4, ఏప్రిల్ 2022, సోమవారం

తిన్నడి* *గాథ

 *ఈశ్వరుడికి భక్తుల మనస్సులోని భక్తి మీదనే దృష్టి గానీ ఆచారం, నియమాలపై అంతగా ఆసక్తి యుండదు.* *ఇందుకు ఉదాహరణంగా*

*శంకరులు శ్రీ కాళహస్తి మహాత్మ్యమును తెలిపే* *గాథలలోని తిన్నడి*

*గాథను ఉదహరించారు*


శ్లోకం: మార్గావర్తిత పాదుకా  పశుపతే రంగస్య  కూర్చాయతే

గండూషాంబు నిషేచనం పురరిపో ర్దివ్యాభి ‍షేకాయతే

కించిద్భక్షిత  మాంస శేషకబళం  నవ్యోపహారాయతే

భక్తిః  కిం న కరోత్యహో  వనచరో భక్తావతంసాయతే !!


*ఆహాహా! ఏమి శివభక్తి యొక్క మహిమా చమత్కారము*. అడవి దారులందు తిరిగే  అపరిశుద్ధమైన చెప్పు, శివలింగమును తుడిచే కుంచె అయ్యింది. నోటితో నీటిని పుక్కిలించి చల్లడం, శివునికి దివ్య అభిషేక మయ్యింది. కొంచము తినగా మిగిలిన మాంసపు ముక్క క్రొత్త నైవేద్యమయ్యింది. ఏమాశ్చర్యము! భక్తి ఏమైనా చేయగలదు. ఆటవికుడు భక్తులలో అగ్రగణ్యుడు అయ్యాడు.


ఈశ్వరా!  ఇది ఎంతో ఆశ్చర్యం. పాత చెప్పు  ఈశ్వరుని నిర్మాల్యం తుడిచే కుంచె అయ్యింది. పుక్కిలితో తెచ్చిన నీరు పరమశివుడి  దివ్యాభిషేకానికి పనికి వచ్చింది. ఎంగిలి మాంసపుముక్క క్రొత్త నైవేద్య పదార్థంగా ఉపయోగపడింది. భక్తి యన్నది ఏమైనా చేయగలదు. కొండలలో తిరిగే కోయవాడు భక్తులలో శిరోమణి అయ్యాడని శంకరులు

శ్రీ కాళహస్తిలో జరిగిన తిన్నడి కథను దృష్టిలో యుంౘుకొని ఈ శ్లోకము చెప్పారు.

కామెంట్‌లు లేవు: