20, అక్టోబర్ 2026, మంగళవారం

సూర్యుడు

  🙏🌹సూర్యుడు కష్టాలన్నీ పరుగో పరుగు 🌹🙏


చీకటుల చీల్చుకుని తొలి వెలుగుల పరుగు 

కాసేపటిలో చీకటిలన్నీ ఎటో పరుగో పరుగు 


అలా అలా ఆ వాతావరణం లో అనారోగ్యం పరుగు

ఆరోగ్యం కొరకు వైద్యులు తెలిపే నిత్య నడక పరుగు


వనములలో కాసేపు తిరిగిన చాలు అలసటల పరుగు 

ప్రకృతిలో పదినిమిషాలు నిలిచిన ఆనందాలతో పరుగు 


ప్రత్యక్ష దర్శనమివ్వ సిందూర బింబముగా నిత్య పరుగు

అర్ఘ్యం చెల్లించి శక్తి పొందుటకై మనసు ఉబలాట పరుగు 


ఓం శ్రీ నిత్యం చీకటులపరుగు వెలుగుల పరుగు ఆనందాల పరుగు తమ దయవలనే దేవాది దేవా 

శ్రీ అరుణోదయ తేజో సవిత్రా నమో నమః నమో నమః 


🙏🌹బాలచందర్ రాజుఉమా

  20/10/26 +2138+

కామెంట్‌లు లేవు: