26, సెప్టెంబర్ 2020, శనివారం

: *ఆచార్య సద్భోదన

*




మన హృదయంలో నిజమైన ప్రేమ ఉంటే మనమెప్పుడూ విషాదాన్ని చెందము.




భగవంతునికి సన్నిహితంగా ఉండగలిగేవారు సంతోషంగా కాక మరెలా ఉండగలరు.




అచంచల భక్తి, విశ్వాసాలను నిలుపుకోకపోతే మన అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని దూరం చేసుకుంటాం.




మనలో ప్రశ్నలు, సందేహాలు ఉండకూడదు.




ప్రేమ, విశ్వాసాలతో సాగుతూ ఎటువంటి ఎదురు ప్రశ్నలు లేకుండా ఉండగలిగితే మహోన్నత శాంతి మనకు లభిస్తుంది.




ఆ శాంతికి ఎటువంటి గాయాలనైనా మాన్పగల అద్భుత శక్తి ఉంది.




అది ఉల్లాస పరుస్తుంది, ఉత్తేజాన్నిస్తుంది, అంతేకాదు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.




సర్వేజనా స్సుఖినోభవంతు.




*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

: *శత శ్లోకీ రామాయణము* *(64)*



*రాఘవప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమమ్*


*దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభమ్*




ఆ సమయంలో రాముని బల పరాక్రమాలు తెలుసుకోదలచి సుగ్రీవుడు పర్వతమంత ఉన్న దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని రామునికి చూపించాడు. (దుందుభి వాలిచే హతుడై దూరంగా విసిరి వేయబడ్డాడని తెల్పి, వాలి అంత బలసంపన్నుడని సుగ్రీవుడు రామునికి స్ఫురింపజేశాడు.)




*జై శ్రీరామ్*

*శ్రీ కృష్ణ శతకము* *(46)*



*వలపులతేజీ నెక్కియు*


*నిలపై ధర్మంబు నిలుప! హీనుల దునుమన్*


*కలియుగము తుదిని వేడుక*


*కలికివిగా నున్న లోక! కర్తవు కృష్ణా!*




ఓ కృష్ణా! భూలోకమున ఆకర్షణీయమైన గుర్రమును అధిరోహించి దుష్టులను సంహరించి ధర్మమును నిలబెట్టుటకై కలియుగాంతమున వచ్చు కల్కి అవతారముగా ఉన్న లోకములను సృష్టించినవాడవు నీవే.




*జై శ్రీకృష్ణ*

: *జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్

*




సందేహం;- ప్రసిద్ధ విదుర నీతిలో విద్యను గురించి, విద్యార్థులను గురించి ఏమైనా చెప్పబడిందా?




సమాధానం;- మహాభారతంలో లాగే, విదురనీతిలో గూడ చెప్పని విషయం లేదు.




*సత్యేన రక్ష్యతే ధర్మః విద్యా యోగేన రక్ష్యతే*


*మృజయా రక్ష్యతే రూపం కులం వృత్తేన రక్ష్యతే*




ధర్మం సత్యం చేత రక్షింపబడుతుంది. విద్య అభ్యాసం చేత రక్షింపబడుతుంది. విద్య మనసుకు వివేక వికాసాలను కలిగిస్తుంది. అరగదీస్తున్న గంధపు చెక్క చక్కని సువాసనల్ని వెదజల్లినట్లు అభ్యాసంతో కూడిన విద్య కీర్తి ప్రఖ్యాతులను దశదిశలకు విస్తరింపజేస్తుంది. ఒంటికి నలుగుపెట్టుకొనడం చేత రక్త ప్రసరణ బాగా జరిగి, శరీరం ఆరోగ్యాన్ని కాంతిని పొందుతుంది. అలాగే వంశం మంచి ప్రవర్తన చేత రక్షింపబడుతుంది అంటాడు విదురుడు.




*ఆలస్యం మదమోహౌచ చాపలం గోష్ఠిరేవచ*


*స్తబ్ధతాచాభి మానిత్వం తధా అత్యాగి త్వమేవచ*


*ఏతైవై సప్తదోషాన్యుః సదా విద్యార్థి నాం మతాః*




ఆలస్యం, అహంకారం, చంచలత్వం, అదన (అనవసర) ప్రసంగం స్తబ్ధత్వం అభిమానం (గర్వం), లోభం అనే ఏడు దోషాలు విద్యా సంపాదనకు ఆటంకాలని విదురుని ఉపదేశం.




*అశుశ్రూషా, త్వరా, శ్లాఘా విద్యాయాః శత్రవంత్రయః* 




గురు సేవా రాహిత్యం, తొందరపాటుతనం, ఆత్మస్తుతి అనే ఈ మూడు విద్యకు శత్రువులని విదుర ఉపదేశామృతం.  




*శుభంభూయాత్*

: *శత శ్లోకీ రామాయణము* *(62,63)*



*ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి*


*వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః*


*సుగ్రీవః శంఖితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే*




అంతా విని వాలిని వధిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. శ్రీరాముని బలపరాక్రమాల పట్ల వానరుడైన సుగ్రీవునకు సంశయం ఉండటంచే, అతడు వాలి బల విశేషాలను వివరించి చెప్పాడు.




*జై శ్రీరామ్*

*ఆచార్య సద్భోదన

 *




మనః పూర్వకంగా చేసిన ఏ కార్యమైనా ఇబ్బడి ముబ్బడిగా ఫలితాలను అందిస్తుంది. మనస్సు పూర్తిగా లగ్నం చేయకుంటే అది భక్తి అనబడదు. లెక్కలు కట్టే గుణం భక్తిలో కనిపించదు. వ్యాపార ధోరణి ఇసుమంత ఉన్నా అది ఆధ్యాత్మికత అనబడదు. దానిని భక్తి అని పరిగణించలేం. మోటుగా మతాన్ని గ్రహిస్తే మానవుడు భయం చేత ప్రార్థించవచ్చు. సర్వ శక్తిమంతమైన భగవంతుని కరుణ లేనిచో ఏదైనా కీడు వాటిల్ల వచ్చని భయపడి మోకాళ్ళపై సాగిలపడి తప్పులను మన్నించమని ప్రార్థిస్తాడు. కాని నిజమైన భక్తుడు ప్రేమతో, అణకువతో మోకరిల్లి ఉపాసిస్తాడు.




సర్వేజనా స్సుఖినోభవంతు.




*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సుందరకాండ - తొమ్మిదవ సర్గ* *(06,07)*

 :


రావణుని భార్యలైన రాక్షస స్త్రీలతోనూ, అతడు చెరబట్టి తెచ్చిన రాజకన్యలతోనూ ఆ భవనం నిండి ఉంది. ఏనుగులు, రక్షక భటులతో కూడుకొన్న ఆ భవనం, మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలాలు, పాములు తిరుగాడుతూ, పెనుగాలులు వీస్తూ ప్రచండంగా ఉన్న సముద్రాన్ని పోలి ఉంది.




*(08)*


కుబేరునికి ఎంత ఐశ్వర్యం ఉందో, ఆకుపచ్చ గుర్రాలు పూన్చిన రథం వాహనంగా గల ఇంద్రునికి ఎంత ఐశ్వర్యం ఉందో, అంతటి ఐశ్వర్యం స్థిరంగా ఆ రావణుని గృహంలో కొలువై ఉంది.




*(09)*


రావణుని గృహంలోని సంపత్సమృద్ధి, యక్షాధిపతియైన కుబేరుని, యముని, వరుణుని సమృద్ధితో తులతూగుతుంది. కాదు వాటిని మించినదని చెప్పడం సత్య దూరం కాదేమో.




*(10)*


రావణుని భవన మధ్య భాగంలో, మత్తగజాల ఆకృతిలో రూపొందిన అనేక శిఖరాలతో కూడుకొని, చక్కగా నిర్మితమైన ఒక భవనం (పుష్పకం) వాయుపుత్రుడైన హనుమంతుని కంటబడింది.




*జై శ్రీహనుమాన్*

: *ఓం నమో భగవతే వాసుదేవాయ

*




కలహాలు పెట్టి కడుపు నింపుకొనేవాడుగా నారదుడిని చిత్రించి, వినోదించడం మనకు అలవాటు అయింది. కాని నారద మహర్షి వేటికి మధ్య, ఎవరెవరికి మధ్య తగవులు పెడతాడు? తెలుసుకోవాలి.




ధర్మంతో అధర్మము, సత్యంతో అసత్యము తలపడేట్లు జేసి, అటు లీలా విభూతికీ (ఈ లోకం) నిత్య విభూతికీ (పరమ పదం) అధిపతి అయిన పరమాత్మ లీలలకు పూర్వ రంగం ఏర్పరచడం, ఉపకరణాలను సమకూర్చడం, ఆ లీలల్లో సహాయపడటం నారద మహర్షి వంటి మహనీయులు జగత్కల్యాణం కోసం చేస్తుంటారు. ఇందులో వారి స్వార్థం ఏమీ ఉండదు. అన్ని యుగాల్లో, అన్ని లోకాల్లో, అన్ని సమాజాల్లో, అన్ని కార్యాల్లో నారద మహర్షి నిరాటంకంగా ప్రవేశించి పనులు చక్కబెడుతూంటారు.




నారదుణ్ణి దేవతలే కాదు రాక్షసులు కూడా గౌరవిస్తారు. హిరణ్య కశిపుని భార్య నారద మహర్షి ఆశ్రమంలో తలదాచుకోవడం క్షేమమని భావిస్తుంది. వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధృవుడు మున్నగు మహా పురుషుల్ని, మహా భక్తుల్ని నారదుడే తయారుచేశాడు.




త్రిలోక సంచారిగా వీణా తంత్రుల్లో నారాయణ నామాన్ని పలికిస్తూ, పరమాత్మ గుణానుభవంలో తన్మయత్మం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేస్తూండే నారద మహర్షి *భక్తి సూత్రాలు* గూడా రచించి వినుతికెక్కాడు.




*శుభంభూయాత్*

*శత శ్లోకీ రామాయణం

  *




*(61)*


*తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి*


*రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ*




ఆ తర్వాత వానర రాజైన సుగ్రీవుడు తనకూ వాలికీ నెలకొన్న వైరాన్ని గూర్చి దుఃఖిస్తూ, స్నేహ భావంతో శ్రీరామునికి యావత్తు తెలియజేశాడు.




*జై శ్రీరామ్*

ఆచార్య సద్భోదన

*




అభ్యాస పూర్వక భక్తి మనలో శక్తి సమృద్ధిని కలిగిస్తుంది. ఇప్పుడు అసాధ్యాలుగా భావించే వాటిని ఆ శక్తి ద్వారా సుసాధ్యాలు చేయవచ్చు. ఒక్కోసారి మనకు ఆధ్యాత్మిక పరిపక్వత అందనంత దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దానిని పొందగలమా అనే సందేహం కూడా కలుగుతుంది. కానీ ఒక్కసారి సరియైన జ్ఞానం కలిగితే మనలోని సందేహాలన్నీ చెల్లాచెదరై పోతాయి. అయితే మనం జ్ఞానానికి వ్యతిరేక దిశలో ఉంటే దానిని పొందలేం. కానీ సవ్య దిశలో ప్రయాణిస్తే తప్పక దాని ప్రకాశాన్ని చూడగలం. నిర్భీతితో, మనః పూర్వక భక్తితో ముందుకు సాగితే పరమావధిని తప్పక చేరుకోగలం.




సర్వేజనా స్సుఖినోభవంతు.




*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*శ్రీ కృష్ణ శతకము* *(44)*



*ఘనులగు ధేనుక ముష్టిక*


*ధనుజుల చెండాడితౌర! తగ భుజశక్తిన్*


*అనఘాత్మ! రేవతీపతి*


*యనగ బలరామమూర్తి! వైతివి కృష్ణా!*




ఓ కృష్ణా! బలరామ అవతారమును ధరించి, రేవతీపతిగా పేర్కొనబడి, నీ గొప్పదైన భుజ బలముచేత ధేనుక ముష్టిక రాక్షసులను జంపిన మహానుభావుడవు నీవే కదా.




*జై శ్రీకృష్ణ*

*సుందరకాండ - తొమ్మిదవ సర్గ* *(01)*



వాయునందనుడైన హనుమంతుడు శ్రేష్ఠమైన ఆ భవన సముదాయం నడుమ, విస్తృతమైన ఒక భవన శ్రేష్ఠాన్ని చూశాడు.




*(02)*


రాక్షసేంద్రుడైన రావణుని ఆ భవంతి అర యోజనం వెడల్పు ఒక యోజనం పొడవు గలదై అనేక ప్రాసాదాలతో కూడినదై అలరారుతోంది.




*(03)*


విశాలమైన నేత్రాలు గల విదేహరాజు జనకుని కుమార్తెయైన సీతాదేవి కోసం శత్రు సంహారకుడైన హనుమంతుడు ఆ మందిరం యావత్తూ అన్వేషిస్తూ తిరిగాడు.




*(04,05)*


తర్వాత శ్రీమంతుడైన హనుమంతుడు అనేక మంది రాక్షసుల గృహాలను పరిశీలించి చూసి చివరగా రాక్షస రాజైన రావణుని నివాస భవనంలోకి ప్రవేశించాడు. ఆ భవనంలో అన్ని చోట్లా రెండు దంతములున్న ఏనుగులు, మూడు దంతాలు గల ఏనుగులు, నాలుగు దంతాల ఏనుగులు నిలబడి ఉన్నాయి. అ భవనాన్ని ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉన్న రాక్షసులు సదా సర్వదా పరిరక్షిస్తూన్నారు. అయినప్పటికీ ఆ భవనం విశాలంగానే కావస్తున్నది.




*జై శ్రీహనుమాన్*

*శత శ్లోకీ రామాయణము* మ *(60)*

 :


*సుగ్రీవాశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః*


*చకార సఖ్యం రామేణ పీతశ్చైవాగ్నిసాక్షికమ్*




వానరుడైన సుగ్రీవుడు రాముని వృత్తాంతం ఆసాంతం ఆలకించి ఆయన పట్ల ఆదరంతో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకొన్నాడు.




*జై శ్రీరామ్*

శ్రీ నరసింహ శతకము* *(100)*



*శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమై చెలగుచుండు*


*నే మనుజుడైన నెలమి నీ శతకంబు భక్తితో విన్న సత్ఫలము గలుగు*


*జెలగి ఈ పద్యముల్ జేర్చి వ్రాసినవారు కమలాక్షు కరుణను గాంతురెపుడు*


*నింపుగా పుస్తకం బెపుడు పూజించిన దురితజాలంబులు దొలగిపోవు*


*నిద్ధి పుణ్యకరంబని యెపుడు జనులు గష్టమనక పఠించిన గలుగు ముక్తి*


*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*




శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.




తండ్రీ! శేషప్ప చెప్పిన ఈ ఆనంద పద్యాలు చెవులకు ఇంపుగా ఉంటాయి. ఈ శతకాన్ని భక్తితో విన్నవారికి సత్ఫలు వస్తాయి. ఈ పద్యములను లిఖించివారు కమలాక్షుని కరుణకు పాత్రులవుతారు. ఈ గ్రంథమును పూజించిన వారికి పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. పుణ్యప్రదమైన ఈ శతకమును కష్టమనుకోకుండా నిత్యము పఠించువారికి ముక్తి కలుగుతుంది.


*(శ్రీశేషప్ప కవి గారి శ్రీనరసింహ శతకము సమాప్తం)*




*జై శ్రీనారసింహా*

ఆచార్య సద్భోదన*


నిస్వార్థ ప్రేమ ద్వారా ఉన్నత స్ఫూర్తి, జ్ఞానం కలుగుతాయి. మనమంతా జీవితంలో ఉన్నతమైనది ఏదో సాధించాలనే తపనతో ఉంటాం. మన భావాలు ఉన్నతంగా విస్తరించే వేళకై, మన జీవితాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దే క్షణానికై ఎదురుచూస్తూ ఉంటాం. పరమమైన సత్యాన్ని కనుగొనేదాకా మానవులు తృప్తి చెందలేరు. "నేను, నాది" అనే మమత్వ భావాల మత్తులో ఉన్న మనకు మనం భగవంతుని నుండి వేరుగా ఉన్నామనే భావన కూడా అజ్ఞానం వల్లనే కలుగుతుంది. విశ్వజనీనమైన శక్తిలో భాగస్థులమని గుర్తించగలిగితే మనలోని అల్పత్వపు పరిధులు, ద్వైత భావన అదృశ్యం అవుతాయి.




సర్వేజనా స్సుఖినోభవంత

*సుందరకాండ - ఎనిమిదవ సర్గ*

 




*(06)* విశిష్ట రీతుల్లో నిర్మితమైనదవడం వలన ఆ విమానం రూపంలో విశిష్టతను సంతరించుకొంది. అనేక శిఖరాలతో కూడుకొన్నదై, చూడడానికి విచిత్రంగా కనిపిస్తూన్నది. మనోహరంగా, శరత్కాల చంద్రుని మల్లే నిర్మలంగా చిన్నచిన్న శిఖరాలు గల మహాపర్వత శిఖరంలా ఉన్న ఆ పుష్పకాన్ని హనుమంతుడు చూశాడు.




*(07)* కుండలాలతో శోభిస్తూన్న ముఖాలు గలవారూ, మహాకాయులూ, గగన విహారులూ అయిన రాక్షసులూ, గుండ్రని వంకర విశాలమూ అయిన కళ్ళు గల మహావేగవంతమైన వేలకొద్దీ భూతాలూ మోస్తూ ఉన్నట్లున్న పుష్పక విమానాన్నీ హనుమంతుడు చూశాడు.




*(08)* వసంత ఋతువులో పూచే పుష్పరాసులచే మనోజ్ఞమై, వసంత మాసంకన్నా రమ్యమై ఒప్పారుతున్న ఆ పుష్పక విమానాన్ని వానర వీరులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు చూశాడు.




(శ్రీమద్వాల్మీకి రామయణమునందలి సుందరకాండలోని ఎనిమిదవ సర్గ సమాప్తం)




*జై శ్రీహనుమాన్*

శ్రీకృష్ణశతకము* *(43)*

 

*దశకంఠుని బరిమార్చియు*

*కుశలముతో సీత దెచ్చి! కొనియు నయోధ్యన్*

*విశదముగ కీర్తి నేలితి*

*దశరథరామావతార! ధన్యుడ! కృష్ణా!*


ఓ కృష్ణా! నీవు శ్రీరామావతారం ఎత్తి దశరథ పుత్రుడుగా జన్మించి, పది తలలు గల రావణుని చంపి, సీతాదేవిని క్షేమముగా తెచ్చుకొని, అయోధ్య పట్టణమును గొప్ప కీర్తితో పాలించితివి. నీ పాలన ముల్లోకములలో రామరాజ్యముగా ప్రసిద్ధి చెందినది.


*జై శ్రీకృష్ణ*

శత శ్లోకీ రామాయణము

*




*(59) హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః*


*సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః*


*ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః*




హనుమంతుని యోచన ప్రకారం రాముడు, సుగ్రీవుని కలుసుకొన్నాడు.




మహాబల సంపన్నుడైన రాముడు, తన గురించీ ముఖ్యంగా సీత గూర్చీ మొదటి నుండి జరిగింది యావత్తు ఆ సుగ్రీవ హనుమంతులకు తెలిపాడు.




*జై శ్రీరామ్*

*శ్రీ నరసింహ శతకము*

 : 




*(99) అమరేంద్రవినుత నిన్ననుసరించినవారు ముక్తిబొందిరి వేగ ముదముతోడ*


*నీ పాదపద్మముల్ నెరనమ్మి యున్నాను నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర*


*కాచి రక్షించినన్ కడతేర్చు వేగమే నీ సేవకుని జేయు నిశ్చయముగ*


*గాపాడినను నీకు గైంకర్యపరుడనై చెలగి నీ పనులను చేయువాడ*


*ననుచు బలుమారు వేడెద నబ్జనాభ నాకు బ్రత్యక్షమగుము నిన్ నమ్మినాను*


*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*




శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.




తండ్రీ! సురరాజ పూజితా! నిన్ను అనుసరించిన వారు శీఘ్రముగా ముక్తిని పొందినారు. కమలనేత్రా! నీ చరణకమలాలను నమ్మియున్న నాకు ముక్తిని ప్రసాదింపుము. నన్ను కాపాడి, కడతేర్చి, తొందరగా నీ దాసుని చేసుకో. నన్ను పూర్ణంగా నీకు సమర్పించుకొని, అతిశయించి నిన్ను సేవిస్తాను. నిన్ను పదేపదే యాచిస్తున్నాను. పద్మనాభా! నిన్నే నమ్మియున్నాను. నాకు ప్రత్యక్షము కమ్ము.




*జై నారసింహా*

ఆచార్య సద్భోదన*





భక్తి మనలను విశ్వవ్యాప్తితో ఏకం చేస్తుంది.




మనం ఉన్నత జ్ఞానాన్ని పొందాలని పరితపిస్తూంటే, మనలోని సందేహాలను నివృత్తి చేసుకుంటుంటే, మనలోని అంధకారం పటాపంచలు అవుతూ హృదయ కవాటాలు తెరవబడతాయి.




అప్పుడు మనం సత్యాన్ని భక్తి యొక్క తీవ్రతతో కనుగొంటాం.




విశ్వాస పూర్వక పోరాటంతో మనం దివ్యత్వాన్ని గ్రహిస్తూ తేజోవంతువంతులం అవుతాము.




ప్రపంచం మన యందే, మన లోపలే ఉన్నది, దానిని వెలికి తీయగలగాలి.




దీనిని అకుంఠిత దీక్ష, ధ్యానం, ప్రార్థనలతో సాధించవచ్చు.




సర్వేజనా స్సుఖినోభవంతు.




*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సుందర కాండ - ఎనిమిదవ సర్గ*





*(01)* మహావీరుడూ, వాయుపుత్రుడూ అయిన హనుమంతుడు ఆ భవన సముదాయం మధ్యలో ఆకాశంలో ఎగురగల భవన వాహనమైన గొప్ప పుష్పక విమానాన్ని చూశాడు. ఆ పుష్పకం వజ్రాలూ, మాణిక్యాలు పొదుగబడి ఉండడంతో చిత్రవర్ణంతో ఒప్పారు తున్నది. దాని గవాక్షాలు పుటంపట్టిన బంగారంతో నిర్మితమై, నగిషీలతో అలరారుతున్నాయి.




*(02)* స్వయంగా విశ్వకర్మయే ఆ పుష్పకాన్ని రూపొందించి, దాని నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించాడు. కనుక ఆ పుష్పకానికి చేసిన అలంకరణ సాటిలేనిదై విరాజిల్లుతూన్నది. అది ఆకాశాన వాయుమార్గంలో నిలబడినదై, సూర్యమార్గానికి చిహ్నంలా ప్రకాశిస్తూన్నది.




*(03)* ఆ విమానంలో విశేష ప్రయత్నంతో నిర్మితంకానిదీ, అమూల్య రత్నాలు పొదుగబడనిదీ ఏదీ లేదు. అందలి విశేషాలు దేవలోకంలో సైతం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పలేము. దానిలో గొప్ప నిర్మాణాత్మక విశేషం లేనిది ఏదీ లేదు.




*(04)* ఆ విమానాన్ని రావణుడు తన పరాక్రమంతోనూ, గొప్ప తపశ్శక్తితోనూ సముపార్జించుకున్నాడు. సంకల్ప మాత్రాన అది కోరుకున్న ప్రదేశానికి పోగలదు. ఆయా భాగాలందు అనేక ఆకారాల విశేషాలతో నిర్మితమైనదీ, అక్కడక్కడ తుల్యమైన విశేషాల దర్శనం గలదీ అయిన విమానాన్ని హనుమంతుడు చూశాడు

*(05)* ప్రభువు మనస్సును ఎరిగి ఆ విమానం వాయువేగంతో సత్వరంగా పయనిస్తూ ఇతరులెవరూ ఆపడానికి వీలులేనిదై ఉన్నది. మహాత్ములు, పుణ్యాత్ములు, తేజసంపన్నులు, కీర్తిశాలురు, మహదానంద భరితులు అయిన ఇంద్రాదులు నివసించే స్వర్గాన్ని ఆ విమానం పోలి ఉన్నది

*జై శ్రీహనుమాన్*

శ్రీ కృష్ణ శతకము(42

 *)    ఇరువ దొకమారు నృపతుల*


*శిరములు ఖండించితౌర! చే గొడ్డంటన్*


*ధర గశ్యపునకు నిచ్చియు*


*బరగవె జమదగ్ని రామ! భద్రుడ కృష్ణా!*




ఓ కృష్ణా! నీవు పరశురామ అవతారం ఎత్తి ఇరువై ఒక్క సార్లు రాజుల తలలను నీ గండ్ర గొడ్డలిచే ఖండించితివి. 


ఈ భూమినంతటిని కశ్యప మహామునికిచ్చి ఘనముగా వెలసితివి గదా!




*జై శ్రీకృష్ణ*

ఆచార్య సద్భోదన


భక్తి అనేది అంతరంగంలో కలిగేది, దానికి అపారమైన శక్తి ఉంది.


సరళత్వం, శుద్ధత, భగవంతుని పొందాలనే ఆకాంక్షను కలిగి ఉన్న భక్తుని హృదయంకన్నా శక్తిమంతమైనది మరొకటి ఉండదు.


అతని ప్రార్థనలో శక్తి ఎందుకు వస్తుందంటే అతడు తన కొరకు ఏమీ కోరుకోడు.


అతని ప్రార్థన ఫలిస్తుంది.


ఎందుకంటే అందులో స్వార్థపరత్వంకానీ, కపటం కానీ ఉండదు.


అతడు తన ఉనికిని కూడా మరచి ధ్యానిస్తాడు.


తనకంటే విలువైనది భగవంతుడేనని గ్రహిస్తాడు.


ఆ జ్ఞానకిరణాల ముందు అన్ని సందేహాలు, సంశయాలు, పోరాటాలు అదృశ్యమవుతాయి.

సర్వేజనా స్సుఖినోభవంతు.




*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

ఈశ్వర


 

*శ్రీ నరసింహ శతకము*

 




*(98)*


*లక్ష్మీశ నీ దివ్య లక్షణ గుణముల వినజాల కెప్పుడు వెర్రినయితి*


*నా వెర్రి గుణములు నయముగా ఖండించి నన్ను రక్షింపుమో నళిననేత్రా*


*నిన్ను నే నమ్మితి నితరదైవములనే నమ్మలే దెప్పుడు నాగశయన*


*కాపాడినను నీవె కష్ట పెట్టిన నీవె నీపాద కమలముల్ నిరత మేను*


*నమ్మియున్నాను నీ పాదనళిన భక్తి వేగ దయజేసి రక్షించు వేదవేద్య*


*భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*




శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! 


నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. 


పాపములను పారద్రోలు వాడవు. 


దుష్టులను శిక్షించువాడవు.




తండ్రీ! లక్ష్మీపతీ! నీ కళ్యాణగుణములను ఎన్నడూ వినక వెర్రివాడను అయ్యాను. 


నా వికారాలను ఖండించి, పద్మనేత్రా! నన్ను రక్షించు. 


నిన్ను తప్ప చిల్లర దేవుళ్ళను నేను నమ్మలేదు ఎప్పుడు. 


పన్నగశయనా! నీ చరణ కమలాలనే సదా నమ్మి ఉన్నాను. 


కనికరించినా, కష్టపెట్టినా నీదే భారం. 


నీ చరణకమల భక్తిని పూర్ణంగా ప్రసాదించి, నన్ను రక్షించు.




*జై నారసింహా*

*శ్రీ కృష్ణ శతకము*

 


*(41)*


*వడుగడవై మూడడుగుల*


*నడిగితివౌ భళిర భళిర! యఖిల జగంబుల్*


*తొడిగితివి నీదు మేనున*


*గడుచిత్రము నీ చరిత్ర! ఘనుమవు కృష్ణా*




ఓ కృష్ణా! నీవు వామనావతారమెత్తి బలి చక్రవర్తిని మూడడుగుల నేలను ఇమ్మని అడిగితివి. 


ఆ రాజు ఇచ్చినంతనే లోకములన్నిటిని రెండడుగులతో ఆక్రమించి మూడవ అడుగుతో అతనిని పాతాళమునకు అణగ ద్రొక్కితివి. 


ఇట్టి నీ చరిత్ర చాలా అద్భుతమైనది, ఘనమైనది గదా.




*జై శ్రీకృష్ణ*

సుందరకాండ - ఏడవ సర్గ* 16)*

 


తర్వాత రావణుని బాహుబలంతో రక్షింపబడుతూ రాక్షసులకు ఆదరణీయమైన ఆ లంకా నగరంలో కలయ తిరుగుతూ, భర్త సద్గుణ సంపత్తిచే వశీకృతమై ఆయనయందే మనస్సును లగ్నం చేసిన సీతాదేవి ఎక్కడా కాన రాక పోవడంతో హనుమంతుడు ఎంతో దుఃఖించాడు.




*(17)*


అనేక రీతుల్లో యోచించగల శక్తిమంతుడూ, మహాత్ముడూ అయిన హనుమంతుడు సునిశిత దృష్టితో, దృఢ నిశ్చయంతో ఎంతగా అన్వేషించినా సీతాదేవి కనిపించక పోవడంతో చింతా క్రాంతుడయ్యాడు.




*(శ్రీమద్వాల్మీకి రామాయణమునందలి సుందరకాండ ఏడవ సర్గ సమాప్తము)*




*జై శ్రీహనుమాన్*

*శత శ్లోకీ రామాయణము*58)*



*శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః*


*పంపాతీరే హనుమతా సంజ్ఞ్గతో వానరేణ హ*




దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముని శబరి చక్కగా పూజించింది.


ఆ తర్వాత ఆయన పంపా నదీ తీరంలో వానరుడైన హనుమంతుణ్ణి కలుసుకొన్నాడు.




*జై శ్రీరామ్*

ఋతువులు , ఆయా సమయాల్లో పాటించవలసిన ఆహార విహార నియమాలు -

 


 * వసంత ఋతువు - 


       వసంత ఋతువు నందు కఫము ప్రకోపించి అనేక రోగములను కలుగజేయును . అందువలన అట్టి కఫముని వాంతి , ముక్కు ద్వారా , విరేచనం ద్వారా కఫాన్ని పోగొట్టి కఫాన్ని తగ్గించవలెను .  


             ఈ సమయంలో పాతవి అయిన గోధుమలు , శొంటి, వేగిసచెక్క , చందనము , తుంగముస్తలు కాచబడిన నీళ్ళనిగాని , తేనె కలిపిన నీళ్ళని గాని పానము చేయవలెను .


       ప్రాతఃకాలం సమయమున శరీరం మర్దించుకొని నలుగుపెట్టుకొని స్నానం చేయవలెను . మధ్యాహ్నమున నీటికాలువుల యందు , చెట్లు ఎక్కువ ఉన్న తీగలు గల చెట్లు ఉన్న ఉద్యాన వనాల యందు గడపవలెను . 


              వసంత ఋతువు యందు చల్లటి పదార్థాలు , మధురపదార్థాలు , సేవించరాదు . పగలు నిద్రించరాదు.


 * గ్రీష్మ ఋతువు - 


       ఈ గ్రీష్మ ఋతువు నందు తీక్షణమైన సూర్యప్రకోపం వలన శరీరం నందు కఫం తగ్గిపోయి వాతం పెరుగును . ఈ ఋతువు నందు ఉప్పు , కారం , పులుపు కలిగిన పదార్థాలు , వ్యాయామం , సూర్యకిరణాల యందు కూర్చోవడం నిషేదించవలెను . 


              ఈ కాలం నందు మధురపదార్థాలను మాత్రమే వాడవలెను . పంచదారతో కూడిన పేలాల పిండి మొదలగు పదార్థాలు తినవలెను . రాత్రిసమయంలో వెన్నెలలో ఆరుబయట ఉంచబడిన గేధ పాలలో పంచదార వేసుకొని అవి తాగవలెను .


       మధ్యాహ్న సమయం నందు చెట్లు ఉండి నీడ ఎక్కువ గల ప్రదేశాలలో పైనుంచి నీరు జాలువారే విధంగా జలగృహము నిర్మించుకొని అందు నివసించవలెను . రాత్రి సమయంలో మేడ పై భాగాల్లో వెన్నెల లో లేదా ఆరుబయట ఉండవలెను . 


 * వర్షఋతువు - 


         వర్షఋతువు నందు ఆకాశం మేఘాలతో ఆవరించబడి ఉండినప్పుడు జలకణములతో కూడి ఉండునట్టియు , వేసవికాలం తరువాత చల్లాగా అయినట్టి గాలి వలన లోపల ఉండు వాతం దోషం పొందును. భూమి యొక్క ఉష్ణం కాల స్వభావం చేత ఆమ్ల స్వభావం పెరిగినటువంటి జలం తాగుట చేత శరీరం నందలి పిత్తం దోషం పొందును. సాలెపురుగులు మొదలగు విష మూత్రాదులతో కలిసి ఉన్న వర్షపు నీరు సేవించుట చేత కాలస్వభావం చేత మందంగా ఉన్న జఠరాగ్ని వలన కఫం దోషం పొందును. 


                 ఈ విధంగా ఒకే కాలం నందు వాత, పిత్త, కఫాలు మూడు ఒకేసారి దోషం పొందుట వలన వాటిని శమింపచేయునట్టి మరియు జఠరాగ్ని పెంచే ఆహారాలు ఉపయోగించవలెను . 


           ఈ కాలం నందు పాతవైన యావలు , గొధుమలు , నేతితోను , శొంఠితోను చేయబడిన మాంసరసం , పెసరకట్టు , చాలా కాలం నుంచి నిలువ ఉంచబడిన మద్యం , వర్షం నుంచి పడిన నీరు , బావినీరు , కాచిన నీరు వీటిని ఉపయోగించాలి . ఈ ఋతువునందు అధిక శ్రమ చేయక శరీరం నందు గంథం పూసుకొని , సుగంధ ద్రవ్యముల ధూపమును వేసుకొని మేడ యందు నివశించవలెను . 


                    ఈ వర్షాకాలం నందు నదీజలం , కడుపు నిండా తినడం , పగటినిద్ర , శ్రమ ఎక్కువుగా ఉండే పనులు , ఎండ వీటిని చేయరాదు . 


 * శరదృతువు - 


         శరదృతువు నందు పిత్త దోషం ప్రకోపించును . ఈ కాలం నందు చేదు , తీపి , వగరు కలిగినటువంటి ఆహారాలు లొపలికి తీసికొనవలెను . ఆకలి అయినప్పుడే పదార్థాలు తీసికొనవలెను . శాలి ధాన్యం , పెసలు, పంచదార, ఉసిరికాయ , చేదుపోట్ల , తేనె , హంసలు తిరిగే తటాకం నందలి నీరు ఉపయోగించవలెను . 


                   చందనం , వట్టివేరు , పచ్చకర్పూరం , ముత్యాల హారం , పుష్పాల దండలు , పట్టుబట్టలు వీటిని వాడవలెను . మేడ పైభాగం నుండి సూర్యాస్తమయం అయిన సమయం లో వెన్నెలని సేవించవలెను . ఈ ఋతువు నందు మంచు , యావక్షారం వంటి లవణాలు , పెరుగు , నూనె , వస , ఎండ , ఘాటుగా ఉండు మద్యములు, పగటి నిద్ర , తూర్పుగాలి వీటిని వదిలివేయవలెను . 


 * హేమంత ఋతువు - 


        హేమంతఋతువు యందు మధురరసం , ఆమ్లరసం , లవణ రసం గల పదార్థాలు భుజించవలెను . ప్రాతఃకాలం నందు ఆకలిగా ఉన్నచో కొంచమే భుజించవలెను . వాతాన్ని 

హరించే తైలములతో అభ్యంగనం, శిరస్సు తైలముతోమర్దించుకొనుట, మల్లయుద్ధం , శరీరమునకు మర్దనం చేయించుకొనుట చేయవలెను . స్నానం చేసినతరువాత కుంకుమపువ్వుని , కస్తూరిని కలిపినూరి శరీరంకి పూసుకుని అగరుచెక్కతో దూపం వేసుకొనవలెను . 


                 ఈ కాలం నందు బలకరమైన మాంసరసం , మాంసములు , బెల్లంతో చేసిన మద్యం , మధుర మద్యం , గోధుమపిండి , మినుములు , చెరుకుపాలు వీనితో చేయబడిన పదార్థాలు , నూతనమైన అన్నం , వస , తైలం వీటిని ఉపయొగించవలెను . స్నానం కొరకు వేడినీటిని మాత్రమే ఉపయొగించవలెను . చలిబాధ లేకుండా ఉండటం కొరకు దుప్పటి, కంబళి , శాలువ వీటిని కప్పుకొనవలెను . కొంతసమయం సూర్యకిరణముల యందు ఉండి చెమట పట్టే విధంగా చూసుకొనవలెను . భూగృహముల యందు నివశించవలెను . 


 * శిశిరఋతువు - 


           హేమంత ఋతువు నందు పాటించే నియమాలను ఈ ఋతువు నందూ పాటించవలెను . 


          పైన చెప్పిన విధంగా ఆయా ఋతువుల్లో ఆయా ఆహారపదార్థాలని తీసుకోవడం , ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం వలన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు . 


 

    గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః

 జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః

నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం


శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యంగారు లబ్ధప్రతిష్టులైన గాయకులు. వారు దాదాపుగా 40 వేలకు పైగా పాటలు పాడటము,అవికూడా జనరంజకము కావడము, కొన్ని కోట్లమంది ప్రజల హృదయములలో పాట ద్వారా సుస్థిరమైన స్థానము సంపాదించు కోవడము అంత తేలిక అయిన విషయము కాదు. బహుశా వారి నాన్నగారు చేసిన గొప్పతపస్సు వారిని అంత యశో విరాజితులను చేసిందని నేను వ్యక్తిగతముగా నమ్ముతూ ఉంటాను. బాలసుబ్రమణ్యంగారి నాన్నగారు శ్రీ పండితారాధ్యుల సాంబమూర్తిగారు నెల్లూరులో హరికధలు చెపుతూ ఉండే వారు. 19 సం || పాటు ఉంఛవృత్తి చేసి నెల్లూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తూ ఉండేవారు. మొదటి భిక్ష బాలసుబ్రమణ్యంగారి అమ్మగారు పెడుతూ ఉండేవారు. అపర త్యాగరాజులాగే 'మనసా ఎటులోర్తునో' కీర్తన పాడుతూ వీధి వీధి తిరిగి భిక్ష స్వీకరించి రామపాద పూజలో తరించే వారు. నెల్లూరు పట్టణానికి ఎందరో సంగీత విద్వాంసులను పిలిపించి సంగీత కార్యక్రమములు నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన యొక్క అపారమైన భక్తి వారు చేసిన త్యాగరాజ ఆరాధనోత్సవాల ఫలితముగా బహుశా బాల సుబ్రహ్మణ్యం గారు ఆయనకు కుమారుడిగా జన్మించారు. ఆయన జీవితము నిజానికి పూలుపరచిన పడక కాదు. చిన్నతనములో ఆయన పడ్డ కష్టములు అన్నీఇన్నీ కావు. ఎన్ని ఊళ్లు మారారో వాళ్ళ అమ్మగారి చేతికిఉన్న విసన కర్ర కాడ దెబ్బలు ఎన్నిమాట్లు తిన్నారో! దీపావళి పండగ వస్తే ఒక సిల్కు లాల్చి కోనుక్కోవడము 10 రూ. పెట్టి దీపావళి సామాను కొనుక్కోవడము ఎంతో కష్టము. అటువంటి బాలసుబ్రమణ్యంగారిని వాళ్ళ అమ్మగారు ఒళ్ళో పడుకో పెట్టుకుని – మణీ! నాన్న కష్ట పడుతున్నారు పరాయి ఇంట్లో ఉంటున్నాము. చదువుకోమంటే ఏదో ఒక పనిపెట్టుకుని మాటి మాటికి నాన్నగారిని డబ్బులు అడిగితే కష్ట పడతారు అని వాళ్ళ అమ్మగారు నచ్చ చెపుతూ ఉండేవారు. చిన్నతనములో బాలసుబ్రమణ్యంగారిని వాళ్ళ నాన్నగారి స్నేహితుల దగ్గరకు వెళ్ళి డబ్బు అప్పుగా తీసుకుని రమ్మంటే ఎంతో బిడియ పడుతూ వెళ్ళి తీసుకుని వచ్చేవారని ఆయన వ్రాసుకున్నారు. అన్ని కష్టములు పడి సంగీతము మీద అభిరుచి భగవంతుని యొక్క అనుగ్రహముగా ఏర్పడిన తరవాత వెనక్కి తిరిగి చూడలేదు. ఒకసారి చలనచిత్రములలో నేపథ్య గానము పాడటము ప్రారంభము చేసిన తరవాత ఆయన ఎవరి కంఠము అయినా సరే అంత అద్భుతముగా అనుకరించే వారు. ఆ నటుడే పాడితే ఎలా ఉంటుందో బాలసుబ్రమణ్యంగారు పాడితే అలా ఉండేది. ఎందరికో నటులకు వారి కంఠమును డబ్బింగ్ కోసమని అద్భుతముగా వెచ్చించారు. ఆయా నటులు అంత లబ్ధప్రతిష్టులు కాగలిగారు అంటే దానిలో బాలసుబ్రమణ్యంగారు చేసిన సేవ, వారు చూపించిన సౌహార్ద్రము ఎంతో ఉన్నది. ఆయన గొప్ప నటులు, గొప్ప సంగీత విద్వాంసులు. ఎన్నో పాటలు పాడారు. ఆయన గురుముఖతః సంగీతము నేర్చుకోకపోయినా భగవంతుడు ఆయనకు అంత గొప్ప సంగీతవిద్య ఇచ్చారు. ఎన్ని పాటలు పాడారో, ఎంత భావయుక్తముగా పాడారో. ఉచ్ఛారణ గురించి ఎంత జాగ్రతలు తీసుకునేవారో. ఏ పదమైనా శాస్త్రీయముగా ఉచ్ఛరించి అర్థము చెడిపోకూడదని జాగ్రత తీసుకునేవారు. అన్నిటినీ మించి విశాల హృదయము కలిగిన స్నేహశీలి. శాంతా బయోటెక్ వ్యవస్థాపకులైన శ్రీ వరప్రసాద్ గారికి అత్యంత ఆత్మీయులు. వారిని అనేక సందర్భములలో కలుసుకోవడము జరిగింది. పెద్దల పట్ల వారి గౌరవము చాలా చాలా గొప్పగా ఉండేది. అంత స్థాయి కలిగిన వ్యక్తి , ఆకాశమంత ఎత్తు ఎదిగిన వ్యక్తి ఇంత వినయముతో ప్రవర్తించడము సాధ్యమవుతుందా? అనిపించేది. పెద్దలు కనపడితే అంత వినయముతో ప్రవర్తించేవారు. ఎంతో సమయ పరిపాలన చేసేవారు. అందరినీ ఆదుకునేవారు. గొప్ప భక్తి కలిగిన వ్యక్తి. వారికి గోసేవ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. అన్నిటినీ మించి వారిలో ఉన్న చాలా చాలా గొప్ప విషయము ఎక్కడ మంచి ఉన్నా గ్రహించేవారు. ఏ కార్యక్రమమైనా దానిని అడ్డు పెట్టి సమాజానికి మంచిని అందించే ప్రయత్నము చేసేవారు. లబ్ధప్రతిష్టులైన గాయకులు, గాయనీ మణులు తయారు కావాలన్న ఉద్దేశ్యముతో etv లో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమములో వేదికకు ఎందరో గాయకులను పరిచయము చేసారు. స్వరాభిషేకము అన్న పేరుతో ఎప్పుడూ నిత్య నూతనమైన పాటలను పాడుతూ, వెనక ఉన్న నేపథ్యమును, కవి ఏ సందర్భములో పాట వ్రాసారు? నటీ నటులు ఎలా నటించారు ? ఆ దర్శక ప్రతిభ ఏమిటి? పాట వ్రాసిన కవి ఎంత భావ స్ఫూరకముగా ఆ గీతము రచించారు? అన్న విషయములు చెపుతుంటే ఎంతో అద్భుతముగా అనిపించేది. వ్యక్తిగతముగా ఆయన కారణజన్ముడు అనిపిస్తుంది. 74 సం || ల వయసులో అన్ని వేల పాటలు గురువు దగ్గర సంగీత అభ్యాసము లేకుండా పాడగలగడము, అంతమంది నటుల కంఠమునకు సరిపోయేట్టుగా పాడగలగడము , విరుపు దగ్గర నుంచి మాట వరకు అంత గొప్పగా ఉండగలగడము అంతగా వదగ గలగడము ఆయనకు ఆయనకే చెల్లింది. అంత గొప్పవారు బాలసుబ్రమణ్యంగారు. 

 ఆయన ఇవ్వాళ శరీరము విడిచి పెట్టి ఉండవచ్చుగాక! కానీ ఆయన ఎప్పటికీ అలాగే శాశ్వతముగా ఉండిపోతారు. ఎందుచేత అనగా సాగరసంగమము చలన చిత్రములో చిట్టచివర విశ్వనాథ్ గారు ఒక శ్లోకము చెప్పిస్తారు. యశ శరీరము కలిగిన మహానుభావులకు జరా మరణములు ఉండవు. శరీరము ఉన్నంత కాలమే మిగిలిన వారి యొక్క వాణి వినపడుతుంది. ఇటువంటి లబ్ధప్రతిష్టులైన వారి శరీరము కాలగతిలో వెళ్ళిపోయినా వారి కంఠము వినపడుతూనే ఉంటుంది. ఎన్ని లలిత గీతములు పాడారో. ఎన్ని భక్తి గీతములు పాడారో, ఎన్ని సందేశాత్మకమైన గీతములు పాడారో. ఆయా సభలలో, ఆయా సందర్భములలో, మనసుకి ఉత్సాహము కలగవలసిన సందర్భములలో జనులు నిరంతరముగా పాటలు వింటూనే ఉంటారు. అటువంటి కీర్తి శరీరము కలిగిన బాలసుబ్రమణ్యంగారికి జరా మరణములు ఉంటాయని నేను నమ్మటము లేదు. భర్తృ హరి తన నీతిశతకములో చెప్పినట్టు 

 నాస్తి తేషాం యశః కాయే |

జరామరణజం భయమ్ ||

 విశ్వనాథ్ గారు ఆయనతో ఎందుకు ఆ శ్లోకము పాడించారో అది ఆయన విషయములోనే నిజమైంది. వారు పరమేశ్వరుడి అనుగ్రహము చేత పునరావృత్తి లేని స్థితిని పొందాలని ఈశ్వరుడు తన విభూతిని ఆయన పట్ల అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా నమస్కరించి ప్రార్థన చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క బాధను, హృదయపూర్వకమైన సంతాపమును తెలియ చేసుకుంటున్నాను.


- బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు

బడంగి పేట


 

Ticket


 

*ఇంద్రుని వల్ల శాపగ్రస్తులైన అహల్య గాధ*



ప్రాచీన కాలంలో వున్న అస్పరసల పాత్ర ఎంతో అద్వితీయమైనది. సౌందర్యానికే ప్రతీకగా వర్ణిస్తూ ఎన్నో రకాల కథలు ప్రచురించబడ్డాయి. కేవలం అందగత్తెలే కాకుండా మంచితనం కలిగినటువంటివారి జీవిత చరిత్రలు.. మట్టిబొమ్మలు ప్రాణం పోసుకున్నట్టు అపురూపంగా వుంటాయి. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్త్రీలకు ముగ్ధులయిపోయేవారు. అటువంటి మహోన్నత పాత్రలను కలిగిన స్త్రీలలో అహల్య ఒకటి. ఆమె మంచిగుణాల గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం...


పూర్వం చతుర్ముఖుడు, గౌతమ మహర్షికి నిత్యం సేవలను అందించేందుకు, ఆయన ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఒక అప్సరసను ఏర్పాటు చేశాడు. ఆమె పేరు అహల్య. ఈమె సుగుణాలతో కూడిన సౌందర్యవంతమైన ఒక అందాల రాశి. ఈమె ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో నిస్వార్థతతో, నిజాయితీగా నిత్యం గౌతమ మహిర్షికి సేవలను అందిస్తూ... ఎంతో అందంగా, సక్రమంగా నిర్వహించుకునేది. దాంతో ఈమె నిజాయితీని గమనించిన బ్రహ్మదేవుడు.. గౌతమునికి అహల్యే తగిన భార్య అని భావిస్తాడు.


అలా ఆలోచించిన మరుక్షణమే బ్రహ్మదేవుడు, ధ్యానం చేసుకుంటున్న గౌతమ మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు... "ఓ గౌతమా! నేను నీకు పెట్టిన అన్ని పరీక్షలలోనూ నువ్వు గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే.. భూప్రదక్షిణతో సమానమైన పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యంతోపాటు ఎన్నో పుణ్యకారాలను సంపాదించుకున్నావు. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను మనస్సుతో స్వీకరించి, ధన్యుడివి అవు" అని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా.. బ్రహ్మదేవుడే దగ్గరుండి వనదేవతల సమక్షంలో వీరిద్దరి వివాహాన్ని (గౌతమ మహర్షి, అహల్య) జరిపిస్తాడు.


ఇలా జరిగిన వీరి వివాహనంతరం కొంతకాలానికి వీరిద్దరికి శతానందుకు అనే ఒక కొడుకు పుడతాడు. ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కొన్నాళ్ల తరువాత గౌతమ మహర్షి తపో దీక్షను చేపడతాడు. ఆ దీక్ష ప్రభావం ఎంతగా వుంటుందంటే.. ఏకంగా స్వర్గాన్నే కదిలించేలా వుంటుంది. దాంతో స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు ఒక్కసారిగా భయానికి గురవుతాడు. ఎక్కడ తన పదవి పోతుందేమోనన్న భయంతో.. అతని దీక్షను భంగం కలిగించాలని ఒక పన్నాగం పన్నుతాడు. దానికి దేవతలందరి సహాయాన్ని కూడా కోరుకుంటాడు.


అయితే అహల్య అందానికి ముగ్ధుడైన దేవేంద్రుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు తన స్వర్గలోకాన్ని - దేవతలను కాపాడుకునేందుకు, మరోవైపు అహల్యను పొందాలనుకునేందుకు దేవేంద్రుడు ఒక తనదైన ఒక పన్నాగం పన్నుతాడు. దానిప్రకారం ఒకరోజు దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇంకా తెల్లవారుజాము కాకముందే కోడిరూపంలో వచ్చిన దేవేంద్రుడు గట్టిగా కూస్తాడు. దాంతో గౌతముడు ఒక్కసారిగా ఉలిక్కపడి లేచి, బ్రహ్మముహూర్తం సమీక్షించిందని అనుకుని, సూర్యభగవానుని అర్ఘ్యం ఇచ్చేందుకు బయటకు వెళతాడు. పవిత్ర నదీజలాన్ని తెచ్చుకునేందుకు నదివైపుగా వెళుతుండగా చుట్టుపక్కల కారు చీకటి కమ్మకుని వుంటుంది. అప్పుడు గౌతముడు తన మనసులో.. "కోడి కూసినప్పటికీ ఎక్కడా వెళుతురు జాడ కనిపించడం లేదు. ఇంకా తెల్లవారలేదులే" అని అర్థం చేసుకుని తిరిగి వెనక్కి ఆశ్రమానికి వెళతాడు.


గౌతముడు ఆశ్రమానికి చేరుకోగానే.. తన రూపంలో వున్న దేవేంద్రునిని అహల్యతో కలిసి వుండడాన్ని చూస్తాడు. దాంతో గౌతమ మహర్షికి ఎనలేని కోపం పొంగుకొని వస్తుంది. అవమానంతో కుంగిపోతున్న దేవేంద్రుడు, కోపంతో రగిలిపోతున్న మహర్షిని చూసి భయంతో తన అమరలోకానికి పరుగులు తీస్తాడు. అయితే ఇందులో అహల్య ఏ తప్పు లేకపోయినా.. ఇంద్రుని పక్కన వున్నందువల్ల గౌతమ మహర్షి కోపంతో ఆమెను శపిస్తాడు. "నువ్వు రాయిగా మారిపో" అంటూ క్షణికావేశంతో అంటాడు. అప్పుడు కూడా అహల్య తన భర్త మాటను శిరసావహిస్తూ ఏమీ అనుకోకుండా.. అతను విధించిన శాపాన్ని గౌరవంగా అంగీకరిస్తుంది.


ఇదంతా జరిగిపోయిన కొద్దిసేపటి తరువాత గౌతమ మహర్షి తన దివ్యదృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. అహల్య తప్పు ఏమీలేదని గ్రహిస్తాడు. దానికి ఎంతో పశ్చాత్తాపపడుతూ.. "రాయిగా వున్న నువ్వు రాముడి పాదాలు తాకినప్పుడు తిరిగి స్త్రీ రూపాన్ని పొందుతావు" అని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా రాయిగా మారిపోయిన అహల్య శాప విమోచన పొందేందుకు రాముని రాక కోసం ఎదురుచూస్తూ తన కాలాన్ని గడిపింది. చివరికి చాన్నాళ్ల తరువాత రాముని పాదాలతో పునీతురాలై.. మళ్లీ స్త్రీ రూపాన్ని పొందుతుంది.


అదీ అహల్య గాధ. అహల్య ఎంతో సాత్వికురాలు కాబట్టి.. తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లాపాలు ఆడినప్పుడు కూడా.. తన భర్తేనని అనుకుని మురిసిపోయింది. అంతేకాని.. ఆమెకు ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది అస్సలు వుండేది కాదు. తొందరపాటుతో భర్త శాపించినప్పటికీ దానిని అంగీకరిస్తూ తన భర్త మాటను దాటేయకుండా శిరసావహించింది. ఇదే అహల్య గొప్పతనం.

*సేకరణ*

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి🌺🙏

 


1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి.


2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.


3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.


4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.


5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.


6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.


7. సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దార్లు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది.

సామర్థ్యం

 తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది.. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది..

కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు

ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి....

అయ్యో నన్ను ఏదో బంధించేసింది అని చెప్పేసి ఆ తామర

రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది....

అయితే మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేెకులను తొలచలేదా..

ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..

గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...

కానీ 

అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...

లేక 

నన్నేదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీన పర్చింది.. ఆ భావనను నమ్మడమే దాని బలహీనత..

నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న 

దాన్ని నమ్మింది... అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...


మన జీవితంలో సమస్యలూ అంతే,

సమస్య బలమైంది కాదు..

మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం...

మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,

గుర్తించడమే, నమ్మడమే దాని బలం...


"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...

దాని బలం తామర రేకు అంత....

నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత.

తెలుసుకో అదే..జీవిత సత్యం..


భగవద్గీత 

ఆర్య

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*


మనం చెప్పే మాట ఎలా ఉండాలో సుందర పాండ్యుడనే చక్రవర్తి తన *ఆర్య* ల్లో చెప్పాడు. ఒక్క *ఆర్య* ను అధ్యయనం చేద్దాం.


*శబ్ధార్థ సూక్ష్మ వసనా*

*సత్యాభరణా, విచిత్ర హేత్వంగీ*

*విద్వన్ముఖ నిష్క్రాంతా*

*సుస్త్రీవ విరాజితే వాణీ*


శబ్ధార్థాలనే మేలి వస్త్రాలు ధరించి, విచిత్ర హేతువులనే చక్కని మేనుతో, సత్యాన్ని అలంకరించుకొని విద్వాంసుల నోటి నుండి వెలువడిన మాట మంచి మగువలా ప్రకాశిస్తుంది. 


మాటకు ఒక శరీరం ఉంటుంది. వస్త్రాలుంటాయి, అలంకారాలుంటాయి. వట్టి పొల్లు మాటలకు విలువుండదు. మనం పలికే ప్రతి మాటా హేతుబద్ధం అయి ఉండాలి. యుక్తి యుక్తంగా ఉండాలి. అందంగా, కాదనడానికి లేనట్టుగా ఉండాలి. విచిత్ర హేతుత్వం అంటే ఇదే. 


మాటకు విచిత్ర హేతువు శరీరం, శబ్ధార్థాలు మేలి వస్త్రాలు. మాట గంభీరమూ, లలిత మర్యాద గలదీ కావాలి. శబ్ధార్థాలు విషయ సౌందర్యాన్ని ప్రకాశింప చెయ్యాలి. ఆభరణాలు, శరీరానికి బట్టకు, కట్టుకూ నిండు దనాన్ని ఇస్తాయి. 


అలాగే మన మాటకు సత్యము, ప్రియము, ఆభరణాలు కావాలి. అలాంటి మాట మంచి మగువలా రాణిస్తుంది అంటాడు సుందర పాండ్యుడు.


*శుభంభూయాత్*

*శ్రీ నరసింహ శతకము

*


*(97)*

*కూర్మావతారివై కుధరంబు క్రిందను గోర్కెతో నుండవా కొమరు మిగుల*

*వారాహమూర్తివై వనభూములను జొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షునపుడు*

*నరసింహమూర్తివై నరభోజను హిరణ్య కశిపుని ద్రుంచవా కాంతిమీర*

*వామనరూపివై వసుధలో బలిచక్రవర్తి నణంపవా వైరముంచి*

*ఇట్టి పనులెల్ల చేయగా నెవ్వరికిని దగును నరసింహ నీకిది దగునుగాక*

*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*


శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహ స్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.


తండ్రీ! కూర్మమూర్తివై మందర పర్వతము క్రింద నిలిచినావు. వరాహమూర్తివై హిరణ్యాక్షుని శిక్షించినావు. నరసింహమూర్తివై హిరణ్యకశిపుని త్రుంచినావు. వామనమూర్తివై బలిచక్రవర్తిని అణచివేశావు. ఈ లోకం నుండి పాతాళానికి పంపావు. ఇలాంటి కార్యాలన్నీ నీకు గాక మరెవరికి సాధ్యము నరసింహా.


*జై నారసింహా*

*ఆచార్య సద్భోదన*

 


భక్తుని యొక్క మొదటి కర్తవ్యం భగవంతుని సేవించడమే. భక్తులకు భగవంతుని వద్ద ప్రవేశం నేరుగా ఉంటుంది. వారు ఇలా అంటారు.


*నాకు భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉంది, ఆయన ఉనికిని అనుభూతిలోనికి తెచ్చుకోవాలని ఉంది, ఆయనతో సంభాషించాలని ఉంది, భగవంతునిలో లీనమవ్వాలని ఉంది*.


భగవంతుని గురించి స్పష్టత ఏర్పడాలంటే నిశ్శబ్ధంగా ఆయన ధ్యానంలో మునిగిపోవాలి. దీనికి కాలంతో ప్రమేయం లేదు. అన్ని సమయాల్లోను ఆయనను ప్రార్థించవచ్చు. మన జీవితంలోని ప్రతి ఘడియకాలమూ భగవంతుని ఎడల ఆరాధనా భావంతో నిండి ఉండాలి.


సర్వేజనా స్సుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*శత శ్లోకీ రామాయణము

*


*(56,57)*

*తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః*

*స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్*

*శ్రమణీం ధర్మనిపుణా మభిగచ్ఛేతి రాఘవ*

*సోభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః*


గొప్ప బాహువులు గల రాముడు ఆ కబంధుని సంహరించి, దహనం చేశాడు. అతడు స్వర్గానికి వెళ్ళాడు.


వెళ్లబోయే ముందు ఆకాశం నుండి "శ్రీరామా! ధర్మాన్ని తు.చ.తప్పక ఆచరిస్తున్నదీ, ధర్మాలు చక్కగా ఎరిగినదీ, సన్న్యాసాశ్రమం స్వీకరించినదీ అయిన శబరిని చూసి వెళ్ళు" అని చెప్పాడు.


మహాతేజశ్శాలీ, శత్రు సంహారకుడూ అయిన రాముడు స్వయంగా తానే శబరి వద్దకు వెళ్ళాడు.


*జై శ్రీరామ్*

*శ్రీ కృష్ణ శతకము*



*(40)* 

*కెరలి యరచేత కంబము*

*నరుడుగ వేయుటను వెడలి! యసురేశ్వరునిన్*

*ఉదరము జీరి వధించితి*

*నరహరి రూపావతార! నగధర! కృష్ణా!*


కొండను ధరించునట్టి వాడవైన ఓ కృష్ణా! హిరణ్యకశిపుడు కోపించి, "ఓరీ ప్రహ్లాదా! నీ విష్ణువుని జూపరా!" అని ఉక్కు స్థంభమును చరచగా నీవు నరసింహావతారము దాల్చి ఆ స్తంభము నుండి బయలు వెడలి అతని పొట్టను చీల్చి చంపితివి.


*జై శ్రీకృష్ణ*

*సుందరకాండ - ఏడవ సర్గ*



*(11)*

రత్నకాంతుల అతిశయంతో అమితంగా ప్రకాశిస్తూ అక్కడ వెలసి ఉన్న ఉత్తమ భవనాలకన్నా అత్యున్నతమైన పుష్పకమనే పేరుగల ఆ మహావిమానాన్ని హనుమంతుడు చూశాడు.


*(12)*

ఆ పుష్పక విమానంలో వైఢూర్యాలతోను, వెండితోను, పగడాలతోను రూపొందించిన పక్షులూ, అనేక విధాలైన మాణిక్యాలతో తయారైన సర్పాలూ, శుభకర లక్షణాలు గల ఉత్తమజాతి గుర్రాలూ అలంకార నిమిత్తం అమర్చబడి ఉన్నాయి.


*(13)*

ఆ విమానంలో మంచి ముఖాలు, కోమలమైన రెక్కలు గల పక్షులను కూడా రూపొందించారు. సవిలాసంగా ఒకింత వంకరగా వంచబడిన ఆ పక్షుల రెక్కల మీద పగడపు, బంగారపు పువ్వులు చెక్కబడి ఉన్నవి. ఆ పక్షులు మన్మథునికి దోహదపడేవిలా తోచుచున్నాయి.


*(14)*

ఆ పుష్పక విమానంలో తామర కొలను, దానిలో లక్ష్మీదేవిని అభిషేకించడానికన్నట్లు ఆయత్తమైన ఏనుగులు చిత్రించబడి ఉన్నాయి. సుందరములైన తొండములు గల ఆ ఏనుగుల శరీరాలు పుప్పొడితో నిండి ఉన్నాయి. ఆ ఏనుగులు తామర పువ్వులను తామర ఆకులను తమ తొండములతో పైకెత్తి ఆ కొలనులో క్రీడిస్తున్నాయి. అందమైన హస్తములు కలదీ, ఆ హస్తములందు పద్మములు ధరించి, ఆ ఏనుగులచే అభిషేకము పొందుచున్నదా అన్నట్లున్న లక్ష్మీదేవి ఆ కొలనులో ప్రకాశిస్తూ చిత్రీకరించబడి ఉంది.


*(15)*

అలా హనుమంతుడు సుందరమూ, శుభప్రదమూ అయిన పర్వతం మల్లే ఉన్న ఆ రావణ గృహాన్ని తిలకించి, ఆశ్చర్యచకితుడై వసంత ఋతువులో సుగంధభరితమై సుందరమైన గుహలతో మనోహరంగా ఒప్పారుతున్న పర్వతంలా ఉన్న ఆ గృహంలో మళ్ళీ ప్రవేశించి అన్వేషించసాగాడు.


*జై శ్రీహనుమాన్*

శ్రీ నరసింహ శతకము*

 *


*(96)*

*మత్స్యావతారమై మడుగు లోపల జొచ్చి సోమకాసురు ద్రుంచి చోద్యముగను*

*దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలల్ల బ్రహ్మకిచ్చితి వీవు భళియనంగ*

*నా వేదముల నంది యాచార నిష్ఠల ననుభవించుచు నుందు రవని సురులు*

*సకల పాపంబులు సమసిపోవు నటంచు మనుజులందరూ నీదు మహిమ దెలిసి*

*యుందు రిటువంటివారు నీ యునికి దెలియు వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ*

*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*


శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహ స్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.


తండ్రీ! మత్స్యావతారమునెత్తి సాగరములో ప్రవేశించి, సోమకాసురుణ్ణి వధించి వేదాలు తెచ్చి, వాటిని దేవతలకు, భూసురులకు మేలుగోరి ఇచ్చావు. వాటిని భూసురులు నియమనిష్ఠలతో అనుభవిస్తున్నారు. నీ మహిమలో సర్వపాపాలు ప్రక్షాళనమౌతాయని వీరు తెలుసుకున్నారు. నిన్ను తెలిసిన వారికి శీఘ్రంగా ముక్తి లభిస్తుంది.


*జై నారసింహా*

పుష్కరాలు

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*


సందేహం;- పుష్కరం అంటే ఏమిటి, పుష్కరాలు ఎందుకు జరుగుతాయి, పుష్కరుడు ఎవరు దాని గురించి కొంచెం వివరంగా చెప్పమని కోరుకుంటున్నాను?


సమాధానం;- పన్నెండు సంవత్సరాల కాలం. భారతదేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది. పుష్కర అనేది భూమి మీది సప్త ద్వీపాలలోను ఒకదాని పేరు. కానీ, సాధారణంగా పుష్కరం/పుష్కరాలు అంటే నదులకు జరిగే పుష్కరోత్సవాలనే స్ఫురిస్తుంది. మన దేశంలోని పన్నెండు నదులకు పుష్కరాలు జరపడానికి సంబంధించి వాయు పురాణంలో ఒక గాథ ఉంది. బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ పన్నెండు నదులనూ దర్శిస్తుంటాడని ఐతిహ్యం. బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడంచేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం. 


బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు పుష్కరం అంటారు. సంవత్సర కాలం జరిగే ఈ ఉత్సవాలలో చివరి పన్నెండు రోజులూ అంత్య పుష్కరం. పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం. పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది. సప్తర్షులే గాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా నమ్మకం. పుష్కరాల ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు. తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సంప్రదాయం కూడా ఉంది.


*శుభంభూయాత్*

ఆచార్య సద్భోదన*

 *


నిజమైన భక్తులు ఎన్నటికీ తమ మూలాధారమైన భగవంతుని ఉనికిని విస్మరించలేరు. ఒక ఆదర్శ శిష్యునిగా, ఆదర్శ భక్తునిగా మెలిగే ప్రయత్నం చేయాలి. భగవంతుని ఋణం మనం తీర్చుకోలేనిదనే సంగతిని విస్మరించరాదు. విశ్వాన్ని సృజించిన భగవంతునికీ, ఆయన వారసులైన సమస్త ప్రజానీకానికీ యావజ్జీవితం సేవ చేసినా సరిపోదు. మన జీవన విధానం ద్వారా ఆయనను మెప్పించగలిగితే అంతకన్నా భాగ్యం మరొకటి ఏమి ఉంటుంది. అలాకాక మనోవాక్కాయముల ద్వారా ఆయనను నొప్పించే విధంగా ప్రవర్తిస్తే దానిని మించిన దురదృష్టం ఉండబోదు. మన మూలాధారమైన భగవంతుని నిరంతర ధ్యానం ద్వారా అభ్యసించడంకన్నా ఉత్తమమైనది మరొకటి ఉండబోదు. ఆ స్పృహను క్షణకాలం కూడా విస్మరించరాదు. మన హృదయాన్ని అవిశ్రాంతంగా భగవదాలోచనలతో నింపివేయాలి.

సర్వేజనా స్సుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*శత శ్లోకీ రామాయణము

*


*(54,55)*

*తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్*

*మార్గమాణో వనే సీతాం రాక్షసం సందర్శ హ*

*కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనమ్*


మరణించిన జటాయువుకు పెల్లుబుకుతున్న దుఃఖంతో శ్రీరాముడు శ్రద్ధగా దహన సంస్కారం నిర్వర్తించాడు. ఆ తర్వాత సీతకై అరణ్యంలో వెతుకుతున్న సమయంలో వికృత రూపంలో భయంకరంగా ఉన్న కబంధుడనే రాక్షసుడు రామునికి తారసపడ్డాడు.


*జై 

శ్రీరామ్*

శ్రీ కృష్ణ శతకము

 **


*(39)*

*ఆది వరాహుడవయి నీ*

*వా దనుజు హిరణ్యనేత్రు! హతుజేసి తగన్*

*మోదమున సురలు వొగడగ*

*మేదిని వడి గొడుగునెత్తి! మెరసితి కృష్ణా!*


ఓ కృష్ణా! నీవు వరాహరూపమును ధరించి హిరణ్యాక్షుడను రాక్షసుని చంపి రసాతలమున క్రుంగిన భూమిని నీ కోరలతో గొడుగువలె పైకెత్తి ప్రకాశించితివి.


*జై శ్రీకృష్ణ*

ఈశ్వర

 https://drive.google.com/file/d/1i2yW4Jf2XZu3Iw4x_3B6uptWWJSJ5oIg/view?usp=drivesdk

విజయానికి నిర్వచనం

ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి అదే విజయమనుకుంటాడు. తనకు వచ్చిన ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలను పొందిన ఆటగాడికి విజయమంటే అదే. నిద్రాహారాలకు దూరమై ప్రయోగాలు చేస్తూ ప్రజలకు అనేక ఆవిష్కరణలు అందించే శాస్త్రవేత్తకు తాను సాధించిందే విజయం. చిక్కక పాదరసంలా జారిపోయే భావాలను ఒడిసిపట్టి చక్కని భాషలో వ్యక్తీకరించిన వేళ రచయితకు ఎనలేని సంతోషం. అతడి భావనలో అదే విజయం.

విజయం అనే మాట సాపేక్షమైనది. జీవితంలో విజయం సాధించడమంటే కొందరు వారి భావనలో ఉండే గొప్ప కార్యాలను చేయడమని వాదిస్తారు. వాస్తవానికి వారు చేసిన పనులు విజయాలే కాని విజయమంటే అదేకాదు. మనిషి ఆర్థిక, సామాజిక, మానసిక, ఆలోచనా తీరులతోపాటు అతడి జీవిత నేపథ్యంమీద ఆధారపడి విజయభావన వ్యక్తమవుతూ ఉంటుంది. జీవితంలో ఉండే అనేక అంశాలు, వాటి ప్రాధాన్యాన్ని బట్టి, వ్యక్తుల అభిరుచిని బట్టి వారి ప్రతిభా వ్యుత్పత్తుల ఆధారంగా వారు సాధించే ఘనకార్యాలే విజయాలు.

నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఆ బిడ్డ ఎదుగుదల ముఖ్యం. మెడ నిలబెట్టవలసిన సమయంలో నిలబెట్టడం, నడవాల్సినప్పుడు నడవడం, మనుషుల్ని గుర్తుపట్టడం... ఇలా ఏ తరుణంలో చేయవలసిన పనులు అప్పుడు చేస్తూ ఆరోగ్యంగా ఎదిగే బిడ్డను చూస్తే తల్లికి పట్టరాని ఆనందం. ఆ ఆనందమే ఆమెకు విజయమంటే.

రైతు పొలాన్ని దున్ని, విత్తనాలు చల్లి, నీటి వసతి ఏర్పరచి బిడ్డలా సంరక్షిస్తూ పోషణ చేస్తాడు. పంట చేతికి చిక్కినవేళ రైతుకది ఓ ఘనవిజయమే.

వైద్యుడు దేవుడితో సమానం. రోగులకు వైద్యం అందించి వారిని స్వస్థులను చేస్తాడు. ఒక్కొక్కసారి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఎంతో కిష్టతతో కూడినదై, రోగి ప్రాణానికి ముప్పు తేవచ్చన్న సందర్భంలో సాహసించి ఆ శస్త్రచికిత్సను వైద్యుడు చేస్తాడు. కృతకృత్యుడైన వేళ అది ఓ అద్భుత విజయమే!

రెక్కాడితేగాని డొక్కాడని శ్రమజీవులెందరో ఉన్నారు. రెక్కలు, ముక్కలు చేసుకుని వచ్చిన ఆ కూలి డబ్బుతో బిడ్డ నోటికి ముద్దనందించిన వేళ ఆ తల్లికది గొప్ప విజయమే.

దేనిలోనైనా ఒక నైపుణ్యం, పరిణతి పొందడానికి సాధన అవసరం. నిర్ణీత సమయంలో చదువు పూర్తిచేసుకోవాలి, ఉద్యోగాన్ని సంపాదించుకుని ఆర్థిక భద్రతకు దారిని ఏర్పరచుకోవాలి. గృహస్థాశ్రమ జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపి, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. ఇవీ విజయాలే.

నైతిక ప్రవర్తనతో, ధర్మబద్ధతతో, నిజాయతీ నిబద్ధతలతో జీవించాలి. అప్పుడే మన జీవితానికి ఒక విలువ, గౌరవం ఒనగూడుతాయి. ఈ రకమైన ప్రవర్తన మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అనేకమంది మనమంటే అభిమానించేటట్లు చేస్తుంది. ఇదీ విజయమే!

మనిషి ఒక ఉపాధ్యాయుడో, వైద్యుడో, శాస్త్రవేత్తో, రచయితో, సంగీతకారుడో... ఎవరైనా కావచ్ఛు కాని తాను మానవుడినన్న విషయం మరువకూడదు. తనలోని ప్రేమ, జాలి, కరుణ, నిజాయతీ, ధైర్యస్థైర్యాలు మొదలైన మానవీయ లక్షణాలను వికసింపజేయాలి. అప్పుడే మహనీయుడవుతాడు. అది అన్నింటికంటే అద్భుత విజయం, అసలైన విజయం!

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *వందేమాతరం*

                                                                                                                                                        *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  




*10.1-893-*


*మ. "వినుఁ డీ శైలము కామరూపి; ఖలులన్ వేధించు; నాజ్యాన్నముల్*

*మన మొప్పింపఁగ నాహరించె; మనలన్ మన్నించెఁ; జిత్తంబులో*

*ననుకంపాతిశయంబు చేసె మనపై" నంచున్ సగోపాలుఁడై*

*వనజాక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుఁడై.* 🌺



*_భావము: పర్వత రూపములో నున్న శ్రీకృష్ణుడు వారితో : "ఓ గోపాలకులారా! వినండి! ఈ కొండ కామరూపి అనగా కోరిన రూపము ధరించ గలిగిన మహా శక్తి. ఇది దుష్ట శిక్షణ చేయగలదు, ఇప్పుడే మనకు ఆనందము కలిగిస్తూ నేతితో వండిన వంటలు అందించగా ఆరగించిన్నది కదా! మనపై కరుణాదృష్టితో మనము సమర్పించిన నైవేద్యములను స్వీకరించినది కదా!", అనగానే మరల తన సహజ స్వరూపములోనికి వచ్చిన శ్రీకృష్ణునితో కలిసి గోపాలకులందరూ భక్తి శ్రద్ధలతో కోరికలు తీర్చే కల్పవృక్షము వంటి ఆ పర్వతమునకు నమస్కరించిరి._* 🙏



*_Meaning: Sri Krishna presently in the form of mountain told the Yadava folk: "This mountain has the mystic power of getting into any form of its choice and can destroy evil and all demons. Just now you all saw that it has consumed all the food items served duly accepting our prayers with compassion towards us". Then he came back to his human form and together with the people assembled there worshipped the mountain with reverence and devotion."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

మూకపంచశతి

 *దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


🌷 మూకపంచశతి 🌷


🌷 ఆర్యాశతకము 🌷


🌹8.

శ్లోకం


శ్రితకమ్పాసీమానం శిధిలిత పరమ


శివధైర్య మహిమానమ్ 


కలయే పాటలిమానం

       కఞ్చనకఞ్చుకితభువనభూమానమ్


   🌺భావం: 


పరమశివుని ధీరత్వమహిమను శిధిలముగావించి ,ఈ సమస్త భువనమును కంచుకము(వస్త్రము)గాధరియించిన, ఒకానొక విద్యుల్లేఖ వంటి ఎఱ్ఱనివర్ణముతో ప్రకాశించు ఆ పవిత్ర కంపానదీతీరవాసిని కంచికామాక్షీ దేవిని ధ్యానించెదను.🙏


🌼కంపానదీ తీరభూమియగు కాంచిక్షేత్రమున కొలువైన కామాక్షీ దేవి ,కామేశ్వరుని ధైర్యాన్నిఓడించిన కామసంజీవని,సకల భువనసమూహాలను పైవస్త్రముగా ధరియించిన పరాశక్తి అయిన ఒకానొక (ఎఱ్ఱని ) చైతన్య స్వరూపాన్ని సదా ధ్యానించెదను 🙏


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను 

పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


ధర్మో రక్షతి రక్షితః

🙏🙏🙏

*ధర్మము-సంస్కృతి*

చిదగ్నికుండసంభూతా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 9 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


చిదగ్నికుండసంభూతా – దేవకార్యసముద్యతా  


సంభూతా అనగా ప్రభవించినది అని అర్థము. లోకములో ఏ ప్రాణి అయినా అగ్నిలో తన రూపము కోల్పోతుంది. సంభవించే ప్రాణి ఉంటుందా! ఆవిడ పుట్టినది మామూలు అగ్నికుండము కాదు చిదగ్నికుండము. భండాసురుడు పెట్టే బాధలు భరించలేక దేవతలు అందరూ కలిసి పెద్ద హోమకుండము ఏర్పాటు చేసి, పరమశివుడు తెచ్చిన వాయువును అగ్నిగా నిక్షేపించి, అందులో మామూలు కట్టెలు వెయ్యకుండా తమ శరీరభాగములను హవిస్సులుగా సమర్పిస్తే, దేవతలు భండాసురుని చేత భాధలు పొందుతున్నారని వాడిని నిర్జించడానికి అమ్మవారు ఆ అగ్నిహోత్రము నుంచి పైకి వస్తున్నది. చిదగ్నికుండము అందరిలో ఉంటుంది. అందులోనుంచి ఆవిర్భవిస్తున్న అమ్మవారిని చూడాలి అంటే కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళాలి. మనలోనే ఉన్న చిదగ్నికుండము కట్టెలు లేకుండా ఎలా ప్రకాశిస్తున్నది అనగా జ్ఞానమనే అగ్ని ప్రకాశిస్తూ ఉంటుంది. అగ్నికి వేడి ఒక్కటే కాక ప్రకాశము కూడా ఉంటుంది. ప్రకాశము కలిగిన జ్ఞానము, అజ్ఞానమనే చీకటిని తీసేస్తుంది. అజ్ఞానము పోతే మోక్షయోగ్యత కలుగుతుంది. ‘బ్రహ్మసత్యం – జగత్ మిథ్య’ అన్న భావము అనుభవములోకి వస్తే జ్ఞానం. నామరూపములు కనపడుతుంటే మాయ. ఈ మాయను దాటాలి అంటే అమ్మవారి అనుగ్రహము ఉండాలి. ఇంకొకటి కనపడదు అంతటా ఈశ్వరుడే కనపడతాడు. ఆ ప్రకాశములో అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. చిదగ్నికుండసంభూతా అన్నప్పుడు ఆవిడ ఆవిర్భవిస్తు పైకి వస్తున్న స్వరూప దర్శనము ప్రారంభమయితే దేవతల కార్యము కొరకు రావడము లేదు అన్నది గ్రహించ గలుగుతారు. హాయిగా తిని, హాయిగా తిరిగి, హాయిగా పడుకోవాలని అనుకుంటూ ఎప్పుడూ హాయి హాయి హాయి అనేవాడు మనలోనే ఉన్న భండాసురుడు. ఎప్పుడూ ఈ శరీరముతో తాదాత్మ్యత చెందుతూ దానికి సుఖముగా ఉన్నది చూడాలనుకునే ఈ భండప్రవృత్తిని నశింప చెయ్యడానికి అమ్మవారు వస్తున్నది. రాక్షసులు మన దేహములోనే ఉంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనే ఆరుగురు దొంగలు జ్ఞానమనే రత్నమును అపహరించుకుని పోవాలని చూస్తుంటారు. ‘అమ్మా ! ఈ రాక్షస బాధ పడలేకపోతున్నాను. నువ్వే రక్షించి సత్వగుణమును ప్రవేశ పెట్టాలి’ అని శరణాగతి చేసే భక్తులలో ఆవిర్భవించి వారిని తన మార్గములో తిప్పుకుంటుంది. దేవకార్యము అంటే లోపల ఉన్న మంచి లక్షణములను రక్షించి చెడ్డ లక్షణములను పోగొడుతుంది. అలా రక్షించే సౌజన్యమే దేవకార్యసముద్యత.



దేవాలయాలు




















 

శిల్ప నైపుణ్యం










 

ప్రవచనములు


 

**హిందూ ధర్మం** 49 (విద్య)

 **దశిక రాము**




శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో మళ్ళీ మనిషి ఇతర గ్రహాలపై అడుగుపెట్టాడు. విశ్వం యొక్క రహస్యాన్ని చేధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఇంకా అంతులేని ప్రశ్నలు వేల కొద్ది పుట్టుకొస్తున్నాయి. కొన్నిటికి సమాధానం ఉండదు. కొన్ని చేధించడం కష్టం. వీటిని తెలుసుకోవద్దని కానీ, ఇవి అవసరం లేదని కానీ వేదం, శాస్త్రం ఎప్పుడు చెప్పలేదు. వేదంలో కంప్యూటర్ మొదలైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది. కానీ ఇదంతా బాహ్య విషయజ్ఞానం. విద్య అంటే ఏమిటి? దేన్ని తెలుసుకుంటే ఇక ఏది తెలుసుకోవలసిన అవసరం ఉండదో, ఏది అర్దమైతే ఈ లోకంలో రహస్యాలన్నీ అర్దమవుతాయో, దేన్ని తెలుసుకున్న క్షణంలోనే మానవ మస్తిష్కానికి వచ్చే సమస్త ప్రశ్నలకు సమాధానం తొలగుతుందో, ఏ జ్ఞానం చేత ఇక మనిషికి ప్రశ్నలు అనేవి తలెత్తవో, అదే విద్య. దాని గురించే ధర్మం మాట్లాడుతోంది.


ఈ విద్య మన గురించి చెప్తుంది. 'యత్ పిండాండే తత్ బ్రహ్మాండే' అని సంస్కృత వాక్కు ఒకటి ఉంది. ఏదైతే ఈ పిండాండంలో (శరీరంలో) ఉందో, అదే బ్రహ్మాండంలో కూడా ఉంది. ఎక్కడో ఉన్న విషయాన్ని అర్దం చేసుకోవడం కంటే మనలో ఉన్న విషయాన్ని అర్దం చేసుకోవడం సులభం. ఈ రహస్యం మనకు దగ్గరగా ఉంది. మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? జీవితంలో వచ్చే సుఖదుఖాలకు, కష్టనష్టాలకు కారణం ఏమిటి? అసలు అందరిలో ఉన్న 'నేను' ఎవరు? ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి అనేక రహస్యాలను విస్పష్టం చేస్తుంది విద్య.


ఇంకోమాటలో చెప్పాలంటే ఎవరో చనిపోతారు. అందరూ ఏడుస్తుంటారు, అక్కడున్న వారు అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు. ఇంకా శవాన్ని దహనం చేయలేదు కదా. ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. కాకపోతే ఉలుకుపలుకు లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు, అంతేకదా. మరి ఎక్కడికో పొవడమేమిటి? అక్కడ పోయింది ఎవరు? కదలకుండా ఉన్న ఆ దేహం ఎవరు? అతనే దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు కదా. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? వెళ్ళిపోయిందెవరు, అక్కడ పడి ఉన్నది ఎవరు? అతను ప్రాణం అయితే, ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోయింది? అసలు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానం చెప్తుందీ విద్య.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏

https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU


*ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి* గ్రూప్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

*🌷సృష్టి రహస్య విశేషాలు...!!-2🌷*

 🙏మీ తిరుపరి శ్రీధర్ రెడ్డి🙏




*సృష్ఠి యవత్తు త్రిగుణములతోనేఛ ఉంటుంది*

.

దేవతలు జీవులలో చేట్లు అన్ని వర్గలలో మూడే గుణములు ఉంటాయి

1 సత్వ గుణం

2 రజో గుణం

3 తమో గుణం

.

*( పంచ భూతంలు అవిర్బావాం )*

,

1 ఆత్మ యందు ఆకాశం

2 ఆకాశం నుండి వాయువు

3 వాయువు నుండి అగ్ని

4 అగ్ని నుండి జలం

5 జలం నుండి భూమి అవిర్బవించాయి.

.

5 ఙ్ఞానింద్రియంలు

5 పంచ ప్రాణంలు

5 పంచ తన్మాత్రలు

5 ఆంతర ఇంద్రియంలు

5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు

.

*1 ( ఆకాశ పంచికరణంలు )*

.

ఆకాశం – ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )

ఆకాశం – వాయువులో కలవడం వల్ల ( మనస్సు )

ఆకాశం – అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )

ఆకాశం – జలంతో కలవడంవల్ల ( చిత్తం )

ఆకాశం – భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి


*2( వాయువు పంచికరణంలు )*

.

వాయువు – వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)

వాయువు – ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )

వాయువు – అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )

వాయువు – జలంతో కలవడంవల్ల ( ప్రాణ )

వాయువు – భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.


*3 ( అగ్ని పంచికరణములు )*

.

అగ్ని – ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )

అగ్ని – వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )

అగ్ని – అగ్నిలో కలవడంతో ( చక్షువు )

అగ్ని – జలంతో కలవడంతో ( జిహ్వ )

అగ్ని – భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టేను.


*4 ( జలం పంచికరణంలు )*

.

జలం – ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )

జలం – వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )

జలం – అగ్నిలో కలవడంవల్ల ( రూపం )

జలం – జలంలో కలవడంవల్ల ( రసం )

జలం – భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టేను.


*5 ( భూమి పంచికరణంలు )*

.

భూమి – ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )

భూమి – వాయువుతో కలవడం వల్ల ( పాని )

భూమి – అగ్నితో కలవడంవల్ల ( పాదం )

భూమి – జలంతో కలవడంతో ( గూహ్యం )

భూమి – భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టేను.

.

*( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు*

.

1 శబ్ద

2 స్పర్ష

3 రూప

4 రస

5 గంధంలు.

.

*5 ( పంచ తన్మాత్రలు )*

.

1 చెవులు

2 చర్మం

3 కండ్లు

4 నాలుక

5 ముక్కు

.


*5 ( పంచ ప్రాణంలు )*

,

1 అపాన

2 సామనా

3 ప్రాణ

4 ఉదాన

5 వ్యాన

.

*5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మఇంద్రియంలు )*

,

1 మనస్సు

3 బుద్ది

3 చిత్తం

4 జ్ఞానం

5 ఆహంకారం

.

1 వాక్కు

2 పాని

3 పాదం

4 గుహ్యం

5 గుదం

.

*6 ( అరిషడ్వర్గంలు )*

,

1 కామం

3 క్రోదం

3 మోహం

4 లోభం

5 మదం

6 మచ్చార్యం

.

*3 ( శరీరంలు )*

,

1 స్థూల శరీరం

2 సూక్ష్మ శరీరం

3 కారణ శరీరం

.

*3 ( అవస్తలు )*

,

1 జాగ్రదవస్త

2 స్వప్నవస్త

3 సుషుప్తి అవస్త

.

*6 ( షడ్బావ వికారంలు )*

,

1 ఉండుట

2 పుట్టుట

3 పేరుగుట

4 పరినమించుట

5 క్షిణించుట

6 నశించుట

.

*6 ( షడ్ముర్ములు )*

,

1 ఆకలి

2 దప్పిక

3 శోకం

4 మోహం

5 జర

6 మరణం


*.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )*

,

1 చర్మం

2 రక్తం

3 మాంసం

4 మేదస్సు

5 మజ్జ

6 ఎముకలు

7 శుక్లం

.

*3 ( జీవి త్రయంలు )*

,

1 విశ్వుడు

2 తైజుడు

3 ప్రఙ్ఞాడు

.

*3 ( కర్మత్రయంలు )*

,

1 ప్రారబ్దం కర్మలు

2 అగామి కర్మలు

3 సంచిత కర్మలు

.

*5 ( కర్మలు )*

,

1 వచన

2 ఆదాన

3 గమన

4 విస్తర

5 ఆనంద

.

*3 ( గుణంలు )*

,

1 సత్వ గుణం

2 రజో గుణం

3 తమో గుణం

.

*9 ( చతుష్ఠయములు )*

,

1 సంకల్ప

2 అధ్యాసాయం

3 ఆభిమానం

4 అవధరణ

5 ముదిత

6 కరుణ

7 మైత్రి

8 ఉపేక్ష

9 తితిక్ష

.

10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )

( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )

.

1 ఆకాశం

2 వాయువు

3 ఆగ్ని

4 జలం

5 భూమి

.

*14 మంది ( అవస్థ దేవతలు )*

,

1 దిక్కు

2 వాయువు

3 సూర్యుడు

4 వరుణుడు

5 అశ్వీని దేవతలు

6 ఆగ్ని

7 ఇంద్రుడు

8 ఉపేంద్రుడు

9 మృత్యువు

10 చంద్రుడు

11 చతర్వకుడు

12 రుద్రుడు

13 క్షేత్రజ్ఞుడు

14 ఈశానుడు

.

*10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )*

,

1 ఇడా నాడి

2 పింగళ

3 సుషుమ్నా

4 గాందారి

5 పమశ్వని

6 పూష

7 అలంబన

8 హస్తి

9 శంఖిని

10 కూహు

11 బ్రహ్మనాడీ

,

*10 ( వాయువులు )*

,

1 అపాన

2 సమాన

3 ప్రాణ

4 ఉదాన

5 వ్యానా

6 కూర్మ

7 కృకర

8 నాగ

9 దేవదత్త

10 ధనంజమ

.

*7 ( షట్ చక్రంలు )*

,

1 మూలాధార

2 స్వాదిస్థాన

3 మణిపూరక

4 అనాహత

5 విశుద్ది

6 ఆఙ్ఞా

7 సహస్రారం

.

*( మనిషి ప్రమాణంలు )*

,

96 అంగళంలు

8 జానల పోడవు

4 జానల వలయం

33 కోట్ల రోమంలు

66 ఎముకలు

72 వేల నాడులు

62 కీల్లు

37 మురల ప్రేగులు

1 సేరు గుండే

అర్ద సేరు రుధిరం

4 సేర్లు మాంసం

1 సరేడు పైత్యం

అర్దసేరు శ్లేషం

.

*( మానవ దేహంలో 14 లోకలు ) పైలోకలు 7*

,

1 భూలోకం – పాదాల్లో

2 భూవర్లలోకం – హృదయంలో

3 సువర్లలోకం – నాభీలో

4 మహర్లలోకం – మర్మంగంలో

5 జనలోకం – కంఠంలో

6 తపోలోకం – భృమద్యంలో

7 సత్యలోకం – లాలాటంలో

.

*అధోలోకలు 7*

.

1 ఆతలం – అరికాల్లలో

2 వితలం – గోర్లలో

3 సుతలం – మడమల్లో

4 తలాతలం – పిక్కల్లో

5 రసాతలం – మొకల్లలో

6 మహతలం – తోడల్లో

7 పాతాళం – పాయువుల్లో

.

*( మానవ దేహంలో సప్త సముద్రంలు )*

,

1 లవణ సముద్రం – మూత్రం

2 ఇక్షి సముద్రం – చేమట

3 సూర సముద్రం – ఇంద్రియం

4 సర్పి సముద్రం – దోషితం

5 దది సముద్రం – శ్లేషం

6 క్షిర సముద్రం – జోల్లు

7 శుద్దోక సముద్రం – కన్నీరు

.

*( పంచాగ్నులు )*

,

1 కాలగ్ని – పాదాల్లో

2 క్షుదాగ్ని – నాభీలో

3 శీతాగ్ని – హృదయంలో

4 కోపాగ్ని – నేత్రంలో

5 ఙ్ఞానాగ్ని – ఆత్మలో

.

*7 ( మానవ దేహంలో సప్త దీపంలు )*

,

1 జంబు ద్వీపం – తలలోన

2 ప్లక్ష ద్వీపం – అస్తిలోన

3 శాక ద్వీపం – శిరస్సుప

4 శాల్మల ధ్వీపం – చర్మంన

5 పూష్కార ద్వీపం – గోలమందు

6 కూశ ద్వీపం – మాంసంలో

7 కౌంచ ద్వీపం – వేంట్రుకల్లో

.

*10 ( నాధంలు )*

,

1 లాలాది ఘోష – నాధం

2 భేరి – నాధం

3 చణీ – నాధం

4 మృదంగ – నాధం

5 ఘాంట – నాధం

6 కీలకిణీ – నాధం

7 కళ – నాధం

8 వేణు – నాధం

9 బ్రమణ – నాధం

10 ప్రణవ – నాధం


🌺🙏🙏🙏🙏🙏🌺    


🙏మీ తిరుపరి శ్రీధరుడు🙏

ప్రవచనములు

 


కరోనానేర్పింది


 

హిందూ ధర్మం - 8

 **దశిక రాము**




ధర్మం చేతనే ఈ విశ్వం నడుస్తున్నది. అనంత విశ్వంలో సూర్యుడు మధ్యలో ఎలా నిలబడ్డాడు అంటే అది అతని ధర్మం కనుక. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం తన ధర్మం. ఇతర గ్రహాలను తనలో ఉండే ఐస్కాంత శక్తి ద్వారా ఆకర్షించి, వాటిని తన చుట్టు తిప్పుకోవడం సూర్యభగవానుడి ధర్మం కనుకనే సూర్యుడు తన ఐస్కాంతశక్తితో అంతరిక్షంలోని గ్రహాలను ఆకర్షిస్తున్నాడని, ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్పక కొన్ని లక్షల ఏళ్ళకు పూర్వమే వేదం స్పష్టం చేసింది. దీన్ని వైజ్ఞానికంగానూ, వైశేషికంగానూ మనం దర్శించవచ్చు. కానీ వీటన్నిటి వెనుక సూక్ష్మంగా ధర్మం ఉంది. భూమి తన చుట్టు తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తన నిర్దేశిత కక్ష్యలో తిరగడం భూమి ధర్మం. 


ఈ సృష్టి అనేక అణువుల సమూహం. సృష్ట్యాదిలో పరమాత్మ సంకల్పం వలన అణువులన్నిటి మధ్య ఒక ఆకర్షణ ఏర్పడి, భూగోళంగా, ఇతర గ్రహ నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. ఈ సృష్టి అంతమయ్యేవరకు అవి అలా కలిసి ఉండాలనేది సృష్టి ధర్మం. కనుక అట్లా కలిసి ఉన్నాయి, వాటిని ఒక శక్తి కలిపి ఉంచుతోంది. అట్లాగే సృష్టి అంతమయ్యే సమయానికి ఈ అణువులన్నీ, వేటికవి విడిపోతాయి. ఎందుకంటే అది వాటి ధర్మం, పరమాత్మ వాటి ధర్మాన్ని అలా నిర్దేశించాడు కాబట్టి. వీటికి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పిన కారణాలను మనవాళ్ళు వైశేషికదర్శనంలో ఎప్పుడో చెప్పారు. కానీ సూక్ష్మంలోకి వెళ్తె, వీటిని నడిపిస్తున్నదని ధర్మమే అని గుర్తించారు.


అగ్ని అన్నిటిని కాల్చడం దాని యొక్క ధర్మంగా పరమాత్మ నిర్దేశించాడు. అది తన ధర్మాన్ని అనుసరిస్తుంది. అన్ని ద్రవపదార్ధాలు ఉన్నా, నీరు మాత్రమే దాహం తీర్చగలదు. పెట్రోల్ బావులు వంద ఉన్నా, గుక్కేడు నీళ్ళు లేకపోతే మనిషి ప్రాణం పోతుంది. దాహం తీర్చడం నీటి యొక్క ధర్మంగా పరమాత్మ పేర్కొన్నాడు కనుక నీరు దాహం తీరుస్తోంది. అట్లాగే గాలి, భూమి కూడా. ప్రోటాన్, ఎలట్రాన్, న్యూట్రాన్‌లో ఉండే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ తత్వాలు వాటి వాటి ధర్మాలు. వాటి మధ్య ఆకర్షణ ఏర్పడడం, విద్యుత్ అయస్కాంతక్షేత్రం ఏర్పడడం ఇవన్నీ, ధర్మాన్ని అనుసరించి జరుగుతున్నవే. ఈ విధంగా ధర్మం విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వం నడవడానికి మూలమైన సూత్రాలే (basic principles) ధర్మం. 


తరువాయి భాగం రేపు


**ధర్మో రక్షతి రక్షితః**


మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


94 - అరణ్యపర్వం.


మార్కండేయమహర్షితో సద్గోష్ఠిలో ధర్మరాజు, శ్రీకృష్ణుడు మొదలైనవారు వున్న తరుణంలో, సత్యభామా, ద్రౌపదీ అల్లంతదూరంలో, ఒక చెట్టు క్రింద కూర్చుని సరదా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.


ఆ సమయంలో సత్యభామ ' ద్రౌపదీ ! అసమానశూరులైన అయిదుగురు భర్తలను మెప్పించి, వారిని నీ ఆకర్షణలో ముంచి, యే విధమైన పొరపొచ్చాలు లేకుండా యెలా నెట్టుకురాగలుగుతున్నావు ? నీ గురించి ఆ విషయంలో యెప్పుడూ ఒకింత ఆశ్చర్యమూ, ఆ రహశ్యం తెలుసుకోవాలనే వుత్సాహమూ కలుగుతూ వుంటుంది. ఈ విజయం యేదైనా మంత్రసాధన వలన సాధించావా ? లేక యేదైనా ఔషధవిద్య నేర్చుకున్నావా ? లేక అశ్వనీ దేవతలు మూలికా వైద్యము అనుగ్రహించారా ? దాపరికం లేకుండా నాకు చెప్పవా ? అష్టభార్యలతో జీవిస్తున్న నా పతిదేవుడు శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకోవడానికి, నీవు చెప్పే రహశ్యం నాకు వుపయోగపడవచ్చును. నాపతి నాకే స్వంతమవాలనే స్వార్ధం యేభార్యకైనా వుండడంలో తప్పులేదు కదా ! ' అని ద్రౌపదిని అడిగింది.


దానికి ద్రౌపది చిరునవ్వుతో, ' సత్యభామా దేవి యేనా యీప్రశ్న నన్ను అడిగింది ? మనం పాతివ్రత్యంలో జీవించే మహిళలం. మనకు యీచర్చ అంత సమంజసం కాదేమో ! ' అని అన్నది. అయినా సత్యభామ వత్తిడి చెయ్యడంతో, ద్రౌపది చెప్పసాగింది : 


' ఏ భర్త అయినా తనభార్య తనను మంత్రతంత్రాలతో వశపరచుకోవాలని ప్రయత్నిస్తున్నది అనితెలుసుకుంటే, తనప్రక్కలో కట్లపాము వున్నట్లుగా భయపడడా ? ఆమెను చూసినప్పుడల్లా, యెంతో భయంతో, ఆందోళనతో వుంటాడు, తనపై యే మంత్రప్రయోగం చేస్తుందో అని. అలాంటి భర్త శాంతి సౌఖ్యాలకు దూరమై, అసలు సంసారిక జీవనాన్ని అసహ్యించుకుంటాడు. '

' ఆవిషయం తన భర్త శత్రువులకు తెలిస్తే, ఆమె ద్వారా విషప్రయోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషం వికటించి, అనేక రోగాలు వచ్చే సమస్య కూడా వున్నది. కాబట్టి యేభార్యకూడా అట్టి ఆలోచనే చెయ్యకూడదు. '


' అయితే, నీవు యెంతో ఉత్సుకతతో నా నడవడిక గురించిన రహశ్యం అడుగుతున్నావు కాబట్టి చెబుతాను.విను. నేను ఏనాడూ నా భర్తలముందు అహంకారంతో సంచరించను. వారికి యేవిధంగా నేను ప్రవర్తిస్తే ఆనందంగా వుంటుందని భావిస్తారో, అలానే నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ విధంగా వారిని ఆనందింప జేస్తూ, నేనూ ఆనందం పొందుతాను. వారితో దుష్టసంభాషణలు చెయ్యను. అసభ్యభంగిమలలోవారి కంటబడను. పరపురుషుల ముఖాలలోనికి దృష్టిసారించి సంభాషణలు చెయ్యను. ఏ విషయం అయినా చర్చిస్తున్నప్పుడు, నా భర్తల మనోభావాలు వారిముఖాలలో చదవగలిగే శక్తి సంపాదించుకున్నాను. ఆవిధంగానే సంభాషణ కొనసాగిస్తాను. నా భర్తలు, భృత్యులు భుజించిన తరువాతే, నేను భోజనం చేస్తాను. '

' నా భర్తలు మేలుకుని వున్నంతవరకు, వారికి చేదోడు వాదోడుగా వుంటాను. వారు నిద్రించిన తరువాతనే, నేను నిద్రిస్తాను. అదేవిధంగా, వారు నిద్రలేచేముందే నేను పడకపైనుండి లేచి దైనందిన కార్యక్రమాలు మొదలుపెడతాను. వారు ఇంట లేననప్పుడు ద్వారందగ్గర నిలబడను. వనవిహారాలు యెప్పుడూ ఒంటరిగా చెయ్యను. ఏ సందర్భంలో కూడా, భర్తల ముందు గానీ, వేరే వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు గానీ, అతిగా నవ్వను. '


' ఇంటిని అందంగా అలంకరిస్తాను. శాకపాకాలు నా పర్యవేక్షణలో శుచిగా రుచిగా తయారుచేస్తాను. సోమరితనాన్ని నా దగ్గరకు రానివ్వను. ఎట్టి పరిస్థితులలో అబద్దం ఆడను. నా భర్తలకు యిష్టంలేని వాటిపై వ్యామోహం పెంచుకోను. అత్తగారిని ప్రేమగా చూసుకుంటాను. నా పుట్టినింటి వారిగురించి అసందర్భంగా, అనవసరంగా గొప్పలు చెప్పను. మెట్టినింటిని కించపరచను. '


' బ్రాహ్మణులకు సువర్ణపాత్రలలో భోజనాలు ఏర్పాట్లు చేసేదాన్ని. ఆ సువర్ణపాత్రలు నా సంరక్షణలో వుండేవి. భృత్యుల పేర్లు అందరివీ నాకు జ్ఞాపకం వుండేవి. జంతువులకు పోషణ, వాటి బాగోగులూ నా పర్యవేక్షణలో జరిగేవి. నేను నా భర్తల దినచర్యలలో అధికభాగం వారి రాచకార్యాలకు, ఉపాసనా కార్యక్రమాలకు వెచ్చించే విధంగా చూసుకునేదానిని. '


' ఈ విధమైన ప్రవర్తన కారణంగానే నా భర్తలు నాకు వశమయ్యారు. వశీకరణాలు, మంత్రతంత్రాలు నాకు తెలీవు. వాటి ఆలోచన కూడా నాకు యెప్పుడూ రాలేదు. '

అని సుదీర్ఘంగా చెప్పింది ద్రౌపది సత్యభామకు. ఆమె చక్కని ప్రవచనాభరితమైన వాక్కులకు సత్యభామ యెంతో సంతోషించి, తాను అడిగిన ప్రశ్నకు బాహాటంగానే సిగ్గుపడింది. ' ద్రౌపదీ ! పరిహాసంగా యీ ప్రసంగాన్ని ప్రారంభించాను. ఓ అయోనిజా ! నన్ను క్షమించు. యెంతో చక్కగా లోతుగా విడమర్చి చెప్పావు. ' అని సత్యభామ ద్రౌపదిని దగ్గరకు తీసుకున్నది.  


దానికి ద్రౌపది, ' సత్యా ! నేను యేవిధమైన కపటంతో చెప్పలేదు. భర్త మనస్సు యెలా వశం చేసుకోవాలో, యింకా చెబుతాను విను. ' భర్త గృహద్వారం ప్రవేశిస్తుండగానే, నవ్వుతూ యెదురువెళ్ళాలి. భర్త ఏకాంతం లో చెప్పే విషయాలు గోప్యంగా వుంచాలి. రహశ్య సంభాషణలు నీ ద్వారా బయటకు వెళ్ళినాయని తెలిస్తే నీ భర్త యిక నిన్ను నమ్మడు. ఏనాడూ రహశ్యాలు నీతో పంచుకోడు. నీ భర్త వైపు వారిని చులకన మాటలతో నిందిస్తూ భర్త వద్ద మాట్లాడవద్దు. భర్తకు హితులెవరో, విరోధులెవరో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించు. చివరిగా ఒకే మాట చెబుతాను. ' నీ భర్త శ్రీకృష్ణునికి నాభార్య సత్యభామకు నామీద ప్రేమ అధికంగా వున్నది, సంపూర్ణ హృదయంతో నన్ను అనుసరిస్తుంది. అనే భావం కలిగిననాడు నిన్ను విడిచి శ్రీకృష్ణుడు క్షణంకూడా వుండలేడు. అని ముగించింది ద్రౌపది.


ఈ విధంగా, కొన్నిరోజులు సత్యా కృష్ణులు కామ్యకవనం లో పాండవులతో సంతోషంగా గడిపి, తిరిగి ద్వారకకు బయలుదేరి వెళ్లారు. 


అని జనమేజయుని కి వైశంపాయనమహర్షి చెప్పాడని, శౌనకాది మహామునులకు, సూతుడు నైమిశారణ్యంలో చెప్పాడు. 

  

స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

, ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః. 🙏

 ౧౦౩, ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః. 🙏


ఇంద్రవజ్ర(త త జ గ గ..యతి.౮)

అక్రోధ మందస్మితాంబ! యాజ్ఞా

చక్రాంతరాళస్థ! ప్రశాంత రూపా!

వక్రప్రవృత్తుల్ విడఁ బాపుమమ్మా!

చక్రిన్ మదిన్ గాంచఁగ సాగనిమ్మా.🙏



స్రగ్ధర. .....(మ ర భ న య య య ...యతి ౧ . ౮ . ౧౫.) 

ఆజ్ఞాచక్రాంతరాళ స్థనగనె శుభ లక్ష్యంబులే చేరు మమ్మున్,

విజ్జానంబీవెగా దేవి యొసగుచు శుభాపేక్షఁ గల్పింతువమ్మా.

సుజ్ఞానంబే భవానీ! శుభ గతిని రహించున్ జయంబుల్ వరించున్.

మాజ్ఞానాక్షిన్ విడన్ నీమముననొనరఁ బ్రేమన్సదా చేయుమీవే. 🙏


ఆజ్ఞాచక్రాంతరాళస్థ పాదపద్మములకు సేవింపులతో

చింతా రామకృష్ణారావు

59వ పద్యం


మ.

గతి నీవంచు భజించు వార లపవర్గం బొందగా, నేల సం

తతముం గూటికినై చరింప? వినలేదా? “యాయురన్నం ప్రయ

ఛ్ఛతి” యంచున్ మొఱవెట్టగా శ్రుతులు? సంసారాంధ కారాభిదూ

షిత దుర్మార్గులు గాన గానబడవో శ్రీకాళహస్తీశ్వరా!

*మహా ప్రతిభామూర్తి మహాభినిష్క్రమణం*/

 ఈరోజు (26-9-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹 *మహా ప్రతిభామూర్తి మహాభినిష్క్రమణం*// చావుపుట్టుకలకు అతీతమైన కీర్తిశరీరులు కొందరుంటారు. నేటి తరంలో, బాలు ఆ కోవకు చెందినవారు. పాట రూపంలో ఎప్పటికీ చిరంజీవిగా వుంటారు. మనిషి ఉన్నంతకాలం మాట ఉంటుంది. మాట ఉన్నంతకాలం పాట ఉంటుంది. పాట ఉన్నంతకాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉంటారు. ఆయన కళకు ప్రాంతాల హద్దులు లేవు. ఆయన ప్రతిభను కొలిచే కొలబద్దలు అంతకంటే లేవు. తెలుగువారెంత ప్రేమిస్తారో, తమిళులు అంతగా పూజిస్తారు, కన్నడిగులు అంతే తీరున ఆరాధిస్తారు. ప్రతి భాషీయుడు బాలు నా ఇంటి మనిషి అనుకుంటారు. అన్ని భాషల కథానాయకులు, నటులు తమ సొంత గొంతుగా భావిస్తారు. ఆ పాట పాడుతోంది .... ఆ నటుడే అన్నట్లుగా, అందరినీ భ్రమలోకి తీసుకెళ్లే అసాధారణ ప్రతిభామూర్తి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. జీనియస్ అనే పదం నూటికి నూరు శాతం బాలుకు సరిపోతుంది. సహజ సిద్ధమైన ప్రజ్ఞామూర్తిని జీనియస్ అంటారు.పుట్టుకతో వచ్చిన ప్రతిభ,కళ కలగలసిన పూర్ణస్వరూపం బాలసుబ్రహ్మణ్యం. ఏ విషయాన్నైనా వెనువెంటనే గ్రహించే ప్రతిభ, గ్రహించి హృదయంలో ధరించే ధారణా ప్రతిభ, ధరించినదానిని పరమాద్భుతంగా సృజనాత్మకంగా ఆవిష్కరించే ప్రదర్శనా ప్రతిభ, ఏ గొంతునైనా, ఏ రూపాన్నైనా ఏ భావాన్నైనా అలవోకగా అనుకరించి, అనుసరించే ధ్వన్యనుకరణ ప్రతిభ, ఏ భాషలోనైనా అద్భుతంగా పాడడమే కాదు, అంతే సహజంగా మాట్లాడే భాషా ప్రతిభ, ఎటువంటి పాటనైనా ఇట్టే పాడగలిగే గానప్రతిభ బాలసుబ్రహ్మణ్యంలో ఉన్నట్టుగా భారతీయ నేపథ్య గాయకులలో ఎవ్వరికీ లేదు. నవరసాలు నదీ ప్రయాణమంత సహజంగా ప్రవహిస్తాయి.ముఖ్యంగా శృంగారం, వీరం,కరుణ రసాల ఆవిష్కరణలో బాలు స్థాయి శిఖరం. గాయకుడు,స్వరకర్త, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, మిమిక్రీ కళకారుడు,రచయిత, ప్రయోక్త.. ఇలా అన్నింటినీ తనలోనే నింపుకొని, ప్రదర్శించి,రక్తికట్టించే బహుముఖ ప్రతిభామూర్తి. గొప్ప గాత్ర సంపద బాలుకు లభించిన గొప్ప వరం.ఫ్లూట్, కంజర వంటి వాయిద్యాలను కూడా అపురూపంగా వాయిస్తారు. ఏ విషయాన్నైనా అవలీలగా గ్రహించే శక్తి, అద్భుతంగా ప్రదర్శించే ప్రతిభ బాలును అందరికంటే భిన్నంగా నిలబెట్టాయి. వీటన్నింటికి తోడు మానవ సంబంధాలు, ప్రజాసంబంధాలు కూడా చాలా ఎక్కువ. పాడుతా తీయగా కార్యక్రమంలో పాడిన చిన్నపాప మొదలు -రాష్ట్రపతి వరకూ అందరితో సత్ సంబంధాలు ఉంటాయి. మంచితనం, ప్రేమతత్త్వం, సహాయం చేసే సద్గుణం, భోళాతనం,స్నేహశీలత బాలుని ఎందరికో దగ్గరచేశాయి. ఎందరో బాలుకు దగ్గరయ్యారు. వినయం, సహనం ఆయన భూషణం. అదే సమయంలో, ఆత్మగౌరవం ఆయన సంపద. ఘంటసాల వంటి దివ్యగాత్ర సంపన్నులు ఉన్న సమయంలోనూ బాలు రాణించారు. ఘంటసాల వెళ్లిపోయిన తర్వాత పాటకు తోడునీడగా నిలిచి, ఐదు దశాబ్దాల పాటు పాటకు జవజీవాలను,రసపోషకాలను అందించి ,ఆత్మగౌరవాన్ని కట్టబెట్టి.సృజన సుఖాన్ని పంచారు. తెలుగువారికి ఒక కన్ను ఘంటసాల, ఇంకొక కన్ను బాలసుబ్రహ్మణ్యం. జ్ఞాననేత్రమైన మూడవ కన్నుకూడా బాలసుబ్రహ్మణ్యమే. బాలువంటి బహుకళా స్వరూపమైన గాయకుడు ఇప్పుడప్పుడే పుట్టకపోవచ్చు. సినిమా ప్రపంచంలో నిలిచి గెలిచాడు. తన కెరీర్ ప్రారంభంలో, ఘంటసాల వెళ్లిపోయిన కొత్తల్లో, పేరున్న పెద్ద నటులెవ్వరూ బాలుతో పాడించుకోడానికి ఒప్పుకోలేదు. ఒక్క కృష్ణ తప్ప, అందరూ తిరస్కరించారు. తర్వాత కొద్ది కాలంలోనే, మాకు నువ్వే పాడాలి.., అంటూ వెంటపడ్డారు.అంతగా వాళ్లను లొంగదీసుకున్న ప్రతిభ బాలు సొత్తు. కమెడియన్లు, విలన్లు, హీరోలు అందరికీ బాలు పాటే కావాలన్నంతగా పరిశ్రమలో బాలు ప్రభవించారు. త్రివిక్రమ స్వరూపుడుగా అవతరించారు.ఒక్కొక్కరోజు పదిహేను పదహారు పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ సంగీత దర్శకుల దగ్గరికి అవకాశాల కోసం తిరిగారో, పాడించుకోవడం కోసం వాళ్లు బాలు చుట్టూ క్యూలు కట్టారు. తమిళ, కన్నడ భాషల్లో పాడడం కోసం ఆ భాషల మూలాలను గ్రహించి, యాసలు తెలుసుకొని భాషలు నేర్చిన ఘన గాయకుడు ఎస్పీబి. బాలు పాటకు ఆ భాషీయులంతా పాదాక్రాంతులయ్యారు. ఇవన్నీ... ప్రతిభ, సాధన, ఏకాగ్రత, పట్టుదల,ఇష్టంతో సాధించుకున్న కీర్తి కిరీటాలు. తన స్నేహితులెందరికో లెక్కలేనన్ని సహాయాలు చేశారు. వారి బాధలు తనవిగా చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.వారి బాధ్యతలు తనవిగా భావించి తోడుగా నిలిచారు. తనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన కోదండపాణిని గుండెగుడిలో పెట్టుకొని పూజించారు. తను ఆరాధ్యదైవంగా భావించే ఘంటసాల విగ్రహాన్ని సొంత ఖర్చులతో హైదరాబాద్ లో స్థాపించారు. హరికథా ప్రపూర్ణుడైన తండ్రి సాంబమూర్తి నిలువెత్తు కాంశ్య విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్ఠించారు.ప్రతి ఏటా బిక్షా పూర్వక త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించి తండ్రి సంకల్పానికి సంపూర్ణ సిద్ధి కలిగించారు. వారసత్వంగా వచ్చిన ఇంటిని కంచిపీఠానికి వేదవిద్యకోసం అందించారు.ప్రకాశం జిల్లా మాచవరం బాలు తండ్రిగారి సొంతవూరు.అక్కడి నుండి నెల్లూరు వెళ్లిపోయారు.అదే బాలుకు సొంతఊరుగా అయిపొయింది.తల్లివారిది ఆంధ్రప్రదేశ్ -తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కోనేటంపేట.ఈ ఊరుతోనూ బాలుకు గొప్ప బంధాలు పెనవేసుకుని వున్నాయి.ఈ ఊరికి కూడా తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేశారు.బాలుని మరచిపోవడం ఎప్పటికీ ఎవ్వరికీ సాధ్యం కాదు.పద్మభూషణ్ మొదలు ఎన్నో ఘన గౌరవాలు, ఖండాతర ఖ్యాతిని సంపాయించుకున్నారు. సంపూర్ణమైన శాస్త్రీయ సంగీత కచ్చేరి ఇవ్వాలనే ఒక కోరిక తీర్చుకోకుండా వెళ్లిపోయారు.పాటంటే ఎంత ఇష్టమో, తెలుగుభాషంటే అంతకంటే ఇష్టం.జీవితమంటే ఇంకా ఇష్టం.ప్రతి క్షణాన్ని అనందంగా గడపాలని కోరుకునే రసపిపాసి.కొన్నింటికి ప్రత్యామ్నాయమైన సృష్టి ఉండదు. బాలుకు పర్యాయ పదం బాలు మాత్రమే. ఇన్నేళ్లు, ఇంతమందికి, ఇంత ఆనందాన్ని పంచిపెట్టిన బాలు ఇలా ఇన్ని రోజులపాటు ఆస్పత్రిలో బాధపడి వెళ్లిపోవడం చాలా బాధాకరం.అఖండ ప్రతిభామూర్తి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం దివ్యజ్యోతి అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. మహాప్రతిభామూర్తి మహాభినిష్క్రమణకు గుండెలు గొంతు చేసుకొని హృదయాంజలి సమర్పిద్దాం. -మాశర్మ🙏