26, సెప్టెంబర్ 2020, శనివారం

దానం అనేది మహత్తర కార్యం



మనది ధర్మభూమి, కర్మభూమి, దాన ధర్మాలతో మానవసేవే మాధవ సేవగా భావించే మహోన్నతమైన భూమి. ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో నడిచిందని, కలియుగంలో ఒక పాదంతో నడుస్తోందని చెప్పుకుంటున్నాము. దీనికి కారణమేమిటి?


అంపశయ్య మీద ఉన్న భీష్ముని '' ధర్మం అంటే ఏమిటి'' తనకి చెప్పమని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు నాయనా ఇతరులకు ఏమి చేస్తే మన మనసు బాధపడుతుందో అటువంటి పని మనం ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మము. అట్టి ధర్మమే స్వధర్మము. దీనిలో భాగమే దానము. పాత్రత తెలుసుకొని ఇచ్చిన దానము ధర్మాన్ని నిలబెడుతుంది. అ ధర్మం సమాజానికి ఎంతో అవసరము. భూలోకంలో నాలుగు అత్యుత్తమ దానాలు ఉన్నాయని కన్యాదానము, గోదానము, భూదానము, విద్యాదానం అని చెబుతారు. కన్యాదానం వల్ల కుటుంబం ఏర్పడుతుంది. గోదానం, భూదానము వల్ల కుటుంబానికి కావలసిన పాడిపంటలు ఏర్పడతాయి. విద్యా దానం వల్ల అజ్ఞానం అంతరించి జీవన విధానానికి ఒక దారి లభిస్తుంది. కానీ ఆర్తులకు, దీనులకు, జీవుల కు ఆకలి తీర్చే దానం అన్న దానము. అన్నదానమే అన్ని దానాల్లోకి గొప్పది. ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది దానధర్మము చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి.........

కామెంట్‌లు లేవు: