🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*
శ్రీ కాళహస్తీశ్వర శతకం - 76
మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం
డలియోపాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా
జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గాసిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు శ్రమపడుచు స్త్రీలతో కామసుఖములననుభవించు ప్రయత్నములో మునిగియుందురు.
ఇది యోగసాధనములోని అంశమా ఏమి? స్త్రీ దేహాంశములలో ఈ కామసుఖస్థానము మలమూత్రాది మాలిన్యములతో నిండియుండు చోటే కాని సుషుమ్నా నాడీద్వారము కాదు.
బొడ్డునుండి పైన కనబడు ’నూగారు’ అనబడు రోమరేఖ ’కుండలినీ’ కాదు. రెండు పాదములు, రెండు చేతులు రెండు కన్నులును పద్మములతో పోల్చి ఆనందింతురు.
అవి మూలధారము మొదలైన ఆరు పద్మములు కావు కదా. ముఖమును పద్మముతో సమమని భావించి అందు ఆసక్తి చెందుదురు.
అది వాస్తవ సహస్రారపద్మమా? కాదు. నుదురును అష్టమీచంద్రరేఖగా భావింతురు. అది వాస్తవమగు చంద్రరేఖ కానే కాదు.
దేవా! నన్నట్టి మోహమునుండి తప్పింపుము. నిన్ను సేవించి తరించగల్గునట్లు అనుగ్రహింపుము.
ఓం నమః శివాయ
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి