* వసంత ఋతువు -
వసంత ఋతువు నందు కఫము ప్రకోపించి అనేక రోగములను కలుగజేయును . అందువలన అట్టి కఫముని వాంతి , ముక్కు ద్వారా , విరేచనం ద్వారా కఫాన్ని పోగొట్టి కఫాన్ని తగ్గించవలెను .
ఈ సమయంలో పాతవి అయిన గోధుమలు , శొంటి, వేగిసచెక్క , చందనము , తుంగముస్తలు కాచబడిన నీళ్ళనిగాని , తేనె కలిపిన నీళ్ళని గాని పానము చేయవలెను .
ప్రాతఃకాలం సమయమున శరీరం మర్దించుకొని నలుగుపెట్టుకొని స్నానం చేయవలెను . మధ్యాహ్నమున నీటికాలువుల యందు , చెట్లు ఎక్కువ ఉన్న తీగలు గల చెట్లు ఉన్న ఉద్యాన వనాల యందు గడపవలెను .
వసంత ఋతువు యందు చల్లటి పదార్థాలు , మధురపదార్థాలు , సేవించరాదు . పగలు నిద్రించరాదు.
* గ్రీష్మ ఋతువు -
ఈ గ్రీష్మ ఋతువు నందు తీక్షణమైన సూర్యప్రకోపం వలన శరీరం నందు కఫం తగ్గిపోయి వాతం పెరుగును . ఈ ఋతువు నందు ఉప్పు , కారం , పులుపు కలిగిన పదార్థాలు , వ్యాయామం , సూర్యకిరణాల యందు కూర్చోవడం నిషేదించవలెను .
ఈ కాలం నందు మధురపదార్థాలను మాత్రమే వాడవలెను . పంచదారతో కూడిన పేలాల పిండి మొదలగు పదార్థాలు తినవలెను . రాత్రిసమయంలో వెన్నెలలో ఆరుబయట ఉంచబడిన గేధ పాలలో పంచదార వేసుకొని అవి తాగవలెను .
మధ్యాహ్న సమయం నందు చెట్లు ఉండి నీడ ఎక్కువ గల ప్రదేశాలలో పైనుంచి నీరు జాలువారే విధంగా జలగృహము నిర్మించుకొని అందు నివసించవలెను . రాత్రి సమయంలో మేడ పై భాగాల్లో వెన్నెల లో లేదా ఆరుబయట ఉండవలెను .
* వర్షఋతువు -
వర్షఋతువు నందు ఆకాశం మేఘాలతో ఆవరించబడి ఉండినప్పుడు జలకణములతో కూడి ఉండునట్టియు , వేసవికాలం తరువాత చల్లాగా అయినట్టి గాలి వలన లోపల ఉండు వాతం దోషం పొందును. భూమి యొక్క ఉష్ణం కాల స్వభావం చేత ఆమ్ల స్వభావం పెరిగినటువంటి జలం తాగుట చేత శరీరం నందలి పిత్తం దోషం పొందును. సాలెపురుగులు మొదలగు విష మూత్రాదులతో కలిసి ఉన్న వర్షపు నీరు సేవించుట చేత కాలస్వభావం చేత మందంగా ఉన్న జఠరాగ్ని వలన కఫం దోషం పొందును.
ఈ విధంగా ఒకే కాలం నందు వాత, పిత్త, కఫాలు మూడు ఒకేసారి దోషం పొందుట వలన వాటిని శమింపచేయునట్టి మరియు జఠరాగ్ని పెంచే ఆహారాలు ఉపయోగించవలెను .
ఈ కాలం నందు పాతవైన యావలు , గొధుమలు , నేతితోను , శొంఠితోను చేయబడిన మాంసరసం , పెసరకట్టు , చాలా కాలం నుంచి నిలువ ఉంచబడిన మద్యం , వర్షం నుంచి పడిన నీరు , బావినీరు , కాచిన నీరు వీటిని ఉపయోగించాలి . ఈ ఋతువునందు అధిక శ్రమ చేయక శరీరం నందు గంథం పూసుకొని , సుగంధ ద్రవ్యముల ధూపమును వేసుకొని మేడ యందు నివశించవలెను .
ఈ వర్షాకాలం నందు నదీజలం , కడుపు నిండా తినడం , పగటినిద్ర , శ్రమ ఎక్కువుగా ఉండే పనులు , ఎండ వీటిని చేయరాదు .
* శరదృతువు -
శరదృతువు నందు పిత్త దోషం ప్రకోపించును . ఈ కాలం నందు చేదు , తీపి , వగరు కలిగినటువంటి ఆహారాలు లొపలికి తీసికొనవలెను . ఆకలి అయినప్పుడే పదార్థాలు తీసికొనవలెను . శాలి ధాన్యం , పెసలు, పంచదార, ఉసిరికాయ , చేదుపోట్ల , తేనె , హంసలు తిరిగే తటాకం నందలి నీరు ఉపయోగించవలెను .
చందనం , వట్టివేరు , పచ్చకర్పూరం , ముత్యాల హారం , పుష్పాల దండలు , పట్టుబట్టలు వీటిని వాడవలెను . మేడ పైభాగం నుండి సూర్యాస్తమయం అయిన సమయం లో వెన్నెలని సేవించవలెను . ఈ ఋతువు నందు మంచు , యావక్షారం వంటి లవణాలు , పెరుగు , నూనె , వస , ఎండ , ఘాటుగా ఉండు మద్యములు, పగటి నిద్ర , తూర్పుగాలి వీటిని వదిలివేయవలెను .
* హేమంత ఋతువు -
హేమంతఋతువు యందు మధురరసం , ఆమ్లరసం , లవణ రసం గల పదార్థాలు భుజించవలెను . ప్రాతఃకాలం నందు ఆకలిగా ఉన్నచో కొంచమే భుజించవలెను . వాతాన్ని
హరించే తైలములతో అభ్యంగనం, శిరస్సు తైలముతోమర్దించుకొనుట, మల్లయుద్ధం , శరీరమునకు మర్దనం చేయించుకొనుట చేయవలెను . స్నానం చేసినతరువాత కుంకుమపువ్వుని , కస్తూరిని కలిపినూరి శరీరంకి పూసుకుని అగరుచెక్కతో దూపం వేసుకొనవలెను .
ఈ కాలం నందు బలకరమైన మాంసరసం , మాంసములు , బెల్లంతో చేసిన మద్యం , మధుర మద్యం , గోధుమపిండి , మినుములు , చెరుకుపాలు వీనితో చేయబడిన పదార్థాలు , నూతనమైన అన్నం , వస , తైలం వీటిని ఉపయొగించవలెను . స్నానం కొరకు వేడినీటిని మాత్రమే ఉపయొగించవలెను . చలిబాధ లేకుండా ఉండటం కొరకు దుప్పటి, కంబళి , శాలువ వీటిని కప్పుకొనవలెను . కొంతసమయం సూర్యకిరణముల యందు ఉండి చెమట పట్టే విధంగా చూసుకొనవలెను . భూగృహముల యందు నివశించవలెను .
* శిశిరఋతువు -
హేమంత ఋతువు నందు పాటించే నియమాలను ఈ ఋతువు నందూ పాటించవలెను .
పైన చెప్పిన విధంగా ఆయా ఋతువుల్లో ఆయా ఆహారపదార్థాలని తీసుకోవడం , ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం వలన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి