మానవ పరిణామ క్రమము భగవంతుని రూపములో గల అతీతమైన శక్తి. అది పంచభూతాత్మకమైన గాని శక్తి లక్షణము తెలియదు. వక జంతువు మనకు స్వయంగా కంటికి కనబడుతున్నా కూడా అఙ్ఞానం తో అది జంతువుని దానిని సంహారము చేయు ఆలోచనా స్వభావము. అఙ్ఞానమని, దానిని రాక్షసత్వంతో పోల్చుట జరిగినది. రాక్షసత్వంతో అనగా అహంకారము. అహంకారము అనగా మరణం లేకుండా అనగా పంచభూతాత్మకమైన దేహము మీద భ్రాంతి తో మృత్యువు లేని అమృతత్వం సాధించాలని. శరీరం ధాతు పర మైనది కావున అది ఎప్పటికైనా లయం కావాలి. సృష్టికి మూలమైన ధాతువులు లయం చెందుట అనగా మార్పు చెందుట యను లక్షణము కలిగియున్నవి. ధాతు పరమైన దేహము స్థిరమైనదని తెలియుట రావణ కుంభకర్ణు శిశుపాలు దంతవక్త్ర హిరణ్యాక్ష హిరణ్యకశ్యప యిలా ఎన్నో మానవ రూపంలో గల కృూర మృగ లక్షణము. అన్నీ జంతు సంబంధములే. మానవుడు కూడా విశ్వంలో వక పశువు. ఎందుకనగా ధాతు పరమైనది కావున పశు లక్షణము. ఈ పశువులు అనబడే మానవులకు పతి ఈశవః ఈశ్వర శక్తి. పశుపతి. పశువులను పాటించుట పతి లక్షణము. ప్రజాపతి కూడా.
దేహముతో శాశ్వతత్వం అసంభవం. అమృతత్వం అసలే అసంభవం. భగవశ్శక్తి కూడా యుగే యుగే అనగా మార్పు చెందవలె. మరి సూపర్ అటామిక్ మార్పు చెందినపుడు ఏమీ తెలియని మానవుడు మార్పుకు లోనుకాకుండా యుండుట అసంభవం. మనిషి జంతువులను సంహరించి భక్షించుట రాక్షసత్వం. వకప్పుడు జంతువులు మనుషులను రాక్షసత్వం కలిగిన వారిని సంహరిస్తే యిప్పుడు రాక్షసత్వం కలిగిన మనుషుల రాక్షసత్వం గుణంతో వాటిని సంహరిస్తున్నారు. మనకు జంతువులకు ఏమీ తేడా లేదు. మనం కూడా జంతువలవలెనే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాము. మనుషులు రాక్షసులు గా మారుట లయం ప్రళయం. మనుషులు దైవత్వం కలిగియుండుట సృష్టి. దీనిని తెలియుట అగ్రగణ్యం. చైతన్యం ప్రకృతిని నిర్మించుట అమృత తత్వం. జీవ లక్షణం. ఏది కావాలో కోరుట ఙ్ఞానం. ఙ్ఞాని యే అగ్రగణ్యుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి