26, ఆగస్టు 2023, శనివారం

బొట్టు పెట్టుకునే స్థలంలో ఏర్పడే మచ్చ

 బొట్టు పెట్టుకునే స్థలంలో ఏర్పడే మచ్చ నివారణ కొరకు -


చాలా మంది ఆడవారిలో ఇది ప్రధాన సమస్య . విష రసాయనాలు కలిగిన బొట్టు బిళ్ళలు వాడటం వలన మచ్చ ఏర్పడి అసహ్యకరంగా కనిపిస్తుంది. దాని నివారణ కొరకు ఈ యోగమును ఉపయోగించుకోగలరు .


మారేడు దళము లను మెత్తగా నూరి లేపనం చేస్తుంటే బొట్టు పెట్టుకునే స్థలంలో ఎర్పడే పుండు , మచ్చ పోవును


  

   మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


 

అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 


    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో   అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది.  ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 


 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 


      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 


 మోతాదు - 


     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 


       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 


  ఔషధోపయోగాలు  - 


 *  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 


 *  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 


 *  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 


 *  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 


 *  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 


 *  రక్తము నందలి దోషములను పోగొట్టును . 


 *  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 


 *  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 


 *  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 


 *  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 


 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .


 *  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 


 *  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 


 *  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 


 *  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 


 *  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 


 *  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 


 *  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 


 *  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 


 *  మూర్చరోగులకు ఇది వరం వంటిది . 


 *  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 


 *  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 


      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 


         కరోనా చికిత్సలో కూడా ఇది చాలా అద్బుతముగా పనిచేసింది . నేను ఎంతో మంది రోగులకు ఇచ్చాను . కరోనా నుంచి కోలుకొనిన తరువాత వచ్చే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవడానికి ఇది వాడుట అత్యుత్తమం . 


      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం . 


  గమనిక - 


       శుద్ధిచేసిన అశ్వగంధ చూర్ణం కావలెను అనిన నన్ను సంప్రదించగలరు . కావలసిన వారి ఫొన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు . sms , whatsup mess ki సమాధానం ఇవ్వడం జరగదు . మీరు సంప్రదించవలసిన ఫొన్ no      9885030034 . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


            

: ప్రాచీన భారతీయ పురాణాలలో వివరించినటువంటి "బ్రహ్మస్త్రం" గురించి సంపూర్ణ వివరణ  -


           మన భారతీయ పురాణాలు చదివినవారికి "బ్రహ్మస్త్రం " అనే పేరు అత్యంత సుపరిచితం అయినదే ముఖ్యంగా రామాయణ , మహాభారతాలలో ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ బ్రహ్మస్త్ర ప్రయోగం మరియు దాని వివరాలు గురించి భారతీయులమైన మనకంటే పాశ్చాత్య శాస్త్రజ్ఞులకు ఈ విషయాల గురించి సంపూర్ణ అవగాహన ఉన్నది. దీనికి ప్రధాన కారణం మనం నిర్లక్ష్యం చేసి వదిలివేసిన ఎన్నో అద్భుతగ్రంధాలు మరియు విజ్ఞానాన్ని వారు అర్థం చేసుకుని ఆదరించడమే . అలాంటి కొన్ని విజ్ఞానదాయకమైన విషయాలు మరుగునపడిపోయిన ఎన్నో విషయాలను మీకు తెలియచేయడానికి నావంతు ప్రయత్నం చేస్తున్నాను . ఇప్పుడు మీకు ప్రాచీన భారతీయ యుద్ధాలలో ఉపయోగించిన "బ్రహ్మస్త్రం" అనే ఒక భయంకర ఆయుధం గురించి వివరిస్తాను. దీనినే మనం ఈ ఆధునిక యుగంలో "ఆటంబాంబు " అని పిలుచుకుంటున్నాం.


                1945 వ సంవత్సరం జులై 16 వ సంవత్సరం తెల్లవారుజామున 5:30 సమయములో న్యూమెక్సికో ఎడారిలో ఒక బాంబు పరీక్షించారు. ఈ ప్రయోగం సరిగ్గా హిరోషిమా నగరం పైన అణుబాంబు ప్రయోగించడానికి నెలరోజుల ముందు జరిగింది. ఈ ప్రయోగం జరిగిన  తరువాత ఓపెన్ హమీర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త రోచస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక విద్యార్థి "మీ ప్రయోగం ప్రపంచంలో మొదటిసారే కదా ?" అని అడిగినాడు . అందుకు హమీర్ అవును ఇది ఈ ఆధునిక కాలంలో మాత్రం మొదటిది అని భారతదేశంలో జరిగిన పురాతన యుద్ధగాథలు , మహాభారతం గురించి వివరించాడు.


          ప్రాచీన భారతీయ పురాణాలలో బ్రహ్మస్త్రం గురించి ఈ విధముగా ఉన్నది. "అది ఒక్కటే బాణం కాని ఈ విశ్వశక్తి మొత్తం దానిలో ఇమిడి ఉన్నది. పదివేల సూర్యులు పగిలినట్లు మంటలు లేచి గగనాన్ని దేదీప్యమానం చేశాయి. ఒక ఇనుప పిడి లాంటి దానితో బిగించిన ఆయుధం ఇది. అజేయమైన మృత్యుసందేశాన్ని తెచ్చిన పిడుగు అది . సమస్త భవనాలను , కందకాలను బూడిద చేసివేసింది. కాలిపోయిన మనుష్యులెవరో గుర్తుపట్టటానికి వీలుకాలేదు . వెంట్రుకలు , గోళ్లు , కండ్లు , పండ్లు ఊడిపడిపోయాయి . పక్షులు , పశువులు , వృక్షాలు చచ్చి తెల్లగా మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారధాన్యాలు , వాతావరణం విషతుల్యం అయిపోయాయి. సైనికులు బావులలో , నదులలో దూకి మంటలు ఆర్చుకున్నారు" అని చెప్పబడినది. దీని గురించి మరిన్ని విషయాలు    " with out trace " అను గ్రంధమున ఉదహరించారు. ఈ హమీర్ అనే శాస్త్రవేత్త సంస్కృతంలో మంచి పండితుడు . ఈయన న్యూ మెక్సికోలో అటామిక్ బాంబు పరిశోధనాలయా డైరెక్టర్ గా వ్యవహరించారు.


           సుప్రసిద్ద సోవియట్ పండితుడు అయిన A .A . గోర్బోవిస్కీ తన గ్రంథం "book of హైపోథెసిస్ " లో కూడా చాలా వివరణలు ఇచ్చారు .  మన ప్రాచీన భారతీయులకు అణ్వస్త్ర విషయాల గురించి సంపూర్ణంగా తెలుసు. హరప్పా, మొహంజదారో నాగరికతలు విరాజిల్లిన కొన్ని ప్రదేశాలలో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడి వీధుల్లో నల్లగా కాలిపోయిన ముద్దల వంటి పదార్థం దొరికింది . మొదట శాస్త్రవేత్తలకు అది ఎలాంటి పదార్థమో అంతుబట్టలేదు . దానిని ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు అది మట్టితో చేసిన కుండపెంకులుగా నిర్దారించబడినవి . ఆ పదార్థం తీవ్రమైన వేడికి కరిగిపోయినదిగా నిర్దారించబడినది. అంతేకాదు ఆ పదార్థం తీవ్రమైన రేడియేషన్ కి గురిఅయ్యినది. ఉండవలసిన రేడియేషన్ స్థాయి కంటే కొన్ని వందల రెట్ల రేడియేషన్ ప్రభావం కనిపించింది.


                 4000 సంవత్సరాల క్రితం మరణించిన ఒక వ్యక్తి అస్థిపంజరంలో మామూలు ప్రమాణం కంటే ఎన్నో వందలరెట్ల రేడియోధార్మికత కనిపించింది. ఈ బ్రహ్మస్త్రాన్ని గురించి దక్షిణ అమెరికాలో కొన్ని పురాతన గ్రంథాలలో కూడా వివరణ ఉన్నది. అక్కడి గ్రంథాలలో దానిని        "మాష్ మాకి " అనే పేరుతో పిలుస్తారు . భారతీయ ప్రాచీన వైమానిక శాస్త్రం అయినటువంటి "సమరాంగణ సూత్రధార " లో కూడా ఈ విషయాల గురించి వివరణ ఉన్నది.


          ఇలాంటి ఎన్నో రహస్యమైన భయంకర ఆయుధాలు మరియు పుష్పక విమానాలు వంటి వాటిని మరియు ఎన్నో రహస్య విద్యలకు సంబంధించిన సమస్త సమచారాన్ని కొన్ని రహస్య ప్రదేశాల్లో మన పూర్వీకులు దాచి ఉంచారు .


     పైన చెప్పినటువంటి పుష్పక విమాన రహస్యాలను నేను రాసిన గ్రంథాలలో సంపూర్ణంగా వివరించాను. అతి త్వరలో మరిన్ని వైజ్ఞానిక విషయాలు మీకు వివరిస్తాను.   మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

 ॐ  సంత్ తులసీదాస్ జయంతి శుభాకాంక్షలు


      ఆయన బార్హస్పత్యమాన శ్రావణ బహుళ (చాంద్రమాన శ్రావణ శుక్ల) సప్తమినాడు జన్మించినారు. 

      కాశీలో పురాణ కాలక్షేపం చేస్తున్న సమయంలో హనుమ దర్శనం పొందిన మహనీయుడు. 

      హనుమ ద్వారా శ్రీరామ దర్శనం పొందారు. 

      ఉత్తర భారతంలో సాధారణ ప్రజల్లో బహుళ ప్రచారం పొందిన "రామచరిత మానస్" రచించారు. 

       సుందరకాండతో సమానమైన సులువుగా హనుమని స్తుతించే శక్తివంతమైన "హనుమాన్ చాలీసా" ఆయన సృష్టే. 

       గోస్వామి తులసీదాస్ జన్మించిన ఇదే శ్రావణ శుక్ల సప్తమినాడు నేను కూడా జన్మించడం నా అదృష్టం. 


ॐ  Sant Tulasidas Jayanthi 


      Best wishes. 


    Goswami Tulasidas was born on Sravana Sukla Saptami of Lunar based year (the same time is Bahula Saptami as per Baarhaspathya maana followed by the northern regions). 

     He got the Darsan of Hanumaan at Vaaraanasi at the time of giving his discourses.

      He had the Darsan of Raama through Hanuma. 

      He wrote a Raamaayana "RAAMACHARITHA  MAANAS" , the most popular at the common level public.      

      He graced us HANUMAAN CHAALEESA to praise Hanuma which is equal to give result of enchanting Sundarakaanda. 

      It is my fortune to have my birth on the same day Goswami Tulasidas was born.

Panchang


 

పురాణములందు

 05

స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ 

పురాణే మంత్రేవా స్తుతినటన హాస్యే ష్వచతురహ

కథం రాజ్ఞామ్ ప్రీతిర్భవతి మయి కో2హం పశుపతే 

పశుం మాం సర్వజ్ఞ ప్రధితకృపయా పాలయ విభో  



సీ. స్మృతి,పురాణములందు, స్తుతి,నాట్యములయందు

               శకున , వైద్య , నటన శాస్త్ర మందు

    సంగీత ,సాహిత్య, సారస్వతము లందు 

               చతుర , హాస్య , విదూష వితతు లందు

    నేర్పున్న విబుధుండ నే గాను పరమేశ !

               భావింప నన్నింట పశువు నేను

    అటువంటి నా మీద నవనీపతుల కెట్లు

               ప్రేమతో జీరంగ ప్రీతి గలుగు ?

తే. పశువు నగునన్ను పాలించ పరుడు లేడు

     పశుపతీ ! నీవు పాలించి భవము నందు

     కరుణ తోడను రక్షించి కావు మెపుడు

    భక్త మందార ! శంకరా ! పాహి పాహి !        05

Vyjayantimaala


 

Photo








































 

Kaadandi


 

Jai


 

వరలక్ష్మీ కటాక్షం

 

వరలక్ష్మీ కటాక్షం


భారతీయ పర్వకాలాల్లో ఒక్కొక్క రుతువుకు, ఒక్కో మాసానికి, తిథులకు ప్రత్యేకతలున్నాయి. ఆ ప్రత్యేకతలే ప్రత్యేక దేవతారూపాలుగా పూజలందు కుంటున్నాయి. పూజ, వ్రతం, ధ్యానం, సంకీర్తన... వంటి మార్గాలన్నీ మనసును  మహాశక్తితో అనుసంధానపరచే సాధనలు.


గ్రీష్మంలో అగ్నితత్వాన్ని స్వీకరించిన భూదేవి, వర్షరుతువు ఆరంభమాసమైన శ్రావణం నుంచి జలతత్వాన్ని గ్రహిస్తుంది. ఈ జలతత్వ సంధానాన్నే 'ఆప్యాయనం అంటారు. భూమికి ఆప్యాయనం కలిగించే మాసం శ్రావణం. ఈ 'ఆర్ధశక్తి' వల్లనే పచ్చదనం, సస్యసంపద భూమికి సమకూరుతాయి. ఆ ఐశ్వర్య రూపిణిని మహాలక్ష్మిగా, సృష్టికారణశక్తిగా, సంపదల దేవతగా ఆరాధించే పద్ధతిని వేద రుషులు ఆవిష్కరించారు. ఆర్ద్ర, పుష్కరిణి (పోషకశక్తి) అని 'శ్రీ'దేవిని వరలక్ష్మిగా 'శ్రీసూక్తం' వర్ణించింది.


సర్వవ్యాపకుడైన పరమాత్మను శ్రీమహావిష్ణువుగా, ఆయన విభూతి (ఐశ్వర్య) శక్తిని మహాలక్ష్మిగా వేదం విశదపరచింది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి (విద్యాలక్ష్మి), శ్రీలక్ష్మి, వరలక్ష్మి... అనే ఆరులక్ష్ములుగా ఉన్న మహాలక్ష్మి ఎల్లవేళలా నా ఎడల ప్రసన్నురాలగుగాక, అంటూ వైదిక సంప్రదాయం లక్ష్మీ రూపాలను పేర్కొంది. కార్యానికి సిద్ధి; దుఃఖం(ఆజ్ఞానం) నుంచి విముక్తి; సంకల్పాలకు సాఫల్యం (గెలుపు), విజ్ఞానం; శోభ, కాంతి, అభీష్టాలు నెరవేరడం... ఈ ఆరు సంపదల రూపాలే పై ఆరు లక్ష్ములు..


'చారుమతి' అనే సాధ్విని వరలక్ష్మి అనుగ్రహించి, స్వప్నంలో సాక్షాత్కరించి, శ్రావణమాస పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం నాడు తనను ఆరాధించి వ్రతాచరణ చేసేవారిని అనుగ్రహిస్తానని ప్రసన్నురాలై దీవించింది. ఆ వృత్తాంతాన్ని తన పెనిమిటికి, అత్తమామలకు చెప్పి, వారి ఆనందాన్ని ఆమోదాన్నీ పొంది వరలక్ష్మి వ్రతాన్ని తోటి స్త్రీలతో కలిసి ఆచరించిందని వ్రతకథ చెబుతోంది. 'చారుమతి' అంటే 'మంచి బుద్ధికలది' అని అర్థం. కుటుంబంలో ఉన్న (ఉండవలసిన) సౌమనస్య స్వభావాన్ని ఆమె ప్రవర్తన సూచిస్తుంది.

వస్త్రాభరణాలతో అలంకృత అయిన స్త్రీమూర్తిని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా మన్నన చేయడం వరలక్ష్మీవ్రతం నాటి పేరంటాల అర్చనలో గోచరిస్తుంది. శుక్రవారాలు లక్ష్మీప్రీతికరాలు అని శాస్త్రోక్తి, శుక్రవారానికి 'భృగుప్రజాపతి' అధిపతి. ఆ భృగువు తపస్సుకు ఫలితంగా లక్ష్మీదేవి ఆయనకు తనయగా ఆవిర్భవించింది. నారాయణుడి విభూతి శక్తియే సిద్ధిగా ఆయనను అనుగ్రహించింది. ఆ మహాలక్ష్మిని నారాయణుని పత్నిగా అప్పగించాడు భృగువు. భృగువు అధిపతిగా ఉన్న భృగువాసరం (శుక్రవారం) లక్ష్మీపూజకు ముఖ్యమని శాస్త్రనిర్ణయం.


శుక్రవారానికి ఇంద్రుడు దేవతగా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. 'ఇంద్రుడు' అనే మాటకు 'ఐశ్వర్యం, తేజస్సు కలవాడు' అని అర్థం. త్రిలోకాధిపతి విష్ణుకృపతో లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడయ్యా'డు. 'ఇందిర' అన్నా మహాలక్ష్మియేకదా! చంద్రకళలు వృద్ధిచెందే శుక్లపక్షంలో, చంద్రసహోదరిగా క్షీరసాగరం నుంచి ఉద్భవించిన లక్ష్మిని అర్చించాలని సంప్రదాయం. అందుకే, పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా నిర్ణయించారు. వరలక్ష్మీ కటాక్షం వల్ల భారత జాతి క్షేమ సమృద్ధులతో విలసిల్లాలని భారతదేశం సర్వతోముఖాభ్యుదయాన్ని సాధించాలని ఆ జగన్మాతను ప్రార్ధిద్దాం.


సామవేదం షణ్ముఖశర్మ

యజ్ఞోపవీతం

 *యజ్ఞోపవీతం గురించి కొంత సమయం వెచ్చించి చదివి తెలుసుకోండి.*

ఒకజత(మూడు ముడులు) సరిగా వడకాలంటే ఒకరోజు సమయం పడుతుంది., కానీ బయట వ్యాపారాత్మక యజ్ఞోపవీతాలు 20₹,30₹ లకే ఐదు ముడుల జతలు ఇస్తున్నారంటే అవి యజ్ఞోపవీతాలేనా అనే అనుమానం ఈనాడు బ్రాహ్మణులకే కలగకపోవడం చాలా బాధాకరం. కనీసం చిలపదారంతో యజ్ఞోపవీతం జత(మూడుముడులు) తయారు చేయాలన్నా4,5 గంటల సమయం పడుతుంది. అంటే ఒక బ్రాహ్మణుని అరదినం పనికి సాటి బ్రాహ్మణుడు నిర్ధారించే విలువ 20₹ అన్నమాట. ఒక చిన్న వైద్యుని సంప్రదించడానికే 500₹ ,ఒక కాఫీతాగడానికే 50₹, ఒక సినిమా చూడటానికి500₹, ఒక కూల్ డ్రింక్ తాగడానికి30₹ పెట్టే బ్రాహ్మణులు యజ్ఞోపవీతానికి 20₹ ఇవ్వాలనుకోవడం ఎంతనీచము?? దాని పేరే యజ్ఞోపవీతం, కనీసం దాని అర్థమైనా తెలుసా!!?? అసలు అది ఎలా చేస్తారో తెలుసా!!?? స్వంతంగా యజ్ఞోపవీతం తయారు చేసుకోలేనివారు,దాని కి సరైన విలువ ఇవ్వలేనివారు బ్రాహ్మణులమని గర్వంగా చెప్పుకోవడం ఎంతవరకూ సమంజసం!!?? మనం చదివే మంత్రం పనిచేయాలంటే దానికి మూలాధార సూత్రమైన యజ్ఞోపవీతం సరైనది అయ్యుండాలి. రాగితీగలకు కలిపితేనే(దారాలకుకాదని) విద్యుచ్చక్తి దీపాన్ని వెలిగిస్తుందని కళ్ళకు కనిపిస్తుంది, కానీ యజ్ఞోపవీతం3×96 బెత్తలమన చేతికొలతలో ఏక తంతువును తాల్చి,మూడు పోచలుగా కలిపి బ్రహ్మ ముడి తో బంధించి ధరించిన ద్విజుడు చదివే మంత్రమే ఫలిస్తుందని వెంటనే కనబడదు కదా!!

కనీసం ఈ శ్రావణ పూర్ణిమ సందర్భంగా అయినా యజ్ఞోపవీతం ఎలా చేసుకోవాలో తెలుసుకుని ధరించి తరించి ద్విజలమని ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేయండి. యజ్ఞోపవీతం అనే ది ఇరవై ముఫ్ఫై రూపాయల కు లభించేదారం కాదనీ ద్విజుల శక్తి ని నిర్ణయించే బ్రహ్మ సూత్రమనీ తెలుసుకుని మన కర్మలు ఫలించాలంటే ఈ సూత్రం సక్రమమైనదై ఉండాలని గుర్తించండి. అసలైన యజ్ఞోపవీతం ధరించి త్రికాల సంధ్యావందనం ఆచరించే ద్విజునకు చేసే నమస్కారం సాక్షాత్తూ దేవుని కి చేసే పూజతో సమానం.

 సులభంగా యజ్ఞోపవీతం తయారు చేసుకొనే ఎలక్ట్రానిక్ యంత్రాలు మేము తయారు చేసి ఇవ్వగలము. కావలసిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు (9492050200). యజ్ఞోపవీతం తయారీ మొదలైన వివరాలన్నీ నా YouTube channel "KOMPELLA SRINIVASA SARMA" లో వీడియో లు అందుబాటులో ఉన్నాయి.

శుభమస్తు.

శ్రీమద్వాల్మీకి రామాయణం


ॐ    శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

                           భాగం : 1/12 

                ----------------------- 


యావత్ స్థాస్యన్తి గిరయః 

               సరితశ్చ మహీతలే I 

తావత్ రామాయణకథా 

               లోకేషు ప్రచరిష్యతి ॥ 

             - అని బ్రహ్మదేవుని మాట! 

    అంటే, పర్వతాలూ నదులూ భూతలమందు ఉన్నంతకాలమూ రామాయణ కథ లోకాలలో వ్యాపించియుంటుంది అని అర్థం. 


రామాయణం వైదిక విద్య 


    మానవుని జీవన విధానాన్ని వైదికశాస్త్రపరంగా వివరించేది శ్రీమద్వాల్మీకీ రామాయణం. 

    వేదార్థానికి పరిపుష్టి కూర్చడానికై రచింపబడిన రామాయణం ఏ విషయాన్నైనా ఆయా సందర్భాలలో చక్కని కథాభాగంగా వివరిస్తూ, 

    మనకి కావలసిన కార్యాలకు సంబంధించి సందేశాల రూపంలో మార్గాన్ని సూచిస్తుంది. 

    అది సమస్యలకి పరిష్కారంగా మాత్రమే కాకుండా, అసలు సమస్యని నివారించే విధంగా వ్యక్తికీ, సమాజానికీ అన్ని కాలాలలోనూ పూర్తిగా అవుసరమైనది. 


ప్రస్తుత విద్యావ్యవస్థ 


    గణితం, భౌతిక, జీవశాస్త్రాలూ, అర్థ, భౌగోళిక, చరిత్ర, పరిపాలన, విజ్ఞాన, వైద్య మొదలైన శాస్త్రాలనేవి - 

    ఒక్కొక్కరూ ఒక్కొక్క విషయంలో మాత్రమే నిష్ణాతులయ్యే అవకాశం ప్రస్తుత విద్యావ్యవస్థలో మనకి కనిపిస్తుంది. 

    అదీకాక, వాటిలో ఏ విషయమైనా, అనేక పరిశోధనలు చేస్తూ, వచ్చే ఫలితాలు పాత పరిశోధనల ఫలితాలతో విభేదిస్తూ ముందుకువెళ్ళే వ్యవస్థే మనకి తెలుసు. 

    పరమాణు నమూనా - ఎలక్ట్రాన్ విషయాలకి సంబంధించి రూథర్ ఫర్డ్, థామ్సన్, నీల్స్ బోర్, సోమర్ ఫీల్డ్ వంటి శాస్త్రవేత్తలు ఒకరి తరువాత ఒకరు భిన్న నిర్వచనాలనివ్వడమే దీనికి గొప్ప ఉదాహరణ. 


రామాయణం ఆదర్శం 


    కానీ, శ్రీమద్వాల్మీకి రామాయణం ఏ విషయమైనాసరే, దానిపై ప్రత్యేకంగా పరిశోధనతో ముందుకు వెళ్ళవలసిన అవుసరంలేక, ఆ విషయంమీద ఆదర్శంగా కనిపించే విధానంతో, విషయాన్ని లోతుగా సమగ్రంగా వివరిస్తూ, అన్ని విద్యావిషయాలనీ అందిస్తుంది. 

    మానవుని జీవితంలో, పుట్టిన దగ్గరనుంచీ జీవితకాలమంతా దైనందిక జీవితంలో, 

    వ్యక్తిగా - సమాజపరంగానూ, ప్రకృతికి చెందిన భౌతిక విషయాలకీ, మానసిక ఆలోచనకి సంబంధించి సమగ్రంగా సమాచారాన్ని విశ్లేషించే ఆదికావ్యం శ్రీమద్వాల్మీకి రామాయణం. 


    సార్వకాలీనమైన వేద ప్రమాణంగా వివరించేది అవడమే దీనికి కారణం. 


    ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని వివిధ  అంశాలలోని

    ప్రస్తుత విద్యావిషయాలలో గణితం, చరిత్ర, సాంకేతికవిద్య, వైద్యంవంటివాటికి సంబంధించి ఒక్కొక్క విషయానికి ఆ గ్రంథం ఏ విధమైన సందేశం ఇస్తోందో 

    ఒక్కోరోజు ఒక్కొక్క విషయమై  పరిశీలిద్దాం. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

శ్రీ పాతాళేశ్వర్ ఆలయం

 🕉 మన గుడి :


⚜ ఛత్తీస్‌గఢ్ : మల్హర్




⚜ శ్రీ పాతాళేశ్వర్ ఆలయం


💠 మల్హర్ భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం . ఒకప్పుడు ప్రధాన నగరం మరియు 1వ సహస్రాబ్దిలో రాజధానిగా పనిచేసిన చరిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశం.


💠 శాసనాలు మరియు భారతీయ సాహిత్యంలో దీనిని మల్లార్, మల్లారి మరియు శరభాపూర్ అని పిలుస్తారు.

 సమకాలీన కాలంలో, ఇది ఒక పురాతన కోట యొక్క పుట్టలు మరియు శిధిలాలు, పునరుద్ధరించబడిన రెండు శివాలయాలు మరియు హిందూ, జైన మరియు బౌద్ధ దేవాలయాల యొక్క ప్రధాన సమూహాల శిధిలాలతో కూడిన మ్యూజియం వంటి గ్రామంగా ఉంది. 

దీనికి పురావస్తు ప్రాముఖ్యత కూడా ఉంది. 


💠 శంఖం, చక్రం మరియు గద పట్టుకున్న నాలుగు చేతులతో విష్ణువు యొక్క పురాతన శిల్పం 200వ సంవత్సరం లో  చత్తీస్‌గఢ్‌లోని మల్హర్‌లో కనుగొనబడింది. 


💠 మల్హర్‌లోని 12వ శతాబ్దపు పాతాలేశ్వర దేవాలయం ప్రాచీన భారతీయ సాహిత్యంతో పాటు ఇతిహాసమైన రామాయణం, మహాభారతం మరియు ఇతర పురాణాలలో ఉత్తర భారతదేశంలోని పురాతన కోసల  వంశపు రాజులు అయోధ్యను రాజధానిగా చేసుకుని కోసలాన్ని పాలించారు. శ్రీరామచంద్రుడు ఆ వంశానికి చెందిన రాజు, అతని పాత్ర మరియు కార్యకలాపాల ఆధారంగా రామాయణం వ్రాయబడింది. రాముడి తరువాత , రాజ్యాన్ని అతని ఇద్దరు కుమారులు, లవ మరియు కుశల మధ్య విభజించినట్లు చరిత్ర


💠 ఉత్తర కోసలు తన వాటాగా లవకు శ్రావస్తి నగరి రాజధానిగా ఉండగా కుశ దక్షిణ కోసలను అందుకున్నాడు. అతను ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని విభజించే వింధ్యపర్వత శ్రేణికి సమీపంలో కుశవ్రతే నదిపై తన కొత్త రాజధాని కుశస్థలిపురాన్ని స్థాపించాడు . 

కుశస్థలిపురము ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో మల్హర్ అని గుర్తించబడింది .

 

💠 చతురస్రాకారంలో గర్భగుడి మరియు మండపం ఉన్నాయి.  

గర్భగృహం లో శివలింగాన్ని మండపం కంటే తక్కువ స్థాయిలో ఉంచారు.

 

💠 ఇది బిలాసపూర్  నుండి ఆగ్నేయంగా 30 కిమీ దూరంలో గ్రామీణ భూభాగంలో ఉంది, ఇది భారతదేశ జాతీయ రహదారి 49 కి అనుసంధానించబడి ఉంది.

శ్రీ కాళహస్తీశ్వర శతకం - 76

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*



శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 76




మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం

డలియోపాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా

జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గాసిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!




తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు శ్రమపడుచు స్త్రీలతో కామసుఖములననుభవించు ప్రయత్నములో మునిగియుందురు. 


ఇది యోగసాధనములోని అంశమా ఏమి? స్త్రీ దేహాంశములలో ఈ కామసుఖస్థానము మలమూత్రాది మాలిన్యములతో నిండియుండు చోటే కాని సుషుమ్నా నాడీద్వారము కాదు. 


బొడ్డునుండి పైన కనబడు ’నూగారు’ అనబడు రోమరేఖ ’కుండలినీ’ కాదు. రెండు పాదములు, రెండు చేతులు రెండు కన్నులును పద్మములతో పోల్చి ఆనందింతురు. 


అవి మూలధారము మొదలైన ఆరు పద్మములు కావు కదా. ముఖమును పద్మముతో సమమని భావించి అందు ఆసక్తి చెందుదురు. 


అది వాస్తవ సహస్రారపద్మమా? కాదు. నుదురును అష్టమీచంద్రరేఖగా భావింతురు. అది వాస్తవమగు చంద్రరేఖ కానే కాదు. 


దేవా! నన్నట్టి మోహమునుండి తప్పింపుము. నిన్ను సేవించి తరించగల్గునట్లు అనుగ్రహింపుము.



ఓం నమః శివాయ



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

భారతీయ ఆత్మను

 షిరిడీ సాయి బాబా మహత్యం సినిమాలో నువ్వు లేక అనాధలం అనే పాట అప్పటి నుంచే పెద్ద హిట్టు..


ఈ సినిమాలోని అన్ని పాటలు సాయి బాబా భక్తులను పెంచాయి అనడంలో సందేహం లేదు


అయితే ఆ పాటలోని రెండవ చరణం ఇలా ఉంటుంది..


మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని

ప్రార్ధనలు చేశామయా నిన్నే..

అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని

చేశాము సలాం సలాం నీకే

గురునానకైనా ....గురుగోవిందైనా...

గురుద్వారమైనా...నీ ద్వారకేననీ

నీ భక్తులైనాము సాయి....రావా .. నువ్వు..

కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి (2)

అల్లాసాయి మౌలాసాయి (2)

నానక్ సాయి గోవింద్ సాయి

ఏసు సాయి షిర్డి సాయి ఓం... నానక్ ..

సాయి సాయి బాబా సాయి..


పై పాటలోని ఆధారంగా చర్చికి వెళ్ళే ఏ క్రైస్తవుడయినా ఏసే-సాయి,సాయినే ఏసు అని సాయి బాబా ఫోటో పెట్టుకుని ప్రార్థనలు చేయడం మీలో ఎవరైనా చూసారా???


అలాగే మసీదుకి వెళ్ళే ఏ ముస్లిమైనా అల్లానే సాయి-సాయి బాబానే అల్లా అని నమాజు చేయడం మీలో ఎవరైనా చూసారా??


కాని హిందువులు మాత్రం రాముడే సాయి-కృష్ణడే సాయి అని రామ సాయి-కృష్ణ సాయి అని పూజలు చేస్తారు..!

పూజిస్తే పూజించారు కాని మరి వాళ్ళెందుకు పూజించరో అని ఒక్కసారైనా ఆలోచించారా!


అలాగే ఎవడన్న ఏసు సాయి,సాయి మరియా, సాయి పాదం, ఖాన్ సాయి,సాయి రహమాన్ అని పేర్లు పెట్టుకున్నారా?


వేల సంవత్సరాల క్రితం నుండి ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానం రూపంలో సనాతన ధర్మం ఆచరించబడుతూ వచ్చింది... మొదటి సారి బౌద్ధ ధర్మాన్ని అనుసరించడం తో ధర్మం స్థానంలో మత భావన ప్రారంభం అయ్యింది.... ఎడారి మతాలు భారత దేశం లో ప్రవేశించడం తో, బలవంతం గానో లేక సమస్త ప్రకృతిని సమభావంతో చూసే సనాతన ధర్మ మౌళిక లక్షణం వల్ల సనాతన వైదిక సమాజం పై ఎడారి మతాల ప్రభావం స్పష్టంగా పెరగసాగింది.... అప్పటి సామాజిక అసమానతలను ఈ ఎడారి మతాలు తమకు అనుకూలంగా మలుచుకుని సమాజంలో ప్రజల మధ్యన మానసిక విభజనను తేగలిగాయి...


ఇతర మతాలకు చెందిన వారిలో సగం మంది వారి మత గ్రంథాలను ఒకసారైనా చదివి ఉంటారు లేదా వారి ఇంట్లో ఉంచుకొని ఉంటారు.... అదే హిందువులలో కనీసం పది శాతం మంది కూడా వారి ధర్మ గ్రంథాలైన రామాయణ, భారత, భగవద్గీత లను కనీసం కంటితో కూడా చూసి ఉండరు.....


హిందువులలోని ఈ ఉదాసీనత, ఏ మతం గురించి తెలియకుండా అన్ని మతాలు సమానమనుకునే మానసిక దాస్యం వలన క్రమంగా తన అస్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని కోల్పోయి ఇలాంటి కలుపుమొక్కలు పెరగడానికి అవకాశం ఇస్తోంది.


తిరిగి మన పూర్వవైభవం పొందాలంటే మన పిల్లలకు మన ధర్మ గ్రంథాలను, మన ఆచార సాంప్రదాయాలను, మన పురాణ పురుషులు, మన నిజమైన స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను చిన్నతనం నుండే పరిచయం చేయడం మన తక్షణ భాధ్యత...


భారతీయులను మానసికంగా ఏకం చేయగల శక్తి ఒక్క రామనామానికే ఉంది.

రామ నామమే తిరిగి భారతీయ ఆత్మను  ఉద్దీపన చేయగలదు.


జై శ్రీరామ్... జై హింద్... జై భారత్....


*©️ Hindu Dharmika Sena - హిందూ ధార్మిక సేన*

భారత దేశం వయసు

 900సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !

2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 

5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 

1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి 


మరీ భారత దేశం వయసు ఎంత?


ప్రపంచంలో  ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు  అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం


ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....


ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే

 

వైదిక  సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి"  కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి


విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు


ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు

ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు 


ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...

 "నా దేశం-భారత దేశం"


ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.


మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.

చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...

"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"


ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది


రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది


మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?


శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు 


ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.

ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...

"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం

 

మరీ దేశభక్తుల విషయం...


1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?

4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !


మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు

ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది

ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి


ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.


ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని  విమర్శిస్తారు. జై హింద్

నేను బారతీయున్ని బ్రతికినన్నాళ్లు ఈ గెడ్డ మీదే బ్రతుకుతాను పోయాక కూడా ఈ మట్టిలో కలిసి ఉంటాను

శుక్రగ్రహ జననం - 3*

 _*నవగ్రహ పురాణం - 36 వ అధ్యాయం*_


*శుక్రగ్రహ జననం - 3*

*''బుద్ధికి బృహస్పతి' అనే మాటను త్వరలో మనం వింటాం ! అసాధారణ జ్ఞానం అతగాడి సొంతం సుమా !"* నారదుడు అన్నాడు.


*“ఊ... చూస్తుంటే - ఆ బృహస్పతిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్లు తోస్తోంది. నారదా !"* వృషపర్వుడు వాలుగా చూస్తూ అన్నాడు.


*“నారాయణ ! పసిగట్టడంలో ఎవరైనా మీ అసురుల తరువాతే సుమా !"* నారదుడు

నవ్వాడు. 


*"నువ్వు సురపక్షపాతివి కాకపోతే , ఆ బృహస్పతిని ఇక్కడ నిలిపి వుండే వాడివి నారదా ?”* వృషపర్వుడు ఉక్రోషంతో అన్నాడు.


*"నారాయణ ! నువ్వెవరు ? నేనెవరు ? వీరి తండ్రి కశ్యప ప్రజాపతి. ఆయన తండ్రి మరీచి మహర్షి. ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు. నీకు తాతగారు. నేనెవరు ! బ్రహ్మగారి మరొక మానసపుత్రుడ్ని , నీ పితామహుడు మరీచికి సోదరుణ్ని. ఆ  సుర బృందమూ , మీ అసుర బృందమూ అక్కచెళ్లెళ్ల బిడ్డలు , సోదరులు. కాకపోతే దాయాదులు. నాకు మీరూ , మీరూ అందరూ ఒక్కటే ! ఈ నారదుడికి పక్షమూ లేదు ; పాతమూ లేదు !"* 


"మాటలలో , పాటలలో నీ నైపుణ్యం చాలా గొప్పది నారదా !"* వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు.


*“సరే ! నేను సురపక్షపాతిని కాను , అని నిరూపించడానికే వచ్చాను. అక్కడ ఒక గురువు వున్నట్లు ఇక్కడ ఒక 'సద్గురువు' వుండాలన్న ఆలోచన నాది..."*


*"అందుకేగా ఆ బృహస్పతిని ముందుగా ఆ ఇంద్రుడి పరం చేశావు !"* వృషపర్వుడు కసిగా అన్నాడు.


*“నారాయణ ! ఆ బృహస్పతిని మరిచిపో , వృషపర్వా ! ఆలోచనలో , ఆచరణలో , వ్యూహ రచనలో - ఆ బృహస్పతిని మించిన మహామేధావిని మీ కోసం ప్రత్యేకించి వుంచాను. అంకుశం లాంటి నిశితమైన బుద్ధి ! నిరంకుశమైన వైఖరి ! ముఖ్యంగా జాగ్రత్తగా విను - ముఖ్యంగా అసుర సంతతి పట్ల సానుభూతి. ఇన్ని అద్భుత లక్షణాలున్న...”*


*“ఎవరావ్యక్తి !"*

వృషపర్వుడు నారదుడి వాక్ ప్రవాహానికి ప్రశ్నతో అడ్డుకట్ట వేశాడు.


*"బ్రహ్మ మానస పుత్రశ్రేష్ఠుడు భృగుమహర్షి తెలుసు కదా ! ఆయన మీ అసుర సంతతికి చెందిన పులోమను పత్నిగా స్వీకరించాడు...."*


*"ఈ విషయాలు మాకు ఎరుకేలే , నారదా !"* వృషపర్వుడు అడ్డు తగిలాడు.


*"ఆ దంపతుల పంచమ పుత్రుడు - 'ఉశనుడు'... మహామేధావి. ఇటీవలే విద్యాభ్యాసం ముగించాడు. ముఖ్యంగా ఉశనడు , ఆ బృహస్పతికి దీటైన వాడు. సమ ఉజ్జీ ! నిజం చెప్పుకోవాలంటే - బృహస్పతి కంటే - రెండాకులు ఎక్కువే చదివాడు. ప్రధానంగా మనకు అనుకూలించే అంశమేమిటంటే - తల్లి పులోమ ఉశనుడికి ఆ సుర పక్షపాతాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. ఆ ఉశనుడు ఏ తపో దీక్షలోనో పూర్తిగా మునిగిపోక ముందే... పట్టుకోవడం మంచిదని నా సూచన !"*


*"మా సూత్రధారిగా వ్యవహరించి , కార్యం సానుకూలం చేయవచ్చు కదా , నారదా !"* వృషపర్వుడు ఆశగా అడిగాడు.


*“నారాయణ ! అందుకేగా వచ్చాను ! ఇంద్రుడికి ఒక గురువును సూచించాను. నీకు ఒక గురువును సూచిస్తే నా సమదృష్టి మీకు తెలిసి వస్తుంది ! ఎంత త్వరగా భృగుదర్శనం చేసుకుంటే అంత మంచిది.”*


*"ఇంతకాలం నారదుడు 'సురపక్షపాతి' అని అనుకునే వాణ్ని ! వాస్తవానికి నువ్వు 'అసురపక్షపాతి' అని ఇప్పుడు అర్థమవుతోంది నారదా !"* వృషపర్వుడు చిరునవ్వుతో అన్నాడు.


*“నారాయణ ! అసురులకు ఆవేశం అధికం అని ఊరికే అన్నారా”* నారదుడు నవ్వుతూ అన్నాడు. 


*"భృగుమహర్షి ఆశ్రమానికి..."*


*“ఉగ్రా ! రథం సిద్ధం చెయ్ !”* నారదుడికి అడ్డు తగుల్తూ ఆవేశంగా అన్నాడు. వృషపర్వుడు.


*"అసుర గురువుగానా?”* భృగుమహర్షి సాలోచనగా అన్నాడు.


*"ఔను ! మాకు మార్గ నిర్దేశకులు కరువయ్యారు. విద్యాదానం చేసే ఆధ్యాపకులు లేరు. ఉశనుల వారిని తమరు అద్వితీయంగా తీర్చిదిద్దారని నారద మహర్షి చెప్తున్నారు. మీరు అంగీకరించాలి , మా కులాన్ని ఆశీర్వదించాలి !"* వృషపర్వుడు వినయంగా అన్నాడు.


*"సరే అనండి , భృగుమహర్షీ ! దైత్య దానవ బాలకులూ , యువకులూ విద్యా గంధం లేకుండా వున్నారు. పాపం !"* నారదుడు అందుకుని అన్నాడు..


*“ప్రసాదించండి"* పులోమ కల్పించుకుని అంది.


భృగుమహర్షి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. పులోమ చిరునవ్వు నవ్వింది. *"ఇలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉశనుడిలాంటి పుత్రుణ్ణి ప్రసాదించమని మిమ్మల్ని అడిగాను.”*


*"నాన్నగారూ !”* అంత వరకూ మౌనంగా ఉన్న ఉశనుడు అన్నాడు. *"అమ్మ సంకల్పాన్ని ఆచరణలో పెడదాం. నాన్నగారూ !"*


భృగుమహర్షి తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు.


*"మీ అందరి అంగీకారాన్ని ఆమెదించకుండా ఎలా ఉంటాను ! ఉశనా ! అసుర గురువుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలి సుమా !”*


*"మీరు అనుగ్రహించిన విద్య నాకు ఆ కీర్తిని తెచ్చి ఇస్తుంది. నాన్నగారూ !"* ఉశనుడు వినయంగా , సగర్వంగా అన్నాడు..


*"అసుర కులం మీ దంపతులకు శాశ్వతంగా ఋణపడి ఉంటుంది , మహాత్మా !"* వృషపర్వుడు భృగుడికి పాదాభివందనం చేశాడు.


*"మాతా ! దీవించండి !"* అంటూ పులోమ పాదాలు స్పృశించాడు.


*"వృషపర్వా ! ఉశనుడిని రాక్షస గురువుగా అభిషేకించడానికి రేపు దివ్యమైన ముహూర్తం..."* నారదుడు హెచ్చరించాడు.


*"శుభస్య శీఘ్రం ! వృషా ! నారదుల వారు చెప్పినట్టు రేపే ఆ శుభకార్యం ముగించు"* భృగుమహర్షి అన్నాడు.

నవగ్రహ పురాణం - 36 వ అధ్యాయం*_

 _*నవగ్రహ పురాణం - 36 వ అధ్యాయం*_


*శుక్రగ్రహ జననం - 3*

*''బుద్ధికి బృహస్పతి' అనే మాటను త్వరలో మనం వింటాం ! అసాధారణ జ్ఞానం అతగాడి సొంతం సుమా !"* నారదుడు అన్నాడు.


*“ఊ... చూస్తుంటే - ఆ బృహస్పతిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్లు తోస్తోంది. నారదా !"* వృషపర్వుడు వాలుగా చూస్తూ అన్నాడు.


*“నారాయణ ! పసిగట్టడంలో ఎవరైనా మీ అసురుల తరువాతే సుమా !"* నారదుడు

నవ్వాడు. 


*"నువ్వు సురపక్షపాతివి కాకపోతే , ఆ బృహస్పతిని ఇక్కడ నిలిపి వుండే వాడివి నారదా ?”* వృషపర్వుడు ఉక్రోషంతో అన్నాడు.


*"నారాయణ ! నువ్వెవరు ? నేనెవరు ? వీరి తండ్రి కశ్యప ప్రజాపతి. ఆయన తండ్రి మరీచి మహర్షి. ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు. నీకు తాతగారు. నేనెవరు ! బ్రహ్మగారి మరొక మానసపుత్రుడ్ని , నీ పితామహుడు మరీచికి సోదరుణ్ని. ఆ  సుర బృందమూ , మీ అసుర బృందమూ అక్కచెళ్లెళ్ల బిడ్డలు , సోదరులు. కాకపోతే దాయాదులు. నాకు మీరూ , మీరూ అందరూ ఒక్కటే ! ఈ నారదుడికి పక్షమూ లేదు ; పాతమూ లేదు !"* 


"మాటలలో , పాటలలో నీ నైపుణ్యం చాలా గొప్పది నారదా !"* వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు.


*“సరే ! నేను సురపక్షపాతిని కాను , అని నిరూపించడానికే వచ్చాను. అక్కడ ఒక గురువు వున్నట్లు ఇక్కడ ఒక 'సద్గురువు' వుండాలన్న ఆలోచన నాది..."*


*"అందుకేగా ఆ బృహస్పతిని ముందుగా ఆ ఇంద్రుడి పరం చేశావు !"* వృషపర్వుడు కసిగా అన్నాడు.


*“నారాయణ ! ఆ బృహస్పతిని మరిచిపో , వృషపర్వా ! ఆలోచనలో , ఆచరణలో , వ్యూహ రచనలో - ఆ బృహస్పతిని మించిన మహామేధావిని మీ కోసం ప్రత్యేకించి వుంచాను. అంకుశం లాంటి నిశితమైన బుద్ధి ! నిరంకుశమైన వైఖరి ! ముఖ్యంగా జాగ్రత్తగా విను - ముఖ్యంగా అసుర సంతతి పట్ల సానుభూతి. ఇన్ని అద్భుత లక్షణాలున్న...”*


*“ఎవరావ్యక్తి !"*

వృషపర్వుడు నారదుడి వాక్ ప్రవాహానికి ప్రశ్నతో అడ్డుకట్ట వేశాడు.


*"బ్రహ్మ మానస పుత్రశ్రేష్ఠుడు భృగుమహర్షి తెలుసు కదా ! ఆయన మీ అసుర సంతతికి చెందిన పులోమను పత్నిగా స్వీకరించాడు...."*


*"ఈ విషయాలు మాకు ఎరుకేలే , నారదా !"* వృషపర్వుడు అడ్డు తగిలాడు.


*"ఆ దంపతుల పంచమ పుత్రుడు - 'ఉశనుడు'... మహామేధావి. ఇటీవలే విద్యాభ్యాసం ముగించాడు. ముఖ్యంగా ఉశనడు , ఆ బృహస్పతికి దీటైన వాడు. సమ ఉజ్జీ ! నిజం చెప్పుకోవాలంటే - బృహస్పతి కంటే - రెండాకులు ఎక్కువే చదివాడు. ప్రధానంగా మనకు అనుకూలించే అంశమేమిటంటే - తల్లి పులోమ ఉశనుడికి ఆ సుర పక్షపాతాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. ఆ ఉశనుడు ఏ తపో దీక్షలోనో పూర్తిగా మునిగిపోక ముందే... పట్టుకోవడం మంచిదని నా సూచన !"*


*"మా సూత్రధారిగా వ్యవహరించి , కార్యం సానుకూలం చేయవచ్చు కదా , నారదా !"* వృషపర్వుడు ఆశగా అడిగాడు.


*“నారాయణ ! అందుకేగా వచ్చాను ! ఇంద్రుడికి ఒక గురువును సూచించాను. నీకు ఒక గురువును సూచిస్తే నా సమదృష్టి మీకు తెలిసి వస్తుంది ! ఎంత త్వరగా భృగుదర్శనం చేసుకుంటే అంత మంచిది.”*


*"ఇంతకాలం నారదుడు 'సురపక్షపాతి' అని అనుకునే వాణ్ని ! వాస్తవానికి నువ్వు 'అసురపక్షపాతి' అని ఇప్పుడు అర్థమవుతోంది నారదా !"* వృషపర్వుడు చిరునవ్వుతో అన్నాడు.


*“నారాయణ ! అసురులకు ఆవేశం అధికం అని ఊరికే అన్నారా”* నారదుడు నవ్వుతూ అన్నాడు. 


*"భృగుమహర్షి ఆశ్రమానికి..."*


*“ఉగ్రా ! రథం సిద్ధం చెయ్ !”* నారదుడికి అడ్డు తగుల్తూ ఆవేశంగా అన్నాడు. వృషపర్వుడు.


*"అసుర గురువుగానా?”* భృగుమహర్షి సాలోచనగా అన్నాడు.


*"ఔను ! మాకు మార్గ నిర్దేశకులు కరువయ్యారు. విద్యాదానం చేసే ఆధ్యాపకులు లేరు. ఉశనుల వారిని తమరు అద్వితీయంగా తీర్చిదిద్దారని నారద మహర్షి చెప్తున్నారు. మీరు అంగీకరించాలి , మా కులాన్ని ఆశీర్వదించాలి !"* వృషపర్వుడు వినయంగా అన్నాడు.


*"సరే అనండి , భృగుమహర్షీ ! దైత్య దానవ బాలకులూ , యువకులూ విద్యా గంధం లేకుండా వున్నారు. పాపం !"* నారదుడు అందుకుని అన్నాడు..


*“ప్రసాదించండి"* పులోమ కల్పించుకుని అంది.


భృగుమహర్షి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. పులోమ చిరునవ్వు నవ్వింది. *"ఇలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉశనుడిలాంటి పుత్రుణ్ణి ప్రసాదించమని మిమ్మల్ని అడిగాను.”*


*"నాన్నగారూ !”* అంత వరకూ మౌనంగా ఉన్న ఉశనుడు అన్నాడు. *"అమ్మ సంకల్పాన్ని ఆచరణలో పెడదాం. నాన్నగారూ !"*


భృగుమహర్షి తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు.


*"మీ అందరి అంగీకారాన్ని ఆమెదించకుండా ఎలా ఉంటాను ! ఉశనా ! అసుర గురువుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలి సుమా !”*


*"మీరు అనుగ్రహించిన విద్య నాకు ఆ కీర్తిని తెచ్చి ఇస్తుంది. నాన్నగారూ !"* ఉశనుడు వినయంగా , సగర్వంగా అన్నాడు..


*"అసుర కులం మీ దంపతులకు శాశ్వతంగా ఋణపడి ఉంటుంది , మహాత్మా !"* వృషపర్వుడు భృగుడికి పాదాభివందనం చేశాడు.


*"మాతా ! దీవించండి !"* అంటూ పులోమ పాదాలు స్పృశించాడు.


*"వృషపర్వా ! ఉశనుడిని రాక్షస గురువుగా అభిషేకించడానికి రేపు దివ్యమైన ముహూర్తం..."* నారదుడు హెచ్చరించాడు.


*"శుభస్య శీఘ్రం ! వృషా ! నారదుల వారు చెప్పినట్టు రేపే ఆ శుభకార్యం ముగించు"* భృగుమహర్షి అన్నాడు.

*2-అధ్యాయం, 8వ శ్లోకం *🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

 🕉️ *🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️* 

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 8వ శ్లోకం* 


 *న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్* 

 *యఛ్చోకముఛ్చోషణమింద్రియాణామ్* ।

 *అవాప్య భూమావసపత్నమృద్ధం* 

 *రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ।।* 8


 *ప్రతిపధార్థం* 


న హి ప్రపశ్యామి — చూడలేకున్నాను; మమ — నా యొక్క; అపనుద్యాత్ — పోగొట్టే; యత్ — ఏదైతే; శోకం — శోకమును; ఉచ్చోషణమ్ — శుష్కింప చేయునట్టి; ఇంద్రియాణామ్ — ఇంద్రియముల యొక్క; అవాప్య — పొందిన తరువాత; భూమౌ — ఈ భూమిపై; అసపత్నమ్ — ఎదురులేని; ఋద్దం — సుసంపన్నమైన; రాజ్యం — రాజ్యమును; సురాణామ్ — దేవతల యొక్క; అపి — అయినా; చ — కూడా; ఆధిపత్యమ్ — ఆధిపత్యము.


 *తాత్పర్యము* 


 ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరిసంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యం ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లానుపాయమును గాంచలేకున్నాను.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం🙏🙏*


 

Chinta chiguru
























 

Bachalikura


 

Sive sarvaardha saadake


 

తులసీ ప్రదక్షిణం పాట...

 తులసీ ప్రదక్షిణం పాట...


పెద్దవాళ్లు ఒకప్పుడు పాడేవారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఎవరో పంపారు.


 గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా 

 ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా !వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా 

 రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నిండైన సందలు నాకియ్యవమ్మా

 మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! ముత్తైదువతనం నాకియ్యవమ్మా  

 నాల్గోప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నవధాన్య రాసులను నాకియ్యవమ్మా  

 అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !ఆయువై దోతనం నాక్య్యవమ్మా  

 ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా

 ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా 

 ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! యమునిచే బాధలు తప్పించవమ్మా 

 తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా  

 పదోప్రదక్షిణం నీకిస్తినమ్మా !  పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా 

 ఎవ్వరు పాడినా ఏకాశి మరణం ! పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం 

 రామతులసీ , లక్ష్మీ తులసీ ! నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా ,,

సేకరణ

ఆగస్టు 26, 2023* రాశి ఫలాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*శనివారం, ఆగస్టు 26, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :  *దశమి రా7.02* వరకు  


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


సంతానం విద్యా విషయాలలో  శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహం తో  వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------

*వృషభం*


వాహన  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దాయాదులతో  ఆస్తి వివాదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.

---------------------------------------

*మిధునం*


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట  ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో  శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా  సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

---------------------------------------

*కర్కాటకం*


ప్రయాణాలలో  కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు  ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

*సింహం*


సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో  ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------

*కన్య*


దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు  ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను  దర్శించుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

*తుల*


బంధు మిత్రులతో  ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో   వ్యయప్రయాసలు తప్పవు  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

---------------------------------------

*వృశ్చికం*


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంతో  ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------

*ధనస్సు*


వృధా  ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

---------------------------------------

*మకరం*


ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.  సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు  అప్రయత్నంగా పూర్తి చేస్తారు.  వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం.

---------------------------------------

*కుంభం*


ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య  విషయంలో  అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. సోదరులతో  స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

*మీనం*


సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం   అందుతుంది.  ఆప్తుల  నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలకు  నూతన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు  గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగమున  అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 7*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 7*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


       *క్వణత్కాంచీదామా" కరి కలభ కుంభస్తననతా*

       *పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా |*

       *ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః*

       *పురస్తా-దాస్తాం నః పురమథితు రాహోపురుషికా ||*


ఈ శ్లోకము, తరువాతి శ్లోకము రోజూ భక్తితో పారాయణము చేస్తే, ఇంటిలోని దోషాలు తొలగి, గృహస్థులు సుఖశాంతులు కలిగియుంటారని ప్రతీతి.


ఇక్కడ నుండి అమ్మవారి రూప వైభవాన్ని వర్ణిస్తున్నారు శంకరులు. భక్తులు దైవ స్వరూపాన్ని నాలుగు విధాలుగా స్మరించుకోగలితే ఉత్తమ ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తారు. ఇవి

స్థూల - విగ్రహము

సూక్ష్మ - దేవతకు సంబంధించిన మంత్రము సూక్ష్మతర - కుండలినీ ధ్యానము

 సూక్ష్మతమ - ఉపనిషత్ ప్రతిపాదితమైన నిర్గుణ బ్రహ్మ తత్త్వము. ప్రతిదీ సూక్ష్మమైన కొలదీ మరింత శక్తి కలిగియుంటుంది పరమాణువు వలె. జీవుడికి కూడా ఈ నాలుగు అన్వయించవచ్చు. వరుసగా  శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ.


ఇప్పుడు పై శ్లోకంలో శ్రీ కాంచీపుర కామాక్షీ అమ్మవారి స్థూలరూప వర్ణన చేస్తున్నారు శంకరులు.


క్వణత్కాంచీదామా = క్వణత్ అంటే కింకిణీ నాదములు చేస్తున్న, ధ్వనిస్తున్న

కాంచీ అంటే నడుము భాగము (మొల) దామా అంటే నూలు (త్రాడు) అంటే అమ్మవారు మువ్వల మొలనూలు/వడ్డాణము ధరించియున్నారు. అమ్మవారి ఆభరణములు మంత్రములైతే, మువ్వల ధ్వని మంత్ర నాదములు. ముందుగా వడ్డాణము గురించి చెప్పటంలో విశేషం ఇదే, అమ్మవారు మంత్రస్వరూపిణి అని. 


భాగవతం ఏకాదశ స్కంధంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తాడు.పరమాత్మ సర్వవ్యాపియై వుండి ఏ విధంగా శరీరంలోకి ప్రవేశిస్తాడు అని. శ్రీ కృష్ణుడు చెప్తున్నారు  పరమాత్మ తన ప్రకృతిని అధిష్ఠించి విశ్వరూపాన్ని ధరిస్తాడు. ఆ ప్రకృతి పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని రెండు విధాలు. జీవభూత సృష్టి అంతా పరా ప్రకృతి, జడ సృష్టి అంతా అపరా ప్రకృతి. పరమాత్మ ఈ సృష్టిలో ప్రాణరూపంగా, సూక్ష్మాతి సూక్ష్మమైన నాదంగా మూలాధార చక్రంలో ప్రవేశిస్తాడు. అక్కడ నుండి నాభి స్థానంలోని మణిపూర చక్రాన్ని చేరుతాడు. అక్కడ నాదము కొంత దిటవై 'పశ్యంతి' గా మారి క్రమంగా సాగుతూ వర్ణరూపంగా (అక్షర రూపం) మారుతుంది. వ్యక్తమైన నాదము మొదట నాభి స్థానము నుండి బయలుదేరుతుంది కనుక శంకరులు అమ్మవారి వర్ణన వడ్డాణము నుండి మొదలుపెట్టారు.


కరి కలభ కుంభస్తననతా  పరిక్షీణా మధ్యే = సన్నని నడుముపై వున్న ఉత్తుంగమైన వక్షస్థలము, జగములను పోషించగల వక్షము.


పరిణత శరచ్చంద్రవదనా = పండిన శరత్కాలపు పూర్ణచంద్రుని వంటి ముఖము, 


ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః = క్రింది రెండు చేతులతో ధనుర్బాణములను, పై రెండు చేతులతో పాశమును, అంకుశమును (సృణి) ధరించినది,  


పురమథితు: = త్రిపురాసుర సంహారియైన పరమేశ్వరుని యొక్క


అహో పురుషికా = ఆశ్చర్యకరమైన ఇచ్చాశక్తి అయిన అమ్మవారు, 


పురస్తాత్ ఆస్తాం నః = ఈ రూపం కల తల్లి నా కన్నులకు సాక్షాత్కరించుగాక!


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నిజమైన స్వభావాన్ని

 *దక్షిణాఫ్రికాలో జరుగుతున్న BRICS సమావేశాల వేదికపై దేశాల ప్రతినిధులు ఎక్కడ నిలబడాలో తెలిపేందుకు.. ఆయా దేశాల జెండాలను నేలపై పరిచారు..*



*భారతదేశ పతాకం నేలపై ఉండడం చూసి.. జాతీయ పతాకానికి అవమానం జరగొద్దని.. ప్రధాని మోడీ ఆ జెండాను.. తీసుకుని జేబులో పెట్టుకున్నారు. అది చూసి, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కూడా తన దేశ జెండాను తీశాడు.. కానీ అప్పటికే అతను దానిపై అడుగు పెట్టాడు.*


*ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా పట్టింపు, పరిశీలన ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావాన్ని చూపుతాయి.*


*అలాంటి ప్రధాని మనకున్నందుకు.. చూసి గర్వించడమే కాదు.. మనమూ రోడ్లపై పడేసి మన జాతీయ🇮🇳పతాకానికి ఎన్నడూ అవమానం జరగనివ్వవద్దు* 🙏

సూర్యాస్తమయ వర్ణన



సూర్యాస్తమయ వర్ణన


                                                   ఇద్దరు మహాకవుల పద్యాలు!


                ఉ:  కాయజ  విక్రియం  బడయఁ  గాని  కులంబున  సంభవించి , య


                       న్యాయము  సేయునే యిటు? దురాత్ముఁడు  వీఁడు  త్రపాభిమానము


                      ల్మాయఁగదట్టి  యంచు,  నతిమాత్రము  లజ్జితుఁడైన    కైవడిన్ ,

                      తోయజ షండ బాంధవుఁడధో ముఖుఁడయ్యె ,  నభోంగణమ్మునన్; 


                        శివరాత్రి మాహాత్మ్యము - ద్వి: ఆశ్వా;   శ్రీనాధ మహాకవి !


             చ:     తరుణి  ననన్య కాంత  నతి దారుణ  పుష్ప శిలీముఖ  వ్యధా


                      భర  వివశాంగి  నంగభవు బారికి  నగ్గము సేసి క్రూరుఁడై 


                      యరిగె  మహీసురాధఁడహంకృతి తోనని,  రోష భీషణ

,

                       స్ఫురణ  వహించెనో  యన , నభోమణి దాల్చె  కషాయ  దీధితిన్;


                           మనుచరిత్రము- ద్వ:  ఆ :   అల్లసాని  పెద్దన; 


                        ఈయిరువురును ప్రసిధ్ధులే!  ఒకరు  పురాణఆంధ్రకరణ  ప్రతిభాచాతురీ ధురీణుఁఢు.మరియొకరు  ప్రబంధమార్గ నిర్ణేత!

పద్యరచనా విషమున  నిరువురిది యొకేమార్గము. ఒకరిశైలి ప్రౌఢము.మరియొకరిది  కొంత సరళము. 


                   పైపద్యముల నొకింత పరిశీలింతము; ఈరెండు పద్యములు సుమారుగా  నొకేరకమైన  సందర్భము  ననుసరించుట  విశేషము!


               మొదటిపద్యము శ్రీనాధుని శివరాత్రి మహాత్మ్యము లోనిది. సుకుమారుఁడను  బ్రాహ్మణ యువకుడు తనను వలచిన చిన

దాని కనుమొరగి పారిపోవు సందర్భము.


భావము:  మన్మధుని బారికి అవకాశంలేని పరమ పవిత్రమైన  వేదవిప్రుల యింటఁ బుట్టి  , తుంటరియై  స్వాభిమానమును సిగ్గును వీడి ,

వీడు యింత  నీచమైన కార్యమును చేయునా? (యువతులను మోసగించి పారిపోవుట)   యని  సిగ్గుతో  మొగము వంచుకొను చుండెనా? యనునట్టు  సూర్యుడు యెర్రని మోముతో  నస్తమించు చుండెనని  మొదటి పద్యముయొక్క భావము.


                        రెండవ పద్యం పెద్దనది. ప్రవరుడు వరూధిని వలపు  దిరస్కరించి  వెడలెను.నాడు ఆసరికి ప్రొద్దుగ్రుంకెను. ఆదృశ్యమును (సూర్యాస్తమయమును)  పెద్దన  రెండవ పద్యమున వర్ణించు చున్నాడు.


                 వయస్సులో ఉన్నపిల్ల. ఇంకా పెళ్ళికానిది. అందమైనదీ, అయిన యీవరూధినిని యీరీతిగా మన్మధ బాణములకు  అప్పగించి  యీబ్రాహ్మణాధము డహంకారముతో  నిట్లేగునా? యని కోపముతో  నెర్రవడిన యట్లు సూర్యుడు  పడమర దిక్కున

కషాయ కాంతులు వ్యాపింప నస్తమించెను. అని పెద్దన భావము.


                    సూర్యాస్తమయ వర్ణనము యిరువురకు సమానమే! సుకుమారునియకృత్యములకు సిగ్గుపడి అక్కడ సూర్యుడస్తమింప

గా, ప్రవరునిపై కోపమున  నిచట సూర్యుడు  అస్తమించినాడు. పదములపోహళింపు,క్రియాప్రయోగము పద్యపుటెత్తుగడ ముగింపు

యిరువురూ సమమే!


                      ఈవిధముగా శ్రీనాధుని కవిత్వమును  సర్వము ననుకరించి  పెద్ద యైన  పెద్దన గారు పూర్వకవి స్తుతిలో  శ్రీనాధమహా

కవిని స్మరణ  చేయక పోవుట  విచిత్రము! 


                                                                  స్వస్తి!🙏🙏🙏🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷💐💐