మనం సహజంగా ఎవరైనా కష్టాలలో ఉంటే వాళ్ళని మంచి మాటలు చెప్పి ప్రేమతో సంభాషిస్తూ వారిని ఓదార్చటం చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మనం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాము. ఓదార్చే వాళ్ళు ఓదార్పు పొందేవాళ్ళు అందారూఒక్కరే . అర్ధం కవాటంలేదా. ఇప్పుడు ప్రతి వారికి ఇప్పటి పరిస్థితిలో ఓదార్పునిచ్చే వారు కావాలి. కానీ అందరు ఒకే రకంగా ఉండటంతో ప్రతివారు ఎదుటి వారిని ఓదార్చాలి. అంటే మనం అంతా మనకు వున్న సామాజిక మాధ్యమాలతో ప్రేతివారిని (ఇంట్లోంచి వెళ్లకుండా) కలసి ఓదార్పు మాటలు చెప్పుకుంటూ ఈ విపత్కర కరోనా గడ్డు సమస్య తీరేదాకా ద్యేర్యం కోల్పోకుండా మానస్థాపానికి లోను కాకుండా ఉండాలి. నిజానికి మనం పుట్టినప్పటినుండి ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు, వినలేదు.
అందరం ఈ సమయాన్ని మన ఇష్ట దేముడిని కొలవటానికి వినియోగించుకుని మన ఆధ్యాత్మిక ఉన్నతికి, దేశ శ్రేయస్సుకు తోడ్పడుదాం.
ఓం శాంతి శాంతి శాంతిః.