1, డిసెంబర్ 2020, మంగళవారం

కార్తీక పురాణం

 _*🚩కార్తీక పురాణం*_🚩

🚩_*30 అధ్యాయాలు🚩*_


🕉️☘🕉☘🕉☘🕉☘


*1 . వ అధ్యాయం - కార్తీక మాసం మహత్యం*



*2 . వ అధ్యాయం - సోమవార వ్రత మహిమ*



*3 . వ అధ్యాయం - కార్తీక మాస స్నాన మహిమ*



*4 . వ అధ్యాయం - దీపారాధన మహిమ*



*5 . వ అధ్యాయం - వనభోజన మహిమ*



*6 . వ అధ్యాయం - దీపదానవిధి - మహత్యం*



*7 . వ అధ్యాయం - శివకేశవార్చన విధులు*



*8 . వ అధ్యాయం - శ్రీహరి నామస్మరణా ధన్యోపాయం*



_*9 . వ అధ్యాయం - విష్ణు పార్శద , యమ దూతల వివాదము*_



*10 . వ అధ్యాయం - అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము*



*11 . వ అధ్యాయం - మంథరుడు - పురాణ మహిమ*



*12 . వ అధ్యాయం - ద్వాదశి ప్రశంస*



*13 . వ అధ్యాయం - కన్యాదాన ఫలము*



*14 . వ అధ్యాయం - ఆబోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము)*



*15 . వ అధ్యాయం - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*



*16 . వ అధ్యాయం - స్తంభ దీప ప్రశంస*



*17 . వ అధ్యాయం - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*



*18 . వ అధ్యాయం - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*



*19 . వ అధ్యాయము - చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*



*20 . వ అధ్యాయము - పురంజయుడు దురాచారుడగుట*



*21 . వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట*



*22 . వ అధ్యాయము - పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*



*23 . వ అధ్యాయము - శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట*



*24 . వ అధ్యాయము - అంబరీషుని ద్వాదశీవ్రతము*



*25 . వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట*



*26 . వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ*



*27 . వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*



*28 . వ అధ్యాయం - విష్ణు సుదర్శన చక్ర మహిమ*



*29 . వ అధ్యాయం - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము*



*30 . వ అధ్యాయం - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*

🙏🙏🌷🙏🙏🌷🙏🙏

కార్తీక పురాణ శ్రవణం

 _*కార్తీక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి ?*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



కొన్ని మంచి మాటలు వింటేనే జీవితం సన్మార్గంలో నడుస్తుంటుంది. అప్పుడప్పుడన్నా అలాంటి మంచి మాటలను యధాలాపంగానైనా వినటం అవసరం. ఈ సత్యాన్ని తెలియచేస్తున్నట్లు ఉంటుంది.  *కార్తీక పురాణ శ్రవణ ఫలం*. శ్రవణమంటే వినటం అని అర్థం. పూర్వం తండ్రి చెప్పిన మాట వినకుండా ఆ తండ్రి కోపానికి గురై ఎలుకగా జన్మించిన ఓ కుర్రాడి కథ ఇక్కడ ప్రస్తావితమవుతోంది. స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం అయిదో అధ్యాయంలో ఇదంతా కనిపిస్తుంది. జనక మహారాజుకు వశిష్ఠుడు సర్వపాప క్షయకరమైన కార్తీక మాస విశేషాలను వివరించసాగాడు. కార్తీక మాసంలో *శ్రీమహా విష్ణువు సన్నిధిలో భగవద్గీత పారాయణ* చేయడం ఎంతో శుభప్రదం.


భగవద్గీతలో ఉన్న విభూతి , విశ్వరూప , సందర్శనాధ్యాయాలను పారాయణ చేయాలి. అలా చేయటం వల్ల వైకుంఠ వాసార్హత లభిస్తుంది. శ్రీమహా విష్ణువును తులసీ దళాలతోనూ , తెల్లనివి , నల్లనివి అయిన అవిశ పూలతోనూ , గన్నేరు పూలతోనూ పూజించటం ఎంతో మేలు. ఈ మాసంలో హరి సన్నిధిలో కార్తీక పురాణంలోని ఒక శోక్లాన్ని విన్నా లేదా ఒక శ్లోక పదాన్ని చెప్పినా , విన్నా కర్మ బంధ విముక్తి లభిస్తుంది. అలాగే కార్తీక శుక్ల పక్షంలో వన భోజనం కూడా పాపనాశకరమే. ఈ మాసంలో చేసే జపాలు , హోమాలు అన్నీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. సర్వపాపాలనూ నశింపచేస్తాయి. వన భోజనం విషయంలో ముందుగా వనంలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాదులతో పూజించి భక్తితో ముందుగా వేద పండితులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన వారు భోజనం చేయాలి.



*శ్రవణ ఫలం*



పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే వేద వేదాంగ పండితుడు ఉండేవాడు. అయితే ఆయనకు జన్మించిన కుమారుడు మాత్రం తండ్రి మాట వినకుండా తిరుగుతూ ఉండేవాడు. ఓ సంవత్సరం కార్తీకం ప్రవేశించగానే ఆ మాస పవిత్రతను చెప్పి వ్రతాన్ని ఆచరించమన్నాడు దేవశర్మ.  కానీ , కుమారుడు తండ్రి మాటను తిరస్కరించటమే కాక నాస్తిక ధోరణిలో తండ్రిని ఎదిరించాడు. దాంతో తండ్రికి కోపం మితిమీరి ఎలుకగా పుట్టమని శపించాడు. అప్పటికి ఆ కుమారుడికి జ్ఞానోదయమైంది. తప్పు క్షమించమని తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. తండ్రి కరుణించి ఎప్పుడు కార్తీక మహాత్మ్యాన్ని (కార్తీక పురాణాన్ని) వింటావో అప్పుడు పాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే దేవశర్మ కుమారుడు ఎలుకగా మారి సమీప అరణ్యంలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగాడు.

ఇంతలో ఓ రోజున విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి ఆ పరిసరంలో ఉన్న కావేరీ నదిలో స్నానమాడటానికి వచ్చాడు. ఆ తర్వాత ఎలుక ఉన్న చెట్టు దగ్గరకొచ్చి తన శిష్యులతో కార్తీక మహాత్మ్యాన్ని చెప్పటానికి , హరి పూజకు సంసిద్ధుడయ్యాడు. ఇంతలో ఓ దారి దోపిడీ వేటగాడు అక్కడున్నది సామాన్య మునులనుకొని వారిని బాధించి , వారి దగ్గరున్న వస్తువులను తీసుకెళ్ళటానికి వచ్చాడు. కానీ , ఆ సజ్జన దర్శనంతో అతడిలోని పాపపు ఆలోచనలన్నీ పోయి సాత్వికుడిగా మారి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడ్డాడు. తనలో ఏదో తెలియని మార్పు వచ్చిందని , అది తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కనుక తనకు ఇంకా ఏదైనా మంచి విషయాన్ని బోధించి ముక్తి లభించేలా చేయమని ప్రార్థించాడు.

విశ్వామిత్రుడు వెంటనే కార్తీక వ్రత మహాత్మ్యాన్ని గురించి చెప్పి కార్తీక పురాణాన్ని వినిపించాడు. జరుగుతున్నదంతా చెట్టు తొర్రలో నుంచి చూస్తున్న ఎలుకకు శాప విముక్తి కలిగి అసలు రూపం లభించింది. అప్పుడు ఆ దేవశర్మ కుమారుడు విశ్వామిత్రుడి కాళ్ళమీద పడి విషయమంతా చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది ఇంటికి తిరిగి వెళ్ళాడు. బోయ కూడా ఆనాటి నుంచి పూర్తిగా హింసకు దూరమై అత్యంత కాలంలో ముక్తిని పొందాడు. ఇదంతా పూజ , వ్రతం , పురాణ కథ అని కొట్టి పారేయనక్కరలేదు. తల్లితండ్రులను ఎదిరించిన వాడు కష్టాల పాలవుతాడని సజ్జన దర్శనం , సాంగత్యం మనిషిలో మంచి మార్పును తెస్తాయని చెప్పే సందేశాన్ని గమనించి ఆచరించవచ్చు.

కార్తీక_మాసం_విశిష్టత

 #కార్తీక_మాసం_విశిష్టత : (16-11-2020 సోమవారం నుండి 14-12-2020 సోమవారం వరకు)


కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న #కార్తీక_మాసం అంటే పరమశివుడికి మహాప్రీతి.. గరళకంఠుడి తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు.. కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.


శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసం తో సమానమైన మాసం లేదని అంటారు.. శివకేశవులకు అత్యంత ప్రతీకరమైంది కార్తీకమాసం.. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైంది.. 


#కార్తీక_మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు.. #కార్తీక_మాసం తొలి రోజున బలిపాడ్యమి, విదియ నాడు వచ్చే భగినీ హస్త భోజనం ఆధ్యాత్మికం గా విశిష్టమైనవి.. కార్తీకమాసంలో చేసే దీపదానం మంచి ఫలితాలను ఇస్తుంది.. 


ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం అత్యంత శ్రేష్ఠమైంది. కార్తీకమాసం శుక్లపక్షంలో అక్షయ నవమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, త్రయోదశిలు ఇలా ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది.. కార్తీక శుద్ధ త్రయోదశి రోజునే స్వాయంభువ మన్వంతరం ప్రారంభమైందని పేర్కొంటారు.. 


కార్తీక పౌర్ణమి రోజున గౌరీవ్రతం, కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు. #కార్తీక_మాసం లో ఎటువంటి మంచి పనిచేసినా ‘#కార్తిక_దామోదర_ప్రీత్యర్థం’అని ఆచరించాలని శాస్త్రోక్తి. 


శరదృతువులో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోష రహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు. కార్తీక మాసంలో మానసిక, శారీరక రుగ్మతులను తొలగించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ముఖ్యమైంది... పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి. 


కార్తీకంలో సూర్యోదయానికి ముందు విష్ణు సన్నిధిలో శ్రీహరి కీర్తనలు గానం చేస్తే వేల గోవుల దాన ఫలితం, వాయిద్యం వాయిస్తే వాహపేయ యజ్ఞఫలం, నాట్యం చేస్తే సర్వతీర్థ స్నానఫలం, పూజా ద్రవ్యాలను సమరిస్తే అన్ని ఫలాలూ, దర్శనం చేసేవారికి ఈ ఫలితాల్లో ఆరో వంతు ఫలం లభిస్తుంది. 


విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో రావి చెట్టు మొదట్లో గానీ, తులసీవనం లో గానీ భగవంతుని స్మరించుకోవచ్చు.. కార్తీక మాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి..


శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన, జపాలు ఆచరిస్తే వెయ్యి అశ్వమేథాల ఫలం దక్కుతుంది. సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు. 


#ఉపవాసం: కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించడం. 


#ఏకభుక్తం: దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవ తీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి. 


#నక్తం: పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి. 


#అయాచితం: భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం. 


#స్నానం : శక్తిలేని వాళ్లు సమంతర స్నానం, జపాలు చేసినా చాలు.. 


మంత్ర, జప విధులు కూడా తెలియనివాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది. 


పైన పేర్కొన్న వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది.. కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న #కార్తీక_మాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడి తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు.. కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది...


ఓం నమ:శివాయ...🙏🙏🙏

ఓం నమో నారాయణాయ... 🙏🙏🙏

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1958 (౧౯౫౮)*


*10.1-962-*


*మ. అని చింతించి దయాళుఁడైన హరి మాయాదూరమై, జ్యోతియై,* 

*యనిరూప్యంబయి, సత్యమై, యెఱుకయై, యానందమై, బ్రహ్మమై,* 

*యనఘాత్ముల్ గుణనాశమందుఁ గను నిత్యాత్మీయ లోకంబు గ్ర*

*క్కునఁ జూపెం గరుణార్ద్రచిత్తుఁ డగుచున్ గోపాలకశ్రేణికిన్.* 🌺



*_భావము: దయాళువగు శ్రీకృష్ణుడు గోపాలురపై కరుణ వహించి వారికి ప్రకృతి మాయకు అతీతమైనది, జ్యోతిర్మయమైనది, ఇది అది అని నిరూపించబడలేనిది, నిత్యసత్యమైనది, జ్ఞానానందమయమైనది, పరిపూర్ణమైన బ్రహ్మమై, పాపరహితులైనవారు త్రిగుణాత్మకప్రకృతిని అధిగమించి కనుగొన్న శాశ్వతలోకమగు తనదైన వైకుంఠమును చటుక్కున చూపించాడు._* 🙏



*_Meaning: The merciful Sri Krishna was kind towards the Yadava folk and showed them His Supreme Abode, Vaikuntham, which is beyond the material world, radiating brilliance, that cannot be proved with any physical proofs, permanent, knowledgeable, complete in all respects, the eternal power, which conquered the primordial elements._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*


*వందేమాతరం*

                                                                                                                                                               *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1960 (౧౯౬౦)*


*10.1-965-*


*ఆ. కామతంత్రటీక, కలువల జోక, కం*

*దర్పు డాక, విటులతాల్మి పోక,* 

*చకిత చక్రవాక, సంప్రీత జనలోక,* 

*రాక వచ్చె మేలురాక యగుచు.*🌺



*_భావము: కామసంబంధమైన విషయములకు వ్యాఖ్యానమువంటిది, కలువలను వికసింప చేసేది, మన్మథుడు విజృంభించటానికి అనువైనది, జారుల యొక్క ఓపికను నశింపజేసేది, చక్రవాక పక్షులకు భ్రమ, భ్రాంతి కలిగించేది, సకల జనులకు సంతోషము, శుభములు కలిగించేటటువంటి నిండుపున్నమి రానే వచ్చింది._* 🙏



*_Meaning: On the bright full moon day of Sharad Ruthu, the moonlight was felt like provocateur of carnal desires, black lilies were blooming, Manmatha, the God of love was out to strike at the hearts of the lovers, the patience of the paramours was tested to the ultimate, illusions were created in the minds of the poetical swans, great pleasure and happiness was experienced to one and all on this charming and delightful day._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

Complaint u/s 498-A IPC and Ss.3, 4 Dowry P.A

 Complaint u/s 498-A IPC and Ss.3, 4 Dowry P.A. - Settlement between parties - Criminal complaint quashed. (2019(4) Criminal Court Cases 781 (S.C.)


Dishonour of cheque - Company - Notice served upon Managing Director - Complaint against company - Mere irregularity. (2019(1) Criminal Court Cases 301 (Delhi)


Dying declaration - Principles relating to recording of dying declaration and its admissibility and reliability, summed up. (2020(2) Apex Court Judgments 265 (S.C.)


Limitation - Exclusion of time spent in obtaining certified copy - Court to compute limitation on the basis of endorsement as contained in the certified copy - Suspicion of unfair and/or improper practice - Remedy lies in initiating a domestic inquiry. (2019(3) Apex Court Judgments 627 (S.C.)


Maintenance u/s 125 Cr.P.C. - Cannot be refused on ground of not obeying decree of restitution of conjugal rights by her, particularly when appeal against said decree is pending. (2019(1) Criminal Court Cases 118 (Allahabad)


Rent & Eviction - Clause in rent agreement of increase of rent by 10% each year - It is a promise contingent on tenancy being continued beyond one year - It cannot make the tenancy year to year or tenancy for a period of more than one year - Rent note does not require compulsory registration. (2020(3) Civil Court Cases 749 (S.C.)


Res judicata - Principles of res judicata do not apply to a consent decree. (2020(1) Civil Court Cases 203 (Allahabad)


Statement u/s 161 Cr.P.C. as dying declaration - Condition of injured was serious - Blood pressure was not recordable - Without getting opinion of doctor that patient was in a fit condition for making statement his statement should not have been recorded - Dying declaration does not meet the test of a verifiable dying declaration. (2020(1) Apex Court Judgments 136 (S.C.)


Voice sample - Notice to accused - Not required when direction of Court was on a request by investigating agency in the course of investigation. (2020(3) Criminal Court Cases 770 (Kerala)

*స్త్రీ ధర్మ సంబంధ 16 పుస్తకాలు(PDF)

 *స్త్రీ ధర్మ సంబంధ 16 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


16  పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/sthridharmalu-pdf


               (OR)


స్త్రీ ధర్మ ప్రదీపిక www.freegurukul.org/g/SthriDharmalu-1


అన్నమయ్య శృంగార సంకీర్తనల్లో స్త్రీ ధర్మాలు www.freegurukul.org/g/SthriDharmalu-2


ఆర్య గృహిణి www.freegurukul.org/g/SthriDharmalu-3


స్త్రీల హక్కులు సమస్యలు www.freegurukul.org/g/SthriDharmalu-4


స్త్రీ విలువ www.freegurukul.org/g/SthriDharmalu-5


స్త్రీ నిజ స్థితి www.freegurukul.org/g/SthriDharmalu-6


స్త్రీ - పురుష అసమానతా సమస్యలు www.freegurukul.org/g/SthriDharmalu-7


వనితా లోకం www.freegurukul.org/g/SthriDharmalu-8


లఘు వీర గాధల్లో స్త్రీ విలువలు www.freegurukul.org/g/SthriDharmalu-9


అక్క మహాదేవి వచనములు www.freegurukul.org/g/SthriDharmalu-10


మహిళా జాగరణ మహోద్యమం www.freegurukul.org/g/SthriDharmalu-11


స్త్రీ సమస్యలు - సంఘ సంస్కరణ www.freegurukul.org/g/SthriDharmalu-12


స్త్రీ హిత బోదిని www.freegurukul.org/g/SthriDharmalu-13


స్త్రీ శక్తి www.freegurukul.org/g/SthriDharmalu-14


మానవ హక్కులు - మహిళల హక్కులు www.freegurukul.org/g/SthriDharmalu-15


స్త్రీ లకు చిట్కాలు -1116 సలహాలు www.freegurukul.org/g/SthriDharmalu-16


స్త్రీ ధర్మాలు గురించి తెలుసుకోవడానికి  కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

సంగీతం సంబంధ 32 పుస్తకాలు(PDF)

 *సంగీతం సంబంధ 32 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


32  పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/sangeethamu-pdf


               (OR)


క్రొత్త సంగీత విద్యాదర్పణము www.freegurukul.org/g/Sangeethamu-1


రాగ తాళ చింతామణి www.freegurukul.org/g/Sangeethamu-2


సంగీత మార్తాండము-తాళాధ్యాయము www.freegurukul.org/g/Sangeethamu-3


సంగీత ప్రధమ భోదిని www.freegurukul.org/g/Sangeethamu-4


సంగీత లక్షణము www.freegurukul.org/g/Sangeethamu-5


సంగీత శాస్త్ర సుధార్ణవము www.freegurukul.org/g/Sangeethamu-6


ముక్తాయి సూత్ర భాష్యము www.freegurukul.org/g/Sangeethamu-7


ఆంధ్రుల సంగీత కళ www.freegurukul.org/g/Sangeethamu-8


సంగీత విద్యా ప్రకాశిక www.freegurukul.org/g/Sangeethamu-9


పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారి రచనలు www.freegurukul.org/g/Sangeethamu-10


గాన భాస్కరము www.freegurukul.org/g/Sangeethamu-11


శతరాగరత్న మాలికా www.freegurukul.org/g/Sangeethamu-12


సంగీత కళా ప్రదర్శిని-1 www.freegurukul.org/g/Sangeethamu-13


మృదంగ భోదిని www.freegurukul.org/g/Sangeethamu-14


సంగీత నక్షత్ర మాల www.freegurukul.org/g/Sangeethamu-15


గంధర్వ కల్పవల్లి www.freegurukul.org/g/Sangeethamu-16


సంగీత సిద్ధాంత సోపానములు-1 www.freegurukul.org/g/Sangeethamu-17


సిరి మువ్వలు www.freegurukul.org/g/Sangeethamu-18


జాతీయ సంగీతం www.freegurukul.org/g/Sangeethamu-19


సంగీత శబ్దార్ధ చంద్రిక www.freegurukul.org/g/Sangeethamu-20


ప్రాచీనాంధ్ర మహాకవుల సంగీత ప్రతిపత్తి www.freegurukul.org/g/Sangeethamu-21


సంగీత విద్యా భోదిని www.freegurukul.org/g/Sangeethamu-22


ఆంధ్రప్రదేశ్ సంస్థానాలు సంగీత వాగ్మయం www.freegurukul.org/g/Sangeethamu-23


గాన శాస్త్ర ప్రశ్నోత్తరావళి www.freegurukul.org/g/Sangeethamu-24


సంగీత వాయిద్యాలు www.freegurukul.org/g/Sangeethamu-25


అష్టోత్తర శత రాగాంగాది వర్ణమాల www.freegurukul.org/g/Sangeethamu-26


గాన విద్యా వినోదిని www.freegurukul.org/g/Sangeethamu-27


సంగీత సాంప్రదాయ ప్రదర్శిని-1 నుంచి 4 www.freegurukul.org/g/Sangeethamu-28


సంగీత శాస్త్ర వాచకములు - గాన విషయము-1,2 www.freegurukul.org/g/Sangeethamu-29


సంగీత సౌరభం-1,3,4 www.freegurukul.org/g/Sangeethamu-30


గాంధర్వ వేదము www.freegurukul.org/g/Sangeethamu-31


మనోధర్మ సంగీతం www.freegurukul.org/g/Sangeethamu-32



సంగీతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

వివాహం/పెండ్లి సంబంధ 15 పుస్తకాలు

 *వివాహం/పెండ్లి  సంబంధ 15  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


15 పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/vivaham-pdf


               (OR)


పాణిగ్రహణము-వివాహ మంత్రార్ధము www.freegurukul.org/g/Vivaham-1


గృహస్థాశ్రమం లో ఎలా వుండాలి www.freegurukul.org/g/Vivaham-2


పెండ్లి సందడి- వివాహ పద్ధతి www.freegurukul.org/g/Vivaham-3


బ్రహ్మ చర్యం www.freegurukul.org/g/Vivaham-4


పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు www.freegurukul.org/g/Vivaham-5


వివాహ మంత్రార్ధం www.freegurukul.org/g/Vivaham-6


పాణిగ్రహణం www.freegurukul.org/g/Vivaham-7


వైదిక వివాహ వైశిష్ట్యము www.freegurukul.org/g/Vivaham-8


సప్తపది www.freegurukul.org/g/Vivaham-9


హైందవ వివాహము www.freegurukul.org/g/Vivaham-10


గృహస్థ ధర్మావళి www.freegurukul.org/g/Vivaham-11


వివాహ తత్త్వము www.freegurukul.org/g/Vivaham-12


వివాహం సంతానం కోసమేనా www.freegurukul.org/g/Vivaham-13


మన వివాహ వ్యవస్థ www.freegurukul.org/g/Vivaham-14


గృహస్థ ధర్మావళి www.freegurukul.org/g/Vivaham-15


వివాహం/పెండ్లి  గురించి తెలుసుకోవడానికి  కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

*ఆరోగ్య సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట

 *ఆరోగ్య సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


55 పుస్తకాలు ఒకేచోట!  https://www.freegurukul.org/blog/arogyam-pdf


               (OR)


మీ ఇంట్లో మీరే డాక్టర్ www.freegurukul.org/g/Arogyam-1


యోగము - భోగము - రోగము www.freegurukul.org/g/Arogyam-2


నీవు - నీ పుట్టుక www.freegurukul.org/g/Arogyam-3


వ్యాధులు భయాలు www.freegurukul.org/g/Arogyam-4


సైన్సు ఆరోగ్యం www.freegurukul.org/g/Arogyam-5


హార్ట్ ఎటాక్ www.freegurukul.org/g/Arogyam-6


కన్ను ఆత్మకథ www.freegurukul.org/g/Arogyam-7


జ్వరాలు www.freegurukul.org/g/Arogyam-8


మూత్రపిండాల మర్మం www.freegurukul.org/g/Arogyam-9


జీర్ణం..జీర్ణం www.freegurukul.org/g/Arogyam-10


కీళ్ళు కండరాలు www.freegurukul.org/g/Arogyam-11


ఇదీ గుండె గుట్టు www.freegurukul.org/g/Arogyam-12


ఊపిరితిత్తుల ఊసు www.freegurukul.org/g/Arogyam-13


మధుమేహము-రక్తపోటు www.freegurukul.org/g/Arogyam-14


డయాబెటీస్ www.freegurukul.org/g/Arogyam-15


టీకాలు www.freegurukul.org/g/Arogyam-16


చలి జ్వరము www.freegurukul.org/g/Arogyam-17


స్థూల కాయం www.freegurukul.org/g/Arogyam-18


కన్ను - విధులు, వ్యాధులు, వైద్యము www.freegurukul.org/g/Arogyam-19


షుగర్ అంటే భయం ఎందుకు? www.freegurukul.org/g/Arogyam-20


ఆస్తమ ఉబ్బసము www.freegurukul.org/g/Arogyam-21


అంటువ్యాదులు www.freegurukul.org/g/Arogyam-22


శరీర శాస్త్రము-ఆరోగ్య భోధిని www.freegurukul.org/g/Arogyam-23


ఆరోగ్య దీపిక www.freegurukul.org/g/Arogyam-24


ఆరోగ్య సూత్రాలు www.freegurukul.org/g/Arogyam-25


ఆరోగ్యం - శుబ్రత www.freegurukul.org/g/Arogyam-26


ఆరోగ్యము - దీర్గాయువు www.freegurukul.org/g/Arogyam-27


ఆరోగ్యమే మహాభాగ్యం www.freegurukul.org/g/Arogyam-28


అందరికీ ఆరోగ్యం www.freegurukul.org/g/Arogyam-29


వైద్య ప్రపంచము www.freegurukul.org/g/Arogyam-30


మెడికల్ గైడ్ www.freegurukul.org/g/Arogyam-31


మెడికల్ బుక్ www.freegurukul.org/g/Arogyam-32


వైద్య రంగంలో సంఘ సంక్షేమ సేవలు www.freegurukul.org/g/Arogyam-33


ప్రధమ చికిత్స www.freegurukul.org/g/Arogyam-34


ప్రధమ చికిత్స www.freegurukul.org/g/Arogyam-35


మీకు అవసరమైన వైద్య వివేకం www.freegurukul.org/g/Arogyam-36


డాక్టర్ వచ్చేలోగా ఏం చేయాలి www.freegurukul.org/g/Arogyam-37


నర్సులకొరకైన పుస్తకం www.freegurukul.org/g/Arogyam-38


ప్రకృతి వైద్యం www.freegurukul.org/g/Arogyam-39


హెల్త్ అండ్ బ్యూటీ www.freegurukul.org/g/Arogyam-40


ప్రకృతి వైద్య తత్త్వము www.freegurukul.org/g/Arogyam-41


ప్రకృతి గృహ వైద్యం www.freegurukul.org/g/Arogyam-42


గృహౌషద వనము www.freegurukul.org/g/Arogyam-43


చిట్కా వైద్యం-2 www.freegurukul.org/g/Arogyam-44


వేదాలలో సూర్యకిరణ చికిత్స www.freegurukul.org/g/Arogyam-45


ఉపవాస చికిత్స www.freegurukul.org/g/Arogyam-46


పథ్యా పథ్యము www.freegurukul.org/g/Arogyam-47


సంవాహన చికిత్స - అవయవ మర్దన చికిత్స www.freegurukul.org/g/Arogyam-48


బాల రోగముల చికిత్స www.freegurukul.org/g/Arogyam-49


ఆరోగ్యామృతము www.freegurukul.org/g/Arogyam-50


చిరంజీవ చిరంజీవ-సుఖీభవ సుభీభవ www.freegurukul.org/g/Arogyam-51


అందానికి మార్గాలు www.freegurukul.org/g/Arogyam-52


గర్భధారణ సమస్యలు www.freegurukul.org/g/Arogyam-53


గర్భధారణ సుఖ ప్రసవం www.freegurukul.org/g/Arogyam-54


మహిళా శిశు వ్యాదులు-జాగ్రత్తలు www.freegurukul.org/g/Arogyam-55


ఆరోగ్యం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

తెలుగు/తెలుగు చరిత్ర సంబంధ 23 పుస్తకాలు

 *తెలుగు/తెలుగు చరిత్ర సంబంధ 23  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


23 పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/telugu-pdf


               (OR)


తెలుగు భాషా చరిత్ర www.freegurukul.org/g/Telugu-1


ఆంధ్ర భాషా వికాసము www.freegurukul.org/g/Telugu-2


తెలుగు కోర్స్ www.freegurukul.org/g/Telugu-3


భాషాశాస్త్ర మూల సూత్రాలు www.freegurukul.org/g/Telugu-4


బాష www.freegurukul.org/g/Telugu-5


తెలుగు వాక్యం www.freegurukul.org/g/Telugu-6


చక్కని తెలుగు వ్రాయడం ఎలా www.freegurukul.org/g/Telugu-7


ద్రావిడ భాషా పరిశీలనము-2 www.freegurukul.org/g/Telugu-8


ముప్పది రోజులలో తెలుగు www.freegurukul.org/g/Telugu-9


వ్యవహారిక భాషా వికాసం www.freegurukul.org/g/Telugu-10


సామాన్య భాషా శాస్త్రం www.freegurukul.org/g/Telugu-11


భాషా చారిత్రిక వ్యాసావళి www.freegurukul.org/g/Telugu-12


తెలుగు భాషా భోదన ప్రణాళిక www.freegurukul.org/g/Telugu-13


పరమ లఘు మంజూష www.freegurukul.org/g/Telugu-14


ఆంధ్ర భాషా చరిత్రము www.freegurukul.org/g/Telugu-15


మన భాష www.freegurukul.org/g/Telugu-16


మాతృ భాషా భోదన www.freegurukul.org/g/Telugu-17


ఆంధ్ర సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/Telugu-18


ఆంధ్ర బాషా వికాసం www.freegurukul.org/g/Telugu-19


ఆంధ్ర భాషా చరిత్రము-1,2 www.freegurukul.org/g/Telugu-20


అధికార భాష - తెలుగు చరిత్ర www.freegurukul.org/g/Telugu-21


భారతీయ సాహిత్య సంకలనము www.freegurukul.org/g/Telugu-22


అధికార భాష తీరుతెన్నులు www.freegurukul.org/g/Telugu-23


తెలుగు/తెలుగు చరిత్ర పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

కార్తీక పురాణం - 17 వ అధ్యాయము🚩

 *🚩కార్తీక పురాణం - 17 వ అధ్యాయము🚩*_


🕉☘🕉☘🕉☘🕉☘🕉☘🕉


*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*


☘☘☘☘☘☘☘☘☘


ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.


కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా


"ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరెను.


అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే  'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.


ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్రపోతిని, సుఖింగావుంది' అనుకోనునదియే ఆత్మ.  


దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే 'పరమాత్మ' యని గ్రహింపుము. 'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణి౦చుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.


జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమను భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై  గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*కార్తీక పురాణం

 *కార్తీక పురాణం -*

*16వ అధ్యాయము*


🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉


*స్తంభ దీప ప్రశంస*


*వశిష్టుడు చెబుతున్నాడు -*


"ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత  ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ  విడువకుండ, తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.


సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యు౦దురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు  ఆకాశ దీపముగాని, స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు  శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.


*దీప స్తంభము విప్రుడగుట*


ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్దడు తక్కిన మునులను జూచి "ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీకశుద్ధ  పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్త౦భముపాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కునివత్తము, రండు" అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి  వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి "ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి" అని ప్రశించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయా విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచె నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష  జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని, నన్ను మన్ని౦పు" డని వేడుకొనెను.


ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్యమొంది "ఆహా! కార్తీకమాసమహిమ మెంత గొప్పది అదియునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు, రాళ్లు, స్త౦భములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్ని౦టి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్త౦భమునకు ముక్తికలిగిన" దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి "మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశి౦చుటెట్లు? నాయీ సంశయము బాపు"డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరుల౦దరును తమలో నోకడగు అంగీరసమునితో "స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన, వివరించు"డని కోరిరి. అంత నా౦గీరసుడిట్లు చెప్పుచున్నాడు.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షోడశాధ్యాయము - పదహారో రోజు పారాయణము సమాప్తం.*


🕉🕉

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కార్తీక పురాణం

 *కార్తీక పురాణం -*

*15వ అధ్యాయము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*


అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.


ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.


ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.


సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.


ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడియుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించుచుంతివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.


*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.*

🙏🙏🙏🙏🙏🙏

తల్లితండ్రుల గొప్పదనం

 *తల్లితండ్రుల గొప్పదనం గురించి  శాస్త్రాలలో చెప్పబడిన విధానం.*

======================


01. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.


02. ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి0


03. ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.


04. సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.


05. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.


06. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.


07. ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం


08. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.


09. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే  అని ధర్మశాస్త్రం చెబుతోంది.


10. తల్లిని మించిన దైవం లేదు - గాయత్రిని మించిన మంత్రం లేదు.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

అజీర్తి విరోచనాలు చక్కటి పరిష్కారం.

అజీర్తి విరోచనాలు చక్కటి పరిష్కారం. 

కరివేపాకు మాత్ర 

మనం ఏదో ఒక సారి ఈ రకమైన అనారోగ్య సమస్యతో బాధ పడుతూవుంటాము. ఎక్కడైన హోటళ్లలో తిన్న, లేక ఏదయినా పార్టీలో సమయం కానీ సమయంలో అనేక పదార్ధాలు తిన్న మనకు అవి వెంటనే జీర్ణం కాకుండా అజీర్తి చేసి దానివల్ల కడుపులో నొప్పి, గ్యాసు, తరువాత విరోచనాలు కలుగుతాయి.  ఇది సర్వ సాధారణం. దానికి మనం జెలిసెల్ మొదలైనవి వాడుతాము. కానీ ఏమాత్రం ఉపశమనం కలుగదు.  ఈ రోజు మీకు ఈ సమస్యకు ఒక చక్కటిపరిష్కారం  తీసుకొని వచ్చాను. మీరు చాల సురక్షితంగా ఈ మందు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా మీవంట ఇంటిలోనే దొరికే వాటితో 4 నిముషాలలో తయారు చేసుకోవచ్చు. మరియు వెంటనే ఉపశమనం పొందవచ్చు. 

కావలసిన పదార్ధాలు. 

1. ఒక గుప్పెడు కరివేపాకులు 

2.  రెండు లేక మూడు  మిరియాలు, 

3.  రెండు మూడు ఉప్పు రాళ్లు ( రాళ్ల ఉప్పు లేకపోతె అర చిటికెడు మెత్తటి ఉప్పు)\

తయారుచేసే విధానం. ముందుగా కరివేపాకులను చక్కగా మంచి నీటిలో కడుక్కొని వాటిని ఒక కలవం లో వేసి మెత్తగా దంచండి. ఒకటి లేక రెండు చుక్కల నీటిని కలపండి. నీరు ఎక్కువ కలుపకూడదు. అప్పుడు అది ఒక పేస్టు లాగ అవుతుంది. దానితో  మిరియాలు ఉప్పు కూడా కలిపి మెత్తగా కలయ నూరండి. మీదగ్గర కలవం లేకపోతె కలవరపడనవసరం లేదు రోట్లో కానీ లేక చిన్న మిక్సీ జారులో కానీ నూరుకోవచ్చు.  ఏది లేకపోతె ఒక గుండ్రాయిని తీసుకొని ఒక రాయిమీద నూరుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక కుంకుడు గింజ పరిమాణంలో ఆ పేస్టు తయారు అవుతుంది దానిని తీసుకొని  నములుతూ మింగండి.  తరువాత కొద్దిగా నీళ్లు తాగండి ఈ మిశ్రమం చక్కగా ఉప్పుప్పగా కారం కారంగా రుచిగా ఉంటుంది. దీనిని కొంచం తక్కువ మోతాదులో చిన్న పిల్లలకు కూడా వాడ వచ్చు.  ఈ మందు తీసుకున్న పది నిముషాలలో మీకు మీ అజీర్తి విరోచనాలు తగ్గుతాయి. 

ఒక వేళ మీకు చాలా తీవ్రంగా విరోచనాలు అవుతుంటే సాయంత్రం ఇంకొక మాత్ర వేసుకోండి. సహజంగా మీకు రెండవ డోసు తీసుకునే అవసరం  ఉండదు.  మొదటి డోసు తోటె మీరు పూర్తీగా కోలుకుంటారు. 

గమనిక:  మీరు దీనిని అనవసరంగా ఎక్కువగా తీసుకోవద్దు.  మోతాదుకన్నా ఎక్కువగా ఏది తీసుకున్న దాని దుష్ప్రభావం ఉంటుంది.  ఈ మందు ఎక్కువగా తీసుకుంటే మీకు విరోచనాలు పూర్తిగా ఆగిపోవటం మాత్రమే కాకుండా మీకు వేడి చెస్తుంది అంతే కాకుండా మల బద్ధకం కలుగ వచ్చు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని తగు మోతాదులో వాడితే మీకు ఈ మందు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. 

పిల్లలకు వారి వయస్సుని పట్టి కొద్దిపాటి మోతాదులో మందు వాడండి.  సత్ఫలితాలని పొందండి.

ఇంకొక ఆరోగ్య పరిష్కారంతో మరల కలుద్దాము. 

ఇట్లు 

మీ సి. భార్గవ శర్మ 

సర్వ్యే జానా సుఖినోభవంతు. 

ఓం శాంతి శాంతి శాంతిహి  


 



 

ఆయుర్వేద వైద్యుడు పాటించవలసిన నియమాలు -

 ఆయుర్వేద వైద్యుడు పాటించవలసిన నియమాలు - 


  ఆయుర్వేదం అనేది భగవంతుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం . మిగిలిన వైద్యపద్ధతులవలే ప్రత్యేకమైన చదువు దీనికి అవసరం లేదు . ఆయుర్వేదంలో అనుభవం అనేది ప్రధానం . రోగి ఏ వ్యాధితో భాధపడుతున్నాడో సరిగ్గా అంచనావేసి దానికి సరైన చికిత్సను అందించడంలోనే వైద్యుడి యొక్క గొప్పతనం అనేది ఉంటుంది. 


             ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోస్ చూసాను . దానిలో ఇది వాడుకోండి అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇలా వాడండి అలా చేస్తే తిరుగే ఉండదు వంటి మాటలతో జనాన్ని పిచ్చివాళ్లని చేస్తున్నారు . అసలు మనిషి శరీరతత్వం తెలియకుండా మందు ఎలా చెప్తారు అన్నదే అర్ధంకాని ప్రశ్న . 


           ప్రతిమనిషిలోను ఆయుర్వేదం ప్రకారం మూడు తత్వాలు ఉంటాయి. అవి వాత పిత్త కఫాలు . తల భాగం నుంచి ఉదర పైబాగం వరకు కఫ శరీరం ఉంటుంది. ఉదర భాగం నుంచి నడుము పై భాగం వరకు పిత్త శరీరం ఉంటుంది. నడుము భాగం నుంచి పాదాల వరకు వాత శరీరం ఉంటుంది.  మనం తీసుకునే ఆహారాల వల్లకాని లేక మనం సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లకాని వాతపిత్తకఫాల మద్య అసమతులనం ఏర్పడి రకరకాల రోగాలు సంప్రాప్తిస్తాయి. ఈ మూడు తత్వాలు సమానంగా ఉన్నంతవరకు మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. 


          ఒక వ్యక్తిని చూడగానే అతని శరీరతత్వాన్ని ముందుగా అంచనావేసే అనుభవాన్ని వైద్యుడు పొందగలగాలి. రోగికి సమీపమున కూర్చొని ముందుగా కొన్నిరకాల ప్రశ్నలు అడగవలెను . దానివలన మరికొంత అవగాహన కలుగును. అవి


 రోగనిర్థారణ ప్రశ్నలు  -


 * రోగి వయస్సు మరియు రోగి కలుగు వేదన గురించి అడుగవలెను .


 * మలమూత్రములు క్రమముగా వెళ్లుచున్నావా ?  మలమూత్రాల రంగు గురించి అడగవలెను.


 * రోగిని అడుగుచూ రోగి యొక్క శరీర ప్రకృతి వాతమా? పిత్తమా ? లేక కఫామా ? అన్నది నిర్ధారణకు రావలెను .


 * భుజించు పదార్ధాలలో ఏయే పదార్థాలు ఎక్కువుగా తింటారు ?


*  నిద్ర సక్రమముగా పట్టునా ?


*  సుఖవ్యాధులు ఏమైనా ఉన్నావా ? వాటి లక్షణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి .


 * జ్వరం వచ్చుచున్నదా ? ఏయే సమయాలలో వచ్చును ?.


 * ఎప్పుడు అయినా కర్పూర సంబంధమైన రసాలు ( menthol ) సేవించారా ?


 * మద్యపానం , ధూమపానం వంటి అలవాట్లు ఉన్నాయా ?


 * రోగి యొక్క రక్తసంబంధీకులలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నదా ?


 *  చల్లటి పదార్థాలు తీసుకున్నపుడు ఎలా ఉంటుంది ? వేడిపదార్థాలు తీసుకున్నపుడు ఎలా ఉంటుంది ?


 *  రోగి స్థూల శరీరుడా ? శుష్క శరీరుడా ?


 *  రోగి కూర్చొని పనిచేయువాడా లేక తిరుగుతూ పనిచేయువాడా అనగా మన ఉద్యోగం వల్ల కూడా మనకొచ్చే జబ్బులు ఉంటాయి.


 *  ఇదివరలో ఎమైనా మందులు సేవించారా ? ఇప్పుడు ఎమైనా మందులు వాడుతున్నారా ?


 *  స్త్రీ అయినచో సంతానవతియా ? కాదా ?  గర్భిణీ స్త్రీ అయిన ఎన్నో మాసము ? ఋతువు సరిగ్గా వచ్చుచున్నదా ? ప్రసూతి అయ్యినప్పుడు మలినములు అన్నియు బయటకి వెడలినవా ?  ఎంతకాలం అయినది ? దేహదారుఢ్యం ఎలా ఉంది ?.


 * చంటిపిల్లలు అయినా పాలు సరిగ్గా తాగుదురా? 


 * చంటిపిల్లకు కలిగే బాలపాప చిన్నె అనే వాత సంబంధ రోగం ఉన్నదా ?.


* కడుపునొప్పి , కడుపు వెంట జిగురు వెళ్లుట, పాలు కక్కుట ఉందా ?  


        ఇన్ని రకాల ప్రశ్నలు వేసి నాడిని పట్టుకొని చూసి రోగాన్ని సరిగ్గా అంచనా వేసుకొని ఆ తరువాత రోగి యొక్క శరీర తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఔషధాన్ని ఇవ్వవలెను.


            మనిషికి 120 సంవత్సరములు ఆయుర్దాయం అని జ్యోతిష్యగ్రంధాలు తెలుపుచున్నాయి. కాని ప్రస్తుతం మనం తినే ఈ పురుగు మందుల తిండికి 60 సంవత్సరాలు బ్రతకడమే గొప్ప అవుతున్నది. కేవలం నాడీ జ్ఞానం వల్లనే రోగం తెలుసుకొనుట కష్టం అని మనపూర్వీకులు అష్టమస్థాన పరీక్ష గురించి తమగ్రంధాలలో విపులంగా రాశారు.


 అష్టమస్థాన పరీక్ష అనగా 


  1 - నాడీ , 2 - స్పర్శ , 3 - రూపము , 4 - శబ్దము , 5 - నేత్రము , 6 - మూత్రము , 7 - పురీషము ,  8 - నాలుక .  


          పైన చెప్పిన  ఎనిమిదింటిని పరిశీలించి రోగ నిర్ధారణ చేయవలెను .


          ఇన్నిరకాల పరీక్షలు చేసి రోగనిర్దారణ చేయవలెను . వైద్యుడు రొగికి ఇచ్చే ఔషదం శుద్ది చేసి మాత్రమే ఇవ్వవలెను. శుద్ధి చేయనటువంటి 

ఔషధం పనిచేయదు . 


           చివరగా ఒక్కమాట మీకు తెలియచేయదలుచుకున్నాను అవగాహన లేనివారి మాటలు విని సొంతంగా ప్రయోగాలు చేసుకుని ఏదన్నా సమస్య వస్తే దయచేసి ఆయుర్వేదాన్ని నిందించకండి. తప్పు ఆయుర్వేదానిది కాదు. మీకు చెప్తున్న అవగాహన లేని వ్యక్తులది. మీ అంతట మీరు వైద్యం చేసుకోవాలి అనుకుంటే ముందు మీ శరీరతత్వాన్ని తెలుసుకోండి. అదే విధంగా మీరు సంప్రదించే వ్యక్తి ఆయుర్వేదం మీద సంపూర్ణ అవగాహన కలిగినవాడా లేదా అన్నది కూడా ఒకటికి పదిసార్లు అడిగి మీకు సంతృప్తికరమైన జవాబులు వస్తేనే సంప్రదించండి . 


         ఇవన్నీ మీకు చెప్పుటకు ప్రధాన కారణం ఒక వ్యక్తి చెప్పిన మందులు వాడి ఫలితం కానరాక ఆయుర్వేదం సరిగ్గా పనిచేయదు .వేడి చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వంటి మాటలు నాతో 

 మాట్లాడారు. అందుకే ఆయుర్వేద గొప్పతనాన్ని వివరించవల్సి వచ్చింది.


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Jai Bharat


 

తిరుమల

 తిరుమల


మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..


తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.


కానుక సంగతి పక్కన పెడితే... వివాహ ఆహ్వాన మొదటి పత్రిక స్వామి వారికి పంపడం శుభప్రథమైన కార్యం.


To,

Sri Lord Venkateswara swamy,

The Executive Officer

TTD Administrative Building

K.T.Road

Tirupati

517501

కార్తీక పురాణం

 🚩 _*కార్తీక పురాణం*_🚩 

🚩 _*17 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*


🕉️☘☘☘☘☘☘🕉️


ఓ మునిశ్రేష్ఠులారా ! ఓ ధనలోభీ ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.


కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున , శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక , కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా


*"ఓ మునీంద్రా ! నేనింత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక , ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన , *'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"* యని ధనలోభుడు కోరెను.


అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే , *'నేను - నాది'* అని చెప్పబడు జీవత్మాయే  *'అహం'* అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా *' నః '* అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై ఎల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే *"ఆత్మ"* యనబడను. *"నేను"* అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక , ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ *"నేను", "నాది"* అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.


ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర , ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ . అట్లే , అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరెంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి , మేల్కొన్న తర్వాత *'నేను సుఖనిద్రపోతిని , సుఖంగావుంది'* అనుకోనునదియే ఆత్మ.  


దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును , ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన , దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే *'పరమాత్మ'* అని గ్రహింపుము. *'తత్వమసి'* మొదలైన వాక్యములందలి *'త్వం'* అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం *'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి"* అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే *"ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షిణించుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము , ఉపదేశము , సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ".* ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో , అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.


జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు , జీవులు కర్మ ఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై  గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు , దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.



*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.*


🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

జాతకం లేని వారికి శాంతులు

 జాతకం లేని వారికి శాంతులు


వర్తమానంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. జీవితంలో జరిగే మంచి చెడులను తెలుసుకునేందుకు జ్యోతిష్కులను, పండితులను ఆశ్రయిస్తుంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా చెబుతుండగా, ఇంకొందరు సంఖ్యాశాస్ర్తాన్ని ఆధారంగా చేసుకుని, మరికొందరు గ్రహ సంచారాల ఆధారంగా జాతకాలు చెబుతుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పేది హస్త సాముద్రికం కాగా, గ్రహ గతుల ఆధారంగా చెప్పేది జన్మకుండలి ఆధారిత జ్యోతిష్యం.


జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి జన్మించిన తేదీ (నెల, సంవత్సరంతో సహా), సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ కచ్చితంగా ఉంటే జాతకం కూడా కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం సరిగా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధారించడం సాధ్యమవుతుంది.


అలాగే, లగ్నం కచ్చితంగా నిర్ధారించేందుకు జన్మించిన ప్రదేశం కూడా ముఖ్యమే. సూర్యోదయ సమయాలు ఆయా ప్రాంతాలనుబట్టి కొన్ని నిమిషాలు హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా లగ్న నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేషాది మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ప్రమాణం సుమారు 2 గంటల వరకు ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు నిమిషాల తేడాలో లగ్నం మారవచ్చు. జన్మించిన ప్రదేశం తెలుసుకోవడం ద్వారా లగ్నంలో తేడాలు రాకుండా చూసే అవకాశముంటుంది.


కొందరికి జన్మించిన తేదీ, సమయం తెలియదు. వారి పెద్దలు చెప్పే కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. అయితే, జన్మ కుండలి వేయడం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.


జాతకం లేని వారికి శాంతులు అంటే జన్మించిన సమయం లేని వారికి. అయితే జాతకం ఉన్న వాళ్ళుకూడా చేసుకోవచ్చును.


ఆదిత్య హృదయం:

ఇది సూర్యునికి సంబంధించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేసించినాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పటించుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను పొందుతారు. ఇంకా.. మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది. పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుంచి, దుఃఖముల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పఠించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాధించాడు. గోధుమలతో చేసిన పదార్ధములు, క్యారెట్, రాగి చెంబులో నీళ్లు తాగడం వలన కూడా సూర్య గ్రహా దోషాలు తొలుగుతాయి.


రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం:

జీవితంలో మనకు ఎదురైనా అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే "రుణ విమోచక అంగారక(కుజ) స్తోత్రం" 41 రోజులు పారాయణ చేస్తూ , నవగ్రహాలకు రోజూ 27 ప్రదక్షిణలు చేయాలి. చివరి రోజు కందులు, ఎర్ర గుడ్డ, ధనము దక్షిణగా పెట్టి,కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి. మీ అప్పులు తప్పక తీరు తాయి.


ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారా?

మీరు "విష్ణు సహస్ర నామ స్తోత్రం" 41 రోజులు పారాయణ చేయండి. సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేఇంచండి. మీ బాధలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.


మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము లేదా?

మీరు ఒకసారి కాళహస్తి వెళ్లి రాహు,కేతు,కుజ గ్రహాలకు "సర్ప దోష నివారణ పూజ" చేయించండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేయించండి. కర్నాటక రాష్ట్రంలో నున్న విదురాస్వద్ధలో చేయిస్తే ఇంకా మంచిది. లేదా" సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చేయండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. తప్పక సంతానం కలుగుతుంది.


వివాహం ఆలస్య మవుతోందా?

మీరు "రుక్మిణి కల్యాణం" పారాయణ చేయండి. లేదా 41రోజులు , రోజుకి 41 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి, చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి. అయితే నవగ్రహాలకు తిరిగే మొదటిరోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది.


ధనమునకు ఇబ్బంది పడుతున్నారా?

ధన కారకుడైన సాయి బాబా పారాయణ 41 రోజులు చేస్తూ, ప్రతిరోజూ సాయిబాబా మందిరమునకు వెళ్లి, ఆలయమును శుబ్రపరుస్తూ(అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు, అరటి తొక్కలు, ప్రసాదం తిన్న ఆకులు) బాబాని దర్శించుకోవాలి. 41వ రోజు బూంది ఒక కిలో పావుకిలో బాబాకి నైవేద్యం పెట్టి, పేదలకు పంచండి. మీ ఇబ్బందులు తగ్గిపోతాయి.


డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ

ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చేయండి. అలాగా 8 మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయించండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి. ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యమూ "శ్రీ సూక్తము" పారాయణ చేయవలెను.


హనుమాన్ చాలీసా

హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతవి. అటువంటి కల్పవృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం "హనుమాన్ చాలీసా". ఈ హనుమాన్ చాలీసాను దినమునకు 11 పర్యాయములు చొప్పున మండలం(40 రోజులు) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని 108 పర్యాయములు పఠించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ 3 వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.ఇవి అన్ని సింపుల్ రేమిడిస్ పాటించి మంచి ఫలితాలను పొందండి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

ధార్మికగీత - 97*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 97*

                                    *****

           *శ్లో:- కృపణేన సమో దాతా ౹*

                  *న కశ్చిత్  భువి విద్యతే ౹*

                  *అస్పృశ్య  న్నేవ విత్తాని  ౹*

                  *యః  పరేభ్య:  ప్రయచ్ఛతి౹౹*

                                 *****

*భా:- లోకంలో తాను తినక, పరులకు పెట్టని వాణ్ణి "లోభి" అంటాము. తాను తింటూ,ఇతరులకు పెట్టేవాణ్ణి "దాత" అని కొనియాడతాము. అయితే దాత కంటే లోభిలో ఒక ఉదాత్తమైన గుణం ఉన్నదట. దాత వివిధ ద్రవ్యాలను తన చేతులతో తాకుతూ "తుభ్య మహం సంప్రదదే ! న మమ !" అంటూ శాస్త్రోక్తంగా దానం చేయడం పరిపాటి.  సంప్రదాయం. కాని లోభి జీవితకాలం తినకుండా, ఒకరికి పెట్టకుండా దాచి, దాచి; తనివితీరా చూచుకుంటూ, కాపాడుతూ చివరికి ఏదో ఒకరోజు దొంగల పాలో, దొరలపాలో చేస్తాడు.అంటే వాటిని తన చేతులతో తాకకుండానే దానం చేస్తున్నాడన్నమాట. కాన లోభితో సమాన మైన దాత లోకంలోనే లేడు. దాత తాకి అపవిత్రం చేస్తుండగా, లోభి తాక కుండా పవిత్రంగా,  ఉదాత్తంగా దానం చేస్తున్నాడని సారాంశము. ఒక అవలక్షణాన్ని కూడా సలక్షణంగా నిరూపణ చేయడమే కవి చమత్కారంగా  భావించాలి*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్య.ము

 శ్రీ సత్యనారాయణ  స్వామి  వ్రత మహాత్మ్య.ము


అల్లు డారీతి బలుకగ యనునయమున 

సుంత డెందంబు నందున చింత వీడి 

వెళ్లి వెనువెంట యా యతిన్ వెదుకుటకును 

కాంచి ఱొకచోట యాతని కన్నులార      131


అంత సాధువు సన్యాసి చెంతకేగి 

పాదములు రెండు గట్టిగా పట్టుకొనియు 

కనుల వెంబడి భాష్పముల్ గాఱుచుండ 

యనియె నీరీతి యత్యంత యార్తి తోడ    132



"ధన మదాంధత వలనను దారి దప్పి 

యపహసించితి యవివేకి నయ్యు నేను 

నాదు తప్పులు క్షమియించి నన్ను గాచ

శరణు వేడెద మహితాత్మ! శరణు శరణు"  133


సదమల భక్తితొ వణిజుడు

పదముల పై వ్రాలి యట్లు  ప్రార్ధన సేయన్ 

మది మెచ్చియు పరమాత్ముడు 

గదుముచు మఱి యిట్టు లనియె గాంభీర్యమునన్    

                                                        134       


"వ్రతమును జేసెద ననియును 

ప్రతి సారిటు మాట దప్పి ప్రల్లద వృత్తిన్ 

యతి లోభతనము జూపియు 

వెతలందున పడితివీవు విపరీతమునన్     135


దేవుని కపచారంబున 

యీ విధముగ జరిగె నీకు యెఱుగుము శ్రేష్టీ! 

