*
*(96)*
*మత్స్యావతారమై మడుగు లోపల జొచ్చి సోమకాసురు ద్రుంచి చోద్యముగను*
*దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలల్ల బ్రహ్మకిచ్చితి వీవు భళియనంగ*
*నా వేదముల నంది యాచార నిష్ఠల ననుభవించుచు నుందు రవని సురులు*
*సకల పాపంబులు సమసిపోవు నటంచు మనుజులందరూ నీదు మహిమ దెలిసి*
*యుందు రిటువంటివారు నీ యునికి దెలియు వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ*
*భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*
శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహ స్వామీ! నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలు వాడవు. దుష్టులను శిక్షించువాడవు.
తండ్రీ! మత్స్యావతారమునెత్తి సాగరములో ప్రవేశించి, సోమకాసురుణ్ణి వధించి వేదాలు తెచ్చి, వాటిని దేవతలకు, భూసురులకు మేలుగోరి ఇచ్చావు. వాటిని భూసురులు నియమనిష్ఠలతో అనుభవిస్తున్నారు. నీ మహిమలో సర్వపాపాలు ప్రక్షాళనమౌతాయని వీరు తెలుసుకున్నారు. నిన్ను తెలిసిన వారికి శీఘ్రంగా ముక్తి లభిస్తుంది.
*జై నారసింహా*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి