26, సెప్టెంబర్ 2020, శనివారం

*సుందరకాండ - తొమ్మిదవ సర్గ* *(06,07)*

 :


రావణుని భార్యలైన రాక్షస స్త్రీలతోనూ, అతడు చెరబట్టి తెచ్చిన రాజకన్యలతోనూ ఆ భవనం నిండి ఉంది. ఏనుగులు, రక్షక భటులతో కూడుకొన్న ఆ భవనం, మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలాలు, పాములు తిరుగాడుతూ, పెనుగాలులు వీస్తూ ప్రచండంగా ఉన్న సముద్రాన్ని పోలి ఉంది.




*(08)*


కుబేరునికి ఎంత ఐశ్వర్యం ఉందో, ఆకుపచ్చ గుర్రాలు పూన్చిన రథం వాహనంగా గల ఇంద్రునికి ఎంత ఐశ్వర్యం ఉందో, అంతటి ఐశ్వర్యం స్థిరంగా ఆ రావణుని గృహంలో కొలువై ఉంది.




*(09)*


రావణుని గృహంలోని సంపత్సమృద్ధి, యక్షాధిపతియైన కుబేరుని, యముని, వరుణుని సమృద్ధితో తులతూగుతుంది. కాదు వాటిని మించినదని చెప్పడం సత్య దూరం కాదేమో.




*(10)*


రావణుని భవన మధ్య భాగంలో, మత్తగజాల ఆకృతిలో రూపొందిన అనేక శిఖరాలతో కూడుకొని, చక్కగా నిర్మితమైన ఒక భవనం (పుష్పకం) వాయుపుత్రుడైన హనుమంతుని కంటబడింది.




*జై శ్రీహనుమాన్*

కామెంట్‌లు లేవు: