4, ఏప్రిల్ 2022, సోమవారం

నౌరోజ్ కా మేళా*

 అక్బర్ ప్రతీ సంవత్సరం ఢిల్లీలో *నౌరోజ్ కా మేళా* ఏర్పాటు చేయిస్తుండే వాడు..❗

ఇందులో పురుషులకు ప్రవేశం ఉండేది కాదు ....❗

అక్బర్ ఈ జాతరలో ఆడవారి మారు వేషాలతో వెళ్ళుచుండే వాడు మరియు ఏ ఆడవారు అతన్ని మంత్ర ముగ్దం చేయుదురో.... వారిని అతని దాసిలు నమ్మించి కుట్ర పూరితంగా అక్బర్ సమ్ముఖానికి తీసుకు పోయేవారు....❗

ఒక రోజు ఈ నౌరోజ్ జాతరకు మహారాణా ప్రతాప్ సింహ్ చిన్న తమ్ముడు మహారాజు శక్తిసింహ్ బిడ్డ జాతర చూడటానికి వచ్చింది.....❗

ఆమె పేరు బాయిసా కిరణ్ దేవి....❗

ఆమె వివాహం బీకానేర్ యొక్క మహారాజు పృథివీ రాజు గారితో అయ్యింది..❗

బాయిసా కిరణ్ దేవి సౌకర్యాన్ని చూసి అక్బర్ తనను తాను నియంత్రణ చేసుకోలేకపోవటం....❗ మరియు అతను ఎవరు ఏమిటి అని తెలుసు కోకుండానే, దాసీల ద్వారా మోసపూరితంగా రాణివాసం మహల్ లోనికి రప్పించు కున్నాడు....❗

అక్బర్ ఎప్పుడైతే బాయిసా కిరణ్ దేవిని స్పర్శిచటానికి ప్రయత్నించగానే ....

కిరణ్ దేవి గారు నడుంలో దాచిపెట్టు కొచ్చిన ఖడ్గము తీసింది మరియు ఏకధాటిగా అక్బర్ ను కిందపడేసి అతని ఛాతిపైన కాలుతో తొక్కుతూ మెడమీద కత్తిపెట్టింది.....❗

మరియు గర్జిస్తూ అన్నది ఓరీ నీచుడా....❗నరాధముడా, ❗ నా గురించి సరిగ్గా ఎరుగ నట్లున్నావు, ఎవరి పేరు చెప్తే  నీకు నిద్ర పట్టదో...., ఆ నేను మహారాణా ప్రతాప్ తమ్ముని బిడ్డను ....

 నీ చివరి కోరిక ఏమిటో చెప్పు ....❓

అక్బర్ ముఖం రంగు మారింది ముచ్చెమటలు పట్టాయి....❗

ఎప్పుడూ ఊహించి ఉండక పోవచ్చు ఏమనంటే, ఈ విధంగా ఇలా ఒక నాడు అక్బర్ వంటివాడు నేడు ఒక రాకుమారి🤴🏻 కిరణ్ దేవి బాయీసా గారి చరణాలల్లో ఉంటాడని....❗ అనుకొని ఉండడు.

అక్బర్ అన్నాడు:- మిమ్మల్ని గుర్తించ లేకపోయారు, నా ద్వారా తప్పు జరిగిపోయింది .... నన్ను క్షమించు దేవీ❗...!

దీనితో కిరణ్ దేవి బాయిసా  అన్నది:- ఇక మీదట ఢిల్లీలో ఈ నౌరోజ్ మేళా జరగొద్దు....❗

అంతేగాక ఏ ఒక్క స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు ....❗

అక్బర్🤴🏻 చేతులు👏🏻 జోడించి వేడుకున్నాడు ఇక మీదట ఈ జాతర జరుగదు....❗

ఇక రోజు తర్వాత మళ్ళీ ఆ మేళా జరుగలేదు....❗

ఈ దృష్టాంత వర్ణనము  

గిరిధర్ ఆసియ ద్వారా రచించిన *సగథ రాంబో* పుట 632వ పేజీలో ముద్రిత మయ్యింది.

బీకానేర్ సంగ్రహాలయంలో  ఉన్న ఒక పేయింటింగ్ కూడా ఈ ఘటనను ఒక పద్యంలో చెప్ప నైనది.

 కిరణ్ ఆడసింహం వలె పడగొట్టి తొక్కి మెడపై

కత్తి దూయడం..❗  ఈ హఠాత్ పరిణామము వలన

అక్బర్ కు🤲🏼 చేతులు చాచి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడాల్సి వచ్చింది.....❗❗

అక్బర్ ఛాతి పైన కాలుపెట్టి నిలబడిన వీరబాలిక కిరణ్ దేవి చిత్రం ఈనాటికినీ జైపూర్ సంగ్రహాలయంలో సురక్షితంగా ఉంది.

ఈ ప్రకారము ఈ పోస్ట్ ను  షేర్ చేయండి తప్పక చేయండి. మన పౌరుషత్వ వీర వనితల ఆదర్శ ధర్మము దిగ్విజయ గాథలు నేటి పరిస్థితులలో అవసరం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ కథను ప్రతి ఒక్క భారతీయ వ్యక్తికి తెలియాలి. తద్వారా మన గౌరవమయ జీవనశైలిలో భారత వీరపుత్రుల మరియు వీరాంగణల శౌర్య ధైర్య సాహస పరాక్రమము నేటి సమాజానికి కనువిప్పు కావాలి.

ఉగాది

 ఆంధ్ర,తెలంగాణ,కర్ణాటక - ఉగాది

మహారాష్ట్ర - గుడిపడ్వ

పశ్చిమ బెంగాల్ - పోయిల బైసాఖి

పంజాబ్ - బైశాఖి

కేరళ - విషు

తమిళ్ నాడు - పుతండు

రాజస్థాన్ - తప్నా

గుజరాత్ - చేతి చాంద్

హిమాచల్ ప్రదేశ్ - సెరి సజా

మణిపూర్ - చేయిరోబా

కాశ్మీర్ - నవ్రెహ్

అస్సాం - రొంగాలి బిహు

ఒరిస్సా - ఒడియా నబ బర్షా ( పాన సంక్రాంతి)

బీహార్ - చైత్ర నవ రాత్రి (నవ వర్ష)

ఇండోనేషియా హిందువులు - నైపి..

ఇలా పేర్లు వేరైనా ప్రకృతి లో మార్పులు, గ్రహ గమనాలు, కాల గణనాలు తో కూడిన అధ్భుత మైన పండుగ మన హిందూ నూతన సంవత్సరాది...

కేలండర్ లో డేట్లు మారడం కాదు సంవత్సరం ఆరంభం ప్రకృతి చూసి చెప్పవచ్చు... సైన్సు ఇంకా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపెట్టలేని అధ్భుత ఖగోళ శాస్త్ర విజ్ఞానం మా పల్లెటూరి గుడి పంతులు గారి సొంతం...

మనదైన సంస్కృతి సాంప్రదాయాల మాటున అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వదిలి పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి కొట్టుక పోతున్న ఆధునిక హైందవ సమాజమా నిద్రనుండి మేలుకో...

మనదైన విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విశ్వ గురు స్థానంలో భారతమాత ను నిలిపి ఈ అనంత విశ్వాన్ని నీ విజ్ఞానంతో ఏలుకో...

భారత్ మాతా కీ జై...

మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిద్దాం...

ప్రపంచ మానవాళికి మనదైన విజ్ఞానాన్ని అందిద్దాం..

ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.


🙏🙏🙏🙏🙏

కాల మహిమ

 *కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి  కొన్ని ఉదాహరణలు.*

✍️మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే *ఎన్టీఆర్* మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. *ఎన్టీఆర్* చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు.

✍️2009 ఎలక్షన్ ప్రచారంలో  *మెగాస్టార్ చిరంజీవి* మీద కోడిగుడ్లతో దాడి చేశారు.ఆ తరవాత రాజకీలయాల నుంచి నిష్క్రమణ.

✍️మహా మేధావి  *మాజీ ప్రధాని పీవీ నరసింహారావు* 420 case లో  బోనులో  నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.

*✍️మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి*, అంత్యక్రియలు చేయడానికి కనీసం శవం కూడా దొరకలేదు.

✍️ఇప్పటి *ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి*  16 నెలలు జైలులో ఉన్నారు.

✍️1978 లో  *మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని*, కంటెంట్ ఆఫ్ హౌస్ కింద సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.

✍️తమిళ ప్రజలతో "అమ్మ" అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, *మాజీ ముఖ్యమంత్రి జయలలిత* అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు.టాన్సి కేస్ లో కోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి ఏ స్థితి లో చనిపోయిందో చూసాం.

✍️ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన *సత్యం రామలింగరాజు* నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.

✍️ప్రపంచాన్ని గడగడలాడించిన *అలెగ్జాండర్*, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.

✍️జాత్యహంకారానికి  మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి,  రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన *హిట్లర్* దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

✍️గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా చెప్పుకునే  *మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* అపాయింట్మెంట్ కోసం గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన *కేసీఆర్*, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు NDA కన్వీనర్  *చంద్రబాబు నాయుడు* అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైన *నరేంద్ర మోడీ*, దేశ ప్రధాని అయ్యాడు. ఒకప్పుడు *చంద్రబాబు*  అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన *నరేంద్ర మోడీ,  కెసిఆర్* లు 15 సంవత్సరాల తర్వాత *PM, CM* అవడం.*చంద్రబాబుకి* 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి! .ఇప్పుడు అదే *చంద్రబాబు* భోరున ఏడ్చిన సంఘటన చూస్తున్నాం.

ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

ఈ సృష్టి అంతా కాలస్వరూపం. కాలమే దైవం. మనల్ని ఈ భూమి మీదకు తీసుకువచ్చేది *కాలం*, మనల్ని ఈ భూమి మీద నుంచి తీసుకు వెళ్ళి పోయేది *కాలం....*

అందువల్ల *"నేనే"* అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు. ఈ *నేనే* అన్న అహంకారాన్ని దాటాలంటే ప్రతి మనిషి కొంత ఫిలాసఫీని అర్థం చేసుకోవడం  అవసరం....

సత్యమేవ జయతే

తిన్నడి* *గాథ

 *ఈశ్వరుడికి భక్తుల మనస్సులోని భక్తి మీదనే దృష్టి గానీ ఆచారం, నియమాలపై అంతగా ఆసక్తి యుండదు.* *ఇందుకు ఉదాహరణంగా*

*శంకరులు శ్రీ కాళహస్తి మహాత్మ్యమును తెలిపే* *గాథలలోని తిన్నడి*

*గాథను ఉదహరించారు*


శ్లోకం: మార్గావర్తిత పాదుకా  పశుపతే రంగస్య  కూర్చాయతే

గండూషాంబు నిషేచనం పురరిపో ర్దివ్యాభి ‍షేకాయతే

కించిద్భక్షిత  మాంస శేషకబళం  నవ్యోపహారాయతే

భక్తిః  కిం న కరోత్యహో  వనచరో భక్తావతంసాయతే !!


*ఆహాహా! ఏమి శివభక్తి యొక్క మహిమా చమత్కారము*. అడవి దారులందు తిరిగే  అపరిశుద్ధమైన చెప్పు, శివలింగమును తుడిచే కుంచె అయ్యింది. నోటితో నీటిని పుక్కిలించి చల్లడం, శివునికి దివ్య అభిషేక మయ్యింది. కొంచము తినగా మిగిలిన మాంసపు ముక్క క్రొత్త నైవేద్యమయ్యింది. ఏమాశ్చర్యము! భక్తి ఏమైనా చేయగలదు. ఆటవికుడు భక్తులలో అగ్రగణ్యుడు అయ్యాడు.


ఈశ్వరా!  ఇది ఎంతో ఆశ్చర్యం. పాత చెప్పు  ఈశ్వరుని నిర్మాల్యం తుడిచే కుంచె అయ్యింది. పుక్కిలితో తెచ్చిన నీరు పరమశివుడి  దివ్యాభిషేకానికి పనికి వచ్చింది. ఎంగిలి మాంసపుముక్క క్రొత్త నైవేద్య పదార్థంగా ఉపయోగపడింది. భక్తి యన్నది ఏమైనా చేయగలదు. కొండలలో తిరిగే కోయవాడు భక్తులలో శిరోమణి అయ్యాడని శంకరులు

శ్రీ కాళహస్తిలో జరిగిన తిన్నడి కథను దృష్టిలో యుంౘుకొని ఈ శ్లోకము చెప్పారు.

రుణను బంధ

 *రుణను బంధ రూపేణా పశు, పత్ని, సుతలాయా*

పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు...!

💥ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు...


💥ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 


💥ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


💥మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


💥ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు...


💥మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


💥మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు...


ఉదాహరణకు ఒక జరిగిన కథ...


💥కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.


💥తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు.


💥ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 


💥పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 


💥అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...


💥ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 


💥ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.


💥నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...


💥ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.


💥ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి...


💥కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.


💥అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము... 


💥ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం,అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.

Forwarded message