*కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి కొన్ని ఉదాహరణలు.*
✍️మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే *ఎన్టీఆర్* మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. *ఎన్టీఆర్* చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు.
✍️2009 ఎలక్షన్ ప్రచారంలో *మెగాస్టార్ చిరంజీవి* మీద కోడిగుడ్లతో దాడి చేశారు.ఆ తరవాత రాజకీలయాల నుంచి నిష్క్రమణ.
✍️మహా మేధావి *మాజీ ప్రధాని పీవీ నరసింహారావు* 420 case లో బోనులో నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.
*✍️మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి*, అంత్యక్రియలు చేయడానికి కనీసం శవం కూడా దొరకలేదు.
✍️ఇప్పటి *ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి* 16 నెలలు జైలులో ఉన్నారు.
✍️1978 లో *మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని*, కంటెంట్ ఆఫ్ హౌస్ కింద సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.
✍️తమిళ ప్రజలతో "అమ్మ" అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, *మాజీ ముఖ్యమంత్రి జయలలిత* అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు.టాన్సి కేస్ లో కోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి ఏ స్థితి లో చనిపోయిందో చూసాం.
✍️ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన *సత్యం రామలింగరాజు* నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.
✍️ప్రపంచాన్ని గడగడలాడించిన *అలెగ్జాండర్*, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.
✍️జాత్యహంకారానికి మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన *హిట్లర్* దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
✍️గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా చెప్పుకునే *మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* అపాయింట్మెంట్ కోసం గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన *కేసీఆర్*, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు NDA కన్వీనర్ *చంద్రబాబు నాయుడు* అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైన *నరేంద్ర మోడీ*, దేశ ప్రధాని అయ్యాడు. ఒకప్పుడు *చంద్రబాబు* అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన *నరేంద్ర మోడీ, కెసిఆర్* లు 15 సంవత్సరాల తర్వాత *PM, CM* అవడం.*చంద్రబాబుకి* 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి! .ఇప్పుడు అదే *చంద్రబాబు* భోరున ఏడ్చిన సంఘటన చూస్తున్నాం.
ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
ఈ సృష్టి అంతా కాలస్వరూపం. కాలమే దైవం. మనల్ని ఈ భూమి మీదకు తీసుకువచ్చేది *కాలం*, మనల్ని ఈ భూమి మీద నుంచి తీసుకు వెళ్ళి పోయేది *కాలం....*
అందువల్ల *"నేనే"* అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు. ఈ *నేనే* అన్న అహంకారాన్ని దాటాలంటే ప్రతి మనిషి కొంత ఫిలాసఫీని అర్థం చేసుకోవడం అవసరం....
సత్యమేవ జయతే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి