6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

ధృతరాష్ట్ర కౌగిలి*

 

*ధృతరాష్ట్ర కౌగిలి*

జాతీయం - దాని నేపథ్యం.


వేద వ్యాసుని సాంత్వన వాక్యములు విన్న తరువాత, బంధు మిత్రుల శవాలకు అంత్య క్రియలు చేయడానికి, ధృతరాష్ట్రుడు గాంధారి వెంటరాగా మిగతా అంతఃపుర స్త్రీలతో పాటు కురుక్షేత్ర యుద్ధ భూమికి వెడలుతాడు. సరిగ్గా అదే కర్మ కాండల పనిలో ఉన్న పాండవులు వారికి తారసిల్లుతారు.


ధర్మరాజుతో సహా ఒక్కొక్కరు, ధృతరాష్ట్రునికి నమస్కరిస్తే, వారిని దగ్గరికి తీసుకొని గుడ్డిరాజు ఓదారుస్తాడు. భీముని వంతు వచ్చి ముందుకు వచ్చి వెళ్ళబోతుంటే, కృష్ణ పరమాత్మ వారిస్తాడు. అప్పటికప్పుడు భీముని బోలిన ఒక ఇనుప విగ్రహాన్ని రప్పించి, ధృతరాష్ట్రుని ముందు నిలబెడతాడు. ఈ విగ్రహం దుర్యోధనుని మందిరంలో ఉండేది. దీనితో ప్రత్యర్థి అయిన భీముడిని ఊహించుకొని దుర్యోధనుడు మల్ల గదా యుద్ధములను సాధన చేసేవాడు. యోగీశ్వరుడైన కృష్ణునికి ఎక్కడో ఉన్న విగ్రహాన్ని ఇక్కడికి రప్పించడం ఎంత పని! కృష్ణుడు విగ్రహాన్ని, ధృతరాష్ట్రునికి అతి సమీపములోనికి చేరుస్తాడు. అందరూ నిశ్శబ్దమైపోయి జరగబోయే విషయం ఉగ్గబట్టుకొని చూడసాగారు.


ఆ విగ్రహాన్ని కౌగిలించుకొని ధృతరాష్ట్రుడు ఏమి చేశాడొ తిక్కన గారు, ఆంధ్ర మహాభారతము స్త్రీ పర్వములో ఒక లయవిభాతి వృత్తము ద్వారా వివరించాడు.


*పెరుగగ నిజాంగములు*

*శరభస పరిస్ఫురణము*

*అరుదుగ జనావళులు*

*నిరుపమ విధంబిన్*

*కరయుగముతోలవియ*

*ఉరము సదియన్ పెలుచ*

*తరగగ పురిన్ నెత్తురులు*

*ముఖ రంధ్రముల*

*పరవశత మానసము*

*పొరయుటకు చొచ్చియును*

*సరిగొనగ గంటిన్*

*వరసుతునకిప్పుడును*

*పరమపద విన్మగుడ*

*కురునృపతియాప్రతిమ*

*పురినిటుల పుచ్చెన్*


అన్ని అంగములు వాటితో పాటూ శరీరము సాధ్యమైనంత పెద్దది చెసి, అదుపు తప్పిన ఉఛ్చ్వాస నిశ్వాసములతో, అన్ని ముఖ రంధ్రముల నుంచి నెత్తురు కారుతుండగా, విగ్రహమును తన యురమున బిగించి, కురు రాజు ఆ ప్రతిమను పుచ్చెలు పుచ్చెలుగా పిండి పిండి చేసి పరవశుడవడం చూసి, జనాలు అందరూ నిశ్చేష్టులయ్యారు.


కడుపులో లేని ప్రేమ కౌగిలించుకొంటే వస్తుందా? 


ఇదే ధృతరాష్ట్ర కౌగిలి!

ఇది ధృతరాష్ట్రకౌగిలి జాతీయం.

నిర్వికారనిర్వికల్పుడు

శ్రీమాత్రేనమః 


పరమాత్మ/పరమేశ్వరి పరమదయార్ద్రమూర్తి. కాని, నిర్వికారనిర్వికల్పుడు. దేనికీ చలించడు. తనకు తానుగా ఎవరికి ఎంత కష్టం వచ్చినా.... ఎంతటి అవసరం వచ్చినా... ఎంతటి సంతోషం కలిగినా... అన్నిటినీ చూస్తూ ఉంటాడు. తనకు తానుగా కల్ఫించుకోడు. కోరితే ఏదీ కూడా ఇవ్వకుండా ఉండడు. ఆ కోరికలో స్వచ్ఛత ఉండాలి. ఏది కోరినా... అది దుర్గుణమైనా సద్గుణమైనా ఇస్తాడు. కోరినది సత్తా అసత్తా అనేది జీవునియొక్క గుణాధిక్యతను (సత్త్వ రజః తమోగుణాన్ని) అనుసరించి ఉంటుంది. 


ఒకరిని చూచి *"ఈమె ఎంతో గుణవంతురాలు. ఈమె నాకు తల్లి అయితే బాగుంటుంది."* అనే కోరిక మనసులో కలిగితే... అదికూడా ఒక కర్మగా మారి ఆ కర్మఫలంగా తరువాతి జన్మలలో ఆమెకు పుత్రుడిగా/పుత్రికగా జన్మించటం జరుగుతుంది. 


ఇదే విధంగా అన్నీ ఊహించాలి. 


ఈవిధమైన కర్మలను జీవుడు ఆచరించటం లేదా కోరుకోవటం జరిగినప్పుడే భగవంతుడు ఆ కర్మఫలాలను ఇచ్చి అనుభవింపజేస్తాడు. 


అదే... మోక్షజ్ఞానాన్ని కోరుకుంటే మోక్షజ్ఞానాన్నే ఇస్తాడు. 


"అడగనిదే అమ్మైనా పెట్టదు" అన్నట్లు కోరనిదే భగవంతుడు కూడా ఏదీ ఇవ్వడు.

మీ 

*~శ్రీశర్మద*

06ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌹 _*శుక్రవారం*_ 🌹

 *🪷06ఫిబ్రవరి2026🪷*

   *దృగ్గణిత పంచాంగం* 

                    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : పంచమి* ‌రా 01.18 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : హస్త* రా 12.23 వరకు ఉపరి *చిత్త*

*యోగం : ధృతి* రా 11.37 వరకు ఉపరి *శూల*

*కరణం  : కౌలువ* మ 12.45 *తైతుల* రా 01.18 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 07.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 06.02 - 07.44*

అభిజిత్ కాలం  : *ప 11.59 - 12.45*

*వర్జ్యం    : ఉ 07.51 - 09.33*

*దుర్ముహూర్తం  : ఉ 08.55 - 09.41 మ 12.45 - 01.31*

*రాహు కాలం   :ఉ10.55 - 12.22*

గుళికకాళం      : *ఉ 08.03 - 09.29*

యమగండం    : *మ 03.14- 04.40*

సూర్యరాశి : *మకరం*                    

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.47*  

సూర్యాస్తమయం :*సా 06.14*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం        :*ఉ06.37- 08.55*

సంగవ కాలం       :*08.55 - 11.13*

మధ్యాహ్న కాలం    :*11.13 - 01.31*

అపరాహ్న కాలం   :*మ 01.31-03.48*

*ఆబ్ధికం తిధి        : మాఘ బహుళ పంచమి*

సాయంకాలం      :*సా03.48- 06.06*

ప్రదోష కాలం       :*సా 06.06- 08.36*

రాత్రి కాలం         :*రా08.36 - 11.56*

నిశీధి కాలం       :*రా11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57 - 05.47*

******************************

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*చండికా చండరూపేశా* 

*చాముండా చక్రధారిణీ*

           

            *🌷ఓం శ్రీ🪷* 

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః*🌷


🪷🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ న17.2

*శ్రీ భగవానువాచ ।*

*త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।*

*సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ।। 2 ।।*

श्रीभगवानुवाच |

त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा |

सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु || 2||


శ్రీ భగవాన్-ఉవాచ — పరమేశ్వరుడు ఇలా పలికెను; త్రి-విధా — మూడు విధములుగా; భవతి — ఉండును; శ్రద్ధా — శ్రద్ధ/విశ్వాసము; దేహినాం — జీవాత్మలకు; సా — ఏదైతే; స్వ-భావ-జా — వ్యక్తి యొక్క సహజ సిద్ధ స్వభావము నుండి పుట్టినదై; సాత్త్వికీ — సత్త్వ గుణములో; రాజసీ — రజో గుణము యందు; చ — మరియు; ఏవ — నిజముగా; తామసీ — తమోగుణము; చ — మరియు; ఇతి — ఈ విధముగా; తాం — దీని గురించి; శృణు — వినుము.


*BG 17.2 : శ్రీ భగవానుడు ఇలా పలికెను : ప్రతి ఒక్క మానవుడు తన సహజసిద్ధ శ్రద్ధ/విశ్వాసము తో జన్మిస్తాడు, ఇది, సాత్త్వికము, రాజసము, లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును. ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరించెదను, వినుము.*


*వ్యాఖ్యానం*


ఎవ్వరూ కూడా శ్రద్ధ/విశ్వాసము లేకుండా ఉండరు, ఎందుకంటే అది మానవ నైజము యొక్క విడదీయలేని భాగము. వేద శాస్త్రముల పట్ల నమ్మకం లేని వారు కూడా, శ్రద్ధ లేకుండా ఉండరు. వారి యొక్క శ్రద్ధ వేరే చోట ఉంటుంది. అది వారి బుద్ధి కుశలత పైన గాని, వారి ఇంద్రియ అనుభూతి పట్ల గాని, లేదా, వారు నమ్మిన సిద్ధాంతాల పట్ల గాని ఉంటుంది. ఉదాహరణకి, ఎప్పుడైతే జనులు ఇలా అన్నప్పుడు, ‘నేను భగవంతుడిని నమ్మను ఎందుకంటే నేను ఆయనను చూడలేకున్నాను’ అని, - వారికి భగవంతుని పట్ల విశ్వాసం లేదు కానీ, వారి కళ్లపై విశ్వాసం ఉంది. కాబట్టి, వారు తమ కళ్ళకు ఏదైనా కనిపించకపోతే అది లేదు అనుకుంటారు. ఇది కూడా ఒకలాంటి విశ్వాసమే. ఇతరులు ఇలా అంటారు, ‘ప్రాచీన శాస్త్రముల ప్రామాణికత పట్ల నాకు నమ్మకం లేదు. కానీ, ఆధునిక సైన్స్ యొక్క సిధ్ధాంతాలను నమ్ముతాను’ అని; ఇది కూడా ఒకలాంటి శ్రద్ధయే, ఎందుకంటే గడిచిన శతాబ్దాలలో సైన్స్ సిద్ధాంతాలు ఎలా మారుతూ వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాము. మనం నిజమని నమ్మే ప్రస్తుత సైన్స్ సూత్రాలు కూడా భవిష్యత్తులో తప్పని నిరూపితం కావచ్చు. ఇవి సత్యమే అని స్వీకరించటం కూడా ఒకలాంటి విశ్వాసమే. ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న, ప్రొఫెసర్ చార్లెస్ హెచ్. టౌన్స్ (Prof. Charles H. Townes), దీనిని చాలా చక్కగా వివరించాడు: 

  ‘సైన్స్ అంటేనే దానికి విశ్వాసం అవసరం. మన తర్కము (లాజిక్) కరెక్టో కాదో మనకే తెలియదు. నీవు అసలు ఉన్నావోలేవో అని నాకు తెలియదు, నేను ఉన్నానో లేనో నీకు తెలియదు. ఏమో మనం ఇదంతా ఊహించుకుంటున్నామో ఏమో. ఈ జగత్తు అంతా ఇక్కడ కనిపించినట్టుగానే ఉన్నది అని నాకు నమ్మకం, అందుకే నీవు ఉన్నావని నమ్ముతున్నాను. నేను దీనికి ఏమీ రుజువు చూపించలేను.... కానీ, నేను వ్యవహారం చేయటానికి ఏదో ఒక ఆధారాన్ని ఒప్పుకోవాలి. “మతం అంటే నమ్మకం” మరియు “సైన్స్ అంటే విజ్ఞానం” (“religion is faith” and “science is knowledge”) అని అనుకోవటం చాలా తప్పని అనుకుంటాను. మనం శాస్త్రజ్ఞులం ఈ బాహ్య ప్రపంచం ఉందని మరియు మన సిద్ధాంతం/తర్కము నిజము అని నమ్ముతాము. దీనిని చాలా సహజంగా తీసుకుంటాము. కానీ, ఇవి కూడా విశ్వాసంతో చేసే పనులు. వీటిని నిరూపించలేము.’ 

 భౌతిక శాస్త్రవేత్త అయినా, లేదా సామాజిక శాస్త్రవేత్త అయినా, లేదా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయినా, విజ్ఞానాన్ని ఒప్పుకోవటానికి నమ్మకంతో వేసే అడుగు చాలా ముఖ్యమైనది. శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు ఎందుకు వేర్వేరు మనుష్యులు వేర్వేరు ప్రదేశాలలో తమ నమ్మకం ఉంచుతారో వివరిస్తున్నాడు.


ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org/chapter/17/verse/2 రసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘమాస శివస్తుతి

 *మాఘమాస శివస్తుతి

         6/2/26 (27)

 కం .

పరులకు మేలది జేసెడు

పరహితమను మంచిబుద్ధి వర ముగనిమ్మా

పరమశివా ప్రజ్ఞలనిడు

ధరణిన్ నీ భక్తుకెపుడు దప్పక దేవా||

|| (27)

కం.

సుగుణగుణ సాంప్రదాయము

ప్రగతులగొను పథము నదియు పార్థివనిడుమా

సుగుణమణి శంభు యీశా

సుగతిని నడిపించు మమ్ము సుర గణశ్రేష్ఠా||

|| (28)

డా|| శేషం వేణుగోపాల శర్మ 

       స్కూల్ అసిస్టెంట్ తెలుగు 

              కరీణ్ణగరమ్

సమస్యకు పూరణ.

  *ఎవc డెవc డెవ్వc డెవ్వ డెవ్వc డెవ్వc డెవం డెవc డెవ్వc డెవ్వcడో*

ఈ సమస్యకు నా పూరణ. 


జవములు వీరముల్ గలిగి సార్థక జన్ములు యుద్ధభూమిలో


నవకములైన యోచనలు నామరులెత్తులు మర్మతంత్రముల్


శ్రవణము సేయు సంజయుడ! చక్కగ దెల్పుము శత్రువెవ్వడో


ఎవc డెవ్వc డెవ్వcడెవ్వc డెవc డెవ్వc డెవం డెవc డెవ్వc డెవ్వcడో.


(నామరులు =నాము +మరులు =పాచికలు) 


అల్వాల లక్ష్మణ మూర్తి.

నిర్లక్ష్యం.. అతివేగం..*

 *జై శ్రీమన్నారాయణ*

*06.02.2026, శుక్రవారం*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*ఉత్తరాయనం - శిశిర ఋతువు*

*మాఘ మాసం - బహుళ పక్షం*

*తిధి : పంచమి రా2.46 వరకు*

*వారం : భృగువాసరే (శుక్రవారం)*

*నక్షత్రం : హస్త రా2.05 వరకు*

*యోగం : ధృతి రా1.31 వరకు*

*కరణం : కౌలువ మ2.25 వరకు*

*తదుపరి తైతుల రా2.46 వరకు*

*వర్జ్యం : 9.42 - 11.23*

*దుర్ముహూర్తము : ఉ8.50 - 9.35*

*మరల 12.36 - 1.21*

*అమృతకాలం : 7.47 - 9.28*

*రాహుకాలం :10.30-12.00*

*యమగండ/కేతుకాలం : మ3.00 - 4.30*

*సూర్యరాశి: మకరం* 

*చంద్రరాశి: కన్య*

*సూర్యోదయం: 6.35*

*సూర్యాస్తమయం: 5.53*


*


*నిర్లక్ష్యం.. అతివేగం..* 

*ఇంటి నుంచి బయటకు వెళ్తే.. తిరిగి వచ్చే వరకు భయం ...*


ఈ మధ్య కాలంలో యువత బైక్‌ లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఉడుకు రక్తం నరనరాన ఉప్పొంగే యువత అతివేగంగా బైక్‌ నడపడం ఎంత ప్రమాదకరమో, ఒక్కొక్కసారి అది తమ ప్రాణాల మీదకు తెస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా, అతివేగం అనర్థదాయకం వంటి బోర్డులను రాష్ట్ర రవాణా శాఖ వారు ఎన్ని పెట్టినా వాటిని పెడచెవిన పెడుతూ యువత అత్యంత వాయు వేగంతో తమ మోటార్‌ బైక్‌లను దౌడు తీయిస్తున్నారు.


ఏ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో, ఎప్పుడు ఎవరి ప్రాణం ఎలా పోతుందో అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. బైక్‌పై రోడ్డెక్కిన మనిషి ఇంటికి వచ్చేదాక ఆ కుటుంబ సభ్యులకు అదో పెద్ద ఆందోళనే. తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులేనని సంబంధిత గణాంకాలు తెలుపుతున్నాయి. మితిమీరిన వేగం, హెల్మెట్‌ పెట్టుకోవాలన్న స్పృహ కూడా లేకపోవడమే శాపాలవుతున్నాయి..


ప్రాణం విలువ బంధాన్ని కోల్పోయిన ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండని ఏమరపాటు నిర్లక్ష్యం అంతులేని విషాదాన్ని నింపుతుంది. నిండు నూరేళ్ల జీవితాన్ని హరిస్తుంది. వారిని ప్రేమించే వారిని, వారిపై ఆధారపడ్డ వారిని సుడిగుండంలోకి నెట్టేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా సగటున దాదాపుగా 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 50 శాతం ద్విచక్రవాహనదారులే ఉండటం గమనార్హం. తలకు బలమైన గాయాలవ్వడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి...


హెల్మెట్‌ ధరించకపోవటం వల్ల ఏటా సగటున 5.000 నుంచి 6 వేల మంది ప్రాణాలు రోడ్డుపాలవుతున్నాయి..


ప్రపంచంలోని మొత్తం వెహికల్స్లో మనదగ్గర ఉన్నది కేవలం ఒక్క శాతం మాత్రమే. కానీ, రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయేవాళ్లు మాత్రం మనదేశంలోనే ఎక్కువ. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం.. ఏటా ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. వాళ్లలో 10 శాతం భారతీయులే. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా-2021' కూడా ఇదే విషయం చెప్తోంది. దీని ప్రకారం మనదేశంలో 4,03,000 యాక్సిడెంట్స్ జరిగాయి. వీటివల్ల 1,55,000 చనిపోయారు..


ఏదిఏమైనా ఈ మితిమీరిన వేగం అనే అత్యంత అనారోగ్యపు అలవాటుకు పాదాక్రాంతం, బానిస అవ్వడమే గాక, వేగంగా వెళ్లడం అనేది ఓక వేలంవెర్రిగా భావిస్తున్న యువత వారి జీవితాలను వారే సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏమైనా ప్రతి ఏడాది దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఓక సందర్భంలో వేలాది మంది యువత ఈ అదుపు తప్పిన వేగం కారణంగా తమ విలువైన ప్రాణాలను మృత్యుకూపంలోకి నెట్టి వేసుకుంటుండటం అత్యంత దిగ్భ్రాంతికరం. ఇప్పటికైనా యువత తాము అంతకు తాముగా వివేకంతో వ్యవహరించి తమ వేగానికి ముకుతాడు వేయాలి. అది వారికి, ఈ సమాజానికి ఎంతో ఆరోగ్యకరం. కాబట్టి  

 *‘నేటి యువత రేపటి మన దేశ బంగారు భవిష్యత్తుకు ఆశాకిరణాలు’* అనే అత్యంత ప్రధానమైన విషయాన్ని గుర్తు పెట్టుకొని మసలుకోవాలి. దానివల్ల అటు వారికి, వారిని నమ్ముకున్న తల్లిదండ్రులకు, ఇటు దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారు...

06ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌹 _*శుక్రవారం*_ 🌹

 *🪷06ఫిబ్రవరి2026🪷*

   *దృగ్గణిత పంచాంగం* 

                    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : పంచమి* ‌రా 01.18 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : హస్త* రా 12.23 వరకు ఉపరి *చిత్త*

*యోగం : ధృతి* రా 11.37 వరకు ఉపరి *శూల*

*కరణం  : కౌలువ* మ 12.45 *తైతుల* రా 01.18 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 07.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 06.02 - 07.44*

అభిజిత్ కాలం  : *ప 11.59 - 12.45*

*వర్జ్యం    : ఉ 07.51 - 09.33*

*దుర్ముహూర్తం  : ఉ 08.55 - 09.41 మ 12.45 - 01.31*

*రాహు కాలం   :ఉ10.55 - 12.22*

గుళికకాళం      : *ఉ 08.03 - 09.29*

యమగండం    : *మ 03.14- 04.40*

సూర్యరాశి : *మకరం*                    

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.47*  

సూర్యాస్తమయం :*సా 06.14*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం        :*ఉ06.37- 08.55*

సంగవ కాలం       :*08.55 - 11.13*

మధ్యాహ్న కాలం    :*11.13 - 01.31*

అపరాహ్న కాలం   :*మ 01.31-03.48*

*ఆబ్ధికం తిధి        : మాఘ బహుళ పంచమి*

సాయంకాలం      :*సా03.48- 06.06*

ప్రదోష కాలం       :*సా 06.06- 08.36*

రాత్రి కాలం         :*రా08.36 - 11.56*

నిశీధి కాలం       :*రా11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57 - 05.47*

******************************

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*చండికా చండరూపేశా* 

*చాముండా చక్రధారిణీ*

           

            *🌷ఓం శ్రీ🪷* 

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః*🌷


🪷🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సంకల్పంలోకి దిశా నిర్దేశం

 ఖండాంతరలలో ఉన్న మన పిల్లలకి ఉన్న ప్రాంతాల్లో సంకల్పంలోకి దిశా నిర్దేశం ఇదిగో ఇలా



*వివిధ దేశాల సంకల్పాలు*  


వీటిలో తగిన మార్పులు ఉంటే సరి చేసుకొండి. 


*Sankalpam for the US*


క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐన్ద్ర ఖండే, ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే,  రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే, మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే, ఇండియానా రాష్ట్రే, మిన్నిసోటా జీవ నది తీరే,  బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే. 


*(Above is for Bloomington city in Indiana state. Please make the required changes to your city)*


*Australia*


శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే,  భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే,  హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్. 


*UK Region*


విన్ధ్యస్య  పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే, ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్ నదీ తీరే, లండన్ నగరేౌ. 


*Africa*


ప్లక్ష ద్వీపె, వింధ్యస్య నైరుతి దిక్భాగె, తామ్ర ఖండె, కెన్య దేసే,  ...... నగరరే, ....... లక్ష్మి నివాస గ్రుహె. 

 

*ముంబాయి*


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె, ముంబాయి నగరె, ....   లక్ష్మి నివాస గృహే/స్వగృహే. 


*The Middle East*


జంబూ ద్వీపే భరత వర్షే, భరత ఖండే, వింధ్యస్య  పస్చిమ  దిగ్భాగే, అరబీ మహాసాగర పస్చిమ తటె, కతార్ దేశే, దొహా నగరె,  ........ గ్రుహె. 


*Delhi*


మెరొహ్ దక్షిణ పార్స్వె, వింధ్యస్య పశ్చిమ దిగ్భాగే, ఆర్య వర్తైక ప్రదెశె, యమునా తటె, ధిల్లీ నగరె, ... గ్రుహె .  


*SINGAPORE*


మేరొ ఆగ్నేయ దిక్భాగే, మలయ ద్వీపస్య దక్షిణ భాగె, పూర్వ సముద్ర తీరే, సింహపురి మహా ద్వీపే, సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే, వసతి గృహే/లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ.And so on.


*VARANASI*


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, అశీ వరుణయొర్ మధ్యే, మహాస్మశానె, ఆనందవనె, త్రికంటక విరాజితే, అవిముక్త వారణాశీ క్షెత్రె, ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె, వసతి గ్రుహె, విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత, గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ,


*Bangalore*


శ్రీశైలస్య నైరుతి ప్రదెశె, తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె, శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె, ..... గ్రుహె ..... సమస్త దేవతా. 


*Chennai*


శ్రీ శైలస్య ఆగ్నేయ ప్రదేసే, కృష్ణ కావేరి మధ్య ప్రదేశ.


*Vishakhapatnam*


శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా గోదావరి మధ్య ప్రదేశే.


*South Korea*


జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె, మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె, కొరియా నామ ద్వీపె, వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. 


 🙏🙏🙏

శ్రీ అవినాశి లింగేశ్వరర్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1380


⚜  తమిళనాడు : తిరుప్పుకోలియూర్ (అవినాసి)


⚜  శ్రీ అవినాశి లింగేశ్వరర్ ఆలయం



💠 తిరుప్పూర్ జిల్లాలోని అవినాశి అనే పంచాయతీ పట్టణంలో ఉన్న అవినాశి లింగేశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడింది.


💠 ఈ అందమైన దేవాలయంలోని గర్భగృహలో శివుడు అవినాశిఅప్పర్ (అవినాష్ =నాశనం చేయలేని లేదా శాశ్వతమైన, అప్పర్ = తండ్రి) అని పిలువబడే లింగం రూపంలో ఉన్నాడు. 

అతని భార్య పార్వతిని కరుణాంబికై లేదా పెరున్ (గొప్ప) కరుణాయ్ (కరుణగల) నాయకి (దేవత) అని పిలుస్తారు.  


💠 కరుణాంబికై యొక్క గర్భగుడి భగవంతుని కుడి వైపున ఉంది, ఇది చాలా ప్రత్యేకమైనది.



⚜ స్థల పురాణం 


💠 హిందూ పురాణాల ప్రకారం.తిరువంచికులంలో రాజు చేరమాన్ పెరుమాళ్‌ను కలవడానికి వెళుతుండగా, సాధువు సుందరమూర్తి నాయనార్ అవినాషి గుండా వెళుతుండగా, రెండు పొరుగు ఇళ్ల నుండి విరుద్ధమైన స్వరాలు విన్నాడు. 

ఒకటి ఆనందంతో వికసించగా, మరొకటి దిగులుగా మరియు విచారంగా ఉంది. 


💠 మూడు సంవత్సరాల క్రితం, ఒకే వయస్సు గల ఇద్దరు బాలురు సమీపంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, వారిలో ఒకరిని మొసలి మ్రింగివేసిందని అతనికి చెప్పబడింది. 

బతికి ఉన్న బాలుడు ఆ రోజు తన ఉపనయనం నిర్వహించాల్సి ఉంది, అది ఒక ఇంట్లో వేడుకకు కారణం. మరోవైపు, మరొక ఇంటి సభ్యులు తమ కొడుకును కోల్పోయినందుకు దుఃఖిస్తున్నారు ఎందుకంటే అతను బ్రతికి ఉంటే తాము కూడా జరుపుకుంటామని వారు భావించారు.


💠 ఇది చూసిన సాధువు సుందరార్ వెంటనే ఆలయానికి వెళ్లి, మూడు సంవత్సరాల క్రితం మింగిన బాలుడిని తిరిగి ఇచ్చేయమని మొసలిని ఆదేశించమని ప్రభువును కోరాడు. 

సుందరార్ చనిపోయిన బిడ్డను తిరిగి బ్రతికించమని శివుడిని వేడుకుంటూ ఆత్మీయమైన పతిగం చేశాడు. 


💠 అతను నాల్గవ చరణాన్ని పాడుతున్నప్పుడు అతని ప్రార్థనలు ఫలించాయి. 

అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి ఆనందానికి, నీరు చెరువులోకి ప్రవహించడం ప్రారంభమైంది, దాని నుండి ఒక మొసలి ఉద్భవించి ఏడు సంవత్సరాల వయస్సు గల బాలుడిని బయటకు పంపింది. సాధువు సుందరార్ ఆ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి అతని ఉపనయనాన్ని కూడా ఏర్పాటు చేశాడు.   


💠 ఈ సంఘటనను పంగుని ఉత్తిరంలో ముదలై వాయ్ పిళ్ళై ఉత్సవం సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటారు 


💠 ఆలయ చెరువు ఒడ్డున సుందరర్‌కు ఒక మందిరం ఉంది మరియు ధ్వజస్తంభం దిగువన పురాణం యొక్క చిత్రం ఉంది. బాలుడు మొసలి నోటి నుండి బయటకు వచ్చినందున, ఈ ప్రదేశాన్ని పుక్కోలియూర్ అని పిలుస్తారు. 


💠 ఈ ఆలయ స్వామిని బ్రహ్మపురీశ్వరర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే బ్రహ్మ తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఇక్కడ వంద సంవత్సరాలుగా శివుడిని ఇక్కడ పూజించాడని నమ్ముతారు.


💠 రాముడు, ఐరావతం కూడా ఇక్కడ శివుడిని పూజించారని నమ్ముతారు.


💠 అవినాసి అప్పర్ ఆలయం, ఆలయంలో ప్రతిష్టించబడిన అవినాశిలింగేశ్వరుడు కాశీలోని (వారణరసి) శాఖ అని నమ్ముతారు. ఈ కారణంగా, అవినాశిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు.


💠 "కాశియిల్ వాసి అవినాశి" అనే తమిళ సామెత ప్రకారం, కాశీ-వారణాసిలో శివుని ఆశీర్వాదం కోరుకునే భక్తులు అవినాశిలోని అవినాశిలింగేశ్వరుడిని పూజించడం ద్వారా అలా చేయవచ్చని నమ్ముతారు.


💠 "కాశీ కిణారు"లోని తీర్థం (పవిత్ర జలం) మరియు అవినాశిలింగేశ్వరుడు మరియు భైరవుని విగ్రహాలను కాశీ నుండి తీసుకువచ్చారని చెబుతారు. అమావాస్య నాడు ఈ ఆలయంలోని కాశీ బావిలో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.


💠 కరుణాంబికై దేవత తపస్సు చేసి, ఇక్కడ ఉన్న  చెట్టు కింద ఉన్న లింగాన్ని పూజించేదని పురాణాలు చెబుతున్నాయి. 

ఈ ఆలయంలోని  చెట్టు బ్రహ్మోత్సవం పండుగ సమయంలో మాత్రమే వికసిస్తుంది, సంవత్సరంలో ఇతర రోజులలో కాదు. 

ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, ఇది శివుని పట్ల చెట్టుకు ఉన్న భక్తిని చూపిస్తుంది.


💠 శాస్త్రాల ప్రకారం, శని (శని గ్రహం) యొక్క ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి వశిష్ట మహర్షి ఈ ఆలయంలో పూజలు చేశాడని చెబుతారు. 

ఈ ఆలయంలో శని భగవాన్ విగ్రహాన్ని ఆయన ప్రతిష్టించాడని నమ్ముతారు. 

ఈ విగ్రహాన్ని ఇప్పుడు అనుగ్రహ మూర్తిగా పూజిస్తున్నారు.

 

💠 సాధారణంగా, శని సవాళ్లు, పరీక్షలు మరియు కర్మ న్యాయాన్ని తీసుకురావడంతో ముడిపడి ఉంటుంది. 

అయితే, ఇక్కడ అతను అనుగ్రహ మూర్తిగా పూజించబడ్డాడు. 


💠 ఆలయ ప్రధాన ద్వారం వద్ద, రెండు వైపులా నర్తన గణపతి శిల్పాలు కనిపిస్తాయి.

ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున దండాయుధపాణి విగ్రహం ఉంది మరియు ప్రదక్షిణలో మీరు 63 మంది నాయనార్ల విగ్రహాలను, పశ్చిమ చివర లేదా వెనుక వైపున సప్త లింగ విగ్రహాలను కనుగొంటారు.



💠 ఈ ఆలయం కోయంబత్తూర్ నుండి 40 కి.మీ దూరం


రచన

Santosh Kumar

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*643 వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

మునుల శపధం

తరువాత మునులు కొలనులో దిగి తామరతూడ్లను తీసుకుని వాటిని నీటిలో శుభ్రం చేసి కొలను పక్కన పెట్టారు. సంధ్యావందనం చేసుకోవడానికి కొలనులో దిగి సంధ్యావందనంచేసి కొలను బయటకు వచ్చిచూసే సరికి తామరతూండ్లు కనిపించ లేదు. వారికి అనుమానం వచ్చి శునశ్శఖుడిని మధ్యవర్తిగా పెట్టుకుని ఈ విధంగా శపధం చేయసాగారు. ముందుగా అత్రిమహర్షి లేచి " నేను కనుక తామర తూండ్లు దొంగిలించి ఉంటే ఆవును తన్నడం వలన, సూర్యుడికి అభిమఖంగా మలమూత్ర విసర్జన చేయడం వలన, వేదములు చదువకూడని రోజులలో వేదాధ్యయనం చేయడం వలన కలుగు పాపములు నాకు కలుగు కాక " అని శపధం చేసాడు. తరువాత వశిష్ఠుడు లేచి " ఈ తామరతూడ్లు దొంగిలింన వాడు వేదాధ్యయనం మానిన పాపం, సన్యాసిగా ఉండి కామకలాపం చేసిన పాపం, కుక్కను వెంట పెట్టుకుని తిరిగిన పాపముల పోతాడు " అని పలికాడు. తరువాత కశ్యపుడు లేచి " అవసరం లేకున్నా మాంసంతినడం, న్యాయసభలో ఒకరి పక్షం వహించడం, దుష్టులకు దానం చెయ్యడం, కట్టుకున్న భార్యతో పట్టపగలు చేరడం, విద్యా వంతులైన బ్రాహ్మణులను లోభబుద్ధితో ఏడిపించడం, సరకు అంతా ఒకేసారి కొని తరువాత లాభముకు అమ్మడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి కలుగు కాక " అని పలికాడు. తరువాత భరద్వాజుడు లేచి " ఈ తామరతూండ్లు దొంగిలించడం ఎట్టిదనిన జ్ఞాతులపట్ల, గోవులపట్ల, స్త్రీలపట్ల ధర్మం విడిచి ప్రవర్తించిన దానితో సమానం. యజ్ఞకుండంలో వేయవలసిన హవిస్సును కంపలలో మండుతున్న అగ్నిలో వేయడం, గురువును కించపరుస్తూ విద్యను అభ్యసించడం " అని పలికాడు. తరువాత జమదగ్ని లేచి " ఈ తామరతూండ్లు దొంగతనం ఎలా జరిగిందంటే రజస్వల అయిన భార్యతో చేరడం, తాగే నీటిలో మలమూత్రములు విసర్జించడం, ఎప్పుడూ పగప్రతీకారంతో రగిలి పోవడం, భార్యసంపాదన మీద జీవించడం ఈ తామరతూండ్లు దొంగిలించడం సమానం. ఇతరులను అతిధులుగా ఆదరించడానికి బదులు తమలోతామే ఒకరిని ఒకరు ఆదరించడంతో, అనవసరంగా పగను పెంచుకోవడం, పాడి ఆవును కొట్టడం వంటి పాపము చేసిన దానికి ఏ పాపం వస్తుందో ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి వస్తుంది " అని పలికాడు. గౌతముడు లేచి " వేదము చదువుకొని కూడా వేదాధ్యయనం చేయకపోవడం, రోజూ అగ్ని ఆరాధన చేయక పోవడం, మద్యం విక్రయించడం, వర్ణసంకరం చేసి శూద్రస్త్రీని పెళ్ళి చేసుకోవడం మొదలైన పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి సంక్రమిస్తుంది " అని గౌతముడు చెప్పాడు. తరువాత విశ్వామిత్రుడు లేచి " అర్హత కలవారిని వదిలి అర్హత లేని వారిని పనిలో పెట్టుకోవడం, అధర్మవర్తనుడు, కపటి అయిన రాజును సేవించడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వానికి సంక్రమిస్తుంది " అని అన్నాడు. ఇదంతా విని అరుంధతి నవ్వి " ఎప్పుడూ అత్తగారిని ఆక్షేపించడం, తిట్టడం, భర్తపట్ల అనిచితంగా ప్రవర్తించడం, వండుకున్నది ఎవరికి పెట్టకుండా తానే తినడం వంటి పాపములు తామరతూండ్లు దొంగిలించిన వాడికి తగులుతాయి " అన్నది అరుంధతి.ఇంతలో సేవకురాలు గండ " వండినవంట ముందు తానే తినడం, పని చేయడములో సోమరిగా కుటిలముగా ఉండడం, అబద్ధాలు చెప్పడం, కన్నకూతురిని ధనము కొరకు అమ్ముకోవడం, మంచివారికి కీడు చెయ్యడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వానికి సంక్రమిస్తాయి. అదీ కాక ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడు జీవితం అంతా ఒకరికి దాస్యం చేస్తుంటాడు " అని పలికింది. ఆమె భర్త పశుసఖుడు " ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి సంతానం కలుగదు గర్భదరిద్రుడు ఔతాడు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మాఘ పురాణం* ➖➖➖✍️ 19 వ అధ్యాయము

  ```



         *మాఘ పురాణం*  

             ➖➖➖✍️

        19 వ అధ్యాయము


మాఘ పురాణం పందొమ్మిదదవ అధ్యాయంలో, 

గృత్నృమద మహర్షి జహ్ను మునితో మాఘమాస మహిమను వివరిస్తూ, 

ఒకసారి నైమిశారణ్యంలో భృగువు, గౌతముడు, లోమశుడు, గార్గ్యుడు, మాండవ్యుడు, శంతనుడు, పాలస్త్యుడు, శౌనకుడు వంటి మహామునులు తమలో ఎవరు గొప్పవారో అని వివాదం పెట్టుకున్నారని చెప్పాడు. 

వాదన తీవ్రంగా మారి, ఒకరినొకరు దూషించుకుంటూ, కొట్టుకుంటూ హింసాత్మకంగా మారింది. 

ఈ గొడవ గురించి తెలుసుకున్న నారదుడు వైకుంఠానికి వెళ్లి శ్రీహరికి విన్నవించాడు. 

హరి సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులతో పాటు మార్కండేయుని మునుల వద్దకు పంపాడు. 

వారి రాకతో మునులు గొడవ ఆపి వారికి గౌరవం ఇచ్చారు. 


మార్కండేయుడు మునులతో వయస్సు గురించి, జ్ఞానం గురించి మాట్లాడుతూ హరికథా ప్రాముఖ్యతను వివరించాడు.

తన కంటే సనకాది మునులు బాలురైనప్పటికీ వారు ఎల్లప్పుడూ హరినామ స్మరణ, కథా ప్రసంగాలలో మునిగి ఉండడం వలన వారే గొప్పవారని చెప్పాడు. 


మార్కండేయుని మాటలతో మునులు తమ తప్పు తెలుసుకొని, హరికథా ప్రసంగాల ప్రాముఖ్యతను గుర్తించి, సిగ్గుపడి, మార్కండేయుడు, సనకాది మునులకు క్షమాపణ చెప్పారు. 


ఈ సంఘటన ద్వారా మునులు అహంకారం మాని, వినయంతో హరికథా ప్రసంగాలలో మునిగి ఉండడం ద్వారా జ్ఞానం పొందడం నేర్చుకున్నారు. గృత్నృమద మహర్షి జహ్ను మునికి మాఘమాస వ్రతం ద్వారా భగవచ్చింతన చేయడం ద్వారా జీవులు తమ అహంకారాన్ని జయించి, జ్ఞానం పొంది, భవసాగరాన్ని దాటగలరని చెప్పాడు. 


*మునుల వాగ్వాదము:*```

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. ఓయీ వినుము గోమతీ నదీ  తీరమున పవిత్రమైన నైమిశా అరణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగ నేనేయక్కువయను వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడు అను నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తి అయ్యే వరకు తపమును చేసిన వాడను. నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును.

కావున నేనే ఉత్తముడనని యనెను. మాండవ్యుడు నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదును. నిత్కర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడ అను ముని నేను యోగా అభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు,  శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడననియనెను. శౌనకుడును ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును లేరనెను. ఆ మునివరులు తమ గొప్ప తనమును బిగ్గరగా ఏవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరిని ఒకరు ధూషించుకొనుచు, కొట్టు కొనుచు వారి దండములను, ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి.

ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహ ప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించు కొనుచున్నవారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి యీ విషయమును విన్నవించెను. 


శ్రీహరియు ‘నారదా! ఆ మునులు జ్ఞానులైనను నామాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతడు సప్త మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాద పడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరిని కుశల ప్రశ్నాధికముతో శంతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.              

కొంత కాలము గడచిన తరువాత బ్రహ్మ జ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూసి ఏదురువెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై ప్రోక్షణ చేసుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూసి సనకాది మునులు ఆశ్చర్య పడి యిట్లనిరి. “మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు మునులలో ఉత్తముడవు, సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి?  వృద్దులు బాలురకు యెదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శ్రుతి వాక్యమున్నది కదా మేము అయిదేండ్లవారమే కదా!” అని పలికిరి.

ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి యిట్లనెను. “భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందు సత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవియైనచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే దుష్టుల జీవనము గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే యెక్కువగ వ్యర్థముగ అజ్ఞానియై యెక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలముననుభవించి మరల జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది.

మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా! మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు, నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును నీ హృదయ పద్మములందే యుండును. మేము క్షణ కాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే, నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను  వినుచున్న మునులు తమలో తాము యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరును మార్కండేయ మహర్షికి, సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగ శక్తి యుండని ప్రార్థించిరి.

నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతునివలన మునులు మొదలగు వారందరును శ్రుతుల సారము నెరిగిరి. శౌనకుడు మునులును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూల ధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేద వేదాంగములను సర్వ శాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్త్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహము నందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘ మాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగ అలవాటు చేసి జీవులను తరింప జేయును.

జహ్ను మునీశ్వరా! మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయ వివేకములను, సనక సనందనాదుల మహత్త్యమును, పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞాన ఫలములని యెరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్నృమద మహర్షి వివరించెను.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝   *అకృత్వా భరణం పిత్రోః* 

            *అదత్వా గురుదక్షిణామ్* |

            *కృతఘ్నతామ్ చ సంప్రాప్య* 

            *మరణాంతాచ నిష్కృతిః* ||

           

                  ( *మహాభారతం* )


తా𝕝𝕝  *తల్లిదండ్రులను పోషించకపోయినా, గురుదక్షిణ ఇవ్వకపోయినా, కృతఘ్నునుడిగా ప్రవర్తించినా దానికి ప్రాయశ్చిత్తం మరణమే....*


✍️🌹💐🌸🙏

భాగవతం

 *'భాగవతం వింటే బాగవుతాం'*

_శ్రీ పోతన భాగవత మధురిమలు_

 

(6-187-క)

అదిగాన విష్ణుభక్తులఁ

గదియఁగఁ జనవలదు మీరు కరివరదు లస

త్పదపద్మ వినతి విముఖులఁ

దుది నంటఁగఁ గట్టి తెండు ధూర్తులు వారల్.


*భావము:-* కావున, మీరు విష్ణుభక్తులను సమీపించవద్దు. శ్రీహరి పాదపద్మారాధనకు విముఖులైన ధూర్తులను పట్టి బంధించి తీసుకురండి.


శ్రీ భక్త రామదాసు కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

_ధర్మో రక్షతి రక్షితః_

సుభాషితమ్

  

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝   *అకృత్వా భరణం పిత్రోః* 

            *అదత్వా గురుదక్షిణామ్* |

            *కృతఘ్నతామ్ చ సంప్రాప్య* 

            *మరణాంతాచ నిష్కృతిః* ||

           

                  ( *మహాభారతం* )


తా𝕝𝕝  *తల్లిదండ్రులను పోషించకపోయినా, గురుదక్షిణ ఇవ్వకపోయినా, కృతఘ్నునుడిగా ప్రవర్తించినా దానికి ప్రాయశ్చిత్తం మరణమే....*


✍️🌹💐🌸🙏

గురు పాదుకా స్తోత్రం*

  *గురు పాదుకా స్తోత్రం*


అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తితాభ్యాం|

వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం 

నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం


కవిత్వ వారాశి నిశాకరాభ్యాం 

దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యాం|

దూరికృతానమ్ర విపత్తతిభ్యాం 

నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం


నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |

మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం 

నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం‖


నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానా విమోహాది నివారికాభ్యాం |

నమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం 

నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం


నృపాలి మౌలి వ్రజరత్నకాంతి 

సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యాం |

నృపత్వదాభ్యాం నతలోకపంక్తే : 

నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం


పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం |

జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం 

నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం


శమాదిషట్క ప్రదవైభవాభ్యాం 

సమాధిదాన వ్రత దీక్షితాభ్యాం |

రమాధవాంధ్రి స్థిరభక్తిదాభ్యాం 

నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం


స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్ష ధురంధరాభ్యాం |

స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం 

నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం


కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం 

వివేకవైరాగ్య నిధీప్రదాభ్యాం |

బోధప్రదాభ్యాం

ఒక వంక నెలవంక

  ఓం నమః శివాయ 

-----------------------

ఒక వంక నెలవంక ఒక వంక సురగంగ 

శిరమున చెలఁగంగ శివుడనంగ 


ఒకవంక హిమజాత ఒకవంక గణరాజు 

విస్రబ్ధ మూర్తులై వినతి సేయ 


ఒకవంక నందీశు డొక వంక స్కంధేశు 

డాది దేవునికీర్తి నాలపింప 


ఒకవంక చాముండి ఒకవంక చర్చిక 

పరిచర్య సేయంగ నొదిగి యుండ 


యతులు , త్రిదశ తతులు అంతర్ముఖస్తులలై 

ఆత్మలోన వారు మాలకింప 

కొలువుతీరియున్నకుసుమాస్త్ర సంహార 

నంది శైల వాస  వందనమ్ము 

( బాబుదేవీదాస్ రావు )

పంచాంగం 06.02.2026

  ఈ రోజు పంచాంగం 06.02.2026 

Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష పంచమి తిథి భృగు వాసర హస్త నక్షత్రం ధృతి యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు. 

  


శ్రాద్ధ తిథి: పంచమి


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 22*


*పుణ్యా కాపీ పురంధ్రీ పుంఖితకందర్పసంపదా వపుషా |* 

*పులినచరీ కంపాయాః పురమథనం పులకనిచులితం కురుతే॥*


*భావము :*


*మన్మథుడు చేసుకున్న పూర్వజన్మముల పుణ్యఫలితంగా, జగన్మాత అతనికి సుందర శరీరాన్ని సంక్రమింప జేసింది. అటువంటి తల్లి కంపానదీ తీరములోని ఇసుకతిన్నెలపై విహరిస్తున్నది. ఆ పతివ్రతా శిరోమణి దర్శన మాత్రముననే ఈశ్వరుడు పులకాంకిత శరీరుడవుతున్నాడు.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీతj. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।

రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59 ।।



ప్రతిపదార్థ:


విషయాః — ఇంద్రియ విషయములు; వినివర్తంతే — నిగ్రహించు; నిరాహారస్య — స్వీయ సంయమం పాటించి; దేహినః — జీవాత్మకి; రస-వర్జం — రుచి తరిగిపోవుట; రసః — రుచి; అపి — కూడా; అస్య — అతనికి; పరం — పరమాత్మ; దృష్ట్వా — తెలుసుకున్న పిదప ; నివర్తతే — తరిగి పోవును.


 తాత్పర్యము :


సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా కానీ, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును.



 వివరణ:


ఉపవాస సమయంలో, ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదే విధంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు, భోగ విషయ/వస్తువులపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి ఎందుకంటే కోరికల బీజం మనస్సులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు, ఆయా కోరికలు తిరిగి వస్తాయి.


ఈ కోరికల మూల బీజం ఏమిటి? జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అణు-అంశము, అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం, ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించేవరకూ జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్పశక్తిచే ఇంద్రియములను నియంత్రించవచ్చు, కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలను ఆర్పదు. కానీ, జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై, దివ్య ఆనందాన్ని పొందినప్పుడు, తాను అనంతమైన జన్మలనుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


రసోవై సః రసమ్ హ్యేవాయం లబ్ధ్వా ఽనందీ భవతి (2.7.2)


‘భగవంతుడు పూర్ణ-ఆనందమయుడు. జీవాత్మ ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు, ఆ ఆనందంలో తనివి తీరుతుంది.’ ఆ తర్వాత సహజంగానే నిమ్న స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది. భగవత్ భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది.


ఈ విధంగా భగవద్గీత, కేవలం కోరికలను అణచివేయమని చెప్పలేదు, నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసే అందమైన మార్గాన్ని ఉపదేశించింది. రామకృష్ణ పరమహంస మాహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పాడు , ‘భక్తి అంటే సర్వోత్కృష్టమైన దానిపై ప్రేమ; మరియు నిమ్నస్థాయివి వాటంతట అవే వీగిపోతాయి’ (‘Devotion is love for the highest; and the lowest shall fall away by itself.’)

కవి యొక్క చమత్కారం

 జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన

ర్చు లతాంతాయుధు గన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్

దొలగన్ ద్రోచె లతాంగి, యట్లయగు, కాంతుల్ నేరముల్ సేయ పే

రలుకన్ బూనినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే!



ఈ పద్యం శ్రీకృష్ణుడు సత్యభామ కు మధ్య జరిగిన సంఘటన శ్రీకృష్ణుడు శిరస్సును ఎడమ కాలితో సత్య భామ తొలగించటం ఈ పద్యం యొక్క విశిష్టత ఇందులోపడ జన సామాన్యమైనటువంటి విషయం ఏమిటంటే భర్తలు నేరాలు చేస్తే ఉచిత నుచిత అనేది లేకుండా భార్యలు ప్రవర్తిస్తారు అనేది కవి యొక్క చమత్కారం

 ఇన్నాళ్ళకి ఇ

న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్

పళ్ళూడిన ముసిలిది కు

చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!"!


పంచాంగం



 

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - పంచమి - హస్త -‌‌ భృగు వాసరే* (06.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*