🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 97*
*****
*శ్లో:- కృపణేన సమో దాతా ౹*
*న కశ్చిత్ భువి విద్యతే ౹*
*అస్పృశ్య న్నేవ విత్తాని ౹*
*యః పరేభ్య: ప్రయచ్ఛతి౹౹*
*****
*భా:- లోకంలో తాను తినక, పరులకు పెట్టని వాణ్ణి "లోభి" అంటాము. తాను తింటూ,ఇతరులకు పెట్టేవాణ్ణి "దాత" అని కొనియాడతాము. అయితే దాత కంటే లోభిలో ఒక ఉదాత్తమైన గుణం ఉన్నదట. దాత వివిధ ద్రవ్యాలను తన చేతులతో తాకుతూ "తుభ్య మహం సంప్రదదే ! న మమ !" అంటూ శాస్త్రోక్తంగా దానం చేయడం పరిపాటి. సంప్రదాయం. కాని లోభి జీవితకాలం తినకుండా, ఒకరికి పెట్టకుండా దాచి, దాచి; తనివితీరా చూచుకుంటూ, కాపాడుతూ చివరికి ఏదో ఒకరోజు దొంగల పాలో, దొరలపాలో చేస్తాడు.అంటే వాటిని తన చేతులతో తాకకుండానే దానం చేస్తున్నాడన్నమాట. కాన లోభితో సమాన మైన దాత లోకంలోనే లేడు. దాత తాకి అపవిత్రం చేస్తుండగా, లోభి తాక కుండా పవిత్రంగా, ఉదాత్తంగా దానం చేస్తున్నాడని సారాంశము. ఒక అవలక్షణాన్ని కూడా సలక్షణంగా నిరూపణ చేయడమే కవి చమత్కారంగా భావించాలి*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి