------౦ ఆలోచనాలోచనాలు ౦------ దైనందిన జీవితంలో అందరికంటే దారుణంగా దివాలాతీసినవాడు ఎవరయ్యా, అంటే ఉత్సాహాన్ని కోల్పోయినవాడే; ఏదైన విషయం నేర్చుకొనేందుకు పెద్దాచిన్నా తేడా లేదు. ఎదగడానికి సత్వరమూ, ఆలస్యమూ లేదు. ***** నిత్యజీవితంలో ఏ ఆటాపాటా లేకుండా పని, పని అంటూ పనిలో విశ్రాంతి లేకుండా లీనమైపోతే మనం ఉదాసీనంగా తయారవుతాం. అసలు పని అంటూ లేకుండా ఎప్పుడూ ఆటపాటలతో, విందులు, వినోదాలలో మునిగితేలుతుంటే మనం కేవలం ఆటబొమ్మల్లా మారిపోతాం. కాబట్టి మనకు - - - పనీపాటా ఉండాలి. మధ్య, మధ్యలో ఆడుతూ, పాడుతూ ఉండాలి. అప్పుడే జీవితమకరందాన్ని తేనెటీగలాగ ఆస్వాదించగలుగుతాం. ***** నిత్య జీవితంలో మనం ప్రతిరోజును ఎట్లాగడపాలంటే , అదే ఈ భూమిపై మనకు చివరి రోజు అన్నట్లుగా! ( ఇది ఒక సామెత సుమా!) ఎందుకంటే ఎవరికీ తెలియదు, వారి ఎక్స్పయిరీ డేట్ ఏదో! అందుకని ఎవరికి హాని తలపెట్టకుండా, ఎవరినీ నిందించకుండా ఆ రోజును గడిపారనుకోండి, అది చివరి రోజు కాకపోయినా మీ విలువైన జీవితంలో ఒక అద్భుతమైన రోజు అయికూర్చుంటుంది. కాబట్టి ఈ క్షణం నుండే అదే ప్రయత్నంలో ఉందాం. ఏమంటారు? ***** జీవితంలో నేను ఒకసారి మోసపోయానంటే , అది నాకు కష్టము మరియు నష్టము. కానీ పలుమార్లు నష్టపోతుంటే అది నాకు తగిన శాస్తి. అవునంటారా? లేదా! తేది 26--8--2023, శనివారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి