*(06)* విశిష్ట రీతుల్లో నిర్మితమైనదవడం వలన ఆ విమానం రూపంలో విశిష్టతను సంతరించుకొంది. అనేక శిఖరాలతో కూడుకొన్నదై, చూడడానికి విచిత్రంగా కనిపిస్తూన్నది. మనోహరంగా, శరత్కాల చంద్రుని మల్లే నిర్మలంగా చిన్నచిన్న శిఖరాలు గల మహాపర్వత శిఖరంలా ఉన్న ఆ పుష్పకాన్ని హనుమంతుడు చూశాడు.
*(07)* కుండలాలతో శోభిస్తూన్న ముఖాలు గలవారూ, మహాకాయులూ, గగన విహారులూ అయిన రాక్షసులూ, గుండ్రని వంకర విశాలమూ అయిన కళ్ళు గల మహావేగవంతమైన వేలకొద్దీ భూతాలూ మోస్తూ ఉన్నట్లున్న పుష్పక విమానాన్నీ హనుమంతుడు చూశాడు.
*(08)* వసంత ఋతువులో పూచే పుష్పరాసులచే మనోజ్ఞమై, వసంత మాసంకన్నా రమ్యమై ఒప్పారుతున్న ఆ పుష్పక విమానాన్ని వానర వీరులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు చూశాడు.
(శ్రీమద్వాల్మీకి రామయణమునందలి సుందరకాండలోని ఎనిమిదవ సర్గ సమాప్తం)
*జై శ్రీహనుమాన్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి