 'మంత్రిణీ' అనేది స్త్రీలింగ పదం. మంత్రములో సలహా ఇచ్చేవాణ్ణి 'మంత్రి' అంటారు. మంత్రాన్ని ఉచ్చరించడానికి లోపల సంకల్పంగా పనిచేస్తూ మన చేత' ఓం - సోహం - ర్- నాదం' మొదలైనవాటి ఉచ్చారణ సహకారంతో మాటలను పలికించేది, ఆలోచనలను కలుగ చేయునది కూడా కాబట్టి - శ్యామల - మంత్రిణి అయింది.

'మంత్రిణి అయిన శ్యామలాదేవి యందు ఉంచబడిన రాజ్య భారము కలది' అని ఈ నామానికి అర్థం.

🙏ఓం ఐం హ్రీం శ్రీం మంత్రిణిన్యస్తరాజ్యధురేనమః 🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

కామెంట్‌లు లేవు: