30, జనవరి 2021, శనివారం

తత్త్వవిచారణ

 ప్ర: ఉపనిషత్తులలో పూజలు, పునస్కారాల గురించి చెప్పలేదు, చక్కని తత్త్వవిచారణ మాత్రమే ఉంది. హాయిగా ఆ జ్ఞానాన్ని గ్రహించకుండా, ఈ దేవతా పూజలతో కాలం వ్యర్థం చేసుకోవలసిన అవసరముందా? 


జ: ఉపనిషత్ జ్ఞానానికి దేవతా పూజల పట్ల విరుద్ధ భావమేమీ లేదు. వైద్యం గురించి, వంటల గురించి కూడా ఉపనిషత్తులలో చెప్పబడలేదు. అలాగని వైద్యాన్ని, వంటల్ని విడిచి పెడుతున్నామా! ఉపనిషత్తుల జ్ఞానం వేరు. వైద్యం లాంటి శాస్త్రాలు వేరు. ఇవి శరీరాన్ని బాగుచేయడానికి, పోషించడానికి చెప్పబడినవి. ఉపనిషత్తు తత్త్వాన్ని చెబుతోంది. తత్త్వాన్ని చింతనలో ఉంచుకొని మన క్షేమం కోసం చేయవలసిన కర్మల్ని మానకుండా చేసుకుంటాం. 


అలాగే ఉపనిషత్తత్త్వాన్ని మననం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే, దేవతా పూజలు చేయవచ్చు. ఉపనిషత్తులు దేవతాపూజల్ని నిషేధించలేదు. దేని ప్రయోజనం దానిదే. ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు. 


దేవతా పూజ కేవలం అభీష్టసిద్ధికీ, అనిష్ట పరిహారానికి మాత్రమే కాక 1. కృతజ్ఞతా భావంతోను, 2. చిత్తశుద్ధి కోసం, 3. కృతఘ్నతా దోష నివారణ కోసం చేయాలి. దేవతల వల్లనే ప్రకృతి శక్తులు, మన ఇంద్రియ శక్తులు సమర్ధవంతమౌతున్నాయి కనుకనే కృతజ్ఞతగా వారిని అర్చించాలి. లేని పక్షంలో కృతఘ్నతా దోషం వస్తుంది. అందుకే - ఉపనిషత్తు - *“దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యమ్"* - దేవపితృ కార్యాలలో ఏమరపాటు కూడదు - అంటే 'దేవతలను, పితృదేవతలను మరువరాదు'. యజ్ఞ, అర్చనాది కర్మల ద్వారా వారిని ఆరాధించడం మన విధి. వారి ఆరాధన వల్ల శుద్ధమైన చిత్తానికే తత్త్వవిచారం సాధ్యమౌతుంది.

సంపాదకీయం

 *న్యూయార్క్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ జోసెఫ్ హోప్ రాసిన సంపాదకీయం...*


భారత దేశాన్ని ఒక ఉన్నతమైన, ఉత్తమమైన దేశంగా చెయ్యడమే నరేంద్ర మోడీ ఆశయం.  ఆయన్ని ఆపకపోతే భవిష్యత్తులో భారత దేశం ఒక శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది.  అమెరికా, బ్రిటన్, రష్యాలను మించి పోతుంది. 


నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నాడు.  ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు. 


ఆ చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశ భక్తుడున్నాడు.  ప్రపంచంలోని అన్ని దేశాలను తన దేశ ప్రయోజనాలకోసం వాడుకుంటాడు. 


పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లకు అమెరికాతో సంబంధాలు తెగ్గొట్టాడు. 


వియత్నాంకు చేరువై సూపర్ పవర్ గా ఎదగాలన్న చైనా కలలను భగ్నం చేశాడు.

దక్షిణ చైనా సముద్రంలో చమురు నిక్షేపాలను తోడుకునే విషయంలో వియత్నాంకు చైనాకు మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలో వియత్నాంను బలపరిచాడు.  ఫలితంగా వియత్నాం తన మొత్తం చమురును భారత దేశానికి ఎగుమతి చేస్తోంది.


ఇరాన్ లోని చాబహార్ పోర్టుని తన స్వాధీనంలోకి తీసుకుని ఇరాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్, ఇతర ఐరోపా దేశాలకు భారత దేశ ఎగుమతులకు దారి చేశాడు. 


ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. 


ఆయన ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి.  ఆర్టికల్ 370, 35A రద్దయ్యాయి.  


ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీరును  పూర్తిగా వశపరుచుకుంటాడు.  రాబోయే రోజుల్లో పాకిస్థాన్ ను నాలుగు ముక్కలయ్యేలా చేస్తాడు. పాకిస్థాన్ కు అపర మిత్రుడైన సౌదీ అరేబియా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. 


ఆసియా ఖండంలో ప్రపంచ దేశాలకు ఆయన తన సత్తా చాటాడు. ఆసియాలో తన ఆధిపత్యాన్ని నిరూపించాడు. 


వీసా అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టిన పాకిస్తాన్ విదేశీ మంత్రికి UAE జరిమానా విధించి వెనక్కి పంపేలా చేశాడు. 


రష్యా, జపాన్ లను అతి సున్నితంగా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. 


చైనా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంచాడు.  ఈ వ్యక్తి భారత రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. 


ఇతర దేశాలు తమకు చాలా మంది శత్రువులు ఉన్నట్లు భావిస్తూ ఉంటాయి.  కానీ ఇండియాకు పాకిస్థాన్ తప్ప మరో శత్రువు లేడు.  భారత్ మిగతా అన్ని దేశాలతోనూ సఖ్యతగా ఉంటుంది.


నరేంద్ర మోడీ యుద్ధం చేయకుండానే పాకిస్థాన్ ను సర్వ నాశనం చేశాడు.  అది కూడా ఇతర ముస్లిం దేశాల మద్దతుతో.  ఒకవేళ పాకిస్థాన్ ఇండియా మీద యుద్ధం చేసినా పెద్దగా నష్టమేమీ లేదు.  


ఇతర దేశాలతో సంప్రదింపులలో ఆయన నిజాయితీ కొట్టొచ్చినట్లు కనపడుతుంది. 


నరేంద్ర మోడీ ప్రపంచంలోని ఉత్తమ నాయకుల్లో ఒకరు. 


త్వరిత గతిన సాగుతున్న భారత దేశ అభివృద్ధి ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. 


ఇంతవరకూ ఎవ్వరినీ నేను ఇంతగా మెచ్చుకోలేదు. 


 - జోసెఫ్ హోప్

వరుణ యాగానికీ

L

*🌧️వరుణ యాగానికీ వర్షానికి సంబంధం ఏమిటి..?🌧️* 




*మంత్రాలకి చింతకాయలు రాల్తాయా..??అంటూ సందేహించే వారికోసం*


     

ॐ మనకి విశ్వంలో వర్షానికి  ముఖ్యంగా రెండు energy systems కారణం గా ఉంటాయి.

    

1.శబ్ద_తరంగాలు 

2.ఉష్ణ_తరంగాలు 


మంత్రాలు ద్వారా శబ్ద తరంగాన్ని , అగ్ని ద్వారా ఉష్ణ తరంగాన్ని ప్రేరేపిస్తున్నాం.. 


ॐ యఙ్ఞాలలో సమిధలు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలు, సోమ (ఒక రకం మొక్క).. యివి వాడతారు.. వాటి ప్రాముఖ్యత యిపుడు చూద్దాం.


ॐ ఆవు నెయ్యి అగ్ని లో వేసినపుడు ఒక లీటరు నెయ్యి కి ఒక టన్ ఆక్సిజన్ వస్తుంది. 


ॐ ఆవు పాలు 100 డిగ్రీలకు ఆహుతి అయ్యాక ethelene oxide వస్తుంది.. యిది సూక్ష్మ క్రిములను చంపేస్తుంది.


ICU లో sterilization కి ఈ gas వాడతారు. కొత్త ఇంటిలో పాలు పొంగించడానికి ఇది ఒక కారణం.. 


ॐ ఆవు పాలు, నెయ్యి కలసినపుడు propelene oxide వస్తుంది. కృత్రిమ వర్షానికి ఈ వాయువే కారణం.


ॐ సోమ అనే మొక్క scientific name ASCLEPIUS ACIDA.. ఈ మొక్క downstream water quality అంటే భూమి లో వున్న నీటి శాతాన్ని, నాణ్యతను పెంచుతుంది. 


ఈ మొక్క ని యజ్ఞంలో వాడటం వల్ల cloud seeding అంటే వర్షపాతం ను పెరిగేలా చేసి cloud condensing మేఘాలను సంక్షేపనం చేసి వర్షం వచ్చేలా చేస్తుంది. యిది ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది. 


ॐ ఆవు పిడకలు తెలిసినదే కదా radiation absorber.. 


ॐ గంధం, నెయ్యి... యివన్ని యజ్ఞంలో కలిసి hydro carbons ని oxidise చేసి formic acid, acetic acid అనే క్రిమినాశిని వాయువులు ఏర్పడతాయి. 

     

ఇది మన యఙ్ఞానికి ఉన్న ప్రాముఖ్యత..🌷

సర్వభూత గణామేయ సౌహార్దాయ 141

 Forwarded message


సర్వభూత గణామేయ సౌహార్దాయ 141 


శ్రీమఠంలో ప్రతిరోజూ సాయంత్రం, ఏనుగులకు బెల్లం కలిపిన అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలు బంతులుగా పెట్టడం అలవాటు. మావటి ఆ అన్నం ముద్దలను చేతిలోకి తీసుకుని, నేరుగా ఏనుగు నోట్లో పెట్టేవాడు.


ఒకరోజు ఏనుగులకు అన్నం పెట్టే సమయంలో పరమాచార్య స్వామివారు మామూలుగా అటువైపు వచ్చారు. ముద్దలుగా చేసిన అన్నాన్ని చూశారు. దగ్గరలోనే ఉన్న సహాయకునితో, “ఈ అన్నం ముద్దలను ఏనుగుకు తినిపించవద్దు అని మావటికి చెప్పు” అని చెప్పి వెళ్ళిపోయారు.


వెంటనే మేనేజరుని పిలిచారు స్వామివారు.


“ఏనుగుకు పెట్టే అన్నాన్ని సరిగ్గా ఉడికించలేదు. పొడిగా, తరకలుగా విరిగిపోతోంది. ఇంత అశ్రద్ధతో, ఇలా దానికి ఆహారం పెట్టరాదు. అది మాటలురాని ఒక జంతువు, దానికి ఇలా సగం ఉడికిన అన్నం పెడతారా? మావటికి చెప్పు. ఈ ఏనుగుకు పెట్టే ఆహారం సాక్షాత్ గజముఖునికి పెట్టే నైవేద్యం లాగా ఉండాలి. అంత భక్తి ఉండాలి. అంత శ్రద్ధ ఉండాలి. మరలా అన్నం వండి, ఏనుగుకు పెట్టండి” అని చెప్పారు.


మాటలురాని ఒక జంతువుపై స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని చూసి శిష్యులు కరిగిపోయారు.


మహాస్వామి వారు ఆ అన్నం ముద్దల్ని చేతిలోకి తీసుకుని పరిశీలించలేదు. అంతెందుకు, అసలు ఒక్క క్షణం అక్కడ నిలబడి వాటివైపు కూడా చూడలేదు. మరి అది సరిగ్గా ఉడకలేదని, తరకలుగా అయిపోయిందని స్వామివారికి ఎలా తెలుసు?


ఇంత చిన్న విషయాల్లో కూడా స్వామివారు తమ సర్వజ్ఞత్వాన్ని చూపేవారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

సుఖమైనా, దుఃఖమైనా

 శ్లోకం:-డా౹౹ సూరం శ్రీనివాసులు


సుఖం వా దుఃఖం వా న నియమితం నాపి నియతం

విభిన్నత్వాచ్చేతోగతికృతిఫలానాం ప్రతిజనమ్౹

పరం స్యాద్వా నిత్యం సుఖ మిహ జగద్దుఃఖ మితి న

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


సుఖమైనా, దుఃఖమైనా నియతంగానూ వుండవు, 

నియమించబడీ వుండవు. ప్రతి వ్యక్తిలో కూడా గతి, 

కృతి, ఫలం భిన్నంగా ఉంటాయి. పరం నిత్యమూ ,

సుఖమూ కావొచ్చు, కానీ జగత్తు దుఃఖమంటే ఎలా? 

విధాతా !సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు 

విఫలుడవవుతున్నావు?

ధార్మికగీత - 126*

 ☘☘☘☘☘☘☘☘☘☘☘☘

                    *ధార్మికగీత - 126*

                      ***************

       *శ్లో:- ఉపేక్ష్య  సమయే కార్యే౹*

              *భగ్నే  చింతా  నిరర్థకా ౹*

              *నిర్గతే   సలిలే    తత్ర ౹*

              *సేతు బంధో  నిరర్థకః  ౹౹*

                             *****

    *భా:- చేయవలసిన పనిని తగిన సమయములో చేయ కుండా, తరువాత ఆ పని పాడయి పోయినదని విచారించడం వలన ప్రయోజనం ఉండదు. నీరు పారు తున్నప్పుడే గట్టు కట్టాలి. తరువాత గట్టు కడితే లాభం ఏమిటి? గత జల సేతుబంధనం అంటే ఇదే!*

☘☘☘☘☘☘☘☘☘☘☘☘

పరాత్మా

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


పరాత్మా జీవాత్మా జగదపి సమానస్థితియుతా

ననన్యజ్ఞాతత్వా దనుగతజనిత్వా దపరధా౹

స్వరూపప్రాప్తిత్వాత్ పునరిహ వయం భిన్నకథనాః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


పరాత్మ , జీవాత్మ  జగత్తు(జడం) కూడా సమాన స్థితి 

కలిగినవే. ఇతరులెవ్వరికీ తెలియకుండా వుంది కాబట్టి 

పరాత్మ , పుట్టుక కొనసాగింపు జరుగుతోంది కాబట్టి 

జీవాత్మ ,మరొక స్వరూపం పొందుతోంది కాబట్టి జడం 

సమాన స్థితి కలిగి వున్నాయి. అయితే మేమేమో ఇక్కడ 

విభిన్నంగా చెబుతుంటాం. విధాతా ! సృష్టిగతిని 

కొనసాగిస్తూ నువ్వెందుకు విఫలుడవవుతున్నావు?

ఋభు మహర్షి

 మన మహర్షులు - 9


 ఋభు మహర్షి


🍁🍁🍁🍁


ఋభు మహర్షి బ్రహ్మకి ఇష్టమయిన పుత్రులంటారే వాళ్ళల్లో ఒకడు. అంటే బ్రహ్మ మానసపుత్రుడన్నమాట,


భగవంతుడు వరాహావతారం ఎత్తినపుడు ఋభువు ఆయనకి శిష్యుడుగా ఉండేవాడు .చాలా సంవత్సరాలు తపస్సు చేసినవాడు మంచి నిష్ట కలిగిన వాడు అయిన ఋభు మహర్షి దగ్గరికి పులస్త్య మహర్షికి కొడుకయిన నిదాఘుడు అనే మహర్షి వచ్చి శిష్యుడిగా చేర్చుకోమన్నాడు. గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు దొరికాడని అనుకుని ఋధువు సరేనన్నాడు


నిధాఘుడు గురువయిన ఋభువు నుండి అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు ఒక్క ఆద్వైతాన్ని గురించి మాత్రం వంటబట్టించుకోలేక పోయాడు.


నిదాఘుడు వివాహం చేసుకుని యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపస్సు, అతిధులకి సేవచేస్తూ, గురుభక్తి తో కాలం గుడుపుతుండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి


ఒకరోజు ఆయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు.. నిధాఘుడు ఆయన్ని ఆదరించి మహాత్మా ! భోజనం చెయ్యండి అన్నాడు. నాకు అన్నం తినాలని లేదు. ఆరు రుచులు కలిగిన భోజనం పెట్టమన్నాడు. నిదాఘుడు భార్యకి చెప్పి వండించి భోజనం పెట్టాడు మహర్షి భోజనం పూర్తయ్యాక నిదాఘుడు మహాత్మా! ఆకలి తీరిందా? భోజనం బాగుందా అనడిగాడు


ఆకలి వున్న వాడికి ఆకలి తీరిందా? లేదా? తెలుస్తుంది. నాకు ఆకలి అంటే ఏమిటో తెలియదు, భోజనము రుచిగా ఉందా? లేదా? అనేది దేహానికి సంబంధించింది. మట్టిగోడలు మళ్ళీ మట్టి రాస్తే ఎలా గట్టిపడతాయో ఈ శరీరం కూడ పంచభూతాల వల్ల పుట్టింది కాబట్టి ఆ పదార్థాలతోనే పోషింపబడుతుంది. ఏది రుచి ఏది రుచి కాదు, నువ్వు, నేను ఇల్లాంటివన్నీ విడిచిపెట్టి ముక్తికి మార్గం చూసుకో అన్నాడు


నిదాఘుడు మహాత్మా ! మీ పేరు చెప్పలేదు అన్నాడు. 


ఆ మహర్షి నా పేరు ఋభుడు, నేను నీ గురువుని అనగానే నిదాఘుడు ఆయన కాళ్ళమీద పడి మిమ్మల్ని చూసి వేయి సంవత్సరాలయిపోయింది. అందుకే గుర్తించలేకపోయాను క్షమించండి అన్నాడు.


ఇంకొక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి., 


మళ్ళీ బుభు మహర్షి శిష్యుడు నిదాఘుడు ఉన్న నగరానికి వచ్చాడు, నిదాఘుడు అడవికి వెళ్ళి కట్టెలు, పండ్లు మొదలయినవి పట్టుకొని వస్తూ దార్లో నడవడానకి వీలవక ఒకచోట కూర్చున్నాడు.


ఋధుమహర్షి నిదాఘుణ్ణి చూసి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి ? అని అడిగాడు


. శిష్యుడికి మళ్ళీ మామూలే, గురువుగార్ని గుర్తుపట్టలేదు. నడుస్తుంటే రాజ బలగం అడ్డు వచ్చింది. అందుకే ఆగానన్నాడు.


గురువు మళ్ళీ అడిగాడు. ఇందులో రాజెవరు? బలం ఎవరు? అని. 


శిష్యుడు అది కూడ తెలియదా! ఏనుగు మీద ఉన్నవాడు రాజు అన్నాడు. 


గురువు గారు ఊరుకోలేదు రాజెవరు? ఏనుగెవరు ? అన్నాడు


. శిష్యుడు ఓపిగ్గా పైన ఉన్నది రాజు, క్రింద ఉన్నది ఏనుగు అన్నాడు.


 గురువు శిష్యుణ్ని వదిలి పెట్ట దలుచుకోలేదు. పైన అంటే ఏమిటి క్రింద అంటే ఏమిటి ? అన్నాడు. 


ఇంక శిష్యుడికి కోపం ఆగలేదు. ఒక్క ఉరుకు ఉరికి గురువుగారి మెడమీద కూర్చుని ఇప్పుడు నేను పైన నువ్వు క్రింద అన్నాడు.


 గురువుగారు ఇంకా వదలడల్చుకోలేదు శిష్యుణ్ణి, నువ్వంటే ఎవరు? నేనంటే ఎవరు? అన్నాడు. 


శిష్యుడు వెంటనే క్రిందకి దూకేసి గురువుగారి పాదాల మీద పడి మహాత్మా! వేయి సంవత్సరాలు గడిచిపోయింది కదా.. మిమ్మల్ని గుర్తించలేదు. క్షమించండి అన్నాడు.


ఋధ మహర్షి నిదాఘుడ్ని లేవదీసి నీకు బ్రహ్మవిద్య గురించి చెప్పాలని వచ్చాను నీకేమయినా సందేహాలుంటే అడుగు. ఇంక రాను అన్నాడు.


 శిష్యుడు మహాత్మా ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పండి అన్నాడు


ఋభుష మహర్షి వత్సా! ఈ శరీరం మాయచే కప్పబడింది. మేలుకొని వున్నంతవరకు ఈ శరీరం సుఖాలు కోరుతుంది, నిద్రపోయినపుడు అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతుంది. పూర్వజన్మ కర్మల వల్లనే మనిషి సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఆశ్మే పరబ్రహ్మం. దాని వల్లనే సర్వేంద్రియాలు పంచభూతాలు పుడుతున్నాయి. ఏది పరబ్రహ్మ స్వరూపమో, ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో, ఏది నిత్యమో అదే నేను. బ్రహ్మము నేను నాలోంచే అన్నీ పుడుతున్నాయి. నశిస్తున్నాయి. నేనే విశ్వమంతా ఉన్నాను. కళ్ళు లేకపోయినా చూడగలను, చెవులు లేకపోయినా వినగలను, నాకు పాపము లేదు, చావు లేదు, వేరే జన్మము లేదు, నాకు దేహబుద్ధి లేదు అంతా నేనే. నేనే బ్రహ్మను అని తెలుసుకున్నప్పుడు నీకు దేని గురించి చింత..


అంతా నేనే వేరే ఏమీ లేదు. నేనే పరబ్రహ్మ అని అనుకున్నప్పుడు ఈ సంసారం కూడ పరబ్రహ్మ కదా.. దాని గురించి నీకు ఆలోచన ఎందుకు? అది కూడ వదిలేసి పరబ్రహ్మని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో. అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అనేది తెలుస్తుంది, అప్పుడే ఈ సంసారంతో బంధం కూడ ఉండదు. నువ్వు ఎక్కడనుండయితే వచ్చావో అక్కడికి పోవడానికి దారి వెతుక్కో, దానికి మార్గం భగవన్నామం.


భగవన్నామం చేసుకుని నువ్వు ఎవరో ఎక్కడనుండి, ఎందుకు వచ్చావో తెలుసుకుని అక్కడకి వెళ్ళడానికే నీ తపస్సు ఉపయోగించుకోమని ఋభు మహర్షి నిదాఘుడుకి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు.


తెలుసుకున్నాం కదా...

శిష్యుడికి గురవెంత ముఖ్యమో, గురువుకి మంచి శిష్యుడు కూడ అంతే ముఖ్యం, గురువు ఎప్పుడూ శిష్యుడికి మంచి జరగాలనే కోరుకుంటాడు.


చూశారా! గురువుగారు ఎన్ని వేల సంవత్సరాలయినా తన శిష్యుణ్ణి ఎలా కాపాడుకుంటూ, జ్ఞానం, మోక్షం కలిగేలా బోధిస్తూ ఉన్నాడో..


అదే.. గురశిష్య సంబంధం.. తండ్రికి కొడుక్కి.. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం ...


శ్రీ గురుభ్యోన్నమః 🙏


🌸జై శ్రీమన్నారాయణ🌸


🍁🍁🍁🍁

దత్త కరుణ.

 *దత్త కరుణ..*


"శనివారం నాడు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి రావాలని అనుకుంటున్నామండీ..ఆరోజు రాత్రికి అక్కడ మేము బస చేయడానికి ఒక రూమ్ ఇవ్వగలరా?.." అని అతను అడిగాడు..ఈవారం కుదరదు ఆపై శనివారం నాటికి రూమ్ ఇవ్వగలము అని చెప్పాను..ఒక్కక్షణం ఆలోచించి.."పోనీ మేము మంటపం లో పడుకునే అవకాశం ఉన్నదా..? ఈ శనివారం తప్ప నాకు సెలవు లేదు..అందుకని అడుగుతున్నాను.." అన్నాడు.."మంటపం లో ఉండొచ్చు..మీ పేరు చెప్పండి..నమోదు చేసుకుంటాను..ఒకవేళ రూములు తీసుకున్న వాళ్లలో ఎవరైనా రాకపోతే..ఆ రూమ్ మీకు కేటాయిస్తాము.." అన్నాను.."చాలా థాంక్స్ అండీ..నాపేరు హరికృష్ణ, మా ఆవిడ పేరు..శిరీష..మేమిద్దరం వస్తాము..మీకు వీలుంటే రూమ్ చూడండి..లేకుంటే..మంటపం లో ఉంటాము.." అన్నాడు..


అనుకున్న విధంగానే శనివారం నాటి ఉదయం తొమ్మిది గంటల కల్లా హరికృష్ణ, అతని భార్య శిరీష వచ్చారు..మందిరం లోకి వచ్చి, నా గురించి వాకబు చేసి, నేను కూర్చున్న చోటుకి వచ్చారు.."మీరేనా ప్రసాద్ గారు..నమస్తే అంకుల్.." అని ఇద్దరూ ఒకేసారి చెప్పారు..నేనూ నమస్తే అన్నాను.."అంకుల్..రూము ఏదైనా..." అని అతను కొద్దిగా నసుగుతూ అడిగాడు..అందరూ వస్తున్నారని..ఇక మీరు మంటపం లోనే ఉండాలి అని నేను చెప్పాను..అతను తన భార్య వైపు చూసి..మళ్లీ నా వైపు తిరిగి.."సరే అంకుల్..సాయంత్రం పల్లకీసేవ లో పేరు ఎప్పుడు నమోదు చేసుకుంటారు?.." అని నన్ను అడిగాడు..మధ్యాహ్నం మూడుగంటల తరువాత మా సిబ్బంది వద్ద నమోదు చేసుకోండి..అని చెప్పాను..


"అంకుల్..మీరు కొద్దిగా సమయం ఇస్తే..మా సమస్య చెప్పుకుంటాము.." అన్నాడు.."ఇప్పుడు ఖాళీగా వున్నాను..చెప్పండి.." అన్నాను.."మా ఇద్దరికీ వివాహం జరిగి ఆరేళ్ళు అవుతోంది..పెళ్ళైన రెండేళ్ల తరువాత తాను గర్భవతి అయింది..కానీ రెండో నెలలోనే అబార్షన్ అయింది..డాక్టర్ కు చూపించాము..ఒక్కొక్కసారి అలా జరుగుతుందని..కంగారు పడొద్దు..ఈసారి గర్భం వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే..అలా జరుగదు..అని మందులు రాసిచ్చారు..మళ్లీ ఎనిమిది నెలల తరువాత గర్భం వచ్చింది..ఈసారి డాక్టర్ సలహాతో ముందు జాగ్రత్తలు తీసుకున్నాము..మా ఖర్మ ఏమిటో తెలీదు కానీ..మళ్లీ అబార్షన్ జరిగింది..తాను బాగా బాధపడింది..ఇప్పటికి మొత్తంగా మూడు సార్లు అబార్షన్ జరిగింది..ఇప్పుడు రెండో నెల తనకు..ఈ స్వామివారి గురించి బాగా విన్నాను..నేనూ చదివాను..ఒక నమ్మకం ఏర్పడింది..తనకు చెప్పాను..తాను మూడు నెలల నుంచీ స్వామివారి లీలలు ఫేస్బుక్ లో చదువుతున్నదట..నాతో చెపితే..నేను మూఢ నమ్మకం అంటానేమో అని సందేహం తో ఊరుకున్నదట..నేనే ఆడిగేసరికి..సంతోషంగా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నది..గర్భవతి కదా..ఇక్కడ నేల మీద పడుకోవడం కష్టం కదా అని రూమ్ అడిగాను..తానేమో..స్వామివారి ని నమ్మి వెళుతున్నాము..మన బాగోగులు ఆయనే చూసుకుంటాడు..అన్నది..ఇలా వచ్చాము.." అన్నాడు..


"మీ నమ్మకమే మీకు రక్ష.." అన్నాను.. సరే అని ఇద్దరూ లేచి వెళ్లిపోయారు..క్యూ లైన్ లో వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకొని..నమస్కారం చేసుకున్నారు..ఆరోజు సాయంత్రం పల్లకీసేవ కు పేర్లు నమోదు చేసుకున్నారు..సరిగ్గా సాయంత్రం ఆరు గంటలప్పుడు..మా సిబ్బంది నా దగ్గరకు వచ్చి, "అయ్యా..ఈరోజు రూములు బుక్ చేసుకున్న వాళ్లలో ఒకరు ఇంతవరకూ రాలేదు..వాళ్ళ సెల్ కు కాల్ చేస్తే..మాకు ఇబ్బంది వచ్చింది మేము రావటం లేదు..అన్నారు..మీరు చెప్పారు కదా..ఆ దంపతులకు అవకాశం ఇవ్వమని..వాళ్ళకే ఈ రూమ్ ఇద్దాము.." అన్నారు..ఆ దంపతులను పిలిచి విషయం చెప్పాను..సంతోష పడ్డారు.."చూసావా..నేను కష్టపడటం స్వామివారికి ఇష్టం లేదు..అందుకే మనకు రూమ్ ఇప్పించారు.."అని అతని భార్య అన్నది..ఆరోజు పల్లకీసేవ లో ఇద్దరూ పాల్గొన్నారు..ప్రక్కరోజు ఉదయం ప్రభాతసేవ పూర్తి కాగానే..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తమ సమస్య అక్కడ చెప్పుకొని..దయ చూపమని కోరుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం ఊరెళ్లిపోయారు..


పోయిన ఆదివారం ఆ దంపతులు ఇద్దరూ వచ్చారు..ఆ అమ్మాయి చేతుల్లో పసి బిడ్డ ఉన్నది..నేరుగా మా దంపతుల వద్దకు వచ్చి..మా ఆవిడ చేతిలో..ఆ బిడ్డను పెట్టి.."స్వామివారి దయ వల్ల పుట్టింది అంకుల్..అందుకే "దత్త కరుణ" అని పేరు పెట్టుకున్నాము..ఇప్పుడు ఐదో నెల..మా మొరను స్వామివారు విన్నారు..కాకుంటే..ఇక నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది..ఈ బిడ్డ ఒక్కటే చాలు అని స్వామివారే నిర్ణయించారు అనుకున్నాము..ఏదైనా ఆయన దయ.." అన్నది.."నిజం అంకుల్..స్వామివారి ప్రసాదమే ఈ పాప.." అన్నాడు అతను..

స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి వెళుతూ..ఆ దంపతులు మళ్లీ మా దగ్గరికి వచ్చారు.."అంకుల్..స్వామివారు మా కోరిక తీర్చారు..మేము కూడా మా చేతనైన పని ఇక్కడ చేయాలని అనుకున్నాము..అందరికీ ఉపయోగ పడే కార్యం ఉంటే చెప్పండి..మా శక్తి కొద్దీ మేము చేస్తాము.." అన్నారు..ఒక ఐదు నిమిషాలు ఆలోచించి.."మీరే చూసారు కదా..భక్తులు ఉండటానికి వసతి కావాలి..కొన్ని రూములు కట్టాలి..అందుకు మీ చేతనైన సహాయం చేయండి.." అన్నాను.."అలాగే అంకుల్..త్వరలోనే మా వంతుగా విరాళం ఇస్తాము.." అని చెప్పారు..సర్వం..దత్తకృప అని ప్రతిసారీ నేనెందుకు పదే పదే అన్ని పోస్టుల్లో వ్రాస్తుంటాను అని కొంతమంది నన్ను అడిగారు..ఇటువంటి సంఘటనలు కళ్లారా చూసినప్పుడు..అలా రాయడం లో తప్పులేదు అని వాళ్లకు తెలుస్తుంది అని అనుకుంటున్నాను..ఆ దత్తుడి కృపను మీరూ పొందొచ్చు..త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మి కొలవండి చాలు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..99089 73699 & 99089 73699)

రామాయణమ్ ..201

 రామాయణమ్ ..201

.................................

వాలి శ త్రుసంహారకుడు . మహాబలవంతుడు.

 నాకు నా తండ్రికి ఒకప్పుడు బహు ప్రీతిపాత్రుడు .

.

నా తండ్రి మరణానంతరము జ్యేష్టుడని ఈయనకు రాజ్యాభిషేకము చేసిరి . తాతముత్తాతలనుండి సంక్రమించిన రాజ్యాన్ని అతను శాసించుండగా  సేవకునివలె ఆయనకు వంగి ఉంటిని.

.

మాయావి అనే ఒక రాక్షసునికి ఒక స్త్రీ మూలమున వాలి తో వైరము ఏర్పడినది .దుందుభి ,మాయావి అన్నదమ్ములు .

.

ఆ మాయావి ఒకరోజు రాత్రి వేళ జనులనందరూ గాఢ నిద్రలో మునిగిఉన్న వేళ నగరద్వారము వద్దకు వచ్చి భయంకరమైన కేకలు వేయుచూ వాలిని యుద్ధానికి ఆహ్వానించినాడు .

.

అప్పుడు నిదురలో ఉన్న మా అన్న వాలి కోపించి వేగముగా బయటకు వచ్చినాడు .మేము వారించిననూ వాలి మా మాట వినక వానితో యుద్ధానికి బయలుదేరినాడు .

.

నేను కూడా అన్నపై గల స్నేహముతో ఆయన వెంట బయలు దేరినాను .

.

మా ఇరువురినీ చూసి ఆ అసురుడు భయపడి చాలా దూరము పారి పోయినాడు .

.

నిశిరాతిరిలో నిండు చందురుని వెన్నెలలు మాకు దారి చూపాయి.

.

అంత ఆ అసురుడు అత్యంత వేగముగా ఒక బిలములోనికి దూరినాడు .ఆ బిలము చుట్టూరా  గడ్డి కప్పబడి ఉన్నది .

.

అప్పుడు మా అన్న ఎలాగైనా వాని సంగతి చూడాలని పట్టుదలతో కోపావేశములు కలవాడై నన్ను ఆ బిల ద్వారము వద్దనే కావలి ఉండమని ఆజ్ఞాపించి తానూ మహా వేగముగా లోపలికి దూరినాడు .

.

అంతటా నిశ్శబ్దము!

.

 ఏ విధమైన ధ్వనులూ లోపలినుండి వినిపించుటలేదు .....

.

ఒక సంవత్సరము గడిచి పోయినది ...

.

జానకిరామారావు వూటుకూరు

.

విమానం లో భోజనం

 *విమానం లో భోజనం* మనసు పెట్టి చదివే కథ, మనసు న్నోళ్ళ కథ,

.

విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని 

" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి 

.

" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు 

" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే ! 

" సరే ! " 

నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...

నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...

నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను . 

వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .

నేను అంతా గమనించాను . మీకు అభినందనలు . 

ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.

ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...

మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ." 

నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను . 

అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు . 

అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు 

విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు . 

ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి . 

.

ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.

" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !

మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !

ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే. 

- జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

సూర్య నమస్కారానికి అరుదైన ఘనత

 భారత సూర్య నమస్కారానికి అరుదైన ఘనత


భారత సూర్య నమస్కారానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత దక్కింది. ‘సూర్య నమస్కార్ యజ్ఞ’ను గుర్తిస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. “మిస్టర్ స్పీకర్, హిందూ స్వయం సేవక్ సంఘ్ పదవ వార్షికోత్సవం సందర్భంగా ‘సూర్య నమస్కార యజ్ఞ’ను గుర్తించాలని కోరుతున్నాను” అని ఇల్లినాయిస్ ప్రజా ప్రతినిధి బిల్ ఫోస్టర్ బుధవారం నాడు ప్రతినిధుల సభలో తెలిపారు. ఇది చాలా సులభమైన యోగాసనమని గుర్తు చేసిన ఆయన శ్వాసకు సంబంధించిన మెళకువలను ఇది నేర్పిస్తుందని, ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుందని, మనసుకు సాంత్వన చేకూరుస్తుందని ఈ సందర్భంగా ఫోస్టర్ వ్యాఖ్యానించారు. యోగా ఫర్ హెల్త్ అంటూ ఈనెల 14 నుంచి పదిహేను రోజుల పాటు హిందూ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించనున్న ప్రచారం 29తో ముగియనున్న సంగతి తెలిసిందే. యోగా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంఘం ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా పోస్టర్ కొనియాడారు.


పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస, వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం.

పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు అవడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.


సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు , ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది. ఆత్మకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. సమతుల్యం, సహనం, నిర్దిష్ట మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనో విశ్లేషణ, హృదయ వివేకాన్ని సాధకుడు పొందుతాడు. ద్వాదశ సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలు గోప్యమైనవి. వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఇవి ప్రణామ ప్రవాహంగా అవిచ్చిన్నంగా సాగుతాయి. వీటిలో మొండెం, మెడ ముందుకు , వెనుకకు , పైకి, కిందకు ప్రధానంగా కదులుతాయి. ఈ కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి.


ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రెండు .

వేసే ప్రతి ఆసనంలోను శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది .

శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది. శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం.

ముఖ్య సూత్రం .


ప్రాణాయామం, సూర్యనమస్కారం, విశ్రాంతి ఆసనమైన శవాసనం అనే మూడు ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి.


జాగ్రత్తలు

ఋతు సమయాలలోను, వెన్నెముక కింది భాగంలో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీటిని ఆచరించకూడదు. గుండె , రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలున్న వారు, జ్వరం, అల్సర్ లు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు.


సూచనలు

ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే జీవనశైలికి అలవాటుపడిన వారు, చెడు రక్తం, జీర్ణ సమస్యలు వంటి రుగ్మతలున్నవారు ' పవనముక్తాసన శ్రేణి' భంగిమలను మెల్లగా ప్రాక్టీస్ చేసి ఆ తరవాత సూర్య నమస్కారాలకు ఉపక్రమించాలి . పవనముక్తాసనం వలన శరీర భాగాలలోని మజిల్స్ సాగి, సూర్య నమస్కారాలలోని కదలికలకు అనువుగా సర్దుకుంటాయి.

అలా కాని పక్షంలో కీళ్ళ నొప్పులు , జ్వరం, పాదాలవాపు , చర్మం పగలడం వంటి సమస్యలు వస్తాయి.


సూర్యనమస్కారాలను సాయంత్రం వేళల్లో చేయకూడదు .

సూర్యుని వైపు తిరిగి, వేకువఝామునే సూర్య నమస్కారాలు చేయడాన్ని అభ్యసించాలి.


ఆసనాలు: 

1. ప్రణామాసనం

నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి.

' ఓం మిత్రాయ నమః ' అందరికీ మిత్రుడనైన నీకు అంజలి ఘటిస్తున్నాము అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని పఠించాలి .


ప్రయోజనాలు :

ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచడం వల్ల, మనస్సును హృదయం పై కేంద్రీకరించి ఉండటం వల్ల మనస్సు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది.


2.హస్త ఉత్థానాసనం

శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి. ' ఓం రవయే నమః' ప్రకాశవంతుడైన ప్రకాశదాతవైన నీకివే వందనాలు దేవా! అనే అర్థాన్నిచ్చే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి.


ప్రయోజనాలు :

వెన్నెముకకు శక్తి ఇవ్వడం , దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఛాతీని విరిచినట్లుగా వెడల్పుగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. అంతేకాక థైమస్, థైరాయిడ్ వంటి గ్రంథులపై బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.


3. పాదహస్తాసనం

శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ' ఓం సూర్యాయ నమః ' సకల ప్రాణుల పుట్టుకకు కారణమైన పరమాత్మ అనే భావాన్నిచ్చే ఈ మంత్రాన్ని జపించాలి.

జాగ్రత్తలు:

మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు . అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది .


ప్రయోజనాలు:

ఈ ఆసనం వల్ల ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది . మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది , కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం సహకరిస్తుంది.


4.అశ్వ సంచలనాసనం

లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ' ఓం భానవే నమః ' అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం ' అనే అర్థాన్నిచ్చే మంత్రం పఠించాలి.


జాగ్రత్తలు :

ప్రారంభ దశలో ఎక్కువమంది సాధకులు మోకాలిని వెనుకకు వంచడాన్ని మరిచిపోతారు. శరీరమంతా సక్రమమైన భంగిమలో ఉన్నదా లేదా అన అంశాన్ని గమనించాలి. చాలామంది పైకి చూడటం మరిచిపోతారు . తప్పనిసరిగా తలను పైకెత్తి చూడాలి. థైరాయిడ్ గ్రంథి చర్య క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది.

ప్రయోజనాలు :

శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, ఎడ్రినల్, మరియు యురోజెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను అధిగమించడం, సంతాన సాఫల్యం , శ్వాసక్రియ మెరుగుపడటం - ఈ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలు. .


5.సంతులనాసనం 

నాలుగవ స్థితి నుండి గాలి నెమ్మదిగా వదులుతూ కాలివేళ్లు నేలను తాకుతూ, ఎడమకాలిని వెనుకకు కదిలించాలి. ఇప్పుడు మోకాళ్ళు రెండు నేలకు దూరంగా ఉంచాలి. శరీరం మధ్య భాగం పైకి ఎత్తినట్లు బోర్లించిన v ఆకారంలో ఉంచాలి. శరీరం మొత్తం కాలివేళ్ల పైన అరచేతులపైన ఆధారపడి నిలవాలి. దృష్టిని మాత్రం ఎదురుగా నేలపై ఉన్న ఏదైనా వస్తువుపైన కేంద్రీకరించి ఉంచాలి. ' ఓం ఖగయే నమః' ' అనాయాసంగా సాగిపోయే దైవానికి వందనాలు' అనే అర్థం వచ్చే ఈ మంత్రం జపించాలి.


జాగ్రత్తలు : అనాయాసంగా సాగిపోయే దైవానికి దైవానికి వందనాలు" అనే అర్థం వచ్చే ఈ మంత్రం జపించాలి.

ఎక్కువమంది ఈ ఆసనం వేసేటప్పుడు శరీరాన్ని చెక్కలా వంగకుండా ఉంచడం మరుస్తారు . కటి భాగాన్ని పైకి ఎత్తి ఉంచుతారు. అలా చేయకూడదు. దీనివల్ల శరీరం బరువు తగ్గదు. శరీరాన్ని వంచకుండా స్టిఫ్ గా ఉంచడం మరవకూడదు.


ప్రయోజనాలు:

ఈ ఆసనం వేస్తే మణికట్టుకు బలం వస్తుంది. మానసిక, శారీరక పుష్టి కలుగుతుంది. ఇది నడుముకు పటుత్వాన్ని ఇస్తుంది. వెన్నెముకకు (క్రింది భాగానికి) బలాన్ని అందిస్తుంది. అందువల్ల అనేక రుగ్మతలు తొలగుతాయి.


6.అష్టాంగ నమస్కారం: 

అర చేతులను, కాలి వేళ్ళను కదిలించకుండా నేలపై ఉంచాలి. మొండాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి. మొదటిగా మోకాళ్ళను నేలకు ఆనించాలి. తరువాత ఛాతీని, గడ్డాన్ని నేలకు తాకించాలి. ఈ భంగిమలో శరీరం అల ఆకారంలో కనిపిస్తుంది. 

' ఓం పూష్ణే నమః' ' సర్వులకు పోషకుడైన నీకు వందనం' అనే భావంతో మంత్రాన్ని జపించాలి. 


జాగ్రత్తలు:

కడుపు, కండరాలు వేలాడకుండా ఈ భంగిమ నిరోధిస్తుంది. మధుమేహం, మలబద్ధకం, జీర్ణ సమస్యల పరిష్కారంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎడ్రినల్ గ్రంథులకు విశ్రాంతినిస్తుంది. హార్మోనులను సక్రమంగా పని చేయిస్తుంది.


7.భుజంగాసనం: 

అష్టాంగ నమస్కారం వలె ఉదరం నేలకు తాకేలా ఉంచాలి. శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుండి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి., మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి.

' ఓం హిరణ్యగర్భాయ నమః ' విశ్వ ప్రతినిధియైన నీకు నమస్కారం' అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని మననం చెయ్యాలి.


జాగ్రత్తలు :

ఈ భంగిమ చివరిలో మోచేతులను చాచకూడదు. ఉదరాన్ని నేలకు అణచి ఉంచాలి.. అలా చేయడం వల్ల ఉదర గ్రంథులు చురుకుగా పనిచేస్తాయి.


ప్రయోజనాలు:

ఒత్తిడి, స్థూలకాయం, వెన్నెముక సమస్యలు, థైరాయిడ్ సమతుల్యం, యురోజెనిటల్ సమస్యలు - ముఖ్యంగా ఋతుక్రమ సంబంధమైన, ఋతువాగి పోవడం వలన వచ్చే సమస్యలకు ఈ భంగిమ అమోఘంగా పని చేస్తుంది . తొడలు , పిరుదులు, శరీరం వెనుకభాగాన్ని ఈ ఆసనం తీర్చిదిద్దుతుంది .


8.పర్వతాసనం :

పద్మాసనం లో కూర్చునే విధంగా కూర్చుని రెండు చేతులను ఒక చోట చేర్చి చిత్రంలో చూపిన విధంగా చేతులను సాగదీస్తూ పైకి ఎత్తాలి.

ప్రయోజనాలు :


వెన్నెముకకు ఇది మంచి వ్యాయామం , ఫలితంగా వెన్నునొప్పులకి ఇది ఔషధంలా పని చేస్తుంది.


జాగ్రత్తలు : కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ వ్యాయయం చేయకూడదు .


9.అశ్వసంచాలనాసనం :

పై ఆసనాల నుండి నెమ్మదిగా కటిద్వయాన్ని కిందికి దించి కుడికాలిని కొంచెం ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి ఉంచాలి. ఎడమ మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్థ చంద్రాకారం కలిగి గుఱ్ఱం ఆకారం వలె ఉంటుంది. 

' ఓం ఆదిత్యాయ నమః' 'విశ్వ సుతుడైన నీకు ప్రణామం' అనే మంత్రం స్మరణీయం.


ప్రయోజనాలు: ఈ ఆసనం వలన ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది. కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.


10.పాద హస్తాసనం 

అశ్వభంగిమ నుండి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తి ముందుకు నుంచునే విధంగా వంగాలి. చిత్రంలో చూసి అభ్యసించాలి. పై వివరాలే దీనికీ వర్తిస్తాయి.

' ఓం పవిత్రే నమః ' ' చైతన్యం కలిగించే వానికి ప్రణామం' అన్న భావాన్నిచ్చే మంత్రం అనుకోవాలి.


ప్రయోజనాలు :

శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, టైమర్ ఎడ్రినల్, మరియు యూరో జెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను సంతాన సాఫల్యాన్ని, శ్వాసక్రియ మెరుగుపరచడం , ఈ ప్రక్రియ వల్ల కలిగే ఉపయోగాలు.


11.హస్త ఉత్థానాసనం 

పై భంగిమ నుండి రెండు చేతులను తల పైకి ఎత్తి ఉంచాలి. అలా చేసేటప్పుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనుకభాగం వద్ద కొద్దిగా వంగాలి. ' ఓం ఆర్కాయ నమః ' ' శక్తిప్రదాతకు నమస్సులు ' అనే భావాన్నిచ్చే మంత్రాన్ని జపించాలి.


ప్రయోజనాలు :

వెన్నెముకకు శక్తి ఇవ్వడం, దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేసే ఆలోచనల వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. 


ఛాతీని తెరచి ఉంచుకోవాలి, శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది . టైమస్, థైరాయిడ్, వంటి గ్రంథుల పై బాగాపని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం , మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.


12.ప్రణామాసనం 

శ్వాసను వదులుతూ రెండు అర చేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి చాతీ వద్ద ఉంచాలి. దీనితో సూర్య నమస్కారాసనాలు పూర్తి అయినట్లే. 

' ఓం భాస్కరాయ నమః ' ' గురువుకు అభివాదం' అనే భావంలో జపం చెయ్యాలి.