నీ విక బుద్ధిని గలిగియు 

భావించుము వ్రతముసేయ పావనమదితో"  136


అట్లు పరమాత్మ సాధువు కాన తీయ 

ప్రణతు లర్పించి యాతని పదము లంటి 

తప్పు లెన్నక రక్షించ తరచి వేడి 

ప్రార్థనము జేసె నీరీతి భక్తితోడ            137


"చిద్విలాసా! ప్రభో ! శ్రీ సత్య దేవ ! 

నీ లీల నెన్నంగ నేనెంత వాడ 

జగతి నీ మాయతో జనియించు చుండు 

నిక్క మశక్యంబు నీ మాయ దాట 

బ్రహ్మాది దేవతల్ భవుడు సైతంబు 

యెఱుగరు నీ తత్త్వ మెంత సుంతైన 

సహజ మూధుండనౌ సర్వేశ ! నేను 

భవదీయ మాయలో బంధితు నైతి 

అపరాధములు పెక్కు నాచరించితిని 

మఱువను నీపూజ మాధవా ! యింక 

దయయుంచి నా పూర్వ ధనమును యిచ్చి 

కరుణించి రక్షించు కరుణాంతరంగ 

పాహిమామ్ పాహిమామ్ పరమాత్మ !యీశ !"  138


వణిజు డారీతి  ప్రార్థించ , వరదుడైన 

సత్యనారాయణస్వామి సంతసించి 

కామితార్థంబు దీర్చియు కరుణతోడ 

యంత యంతర్హితుండయ్యె నచటినుండి  139


                                    సశేషము …..


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

Devi





 

. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 31

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 31  / Sri Devi Mahatyam - Durga Saptasati - 31 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 9*

*🌻. నిశుంభ వధ - 1 🌻*


1-2. రాజు (సురథుడు) పలికెను: మహాత్మా! రక్తబీజవధ విషయంలో దేవి చేసిన మహాకార్యాన్ని గూరించి మీరు ఇప్పుడు నాకు తెలిపింది విచిత్రమైనది.


3. రక్తబీజుడు కూల్పబడిన పిదప మిక్కిలి కుపితులైన శుంభ నిశుంభులు ఏమి చేసారో ఇంకా వినగోరుతున్నాను.

 

4-5. ఋషి పలికెను : రక్తబీజుడు కూల్పబడుటను, యుద్ధంలో ఇతరులు కూడా హతులవడాన్నీ, విని శుంభాసురుడు నిశుంభుడు అపారమైన కోపం పొందారు.


6-7. ఆ మహాసైన్యం తెగటార్చబడడం చూసి రోషపూరితుడై అసుర సేనలలో ముఖ్యులతో నిశుంభుడు వేగంగా యుద్ధానికి వెళ్ళాడు. అతని ముందూ, వెనుక, ప్రక్కల మహాసురులు కోపంతో పెదవులను కొరుకుతూ దేవిని చంపడానికి నడిచారు.


8-9. మాతృకలతో యుద్ధం చేసి, పిదప కోపంతో చండికను వధించడానికి, మహావీర్య సంపన్నుడైన శుంభుడు స్వసైన్యపరివేష్టితుడై బయలుదేరాడు. అంతట దేవికి, శుంభ నిశుంభులకూ మహాయుద్ధం ప్రారంభమయ్యింది. వారు మేఘాల వలే అత్యుగ్రమైన శరవర్షాన్ని ఆమెపై కురిపించారు.


10. చండిక వారుప్రయోగించిన బాణాలను తన బాణ సమూహాన్ని త్వరితంగా త్రుంచివేసి, ఆ అసురేశ్వరుల అంగాలను తన శస్త్ర సమూహంతో కొట్టింది.


11. నిశుంభుడు ఒక పదను గల ఖడ్గాన్ని, మెరుస్తున్న డాలును తీసుకుని దేవి యొక్క ఉత్తమవాహనమైన సింహాన్ని తలపై కొట్టాడు.


12. వాహనాన్ని కొట్టడంతోనే దేవి నిశుంభుని ఆ ఉత్తమ ఖడ్గాన్ని ఒక వాడి బాణంతో త్రుంచివేసి, అతని డాలును, ఎనిమిది చంద్రబింబాలు గల దానిని, కూడా త్రుంచివేసింది.


13. డాలును ఖడ్గాన్ని ఛేదింపబడడంతోనే ఆ అసురుడు బల్లెమొకటి ప్రయోగించాడు. తన మీదికి వస్తున్న ఆ బల్లెమును ఆమె తన చక్రంతో రెండుగా ఖండించింది.


14. పొంగిపొరలుతున్న కినుకతో నిశుంభాసురుడు అంతట ఒక శూలాన్ని తీసుకున్నాడు. అది వస్తుండగా దానిని కూడా దేవి పిడికిడి పోటుతో చూర్ణంచేసింది.


15. అంతట అతడు గదను ఆడిస్తూ చండికపై దానిని విసిరింది. దానిని ఆమె త్రిశూలంతో ముక్కలు చేయగా అది బూడిదైపోయింది.


16. ఆ దానవశ్రేష్ఠుడు అంతట గండ్ర గొడ్డలితో తనమీదికి వస్తుండగా దేవి బాణసమూహాన్ని ప్రయోగించి అతన్ని భూమిపై పడజేసింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

పట్టించుకోవద్దు

 "ఇతరులు ఏమనుకుంటున్నారో, ఏమి చేస్తున్నారో, పట్టించుకోవద్దు. నీకున్న సమస్యలు చాలు. మొదట నీలో పరివర్తన తెచ్చుకో, తరువాత ప్రపంచం సంగతి చూడటానికి కావలసినంత సమయముంటుంది. నిన్ను నీవు ఉద్ధరించుకోలేకపొతే, లోకాన్నేం ఉద్ధరించగలవు ?" అనేవారు శ్రీ భగవాన్. శ్రీ రమణులను భక్తులు శ్రీ భగవాన్ అనో, మహర్షి అనో, మరే ఇతర అవతారమూర్తి అనో ఆరాధించినా, మిగిలిన వాళ్ళకి వారు అతి సామాన్యుల వలె కనబడేవారు. కొన్ని వేలమంది నడుమ ఉన్నాకూడా, వారు తమ ఆత్మనిష్ఠలో నిలకడగా ఉండేవారు. ఆ స్థితినుంచి ఏ మాత్రము చలించేవారు కారు. ఒక పోలెండు దేశ వనిత శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చింది. ఆమె అనుభవం ఇది. ఆమె ఒంటరిగా స్కందాశ్రామానికి వెళ్లిందొకసారి. తిరిగి వస్తుండగా ఆమెకి దాహంవేసింది. ఆ దప్పికని తీర్చుకోవటానికి మార్గం తెలియక, ఆమె, "శ్రీ భగవాన్ సర్వవ్యాప్తమన్నమాటే నిజమైతే ఆయన ఈ క్షణాన, ఇక్కడ నాకు కనబడి నా దప్పికని తీర్చకూదడా? అనుకుంది. మరుక్షణం శ్రీ భగవాన్ అక్కడ తన కమండలంలో నీటితో ప్రత్యక్షమై ఆమె దాహాన్ని తీర్చారు. ఇది జరుగుతుండగా శ్రీ భగవాన్ ఆశ్రమంలో తమ స్థానంలోనే కూర్చునేఉన్నారు, గిరిపైన జరుగుతున్న జగన్నాటకం గురించి ఏమీ తెలియనట్టుగా. ఆ పోలెండ్ యువతికి గొప్ప భక్తీ, ప్రేమా ఉన్నాయి. క్రిస్టియన్ కూడా. ఏసుక్రీస్తు వలె మహిమలని ప్రదర్శించగలగినవారు క్రీస్తువంటి వారేనని ఆమె నమ్మకం. ఆమె భక్తికి మెచ్చిన భగవాన్ ఆమె విస్వాసాన్ననుసరించే ఆమెకు దర్శనమిచ్చి ఆమె కోర్కెను తీర్చారు. ఇటువంటి సంఘటనల వల్ల భక్తుల నమ్మకమూ, భక్తీ ఎక్కువ అవుతాయి కాని, అతీంద్రియశక్తులను ప్రదర్శించే ప్రయత్నాలు చేయవద్దని శ్రీ భగవాన్ చెప్పేవారు. అన్నివేళలా ఆత్మని గుర్తుంచుకొమ్మని భక్తులను హెచ్చరించే వారు. విదేశీయుడొకరు, రామణాశ్రమములోని , భోజనశాల బయటపడిఉన్న విస్తళ్ళను ఊడుస్తూండటం చూసి, శ్రీ భగవాన్ "వాడేసిన విస్తళ్ళను ఊడ్వటం ముక్తికి మార్గమా? ఈ తపస్సు చేయటానికేనా ఇంత దూరం వచ్చింది? లోపలికి వెళ్ళు, మనస్సుని పరిశుద్ధం చేసుకోవటమనే పనిలో నిమగ్నమవు. అదే అన్నింటికంటె గొప్పసేవ. అదే నీకు మోక్షమివ్వగలదు" అన్నారు.


శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చిన వారు కొందరు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవారు. అటువంటి ఒక భక్తునితో, "గురువుకి నమస్కారం చేయటంవల్ల అహంకారం నిర్మూలమవుతుంది, అదే ఫలితం. ఆత్మసాక్షాత్కారం ఒళ్ళు వంచటం వల్ల కలుగదు. అహంకారాన్ని వంచాలి" అన్నారు. "లోపల ఉన్న శుద్ధమైన ఎరుకే దయామయమైన గురువు పాదాలు. వాటితో సంపర్కమే మోక్షాన్నివ్వగలదు" అని చెప్పారు.


1924లో ఒక రాత్రివేళ కొందరు దొంగలు ఆశ్రమానికి వచ్చి లోపలికి చొరబడదామని కిటికీల రెక్కలను పగులకొడ్తున్నారు. శ్రీ భగవాన్ , "ఆశ్రమంలోకి రావటానికి అంత శ్రమపడతారెందుకు? తలుపు తెరుస్తాం. మీకు కావలసినది తీసుకువెళ్ళవచ్చు" అన్నారట. తలుపుని తీయించారు కూడా. అయినా దొంగలు శ్రీ భగవాన్ ని భౌతికంగా గాయపరిచారు. ఒక భక్తుడు దీనిని సహించలేక వాళ్ళని తిరిగి కొట్టడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శ్రీ భగవాన్ అడ్డుకొని, "శాంతం! శాంతం! ఇదేంపని? వాళ్ళు దొంగలు, వాళ్ళ వృత్తే దొంగతనం చేయటం. అందుకోసం ఏదైనా చెయ్యటానికి వాళ్ళు సిద్ధమే. మనమా సాధువులం. వాళ్ళు చేసిన చెడు పనులనే మనం కూడా చేస్తే వాళ్ళకీ, మనకీ తేడా ఏమిటి?" అన్నారు. ఆ భక్తుడు శాంతించాడు. తరువాత శ్రీ భగవాన్ "ఎట్టి పరిస్థితుల లోనూ, తమ సన్యాస ధర్మాన్ని సాధువులు విడవకూడదు" అని చెప్పారు.


భగవాన్ అందరికీ, అన్నివేళలా అందుబాటులో ఉండేవారు. వారిని దర్శించటానికి ఎవ్వరి అనుమతీ అవసరమయ్యేది కాదు. ప్రారంభదశలో భక్తులు వారి చుట్టూ పడుకొనేవారు. ఆయన రాత్రివేళల లేచి బయటికి వెళ్ళవలసివస్తే ఆ భక్తుల మధ్య నుంచి ఎంతో జాగ్రత్తగా వెళ్లేవారు. ఒక భక్తుడు ఇచ్చిన టార్చిలైటును ఎంతో బలవంతం మీద భగవాన్ తీసుకున్నారు. కానీ, ఆ టార్చిలైటుని ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా వాడేవారు. రాత్రిళ్లు బయటకు వెళ్ళవలసివస్తే, ఆ లైటును నేలమీద పడేట్టు వేస్తే అక్కడ పడుకున్న వారికి నిద్రాభంగం కలుగుతుందని, పొట్టమీద పడేట్టు చేసుకునేవారు! ఇతరులంటే అంత శ్రద్ధ వారికి.


స్కందాశ్రమంలో ఒక నెమలి శ్రీ భగవాన్ వెంటే తిరుగుతూఉండేది. ఒకనాడు ఒక పెద్ద నల్లత్రాచు ఆశ్రమంలోకి వచ్చింది. నెమలి దాన్ని తీవ్రంగా ఎదుర్కొంది. త్రాచు పడగవిప్పింది. ఇక ఆ సహజ శత్రువులు భీకరపోరాటానికి సంసిద్ధమవుతున్నాయి. శ్రీ భగవాన్ పాము దగ్గరకు వెళ్లి, "ఎందుకు వచ్చావిక్కడికి? నెమలి నిన్ను చంపేస్తుంది, ఇక్కడనుంచి వెళ్ళిపో " అన్నారు. వెంటనే పాము తలదించుకుని వెళ్ళిపోయింది.

మార్కండేయులవారు ఇలా అన్నారు. ద్రవిడ దేశమునందు (దక్షిణ భారతదేశంలో) 'అరుణాచలము' అనే దివ్య క్షేత్రం కలదు. ఈ క్షేత్రం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం యొక్క తేజస్సు దాని చుట్టూ ఉన్న మూడు యోజనాల వరకు వ్యాపించియుండును. ఇది హృదయక్షేత్రం. ఇచట శివుడు పర్వతాకారం దాల్చి ఉన్నాడు. లోకశ్రేయస్సు కొరకు అరుణగిరి యోగి అరుణాచల పర్వతంగా ఆవిర్భవించిన గొప్ప క్షేత్రమే అరుణాచలము. సిధ్ధులు , మహర్షులు , దేవతలు , యక్షులు , గంధర్వులు , అప్సరులు మరియు విద్యాధరులు కొలువుతీరిన గొప్ప క్షేత్రం అరుణాచలం. మేరు పర్వతం, కైలాస పర్వతం, మందరగిరి -- వీటన్నిటి కంటే అరుణగిరి మిక్కిలి గొప్పది. అరుణగిరి వద్దనున్నవారికి మోక్షం సులభంగా అనుగ్రహింపబడును. కావున దేవతలు కూడా అరుణాచలవాసాన్ని కోరుకుంటారు. ఇచట పెరిగే వృక్షాలకు పర్వతాకారంలో కొలువుతీరిన శివుని, తమ ఆకులతో, పండ్లతో , పుష్పాలతో పూజించుకునే పుణ్యోపేతమైన అవకాశం ఉన్నందువలన , అరుణాచలంలో పెరిగే వృక్షాలు స్వర్గంలో ఉన్న కల్పవృక్షాలకంటే కూడా ఎంతో గొప్ప వైశిష్ట్యం గలవని పురాణోక్తి.

వాజివాహనం

 *వాజివాహనం* 🐴🦄🐅🐆


               

              ఏ దేవాలయములోనైనా మూల విరాట్టుకు ( దేవునికి) ఎదురుగా ధ్వజస్థంబము వుంటుంది.  అట్టి ధ్వజస్థంబము మొదట్లో కాని పైన గాని , ఆదేవునికి సంభందించిన వాహనము గాని బంటు ( సేవకుడు) గాని వుంటారు. ఉదాహరణకు: - విష్ణు ఆలయం గరత్మంతుడు, శివాలయంలో నంది, రామాలయంలో హనుమంతుడు వుంటారు. 


               అయ్యప్పస్వామి వారి ఆలయంలో ధ్వజస్థంబముపై స్వామివారి వాహనమైన అశ్వము వుంటుంది. శ్రీ అయ్యప్పస్వామి పులివాహనుడని కీర్తించ బడుతున్నాడు. కాని వారి వాహనము గుఱ్ఱము . వాడుక భాషలో పిలిచే గుఱ్ఱము నకు 1. అశ్వము, 2. హయము, 3. హరి, 4. వాజీ, 5. తురగము అనే పేర్లుకూడా వున్నాయి. 


                     మనిషి యొక్క మనస్సు చంచల స్వభావము కలది. అది విషయవాసనలు, కోరికల వెంట గుఱ్ఱము వలె పరుగులు తీస్తూవుంటుంది. దాని వేగమునకు అంతేలేదు. అది మనకు తెలియకుండానే మన స్వాధీనములో లేకుండా పరుగులు తీస్తూవుంటుంది. 


                      తన స్వాధీనములో లేని గుర్రమును స్వాధీన పరచుకొని, సరియైన మార్గమున , తనకు కావలసిన , తనకు నచ్చిన మార్గమున నడిపించ గలిగినవాడే అసలైన రౌతు. 


                     ఆప్రకారంగా మనస్సు అను గుర్రమునకు స్వామి ( భగన్నామము ) నామము అను కళ్ళెము వేసి , దాని వేగమును నిరోధించి , స్వాధీనపరచుకొని భక్తిమార్గమున నడిపించి స్వామివారిని చేరవలయున్నదే పరమార్ధము. 


                    స్వామివారికి జితేంద్రియుడు అను నామము కూడా వున్నది. జితేంద్రియుడనగా ఇంద్రియము ( పంచజ్ఞానేంద్రియములు +పంచకర్మేంద్రియములు , మనస్సు,బుద్ధి ) లను జయించిన లేక స్వాధీన పరచుకున్న వాడని అర్ధము. 


                   ఇంద్రియములను జయించినవారు ఎవరైనా ( దేవునితో ) స్వామితోసమానము. అనగా భక్తుడు భగవంతుడు ఒక్కటౌతున్నారు . జీవాత్మ పరమాత్మలో కలిసి పోతున్నాడు. కనుక భగవంతునితో , అయ్యప్పస్వామితో సమానంగా స్వామీ అని పిలిపించుకొనుటకు అర్హుడౌ తున్నాడు. 


                    కనుక మనముకూడా మన మనస్సు అను గుఱ్ఱమును స్వాధీన పరచుకొని , స్వామి అనుగ్రహము పొందుటకు, స్వామి సన్నిధిని చేరుకొనుటకు , స్వామీ అని పిలిపించుకొనుటకు సరియైన అర్హతను సంపాదించు కొనుటకు ప్రయత్నం చేద్దాం. స్వామి శరణం.

అతీతమైన శక్తి

 మానవ పరిణామ క్రమము భగవంతుని రూపములో గల అతీతమైన శక్తి. అది పంచభూతాత్మకమైన గాని శక్తి లక్షణము తెలియదు. వక జంతువు మనకు స్వయంగా కంటికి కనబడుతున్నా కూడా అఙ్ఞానం తో అది జంతువుని దానిని సంహారము చేయు ఆలోచనా స్వభావము. అఙ్ఞానమని, దానిని రాక్షసత్వంతో పోల్చుట జరిగినది. రాక్షసత్వంతో అనగా అహంకారము. అహంకారము అనగా మరణం లేకుండా అనగా పంచభూతాత్మకమైన దేహము మీద భ్రాంతి తో మృత్యువు లేని అమృతత్వం సాధించాలని. శరీరం ధాతు పర మైనది కావున అది ఎప్పటికైనా లయం కావాలి. సృష్టికి మూలమైన ధాతువులు లయం చెందుట అనగా మార్పు చెందుట యను లక్షణము కలిగియున్నవి. ధాతు పరమైన దేహము స్థిరమైనదని తెలియుట రావణ కుంభకర్ణు శిశుపాలు దంతవక్త్ర హిరణ్యాక్ష హిరణ్యకశ్యప  యిలా ఎన్నో మానవ రూపంలో గల కృూర మృగ లక్షణము. అన్నీ జంతు సంబంధములే. మానవుడు కూడా విశ్వంలో వక పశువు. ఎందుకనగా ధాతు పరమైనది కావున పశు లక్షణము. ఈ పశువులు అనబడే మానవులకు పతి ఈశవః ఈశ్వర శక్తి. పశుపతి. పశువులను పాటించుట పతి లక్షణము. ప్రజాపతి కూడా. 

దేహముతో శాశ్వతత్వం అసంభవం. అమృతత్వం అసలే అసంభవం. భగవశ్శక్తి కూడా యుగే యుగే అనగా మార్పు చెందవలె. మరి సూపర్ అటామిక్  మార్పు చెందినపుడు ఏమీ తెలియని మానవుడు మార్పుకు లోనుకాకుండా యుండుట అసంభవం. మనిషి జంతువులను సంహరించి భక్షించుట రాక్షసత్వం. వకప్పుడు జంతువులు మనుషులను రాక్షసత్వం కలిగిన వారిని సంహరిస్తే యిప్పుడు రాక్షసత్వం కలిగిన మనుషుల రాక్షసత్వం గుణంతో  వాటిని సంహరిస్తున్నారు. మనకు జంతువులకు ఏమీ తేడా లేదు. మనం కూడా జంతువలవలెనే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాము. మనుషులు రాక్షసులు గా మారుట లయం ప్రళయం. మనుషులు దైవత్వం కలిగియుండుట సృష్టి. దీనిని తెలియుట అగ్రగణ్యం. చైతన్యం ప్రకృతిని నిర్మించుట అమృత తత్వం. జీవ లక్షణం. ఏది కావాలో కోరుట ఙ్ఞానం. ఙ్ఞాని యే అగ్రగణ్యుడు.

మొగలిచెర్ల అవధూత

 *శ్రీ మెంటా మస్తాన్ రావు గారు..*


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మా తల్లిదండ్రులకు (శ్రీ పవని శ్రీధర రావు, నిర్మల ప్రభావతి దంపతులు) పరిచయమయ్యే నాటికే, విజయవాడ వాస్తవ్యులు శ్రీ చక్కగా కేశవులు గారు స్వామి వారిని పరిపూర్ణంగా నమ్మి, భక్తి తో సేవిస్తున్నారు..స్వామి వారు మాలకొండలో తపస్సు చేసుకునే పార్వతీ అమ్మవారి మఠం లో ఓ స్టీలు మంచం ఏర్పాటు చేశారు..తరువాతి కాలంలో శ్రీ కేశవులు గారు, మా అమ్మా నాన్న గార్లకు పరిచయం కావడం , ఆ అనుబంధం చివరి వరకూ కొనసాగడం, ఇప్పుడుకూడా శ్రీకేశవులు గారి అబ్బాయి కృష్ణ , మేమూ సత్సంబంధాలు కలిగి వుండటం ఆ దత్తుడి కృపే..


ఆ కేశవులు గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ రావు గారికి కూడా 1973 ప్రాంతంలో శ్రీ స్వామి వారు కేశవులు గారి ద్వారానే పరిచయం అయ్యారు..వారూ స్వామి వారికి పరమ భక్తులుగా మారిపోయారు..శ్రీ కేశవులు గారు, తమ కూతురు వివాహానికి రమ్మని స్వామి వారిని మరీ మరీ కోరి, మొత్తానికి స్వామి వారు విజయవాడ వచ్చేటట్లు ఒప్పించగలిగారు..


శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉండాటానికి శ్రీ మెంటా మస్తాన్ రావు గారి ఇంట్లో బస ఏర్పాటు చేశారు..ఇది మస్తాన్ రావుగారికి ఊహించని వరం..ఆ దంపతులిద్దరూ పొంగిపోయారు..స్వామి వారు మాత్రం ఎక్కడఉన్నా ఒకేవిధంగా ఉండగలిగే వారు..వారి తపోసాధన కానీ.. ఆహారపుటలవాట్లు కానీ.. ఎటువంటి మార్పు లేకుండా ఉండేవి..శ్రీ మస్తాన్ రావు గారికి ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువ..శ్రీ స్వామివారి సాహచర్యంతో అది మరికొంచెం ఎక్కువ అయింది..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడు తన ఇంటికొచ్చి తనకు ఉపదేశం ఇచ్చినట్లు గా భావించేవారు..శ్రీ మస్తాన్ రావు గారు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా..శ్రీ స్వామివారు తమతో గడిపిన కాలం తాలూకు జ్ఞాపకాలను పదే పదే మాతో చెప్పుకొని తన్మయత్వం చెందేవారు..


"ఇప్పటికీ శ్రీ స్వామివారు మా ఇంట్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుందయ్యా.. మహానుభావుడు..దాదాపు పది రోజులపాటు వున్నాడు..ఎంతో బోధ చేసాడు..మా జన్మ తరించింది!.." అని మా దంపతులతో చెప్పేవారు..


శ్రీ మస్తాన్ రావు గారికి వాస్తు శాస్త్రం మీద అవగాహన ఉంది..తన సందేహాలను స్వామి వారిని అడిగారు..స్వామి వారు తమ ధ్యానం అయిపోయిన తరువాత వారి సందేహాలను నివృత్తి చేసేవారు..శ్రీ స్వామివారి మందిరం లో ఏవైనా మార్పులు చేర్పులు చేసే ముందు మేము కూడా శ్రీ మస్తాన్ రావు గారిని సంప్రదించడం ఒక ఆనవాయితీ..

ఈరోజు మేము మందిరం లో ఉంచిన స్వామి వారి ఫోటో...శ్రీ మస్తాన్ రావు గారి ఇంటిలో తీసినదే..స్వామి వారి అసలు రూపం లో లభ్యమవుతున్న ఒకేఒక్క ఫోటో అదే..


ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు..అదేవిధంగా శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి శ్రీ మెంటా మస్తాన్ రావు గారి దంపతులు మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శిస్తూ ఉన్నారు..మొగలిచెర్ల స్వామి వారిని దర్శించే ఆర్యవైస్యుల సౌకర్యార్థం ఓ అన్నదాన సత్రాన్ని, వసతి గృహాన్ని ఏర్పరచే పధకం లో..స్వామి వారి ఆశ్రమ నిర్మాణ దాత శ్రీ మీరాశెట్టి, చెక్కా కేశవులు గారితో కలిసి చురుకుగా పాల్గొని దానిని పూర్తి చేశారు...


ఎనభై ఏళ్ళు పైబడినా.. ఓపిక చేసుకుని శ్రీ స్వామి వారి మందిరం దర్శించడానికి మళ్లీ ఈమధ్య మొగలిచెర్ల కు వచ్చారు..స్వామి వారి సమాధిని దర్శించుకుని, ఆనాటి అనుభవాలు గుర్తు చేసుకొని, మా దంపతులను ఆశీర్వదించి వెళ్లారు..తమకు ఓపిక ఉన్నంతవరకూ దర్శనానికి వస్తుంటామనీ..ఆ శక్తి శ్రీ స్వామివారు తమకు ఇస్తాడనీ నమ్మకంగా చెప్పి మరీ వెళ్లారు..


శ్రీ స్వామివారి కృపను పరిపూర్ణంగా పొందిన శ్రీ మస్తాన్ రావు గారు గత సంవత్సరం విజయవాడ లోని వారి స్వగృహం లో పరమపదించారు..మాకందరికీ పెద్ద దిక్కుగా ఉన్న శ్రీ మస్తాన్ రావు గారి మరణం మాకు తీరని లోటు..కానీ దైవ నిర్ణయాలను ధిక్కరించలేము కదా..


ఈమధ్యనే శ్రీ మస్తాన్ రావు గారి కుటుంబసభ్యులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, ఆ శనివారం సాయంత్రం జరిగిన పల్లకీసేవ లోనూ..ఆ ప్రక్కరోజు ఆదివారం ప్రభాత సేవ లోనూ పాల్గొన్నారు.."మాకు వీలున్నప్పుడల్లా ఈ మహానుభావుడి సమాధి దర్శనం చేసుకుంటామండీ.." అని మస్తాన్ రావు గారి సతీమణి చెప్పారు..వారి కుటుంబానికి ఆ దత్తాత్రేయుడి ఆశీస్సులే రక్ష..!!


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



ఉదర పోషణక్రియే యుదయాస్త మానంబు

             మదియందు దలచుచు మానకుండ

తిరిగితి నిరతంబు సిరిమంతు లింటికి

              యర్థంబు కొఱకునై వ్యర్థ ముగను

మాయాంధ కారాన మగ్నుండ నగునేను

               భవసేవ నెఱుగక బ్రతికి యుంటి

పూర్వ జన్మాంతర పుణ్యంబు కతనను

                నీవు నా డెందాన నిల్చి నావు

అట్టి హేతువు చేనైన యభవ ! నన్ను

తప్పకను నీవె రక్షించ దగును స్వామి ! 

కరుణ జూపుచు  నాపైన గరళ కంఠ !

నీదు సాన్నిధ్య మోసగుచు నిలువ నిమ్ము.    57#



క్షితి నభో వ్యాప్తమై.  చీకట్ల నెల్లను

           పారద్రోలుచు నుండు భాస్కరుండు

యగుపించు చున్నాడు యంబరంబందున

          ప్రత్యక్ష మూర్తి యై పలువురికిని

కోటి సూర్య ప్రభల్ గూడిన నీవేల

            సాక్షాత్క రించవు శర్వ ! నాకు ?

అరయ నాలో నున్న యజ్ఞాన తిమిరమున్

            తొలగించ జాలవే ? తలచితేని

పార్వతీ నాథ ! సర్వేశ ! భవ విదూర !

నాదు యజ్ఞాన మంతయు నాశ పరచి

దివ్య దర్శన మిచ్చియు భవ్య పురుష !

నిండు యభయంబు నిడి ప్రసన్నుండ వగుము.  58 .   



      ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

నక్షత్ర దర్శనం

 🌹🌺🌸🥀🌷💐


*కార్తికంలో నక్షత్ర దర్శనం ప్రాధాన్యం ఏమిటి?*


*కార్తికమాసంలో నక్షత్ర కూటమిని విరాట్ పురుషునిగా భావించి ఆరాధించాలి ఈ నక్షత్ర పురుషునికి కృత్తిక కటిస్తానం. మూల నక్షత్రం పాదాలు. రోహిణి తొడలు. అశ్వని మోకాళ్లు, పూర్వాషాడ, ఉత్తరాషాడ పిరుదులు. ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి నక్షత్రాలు మర్మస్థానాలు. ఉత్తరాబాధ్ర, పూర్వాభాద్ర నక్షత్రాలు భుజాలు. రేవతి కుక్షి. అనురాధ వక్షస్థలం. విశాఖ ముంజేతులు హస్త చేతులు. పునర్వసు వేళ్లు. జ్యేష్ఠ కంఠం. పుష్యమి ముఖం. భరణి శిరస్సుగా మారిపోతాయి. కార్తిక మాసంలో నక్షత్ర పురుష పూజ అంటే విశాల విశ్వారాధనగా భావించాలి*


*నక్తవ్రతం చేయాల్సిన రోజులు : కార్తిక సోమవారాలు పూర్తి ఉపవాసం చేయాల్సిన రోజులు : కార్తిక ఏకాదశి తిథులు, పౌర్ణమి.*


                   *భక్తి*

                  M.s.s.k

గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి

 🌹🌾🌺🌸🥀🌷💐


*గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి దీపారాధన ఎలా చేయాలి?*


*రవిగ్రహ దోష నివారణకు కుంకుమ వర్ణంలోని వత్తులను, ఆవునేతిని ఉపయోగించాలి.*


*చంద్ర గ్రహ దోషం పోగొట్టుకోవడానికి తెల్లవత్తులు రెండింటిని నేతిలో ముంచి వెలిగించాలి.*


*కుజ గ్రహదోషానికి ఎరుపురంగులోని మూడు వత్తులను, నువ్వుల నూనెను వాడాలి.*


*బుధగ్రహానికి సంబంధించి తెల్లజిల్లేడు వత్తులను నాలుగింటిని ఎర్రటి ప్రమిదెలో తమలపాకు వేసి వెలిగించాలిఇందులో  దీపారాధనకు గాను కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.*  


*గురుగ్రహానికి అయిదు తామర వత్తులను ఆవునేతిని ఉపయోగించాలి.*


*శుక్రగ్రహానికి ఆరు తామర వత్తులు వినియోగించాలి.*


*శనిగ్రహానికి ఏడు నల్లని వత్తులను ఇనుప ప్రమిదెలో నువ్వులనూనెతో వెలిగించాలి.*


*రాహుదోషానికి నలుపు వర్ణం కలిగిన ఎనిమిది వత్తులను నిమ్మకాయ డొప్పలో వెలిగించాలి. దీపారాధనలో అష్టమూలికా తైలాన్ని వినియోగించాలి.*


*కేతుగ్రహానికి తెల్లజిల్లేడు వత్తులు తొమ్మిదింటిని కొబ్బరి నూనెతో వెలిగించాలి.*


                   *భక్తి*

                  M.s.s.k