26, సెప్టెంబర్ 2020, శనివారం

**సౌందర్య లహరి శ్లోకము** - 8

 దశిక రాము**




**శ్రీ శంకర భగవత్పాద విరచితము**


**శ్రీ లలితాంబికాయైనమః**


**సుధా సింధోర్మధ్యే**


**సురవిటపి వాటీ పరివృతే**


**మణిద్వీపే నీపోపవనవతి చిన్తామణి గృహే**


**శివాకారే మఞ్చే**


**పరమశివ పర్యఙ్కనిలయామ్**


**భజన్తి త్వాం ధన్యాః**


**కతిచన చిదానన్ద లహరీమ్!!**


తల్లీ పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో కల్ప వృక్షాల

వరుసతో చుట్ట బడినదైన కదంబచెట్ల పూదోటలలో చెలువొందే

చింతామణుల తో నిర్మితమైన గృహంలో , శక్తి రూపమైన 

(త్రికోణపు) మంచములో , శివ పర్యంక నిలయవై నిరతిశయానంద

ప్రవాహ రూపమైన నిన్ను కొందరు ధన్యులు మాత్రం సేవిస్తున్నారు.

(అందరికీ సామాన్య ముగా నీ సేవ లభించదని భావం)


**ఓం గణేశ జనన్యైనమః,** 

**ఓం గుహాంబికాయైనమః, **

**ఓం జగన్నేత్రేన్నమః**


🙏🙏🙏


**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: