*శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమై చెలగుచుండు*
*నే మనుజుడైన నెలమి నీ శతకంబు భక్తితో విన్న సత్ఫలము గలుగు*
*జెలగి ఈ పద్యముల్ జేర్చి వ్రాసినవారు కమలాక్షు కరుణను గాంతురెపుడు*
*నింపుగా పుస్తకం బెపుడు పూజించిన దురితజాలంబులు దొలగిపోవు*
*నిద్ధి పుణ్యకరంబని యెపుడు జనులు గష్టమనక పఠించిన గలుగు ముక్తి*
*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*
శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.
తండ్రీ! శేషప్ప చెప్పిన ఈ ఆనంద పద్యాలు చెవులకు ఇంపుగా ఉంటాయి. ఈ శతకాన్ని భక్తితో విన్నవారికి సత్ఫలు వస్తాయి. ఈ పద్యములను లిఖించివారు కమలాక్షుని కరుణకు పాత్రులవుతారు. ఈ గ్రంథమును పూజించిన వారికి పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. పుణ్యప్రదమైన ఈ శతకమును కష్టమనుకోకుండా నిత్యము పఠించువారికి ముక్తి కలుగుతుంది.
*(శ్రీశేషప్ప కవి గారి శ్రీనరసింహ శతకము సమాప్తం)*
*జై శ్రీనారసింహా*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి