వాయునందనుడైన హనుమంతుడు శ్రేష్ఠమైన ఆ భవన సముదాయం నడుమ, విస్తృతమైన ఒక భవన శ్రేష్ఠాన్ని చూశాడు.
*(02)*
రాక్షసేంద్రుడైన రావణుని ఆ భవంతి అర యోజనం వెడల్పు ఒక యోజనం పొడవు గలదై అనేక ప్రాసాదాలతో కూడినదై అలరారుతోంది.
*(03)*
విశాలమైన నేత్రాలు గల విదేహరాజు జనకుని కుమార్తెయైన సీతాదేవి కోసం శత్రు సంహారకుడైన హనుమంతుడు ఆ మందిరం యావత్తూ అన్వేషిస్తూ తిరిగాడు.
*(04,05)*
తర్వాత శ్రీమంతుడైన హనుమంతుడు అనేక మంది రాక్షసుల గృహాలను పరిశీలించి చూసి చివరగా రాక్షస రాజైన రావణుని నివాస భవనంలోకి ప్రవేశించాడు. ఆ భవనంలో అన్ని చోట్లా రెండు దంతములున్న ఏనుగులు, మూడు దంతాలు గల ఏనుగులు, నాలుగు దంతాల ఏనుగులు నిలబడి ఉన్నాయి. అ భవనాన్ని ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉన్న రాక్షసులు సదా సర్వదా పరిరక్షిస్తూన్నారు. అయినప్పటికీ ఆ భవనం విశాలంగానే కావస్తున్నది.
*జై శ్రీహనుమాన్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి