26, సెప్టెంబర్ 2020, శనివారం

ఆచార్య సద్భోదన*

 *


నిజమైన భక్తులు ఎన్నటికీ తమ మూలాధారమైన భగవంతుని ఉనికిని విస్మరించలేరు. ఒక ఆదర్శ శిష్యునిగా, ఆదర్శ భక్తునిగా మెలిగే ప్రయత్నం చేయాలి. భగవంతుని ఋణం మనం తీర్చుకోలేనిదనే సంగతిని విస్మరించరాదు. విశ్వాన్ని సృజించిన భగవంతునికీ, ఆయన వారసులైన సమస్త ప్రజానీకానికీ యావజ్జీవితం సేవ చేసినా సరిపోదు. మన జీవన విధానం ద్వారా ఆయనను మెప్పించగలిగితే అంతకన్నా భాగ్యం మరొకటి ఏమి ఉంటుంది. అలాకాక మనోవాక్కాయముల ద్వారా ఆయనను నొప్పించే విధంగా ప్రవర్తిస్తే దానిని మించిన దురదృష్టం ఉండబోదు. మన మూలాధారమైన భగవంతుని నిరంతర ధ్యానం ద్వారా అభ్యసించడంకన్నా ఉత్తమమైనది మరొకటి ఉండబోదు. ఆ స్పృహను క్షణకాలం కూడా విస్మరించరాదు. మన హృదయాన్ని అవిశ్రాంతంగా భగవదాలోచనలతో నింపివేయాలి.

సర్వేజనా స్సుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: