1, డిసెంబర్ 2020, మంగళవారం

అజీర్తి విరోచనాలు చక్కటి పరిష్కారం.

అజీర్తి విరోచనాలు చక్కటి పరిష్కారం. 

కరివేపాకు మాత్ర 

మనం ఏదో ఒక సారి ఈ రకమైన అనారోగ్య సమస్యతో బాధ పడుతూవుంటాము. ఎక్కడైన హోటళ్లలో తిన్న, లేక ఏదయినా పార్టీలో సమయం కానీ సమయంలో అనేక పదార్ధాలు తిన్న మనకు అవి వెంటనే జీర్ణం కాకుండా అజీర్తి చేసి దానివల్ల కడుపులో నొప్పి, గ్యాసు, తరువాత విరోచనాలు కలుగుతాయి.  ఇది సర్వ సాధారణం. దానికి మనం జెలిసెల్ మొదలైనవి వాడుతాము. కానీ ఏమాత్రం ఉపశమనం కలుగదు.  ఈ రోజు మీకు ఈ సమస్యకు ఒక చక్కటిపరిష్కారం  తీసుకొని వచ్చాను. మీరు చాల సురక్షితంగా ఈ మందు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా మీవంట ఇంటిలోనే దొరికే వాటితో 4 నిముషాలలో తయారు చేసుకోవచ్చు. మరియు వెంటనే ఉపశమనం పొందవచ్చు. 

కావలసిన పదార్ధాలు. 

1. ఒక గుప్పెడు కరివేపాకులు 

2.  రెండు లేక మూడు  మిరియాలు, 

3.  రెండు మూడు ఉప్పు రాళ్లు ( రాళ్ల ఉప్పు లేకపోతె అర చిటికెడు మెత్తటి ఉప్పు)\

తయారుచేసే విధానం. ముందుగా కరివేపాకులను చక్కగా మంచి నీటిలో కడుక్కొని వాటిని ఒక కలవం లో వేసి మెత్తగా దంచండి. ఒకటి లేక రెండు చుక్కల నీటిని కలపండి. నీరు ఎక్కువ కలుపకూడదు. అప్పుడు అది ఒక పేస్టు లాగ అవుతుంది. దానితో  మిరియాలు ఉప్పు కూడా కలిపి మెత్తగా కలయ నూరండి. మీదగ్గర కలవం లేకపోతె కలవరపడనవసరం లేదు రోట్లో కానీ లేక చిన్న మిక్సీ జారులో కానీ నూరుకోవచ్చు.  ఏది లేకపోతె ఒక గుండ్రాయిని తీసుకొని ఒక రాయిమీద నూరుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక కుంకుడు గింజ పరిమాణంలో ఆ పేస్టు తయారు అవుతుంది దానిని తీసుకొని  నములుతూ మింగండి.  తరువాత కొద్దిగా నీళ్లు తాగండి ఈ మిశ్రమం చక్కగా ఉప్పుప్పగా కారం కారంగా రుచిగా ఉంటుంది. దీనిని కొంచం తక్కువ మోతాదులో చిన్న పిల్లలకు కూడా వాడ వచ్చు.  ఈ మందు తీసుకున్న పది నిముషాలలో మీకు మీ అజీర్తి విరోచనాలు తగ్గుతాయి. 

ఒక వేళ మీకు చాలా తీవ్రంగా విరోచనాలు అవుతుంటే సాయంత్రం ఇంకొక మాత్ర వేసుకోండి. సహజంగా మీకు రెండవ డోసు తీసుకునే అవసరం  ఉండదు.  మొదటి డోసు తోటె మీరు పూర్తీగా కోలుకుంటారు. 

గమనిక:  మీరు దీనిని అనవసరంగా ఎక్కువగా తీసుకోవద్దు.  మోతాదుకన్నా ఎక్కువగా ఏది తీసుకున్న దాని దుష్ప్రభావం ఉంటుంది.  ఈ మందు ఎక్కువగా తీసుకుంటే మీకు విరోచనాలు పూర్తిగా ఆగిపోవటం మాత్రమే కాకుండా మీకు వేడి చెస్తుంది అంతే కాకుండా మల బద్ధకం కలుగ వచ్చు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని తగు మోతాదులో వాడితే మీకు ఈ మందు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. 

పిల్లలకు వారి వయస్సుని పట్టి కొద్దిపాటి మోతాదులో మందు వాడండి.  సత్ఫలితాలని పొందండి.

ఇంకొక ఆరోగ్య పరిష్కారంతో మరల కలుద్దాము. 

ఇట్లు 

మీ సి. భార్గవ శర్మ 

సర్వ్యే జానా సుఖినోభవంతు. 

ఓం శాంతి శాంతి శాంతిహి  


 



 

కామెంట్‌లు లేవు: