🌹🌾🌺🌸🥀🌷💐
*గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి దీపారాధన ఎలా చేయాలి?*
*రవిగ్రహ దోష నివారణకు కుంకుమ వర్ణంలోని వత్తులను, ఆవునేతిని ఉపయోగించాలి.*
*చంద్ర గ్రహ దోషం పోగొట్టుకోవడానికి తెల్లవత్తులు రెండింటిని నేతిలో ముంచి వెలిగించాలి.*
*కుజ గ్రహదోషానికి ఎరుపురంగులోని మూడు వత్తులను, నువ్వుల నూనెను వాడాలి.*
*బుధగ్రహానికి సంబంధించి తెల్లజిల్లేడు వత్తులను నాలుగింటిని ఎర్రటి ప్రమిదెలో తమలపాకు వేసి వెలిగించాలిఇందులో దీపారాధనకు గాను కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.*
*గురుగ్రహానికి అయిదు తామర వత్తులను ఆవునేతిని ఉపయోగించాలి.*
*శుక్రగ్రహానికి ఆరు తామర వత్తులు వినియోగించాలి.*
*శనిగ్రహానికి ఏడు నల్లని వత్తులను ఇనుప ప్రమిదెలో నువ్వులనూనెతో వెలిగించాలి.*
*రాహుదోషానికి నలుపు వర్ణం కలిగిన ఎనిమిది వత్తులను నిమ్మకాయ డొప్పలో వెలిగించాలి. దీపారాధనలో అష్టమూలికా తైలాన్ని వినియోగించాలి.*
*కేతుగ్రహానికి తెల్లజిల్లేడు వత్తులు తొమ్మిదింటిని కొబ్బరి నూనెతో వెలిగించాలి.*
*భక్తి*
M.s.s.k
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి