24, డిసెంబర్ 2025, బుధవారం

పంచాంగం

 


అది నువ్వే


అది నువ్వే


ఒకరోజు సాయంత్రం 7 గంటల సమయంలో సీతాదేవి తన ఇంట్లో ఏదో పాత బట్ట చేత్తో కుట్టుకుంటున్నది. దారాన్ని తెంపి కొత్తదారం సూదిలోకి ఎక్కిద్దామని ప్రయత్నిస్తుండగా కరంటు పోయింది చేతిలోంచి సూది జారీ పడింది. ఇల్లంతా చీకటి సూదిని ఎలా వెతకాలి అని ఒక కొవ్వొత్తి వెలిగించి కొవ్వొత్తి కాంతిలో వెతకటానికి ప్రయత్నించింది. కానీ సూది ఎక్కడ  పడ్డదో ఆమెకు ఎంతవెతికిన కనిపించటం లేదు. ఇంతలో ఆమె భర్త రామారావు ఇంట్లోకి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా వుంది తన భార్య కొవ్వొత్తి వెలుగులో ఏదో వెతుకుతుండటం చూసి ఏమి వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె జరిగినది మొత్తం చెప్పి సూదికోసం వెతుకుతున్నాను అని అన్నది. పిచ్చిదానా ఇంట గుడ్డి వెలుతురులో నీకు సూది కనపడుతుందా ఏమిటి బైట చూడు వీధి దీపం ప్రకాశమానంగా వెలుగుతున్నది రోడ్డుమీద వెతుకుదాం పద అని ఆమెను వీధిలోకి రమ్మని పిలిచాడు. ఏమండీ మీకు మాతికాని పోయిందా సూది నా చెతిలొనుంచి జారీ ఇంట్లో  పడ్డది బయట వెతికితే ప్రయోజనం ఏమిటీ అని ఆమె అంటే. పిచ్చిదానా బైట వెలుతురు బాగా వుంది కాబట్టి అక్కడ మనం వెతికితే వెతకటం తెలుస్తుంది తరువాత మనం అక్కడ దొరకక పొతే ఇంట్లో వెతుక్కోవచ్చు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధం అయ్యింది మీ తెలివి ఎలా పనిచేస్తున్నదో అని ఆమె అని. మీకు చాతనయితే ఒక ఎక్కువ వెలుతురు ఇచ్చే దీపాన్ని తీసుకొని రండి అప్పుడు నేను సూదిని వెతుక్కోగలను. వెలుతురు బైట ఉండవచ్చు కానీ వెలుతురు కావలసింది పోయిన వస్తువు వున్నచోట మాత్రమే. ఇదికూడా మీకు తెలియకపొతే యెట్లా అని భర్తతో అన్నది. 


నిజానికి ఈ దృష్టాంతరం చదివితే హాస్యాస్పదంగా కనపడుతుంది. కానీ ఇది మాత్రం అక్షర సత్యం. మనం దాదాపు కోఠిలో ఏవక్కరో తప్ప అందరం సూది ఇంట్లో ఉంటే వీధిలో వెతికే వారమే అంతేకాదు అక్కడ వెలుతు రూ ఎక్కువగా వుంది ఇక్కడ ఇంకా వెలుతురువుంది అని చెప్పే వాళ్ళ మాటలు విని అక్కడ ఇక్కడ మనం వెతుకుతూ వున్నాం కానీ సూది మాత్రం దొరకటం లేదు కేవలం కాలం గడుస్తుంది, జీవితం అయిపోతున్నది. ఇక విషయానికి వస్తే మిత్రమా 


ఈ రోజుల్లో ఆ గుడికి వెళ్ళండి, ఈ క్షేత్రానికి వెళ్ళండి అక్కడ దేవుడిని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యం ఇక్కడి క్షేత్రంలో దేవుడు చాలా శక్తివంతుడు అని మనలను తప్పు త్రోవ పట్టించే వారు సమాజంలో అనేక మంది తయారుఅవుతున్నారు. దానితో సామాన్యుడు ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేక వారి మాటల గారడితో ప డి కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పటానికి బాధపడుతున్నాను. నిజానికి ఏ గుడికి వెళ్లినా ఏ తీర్థానికి వెళ్లినా నీకు మోక్షం రాదు కేవలం నీ సాధనకు మనస్సు కొంత తోడ్పడుతుంది. దానివల్ల నీకు కలిగే ప్రయోజనం చాలా తక్కువ. 


ఇది ఇలా ఉండగా ఈ రోజుల్లో అనేకమంది స్వామీజీలు, బాబాలు తమకు తామే దేవుళ్లమని పేర్కొనటమే కాకుండా ఇంకా కొంతమంది ఎప్పుడో గతించిన వారికి గూళ్లుకట్టి, పూజలు చేస్తూ మనలను కూడా పూజలు చేయమని ప్రోత్సహించటమే కాక నీవు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే నీతో స్పర్ధకు దిగి వారి వాదనే సరైనదని అయన ఫలానా దేవుడి అవతారం, ఈయన ఫలానా దేవుడి అవతారం అని అయన ఆ మహిమలు చూపెట్టారు, ఈయన ఈ మహిమలు చూపెట్టారని మనలని మభ్యపెడుతూ మన జీవితాలను లక్ష్యంనుంచి విముఖులను చేస్తున్నారు. 


మన సాంప్రదాయంలో వక్తి పూజా ఆరాధనా ఎప్పుడు చెప్పలేదు. కేవలం అంటే కేవలం పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం సిద్ధిస్తుందని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. మానిషి కొంతకాలం తపస్సు చేస్తే కొన్ని దివ్య శక్తులు సంప్రాప్తం అవుతాయి. వాటిని అణువాది అష్టసిద్ధులు అంటారు అట్లా సిద్ధులను పొందినవారిని సిద్దులు అంటారు. సిద్ధులను పొందటం అంత అసాధ్యం ఏమీకాదు. కొంతకాలం తపస్సు చేస్తే చాలు వారు ఏవైతే మహిమలు అన్నారో అవి చాలామంది తాపసులు పొంది వున్నారు. మీరు కూడా పొందగలరు. అది ఏమి విశేషం కాదు.


వీళ్ళు చెప్పే బాబాలు, స్వామీజీలు మన మహర్షులముందు చాలా స్వల్పులు. వసిష్ఠ మహర్షి ఒక దర్భను జీవమున్న బాలునిగా చేసాడు, విశ్వమిత్ర మహర్షి స్వర్గాన్నే సృష్టించగలిగాడు. వీళ్ళు చెప్పే ఈ బాబాలు, స్వామీజీలు అంతకన్నా గొప్పవాళ్ళా ఆలోచించండి. 


ఇక వారు సద్గురువులని వారిని ఆరాధిస్తే మోక్షం వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. మిత్రమా నిజానికి మోక్షాన్ని ఏ సద్గురువు కూడా యివ్వలేదు అది సాధకుడు తనకు తానుగా కఠోర దీక్షతో సిద్దించుకోవలసరైంది. గురువు పాత్ర చాలా చిన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నీవు ఒక రోడ్డు మీద వెళుతున్నావు అడవిలో ఆ రోడ్డు రెండుగా చీలింది. ఇప్పుడు నీవు ఏ రోడ్డుమీద వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ నీకు ఒక మార్గదర్శిని (బోర్డు) కనిపించింది అది ఆ రెండు రోడ్లు ఎటువైపుకు వెళతాయో చూపిస్తుంది. దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని చేరుకోవటానికి నీ కారును నీవే నడుపుకుంటూ వెళతావు. ఆ రోడ్డు దాటిన తరువాత అక్కడి సైను బోర్డు సంగతే మరచిపోతావు. నీ గురువు స్తానం కూడా అటువంటిదే నీకు మార్గదర్శనం చేస్తాడు. నీ మార్గంలో నీవే వెళ్ళాలి. ఆలా వెళ్లక గురువునే పూజిస్తూవుంటే కాలయాపన కాక వేరొకటి కాదు.  


కాబట్టి సాధక మిత్రమా నీవు ఎవరి మాటలు వినక నీకు నీవుగా నీ మార్గాన్ని (మోక్ష మార్గాన్ని) ఎంచుకో ఆ దిశగా నీవు ప్రయత్నం చేసి నీలో నీ హృదయాంతరాలలో నిగూఢంగా వున్న పరమాత్మను దర్శించుకో నీవు ఏ దేముడిగూర్చి గుడులకు వెళుతున్నావో ఆ దేవుడు గుడులలో కాదు నీహృదయంలోనే వున్నాడని మన వేదం మంత్రాలు గోషిస్తున్నాయి. 


పైన కధలో సీతాదేవి ఇంట్లో పారేసుకున్న సూదిని వీధిలో వెతుకుదామని రామారావు చెప్పినా నిరాకరించి ఇంట్లోనే వెతకటానికి నిర్ణయించుకుందో అదే మాదిరిగా నీవుకూడా నీలోనే దేవుడిని వెతకటానికి ప్రయత్నించు వెలుతురూ తక్కువైన వెలుతురూ ఎక్కువ చేసుకొని (ఇక్కడ వెలుతురూ అంటే జ్ఞ్యానం సరిపడిన జ్ఞ్యానం లేకపోతె జ్ఞ్యానులనుండి అంటే గురువులనుండి జ్ఞ్యానాన్ని పొంది నీవే వెతుకు )


ప్రతిరోజూ అన్ని దేవాలయాలలో పఠించే మంత్రపుష్పంలోని ఈ మంత్రాలను చుడండి 


యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ।


అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ 5 ॥


మనకు కనిపించేది వినిపించేది అది యెంత సూక్ష్మ  మైన కానీ అది పూర్తిగా నారాయణుడితో వ్యాపించి వున్నది. అటువంటప్పుడు భగవంతుని ఒక దేవాలయానికి పరిమితం చేయటం ఎంతవరకు సబబు. మీరే చెప్పండి. విశ్వమంతా వ్యాపించి వున్న దేవుడు దేవాలయాలలో కూడా వున్నాడు,  ఉండి  భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. అంటే కేవలం ఐహిక వాంఛలను తీర్చుకోవటానికి మాత్రమే దేవాలయాలకు వెళ్ళాలి కానీ మోక్ష సిద్ధికి మాత్రం కాదు. ఇక బాబాలను, సాధువులను దేవుళ్లుగా కొలవటం ఔచుత్యం అనిపించుకోదు. 


అనన్తం అవ్యయం కవిం సముద్రేన్తం విశ్వశంభువమ్ ।


పద్మ కోశ ప్రతీకాశం హృదయం చ అపి అధోముఖమ్ ॥ 6 ॥


అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్ఠతి ।


జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ ॥ 7 ॥


సన్తతం శిలాభిస్తు లమ్బత్యా కోశసన్నిభమ్ ।


తస్యాన్తే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ ॥ 8 ॥


తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిః విశ్వతో ముఖః ।


సోఽగ్రవిభజంతిష్ఠన్ ఆహారం అజరః కవిః ॥ 9 ॥


హృదయంలో (నీ) బంగారు కాంతులు విరజిమ్ముతూ వడ్ల గింజ కొసపరిమాణంలో భగవంతుడు వసించి వున్నాడు. ఆయనే సర్వాంతర్యామి, అది తెలుసుకొని నీకు నీవే దేవుడవు కమ్ము. 


మోక్ష మార్గం యెంత కఠినమైనదో ఉపనిషత్తు తెలుపుతున్నది. 




ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా .

క్షురస్య ధార నిశితా దురత్యయా

దుర్గాం పాఠస్తత్కవయో వదంతి .. ౧౪.. 

 

14 లేవండి! మేలుకో! గొప్పవారిని సంప్రదించి నేర్చుకోండి. రేజర్ యొక్క పదునైన అంచు వంటిది ఆ మార్గం, కాబట్టి తెలివైనవారు నడవడం కష్టం మరియు దాటడం కష్టం.  

ఒక రేజర్ బ్లేడు మీద నడవటం యెంత కష్టమో అంత కష్టం మోక్షమార్గంలో పయనించటం అని ఈ మంత్రం చెపుతున్నది. కాబట్టి సాదాకా కఠినాతి కఠినమైన మోక్షమార్గాన్ని ఎంచుకొని నీ శాయశక్తుల పణంగా పెట్టి మోక్షసిద్ది పొందు మోక్షం అంటే నిన్ను నీవు నీకుగా తెలుసుకోవటమే, అది తెలుసుకో చాందోగ్యఉపనిషత్‌లోని ఆరవ అధ్యాయంలో తత్ త్వం అసి మహావాక్యాన్ని వ్యక్తం చేసింది దీని అర్ధం ఏమిటంటే నీవు దేనినిగూర్చి వెతుకుతున్నావో అది నీవే అని తెలుసుకో. 

శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన శ్రీమత్ భగవత్గీత, ఆది శంకరులు రచించిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలూ, మన మహర్షుల నుండి ఉద్బవించిన ఉపనిషత్తులను నిత్యం చదివి ఆకళింపు చేసుకొని, అనుసరించే సాధకునికి భగవంతుని గూర్చి, మోక్షాన్ని గూర్చి నిశీత , నిశ్చిత అభిప్రాయం ఏర్పడుతుంది. తెలిసి తెలియక బోధించెడి అజ్ఞ్యానుల మాటలు తేలికగా కనిపించి నిత్యము సత్యము, అనంతము అయిన పరబ్రహ్మ గూర్చి పరుగులిడతాడు.

ఓం తత్సత్ 


ఇట్లు 


మీ భార్గవ శర్మ

తిరుప్పావై ప్రవచనం‎- 9 వ రోజు*


వేకువ ఝామున పాడుకొనుటకు…

```


*తిరుప్పావై ప్రవచనం‎- 9 వ రోజు*

               ➖➖➖✍️

              9 వ పాశురము:


*తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ*

*తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్*

*మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్*

*మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్*

*ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో*

*ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?*

*"మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు*

*నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!*



*🌺భావము:*```

నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 

'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.```



*🌸అవతారిక :*```

'తూరుపుతెలవారె! ఓ జవ్వనీ లేవవే!' అంటూ పాడి 8వ (పాశురం) మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఇప్పటివరకు శ్రవణం (వినటం) మననం (విన్నదానిని మాటిమాటికి స్మరించటం) వీటియొక్క విశిష్ఠతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకొంది. ఇక (9మొదలు 12 మాలికలలో (పాశురాలలో) ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననమూ చేసే వారియొక్క మనస్సు పవిత్రమౌతుంది. నిర్మలమౌతుంది. మాలిన్యం తొలగితేనేకద జ్ఞానం చోటు చేసుకొనేది. అప్పుడా జ్ఞానమే 

ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్ధమైన వ్రాత నిష్ఠ కలిగినవారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికినీ పోక వున్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ వుంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూన్న నాల్గవ గోపికను (యీ మాలికలో) లేపుచున్నారు. 'ఓ మామకూతురా! మరదలా లేలెమ్ము!' అంటున్నారు.```


🌷*9.వ మాలిక:*```

(కాంభోజి రాగము-ఆదితాళము)


1. ప.. ఓ మామకూతుర! మరదలా!


అ..ప.. ఏమిది? మణిమయ ద్వారము తెరువవు?

ఓ మామ కూతుర! మరదలా!


చ.. పావన మణిమయ భావనమందున

దివ్వెల వెలుగులు ధూపములమరగ

దివ్యమౌ తల్పమున దిటవుగ శయనించి

అవ్యక్తమైన నిద్దురపోదువటవే!


2 చ. మూగద? చెవిటిద? మిగుల నలసినద?

ఆగడప కావలి నందుంచబడినద?

ఆ గాఢ నిద్రకు మంత్రించబడినద?

వేగమె లేపవె! నీ కూతునత్తరో!


3 చ. లీలామానుష మాధువుడీతడు

కేళీలోలుడు వైకుంఠవాసుడు

చెలియలగూడి తిరునామ కీర్తనము

ఇలవెలియగ పలుమారు పాడితిమి

ఓ మామకూతుర! మరదలా!```



🌼*తొమ్మిదవరోజు ప్రవచనం:*

```

భగవంతునికి మనకు ఉన్న సంబంధం

*ఆండాళ్ తిరువడిగలే శరణం* ```



 🍀*పాశురము:*


*తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్*

*దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం*

*మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్*

*మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్*

*ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో*

*ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో*

*మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు*

*నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్*


ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. *"తూ"* పరిశుద్దమైన *"మణి"* మణులతో చేసిన *"మాడత్తు"* మేడ, *"చ్చుత్తుం విళక్కెరియ"* చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక, దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది. *"ధూపం కమళ"* ధూపం పరిమళిస్తుంది. *"త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్"* నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా. *"మామాన్ మగళే!"* ఓ మామగారి కూతురా! *"మణి క్కదవం తాళ్ తిఱవాయ్"* మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. ``` సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.



1. మనందరికి తండ్రి ఆయనే!


2. మనందరిని రక్షించేవాడు ఆయనే


3. మనందరిని నావాళ్ళు అన కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు.


4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు.


5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు.


6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే


7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు


8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు


9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే


లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! ```

*"పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా"* అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది.


అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా వాళ్ళ స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం. మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు, దీన్ని పోషించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలెయ్యాలి అని ఇలా దేహ భ్రాంతి పెరిగిపోతుంది, ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే. 


*"మామీర్!" ఓమేనత్తా, "అవళై ఎళుప్పీరో"* మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. *"ఉన్ మగళ్ తాన్ ఊమైయో"* నీపిల్ల ఏమైనా మూగదా లేక *"అన్ఱి చ్చెవిడో"* చెవిటిదా లేక *"ఆనందంలో"* అలసిపోయిందా *"ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో"* ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏమంత్రం పనిచెయ్యదు. అక్కడి నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగవాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కాస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.


అయితే లోపలగోపబాలిక తల్లి “అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది”అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది. 


*"మామాయన్"* చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు. ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం చేత చేసాడు.

ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, *"మాధవన్"* మా-లక్ష్మీదేవి ధవ-నాథుడు,లక్ష్మీదేవి సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన *"వైకుందన్"* వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ- త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా *"ఎన్ఱెన్ఱు"* ఎన్నెన్నో *"నామం పలవుం నవిన్ఱ్"* నామాలను పలుకుతున్నాం. 


ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏

పంచాంగం



 

త్రిఫల ఉపయోగాలు:*

 

*మన ఆరోగ్యం…!


          *త్రిఫల ఉపయోగాలు:*

                 ➖➖➖✍️


```

త్రిఫల చూర్ణం ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చూర్ణం ప్రతి రోజు తీసుకుంటే డాక్టరుతో పని ఉండదు.


“మనిషి ఆరోగ్యం”.. వాత,పిత్త,కఫ, లక్షణాలు హెచ్చు తగ్గులపైనే ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది.


ఈ హెచ్చు తగ్గులను సమతూకం చేయగలిగిన తిరుగులేని ఔషధమే త్రిఫల చూర్ణం.


*#కరక్కాయ, #తానికాయ, #ఉసిరికాయల మిశ్రమమే ‘త్రిఫల చూర్ణం.’


*త్రిఫల చూర్ణంలో ఒక భాగం కరక్కాయ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి.


కొంతమంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు. మార్కెట్ లోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహా చూర్ణం చేసి అమ్ముతున్నారు. విత్తనాలు కాకుండా పై పెచ్చులతో చేసిన త్రిఫలచూర్ణం ప్రభావవంతమైంది.


ఇది సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలది.


జబ్బులు ఉన్నా లేకపోయినా ఒక నెల పాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్ గా వాడి, మీ శరీరాన్ని గమనించండి. మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.


అంతేకాదు త్రిఫల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది.


*అలాగే త్రిఫల చూర్ణం కంటిచూపును పెంచుతుంది. జీర్ణశక్తి,ని ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గుతుంది, వాతం నొప్పులు తగ్గుతాయి, చర్మ సమస్యలను, లివర్, ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.```


*ఉపయోగించే విధానం:-*```

*ఉదయాన్నే పరగడుపున అర గ్లాస్ గోరువెచ్చని నీటిలో చెంచా త్రిఫల చూర్ణం వేసుకుని తాగాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కూడా తాగాలి.✍️```-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