.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
శా||
మాయామోహతమిస్రముం గెడపగా మార్తాండబింబం; బవి
ద్యాయాసంబు నదల్చు నోషధి; విషాదాంభోధి దాటింపగా
సాయంబౌ సుదృఢోడుపమ్మిక ; పునర్జన్మంబు నిర్మూలముం
జేయం జాలు శివామృతమ్ము నిడవా? శ్రీ సిద్ధలింగేశ్వరా!
భావం;
మాయా మోహము అనేటువంటి చీకటిని పారద్రోలే సూర్యబింబ లాంటిది,
అవిద్య అనేటువంటి రోగమును తొలగించే ఔషధము వంటిది,
శోక సముద్రాన్ని దాటించడానికి ఉపయోగపడే దృఢమైన నావ వంటిది,
పునర్జన్మను నిర్మూలింపజేయగల అమృతం వంటిది అయిన శివామృతాన్ని నాకు ప్రసాదించు స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి