*
*(97)*
*కూర్మావతారివై కుధరంబు క్రిందను గోర్కెతో నుండవా కొమరు మిగుల*
*వారాహమూర్తివై వనభూములను జొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షునపుడు*
*నరసింహమూర్తివై నరభోజను హిరణ్య కశిపుని ద్రుంచవా కాంతిమీర*
*వామనరూపివై వసుధలో బలిచక్రవర్తి నణంపవా వైరముంచి*
*ఇట్టి పనులెల్ల చేయగా నెవ్వరికిని దగును నరసింహ నీకిది దగునుగాక*
*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*
శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహ స్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.
తండ్రీ! కూర్మమూర్తివై మందర పర్వతము క్రింద నిలిచినావు. వరాహమూర్తివై హిరణ్యాక్షుని శిక్షించినావు. నరసింహమూర్తివై హిరణ్యకశిపుని త్రుంచినావు. వామనమూర్తివై బలిచక్రవర్తిని అణచివేశావు. ఈ లోకం నుండి పాతాళానికి పంపావు. ఇలాంటి కార్యాలన్నీ నీకు గాక మరెవరికి సాధ్యము నరసింహా.
*జై నారసింహా*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి