20, అక్టోబర్ 2026, మంగళవారం

శమీచెట్టు

             *శమీచెట్టు*

             ➖➖➖✍️```


*చాలా మందికి ఇదే అనుమానం వస్తుంది..


*శమీ చెట్టు శనికి ప్రీతి అయితే, విజయదశమి రోజు ఆ ఆకులనే బంగారంగా ఎందుకు పంచుకుంటాం?


*శని అంటే కష్టం కదా, బంగారం అంటే లక్ష్మి కదా?


*ఇందులో రెండు రహస్యాలు ఉన్నాయి. ఒకటి పురాణ రహస్యం, రెండు జ్యోతిష రహస్యం.


1. పురాణపరంగా - ఇది విజయానికి గుర్తు.


శమీ చెట్టును కేవలం శని చెట్టుగా మాత్రమే చూడకూడదు. 


అది "అపరాజితా" వృక్షం - అంటే ఎప్పుడూ ఓటమి ఎరుగని చెట్టు.


*మహాభారత కథ గుర్తుందా ?

పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ తమ ఆయుధాలన్నింటినీ ఒక మూటగా కట్టి శమీ చెట్టు మీద దాచారు. తిరిగి విజయదశమి రోజే ఆ ఆయుధాలను దించి, శమీ చెట్టుకు పూజ చేసి, కౌరవుల మీదకు యుద్ధానికి వెళ్లి గెలిచారు.


అలాగే శ్రీరాముడు రావణుడి మీదకు వెళ్లే ముందు శమీ చెట్టును పూజించాడు.


అందుకే దసరా రోజు శమీ పూజ అంటే "నా శత్రువుల మీద నాకు విజయం కలగాలి" అని చేసే పూజ. పెద్దలకు ఆకులు ఇచ్చి "శమీ శమయతే పాపం" - నా పాపాలను పోగొట్టు అని ఆశీర్వాదం తీసుకోవడం.


1. జ్యోతిషపరంగా - 

శని అంటే కష్టం కాదు, న్యాయం.


మనం శనీశ్వరుడు అంటే భయపడతాం, కానీ ఆయన పేరు శనైశ్చరుడు - అంటే నెమ్మదిగా నడిచేవాడు. ఆయన కష్టం పెట్టడు, మన కర్మ ఫలాన్ని న్యాయంగా ఇస్తాడు.


*శమీ చెట్టులో ఉన్న గొప్పతనం ఏమిటంటే :-


 *శని యొక్క కఠినత్వాన్ని, వేడిని తనలోకి తీసుకుని, చల్లదనాన్ని, ఓర్పును ఇస్తుంది.

అందుకే శని దోషం ఉన్నవారు శమీ చెట్టు కింద దీపం పెడతారు.


మరి ఆకులు బంగారం ఎలా అయ్యాయి?


దానికి కౌత్సుని కథ ఉంది. 

వరతంతు మహర్షి శిష్యుడు కౌత్సుడు గురుదక్షిణ కోసం రఘుమహారాజును 14 కోట్ల బంగారు నాణేలు అడిగాడు.


రఘుమహారాజు కుబేరుడి మీదకు దండెత్తితే, కుబేరుడు బంగారు వర్షం కురిపించాడు. 

ఆ బంగారం అంతా శమీ చెట్ల మీద పడి, ఆకులన్నీ బంగారు ఆకులుగా మారాయట. 


కౌత్సుడు తనకు కావాల్సినంత తీసుకుని, మిగిలినది ప్రజలకు పంచాడు.


అప్పటి నుండి శమీ ఆకులను "స్వర్ణ పత్రాలు" - బంగారు ఆకులు అని పిలుస్తూ, దసరా రోజు ఒకరికొకరు ఇచ్చుకుంటూ "నీకు సంపద, బంగారం లభించాలి" అని దీవించుకోవడం ఆనవాయితీ అయ్యింది.


*కాబట్టి దీనిని ఈ విధంగా చూడాలి:


*శమీ చెట్టు = శని యొక్క కష్టాన్ని తీసేసి, విజయాన్ని, బంగారాన్ని (లక్ష్మిని) ఇచ్చే చెట్టు.


దసరా రోజు దానికి నమస్కరించడం అంటే - "నా జీవితంలో ఉన్న శని దోషాలు, అడ్డంకులు, పాపాలు అన్నీ పోగొట్టి, నాకు విజయాన్ని, సంపదను ఇవ్వు తల్లీ" అని అపరాజితా దేవిని కోరుకోవడమే.


అందుకే అది శని చెట్టే అయినా, ఆ రోజు అది విజయలక్ష్మీ స్వరూపం.✍️

🕉️ఇటువంటి మంచి విషయాలు                

  మీరు మాత్రమే తెలుసుకుంటే 

  సరిపోతుందా..?

  మీ బంధువులను,స్నేహితులను

  కూడా మన గ్రూప్ లో చేర్చి

  భగవంతుని కృపకు మీరు     

  పాతృలు కావచ్చును.🙏```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                     🌷🙏🌷

 `🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`

                     ➖▪️➖

`ఇలాటి మంచి విషయాలకోసం…`

*“భగవంతుని విషయాలు గ్రూప్“* `లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏`

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము



జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే ।

తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ।। 29 ।।



ప్రతిపదార్థ;


 

జరా — ముసలితనము నుండి; మరణ — మరియు మృత్యువు; మోక్షాయ — విముక్తి కోసము; మాం — నన్ను; ఆశ్రిత్య — ఆశ్రయించినవారు; యతంతి — పరిశ్రమించెదరు; యే — ఎవరైతే; తే — వారు; బ్రహ్మ — బ్రహ్మన్; తత్ — అది; విదుః — తెలుసుకొనుట; కృత్స్నం — సర్వమూ; అధ్యాత్మం — ఆత్మ (తమని తాము); కర్మ — కర్మ; చ — మరియు; అఖిలం — సమస్తము.



తాత్పర్యము:



ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ, నన్ను ఆశ్రయించిన వారు, బ్రహ్మంను, తమ ఆత్మ తత్త్వమును, సమస్త కర్మ క్షేత్రమును తెలుసుకుంటారు.



వివరణ :


7.26వ శ్లోకంలో చెప్పినట్టుగా, భగవంతుడు మన సొంత బుద్ధి బలంచే తెలియబడడు. కానీ, ఆయనకు శరణాగతి చేసిన వారు ఆయన కృపకు పాత్రులౌతారు. అప్పుడు ఆయన కృప చేత ఆయనను తెలుసుకోగలుగుతారు. కఠోపనిషత్తు ఇలా పేర్కొన్నది:


నాయమాత్మా ప్రవచనేన లభ్యో

న మేధయా న బహునా శ్రుతేన

యమేవైష వృణుతే తేన లభ్య

స్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం (1.2.23)


‘ఆధ్యాత్మిక ప్రవచనాల వలన కానీ, బుద్ధి బలం చేత కానీ, రకరకాల ఉపదేశాలు వినటం వలన కానీ భగవంతుడిని తెలుసుకోలేము. కేవలం ఎప్పుడైతే ఆయన ఒకరిపై తన కృప ప్రసాదిస్తాడో, అప్పుడే ఆ భాగ్యశాలియైన జీవాత్మ ఆయనను తెలుసుకోగలదు.’ మరియు ఎప్పుడైతే వ్యక్తికి భగవత్ జ్ఞానం లభిస్తుందో, అతనికి సర్వమూ ఆయన సంబంధముగా తెలియబడుతుంది. వేదములు ఇలా పేర్కొంటున్నాయి : ఏకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, ‘నీకు భగవంతుడు తెలిస్తే, నీకు అన్నీ తెలుస్తాయి.’


కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు ఆత్మ-జ్ఞానమే అత్యున్నత లక్ష్యం అనుకుంటారు. కానీ, ఎలాగైతే సముద్రపు నీటి చుక్క అనేది సముద్రములోని ఒక అతి చిన్న భాగమో, ఆత్మ-జ్ఞానము అనేది బ్రహ్మ-జ్ఞానములో ఒక అతి చిన్న భాగము. నీటి బిందువు గురించి తెలిసిన వారికి, సముద్రము యొక్క లోతు, వైశాల్యము, మరియు శక్తి తెలిసినట్టు కాదు. అదే విధంగా, ఆత్మ గురించి తెలిసినవారికి భగవంతుని గురించి తెలిసినట్టు కాదు. కానీ, భగవంతుని గురించి తెలిసినవారికి అప్రయత్నంగానే భగవంతుని లోనే ఉన్న సమస్త అంగాలు తెలిసిపోతాయి. కాబట్టి, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో – ఆయనని, ఆత్మని, మరియు సమస్త కర్మ క్షేత్రమును – ఆయన కృపచే తెలుసుకుంటారు, అని శ్రీకృష్ణుడు అంటున్నాడు.

సూర్యుడు

  🙏🌹సూర్యుడు కష్టాలన్నీ పరుగో పరుగు 🌹🙏


చీకటుల చీల్చుకుని తొలి వెలుగుల పరుగు 

కాసేపటిలో చీకటిలన్నీ ఎటో పరుగో పరుగు 


అలా అలా ఆ వాతావరణం లో అనారోగ్యం పరుగు

ఆరోగ్యం కొరకు వైద్యులు తెలిపే నిత్య నడక పరుగు


వనములలో కాసేపు తిరిగిన చాలు అలసటల పరుగు 

ప్రకృతిలో పదినిమిషాలు నిలిచిన ఆనందాలతో పరుగు 


ప్రత్యక్ష దర్శనమివ్వ సిందూర బింబముగా నిత్య పరుగు

అర్ఘ్యం చెల్లించి శక్తి పొందుటకై మనసు ఉబలాట పరుగు 


ఓం శ్రీ నిత్యం చీకటులపరుగు వెలుగుల పరుగు ఆనందాల పరుగు తమ దయవలనే దేవాది దేవా 

శ్రీ అరుణోదయ తేజో సవిత్రా నమో నమః నమో నమః 


🙏🌹బాలచందర్ రాజుఉమా

  20/10/26 +2138+

20అక్టోబరు26🌹* *దృగ్గణిత పంచాంగం*

  🌹🌷🌿🪂🛕🪂🌿🌷🌹

*బంధువులు - మిత్రులు*     

     *శ్రేయోభిలాషులు*    

          *అందరికీ*

*🪂విజయ దశమి🪂*

       *🌿దసరా🌿*

   *🎉శుభాకాంక్షలు🎉*

 

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

  *🌹20అక్టోబరు26🌹*  

   *దృగ్గణిత పంచాంగం* 

                

         *ఈనాటి పర్వం*       

   *🪂విజయ దశమి🪂*

         *🌿దసరా🌿*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు* 

*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*


*తిథి : నవమి* మ 12.50 వరకు ఉపరి *దశమి*

*వారం  : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : శ్రవణం* సా 06.02 వరకు ఉపరి *ధనిష్ఠ*

*యోగం : శూల* రా 12.50 వరకు ఉపరి *గండ*

*కరణం  : కౌలువ* మ 12.50 *తైతుల* రా 01.36 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ09.00-10.30 సా04.30-05.30*

అమృత కాలం  : *ఉ 06.36 - 08.21*

అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.15*

*వర్జ్యం   : రా 10.19 - 12.02*

*దుర్ముహూర్తం  : ఉ08.21-09.08 రా 10.38 - 11.28*

*రాహు కాలం  : మ 02.48-04.15*

గుళికకాళం      : *ప 11.52 - 01.20*

యమగండం  : *ఉ 08.57 - 10.24*

సూర్యరాశి : *తుల*                      

చంద్రరాశి : *మకరం* 

సూర్యోదయం :*ఉ 06.10*   

సూర్యాస్తమయం :*సా 05.51*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 06.01 - 08.21*

సంగవ కాలం      :  *08.21 - 10.42*

మధ్యాహ్న కాలం  : *10.42 - 01.02*

అపరాహ్నకాలం : *మ 01.02- 03.23*

*ఆబ్ధికం తిధి:ఆశ్వయుజ శుద్ధ దశమి*

సాయంకాలం   : *సా 03.23 - 05.43*

ప్రదోష కాలం      : *సా 05.43 - 08.11*

రాత్రి కాలం        : *రా 08.11 - 11.28*

నిశీధి కాలం        : *రా 11.28 - 12.17*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.23 - 05.12*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

అంబా

 *అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ ||*

*కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవి ||*

*సావిత్రీ నవయౌవనా శుభకరీ సాంరాజ్య లక్ష్మీప్రదా ||*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||*


*దసరా శరన్నవరాత్రులు* *సందర్భంగా,  పదవ రోజు తేదీ 20 భౌమవారం, అక్టోబరు 2026 రాజరాజేశ్వరి దేవి అలంకారం* *శ్రీ శృంగేరి శారదా పీఠం* *శంకరమఠం, నల్లకుంట, హైదరాబాద్.*