🕉️ *🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం, 8వ శ్లోకం*
*న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్*
*యఛ్చోకముఛ్చోషణమింద్రియాణామ్* ।
*అవాప్య భూమావసపత్నమృద్ధం*
*రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ।।* 8
*ప్రతిపధార్థం*
న హి ప్రపశ్యామి — చూడలేకున్నాను; మమ — నా యొక్క; అపనుద్యాత్ — పోగొట్టే; యత్ — ఏదైతే; శోకం — శోకమును; ఉచ్చోషణమ్ — శుష్కింప చేయునట్టి; ఇంద్రియాణామ్ — ఇంద్రియముల యొక్క; అవాప్య — పొందిన తరువాత; భూమౌ — ఈ భూమిపై; అసపత్నమ్ — ఎదురులేని; ఋద్దం — సుసంపన్నమైన; రాజ్యం — రాజ్యమును; సురాణామ్ — దేవతల యొక్క; అపి — అయినా; చ — కూడా; ఆధిపత్యమ్ — ఆధిపత్యము.
*తాత్పర్యము*
ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరిసంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యం ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లానుపాయమును గాంచలేకున్నాను.
*సర్వేజనా సుఖినోభవంతు*
*హరిః ఓం🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి